31, మార్చి 2011, గురువారం

భోపాల్‌ ఇకపై భోజ్‌పాల్‌

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని భోపాల్‌ను ఇకపై భోజ్‌పాల్‌ పేరుగా వ్యవహరిస్తారు. రాజా భోజ్‌ 11వ శతాబ్దంలో మాల్పా ప్రాంతాన్ని పాలించాడు. మహ్మద్‌ గజనీపై 1024లో రాజాభోజ్‌ విజయం సాధించాడు. భోపాల్‌లో రాజాభోజ్‌ పట్టాభిషేకం మిల్లేనియం లేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ రాజ్‌సింగ్‌ చౌహాన్‌ భోపాల్‌కు భోజ్‌ పాల్‌ పేరును ప్రతిపాదించారు. భోపాల్‌లోని బడా తలావో సరస్సును ఇకపై 'భోజ్‌ తాల్‌' గా వ్యవహరిస్తారు. అలాగే విఐపిరోడ్‌ను 'రాజాభోజ్‌' మార్గ్‌గా పిలుస్తారు. బొంబాయి ని ముంబైగా, మద్రాసును చెన్నైగా, కలకత్తాను కోల్‌కత్తా, బేంగళూర్‌ను బెంగుళూరుగా వ్యవహరిస్తున్నందున భోపాల్‌ను భోజ్‌పాల్‌గా ఎందుకు పరిగణించకూడదంటారు.

నేతల ఆస్తులపై ఇడి ఆరా?

నల్ల ధనం రారాజు హసన్‌ అలి అరెస్టు తదనంతర పరిణామా లు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా పరిశోధనలో రాష్ట్రానికి చెందిన పలువురు బడా రాజకీయ నేత లు, పేరుమోసిన వ్యాపారులతోనూ ఈ గుర్రాల నవాబుకు లావాదేవీలున్నాయని రూఢీ అవడంతో దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) లోతుగా ఆరా తీయ సాగింది. రాష్ట్ర o నుంచి పది వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని విదేశాలకు తరలించినట్లు వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు రంగం లో దిగిన ఇడి హవాలా రాయుళ్ల కదలికలపై నిఘా వేసింది. ఎక్కువ భాగం రాజకీయ నేతలకు సంబంధించినవేనని ఆరోపణ లు వస్తుండడంతో నేతల ఆస్తులపై ఇడి ఆరా తీయసాగింది. పదేళ్ల కాలంలో అతి సంపన్నలైన నేతల వివరాలను సేకరించడంపై ఇడి దృష్టి సారించింది.

ఎవరెన్ని అవరోధాలు కల్పించినామనదే అధికారం : జగన్

వైఎస్ ఖ్యాతిని చరిత్రపుటల్లోంచి చెరిపేసేందుకు పాలక, విపక్షాలు ఏకమై కుట్రలు పన్నుతున్నారని మాజీ ఎం.పి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎవరెన్ని అవరోధాలు కల్పించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని... రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని పార్టీ వర్గాలకు భరోసానిచ్చారు.

వివేకా , జగన్ మధ్య ఉప ఎన్నికల పోరు

కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ సీట్లకు బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డికి, అబ్బాయ్ వైయస్ జగన్ మధ్య ఉప ఎన్నికల పోరు ప్రారంభమైనట్లే. ఈ రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. దీంతో వివేకానంద రెడ్డి, జగన్ మధ్య ఉప ఎన్నికల పోరు జోరందుకుంటుంది.

చిత్తూరు ని విడిచి వెళ్ళడం అంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు

ఘనమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం కలిగిన చిత్తూరు జిల్లాలో పుట్టడం ఎవరికైనా సౌభాగ్యదాయకమని రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ అన్నారు. చిత్తూరు పట్టణంలో శతాబ్ది ఉత్సవాలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషాసంస్కృతీ సాంప్రదాయాల మేలుకలయికని, భిన్నత్వంలో ఇంతటి ఏకత్వాన్ని మరెక్కడా చూడలేమన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, మాడభూషి అనంతశయనం అయ్యంగార్ వంటి తత్వవేత్తలు, రాజనీతికోవిదులు చిత్తూరు జిల్లా నుంచీ దేశానికి సేవలందించారని ప్రశంసించారు.తన బాల్యంలో సుప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య పేరు బాగా వినిపించేదన్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన జిల్లాను వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్ళద్దని .. అలా ఎవరైనా జిల్లాను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటే అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి వుండదన్నారు.

ఉద్యమ ద్రోహులెవరో బైట పెడతా...

తొందర్లేనే తెలంగాణ ద్రోహులెవరో తేలుస్తానని సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన తీరు విషయంపై అధిష్టానానికి కూడా వివరించా...నిర్ణయం వారిపైనే వదిలేసా అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ...తాను తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి పోటీ చేస్తే ప్రత్యర్థిగాతెలుగుదేశం తరపున సిర్పూరు మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐకే రెడ్డి నిలిస్తే వారు తెలంగాణ ద్రోహులు కాదా అని ప్రశ్నించారు.. తెలంగాణా కి ఉద్యమానికి ఎవేరెవరు ద్రోహం చేస్తున్నారో పూర్తి వివరాలను త్వరలోనే కాగజ్‌నగర్‌ లో బహిరంగ సభ పెట్టి వెల్లడిస్తానని సమ్మయ్య పేర్కొన్నారు.

బాబా ఆరోగ్యం మరింత మెరుగు

సత్యసాయి బాబా ఆరోగ్యం మరింత మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు ప్రత్యేక బులెటిన్‌ను విడుదల చేశాయి. బాబాకు అన్ని రకాల పరీక్షలు చేశామని, హృద్రోగ నిపుణుల పర్యవేక్షణలో వైద్యసేవలు కొనసాగుతున్నాయని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డెరైక్టర్ ఏఎస్ సఫాయాతెలిపారు.

దేశం లో రొటేషన్

ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) సహా శాసనసభకు సంబంధించిన అన్ని కమిటీల్లోనూ రొటేషన్ ప్రాతిపదికన నేతలకు అవకాశం కల్పించాలని టీడీపీ భావిస్తోంది. అసెంబ్లీలో పీఏసీ కార్యాలయాన్ని నాగం జనార్దన్‌రెడ్డి బుధవారం ఖాళీ చేయడంతో ఈసారి ఆయనకు అభ్యర్థిత్వం దక్కకపోవచ్చనడానికి ఇదే సంకేతమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదే నిజమైతే ఈసారి వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డికి అవకాశం దక్కొచ్చంటున్నారు. గతంలో టీడీపీ హయాంలో 610 జీవో సభాసంఘానికి ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు.

ఉగాది నుంచి శివన్న కి ఆర్జిత సేవల కట్

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏప్రిల్ 1 నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఉగాది ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ఈఓ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. గర్భాలయంలో భక్తులు నిర్వహించే రుద్రాభిషేకం, కుంకుమార్చన, రుద్ర, చండీ యాగాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.ఉత్సవాలు జరిగే ఐదు రోజులూ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు.

ఓట్ల కోసం ఓదార్పు వాయిదా

‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో నిర్వహిస్తున్న ఓదార్పు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. కడప లోక్‌సభ, పులివెందుల ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 వరకు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించాల్సి ఉంది.