2, ఫిబ్రవరి 2011, బుధవారం
శంకర్ త్రీ ఇడియట్స్ షూటింగ్‌కు విద్యార్థుల రౌండప్
హిందీ చిత్రం త్రీ ఇడియట్స్‌కు రీమేక్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కోయంబత్తూర్‌కు షిఫ్ట్ అయింది. అక్కడ అవినాసి రోడ్డులోని జెన్ని క్లబ్ ఎదురుగా ఊరేగింపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. మార్వాడిల పెళ్లి ఊరేగింపు తరహాలో ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా సమీపంలోని కళాశాల విద్యార్థులకు ఈ విషయం తెలిసి... గుంపులు గుంపులుగా వచ్చి షూటింగ్ ప్రాంతాన్ని రౌండప్ చేశారు. వాళ్లను అదుపు చేయడం సాధ్యం కాకపోవడంతో విజ య్, ఇలియానాలకు సంబంధించిన పాట షూటింగ్‌ను క్లబ్ లోపలికి మార్చారు శంకర్.
టెలికాం మాజీ మంత్రి రాజా అరెస్టు
కేంద్ర టెలికాం మాజీ మంత్రి ఏ. రాజాను సీబీఐ బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేసింది. లక్షా 76వేల కోట్ల కుంభకోణంలో రాజాకు ప్రధాన పాత్ర ఉన్నట్లు పాటిల్ కమిషన్ నిర్ధారించింది. ఈ కేసులో రాజా అవినీతికి పాల్పడ్డారన్న ఆధారాలు ఉన్నందునే అరెస్ట్ చేశామని సీబీఐ తెలిపింది.
ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలకోసం టెలికాం శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహూరాను, అప్పటి రాజా వ్యక్తిగత కార్యదర్శి ఆర్.కె. చందోలియాను కూడా సీబీఐ అరెస్టు చేసింది.
ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలకోసం టెలికాం శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహూరాను, అప్పటి రాజా వ్యక్తిగత కార్యదర్శి ఆర్.కె. చందోలియాను కూడా సీబీఐ అరెస్టు చేసింది.
మందు ప్రియుల వీక్ పాయింట్‌ను సొమ్ము చేసు కొంటున్న ప్రభుత్వం
రాష్ట్ర ఖజానా నింపడమే లక్ష్యంగా మందు ప్రియుల వీక్ పాయింట్‌ను సొమ్ము చేసుకునేందుకు రంగంసిద్ధం చేసింది. చల్లటి బీరు ముట్టుకోవాలంటే ఇప్పుడు జేబులు తడుముకునే పరిస్థితులు కల్పించింది. ఊహించని రీతిలో బీరు ధరలను పెంచేసింది. ఈ తంతు ఒక్క బీరుతోనే ఆగిపోయిందంటే అదీ లేదు. చీప్ లిక్కర్ నుంచి కాస్ట్లీ వైన్ వరకూ దేనినీ వదల్లేదు. అన్నిరకాల మద్యం ధరలను పెంచేసింది.
మందుబాబులుఎన్ని మార్లు ధరలు పెంచినా ఏమీ అనరని కాబోలు ఈ సారి కూడా మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సంకల్పించింది. ఆలోచన వచ్చిందే తడవుగా ధరలను పెంచుతూ అమలులో పెట్టింది. వేసవిలో బీరు విక్రయాలు జోరుగాసాగుతాయి. ఇదే వీక్ పాయింట్ ఆబ్కారీ శాఖకు ప్లస్ పాయింట్ అయింది. ఇప్పటికే రూ. 80 వరకు విక్రయిస్తున్న బీరు ధరలను రూ. 85 నుంచి 90 వరకు పెంచాలని నిర్ణయించింది.
బ్రాందీ, రమ్, జిన్, వోడ్కా, వైన్‌లాంటి మద్యంపైనా కరుణచూపలేదు. వెరైటీని బట్టి రేట్లు ఖరారు చేసింది. ప్రభుత్వం రూ. 4 నుండి 7 వరకు పెంచితే స్థానిక వ్యాపారులు మాత్రం రూ. 7 నుండి 9 వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు

కేసీఆర్‌కు సమైక్యాంధ్ర దమ్ బిర్యాని పార్శిల్
సీమాంధ్ర బిర్యానీపై కేసిీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రుచికరమైన మటన్ దమ్ బిర్యాని తయారు చేసి కేసీఆర్‌కు పార్శిల్ పంపారు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు. కేసఈఆర్ వాడుతున్న పదజాలం సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తోందని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న కేసిీఆర్‌కు అది ముదిరి బట్టలు లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి రాకుండా తక్షణం యర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు.
