30, అక్టోబర్ 2010, శనివారం
మణిరత్నం దర్శకత్వంలో ప్రిన్స్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో యువ హీరో మహేష్ బాబు నటించనున్నారు. విక్రమ్, మహేష్ బాబు నటించే ఈ చిత్రాన్ని రోబో చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ అత్యంత భారీ వ్యయం తో నిర్మించనుంది. |
రాజీవ్ పేరు పై వెనక్కి తగ్గినా సుబ్బరామి రెడ్డి...
లలితకళాతోరణం ఆధునీకరణ పనులను ఉపసంహరించుకున్నట్లు కాంగ్రెస్ నేత టి. సుబ్బిరామిరెడ్డి సీఎం రోశయ్యకు లేఖ రాశారు. లలితకళాతోరణానికి ముందు రాజీవ్ పేరు పెట్టడంపై తలెత్తిన రాజకీయ రగడకు సుబ్బిరామిరెడ్డి మనసు మార్చుకుని జీవోను రద్దు చేయాలని ముఖ్యమంత్రికి వినతి చేశారు. ప్రభుత్వం కొత్తగా స్థలం ఇస్తే ఆడిటోరియం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు.
సామూహిక అభిషేకాలకు శ్రీశైల శివయ్య రెడీ
శ్రీశైల దేవస్థానంలో శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సామూహిక, ప్రత్యేక అభిషేకాలకు ప్రణాళిక సిద్దం చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.
శివునికి అభిషేకాలు చేసేందుకు అన్‌లైన్ల ద్వారా టికెట్లను పొందే అవకాశాలను రద్దు చేసినట్లు తెలిపారు. సామూహిక అభిషేకానికి టికెట్టు ధర 600 రూపాయలు, ప్రత్యేక అభిషేకానికి వెయ్యి రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, 30మంది ప్రత్యేక సెక్యూరిటిని 6నెలల పాటు విధులను వినియోగించుకుంటామని, వీరు నవంబర్ 1వ తేదీ నుండి విధులకు హాజరు అవుతారని తెలిపారు
లక్షాదికారి మాట దేవుడెరుగు.. మృత్యు ముఖంలోకి తోస్తున్నారు
మహిళలను లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మాటలను ప్రస్తుత ప్రభుత్వం నీటి మూటలుగా మార్చింది. పావలా వడ్డీ రుణాల కోసం మహిళా సంఘాలు ఎదురుచూస్తున్న స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో సభ్యులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ప్రత్యామ్నాయంగా సూక్ష్మ సంస్థల నుంచి, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలను పొందే దిశగా మహిళా సంఘాల సభ్యులు మొగ్గు చూపుతున్నారు.
రోజు రోజుకి రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్‌ల మరణ శాసనాన్ని ఆపలేకపోతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 65మంది ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ను మైక్రో సంస్థలు ఏమాత్రం లెక్కచేయడం లేదు. మైక్రోఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు గురిచేస్తే వెంటనే వారిపై కేసులు నమోదుచేయాలని అధికారులను ఆదేశించినా ... మైక్రోసంస్థల ప్రతినిధులు, ఉద్యోగులు యథావిధిగానే రుణం తీసుకున్న మహిళల ఇళ్లకు వెళుతున్నారు. వారం వారం కట్టాల్సిన డబ్బులను కట్టాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలను బెదిరింపులకు కూడా గురిచేసినట్లు తెలిస్తోంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పావలావడ్డీ పథకాన్ని 2004లో ప్రవేశ పెట్టారు... పావలావడ్డీ పథకం తో . ప్రభుత్వం మహిళలను లక్షాధికారి చేస్తామన్న ప్రకటన అమలు కాకపోవడం.. తో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది దీంతో మహిళలు మైక్రోఫైనాన్స్ వైపు మొగ్గుచూపారు. .అన్నది వాస్తవం
