11, నవంబర్ 2010, గురువారం

ఓదార్పుకు అనుకూలంగా మాట్లాడితే చర్యలా,,,,

వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుకూలంగా మాట్లాడిన వారిని, ఓదార్పుకు అనుకూలంగా కదులుతున్న శ్రేణులను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారని పీసీసీ కార్యదరి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే
చెవిరెడ్డి భాస్కరెడ్డిని పార్టీ నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేసారని ... పార్టీకి ఎనలేని సేవ చేసిన భాస్కరెడ్డిపై చర్య తీసుకోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కుట్రపూరిత వాతావరణం నెలకొనివుందని ... పార్టీని అభాసుపాలు చేస్తున్నవారిని, భ్రష్టు పట్టిస్తున్న వారిని ప్రోత్సహిస్తుండడం ఏం న్యాయమని... పార్టీని బలపరిచే దిశగా సాగుతున్న ఓదార్పు యాత్ర ని జగన్ చేస్తే తప్పేమిటని నిలదేస్తూనే... జగాన్ని బలపరిచే నేతలపై ఎదుకు చర్యలుకు దిగుతున్నారో పిసిసి చీఫ్ చెప్పాలన్నారు

బావ చితంలో సెన్సార్ కట్స్ ఇవీ



29.10.2010 విడుదలైన బావ చితంలో సెన్సార్ కట్స్ ఇవీ

అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'బావ' చిత్రాన్ని చూసి 5 కట్స్‌తో 'యు' సర్టిఫికెట్‌ని 27.10.2010 న జారీ చేసిన ఈ చిత్రంలో...

1. ఒకటి, రెండు రీళ్లలో చిత్రీకరించిన దృశ్యాల్లోని 'ఊరపంది నాయాల్లారా' అనే మాటల్ని తొలగించి శబ్దం వినపడకూడదన్నారు.

2. అయిదు, ఆరు రీళ్లలో దేవుళ్లు, వంకాయలు పైన చిత్రీకరించి జోక్స్‌ని తొలగించారు. (దేవుళ్ల పేర్లను తొలగించి అంగీకరించిన వంకాయలు వుంచారు) శబ్దం వినరాకూడదన్నారు.

3. అయిదు, ఆరు రీళ్లలోనే చిత్రీకరించిన 'కాయ కోస్తా' అనే పదాన్ని శబ్దంతో సహా తొలగించారు.

4. అయిదు, ఆరు, పదకొండు, పన్నెండు రీళ్లలో 'చంక నాకుతున్నారా అనే మాటలు ఎక్కడ వచ్చినా వాటిని తొలగిస్తూ శబ్దం వినబడకూడదన్నారు.

5. అయిదు ఆరు రీళ్లలో చిత్రీకరించిన దృశ్యాల్లో ఎన్‌ స్టూడియోకి సంబంధించి వున్న 'ఆల్రెడీ అమ్మేసుకున్నాడు' అనే పదాల్ని తొలగించి, శబ్దం వినబడకూడదన్నారు.













ఆంధ్రప్రభ నుంచి సేకరణ


పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ...

ఎన్టీఆర్‌ను ఎవరూ పట్టించుకోని సమయంలో తాను దగ్గర అయ్యాయని లక్ష్మీపార్వతి అన్నారు. గురువారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తాను వచ్చాకే టీడీపీ మెజార్టీ సీట్లు గెలుచుకుందni ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎవరు పొడిచారో అందరికీ తెలుసునన్నారు.

కష్టాల్లో ఉన్నాడని పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ... న్టీఆర్‌ను పదవీచ్యుతుడ్ని చేసేందుకు... పథకం ప్రకారమే చంద్రబాబు పార్టీలో తన వర్గంవార్ని నింపుకుని వారికే పదవులు ఇచ్చారni న్టీఆర్‌ను ప్రేమించేవారిని, అభిమానించి వారిని ఆయన నుంచి దూరం చేశారన్నారు. . తాను ఎన్నడు ఎన్టీఆర్‌కు కానీ, పార్టీకిగానీ నష్టం కలిగించేలా వ్యవహరించలేదని లక్ష్మీపార్వతి తెలిపారు.

