13, ఏప్రిల్ 2011, బుధవారం

డల్లాస్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైన 'ఎల్బీడబ్ల్యూ'

చిన్న సినిమాగా విడుదలై మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న 'ఎల్బీడబ్ల్యూ'. ఈ చిత్రం ఇప్పుడు డల్లాస్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.

భారతదేశం నుండి కేవలం మూడు చిత్రాలు మాత్రమే ఫెస్టివల్‌కు ఎంపికయ్యాయి. 'దోబీఘాట్‌, రోబో'తో పాటుగా 'ఎల్బీడబ్ల్యూ' చిత్రం ఎంపికైందని నిర్మాతల్లో ఒకరైన కిరణ్‌ భూనేటి ఆనందం వెలిబుచ్చారు.

ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో ఎ వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం యాభై రోజుల వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకాదరణ ఉంటుందనడానికి ఈ చిత్రమే నిదర్శనం అని హీరోలు సిద్ధు, అభిజిత్‌, హీరోయిన్లు నిశాంతి, చిన్మయి తెలిపారు.

'రాజ్‌أ సెన్సార్ కట్స్

వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన 'రాజ్‌' చిత్రంలో సుమంత్‌, ప్రియమణి విమలారామన్‌, అజయ్‌, అలి, గిరిబాబు ముఖ్య పాత్రధారులు. కుమార్‌ బ్రదర్స్‌ పతాకాన కుమార్‌ బ్రదర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం జగన్‌.

అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'రాజ్‌'ని చూసి 11 కట్స్‌లో 89.08 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెరించి 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.

1. ఒకటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన

ఎ) 'ఎవతైనా వలలో వేసుకుందా' డైలాగ్‌ని సౌండ్‌తో సహా కత్తిరించారు.

బి) స్విమ్మింగ్‌ ఫూల్‌ నుంచి నైట్‌ షర్ట్‌ తో బయటకు వచ్చే ప్రియమణికి సంబంధించిన క్లోజ్‌ అప్‌ దృశ్యాలను తొలగించడం ద్వారా 5.04 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

2. ఒకటి రెండు రీళ్లలోనే బీచ్‌లో ఎర్రటి దుస్తులతో ఉన్న వారి క్లీవేజ్‌ దృశ్యాలను తొలగించడం ద్వారా 5.04 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.

3. ఒకటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన 'అది జరగలేదా' డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.

4. మూడు నాలుగు రీళ్ళలో

ఎ) 'ఖాళీగా వున్నాం వచ్చి హెల్ప్‌ చేయమంటావా'

బి) 'ఎంత తొందరగా పెళ్ళాంని ప్రెగ్నెంట్‌ చేస్తే అంత తొందరగా మనం పార్టీ చేసుకోవచ్చు' అనే డైలాగ్స్‌ శబ్దంతో సహా తొలగింపుకు గురి అయ్యాయి.

5. మూడు నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన పాటలో హీరోయిన్‌ రెడ్‌ టవల్‌తో డ్యాన్స్‌ చేసే దృశ్యాలను తొలగించడం వల్ల 79.00 అడుగుల నిడివి గల ఫిలిం కత్తెర పాలయింది.

6. అయిదు ఆరు రీళ్ళలో గల 'డాన్‌ పెరియన్‌ చాంపేన్‌' అనే డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.

7. తొమ్మిది పది రీళ్ళలో

ఎ) 'నాది కనిపించ లేదు' అనే డైలాగ్‌లో 'నాది' అనే పదం వినబడకుండా

బి) గోకుతున్నావా అనే పదం వినరాకుండా

సి) 'పోసుకువచ్చా' అనేది వినబడకుండా తొలగించారు.

14 రీళ్ళ నిడివిగల 'రాజ్‌' చిత్రం 18.3.11న విడుదలయింది.

దొంగల ముఠా 'సెన్సార్' కట్స్

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'దొంగలముఠా' చిత్రంలో రవితేజ, ఛార్మి, లక్ష్మి మంచు, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, సుబ్బరాజ్‌, సుప్రీత్‌ ముఖ్యపాత్రధారులు. శ్రేయ ప్రొడక్షన్స్‌ పతాకాన రూపొందిన ఈ చిత్రానికి సహ నిర్మాత సుమన్‌ వర్మ, నిర్మాత కిరణ్‌ కుమార్‌ కోనేరు.

అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'దొంగలముఠా'ని చూసి 16-3-2011న 2 కట్స్‌తో 10 అడుగుల నిడివి ఫిలిం కత్తిరించి 'యు' సర్టిఫికెట్‌ జారీ చేసింది.

1. మూడు నాలుగు రీళ్ళలోని 'గెస్ట్‌ లు ఏదో చేసుకుంటూ వుండొచ్చుకదా' అనే డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.

2. ఏడవ రీలులో చార్మీ రాక్స్‌మీద పాకే దృశ్యాన్ని తొలగించడం ద్వారా 10 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

12 రీళ్ళ నిడివిగల ఈ చిత్రం 18.3.11న విడుదల అయింది.

కుట్రలు తిప్పి కొడదాం రండి

ఐక్య ఉద్యమాలతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని టీఆర్‌ఎస్ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, వీటిని తిప్పి కొట్టేందుకు పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు, మహిళ లు ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 14 నుంచి 25 వరకు టీ ఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాలను తెలంగాణా అంతటా జరపాలని ఆమె కేడర్ కి సూచించారు

త్వ రలోనే లోక్‌సభకు మధ్యంతరం

కేంద్రంలో అంతా సవ్యంగా లే దని అవినీతి కుంభకోణాలు, అంతర్గత కలహాలు పెచ్చు పెరుగుతున్నాయని ..
అందువల్ల త్వ రలోనే లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు ఖాయమంటూ ముఖ్యమంత్రి య డ్యూరప్ప జోస్యం చెప్పారు. బుధ వారం ఆయన బెంగళూరు లో మీడియాతో మాట్లాడుతూ పలు అవినీతి కుంభకోణాలలో ఇరుక్కున్న కేంద్రంలోని యూపీయే ప్ర భుత్వం ఏ క్షణంలోనైనా అధికారం కోల్పోయే అవకా శాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటూ.. వాటిని సమర్ధ వతంగాఎదుర్కొనడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం గా ఉందన్నారు