31, అక్టోబర్ 2010, ఆదివారం

నాగార్జున 'రగడ ' స్టిల్ల్స్















నాగార్జున 'రగడ’ బ్యాంకాక్‌ షెడ్యూల్‌


నాగార్జున కథానాయకుడుగా అనుష్క, ప్రియమణి నాయికలుగా కామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై వీరూపోట్ల దర్శకత్వంలో డి.శివప్రసాద రెడ్డి నిర్మిస్తున్న ‘రగడ’ బ్యాంకాక్‌ షెడ్యూల్‌కి సిద్ధమైంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్నఈ చిత్ర ప్రధానతారాగణంపై ఓ పాట సహా కొన్నిసన్నివేశాలు నవంబర్‌ 6నుంచి 17వరకూ బ్యాంకాక్‌లో చిత్రీకరణ ఉంటుంది. డిసెంబర్‌ 17న రిలీజవుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, రఘుబాబు, ప్రదీప్‌రావత్‌, దేవ్‌గిల్‌, సుశాంత్‌ సింగ్‌, సత్యప్రకాష్‌, మాస్టర్‌ భరత్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్ర్తి, ఫైట్స్‌: విజయ్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కెమెరా: సర్వేష్‌ మురారి, సంగీతం: తమన్‌.ఎస్‌, నిర్వహణ: కె.చెంచురెడ్డి, సహనిర్మాతలు: డి.విశ్వచందన్‌రెడ్డి, డి.వెంకట కైలాష్‌రెడ్డి, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: వీరు పోట్ల.

బ్యాటరీతో నడిచే మోటార్‌సైకిల్


కోల్‌కతాలో బ్యాటరీ సాయంతో నడిచే మోటార్‌సైకిల్ ఆవిష్కరించిన ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ. టవర్ గ్రూప్ చైర్మన్ రామేందు చటోపాధ్యాయ్ చిత్రంలో ఉన్నారు

శ్రీకాంత్, తరుణ్ హీరోలుగా ‘అనుచరుడు

శ్రీకాంత్, తరుణ్ హీరోలుగా నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ప్రహర్ష ఎంటర్‌టైన్‌మెంట్ ‘అనుచరుడు’ ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ప్రవీణ్‌బాల నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జాస్మిన్ హీరోయిన్‌గా, సురేష్ ప్రొడక్షన్స్‌లో పలు విజయవంతమైన చిత్రాలకు సహాయ దర్శకునిగా పని చేసిన అశోక్ అల్లె దర్శకునిగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రానికి చక్రి సంగీతం, భూపతి కె. కెమెరా వర్క్ అదనపు ఆకర్ణలు’అన్నారు. ఈ చిత్రానికి మాటలు: డా.ఎల్.శ్రీనాథ్, సంగీతం: చక్రి, కెమెరా: భూపతి.కె, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: సత్యనారాయణ, ఫైట్స్: రవివర్మ, సమర్పణ: కె.సాగర్

దీపావళి కానుకగా ‘ఏమైంది ఈవేళ’

వరుణ్‌సందేశ్, నిషాఅగర్వాల్ (కాజల్ అగర్వాల్ చెల్లెలు) జంటగా సంపత్‌నంది దర్శకత్వంలో ఆరిమిల్లి రామకృష్ణ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేసనపల్లి రాధామోహన్ నిర్మించిన ‘ఏమైంది ఈవేళ’ చిత్రం నిర్మాణానంతర పనులను పూర్తి చేసుకుని దీపావళికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది...‘‘చక్కటి కథ, కథనాలతో అందర్నీ ఆకట్టుకునే విధంగా మా చిత్రం రూపొందిందాని దీపావళి కానుకగా నవంబర్ మొదటి వారంలో విడుదల చేస్తున్నాం. అన్నారు చిత్ర నిర్మాత రాధామోహన్ ...

ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: బుజ్జి, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఎడిటింగ్: ముత్యాల నాని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: ఆరిమిల్లి రామకృష్ణ, నిర్మాత: కేసనపల్లి రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్‌నంది.

గుండెలు గుభేల్ .. ‘మైక్రో’ వడ్డీలు...

ఏ స్థాయిలో గ్రామాల్లో మైక్రో సంస్థలు వేళ్లూనుకుపోయాయో ఈ గణాంకాలు చూస్తే తేటతెల్లమవుతుంది. ఆక్టోపస్ మాదిరిగా లక్షలాది మందిని కమ్మేసుకుంటూ లాభాల శాతాన్ని అనూహ్యమైన రీతిలో పెంచుకుంటూ పోయింది. వడ్డీల శాతాలు చూస్తే గుండె గుభేలనకమానదు. దాదాపు 26శాతం నుంచి 37 శాతం వరకు ఈ సంస్ధలు మహిళల నుంచి వడ్డీలు పిండు తున్నాయి. ఈ వడ్డీలు కట్టికట్టి గ్రామీణ ప్రాంతంలో ఆత్మహత్యల శాతం భారీగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. ఈ సంస్ధల పరిధిలోకి దాదాపు 557518 మంది మహిళలు వెళ్లిపోయారంటే ఆతిశయోక్తి కాదు. ఇంతమంది మహిళలు దాదాపు అన్ని సంస్ధల నుంచి రుణాలు పొందాయి. ఇవి పదివేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు కూడా ఉండటం విశేషం.

