ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అహంకారానికి, కడప ఆత్మగౌరవానికే ఉప ఎన్నికలు అన్న వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్రమంత్రి పురందేశ్వరి చెప్పారు. బుధవారం పులివెందులలో విలేకరులతో మాట్లాడుతూ. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి తన తరఫున ప్రచారానికి రమ్మని చెప్పినందు వల్లే తాను పులివెందులకు వచ్చానని చెప్పారు. ఉప ఎన్నికల పోరులో కాంగ్రెసు గెలుపు ఖాయమని ...దశాబ్దాలుగా ప్రజలు కాంగ్రెసును అదరిస్తున్నట్టే ఇప్పుడు కూడా ఆదరిస్తారని...వైయస్ వివేకానందరెడ్డి గెలుపుతోనే పులివెందులలో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
4, మే 2011, బుధవారం
అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఖండూ సహా ఐదుగురు మృతి
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండుతో పాటు మరో నలుగురు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఐదురోజుల క్రితం ఇటానగర్ వెళ్తుండగా ఖండూ ప్రయాణిస్తున్న హెలీకాఫ్టర్ అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆర్మీ వర్గాలు ఖండూ ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు ప్రయాత్నాలు మొదలు పెట్టాయి. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా తవాంగ్లోని లోబ్తాన్ లో జంగ్ జలపాతం వద్ద కుప్పకూలినట్లు తెలుస్తోంది. దోర్జీఖండూ సహా అయిదుగురి మృతదేహాలు లభ్యం అయినట్లు, గుర్తుపట్టలేనంతగా, కుళ్లిపోయినట్లు తెలుస్తోంది. . కాగా దోర్జీఖండూ మృతిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)