6, ఫిబ్రవరి 2011, ఆదివారం

రాష్ట్రంలో విలీనాలు...

రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా 'విలీనాల' ట్రెండ్ నడుస్తోంది. డెబ్బవ దశకంలోనే రాష్ట్రంలో పార్టీల విలీనాలు జరిగాయి.
1969లో తెలంగాణ సాధన కోసం మర్రి చెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితి (టిపిఎస్)ను ఏర్పాటు చేసి.. 1971 ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లలో పోటీచేసి 10 స్థానాలను గెలుచుకుని.. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికే కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

1978లో 'రెడ్డి కాంగ్రెస్' పేరుతో బ్రహ్మనందరెడ్డి పార్టీని ఏర్పాటు చేసి . అప్పట్లో జరిగిన ఎన్నికల్లో 30 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నారు.. . రెడ్డి కాంగ్రెస్ పార్టీలో దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కూడా ఉన్నారు. 1980లో ఈ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

1978లో ఎన్ టి ఆర్ ప్రభుత్వాన్ని కులదోసేందుకు కుయక్తులు పన్ని.. నాదెండ్ల ని వినియోగించుకొన్న క్రమంలో పుట్టుకొచ్చిన ప్రజాస్వామ్య తెలుగు దేశం చివరికి కాంగ్రెస్ లో విలీనమైంది.

సినీ నటీ విజయశాంతి 'తల్లి తెలంగాణ' పేరుతో పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ సాధన లక్ష్యంతో ముందుకు సాగుతున్న టిఆర్ఎస్‌లో విలీనం చేశారు.
ఇదే క్రమంలో 2009 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి 'నవ తెలంగాణ పార్టీ'ని ఏర్పాటు చేసిన సీనియర్ నేత టి.దేవేందర్‌గౌడ్ ఎన్నికల అనంతరం తన పార్టీని ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)లో విలీనం చేశారు. ఆపై ఇప్పుడు దేశంలోనే చేరి కుస్తీలు పడుతున్నారు.

తాజాగా 18 మంది ఎమ్మెల్యేలు కలిగిన చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) కాంగ్రెస్‌లో విలీనం అవుతున్నట్లు ప్రకటించింది.

ఇవికాక ఖాతాలే తెరుచుకొని పార్టిలు బోలెడు కాంగ్రెస్స్ బాటలోనే ఎక్కువగా పయనించాయ న్నదే. గమనార్హం

వారికీ అడ్డగోలు దర్శనం.. సామాన్యుడికి అడ్డుగోడ దర్శనం

ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు... ముఖ్యంగా అధికారపార్టీవారికి అడ్డగోలుగా దర్శనాలు కల్పిస్తు... ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఏడాదికోసారి దర్శనం, గోడ పై నుంచి విమాన వెంకటేశ్వరుడి దర్శనం అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈఓ ఐ.వై.ఆర్.కృష్ణారావు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీటీడీతో పాటు మరో తొమ్మిది ఆలయాలను పరిరక్షణ విషయంలో చేతకాకపోతే ఈఓ, చైర్మన్ పక్కకు తప్పుకోవాలని.. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించే బదులు... కేంద్ర నుంచి పురావస్తు శాఖ అధికారులను డిప్యుటేషన్‌పై రప్పించి ఆలయ పరిరక్షణకు నియమించాలని సూచించారు.

వైఎస్ లక్ష కోట్ల అవినీతి సొమ్ము రాబడతారా?

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడబెట్టిన లక్ష కోట్ల అవినీతి సొమ్మును తిరిగి రాబడతామని ప్రజలకిచ్చిన హామీకి విలీనం తర్వాత కూడా చిరంజీవి కట్టుబడి ఉంటారా ? అని దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. విలీనంపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

10 జనపథ్ ముందు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు

తానే నంబర్ వన్ అంటూ ప్రగల్భాలు పలికి, తాను చెప్పిన ప్రవచనాలను తానే గాలికి వదిలేసి.. చిరంజీవి 10 జనపథ్ ముందు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని పయ్యావుల కేశవ్ ఆగ్రహించారు.

'విలీనమే మార్గం... పదవే లక్ష్యం'

ాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీపై, ఆ పార్టీ అధినేత చిరంజీవిపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. ఆదివారం ప్రజాస్వామ్యంలో చీకటి రోజని అభివర్ణించింది. కాంగ్రెస్ అవినీతిలో వాటాలకోసమే 'ప్రేమే మార్గం... సేవే లక్ష్యం' అంటూ ప్రగల్భాలు పలికిన చిరంజీవి 'విలీనమే మార్గం... పదవే లక్ష్యం' దిశగా పయనించారని మండిపడ్డారు.
గత ఎన్నికలలో ప్రజలను నమ్మించి 17 శాతం ఓట్లను, 18 సీట్లను సాధించిన చిరంజీవి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని, కాంగ్రెస్‌లో విలీనం చేసేముందు ప్రజాభిప్రాయాన్ని కోరలేదని అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్‌లో విలీనం కావడమంటే అవినీతిని పూర్తిగా సమర్ధించడమేనని నాగం జనార్ధన్ రెడ్డి దుయ్యబట్టారు.

'రాజ్యం' ఇక హస్తగత0

అంతా అనుకున్నట్టే అయ్యింది. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో కలిపేయటం జరిగింది. పార్టీ పెట్టి మూడేళ్లు కాకముందే..రాజకీయపార్టీని నడపడ మంటే సినిమాలో నటించి పారేయటం కాదన్న నిజాన్ని తెలుసుకోవటంతో పాటు ఈ వ్యాపారంకి పెట్టుబడి దండగ దుఖాణం మూసేద్దాం అన్న బామ్మర్ధి సలహా సూచనల మేరకు ఆదివారం ఆపసోపాలు పడుతూ కాంగ్రెస్‌ అధినేత్రి పిలుపుకోసం ఎదురు చూపులు చూసి..చివరికి ఇన్నాళ్లూ భారంగా నెడుతున్న బరువు బాధ్యతల్ని దించేసుకుని తన 'రాజ్యం' ఇక హస్తగతమని హాయిగా ప్రకటించేసారు.
అట్టహాసంగా ప్రారంభించి సామాజిక న్యాయం చేస్తామని చెప్పి.. జనం మీదకు కుటుంబ సభ్యులంతా మూకుమ్మడిగా ప్రచారానికి వచ్చి పడ్డా...ఓట్లు పడలేదు. సరికదా సొంత ఊర్లోనే నమ్మని ఓ మహిళామణి చేతిలో చిత్తుగా ఓడించి పంపారు ... చావుతప్పి కన్నులొట్టబోయినట్లు తిరుపతిలో గెలిచారు. కేవలం 18 సీట్లకే పరిమితమైన తరుణంలో రాజావారి లేఖలు, కేవీపీ మంతనాలు,ఉండవల్లి తపాలా పనులు... ఇలా సాగిన వైనాన్ని పత్రికలు ఆ నేడే 'జండా పీకేద్దాం' అంటూ చిరు మనసులోని మాటని బైటపెట్టిన సంగతులు..వాటిపై విరుచుకు పడిన నేతలు గమ నించాలి.వైఎస్‌ ఉన్నపðడే కాంగ్రెస్‌లోకి పోవాలన్న కదనోత్సాహం చూపి ఆమేరకు స్క్రీన్‌ప్లే కూడా రచించేసారని.. దాన్ని తమలాంటి వాళ్ల అడ్డుకున్నామనది చిరుకి రాజకీయ ఓనామాలు చెప్పిన చేగొండి విప్పిన గుట్టు  గుర్తెరగాల్సిందే.

పదహారు వేషాలేసేందుకు విశాల్‌ సిద్దమైపోతున్నాడు..

దశావతారంలో కమల్‌ 10 రకాల వేషాల్లో కనిపిస్తే... అందుకు ధీటుగా విశాల్‌ పదహారు వేషాలేసేందుకు సిద్దమైపోతున్నాడు. తమిళంలో రూపొందుతున్న 'ఆవన్‌-ఇవన్‌' చిత్రంలో నటిస్తున్న విశాల్‌ ఈ సినిమాలో 16 రకాల గెటపðలో కనిపించనున్నాడు. తెలుగులో 'వాడు-వీడు' పేరుతో విడుదల కానున్న ఈ చిత్రంలో విశాల్‌ సరసన ఈచిత్రంలో మధుశాలిని నటిస్తోంది.

కాగా బాల దర్శకత్వంలో గత కొన్నాళ్లుగా సా...గదీస్తూ.. జరుగుతున్న షఉటింగ్‌ పూర్తయితే ఏప్రియల్‌ లో ఈ చిత్రం విడుదల కావటం ఖాయం. ఒక్క గెటప్‌లోనే విశాల్‌కి విజయాలు అంతంత మాత్రం అయిన దశలో ఇన్ని వేషాల్తో ప్రేక్షకులు ఎలా భరించి పట్టం కడతారో చూడాలి.

విలీనం కావడమే మంచిదీ

నాలుగైదు సీట్లు పెంచుకోవడం కోసం పొత్తులు పెట్టుకోవటం కంటే సామాజిక న్యాయం కోసం విలీనం కావడమే మంచిదని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. కాంగ్రెస్ అంతర్గత ఇబ్బందుల వల్ల ... వరుసగా ఎన్నికలు రావడం వల్ల ఖజానాపై భారం పడుతుందని, ప్రజాస్వామ్యానికి కూడా ఇది మంచిది కాదని భావించాం. అందుకే మద్దతివ్వాలనుకున్నాం.
సామాజిక న్యాయం ఎలా సాధించాలన్నదే మా తపన. రాష్ట్రంలో దోపిడీ వర్గం, ప్రజల డబ్బును దోచిన వ్యక్తులు అధికారం కోసం అర్రులు చాస్తూ ప్రజల దగ్గరకు వెళుతున్నారఅన్నారు.

ఇక ఆధార్ ఒక్కటే ఆధారం.

మనం బ్యాంకు ఖాతా తెరవాలన్నా లేదా ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా మొదట అడిగిదే గుర్తింపు కార్డ్ . పాస్‌పో ర్టు కు దరఖాస్తు చేసుకోవాలన్నా వ్యక్తిగత సమాచారం అడుగుతారు. కుటుంబ సభ్యుల వివరాలూ చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో సరైన గుర్తింపు కార్డు లేక ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇకపై ఏ భారతీయుడూ గుర్తింపులేని వ్యక్తిగా ఉండకుండా ప్రభుత్వం ఆధార్ కార్డ్ మంజూరు చేస్తోంది. ఈ కార్‌‌డను ఇప్పుడు పొందలేకపోతే భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లవుతుంది. ప్రతి భారత నివాసికి ప్రభుత్వం 12 అంకెలతో ఒక గుర్తింపు ఇస్తూ మన జీవితాలకు భరోసా ఇస్తోంది. భవిష్యత్తులో బ్యాంకు రుణాలు పొందాలన్నా, ప్రభుత్వ పథకాలను, ప్రయోజనాలను పొందాలన్నా, రేషన్ కార్‌‌డ, లేదా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డ్ ఒక్కటే ఆధారం.

పేరు, పుట్టిన తేది, లింగ విభేదము, చిరునామ వివరాలతోపాటు బయో మెట్రిక్ వివరాలు, వ్యక్తి ముఖచిత్రం, రెండు చేతులకు సంబంధించిన పది వేళ్ల ముద్రలు (4.4.2 విధానంతో) స్కాన్ చేస్తారు. అదేవిధంగా రెండు కళ్లను ఐరిష్ (కుపాప చుట్టూ ఉండే వలయం) చిత్రాలు సేకరించి వాటిని ఆధార్ కార్‌‌డలో పొందుపరచి అందజేస్తారు. ఆధార్ కార్‌‌డ కోసం ప్రతిపట్టణం, గ్రామంలోని ప్రతి వార్డులో ఏర్పాటు చేసిన ఆధార్‌కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. ప్రతి రేషన్‌షాపు డీలర్ వద్ద ఆధార్ దరఖాస్తు ఫారం లభిస్తుంది.

జగన్ దీక్షలను కాపీకొడుతున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు యువనేత జగన్ దీక్షలను కాపీకొడుతు...పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధిం చాలనే లక్ష్యంతో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న హరితయాత్రను అనుకరించాలని టీడీపీ క్యాడర్‌కు ఆదేశాలు జారీ చేశారు. 7వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం ముం డూరు నుంచి పోలవరం కాలువ పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

చేతిలో చేయి వేసుకొని మాట్లాడినా..‘గే’(గో)లే ....

సాధారణ స్ర్తీపురుష జంటల మాదిరిగా మాకూ డేటింగ్ చేసే ప్రదేశాలు కావాలని స్వలింగ సంపర్కులు కోరుకుంటున్నారు. కోర్టు స్వేచ్ఛను ప్రసాదించినా.. ప్రజలు ఇప్పటికీ తమను నేరస్తులుగా చూస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముంబై కేంద్రంగా హమ్‌సఫర్ ట్రస్ట్ నడుపుతూ స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడే సినిమా రూపకర్త శ్రీధర్ రంగాయన్ మాట్లాడుతూ ‘మెట్రో నగరాల్లో ఇద్దరు పురుషులు కౌగిలించుకున్నా.. చేతిలో చేయి వేసుకొని మాట్లాడినా చుట్టుపక్కల వారు దానిని నేరంగా చూస్తున్నారు. గ్రామాలు, చిన్న పట్టణాల్లో మాదిరిగా ఇక్కడ మేం ఆనందంగా గడిపే తావు దొరకడం లేదు. అందుకే స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి చేయించుకున్న వాళ్లు టాయిలెట్లు, ట్రయల్ రూముల్లోకి వెళ్లడానికి కూడా ధైర్యం చేస్తున్నారు. దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పోలీసులు వేధిస్తున్నారు’ అని వివరించారు.

కసబ్ పూణే జైలుకు....?

నగరంపై ఉగ్రవాదుల దాడులకు సంబంధించి సజీవంగా దొరికిపోయిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్ భద్రతా కారణాల రీత్యా చిరునామా ఆర్థర్ జైలు నుంచి పుణే జైలుకు తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.. హైకోర్టులో సోమవారం జరగనున్న విచారణలో కసబ్‌కు ఉరి శిక్ష పడనుందా లేదా శిక్షను తగ్గించి జీవిత ఖైదు విధించనున్నారా అనే విషయం పేర్కొనడం కష్టమే అయినప్పటికీ విచారణ అనంతరం మాత్రం కసబ్ చిరునామా మాత్రం మారనుందని తెలుస్తోంది.

సినిమా వల్ల నుంచి అధికారం లాక్కొందాం

రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి పాలిస్తున్న సినీ రంగానికి చెందిన వాళ్ల నుంచి అధికారాన్ని లాక్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వన్నియర్‌పైనా ఉందని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ఓటు బ్యాంక్‌గా వన్నియర్ సామాజిక వర్గం ఉందని ... వన్నియర్లు ఐక్యంగా లేకపోవడం వల్ల అధికారాన్ని ఇతర సామాజిక వర్గాల వారు తన్నుకుపోతున్నారని అన్నారు

43 ఏళ్లుగా రాష్ట్రం సినీ రంగానికి చెందిన వాళ్ల చేతిలోనే ఉంటోంద ని పరోక్షంగా ముఖ్యమంత్రి కరుణానిధి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై విమర్శలు కురిపించారు. వారి దోపిడీ నుంచి రాష్ట్రా న్ని బయటపడేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంకే పోటీ చేసిన స్థానాలతో పాటు అదనంగా మరికొన్ని నియోజకవర్గాలను కోరబోతున్నామని, ఎవరైతే ఆ మేరకు సీట్లు ఇవ్వడానికి అంగీకరిస్తారో ఆ కూటమిలో చేరతామన, పార్టీలోని సభ్యుల అభిప్రాయం తీసుకున్న తర్వా తే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

నిరవధిక సహాయ నిరాకరణ ఉద్యమం తప్పదు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇప్పటి వరకు చేపట్టిన ఉద్యమాలు ఒక ఎత్తయితే ఇప్పు డు చేపట్టబోయే సహా య నిరాకరణ ఉద్యమం చివరి అస్తమ్రని తెలంగాణ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త పిట్టల రవీంద ర్ పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.

సహాయ నిరాకరణోద్యమం ద్వారా ఎలాంటి ఇ బ్బందులు తలెత్తినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఈ నెల 12న జేఏసీ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో పరిస్థితులు, ప్రభావిత అం శాలు తదితర విషయాలపై జేఏసీల నిర్ణయా లు, సలహాలు, సూచ నల మేరకు ముసాయిదా తయారు చేసి, దానికి విధివిధానాలను క్రోడీకరించి నివేదిక ప్రకటిస్తామని తెలిపారు.

సత్యసాయి సేవలో గయానా అధ్యక్షుడు జెట్టీయో

గయానా అధ్యక్షుడు భారత్ జెట్టీయో పుట్టపర్తి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన ప్రత్యేక భద్రత నడుమ కాన్వాయ్‌లో బెంగళూర్ నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తి చేరుకున్నారు. ప్రశాంతి నిలయం శాంతి భవన్‌లో అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాసేపు అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుని అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రశాంతి నిలయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయిబాబాను ప్రత్యేకంగా దర్శించుకున్నారు

‘తత్కాల్’కు గుర్తింపు కార్డు తప్పనిసరి

తత్కాల్ కోటా రైలు ప్రయాణికులు ఇక నుంచి తమతో పాటు గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. తత్కాల్ పథకంలో చోటు చేసుకుంటున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రయాణ సమయంలో గుర్తింపుకార్డు కలిగి ఉండాలనే నిబంధన చేర్చినట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

తత్కాల్ టికెట్‌పై ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నప్పుడు వారిలో ఒక్కరైనా పైన పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డును తనిఖీ సిబ్బంది అడిగినప్పుడు చూపించాల్సి ఉంటుంది. అలా చూపించని పక్షంలో వారిని టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణిస్తారు. ప్రయాణికులు ఎన్నికల గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదేని గుర్తింపు కార్డు, విద్యార్థులైతే కళాశాల గుర్తింపు కార్డు, జాతీయ బ్యాంకులు జారీ చేసిన పాస్‌బుక్కు, లామినేషన్ చేసిన ఫొటోతో కూడిన క్రెడిట్ కార్డులలో ఏదేని ఒక గుర్తింపు కార్డును తప్పని సరిగా చూపించాల్సి ఉంటుంది.