హెల్ప్ మైక్రో ఫైనాన్స్ సంస్ధ అత్యధికంగా 37.64శాతం వడ్డీ వసూలు చేస్తుండగా తర్వాత స్ధానంలో ఫుల్లర్టన్ ఇండియా సంస్ధ 36శాతంతో నిలిచింది. అలాగే స్వాష్ కెడిట్ కార్పోరేషన్ సంస్ధ 32.36శాతం, ఎస్‌కెఎస్ మైక్రో ఫైనాన్స్ సంస్ధ 31.08శాతం, ఎల్ అండ్ టి ఫైనాన్స్ సంస్ధ 29.53శాతం, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ సంస్ధ 29.89శాతం, ఇంపాక్ట్ సంస్ధ 26.69శాతం, షేర్ మైక్రోపిన్ సంస్ధ 29.64 శాతం, ఆస్మిత మైక్రోపిన్ సంస్ధ 29.64శాతం, క్రిసా ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్ధ 26.60శాతం మేరకు వడ్డీలు వసూలు చేస్తున్నాయి.

వ్యాపారులు సిండికేట్‌.. టాపాసుల రేట్లు చుక్కలంటడం ఖాయం

దీపావళి పండగ వస్తోంది. టపాసుల దుకాణం పెట్టాలి... 15 రోజుల్లో పెట్టిన పెట్టుబడికి ఆపై రెట్టింపు ఆదాయం సంపాదిం చొచ్చు. అధికారుల అనుమతి అక్కర్లేదా..? ఆ...ఏముంది... అధికారుల కెంతో కొంతిస్తే చాలు అనుమతదే వచ్చేస్తోంది. .. ఈ క్రమంలోనే స్థానిక పోలీసు,రెవెన్యూ, ఫైర్‌ అధికారులు అనుమతులివ్వాలని వచ్చిన వారి నుంచి అక్రమంగా ఒక్కోక్క స్థాయి అధికారికి ఒక్కోక్క షాపుకు రూ. 8వేల చొప్పున ముడుపులు పొందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులకు స్థాయిని బట్టి రేటును నిర్ణయించిన వ్యాపారుల నిబంధనలకు విరుద్దంగా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు నెలకొల్పుతున్నారు.

బాణాసంచా దుకాణాలను ఎక్కడ పడితే అక్కడ నెలకొల్పకూడదని అధికారులకు తెలిసినా నిబంధనలకు విరుద్ధంగా... వివరాలు తెలుసుకోకుండానే వ్యాపారులిచ్చే ప్రలోభాలకు తలొగ్గి విచ్చలవిడిగా అనుమతులిస్తూన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంత జరుగుతున్నా అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వారు అధికారులతో, వ్యాపారులతో కుమ్మక్కై మున్సిపల్‌ శాఖ అధికారులు వంత పాడుతూ థానా. అంటే తంధనా అన్నట్లు వ్యవహరిస్తుండడంతో పట్టణాలకు దూరం గా దుకాణ సముదాయాలను ఏర్పాటు చేయాలన్న నిబంధనలకు అధికారుల నేరుగా తూట్లుపొడుస్తుండటంతో.. వ్యాపారులు దుకాణాలను ఇస్తానుసారంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన అధికారులు అమ్యాయాలకు అలవాటుపడి నిబంధనలు తుంగలో తొక్కు తున్నట్లు ప్రజలు ప్రాణాలను ఫణంగా పెట్టి అక్రమ అనుమతులకు దిగుతున్నారు.

అతికష్టంగా దసరా పండగను జరుపుకున్న ప్రజలు దీపావళీ పండగను జరుపుకునేందుకు సిద్దమవుతున్న తరుణంలో బానాసంచా వ్యాపారులు సిండికేట్‌గా మారి టాపాసుల రేట్లను భారీగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాపారం నిర్వహించేవారు సిండికేట్‌గా ఏర్పడి ధరలను భారీ ఎత్తున పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నా యి. పేద మధ్య తరగతి ప్రజలు టాపాసులను కొనాలంటే రూ. 1000పైనే జేబులో ఉంటేనే బానా సంచ దుకాణానికి వెళ్లా ల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నేటివరకు ఏ ఒక్కశాఖ అధికారి కూడా దీపావళీ పండగను పురస్కరించుకుందామనే బానాసంచాలపై ఏ ప్రమాదాలు పొంచి ఉంటాయో కనీసం ప్రజలు అవగాహాన కల్పించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.

