8, ఫిబ్రవరి 2011, మంగళవారం

డిఎల్‌పై భగుమన్న భూమా

పోలవరం ప్రోజక్టుపై పోరాటం చేసున్న వైఎస్‌ జగన్‌పై రాష్ట్ర మంత్రి డి.ఎల్‌ రవీంద్రారెడ్డి విమర్శలు గుప్పించడంపై జగన్‌ వర్గ నేత, మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి విరుచుకు పడ్డారు.

మంగళవారం ఆయన మైదుకూరు నియోజకవర్గంలో జగన్‌ వర్గ నేతలు కార్యకర్తలతో తాసిహల్దార్‌ కార్యాలయంఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం మీడియా మాట్లాడుతూ... అక్రమకేసులు బనాయించి జగన్‌ వెంట కాంగ్రెస్‌ కార్యకర్తలు రాకుండా చూసేందుకు ప్రయ త్నాలు చేస్తున్నారని..జగన్‌ ముందు వారి ఆటలు సాగవన్న భయం కాంగ్రెస్‌ నేతల్లొ నెలకొం దని విమర్శించారు.

ఏనాడో ప్రజల్లో మద్దతు కోల్పోయిన రవీంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మైదుకూరు నియో జకవర్గంలో రానున్న ఉపఎన్నికల్లో మెజార్టీ తీసుకువస్తామని లేదంటే తాము రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామని.. మరి డిఎల్‌ కూడా తన మంత్రి పదవికి రాజీ నామా చేసి రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్దమవుతారా? అని సవాల్‌ విసిరారు.

బాబు, కేసీఆర్‌లు వచ్చినా చేర్చుకొంటాం..

ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కావాలనే ఆరాటంతో పార్టీలు పెట్టుకుంటూపోతే దేశంలో చీలికలు ఏర్పడే ప్రమాదముందని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. కుల, మత ద్వేషాల కంటే ప్రాంతీయ ద్వేషాలు ప్రధాన సమస్యగా మారిపోయిందన్నారు. రోజుకో పార్టీ పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలన్నీ.. ప్రాంతీయ వాదాన్ని పక్కనబెట్టి జాతీయ పార్టీతో విలీనమయ్యే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ వచ్చినా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని 2014లో వై.ఎస్. జగన్మోహన రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అన్నారు.

రెండు సంవత్సరాల ప్రయత్నం కాంగ్రెస్‌తో పీఆర్పీ విలీనం సఫలమైందన్నారు. ప్రజాశ్రేయస్సు కోసమే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేశారని .. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ప్రాంతీయ పార్టీలన్నీ జాతీయ పార్టీలో విలీనం కావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడాన్ని విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని.. విపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని లగడపాటి వ్యాఖ్యానించారు.

సోనియా ‘చేతి’ వాటం సొమ్మంతా ఇటలీకే...

అవినీతి సర్కారుకి మహారాణిగా వెలుగొందుతున్న సోనియా అవినీతి గుట్టురట్టవుతుందన్న భయంతోనే దేశంలో నల్లధనం ఉన్నవారి వివరాలను, స్వీస్‌ బ్యాంకు ఖాతాదారుల చిట్టాను బైటకు చెప్పలేమని చెప్పడం వెనుక అప్పటికి గానీ కేంద్ర అవి నీతి పరుల చిట్టా బైటపెట్టేందుకు నిరాకరిస్తోందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు ధ్వజమెతారు.

కేంద్ర సర్కారు జగరుతున్న కుంభకోణాల గురించి ఎందుకు మాట్లాడటంలేదని దేశంలో జరుగుతున్న అవినీతినంతటికి బాధ్యత కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీదేనని... ఆమె ఇక్కడి సొమ్మంతా ఇటలీకి తరలిస్తున్నారని ఆరోపించారాయన.

అందుకే తాను నేతృత్వం వహిస్తున్న యుపిఏ సర్కారులో కామన్‌వెల్త్‌, 2-జి లాంటి స్కాము లు బైట పడ్డా లక్షల కోట్లు మేసేసరని తెలుసున్నా...ఇప్పుడు సాక్షాత్తు ప్రధాని నిర్వహిస్తున్న శాఖలోనే ఎస్‌-బాండ్‌ కుంభకోణం జరిగి 2లక్షల కోట్లమేర నష్టం జరిగిందని ఆరోపణలు వస్తున్న మిన్నకుంటున్నారని విమర్శించారు.