జగన్‌కు మద్దతు పలికిన వారి పునరాలోచన
కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నదని తెలియడంతో ఎవరిపై వేటు పడుతుందోనని జగన్ వర్గంలో గుబులు మొదలైంది. తొలి విడతగా కనీసం నలుగురైదుగురు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని భావిస్తుండడంతో వారు ఎవరు కావచ్చుననే ఆరా మొదలైంది. జగన్‌తో పాటు ఓదార్పు యాత్రలో, విజయవాడ లక్ష్య దీక్ష, ఢిల్లీలో జల దీక్ష, విశాఖలో జన దీక్ష వేదికల్లో పార్టీకి, అధినేత్రికి వ్యతిరేకంగా ఎవరెవరు మాట్లాడారన్న పూర్తి సమాచారం ఢిల్లీకి చేరినట్టు సమాచారం.
అనకాపల్లి ఎంపి హరి రెండు నాల్కల ధోరణిని కూడా అధిష్ఠానం గుర్తించిందని.. . గతంలో ఒకసారి పార్టీ నుంచి బహిష్కారానికి గురయ్యారని, అదృష్టం బాగుండి కేవీపీ ఆశీస్సులతో టిక్కెట్ సంపాదించి ఎంపీగా ఎన్నికై దాన్ని కూడా నిలుపుకోలేకపోతున్నారని...ఇప్పుడు జగన్ వర్గంలో చేరి అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఆ పార్టీ వారంతా తప్పుపడుతున్నారు. తొలుత ఆవేశంగా జగన్‌కు మద్దతు పలికిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడడం మరో విశేషం. అసలు సమయం వచ్చేసరికి ఎంత మంది అటువైపు ఉంటారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మొత్తానికి జగన్ వర్గంలో గుబులు మొదలైంది.

రాష్ట్రపతి పదవి దక్కలేదన్న అక్కసుతోనే కాకా విమర్శలు
రాష్ట్రపతి పదవి దక్కలేదన్న అక్కసుతోనే కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి సోనియాగాంధీని విమర్శిస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. పీఆర్పీతో పొత్తు వైఎస్ఆర్ ఉన్నపుడు నుంచీ జరుగుతున్న ప్రక్రియేనని,అప్పట్లో వైఎస్ఆర్ చెప్పడంతో తానే వెళ్లి మాట్లాడివచ్చానని అన్నారు. 'పీఆర్పీతో పొత్తుతో సోనియాకు లాభంలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం పీఆర్పీతో పొత్తుకు ఉపక్రమించారు. ఆమె దయాదాక్షిణ్యాలపై పదవులు అనుభవిస్తూ విమర్శించడం తగదు. 'వెంకటస్వామిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. ఆయన కుటుంబసభ్యులు వెంటనే పదవులకు రాజీనామాలు చేయాలి.
పదవీ కాంక్షతోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపిన చిరంజీవి
పీఆర్పీ అధినేత చిరంజీవి అనైతిక పొత్తులు పెట్టుకోవడానికి ప్రయత్నించడాన్ని కార్యకర్తలు జీర్ణిం చుకోలేక , అభీష్టం మేరకు పీఆర్పీకీ రాజీనామా చేసి జగన్ వర్గంలో చేరుతున్నట్టు పీఆర్పీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సదాశివరెడ్డి ప్రకటించారు.
సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైన చిరంజీవి, కేవలం పదవీ కాంక్షతోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపారని ఆయన విమర్శించారు.
సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైన చిరంజీవి, కేవలం పదవీ కాంక్షతోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపారని ఆయన విమర్శించారు.
