18, నవంబర్ 2010, గురువారం
22న కాంట్రాక్ట్ లెక్చరర్స్ ‘చలో హైదరాబాద్’
గత పదేళ్లుగా కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న ప్పటికీ తమకి ఎలాంటి ఉద్యోగ భద్రత లేదని... ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండుతో జూనియర్, డిగ్రీ కళాశాలల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్లు ఈ నెల 22 నుంచి సమ్మె చేస్తారని కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
ఇప్పటికే ఇందుకు సంభందించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని... ఉద్యోగ భద్రత కల్పించాలన్న ప్రధాన డిమాండుతో ఈ నెల 22న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు చెప్పారు

ప్రధానిని ఉత్సవ విగ్రహంగా మలిచి.... దోచుకు తింటున్నారు
నిస్వార్థ చరిత్ర ఉన్న ప్రధాని మన్మోహన్సింగ్ను ఉత్సవ విగ్రహంగా మలిచి, కాంగ్రెస్ నాయకులు దేశాన్ని దోచుకు తింటున్నారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు.
రాష్ర్టంలోను, కేంద్రంలోను అసమర్థ ప్రభుత్వం కొనసాగుతోందని, కుంభకోణాల పరంపరను కొనసాగిస్తోందని కాంగ్రెస్ హయాంలో బయటపడిన ఎమ్మార్, మైనింగ్, సెజ్ కుంభకోణాలపై ఆ పార్టీ నాయకులే విమర్శలు గుప్పించడం సిగ్గుచేటన్నారు. క్రీడలతో సహా అన్ని రంగాల్లో కుంభకోణాల పరంపర కొనసాగుతుందన్నారు. తాజాగా 2జీ స్పెక్ట్రమ్‌లో రూ.173 కోట్ల కుంభకోణం వెలుగు చూసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసినా చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
కుంభ కోణాలను ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత విమర్శలకు దిగడం కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు..

డైరెక్టర్ శంకర్ పై మండిపడుతున్న ప్రిన్స్ మహేష్
'త్రీ ఇడియట్స్’ తెలుగు రీమేక్ లో నటించాలని కోరుతూ జెమిని ఫిలిం సర్క్యూట్ వారు తన వెంటపడితే చాలా కాలం నాన్చి చివరకు ఆ సినిమాను ఓకే చేశాడు. శంకర్ డైరెక్షన్ లో సినిమా అనేసరికి మహేష్ కూడా మెత్తబడ్డాడు. అయితే ఇప్పుడా సినిమాని అరవ మేళంగా తయారు చేస్తున్న శంకర్ పద్దతి నచ్చక మహేష్ మండిపడుతున్నాడట. ‘త్రీ ఇడియట్స్’ చిత్రాన్ని తెలుగు, తమిళ నటులని నింపేస్తున్నాడు.
కేవలం మహేష్, ఇలియానా తప్ప తెలుగు వెర్షన్ లోనూ తెలుగు నటులుండరట. మహేష్ పార్ట్ ఒక్కటీ తెలుగు కోసం రీషూట్ చేస్తారట. ఇది మహేష్ కి అస్సలు నచ్చట్లేదట.ఇలాగైతే ఈ చిత్రంలో నటించనని నిర్మాతలని బెదిరిస్తున్నాడట. ఇంతదాకా వచ్చాక మళ్లీ సినిమా మొదటికొస్తుందేమోనని నిర్మాతలు హడలిపోతున్నారు.
తెలుగు నటులకి కూడా సమప్రాధాన్యమివ్వాలని శంకర్ కి సూచిస్తున్నారు. ఈ సినిమా వరకు శంకర్ దే ఫైనల్ డెసిషన్ కాబట్టి మహేష్ బాధని అతను అర్థం చేసుకుంటాడో లేక చేస్తే చెయ్, లేకపోతే పో అంటాడో చూడాలి.