ఇటలీలోని సోనియాగాంధీ బంధువులు బ్యాంకు ఎకౌంట్లని సీజ్‌ చేసి బారత్‌ నుండి ఎంతెంత మొత్తాలు వచ్చి చేరాయో ఆరాలు తీస్తే... సోనియా చేతివాటానికి జరిగిన అవినీతి ఏ పాటిదో తెలుస్తుందని వ్యాఖ్యానించారు గాలి.

అధినేతగా వెళ్లి... నేతగా వచ్చిన చిరు....

మొన్న ప్రజారాజ్యం పార్టీ అధినేతగా హస్తినకి వెళ్లి... నేడు కాంగ్రెస్‌ నేతగా హైదరాబాద్‌ వచ్చిన చిరంజీవికి ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల కన్నా కాంగ్రెస్‌ నేతలే ఘనస్వాగతం పలికేం దుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు.

మంగళవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో చిరంజీవికి స్వాగతం పలికేందుకు వచ్చిన పీఆర్పీనేతల్ని సైతం పక్కకునెట్టి చిరంజీవితో కరచలనంచేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ఉత్సాహం చూపించడం ఆకట్టుకుంది. ఓదశలో తోపులాట జరిగే సూచనలు కనిపించడంతో చిరంజీవి వాహనం పైకి ఎక్కి అందరికీ అభివాదం తెలుపుతూ ముందుకు సాగిపోయారు.

'చెర'లపల్లిలో ఖాకీలకు మళ్లి ఐఎస్‌ఐల 'ట్రీట్‌'మెంట్‌

ములాఖత్‌ ఇవ్వలేదని ఐఎస్‌ఐ ఖైదీలు జైలు అధికారులపై తిరగబడ్డారు. ములాఖత్‌ ఎందుకు ఇవ్వరని ఐఎస్‌ఐ ఖైదీలు నిలదీయడంతో పోలీసులకు, వారికి మధ్య కొద్దిసేపు ఘర్షణ చోటుచేసుకుంది. కాగా, ఐఎస్‌ఐ ఖైదీల ములాఖత్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే.

రచ్చబండ కి ఎన్నికల నిబంధనలు అడ్డు

ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావడంతో వైఎస్‌ఆర్‌(కడప), వ్రిశీపొట్టీ శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో జరగవలసిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమాలను రద్దు చేశారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న జిల్లాల్లో జరగవలసిన రచ్చబండ కార్యక్రమాలను కూడా రద్దు చేశారు. శాసన మండలిలో ఆరు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒసేయ్‌ రాములమ్మకి సీక్వెల్‌గా దాసరి రామసక్కని తల్లి

సీక్వెల్‌ పిచ్చ తెలుగు సినీ పరిశ్రమకి బాగానే పట్టుకున్నట్లుంది. ఇప్పటికే గతంలో తీసిన దేవదాసు సీక్వెల్‌ దేవదాసు మళ్లీ పుట్టాడు విజయాన్ని చవిచూసానని...ఇప్పుడే సర్ధార్‌ పాపారాయుడు, బొబ్బిలి పులి, ప్రేమాభిషేకం ఇలా వరుస సినిమాలకు సీకెల్స్‌ నిర్మించాలని పదే పదే ప్రకటిసున్న దాసరి తాజా గా తనదృష్టి ‘ఒసేయ్‌.. రాములమ్మ”దగ్గర ఆపినట్లుంది.

దాసరి, విజయశాంతిల కాంబినేషన్‌లో వచిచ్చన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేయగా ఇదే చిత్రానికి సీక్వెల్‌ కధను రడీ చేసుకున్న దాసరి రామసక్కని తల్లి” అని పేరు కూడా ఖరారు చేసు కున్నట్లు సమాచారం.

