2, ఏప్రిల్ 2011, శనివారం

మనమే విజేతలం.. మీరు నమ్మండి,, నమ్మకపోండి ...

శ్రీలంక బౌలర్ కులశేఖర వేసిన వేసిన బంతిని సిక్స్‌గా మలిచి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించాడు. విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా పది బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. శ్రీలంకపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో విజయం సాధించింది. ప్రపంచ కప్ టైటిల్ భారత్ దక్కించుకోవడం ద్వారా సచిన్ టెండూల్కర్ కలను నెరవేర్చింది. 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచ కప్ గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు ప్రపంచ కప్ టైటిల్ సాధించింది. భారత ఆటగాళ్లు మైదానంలోకి చేరుకుని ఆనంద భాష్పాలతో విజయాన్ని ఆనందించారు. హర్భజన్ సింగ్ సంతోషంతో కన్నీటిని ఆపుకోలేకపోయాడు. భారత కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌కు అది గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ప్రపంచ కప్ పూర్తి కావడంతో ఆయన భారత కోచ్‌ పదవి నుంచి తప్పుకోబోతున్నాడు. భారతదేశమంతటా దీపావళి పర్వదినమే కనిపించింది. పెద్ద యెత్తున టపాసులు పేలుస్తూ విజయాన్ని తనివి తీరా ఆస్వాదించారు.