నవ్వులు పండించే నటి హేమ కు జన్మదిన శుభాకాంక్షలు


కోనసీమ యాస తో గలగలా చక్కగా గట్టిగా నవ్వేయడం, దడదడా తడుముకోకుండా మాట్లా de హేమ పుట్టినరోజు నవంబర్‌ 12.

1989లో నటిగా కెరీర్‌ ప్రారంభించిnaa వివాహం కారణంగా నటనకు 1993లో బ్రేక్‌ యిచ్చి, 1997లో నటిగా పున:ప్రవేశం చేసి, ఇటు కామెడీ రోల్స్‌, అటు కేరక్టర్‌ రోల్స్‌ ద్వారానూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికి 290 చిత్రాలకు పైగా చేసిన హేమ రెండు మలయాళ చిత్రాల్లో, ఒక కన్నడ చిత్రంలో ఒక హిందీ చిత్రంలో నటించింది. ఇటీవల కాలంలో టీవీ వంట వార్పూ కార్యక్రమంలోదర్సనమిస్తున్న ఈ తెలుగింటి ఆంటీకి పుట్టిన రోజు శుభా కా౦క్షలు

ఫిలిం టూరిజం సెల్‌ ఏర్పాటు

రాష్ట్రంలో ఫిలిం టూరిజం సెల్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పర్యాటక శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా నలుగురు సభ్యులతో సెల్‌ ఏర్పాటు చేశారు. సినిమాలు తీసేవారికి అవసరమైన సేవలను ప్యాకేజీ రూపంలో అందించడమే లక్ష్యంగా సెల్‌ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

తెలంగాణా ఏర్పాటుకు డెడ్ లైన్ లేదంటున్న కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ నేత చంద్రబాబే అడ్డుపడుతున్నారని టీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖరరావు ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కే. కేశవరావుతో కలిసి గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లా డుతూ నేటికీ శ్రీకృష్ణ కమిటీకి చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికే తేలంగాణలో టీడీపీ పరిస్తితి దారుణమని.. చంద్రబాబును చూస్తే జాలి కలుగుతోందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం నిర్ణయం కోసం జనవరి నెలాఖరు వరకు ఆగుతామని కేసీఆర్ చెప్పారు. కమిటీ నివేదిక ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని డిమాండుతో ఉద్యమం చేపడతామని ఐతే తెలంగాణా ఏర్పాటు కు నిర్దిష్ట గడువు లేనే లేదని తేల్చే చెప్పారు కెసిఆర్ .

వెస్టిండీస్‌ తొలి క్రికెట్‌ టెస్ట్‌కు లలిత్‌ మలింగ పక్కకు

ఈనెల 15 నుంచి గాలేలో వెస్టిండీస్‌తో మొదలయ్యే తొలి క్రికెట్‌ టెస్ట్‌కు గానూ శ్రీలంక ఫాస్ట్‌బౌలర్‌ లలిత్‌ మలింగను పక్కన పెట్టారు. ఇటీవల జూలై , ఆగస్టులో ఇండియాతో జరిగిన హోం సీరీస్‌కుగానూ రెండేళ్ళ విరామం అనంతరం టెస్ట్‌ జట్టులో చోటు చేసుకున్న మలింగను ఈ పర్యటనకు తప్పించారు. ఇండియాతో సీరీస్‌లో కూడా మలింగ తొలి టెస్ట్‌ మాత్రమే ఆడగా రెండో దానిలో విశ్రాంతి తీసుకున్నాడు. ఇక ఆఖరి టెస్ట్‌లో కేవలం ఆరు ఓవర్లే బౌలింగ్‌ చేసి తప్పుకున్నాడు. దాని తదుపరి స్వదేశంలోనే జరిగిన న్యూజిలాండ్‌, ఇండియాలతో జరిగిన ముక్కోణపు సీరీస్‌లో మాత్రం ఆడాడు.

ఆంక్షలు నడుమ ఉప్పల్‌ స్టేడియం

భారత్‌ - న్యూజీలాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ నేపధ్యంలో ఉప్పల్‌ స్టేడియం వద్ద ఆరుగురు ఐపీఎస్‌ల నేతృత్యంలో వెయ్యిమంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ తెలిపారు. రేపట్నుంచి 16వ తేదీవరకూ హైదరాబాద్‌లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.