పరమవీరచక్ర ఊహించని విధంగా తిరుగుటపా కట్టేయటంతో విజయశాంతి దాసరిపై కొంత అప నమ్మకంతో ఉన్నప్పటికీ కధ బాగా రావటంతో పాటు దాసరి వివరించిన పలు సీన్లు తన రాములమ్మ పేరు సార్ధకత చేస్తుందన్న నమ్మకంతో విజయశాంతి సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నలిచ్చినట్లు తెలుసోర్తంది..

‘మార్పు’కోసమే.. నే మారి పోయా...

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయటం మార్పు కోసమేనని తన చర్యల్ని సమర్ధించుకున్నారు తాజా కాంగ్రెస్‌ నేత చిరంజీవి.

విలీన తతంగాన్ని ముగించుకుని శంషాబాద్‌ విమానాశ్రయానికి తనకి స్వాగతం పలకడానికి వచ్చిన అభిమానులు, నేతలనుద్దేశించి మాట్లాడుతూ అందరికీ సమానన్యాయం చేకూర్చేందుకు తనశక్తికి తోడు మరింత బలీయమైన శక్తి అవసరమని గ్రహించాకనే కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయించుకున్నా నని... స్పష్టం చేసారు.

ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నంత మాత్రాన గతంలో లేవదీసిిన ప్రజా సమస్యల్ని మర్చిపోతానని.. సమస్యల పరిష్కారానికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని అధినేత్రి సోనియా హామీ ఇచ్చారని.. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి పరిష్కార దిశగా తీసుకెళ్తానని చెప్పారు.

ఇక నుండి బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్‌కి మరింత చేరువ చేసి రాష్ట్రంలో పటిష్టం చేస్తానని... ఇందుకోసం పార్టీలోని ప్రతి ఒక్కరు తనతో కలిసి రావాలని విజ్ఞప్తి చేసారు చిరంజీవి.

మార్చి13న ఎమ్మెల్సీ ఎన్నికలు

శాసన మండలి లో ఆరు స్థానాల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఈనెల 15న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 22వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తారు. 23న నామినేషన్లను పరిశీలిస్తారు. 25వ తేదీ సాయంత్రం వరకు నామినషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇస్తారు. మార్చి13న ఎన్నికలు నిర్వహించి మార్చి 15న ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తమ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. కడప జిల్లా ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పదవీ కాలం పూర్తి కానుండటంతో ఈ ఎన్నికలు కీలకంగా మారనుంది. వైఎస్‌ జగన్‌ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.

చిరు 'ఫ్యాన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ టు జగన్‌'

నిన్నటి వరకు ప్రజారాజ్యం అధినేత చిరంజీవివికి మద్దతుగా నిలిచిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. చిరంజీవి పార్టీ పెట్టడంతో వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులు ఇప్పుడు మరో గత్యంతరంలేక తమ మాతృ సంస్థలకు తరలిపోవడమో, లేదా ఇతర పార్టీల్లో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు.

పీఆర్పీని కాంగ్రెస్‌పార్టీలో విలీనం చేయడంతో యూకేలోని మెగాస్టార్‌ అభిమానులు కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సాధన కోసం ఆయన చేస్తున్న హరిత యాత్రకు మద్దతు తెలుపుతున్నట్లు చిరంజీవి యూకే(యూరప్‌) అసోసియేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. బ్రిస్టాల్‌, కేమ్‌బ్రిడ్జి, లండన్‌, స్కాట్లాండ్‌లోని తెలుగు ఎన్నారైలు, వెస్ట్‌ ఇంగ్లండ్‌ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారని అసోసియేషన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

జగన్‌ మావైపే.... డిఎస్‌

చిరంజీవితో వచ్చిన ఎమెల్యేల సంఖ్య చూసుకుని..జగన్‌ వెంటవెళ్తున్న ఎమ్మెల్యేలపై వేటుకు సిద్దపడు తున్నట్లు వస్తున్న కధనాలు వాస్తవం కాదని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తేల్చి చెప్పారు.