ఖైదీల కన్నా హీనంగా...హాస్టల్ విద్యార్ధుల జీవనం

బిసి బాలురకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్టూడెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ వసతి గృహాలు ఉండాలి. బిసి బాలికలకు ఇంతే మొత్తంలో వసతి గృహాలు ఉండాలి. అయితే వీటిని చారా వరకు ప్రభుత్వం ప్రారంభించలేదు. పో నీ ప్రారంభి౦చిన వాటికి సక్రమంగా డబ్బు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వసతి గృహాల్లోని విద్యార్థులకు భోజన వసతికి గానూ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో రూ. 16, కాలేజీల్లో రూ. 17.75 ఇస్తున్నారు. ఈ మొత్తంతో విద్యార్థులు సక్రమంగా మూడు పూటలా తినడం, బాగా చదువుకోవడం సాధ్యమేనా..? గుడ్లు, పండ్లు, పాలూ తగ్గించారు. గుడ్లు ఏడు నుండి అయిదుకు తగ్గించారు. జైల్లో ఉండే ఖైదీలకు రోజుకు రూ. 30 వరకు ఖర్చు చేస్తున్నారు. నేరాలు చేసే ఖైదీగా జీవితాలు అనుభవిస్తున్న వారి పాటి కూడా తాము లేమా? అన్న భావన విద్యార్ధుల్లో వ్యక్తమవుతోంది. .

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు కిలో రూ. 2 చొప్పున బియ్యం సరఫరా చేస్తోంది. వసతి గృహాలకు మాత్రం కిలో రూ. 4 కు సరఫరా చేస్తోంది. హాస్టల్స్‌లో ఉండే వారు దనికుల పిల్లలా? హాస్టల్స్‌కు కూడా కిలో రూ.2కు బియ్యం సరఫరా చేస్తే మిగిలిన రెండు రూపాయలు విద్యార్థులకు ఖర్చు చేసేందుకు అవకాశం లభిస్తుంది. మధ్యాహ్న భోజన పథకం హాస్టల్‌ విద్యార్థులకు అమలు చేయడం లేదు. ఈ పథకాన్ని వర్తింపజేస్తే మరో రూ. 3.50 విద్యార్థులకు కలిసివస్తుంది. ఈదిశాగా ప్రభుత్వం ఆలోచించాలి

నేటికీ రాని నోటరి రద్దు జి ఓ ... ఇబ్బందుల్లో విద్యార్ధులు

ప్రభుత్వం విద్యారంగం పట్ల అనుసరిస్తున్న విధానాలు విద్యార్థులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. వారిని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తూ కాలహరణకు కారణమవుతున్నాయి. వృత్తి విద్యాకోర్సులు, ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పొందేందుకు గతంలో తాము చదువుతున్న కళాశాలల్లో కుల, ఆదాయ దృవీకరణ పత్రాలు అందిస్తే సరిపోయేది. తరువాత పది రూపాయల స్టాంపుతో నోటరీ చేయించి ఆన్‌లైన్‌లో పెట్టాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ప్రభుత్వ ప్రకటన తరువాత పది రూపాయల స్టాంపు ధర పెరిగింది. రూ. 100 నుండి రూ. 200 వరకు స్టాంపు ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే సమయంలో నోటరీ చేయించడానికి మరో రూ. 100 వరకు చేతి చమురు వదిలించు కోవాల్సిన దుస్థితి విద్యార్థులకు ఏర్పడింది. దీంతో అష్టకష్టాలు పడి విద్యార్థులు అన్నీ సరిచూసుకుని సర్టిఫికెట్లు అన్‌లైన్‌లో పెడితే నెట్‌లో లోపాలున్నాయని, అవి అందలేదన్న సాకుతో రీయింబర్స్‌మెంట్‌ ఎగవేసేందుకు ప్రభుత్వం మార్గం సుగమమం చేసుకుంది. ఈ విధానాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. పలు చోట్ల ఆందోళనలు కొనసాగించారు. ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో నోటరీ విధానాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. అయితే ఇందుకు జీవో మాత్రం జారీ చేయలేదు.

కోదండరామ్‌ దృష్టిలో కేసీఆర్ కూడా తెలంగాణా ద్రోహేనా ?


విశాలాంధ్ర కోసం సీఎం పదవి త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు, విశాలాంధ్ర కోసం తీర్మానం చేసిన నాటి హైదరాబాద్ రాష్ట్రంలోని మెజారిటీ ఎమ్మెల్యేలు అనేక ఏళ్లు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్న కేసీఆర్ తదితర నేతలంతా వీరి దృష్టిలో విద్రోహులా అని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరామ్‌ను కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు.

ఆనాటి కాంగ్రెస్, కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలు, తెలంగాణలోని అత్యధిక శాతం మేధావులు, ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఏపోస్ట్‌ను ప్రచురించుర్పాటును బలపర్చారని పేర్కొన్నారు.