మ్యాచ్‌ చూసేందుకు వచ్చేవారు కేటాయించిన స్థలాల్లోనే వాహనాలు పార్క్‌ చేయాలని సూచించారు. ఉదయం 8.30 నుంచి 9.30 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకూ స్టేడియం చుట్టుపక్కల వాహనాలకు, సెల్ ఫోన్ లు, లాప్ టాప్లు, భోజన కేరజ్లు, తదితరాలకు అనుమతి నిషేధించినట్లు చెప్పారు.

రాజా రాజీనామా చేయాల్సిన అవసరం లేదట

2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో కుంభకోణంపై టెలికాం శాఖ మంత్రి ఎ.రాజా రాజీనామా చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను డిఎంకె తోసిపుచ్చింది. మంత్రి పదవికి రాజా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ట్రాయ్ నియమాల ప్రకారమే ఆయన వ్యవహరించారని ఆ పార్టీ పేర్కొంది.

'రాజా ఎందుకు రాజీనామా చేయాలి? ఈ విషయంలో సిబిఐ విచారణ జరుగుతోంది. విచారణ ముగిసే వరకూ ప్రతిఒక్కరూ వేచిఉండాలి' అని డిఎంకె ప్రతినిధి, ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు టికెఎస్‌ ఎలగోవన్‌ అన్నారు.

20 న ఆంధ్రప్రదేశ్ ఎన్నారై సమైక్యాంధ్ర సదస్సు

20 వ తేదీన న్యూజెర్సీలో ఆంధ్రప్రదేశ్ ఎన్నారై సంస్థ ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం నాయకులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నది. సమైక్యాంధ్ర నినాదంతో క్రిందటి సంవత్సరం ఏర్పాటైన వేదిక చేపడుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొననున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నారై సంస్థ ప్రతినిధులు గురువారం ప్రకటించారు.
ఇప్పటికే శ్రీ కృష్ణ కమిటీకి ఓ నివేదిక అందించ్చామని ... సమైక్యాంధ్ర నినాదాన్ని మరింత గట్టిగా వినిపించడానికీ ఈ సభ నిర్వహించనున్నట్టు సంస్థ లో చురుకైన పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నారై సంస్థ అధ్యక్షురాలు శైలజ అడ్లూరు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎడిసన్‌లోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో ఈ సభ నిర్వహించనున్నట్టు ఆమె వెల్లడించారు.

బెల్టు వివరాలివ్వండి : హైకోర్టు

ప్రతి పల్లె ఈ మత్తులో జోగుతోంది. నివాసిత ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు ఉన్నచోట మద్యం అమ్మకాలు జరగడానికి వీలులేదని, బెల్టు (గొలుసు) దుఖాణాలు ఎక్కడైనా ఉంటే వాటి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాజాగా హైకోర్టు కోరింది.

గతం నుంచీ కోర్టులు మద్యం విచ్చలవిడి అక్రమాలపై నియంత్రణ ఉండాలన్న వాదనను వినిపిస్తూనే ఉన్నా నేటి పాలకులకు చెవిటి వాని ముందు శంఖం' ఊదిన చందాన కాగితాలకు పరిమితమవ్వడం వల్ల ఈ సారైనా కోర్టు ఉత్తర్వులకు ప్రభుత్వం, స్వచ్ఛంధసంస్థలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు స్పందించే తీరునుబట్టే కోర్టు ఆదేశాలు అమలవుతాయని సర్వత్రా వినిపిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 2 నుంచి 3 ఆపైనే బెల్టుషాపులు ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కార్మికులు, ఇతర కష్టజీవులు పనిచేశాక 68శాతం మద్యం అమ్మకాలలో వీటి పాత్ర కీలకంగానే ఉంది అన్నది వాస్తవం ..లక్షలాదిమంది ప్రజలను తాగుడుకు బానిసలు చేస్తూ లైసెన్సులను విచ్చలవిడిగా ప్రభుత్వం మంజూరు చేయడం, బెల్టుషాపులు కూడా ఇష్టా రాజ్యంగా ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. గ్రామంలో రోడ్డు, లేదా గుడికి ప్రతి నెలా ఫలానా ఇంత ఇస్తామని ఒప్పించి బెల్టుషాపులు పెట్టి దందా సాగిస్తున్నారు.