మంగళవారం ఆయన ఢిల్లీ వెళ్తూ కాసేపు విలేఖర్లతో మాట్లాడుతూ...చిరంజీవితో వచ్చిన ఎమెల్యెలని చూసుకుని..జగన్‌ వెంటవెళ్తున్న ఎమ్మెల్యేలపై వేటుకు సిద్దపడుతున్నట్లు వస్తున్న కధనాలు వాస్తవం కాదని, ‘తన తండ్రి అధికారంలోకి తీసుకువచ్చిన ఈప్రభుత్వాన్ని కూలదోయనని జగన్‌ చెప్తున్నారని... అవసరమొచ్చినపుడు జగన్‌ కూడా మా వెంటే నడుస్తాడుకాంగ్రెస్‌ పార్టీలో చేరతాడు’ అని ధీమా వ్యక్తం చేసారు డిఎస్‌.

వైఎస్‌ హయాంలో జరిగిన పాలనంతా అవినీతిమయమంటూ ఇటీవల పీఆర్పీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తున్న సందర్భంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేసిన వాఖ్యలపట్ల మాట్లాడేందుకు నిరాకరించారు.చిరంజీవి ఎందుకు అలా మాట్లాడారొ.. తనకి తెలియదని తప్పించుకుంటునే... చిరం జీవి చేరిక వల్ల కాంగ్రెస్‌ పార్టీలో అయోమయం నెలకొందన ్నవాదన సరికాదని... త్వరలోనే అన్నింటినీ అధిగమించి ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు మొత్తం కలగల్సి మరింత బలంగా తయారు కాబోతోం దని అన్నారు.

సొమ్ము వచ్చింది.. సిఎం సీటు పోయింది...

కాంగ్రెస్‌ నేతలకు వివిధ పధకాల ద్వారా దోచి పెట్టేందుకు ఈ రాష్ట్ర సర్కారు వద్ద సొమ్ములుంటాయి కానీ, విద్యార్ధులని, పేదప్రజల్ని, రైతుల్ని, కార్మికుల్ని ఆదుకునేందుకు మాత్రం ఒక్క పైసా కూడా ఉండ దని ఎద్దేవా చేసారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.

మంగళవారం గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న రైతు కోసం యాత్రలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుని..ఆ పాపపుసొమ్ము పంపకంలో సోనియాకు కూడా వైఎస్‌ వాటాలు పంపారని...వైఎస్‌ మరణానంతరం వారసత్వంగా వచ్చిన అవినీతి సంపాదనతో పాటు ముఖ్యమంత్రి పీఠం కూడా కావాలని కోరుకుంటున్నాడని విమర్శించారు. అవినీతి సొమ్ము అందినా జగన్‌ వ్యవహ రాలు తెలిసినందువల్లే సిఎం పీఠం దక్కకుండా ఆపార్టీ నేతలే అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.


జలయజ్ఞం పేరుతో కాంట్రాక్టర్లకు, గుత్తేదార్లకు కోట్లు కుమ్మరించి కమీషన్లుల కొటే్టసన ఘనుడు వైఎస్‌ అని.. తన పుత్రరత్నం కంపెనీలో వాటాలు కూడా పెట్టించి.. ఖజానాని లూటీచేసారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్ధలు పనిచేయక పోవటంతో జనం తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాని పరిస్ధిðతి నెలకొందని విమర్శించారు.
యుపిఏ సర్కారు అవినీతిలో పూరిగా మునిగి తేలుతోందని... తాజాగా ఇస్రోలో కూడా రెండు లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నా ప్రధాని, సోనియా మౌనంగా ఉండటం వెనుక అంతరా ర్ధం ఏమిటన్నారు.

నన్ను చూపించరా?.. మీడియాకు బాబు క్లాస్‌

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం గుం టూరులో మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ ఛానెళ్లు ప్యాకేజీలుగా వార్తలను ప్రసారం చేస్తున్నాయని విమర్శించారు. 32 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తాను తనకన్నా వెనుక వచ్చిన జూనియర్లతో పోటీ పడాలా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం కష్టపడుతున్న తనకు కేవలం 3 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారన్నారు.

కాగా, ప్రభుత్వంపై అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తనకు తెలుసని బాబు అన్నారు.