సూక్ష్మ రుణ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలకు లోబడి నిర్వహించేది కొన్ని మాత్రమే ఉన్నాయి. మిగిలినవి అనధికారికంగా లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. సూక్ష్మ రుణ సంస్థలు యాజమాన్యాలు రుణం వసూళ్లుచేసే తీరు దారుణంగా తయారైంది. సూక్ష్మ రుణ సంస్థల సిబ్బంది ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు. 10మంది సభ్యులు ఉంటే వారిలో ఏ ఒక్కరు కట్టకపోయినా మిగిలిన 9మంది కట్టని సభ్యురాలి డబ్బులు తప్పక చెల్లించాలి. లేని పక్షంలో మొత్తం సభ్యులను డబ్బులు కట్టేంత వరకు వారిని అక్కడే నిలబెడతారు. దాంతో పరువుకోసం మహిళలు మరోచోట అధికవడ్డీలకు అప్పు చేసి డబ్బులు తెచ్చి వీరికి కట్టి వీరి వేధింపుల నుంచి బయటపడతారు. స్వయం సహాయక గ్రూపులు..మహిళా గ్రూపులు ... పొదుపు చేసుకుంటే... కార్ఫస్ ఫండ్ అందుబాటులో ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా చెబుతున్నా బ్యాంక్ లింకేజ్ రుణాలు, పావలావడ్డీ రుణాలను తీసుకోవాలంటే సవాలక్ష ధ్రువీకరణలు, వివరణలు ఇచ్చుకుంటేగాని రుణం వచ్చే పరిస్థితిలేదు. దాంతో సూక్ష్మ రుణ సంస్థల వార్షికాదాయం జిల్లాలో గణనీయంగా పెరిగింది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పావలావడ్డీ పథకాన్నికి సక్రమంగా అమలు చేసి అధిక నిధులు కేటాయించి మహిళలను ఆదుకుంటే సూక్ష్మ రుణ సంస్థల ఆగడాలను కొంతమేర అయినా అరికట్టవచ్చునని మహిళా సంఘాలు అంటున్నాయి.
నిబంధనలకు నీళ్ళు ... పేలనున్న టపాసులు
దీపావళి పండగ సమీపిస్తున్న కొద్దీ బాణసంచా విక్రయాలు పెరిగిపోతున్నాయి. యజమానులు అమ్మకాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. అయితే ఇక్కడ వున్న సమస్య అంతా ఒక్కటే నిబంధనల ఉల్లంఘన. శివారు ప్రాంతాలతో పటు నగరంలోని పలుచోట్ల ప్రభుత్వ అనుమతితో హోల్‌సేల్ మందుగుండు దుకాణాలు నడుస్తున్నాయి. ఐతే అగ్నిమాపక శాఖ అధికారులు సూచించిన నిబంధనలకు అనుగుణంగా బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా 10, 15 మినహా మిగిలిన దుకాణాలన్నీ అగ్నిమాపక నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తూ తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి యజమానులు యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగిస్తున్నా అధికారులు మాత్రం నిబంధనలకు పాతర వేస్తున్న దుకాణాదారులపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదాలు జరిగాక చర్యలు తీసుకొనేకంటే ముందుగాని నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
ఆయుర్వేద, హోమియో, యునాని ఎం.డి.కోర్సు లకు ఎన్‌టిఆర్ వర్శిటీ నోటిఫికేషన్
డాక్టర్ ఎన్‌టిఆర్ ఆరోగ్య, వైద్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లోని ఎం.డి. (ఆయుర్వేద), ఎం.డి. హోమియో, ఎం.డి. యునాని కోర్సుల్లో 2010 -11 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి సంబంధించి ఈనెల 30వ తేదీ నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసు కొనేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది . ఈనెల 30వ తేదీ ఉదయం 10 గంటల నుండి నవంబరు 8వ తేదీ సాయంత్రం వరకూ వర్శిటీ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్‌చేసుకోని, వివరాలను పూర్తి చేసి దరఖాస్తులు పంపించాలి.
ఎన్‌టిఆర్ ఆరోగ్య, వైద్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం సైట్ ద్వారా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వివరాలను పూర్తి చేసి వర్శిటీకి పంపించాలి. దరఖాస్తులు అభ్యర్థులు స్వయంగా గాని, లేదా పోస్టు ద్వారా గాని పంపించవచ్చు.