మమ్ముల్ల మట్ట్లో జోగుతున్న ఎక్సైజ్‌ అధికారులు బెల్టుషాపులపై నోరుమెదపని తీరు, లక్ష్యాల కోసం ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం తోడై ప్రజలను బానిసలుగా మారుస్తోంది.

విశాఖలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం

విశాఖపట్నంలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనున్నట్టు కేంద్ర మానవవనరుల శాఖమంత్రి కపిల్‌సిబాల్‌ తెలిపారు.

లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ... దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో 14 ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు... ఈ విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రంలోని విశాఖతో పాటు భువనేశ్వర్‌, కొచ్చి, అమృతసర్‌, గ్రేటర్‌ నొయిడా, పాట్నా, గౌహతీ, కొల్‌కతా, భోపాల్‌, గాంధీనగర్‌, కోవై, మైసూర్‌ , పూణె...తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్టు కపిల్‌సిబాల్‌ వెల్లడించారు.

హైకోర్టుకు కొత్తగా అయిదుగురు జడ్జిలు నియామకం

రాష్ట్ర హైకోర్టుకు అయిదుగురు జడ్జిలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొంది... సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న వారి వివరాలివి
ఎఆర్‌ఎల్ నాగేశ్వరరావు-విశాఖ
కేవీ శంకర్- కడప
శ్రీరవిశంకర్-రంగారెడ్డి,
వి దుర్గాప్రసాద్- సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి

పల్లెపల్లెకూ తెలంగాణ టీడీపీ

తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఉధృతం చేయడాని కే పల్లెపల్లెకూ తెలంగాణ టీడీపీ యాత్రను చేపడుతున్నామని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దయాకర్‌రావు తెలిపారు.

శ్రీ కృష్ణ కమిటీ నివేదిక కంటే ముందుగానే ప్రజలు తెలంగాణ పోరాటం కోసం మరోసారి సమాయ త్తం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలు తీర్చడం కోసం అవసర మైతే ప్రభుత్వంతో ప్రత్యక్షంగా పోరా టాలను కొనసాగిస్తామని దయాకర్‌రావు అన్నారు.

మార్షల్‌తో ఎన్టీఆర్‌ను గెంటించివేసిన ఘనత నీదే..

తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబుకు యనమల సహకరించారని, నిండు సభలో తన వాదన చెప్పుకుంటానన్న ఎన్టీఆర్‌ను మార్షల్‌తో బయటకు గెంటించివేసిన ఘనత వారిదేనని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుపై రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు..

గురువారం తూర్పు గోదావరి జిల్లా వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అణుచరగణం దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. : సుదీర్ఘ అనుభవమున్న ముఖ్యమంత్రి రోశయ్యను రాజకీయ వ్యభిచారి అని విమర్శించే అర్హత వారికి లేదని పేర్కొన్నారు.

వరద ముంపు వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఐతే .... చెప్పిన విధంగా జరగడానకి కేంద్రరాష్ట్ర ప్రభుత్వ నిబంధనలలో లేవని బొత్స తెలిపారు.

శ్రీవారి పుష్పయాగం 13వ తేదీన

తిరుమలలోని శ్రీవారి ఆలయంలో 13వ తేదీన (శనివారం) పుష్పయాగం నిర్వహించనున్నారు... కార్తీక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణం రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో శనివారం ఉదయం స్వామివారు ఉభయ నాంచారీలతో ఆలయ సంపగి ప్రాకారం ఉన్న కల్యాణమంటపానికి వేంచేస్తారు

దీనికిగాను టీటీడీ ఉద్యానవనశాఖ సుమారు మూడు టన్నుల పుష్పాలను సిద్ధం చేయనుంది. వివిధ రకాల పుష్పాలను దాతల నుంచి అధికభాగంలో సేకరిస్తున్నారు.. ఈ సేవలో భక్తులు రూ. మూడు వేలు ఆర్జితం చెల్లించి పాల్గొనవచ్చు.

రోశయ్య ముమ్మాటికీ అవినీతి సామ్రాట్టే

రాజ్యాంగబద్దంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కాని రోశయ్య ముమ్మాటికీ అవినీతి సామ్రాట్టేనని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు పురద్ఘాటించారు. రోశయ్య అవినీతిని ఆధారాలతో సహ నిరూపిస్తానని .. ఆయన తెలిపారు. పశువుల డాక్టర్‌తో తనకు వైద్యం చేయిస్తానన్న మంత్రుల వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పశువులకున్న విశ్వాసం కూడా ప్రజల సొమ్ముతో మంత్రలాయి కోట్లకు కోట్ల రూపాయలు దోచుకు తింటున్నామంత్రులకులేదని ముద్దుకృష్ణమ దుయ్యబట్టారు.

పొన్నాలకు పొగ పెదుతున్న సొంత వర్గం

రాష్ట్ర భారీ నీటిపారుల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య పై వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాష్ట్ర భారీనీటిపారుల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై నేరుగా ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

నియర్‌ కాంగ్రెస్‌ నాయకులను కూడా పట్టించుకోవడంలేదని, పరిస్దితి ఇలాగే కొనసాగితే వరంగల్‌ లాంటి అతిపెద్ద జిల్లాలో పార్టీ మనుగడకు ఇబ్బందులు ఏర్పడే పరిస్దితులు ఉన్నాయని వారు వివరించినట్లు తెలిసింది.ఇదిలా ఉండగా మంత్రి లక్ష్మయ్య సహకారంతోనే ప్రజాప్రతినిధులుగా గత ఎన్నికల్లో టికెట్లు పొంది గెలుపొంdina వారె కావటం గమనార్హం.

రెడిఫ్‌ మెయిల్‌ డాట్‌కామ్‌ను నిషేధించాలన్న వెంకటేష్

రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య కొనసాగుతారని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అధ్యక్షుడు, కర్నూలు ఎమ్మెల్యే టి.జి.వెంకటేశ్‌ చెప్పారు. సిఎంగా మరొకరిని నియమించి రోశయ్యను గవర్నర్‌గా పంపిస్తారంటూ రెడిఫ్‌ మెయిల్‌ డాట్‌కామ్‌ ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎలాంటి ఆధారాలు లేని వార్తలు ప్రచారం చేసిన రెడిఫ్‌ మెయిల్‌ డాట్‌కామ్‌ను నిషేధించాలని ఆయన డిమాండ్‌ చేశారు..

తప్పుడు ప్రచారానికి పాల్పడ్డ వెబ్‌సైట్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ...రోశయ్య ముఖ్యమంత్రిగా నియమితులైన తొలిరోజుల్లో ఆ స్థానాన్ని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరుకున్నా ఇప్పుడు ఆయన సైతం రోశయ్యను సమర్థిస్తున్నారని, మద్ధతు ప్రకటిస్తున్నారని ఆయన తెలిపారు

దేశానికీ స్వాతంత్రం తెచ్చింది ఆర్యవైశ్యుడే

ఈ నెల 21న విజయవాడలో జరిగే ఆర్యవైశ్య సమ్మేళనంకు రాష్ర్టంలోని ఆర్యవైశ్యులందరూ విచ్చేసి విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యుడు పబ్బిశెట్టి సురేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన గాంధీజీ ఆర్యవైశ్యుడని, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కారకుడైన పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యుడని, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి ఆర్యవైశ్యుడేనని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్యను గద్దె దింపడానికి ప్రతి పక్షంపాటు అధికార పక్షం కూడా పావులు కదుపుతున్నప్పటికీ ఆయనను గద్దె దింపలేకపోయారన్నారు. రోశయ్యకు అన్ని శాఖల్లో అనుభవం వుండడం వల్ల అధిష్టానం ఆయనకే ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

భారత దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ ఏకైక ఆర్యవైశ్య ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. విజయవాడలో జరిగే ఆర్యవైశ్య సమ్మేళనంలో ఆయనను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు

బాబు, చిరులది గ్లోబల్‌ ప్రచారం

టిడిపి అధినేత నారాచంద్రబాబునాయుడు, పిఆర్‌పి నాయకులు చిరంజీవులు ప్రభుత్వంపై గ్లోబల్‌ ప్రచారం చేస్తున్నారని 20 సూత్రాల కమిటీ చైర్మన్‌ డా.ఎన్‌.తులసిరెడ్డి మండిపడ్డారు.9 ఏళ్లు సిఎంగా పనిచేసిన బాబుకు అన్నీ తెలిసినప్పటికీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే పని... ఇక చిరంజీవి రాజకీయాలకు కొత్త అని, ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదని కొట్టిపడేశారు.

రోశయ్య సిఎం హయాంలో 2010లో అత్యధికంగా రూ.1104 కోట్లు రాష్ట్రానికి నిధులు విడుదలైయ్యాయని, ఈ ఏడాది రూ.586 కోట్లు ప్రకృతి వైపరీత్యాల నిధి, జాతీయ విపత్తునిధి కింద నిధులు మంజూరు అయ్యాయని గణాంకాలతో ఆయన వివరించారు. తమ ఉనికిని చాటుకునేందుకు టిడిపి నేతలు రోశయ్య ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి పూనుకున్నారని ఆయన విమర్శించారు.

ఉద్యమ స్వరూపాన్ని వివరించే జైబోలో తెలంగాణ

1948నుంచి 69వరకు జరిగిన నాటి తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని వివరిస్తూ... మళ్ళీ నేడు ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని యదాతథంగా కళ్ళకు కట్టేలా తెరకెక్కిస్తున్నట్లు జైబోలో తెలంగాణ దర్శకుడు ఎన్.శంకర్ చెప్పారు. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సినిమాను రూపొందిస్తున్నట్లు .. ఖిలావరంగల్ మధ్యకోట, చమన్ వద్దనున్న అమరుల స్థూపం వద్ద ఏకధాటిగా షూటింగ్ నిర్వహిస్తున్నట్లు చెపుతూ హీరో జగపతిబాబు తెలంగాణ ఉద్యమ పోరాట నాయకునిగా నటిస్తూ ప్రత్యేకాకర్షణగా నిలవనున్నారని చెప్పారు.

వరంగల్ కోట మధ్యలో జై బోలో తెలంగాణ/గలగర్జనలా..జడివాన../నెత్తుటి గాయాల వీణ... అంటూ కొనసాగే టైటిల్‌సాంగ్‌తో పాటు హీరో జగపతిబాబు పై ప్రధాన దృశ్యాలను చిత్రీకరించా మని చెప్పారు శంకర్

కరంట్ 'డవలప్ మెంట్' బాదుడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా పన్నులు వసూళ్లు చేయడమే కాకుండా డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపైన అదనంగా డిపాజిట్ల కోసం వాత పెడుతోంది.. గృహ, వ్యాపార విద్యుత్ వినియోగ దారులపై విద్యుత్ శాఖాధికారులు వేలాది రూపాయలు డిపాజిట్లు చెల్లించాలంటూ నోటీసులను అందచేస్తున్నారు

విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ వినియోగాన్ని రెట్టింపుగా వినియోగిస్తున్నారా.. తెలుసుకునేందుకు ..విద్యుత్‌శాఖ ఉద్యోగులు, సిబ్బంది విద్యుత్ పోల్,పోల్‌కు తిరుగుతూ అక్కడున్న గృహ, వ్యాపార విద్యుత్ సర్వీసులను లెక్కిస్తున్నారు. ఆ ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లో విద్యుత్ వినియోగానికి సంబంధించిన వస్తువులను లెక్కిస్తున్నారు. నెలకు ఆ ఇంటికి ఎంత విద్యుత్ వాడకం జరుగుతుందో కూడా విద్యుత్‌శాఖాధికారులు లెక్కలు వేసుకొని ఒక రిపోర్టును సైతం తయారు చేసి దాని ప్రకారం ప్రతి ఇంటికి నోటీసులను అందచేస్తున్నారు

వేలాది రూపాయలు డవలప్‌మెంట్ చార్జీల పేరుతో విద్యుత్‌శాఖాధికారులు ఇస్తున్న నోటీసులను చూసుకొని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ వాడుకున్నంత ప్రకారం చార్జీలు చెల్లిస్తున్నప్పటికీ మళ్లీ అదనంగా భారం వేయడం ఏమిటని విద్యుత్‌శాఖాధికారులు మళ్లీ ఆలోచించి ఈ డెవలప్‌మెంట్‌ చార్జీల వసూళ్లను నిలిపివేయాలని కోరుతున్నారు.