కాంగ్రెస్సే నన్ను ఇష్టపడింది:చిరంజీవి

ప్రభుత్వం ఊగిసలాడే పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీకి తమ అవసరం వచ్చిందని ఇటీవల ఆ పార్టీలో విలీనమైన పీఆర్పీ అధినేత నేత చిరంజీవి స్పష్టం చేశారు. విలీన ప్రతిపాదన కాంగ్రెస్‌ నుంచే ముందు వచ్చిందని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనతోపాటు వచ్చే నేతలకు మంచి భవిష్యత్‌ ఉంటుందని, విలీన బహిరంగ సభ త్వరలో భారీ ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు.

తాను ఇప్పటికీ సమైక్యవాదినేనని, అయితే కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.

‘మెట్రో‘ నిలపేయాలని హైకోర్టులో పిల్‌

మెట్రో రైలు ప్రోజక్టుతో రాష్ట్ర రాజధానికి మహోన్నత స్ధానం కలిపించాలని భావించిన సర్కారుకు మరోఅడ్డంకి ఎదురైంది. ఈప్రోజక్టు నిలపివేయాలంటూ మంగళవారం రాష్ట్ర హైకోర్టులో పిటీషన్‌ ఒకటి దాఖలైంది. దీనిని విచారణకు స్వీకరించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం ఇందుకు సంబంధించిన వివరాలు దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

హీరో కాస్తా.... కాంగ్రెస్‌లోకి వెళ్లి కారెక్టర్‌ ఆరిస్టయ్యాడు..

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటంతో ఇన్నాళ్లు వెండితెరమీద మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్‌లో కారెక్టర్‌ ఆర్టిస్టుగా మారి పోయాడని వాఖ్యానించారు భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత ఎం. వెంకయ్య నాయుడు మంగళవారం ఆయన నెల్లూరులో మీడియాలో మాట్లాడుతూ... ఇప్పటికే మునిగి పోవటాని కి సిద్దంగా ఉన్న కాంగ్రెస్‌లోకి చిరంజీవి వెళ్లి మరింత భారమై ముంచేస్తాడు మినహా కాపాడే పరిస్ధితి ఏమాత్రం లేదని అన్నారు.

కేంద్రంలోని యుపిఏ సర్కారు, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారు అవినీతితో గబ్బుకొడుతున్నా యని.. ఇప్పటికే 2జి కుంభకోణంతో కకలావికలం అవుతున్న కేంద్ర సర్కారుపై దానిని మించి న ఎస్‌-బాండ్‌ కుంభకోణం గురించి విని ప్రజలు నిర్ఘాంత పోతున్నారని వాఖ్యానించారు. రాష్ట సర్కారు గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ని సరిగా అమలు పరచక పోవటం వల్లే విదార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని... కాంగ్రెస్‌ నేత లు మాత్రం వేల కోట్లు భోంచేసి హాయిగా కాలం వెల్లదీస్తున్నా... ప్రధాని తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు వెంకయ్య.

సరైన బేరం కుదిరితే తెరాస కాంగ్రెస్‌లోకి ఖాయం : గౌడ్‌

తాము ప్రత్యేక తెలంగాణా కోసమే పోరాడుతున్నామని చెప్పు కుంటున్న తెలంగాణా రాష్ట్ర సమితి తన ఆశయాన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఉండకుండా చూసేందుకు కాంగ్రెస్‌ పార్టీకి బ్రాంచ్‌ ఆఫీస్‌గా వ్యవహరిస్తోం దని... ఈమేరకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని... కొన్నాళ్లు పోయాక తెరాస కాంగ్రెస్‌లో విలీనం అయినా ఆశ్చర్యపోనఖ్ఖర్లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవేంద్రగౌడ్‌ విమర్శించారు.

సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాలో మాట్లాడుతూ...తెలంగాణా కోసం పోరా టం చేసేందుకు ప్రత్యేక జేఏసీ ఉన్నప్పటికీ అన్ని పార్టీల వారిని తెరాసలోకి ఆహ్వానిస్తూ... గత ఆరు నెలలుగా కేసీఆర్‌ చేస్తున్న పర్యటనలు చేస్తు తన పార్టీ బలాన్ని పెంచుకోవాలన్న వ్యూహమేనని విమర్శించారు. తెలంగాణాలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్‌ని తెలంగాణ పేరు చెప్పి ఏమార్చాలని చూస్తు... రానున్న ఎన్నికల్లో కొద్దో గొప్పో సీట్లు సాధించు కునేందుకు కేసీఆర్‌ ఎత్తుగడలను జనం గమనిసు్తన ఉన్నారని... వాటిని తిప్పి కొట్టే రోజులు త్వరలో వస్తాయన్నారు. రాష్ట సాధనే లక్ష్యం గాలికొదిలేసి.. ఓట్ల కోసం, సీట్ల కోసం ఉద్యమాన్ని వాడుకోవటం ప్రారంభించిన కేసీఆర్‌ సరైన బేరం కుదిరితే తెరాసని కాంగ్రెస్‌లో విలీనం చేస్తాడని వ్యాఖ్యానించారు దేవేంద్రగౌడ్‌.


భద్రగా మారనున్న ప్రిన్స్ ఖలేజా



వ్యక్తిగత స్వార్ధం కోసం..తక్కువచేసి చూపొద్దు

ప్రజారాజ్యం పార్టీ విలీన0 జగన్, ఉండవల్లి మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలపై రెవెన్యూశాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి స్పందిస్తూ...రాజకీయాల్లో ఎక్కడో ఒక చోట అర్ధవంతమైన ముగింపు ఉండాలి. కానీ ఎవ్వరూ దేన్ని తెగేదాక లాగొద్దు'' అని వ్యాఖ్యానించారు ..వ్యక్తిగత స్వార్ధం కోసం పెద్దవాళ్లను విబేధాల్లోకి తీసుకొచ్చి తక్కువచేసి చూపే అవకాశం ఇవ్వొద్దని ... వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఉండగానే పీఆర్పీ విలీన ప్రయత్నాలు జరిగాయని ఉండవల్లి సరిగ్గానే చెప్పారని ఆయన పేర్కొన్నారు.

నారాయణ జగన్ పంచన చేరుతారేమో?

జగన్‌ను ఆదర్శగా తీసుకోవాలంటూ కొందరు నేతలు అంటున్నారని, ఆయన్ను అవినీతిలో ఆదర్శంగా తీసుకోవాలా అని పీఆర్పీ అధికార ప్రతినిధి రమేష్‌నాయక్ ప్రశ్నించారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పీఆర్పీ సహా ఎన్నో పార్టీల చుట్టూ తిరిగారని, ఇక ఆయన జగన్ పంచన చేరుతారేమోనని విమర్శించారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం కావడం పట్ల కొందరు ఉలిక్కి పడుతున్నారన్నారు.

ఎన్. శంకర్‌, కేసీఆర్‌లను తెలంగాణలో తిరగనివ్వ0

తెలంగాణలోని రజక మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా 'జై బోలో తెలంగాణ 'సినిమాలో పదాలను ఉపయోగించారని, వాటిని తక్షణం తొలగించాలని లేని పక్షంలో ఆ చిత్రం నడుస్తున్న సినిమాహాళ్ళముందు ఆందోళన చేస్తామని తెలంగాణ రాష్ట్ర రజక సంఘం ఆ సినిమా దర్శకుడు ఎన్. శంకర్‌ను హెచ్చరించారు.

రజక సంఘం అధ్యక్షుడు పూసాల సంపత్ పూసాల సంపత్ మాట్లాడతూ రజకమహిళలను అవమానపరిచేలా పదాలు ఉపయోగించారని, తెలంగాణలోని 25 లక్షల రజకుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శంకర్‌ను, ఈ చిత్రానికి పరోక్షంగా పెట్టుబడి పెట్టిన కేసీఆర్‌లను తెలంగాణలో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు.

మద్దెలచెర్వు హత్య కేసులో వల్లభనేని వంశీ విచారణ

మద్దెలచెర్వు హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా టీడీపీ నేత వల్లభనేని వంశీని సీసీఎస్ పోలీసులు విచారించారు. సోమవారం దాదాపు 2 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. రేపు మరోసారి ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది.