14, మార్చి 2011, సోమవారం

జగన్ అక్రమ ఆస్తులపై విచారణకు ప్రధాని సానుకూలం

మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి సంస్థలోకి అక్రమ ఆస్తులు భారీగా తరలివచ్చాయని వాటిపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు సోమవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి విన్నవించారు.  వారు చేసిన డిమాండ్‌కు ప్రధాని సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది.

అనంతరంఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, ఎంపీ మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్‌పై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు  చెప్పారు. జగన్‌కు చెందిన పార్టీని చూసి భయపడే స్థితిలో లేమని అన్నారు. జగన్ అక్రమ ఆస్తులపై తెలుగుదేశం పార్టీ ఎప్పటినుండో పోరాడుతుందని, జగతి పబ్లికేషన్స్ లో వాటాలు పూర్తిగా అక్రమమైనవని అన్నారు. అందులో ఎవరెవరు ఎంత పెట్టారో వారి వారి వాటాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అక్రమ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ ద్వారా విచారణ జరిపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు.

మళ్లీ ప్రతిష్టిస్తే... మేం ఒప్పుకోం..

ట్యాంక్‌బండ్‌పై కూల్చేసిన విగ్రహాలను పునఃప్రతిష్టించాలని ప్రభుత్వం చేసున్న హడావిడిని తామంతా కలసి కట్టుగా తిప్పి కొడతామని ప్రకటించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు.

సోమవారం లోయర్ ట్యాంక్ బండలోని కట్టమైసమ్మ దేవాలయం నుండి పోతన విగ్రహం వరకు స్వాభిమాన్ యాత్ర జరిపిన ఆమె అనంతరం మీడియాలో మాట్లాడుతూ....తెలంగాణ వైతాలికుల విగ్రహాలు లేకుండా వేరే విగ్రహాలు ప్రతిష్టించకూడదని...కాదని సిద్దపడితే మరోమారు విధ్వంసం జరిగినా ఆశ్చర్యపోన్నఖ్ఖరేదని వ్యాఖ్యానించారు.

600 మంది తెలంగాణా కోసం ప్రాణ తాగాలు చేసే... కనీసం పలుకరించిన పాపాన పోని సీమాంధ్ర నేతలు జరిగిన విగ్రహాల విధ్వంసాన్ని మాత్రం అతిగా చూపుతున్నారని... తెలంగాణాకు వ్యతిరేకంగా పలు మీడియా సంస్ధలు చేసున్న వాఖ్యల వల్లే నాడు మీడియా ప్రతినిధులపై దాడి జరిగిందని... తాను భావిస్తున్నట్లు చెప్పారు

తెలంగాణా వ్యతిరేక నివేదిక నేనివ్వలే...

అయిదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా తెలంగాణ అంశంపై అధిష్టానం మే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అయిన ఆయన తెలంగాణా అంశంపై నిర్ణయించాల్సింది పూరిగా కేంద్ర ప్రభుత్వమేనని... ఈ విషయం తెలిసి కూడా తెరాసతో కల్సి రాష్ట్ర ప్రభుత్వాని ఇబ్బంది పెట్టడం సరైనది కాదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమం బలంగా లేదని తాను నివేదిక పంపినట్లు కొందరు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని... తాను ఈ విషయమై ఎలాంటి నివేధికనీ అధిష్టానానికి ఇవ్వలేదని స్పష్టం చేసారు.దృష్ట్యా పార్టీ విప్‌ని ఎవరు ధిక్కరించినా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని... ఎన్నికల నాటికి ప్రాంతాలకతీతంగా కాంగ్రెస్‌ శాసనసబ్యులంతా సభకు హాజరై కాంగ్రెస్‌ అభ్యర్ధులతో పాటు మిత్ర పక్షాల అభ్యర్ధులను కూడా గెలిపించుకోవాలిన బాధ్యత ఉందని సిఎం తెలంగాణా సభ్యులతో చెపారు. కాగా తెలంగాణా ఉద్యమాన్నివిస్పష్టంగా కేంద్రానికి వినిపించేందుకే తాము అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేస్తున్నామని... ఎమెల్సీ ఎన్నికల్లో పాలొనే విషయమై తామంతా కల్సి ఓ నిర్ణయం తీసుకుంటామని శాసనసభ్యులు చెప్పినట్లు సమాచారం.