సత్యభామ పాత్ర చేయడం తన పూర్వజన్మ సుకృత0 : జమున

సత్యభామపాత్ర చేయడం తన పూర్వజన్మ సుకృతమని ప్రజానటి, కళాభారతి, జమున అన్నారు.

తెలుగు చిత్రసీమలో 30 సంవత్సరాల్లో వెయ్యికిపైగా చిత్రాల్లో నటించానని ...నేడు వస్తున్న చిత్రాల్లో పరభాష నటులు రావడం వల్ల డబ్బింగ్ సహకారంతో చిత్రాలు నిర్మిస్తున్నారని చెప్పారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించే సినిమాలు రావాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు అలనాటి నటి జమున.

భార్యాభర్తలు చర్చించుకుంటే కర్నాటకలో ప్రభుత్వంలా ఉంటుంది

భార్యాభర్తల కాపురం సక్రమంగా సాగాలంటే పెళ్లాం చెప్పినట్టు నడుచుకోవాలని...భార్యాభర్తలు పరస్పర అవగాహనతో ఉండాలని.. అయితే చర్చించుకోవద్దని హితవుపలికారు. చర్చించుకుంటే కర్నాటకలో ప్రభుత్వంలా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చమత్కరించారు.

తాడేపల్లిగూడెంలో ఓ వివాహ వేడుకలో హాజరైన ఆయన దంపతులని ఆశీర్వదిస్తూ భార్య చెప్పినట్లు భర్త నడుచుకుంటే ఇబ్బందులు ఉండవని...బలవంతంగా పెళ్లి చేయవద్దని, మంచి వాతావరణాన్ని కల్పించుకోవాలని హితవు పలికారు.

మరోసారి ఓటరు సవరణకు శ్రీకారం

ఎన్నికల సంఘం మరోసారి ఓటరు సవరణకు శ్రీకారం చుట్టింది. ఫొటో ఓటరు జాబితా సవరణతో పాటు కొత్తగా ఓటరు పేరు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వచ్చేనెల 23వ తేదీ వరకు ఓటర్లు ఓటరు జాబితాలో సవరణ, నూతన ఓటర్ల పేర్ల నమోదుకు గడువు విధించింది..

ప్రతి పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన బూత్‌స్థాయి అధికారుల వద్ద ము సాయిదా ఓటరు జాబితాలు ఈనెల 23వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. 1 జనవరి, 2011 నాటికి 18 సంవత్సరాలు నిండినపక్షంలో ఓటర్ల జాబితాలో ఓటరు నమోదు చే సుకునేందుకు అర్హులు. కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేవారు తమ ఇంటి నంబరు పరిధిలోగల బూత్‌స్థాయి అధికారి వద్దకు స్వయంగా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన ఫారం నెం.6 దరఖాస్తును పూరించి వచ్చేనెల 23లోగా అందజేయాలి. అలాగే ఓటరు జాబితాలో పేరు నమోదు విషయంలో ఏదైనా అభ్య ంతరాలు ఉన్నా, ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో నుంచి తొలగించాల్సిన ఉన్నా ఫారం నం.7ను పూర్తి చేసి బూత్‌స్థాయి ఎన్నికల అధికారికి అందజేయాలి.

ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లు తప్పుగా నమోదైన పక్షంలో సవరణ కోసం ఫారం నం.8ను సమర్పించాలి. ఒకవేళ నివాసము వేరేచోటికి మార్చినట్లయితే ఫారం నం.8-ఏ పూర్తిచేసి అధికారులకు అందజేయాలి. సవరణకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకువచ్చే నెలలో మూడు ఆదివారాల్లో అవకాశం కల్పిస్తారు. 7,13,21 తేదీల్లో ఎన్నికల సంఘం జిల్లాలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది.

ఆయా తేదీల్లో కూడా ఓటర్ల తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.వచ్చేనెల 23లోగా సమర్పించి న అన్ని రకాల దరఖాస్తులపై పూర్తిగా విచారణ జరిపి 5 జనవరి, 2011న సవరించిన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తుంది

మా తెలంగాణ వారికి వేదం, సంస్కృతులు తెలియవా?


కృష్ణా, గోదావరి నదులు ఎక్కువ శాతం తెలంగాణలో పారుతున్నా పుష్కరాలనేసరికి రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలను చూపిస్తున్నారని. తెలంగాణ వారికి వేదం, సంస్కృతు ల గురించి తెలియదన్నట్లు ఆంధ్రా పండితులు చిన్నచూపు చూస్తున్నారన్నారని... టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా లో వేద పాఠశాల కోసం పక్కాభవనం నిర్మించడానికి కృషి చేస్తానని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని బ్రాహ్మణ పండితులు సైతం ఆ కాంక్షిస్తున్నారన్నారు.