ఎండి (ఆయుర్వేద), ఎండి (హోమియో), ఎండి (యునాని) కోర్సులకు సంబంధించి ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులయితే రూ.450లు, ఇతర కేటగిరికి సంబంధించి అభ్యర్థులయితే రూ.600లు ఏదైన జాతీయ బ్యాంకు ద్వారా డిమాండు డ్రాప్టు తీసుకొని పంపించాలి. డిడిని డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఎపి పేరుతో విజయవాడలో చెల్లేవిధంగా తీయాల్సి ఉంటుంది.
పూర్తి చేసిన దరఖాస్తులు నవంబరు 8వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా వర్శిటీకి అందే విధంగా పంపించాలి. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి చేసిన తరువాత గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం చేసి పంపించాలి. దరఖాస్తుపై 'ఎండి (ఆయుర్వేద) ఇటి - 2010' అని రాయాలి. అదే హోమియో అయతే ఎండి (హోమియో) ఇటి - 2010 అని, యునాని అయితే ఎండి (యునాని) ఇటి -2010 అని తప్పకుండా రాయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ది కన్వీనర్, పోస్టు గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ కమిటీ, డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఎపి విజయవాడ - 520 008. అనే చిరునామాకు పంపాలి. అభ్యర్థులు స్వయంగా కూడా పంపించవచ్చు.
ఎండి (ఆయుర్వేద), ఎండి (హోమియో), ఎండి (యునాని) కోర్సులకు సంబంధించి నవంబరు 21వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతుంది. ఇతర వివరాలు, నమూనా పరీక్షా పత్రం వర్శిటీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రవేశ పరీక్షకు సంబంధించి నవంబరు 18వ తేదీ నుండి 20వ తేదీ వరకూ ఆయా కోర్సులకు సంబంధించి హాల్‌టికెట్లను వర్శిటీ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. అంతకన్నా ముందే అభ్యర్థులకు స్వయంగా వర్శిటీ పోస్టు ద్వారా ఎన్‌టిఆర్ ఆరోగ్య, వైద్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం పంపిస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులకా?
రోజు రోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ యోచన సాధ్యాసాధ్యాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల సంఖ్య విపరీతంగా పెరగడం, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు సైతం పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటివి నియంత్రించడం మోటార్ వెహికల్ అధికారులకు సాధ్యపడడంలేదు. అలాగే మోటార్ సైకిళ్ల వినియోగం కూడా పట్టణాలకు దీటుగా పల్లెలో పెరిగిపోవడంతో ప్రమాదాలకు పెరుగుతున్నాయి.
ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధ్యయనానికి రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన అధికారుల కమిటీ ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్లో ఈ నియంత్రణ అధికారాలను గ్రామ కార్యదర్శులకు అప్పగించాలని వుంది. దీనిపై అన్నిశాఖల అధికారుల తీరుతెన్నులపై క్షేత్రస్థాయి నుంచి చర్చలు జరుగుతున్నా.... పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు చేయడానికే కార్యదర్శులు, సిబ్బందిలేక సతమతమవుతున్న తరుణంలో ఈ వాహన నియంత్రణ చట్టం భారం ఏమేరకు ఫలిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధ్యయనానికి రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన అధికారుల కమిటీ ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్లో ఈ నియంత్రణ అధికారాలను గ్రామ కార్యదర్శులకు అప్పగించాలని వుంది. దీనిపై అన్నిశాఖల అధికారుల తీరుతెన్నులపై క్షేత్రస్థాయి నుంచి చర్చలు జరుగుతున్నా.... పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు చేయడానికే కార్యదర్శులు, సిబ్బందిలేక సతమతమవుతున్న తరుణంలో ఈ వాహన నియంత్రణ చట్టం భారం ఏమేరకు ఫలిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