జెనీలియాని చూసి భయపడ్డ :రామ్ చరణ్
రామ్ చరణ్ సరసన ‘ఆరెంజ్’ చిత్రంలో హీరోయిన్ గా జెనీలియా నటిస్తున్న విషయం మీకు తెలిసిందే. కాగా ఇటీవల ఓ సందర్భంలో జెనీలియా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ..‘తనని కెమెరా ముందు చూస్తే భయమేస్తుంది. రిహార్సిల్ చేసేటప్పుడు మాములుగా యాక్ట్ చేస్తుంది. అదే కెమెరా ఆన్ చేసిన తర్వాత నన్ను డామినేట్ చేసేంతగా జెనీలియా నటిస్తుంది. నేను ఒక్కోసారి ఆమె ఫెర్ ఫామెన్స్ చూసి భయపడిపోయేవాడిని. తెర మీద ఖచ్చితంగా జెనీ నన్ను డామినేట్ చేసేస్తుంది అనుకుంటూ ఆమెతో పోటీ పడి నటించేవాడిని’ అని చెప్పారు. అయితే జెనీలియా మంచి నటి తనతో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.
ఇంకా చెప్పాలంటే ఆడియో గురించి ప్రత్యేకంగా చెప్సాలి. వెంకటేష్ గారు యాక్ట్ చేసిన ‘ఘర్షణ’ చిత్రానికి సంగీతమందించిన హ్యారీస్ జైరాజ్ అంటే నాకెంతో అభిమానం. ఆయనతో ఒక సినిమా అయినా చేయాలనే నా కోరిన ‘ఆరెంజ్’ తో తీరింది. ఈ సినిమాకి ఆయన ఆరు అద్భుతమైన పాటలు ఇచ్చారు. అందుకు హ్యారిస్ కి థ్యాంక్స్ చెబుతున్నాను అన్నాడు. భవిష్యత్తులో కూడా ఆయనతో కలిపి మరిన్ని సినిమాలు చేస్తాను.

కృష్ణా జిల్లా యువ పారిశ్రామికవేత్తతొబాలకృష్ణ రెండో కూతురు పెళ్లి?
తన రెండో కూతురు తేజస్వినికి బాలయ్య సంబంధాలు వెతుకున్నారని... తెలుగు యువహీరోలతో పాటు చాలా మంది బాలకృష్ణ రెండో కూతురు తేజస్వినిని వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారట. అయితే ఓ యువ పారిశ్రామికవేత్తపై బాలయ్య దృష్టి పడిందని అంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆ యువ పారిశ్రామికవేత్తకు హైదరాబాదులో, హైదరాబాదు పరిసరాల్లో చాలా వ్యాపారాలు ఉన్నాయట. అతనితో పెళ్లికి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. బాలయ్య ప్రథమ పుత్రిక బ్రాహ్మణి వివాహం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేష్ తో జరిగిన విషయం తెలిసిందే.
దాసరి నారాయణ రావు దర్శకత్వం వహిస్తున్న పరమవీర చక్ర సినిమా షూటింగులో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. చాలా రిస్కీ షాట్స్ కూడా బాలయ్య చేస్తున్నాడని దాసరి నారాయణ రావు చెబుతున్నారు. సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో షూటింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో సమాచారం.

హైదరాబాదును ఫ్రీజోన్ గా చేసిందుకు కుట్ర
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, డిజిపి అరవిందరావు హైదరాబాదును ఫ్రీజోన్ గా ఉంచాలని కుట్ర పన్నుతున్నారని సిద్దిపేట శాసనసభ్యుడు టి హరీష్ రావు ఆరోపించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ఫ్రీజోన్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఆ తర్వాతనే ఎస్ఐ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయలేని హోంమంత్రి సబితారెడ్డి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు ఫ్రీజోన్, తెలంగాణ అంశాలపై కలిసి రావాలన్నారు. లేకపోతే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం అనుకుంటే ఆ పరీక్షలు ఎంత మాత్రం జరగనివ్వమన్నారు. మాకు తెలంగాణ ఎంత ముఖ్యమో హైదరాబాదు కూడా అంతే ముఖ్యమని హరీష్ రావు అన్నారు .