సంవత్సరం క్రితమే తెలంగాణ కోసం రాజీనామా అందించా
తన రాజీనామాతో తెల ంగాణ ఏర్పడుతుందంటే ఈ క్షణం చేయడానికి వెనుకాడే ప్రసక్తే లేదన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రబెల్ల్లి దయాకర్ రావు. సంవత్సరం క్రితమే తెలంగాణ కోసం రాజీనామా లేఖను స్పీక ర్‌కు అందించానని తెలం గాణ ద్రోహులు, తెలంగాణ పేరు చె ప్పుకొని పబ్బం గడుపుకునే వారు, తెలంగాణ వాదంతో బాగుపడిన వా రు, పదవుల కోసం పార్టీలు మారిన వారికి తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
మంత్రిపై మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్
పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినమంత్రి పి.శంకర్‌రావుపై చర్య తీసుకోవాలంటూ మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపద్యంలో విచారణ కోరుతూ మంత్రి పి.శంకర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడంపై స్పందన కోరగా 'రాత్ గయీ... బాత్ వోహీ' అని జవాబిచ్చారు.
ఈ నేపద్యంలో విచారణ కోరుతూ మంత్రి పి.శంకర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడంపై స్పందన కోరగా 'రాత్ గయీ... బాత్ వోహీ' అని జవాబిచ్చారు.
బాబ్బాబు ...కాస్త సాయపడండి ... మీపేరుతో బస్సు నడుపుతాం
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) అన్వేషిస్తోంది. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి భారీ సాయం కోసం ఒక వైపు యత్నిస్తూనే, మరోవైపు ఆర్టీసీకి విరాళమిచ్చిన పక్షంలో ఆయా సర్వీసులకు దాతలు సూచించిన పేర్లను పెట్టాలన్న ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు.
దాతలనుంచి ఆర్థిక సాయాన్ని పొందగలిగితే..కొంతమేరకైనా ఆ లోటును పూడ్చుకోవచ్చని.. వారెవరైనా విరాళమందిస్తే వారు సూచించిన పేర్లను నిర్ణీత కాలం వరకు గానీ సదరు సర్వీసులకు పెట్టాలన్నది ఆర్టీసీ భావిస్తోంది.
దాతలనుంచి ఆర్థిక సాయాన్ని పొందగలిగితే..కొంతమేరకైనా ఆ లోటును పూడ్చుకోవచ్చని.. వారెవరైనా విరాళమందిస్తే వారు సూచించిన పేర్లను నిర్ణీత కాలం వరకు గానీ సదరు సర్వీసులకు పెట్టాలన్నది ఆర్టీసీ భావిస్తోంది.
కాంగ్రెస్‌తో పొత్తుకు ఏ స్థాయి పదవులకు బేరం పెట్టాలి?
కాంగ్రెస్‌తో పొత్తుకు సై అనాలా? వద్దా? ప్రభుత్వంలో చేరడంపై ఏం చేయాలి? చేరే పక్షంలో ఏ స్థాయి పదవులకు బేరం పెట్టాలి? నాలుగైదు పదవులు తీసుకొని ఇలా ప్రభుత్వంలో చేరిపోతే.. ఇన్నాళ్లూ పార్టీనే నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నేతల పరిస్థితి ఏం కావాలి? వారికి న్యాయం జరిగేదెలా?.. ఇవీ ప్రస్తుతం ప్రజారాజ్యంలోని వివిధ స్థాయి నేతల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు.
సోనియాతో భేటీలో విలీనం ప్రస్తావనే వస్తుందని విశ్వసిస్తున్న పార్టీ నాయకత్వం.. ఆ దిశగానే విస్తృత కసరత్తు నిర్వహిస్తున్నట్లు సమాచారం. "విలీనం ప్రతిపాదనే వస్తే.. ముఖ్యమంత్రితో సమాన స్థాయి కలిగిన చిరంజీవికి అంతటి ప్రాధాన్యమున్న పదవినే అడిగే అవకాశం ఉంది. ఆయనకు ఆ స్థాయి పదవి వస్తేనే.. పార్టీని నమ్ముకున్న నేతలను కొంతైనా పైకి తీసుకురాగలుగుతారు'' అని పార్టీ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. పీఆర్పీ వెళ్లి కాంగ్రెస్ సముద్రంలో కలిస్తే తమ పరిస్థితేమిటన్నది ద్వితీయ శ్రేణి నేతల ప్రధాన ప్రశ్నగా ఉంది.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)