గతంలో సైకిళ్లకు లైసెన్స్ విధానం అమల్లో ఉండేది. దీంతో పంచాయతీ ఉద్యోగులు రోడ్లపై కాపుకాసి (వెహి కల్ ఇన్‌స్పెక్టర్ల మాదిరిగా) రూ.0.50 పైసలు, రూపాయి విలువగల అల్యూ మినియం లైసెన్సు బిళ్లలు ఏర్పాటు చేసేవారు. లైసెన్సులు లేని సైకిళ్లపై కేసులు నమోదు చేసేవారు. అనంత రం ఈ విధానం రద్దయింది. అయితే ఆవిధంగా ఇప్పుడు ఆ స్థాయిలో వాహనాల నియంత్రణకు గ్రామ కార్యదర్శులు నడుం బిగిస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంద ని అధికారులు భావిస్తున్నప్పటికీ సిబ్బంది కొరత, స్థానిక రాజకీయ జోక్యం అధికమవడం ఇది సాధ్యా సాధ్యాలపై చర్చ జరుగుతోంది
ఇక ఆర్టీసీ ఫ్యామిలీ క్యాట్‌కార్డులు
నవంబర్ 1 నుంచి ఆర్టీసీ ఫ్యామిలీ క్యాట్‌కార్డును ప్రవేశ పెడుతోంది మూడేళ్ల క్రితం వరుసగా రూ.140 చెల్లించి క్యాట్‌కార్డు కొనుగోలు చేసిన ప్రయాణికుడు ఇప్పుడు అదనంగా రూ.160 చెల్లించి ఫ్యామిలీ క్యాట్‌కార్డును పొందవచ్చు. ఫ్యామిలీ క్యాట్‌కార్డు ద్వార ఆర్టీసీ బస్సుల్లో పది శాతం రాయితీపై రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోగానీ అంతరాష్ట్ర సర్వీసుల్లోగానీ ప్రయాణించ వచ్చు..ఈ క్యాట్‌కార్డుదారుడితో పాటు రాయితీ సౌకర్యం నలుగురు కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది
చందా లేసుకొని సోమ్ములిస్తాం... జగన్ జపం మానాలని కొండా దంపతులకు సూచన
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర సాధనకు ప్రత్యేక తెలంగాణ గులాబీ దళం ప్రత్యక్ష పో రాటం చేస్తుందని టీఆర్ఎస్వీ రాష్ట్ర అ ధ్యక్షుడు బల్క సుమన్ వెల్లడించారు.
టీ ఆర్ఎస్వీ నూతన కమిటీ ఏర్పాటు చే సిన వారం రోజుల్లోనే 50వేల సభ్య త్వం నమోదు చేసినట్టు తెలిపారు. కొండా దంపతులు ఇకనైనా జగన్ జపం మానాలని, జగన్ వద్ద పెట్టుబడులుంటే, నష్టపోతామనుకుంటే విద్యార్థులందరూ ఒక్కొక్క రూపాయి పోగేసి అందచేస్తారని అన్నారు. మహబూబాబాద్ లాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు
రాజ్యాంగ బద్ధంగా పోరాటం చేసేందుకు గులాబీ దళాన్ని సిద్ధం చేసి, తె లంగాణా సాధించేందుకు పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ సాధన మలిదశ పోరాటంలో భాగస్వాములను చే సేందుకు డిసెంబర్‌లోగా 15లక్షల మంది విద్యార్థులతో గులాబీ దళాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
యుద్ధానికి సిద్ధం కావాలని రాములమ్మ పిలుపు
డిసెంబర్ నెలాఖరులో శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా రాకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండా లని మెదక్ ఎంపీ విజయశాంతి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో ఎన్నడు లేని విధంగా ఆరునెలల కాలంలో 650 మంది ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో మరో వైపు సమైక్య రాష్ట్రంలో అవతరణ దినోత్సవం జరుపుకోవాలని అనడం భావ్యమా అని ప్రశ్నించారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలుగా మోసానికి గురైందని, అందువల్లే ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు ప్రాణాలు సైతం పొగొట్టుకుంటుంటే మరోవైపు మం త్రులు, ఎమ్మెల్యేలు అవతరణ దినోత్సవంలో పాల్గొంటామని పేర్కొనడం దారుణమన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)