మెదక్ జిల్లా పేరు ఇందిరమ్మగా మరుస్తారట
అధికారం కోసమే తప్ప దేశ ప్రజలకోసం పనిచేస్తున్న పార్టీలు ఎక్కడా లేవని, ఒక్క కాంగ్రెస్ మాత్రమే ప్రజల కోసం అనుక్షణం పాటుపడుతోందని సీఎం రోశయ్య అన్నారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ 125 వ వార్షికోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ
కాంగ్రెస్‌లాంటి త్యాగాల పార్టీ ప్రపంచంలోనే మరొకటి లేదని ... కాంగ్రెస్‌కు యువతే బలమని..కాంగ్రెస్ బలహీనపడితే దేశం బలహీనపడుతుందnnaru. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ పేరు మెదక్ జిల్లాకు పెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని సీఎం రోశయ్య వెల్లడించారు.

అత్త 369 మందిని బలి తీసుకుంటే..కోడలు 400 మందిని బలి తీసుకొంది
1969లో 369 మందిని ఇందిరగాంధి తెలంగాణ ప్రజల ని బలి తీసుకుంటే, నేడు సోనియాగాంధి మరో 400 మందిని బలి తీసుకున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఓ వైపు తెలంగాణ అంశంపై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బిల్లు కోసం ప్రయత్నించాల్సిన నేతలు ఓదార్పు పేరిట లక్ష రూపాయలు ఇచ్చి వారి త్యాగాలను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే బిజెపి తలా ఐదు లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, ఎవరు చస్తారో ముందుకు రావాలని ఘాటుగా వ్యాఖ్యానించారు..
కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పార్లమెంటు బిల్లు పెట్టి రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలని ... కాంగ్రెస్ బిల్లు ప్రవేశపెడితే ఇతర పార్టీలతో నిమిత్తం లేకుండా 165 మంది సభ్యులు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

గోదావరి ఒడ్డున ఏక శిలతో....అయ్యప్పస్వామి దేవాలయం
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏక శిలతో...గోదావరి ఒడ్డున స్థానిక గౌతమ ఘాట్ వద్ద నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయం పూర్తి కావచ్చింది. దాదాపు రూ. 6.60 కోట్లతో శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆలయానికి వచ్చే ఏడాది మార్చి 20న ప్రారంభోత్సవం చేసేందుకు నిర్ణయించారు.
పంపానదిలో స్నాన మాచరించినట్టే ఇక్కడ గోదావరిలో స్నానం చేసేందుకు వీలుగా నది ఒడ్డునే ఆలయాన్ని నిర్మించారు. అయ్యప్ప స్వామి పంచలోహ విగ్ర హం తయారీకి 3.5 కిలోల బంగారం, 25 కిలోల వెండిని 21 అంగుళాల ఎత్తుతో .. కోటి రూపాయలతో తయారు చేయిస్తున్నారు..
ఆలయంలో వినాయకుడు, లక్ష్మి, ఆంజనేయస్వామి, సరస్వతి, సాయినాథుడు, దత్తాత్రేయ తదితర విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యం కోసం అయ్యప్ప ఘాట్‌ను కూడా నిర్మిస్తారు

ఆర్ నారాయణ మూర్తి.. పోరు .... ఆత్మహత్యలొద్దు బిడ్డ
శ్రీ కృష్ణ కమిటీ ఒక ట్రాష్ అని సినీ నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కమిటీని వేశామని ప్రభుత్వాలు గేమ్ ఆడుతున్నాయని... అందరం అన్నదమ్ముల్లా ఉందాం ఆత్మీయులుగా విడి పొదాం.... ఆంధ్ర, రాయసీమలు కూడా ప్రత్యేక ప్రాంతాలు కావాలన్నారు. తాను ఉత్తరాంధ్రకు చెందినవాడిని అయినప్పటికీ తెలంగాణ కు మద్దతు ఇస్తానని తెలిపారు.
నూతన చిత్రం 'పోరు' తాను స్వీయ దర్శకత్వం వహించే నూతన చిత్రాన్ని ఆర్ నారాయణమూర్తి ప్రకటించారు. పోరు అనే టైటిల్‌కు ఆత్మహత్యలొద్దు బిడ్డ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రాన్ని జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుందన్నారు.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)