మన మహా నగరంలోకి 'గ్యాస్' బస్సులు రానున్నాయి

తాజాగా సీఎన్‌జీ బస్సులు నగర రహదారులపై పరుగులు తీయనున్నాయి. మరో రెండు నెలల్లో 350 సహజ ఇంధన ఆధారిత బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గుంటి జయరావు తెలిపారు. 2011, ఫిబ్రవరి నాటికి సీఎన్‌జీ బస్సులు తిరుగుతాయని చెప్పారు.

మెట్రోరైలు మార్గంలో బస్సుల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ అన్వేషణకు ఆర్టీసీలో మెట్రో సెల్‌ను ఏర్పాటు చేశామని.... 1200 డొక్కు బస్సులను మార్చి ప్రయాణికులకు సరికొత్త రీతిలో అందుబాటులోకి తెస్తామని ఇ.డి. తెలిపారు. 12 వాషింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటివల్ల 3 నిమిషాలలో ఒక బస్సును పూర్తిగా శుభ్రం చేయవచ్చునన్నారు.

‘పల్లెపల్లెకు తెలుగుదేశం’ పడకేసింది.

ప్రజా సమస్యలను అధ్యయనం చేసి పోరాటాల ద్వారా పరిష్కరించాలన్న లక్ష్యంతో జిల్లాలో ప్రారంభమైన ‘పల్లెపల్లెకు తెలుగుదేశం’ కార్యక్రమం పడకేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే పది రోజులు ఆలస్యంగా ప్రారంభమై గందరగోళం నడుమ కొనసాగుతోంది. ఏ రోజు, ఏ నియోజకవర్గంలో కార్యక్రమం జరుగుతోంది, ఎవరెవరు హాజరవుతారు, ఏం చేస్తున్నారనే కనీస సమాచారం కూడా జిల్లాల నేతలకు తెలియని పరిస్థితి. దీంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.

2004 నాటి పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం పార్టీ పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్యపోరు ద్వితీయ శ్రేణి నేతలకు సమస్యాత్మకంగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో యాత్రలు అరకొరగా సాగుతున్నాయి. ప్రజాప్రతినిధుల బిజీ షెడ్యూల్ నేపథ్యంలో యాత్రలు పరోక్షంగా అటకెక్కాయి. నేతలు ఖాళీగా ఉన్నరోజే అడపాదడపా జరుగుతున్నాయి...మొత్తం మీద క్యాడర్ కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.

సిలికాన్ వ్యాలీలో సత్యదేవుని వ్రతాలు



అమెరికాలో సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో సత్యదేవుని వ్రతాలు ఘనంగా ప్రారంభ మయ్యాయి.అమెరికాలో సాన్‌జోస్ సమీపంలోని మిల్పిటాస్‌ లోనిసత్యనారాయణస్వామిఆలయంలోవ్రతాలు ప్రారంభించారు.

సత్యదేవుడు, అమ్మవార్ల విగ్రహాలతో సత్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్న అన్నవరం బృందానికి ఆలయ ప్రధానార్చకుడు మారేపల్లి నాగవెంకటశాస్ర్తి ఆధ్వర్యంలో అక్కడ పండితులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్వామి, అమ్మ వార్లను ఉంచి అన్నవరం బృందం ప్రత్యేకపూజలు, స్వామివారి వ్రతాలు నిర్వహించారు.

30, అక్టోబర్ 2010, శనివారం

ఆరెంజ్ మూవీ వర్కింగ్ స్టిల్స్








"కత్తి"లా రెచ్చి పోయిన ముద్దుగుమ్మని ... మీరు చూడాలి మరి...మరీ

































సీమంధ్ర హీరోనే ఫాలో అవుతున్నానంటున్న 'తెలంగాణా' వారసుడు

అర్చన స్పెషల్ ఫొటోస్











మణిరత్నం దర్శకత్వంలో ప్రిన్స్

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో యువ హీరో మహేష్ బాబు నటించనున్నారు.
విక్రమ్, మహేష్ బాబు నటించే ఈ చిత్రాన్ని రోబో చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ అత్యంత భారీ వ్యయం తో నిర్మించనుంది.

రాజీవ్ పేరు పై వెనక్కి తగ్గినా సుబ్బరామి రెడ్డి...

లలితకళాతోరణం ఆధునీకరణ పనులను ఉపసంహరించుకున్నట్లు కాంగ్రెస్ నేత టి. సుబ్బిరామిరెడ్డి సీఎం రోశయ్యకు లేఖ రాశారు. లలితకళాతోరణానికి ముందు రాజీవ్ పేరు పెట్టడంపై తలెత్తిన రాజకీయ రగడకు సుబ్బిరామిరెడ్డి మనసు మార్చుకుని జీవోను రద్దు చేయాలని ముఖ్యమంత్రికి వినతి చేశారు. ప్రభుత్వం కొత్తగా స్థలం ఇస్తే ఆడిటోరియం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

సామూహిక అభిషేకాలకు శ్రీశైల శివయ్య రెడీ

శ్రీశైల దేవస్థానంలో శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సామూహిక, ప్రత్యేక అభిషేకాలకు ప్రణాళిక సిద్దం చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.