కడపలో ఎన్‌టి రామారావు విగ్రహధ్వంసం

కడప నగరం కొండాయపల్లె లో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టి రామారావు విగ్రహాన్ని తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం చేయి సగం వరకు పడి పోయింది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య లో సంఘటనా స్థలానికి చేరుకుని ఆగ్రహంతో ఊగిపోయారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్ర హాల ఏర్పాటుకు అనుమతి లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అయితే ఎన్‌టిఆర్ లాంటి మహోన్న తుడి విగ్రహానికి హాని జరగడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాల న్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని శాసన మండలి సభ్యుడు ఎం.వెంకటశివారెడ్డి డిమాండ్ చేశారు

రాష్ట్రంలో అసమర్థుడి పాలన

రాష్ట్రంలో అసమర్థుడి పాలన సాగుతోంద ని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ సీఎం రోశయ్యపై ధ్వజమెత్తారు.
వయసు పైబడి సీఎం రోశయ్య అసహనం, కోపం ప్రదర్శిస్తున్నారన్నా రు. అపార అనుభవం ఉందని చెప్పుకు నే రోశయ్య ప్రజా సమస్యలు పరిష్కారానికి మా త్రం అనుభవం ఉపయోగించడం లేదన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో టీడీపీ హయాంలో జరిగిన అనేక పథకాలు, కార్యక్రమాలపై 22 కమిటీలను నియమించారని ఏ ఒక్కటీ తప్పు పట్టలేదన్నారు.

ఏనాడూ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేని రోశయ్య ... చెన్నారెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి రాత్రికి రాత్రే ఆయన కేబినెట్‌లో మంత్రి అ య్యారన్నారు..వైఎస్ చనిపోయాక మెజారిటీ సభ్యులు జగన్ సీఎం కావాలని సంతకాలు చేసినా ఆ కుర్చీలో రోశయ్య ఎలా కూర్చున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించినపు డు, 1999లో జరిగిన ఎన్నికల్లోనూ అత్యధిక మెజారిటీతో చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. సీ ఎంగా సొంత జిల్లాకే ఏమీ చేయలేని వ్యక్తి ర్రాష్టానికి ఏం చేస్తారన్నార ని నిలదీసారు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ...

14 నుంచి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 125 ఏళ్లయింది. ఈ సందర్భంగా 14 నుంచి 19వ తేది వరకు హైదరాబాద్, వరంగల్, గుంటూరు, విజయవాడ, తిరుపతి, మెదక్ లేదా నల్గొండలలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో 17వ తేది జరిగే ఉత్సవాలకు ముఖ్యమంత్రి రోశయ్య హాజరు కానున్నారు..

ప్రతి నియోజకవర్గంలో ఈనెల 15న మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ఉత్సవాలకు ఖాదీ దుస్తులు, టోపి ధరించాలని లేదా తెల్లదుస్తులైనా వేసుకుని రావాలన్నా సూచనలు చేసారు. గాంధీ, నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీ ఎవరో కూడా తెలియని వారు నేటికీ మారుమూల పల్లె ప్రజలున్నాయని వీరందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం గురించి వివరించాలన్న భావన వ్యక్తమవుతోంది

ఈ సందర్భంగా ఫొటో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించాలన్న ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్ఎస్ఎస్‌కు ఉగ్రవాద లేబుల్‌ను అతికిస్తారా?

ఆర్ఎస్ఎస్ తోపాటు ఇతర హిందూ సంఘాలపై బురద చల్లడానికి ప్రయత్నిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆరెస్సెస్ ప్రముఖులు పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

నిన్న ఇందిరాపార్క్ దరి ఎన్టిఆర్ స్టే డియంలో జరిగిన సమావేశం ఆద్యంతం ఉద్వేగ భరితంగా సాగింది. సమగ్రత, ఐకమత్యాన్ని సామాజిక సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి చర్యలకు పాల్పడరాదని పాల్గొన్న ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు..

హిందూమతోద్ధరణకు కంకణo కట్టుకున్న ఆర్ఎస్ఎస్‌కు ఉగ్రవాద లేబుల్‌ను అంటించడంపై తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తు కుతంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఆరెస్సెస్ సిద్దంగా ఉందని అజ్మీర్, హైదరాబాద్, సంజోతా ఎక్స్ ప్రెస్‌లో బాంబ్ ప్రేలుళ్ళకు లష్కర్-ఎ-తోయిబా సంస్థలే కారణమన్న నిజాన్ని ప్రధానమంత్రి గుర్తించాలన్నారు