శివునికి అభిషేకాలు చేసేందుకు అన్‌లైన్ల ద్వారా టికెట్లను పొందే అవకాశాలను రద్దు చేసినట్లు తెలిపారు. సామూహిక అభిషేకానికి టికెట్టు ధర 600 రూపాయలు, ప్రత్యేక అభిషేకానికి వెయ్యి రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, 30మంది ప్రత్యేక సెక్యూరిటిని 6నెలల పాటు విధులను వినియోగించుకుంటామని, వీరు నవంబర్ 1వ తేదీ నుండి విధులకు హాజరు అవుతారని తెలిపారు

లక్షాదికారి మాట దేవుడెరుగు.. మృత్యు ముఖంలోకి తోస్తున్నారు

మహిళలను లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మాటలను ప్రస్తుత ప్రభుత్వం నీటి మూటలుగా మార్చింది. పావలా వడ్డీ రుణాల కోసం మహిళా సంఘాలు ఎదురుచూస్తున్న స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో సభ్యులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ప్రత్యామ్నాయంగా సూక్ష్మ సంస్థల నుంచి, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలను పొందే దిశగా మహిళా సంఘాల సభ్యులు మొగ్గు చూపుతున్నారు.

రోజు రోజుకి రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్‌ల మరణ శాసనాన్ని ఆపలేకపోతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 65మంది ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ను మైక్రో సంస్థలు ఏమాత్రం లెక్కచేయడం లేదు. మైక్రోఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు గురిచేస్తే వెంటనే వారిపై కేసులు నమోదుచేయాలని అధికారులను ఆదేశించినా ... మైక్రోసంస్థల ప్రతినిధులు, ఉద్యోగులు యథావిధిగానే రుణం తీసుకున్న మహిళల ఇళ్లకు వెళుతున్నారు. వారం వారం కట్టాల్సిన డబ్బులను కట్టాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలను బెదిరింపులకు కూడా గురిచేసినట్లు తెలిస్తోంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పావలావడ్డీ పథకాన్ని 2004లో ప్రవేశ పెట్టారు... పావలావడ్డీ పథకం తో . ప్రభుత్వం మహిళలను లక్షాధికారి చేస్తామన్న ప్రకటన అమలు కాకపోవడం.. తో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది దీంతో మహిళలు మైక్రోఫైనాన్స్ వైపు మొగ్గుచూపారు. .అన్నది వాస్తవం

సూక్ష్మ రుణ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలకు లోబడి నిర్వహించేది కొన్ని మాత్రమే ఉన్నాయి. మిగిలినవి అనధికారికంగా లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. సూక్ష్మ రుణ సంస్థలు యాజమాన్యాలు రుణం వసూళ్లుచేసే తీరు దారుణంగా తయారైంది. సూక్ష్మ రుణ సంస్థల సిబ్బంది ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు. 10మంది సభ్యులు ఉంటే వారిలో ఏ ఒక్కరు కట్టకపోయినా మిగిలిన 9మంది కట్టని సభ్యురాలి డబ్బులు తప్పక చెల్లించాలి. లేని పక్షంలో మొత్తం సభ్యులను డబ్బులు కట్టేంత వరకు వారిని అక్కడే నిలబెడతారు. దాంతో పరువుకోసం మహిళలు మరోచోట అధికవడ్డీలకు అప్పు చేసి డబ్బులు తెచ్చి వీరికి కట్టి వీరి వేధింపుల నుంచి బయటపడతారు. స్వయం సహాయక గ్రూపులు..మహిళా గ్రూపులు ... పొదుపు చేసుకుంటే... కార్ఫస్ ఫండ్ అందుబాటులో ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా చెబుతున్నా బ్యాంక్ లింకేజ్ రుణాలు, పావలావడ్డీ రుణాలను తీసుకోవాలంటే సవాలక్ష ధ్రువీకరణలు, వివరణలు ఇచ్చుకుంటేగాని రుణం వచ్చే పరిస్థితిలేదు. దాంతో సూక్ష్మ రుణ సంస్థల వార్షికాదాయం జిల్లాలో గణనీయంగా పెరిగింది.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పావలావడ్డీ పథకాన్నికి సక్రమంగా అమలు చేసి అధిక నిధులు కేటాయించి మహిళలను ఆదుకుంటే సూక్ష్మ రుణ సంస్థల ఆగడాలను కొంతమేర అయినా అరికట్టవచ్చునని మహిళా సంఘాలు అంటున్నాయి.

నిబంధనలకు నీళ్ళు ... పేలనున్న టపాసులు

దీపావళి పండగ సమీపిస్తున్న కొద్దీ బాణసంచా విక్రయాలు పెరిగిపోతున్నాయి. యజమానులు అమ్మకాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. అయితే ఇక్కడ వున్న సమస్య అంతా ఒక్కటే నిబంధనల ఉల్లంఘన. శివారు ప్రాంతాలతో పటు నగరంలోని పలుచోట్ల ప్రభుత్వ అనుమతితో హోల్‌సేల్ మందుగుండు దుకాణాలు నడుస్తున్నాయి. ఐతే అగ్నిమాపక శాఖ అధికారులు సూచించిన నిబంధనలకు అనుగుణంగా బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా 10, 15 మినహా మిగిలిన దుకాణాలన్నీ అగ్నిమాపక నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయి.

నిబంధనలు ఉల్లంఘిస్తూ తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి యజమానులు యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగిస్తున్నా అధికారులు మాత్రం నిబంధనలకు పాతర వేస్తున్న దుకాణాదారులపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదాలు జరిగాక చర్యలు తీసుకొనేకంటే ముందుగాని నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

ఆయుర్వేద, హోమియో, యునాని ఎం.డి.కోర్సు లకు ఎన్‌టిఆర్‌ వర్శిటీ నోటిఫికేషన్‌

డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ ఆరోగ్య, వైద్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లోని ఎం.డి. (ఆయుర్వేద), ఎం.డి. హోమియో, ఎం.డి. యునాని కోర్సుల్లో 2010 -11 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి సంబంధించి ఈనెల 30వ తేదీ నుండి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుచేసు కొనేందుకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది . ఈనెల 30వ తేదీ ఉదయం 10 గంటల నుండి నవంబరు 8వ తేదీ సాయంత్రం వరకూ వర్శిటీ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌చేసుకోని, వివరాలను పూర్తి చేసి దరఖాస్తులు పంపించాలి.

ఎన్‌టిఆర్‌ ఆరోగ్య, వైద్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం సైట్‌ ద్వారా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలను పూర్తి చేసి వర్శిటీకి పంపించాలి. దరఖాస్తులు అభ్యర్థులు స్వయంగా గాని, లేదా పోస్టు ద్వారా గాని పంపించవచ్చు.

ఎండి (ఆయుర్వేద), ఎండి (హోమియో), ఎండి (యునాని) కోర్సులకు సంబంధించి ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులయితే రూ.450లు, ఇతర కేటగిరికి సంబంధించి అభ్యర్థులయితే రూ.600లు ఏదైన జాతీయ బ్యాంకు ద్వారా డిమాండు డ్రాప్టు తీసుకొని పంపించాలి. డిడిని డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, ఎపి పేరుతో విజయవాడలో చెల్లేవిధంగా తీయాల్సి ఉంటుంది.

పూర్తి చేసిన దరఖాస్తులు నవంబరు 8వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా వర్శిటీకి అందే విధంగా పంపించాలి. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని పూర్తి చేసిన తరువాత గెజిటెడ్‌ ఆఫీసర్‌ చేత సంతకం చేసి పంపించాలి. దరఖాస్తుపై 'ఎండి (ఆయుర్వేద) ఇటి - 2010' అని రాయాలి. అదే హోమియో అయతే ఎండి (హోమియో) ఇటి - 2010 అని, యునాని అయితే ఎండి (యునాని) ఇటి -2010 అని తప్పకుండా రాయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ది కన్వీనర్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్స్‌ కమిటీ, డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, ఎపి విజయవాడ - 520 008. అనే చిరునామాకు పంపాలి. అభ్యర్థులు స్వయంగా కూడా పంపించవచ్చు.

ఎండి (ఆయుర్వేద), ఎండి (హోమియో), ఎండి (యునాని) కోర్సులకు సంబంధించి నవంబరు 21వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతుంది. ఇతర వివరాలు, నమూనా పరీక్షా పత్రం వర్శిటీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రవేశ పరీక్షకు సంబంధించి నవంబరు 18వ తేదీ నుండి 20వ తేదీ వరకూ ఆయా కోర్సులకు సంబంధించి హాల్‌టికెట్లను వర్శిటీ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. అంతకన్నా ముందే అభ్యర్థులకు స్వయంగా వర్శిటీ పోస్టు ద్వారా ఎన్‌టిఆర్‌ ఆరోగ్య, వైద్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం పంపిస్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులకా?

రోజు రోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ యోచన సాధ్యాసాధ్యాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల సంఖ్య విపరీతంగా పెరగడం, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు సైతం పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటివి నియంత్రించడం మోటార్ వెహికల్ అధికారులకు సాధ్యపడడంలేదు. అలాగే మోటార్ సైకిళ్ల వినియోగం కూడా పట్టణాలకు దీటుగా పల్లెలో పెరిగిపోవడంతో ప్రమాదాలకు పెరుగుతున్నాయి.

ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధ్యయనానికి రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన అధికారుల కమిటీ ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్లో ఈ నియంత్రణ అధికారాలను గ్రామ కార్యదర్శులకు అప్పగించాలని వుంది. దీనిపై అన్నిశాఖల అధికారుల తీరుతెన్నులపై క్షేత్రస్థాయి నుంచి చర్చలు జరుగుతున్నా.... పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు చేయడానికే కార్యదర్శులు, సిబ్బందిలేక సతమతమవుతున్న తరుణంలో ఈ వాహన నియంత్రణ చట్టం భారం ఏమేరకు ఫలిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

గతంలో సైకిళ్లకు లైసెన్స్ విధానం అమల్లో ఉండేది. దీంతో పంచాయతీ ఉద్యోగులు రోడ్లపై కాపుకాసి (వెహి కల్ ఇన్‌స్పెక్టర్ల మాదిరిగా) రూ.0.50 పైసలు, రూపాయి విలువగల అల్యూ మినియం లైసెన్సు బిళ్లలు ఏర్పాటు చేసేవారు. లైసెన్సులు లేని సైకిళ్లపై కేసులు నమోదు చేసేవారు. అనంత రం ఈ విధానం రద్దయింది. అయితే ఆవిధంగా ఇప్పుడు ఆ స్థాయిలో వాహనాల నియంత్రణకు గ్రామ కార్యదర్శులు నడుం బిగిస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంద ని అధికారులు భావిస్తున్నప్పటికీ సిబ్బంది కొరత, స్థానిక రాజకీయ జోక్యం అధికమవడం ఇది సాధ్యా సాధ్యాలపై చర్చ జరుగుతోంది

ఇక ఆర్టీసీ ఫ్యామిలీ క్యాట్‌కార్డులు

నవంబర్ 1 నుంచి ఆర్టీసీ ఫ్యామిలీ క్యాట్‌కార్డును ప్రవేశ పెడుతోంది మూడేళ్ల క్రితం వరుసగా రూ.140 చెల్లించి క్యాట్‌కార్డు కొనుగోలు చేసిన ప్రయాణికుడు ఇప్పుడు అదనంగా రూ.160 చెల్లించి ఫ్యామిలీ క్యాట్‌కార్డును పొందవచ్చు. ఫ్యామిలీ క్యాట్‌కార్డు ద్వార ఆర్టీసీ బస్సుల్లో పది శాతం రాయితీపై రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోగానీ అంతరాష్ట్ర సర్వీసుల్లోగానీ ప్రయాణించ వచ్చు..ఈ క్యాట్‌కార్డుదారుడితో పాటు రాయితీ సౌకర్యం నలుగురు కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది

చందా లేసుకొని సోమ్ములిస్తాం... జగన్ జపం మానాలని కొండా దంపతులకు సూచన

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర సాధనకు ప్రత్యేక తెలంగాణ గులాబీ దళం ప్రత్యక్ష పో రాటం చేస్తుందని టీఆర్ఎస్వీ రాష్ట్ర అ ధ్యక్షుడు బల్క సుమన్ వెల్లడించారు.

టీ ఆర్ఎస్వీ నూతన కమిటీ ఏర్పాటు చే సిన వారం రోజుల్లోనే 50వేల సభ్య త్వం నమోదు చేసినట్టు తెలిపారు. కొండా దంపతులు ఇకనైనా జగన్ జపం మానాలని, జగన్ వద్ద పెట్టుబడులుంటే, నష్టపోతామనుకుంటే విద్యార్థులందరూ ఒక్కొక్క రూపాయి పోగేసి అందచేస్తారని అన్నారు. మహబూబాబాద్ లాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు

రాజ్యాంగ బద్ధంగా పోరాటం చేసేందుకు గులాబీ దళాన్ని సిద్ధం చేసి, తె లంగాణా సాధించేందుకు పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ సాధన మలిదశ పోరాటంలో భాగస్వాములను చే సేందుకు డిసెంబర్‌లోగా 15లక్షల మంది విద్యార్థులతో గులాబీ దళాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

యుద్ధానికి సిద్ధం కావాలని రాములమ్మ పిలుపు


డిసెంబర్ నెలాఖరులో శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా రాకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండా లని మెదక్ ఎంపీ విజయశాంతి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో ఎన్నడు లేని విధంగా ఆరునెలల కాలంలో 650 మంది ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో మరో వైపు సమైక్య రాష్ట్రంలో అవతరణ దినోత్సవం జరుపుకోవాలని అనడం భావ్యమా అని ప్రశ్నించారు.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలుగా మోసానికి గురైందని, అందువల్లే ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు ప్రాణాలు సైతం పొగొట్టుకుంటుంటే మరోవైపు మం త్రులు, ఎమ్మెల్యేలు అవతరణ దినోత్సవంలో పాల్గొంటామని పేర్కొనడం దారుణమన్నారు.

29, అక్టోబర్ 2010, శుక్రవారం

అనుష్క మరీ హాట్ గురూ ...