6, మార్చి 2011, ఆదివారం

ఉద్యమాలవల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది

వీధి పోరాటాల ద్వారా రాష్ట్ర విభజన జరగదని మాజీ సీఎం కె. రోశయ్య అన్నారు. స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విజయవాడ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ , సమైక్యాంధ్ర ఉద్యమాలవల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడడం మినహా జరిగేది ఏమీ ఉండదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే విధంగా ఆందోళనలు చేయడం పౌర హక్కులకు విఘాతం కల్పించటమేనని రోశయ్య అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర విభజన అంశంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక సూచించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం కూలంకషంగా పరిశీలిస్తోందన్నారు. దీనిపై కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా అందరూ కట్టుబడి ఉండాలని హితవు చెప్పారు.

Mutyalamuggu at andhrajyothy.com International News»  అపర కుబేరుడు ముబారక్

ప్రపంచంలోకెల్లా ధనవంతుడెవరు?.. ఈ ప్రశ్నకు సమాధానంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మొదలుకొని ప్రముఖ వ్యాపారవేత్తలు పేర్లు చెప్పేందుకు మనం యత్నిస్తాం. అయితే.. ఇకపై మనం హోస్నీ ముబారక్ పేరు చెప్పాల్సి ఉంటుంది. ఈజిప్ట్‌లో.. గద్దె దిగిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు ముబారక్‌కు ప్రపంచవ్యాప్తంగా రూ. 31 లక్షల కోట్ల (70 బిలియన్ డాలర్లు) ఆస్తులున్నాయని.. బ్రిటిష్ పత్రిక 'ది గార్డియన్' శనివారం తెలిపింది.

ఇలా 70 బిలియన్ డాలర్ల సంపదతో.. ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక ధనవంతులైన మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ ( 53.5 బిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు (53 బిలియన్ డాలర్లు) బిల్ గేట్స్‌ను ముబారక్ వెనక్కు నెట్టారు.

బురఖాలు ధరించేవారికి ఫైన్

ఫ్రాన్స్‌లో ఇకనుంచి బురఖాలు ధరించేవారికి ఫైన్ వేయనున్నారు. బురఖాలు ధరించడాన్ని నిషేధిస్తూ గత ఏడాది ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుంది. అది ప్రస్తుతం పూర్తి స్థాయిలో అమలులో లేదు. అయితే, వచ్చే నెల 11 నుంచి బురఖాలపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. ఒకవేళ్ల బురఖాలు ధరించినప్పటికీ, పోలీసులు అడిగినప్పుడు,

వాటిని తొలగించకపోతే వారిని జైలుకు తీసుకెళ్లి విచారణ చేపట్టొచ్చు లేదా వారికి సుమారు రూ.10 వేల (208 డాలర్లు) వరకు ఫైన్ వేయొచ్చు. అయితే, దీనిపై కొన్ని ముస్లిం సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని అలుసుగా తీసుకుని పోలీసులు అతిగా ప్రవర్తించే అవకాశం ఉందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కిరణ్ పాలన రాక్షసపాలనను తలపిస్తోంది

ఎమ్మెల్సీ ఎన్నికలకు జగన్ వర్గం పోటీ చేయడంలేదని అంబటి రాంబాబు తెలిపారు. జగన్ పార్టీ ఏర్పాటుచేయకుండా ఎన్నికల్లో పోటీ చేయబోమని పేర్కొన్నారు. తమ వర్గంలో ఉన్నవారు మనస్సాక్షి ప్రకారం వ్యవహరించాలని చెప్పామన్నారు. టీఆర్ఎస్, జగన్ కుమ్మక్కయ్యారని వస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. చంద్రబాబునాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కుమ్మక్కవుతున్నారని ఆయన ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి 100 రోజుల పాలన రాక్షసపాలనను తలపిస్తోందని విమర్శించారు.

తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే 168 మంది ఎంపిల మద్దతు

: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఎన్డీఎ తరపున 168 మంది ఎంపిల మద్దతు ఉంటుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. టిడిపివి ఊసరవెల్లి రాజకీయాలని ఆయన విమర్శించారు. ఒక్క బిజెపి మాత్రమే ఢీల్లీ నుంచి గల్లీ వరకు ఒకే విధానాన్ని అనుసరిస్తుందన్నారు.

బరిలో నుంచి తప్పుకున్నా : కుమార్‌రాజా

స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరగనున్న ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా పోటీచేస్తున్న చిట్టాబత్తుల కుమార్‌రాజా బరిలో నుంచి తప్పుకున్నారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యాక ఆదివారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

మిలియన్ మార్చ్'పైనిర్ణయం తీసుకుంటా

తెలంగాణ జెఎసి హైదరాబాద్'లో ఈ నెల 10వ తేదీన చేయ తలపెట్టిన మిలియన్ మార్చ్'ని వాయిదా వేయాలని చాలామంది కోరుతున్నారని..జెఎసి నేతలతో మాట్లాడిన తరువాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు.

ఆస్తికోసమే కృష్ణవేణిని హతం చేశా

ఆస్తికోసమే కృష్ణవేణిని హతం చేశానని నిందితుడు, కృష్ణవేణి భర్త రవికుమార్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఆస్తికోసమే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. తన పేరు మీద ఆస్తిని రాయడానికి నిరాకరించడంతో తాను గొంతుకోసి కృష్ణవేణి హత్యకు పాల్పడ్డానని విశాఖ పోలీసుల ముందు రవికుమార్ నేరాన్ని అంగీకరించాడు.

ఒకరిద్దరిని మేధావులుగా గుర్తించడంలే...

మేధావుల సభకు తాము హాజరుకాలేదని ప్రొఫెసర్ కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్యలు స్పష్టం చేశారు. ఒకరిద్దరిని తాము మేధావులగా గుర్తించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన మేధావులతో పరిష్కరించేది కాదని తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. ఆదివారం ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన మేధావులు కొందరు రహస్యంగా సమావేశమయ్యారు.

9 నుంచి అరసవల్లిలో అద్భుత కిరణస్పర్శ

: ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి «ద్రువ మూర్తిని ఆదిత్యుని తొలికిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆవిష్కాృతం కాబోతోంది. స్వామి పాదాలమీద మొదలై శిరో భాగం వరకు సూర్యకిరణాలు ప్రసరించే ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు అరసవల్లి తరలివస్తారు. కిరణాలు తాకినప్పుడు మూలవిరాట్ బంగారు ఛాయలో మెరిసిపోయే కమనీయ దృశ్యం భక్తులకు కనువిందు చేస్తుంది. గత ఏడాది 9,10 తేదీల్లో సూర్యుడు మబ్బులు మధ్య దోబూచులాడడంతో ఈ అపురూప దృశ్యం తిలకించే అవకాశం 11న మాత్రమే భక్తులకు కలిగింది. ఇదిఇలా వుండగా, గతంలో అపురూప దృశ్యం ఆవిష్కరణ సమయంలో తలుపులు మూసివేయడంతో భక్తులు ఇబ్బంది పడిన విషయాన్ని ఆలయ ఈవో ఎన్.ముత్యాలరావుతో ఆదివారం 'ఆన్‌లైన్' ప్రస్తావించగా కిర ణస్పర్శ కొన్ని క్షణాలు మాత్రమే ఉండటంతో క్యూలైన్లలో పరిమిత సంఖ్యలో భక్తులు చూసేవీలుంటుందని, అందువల్ల ఆ రోజుల్లో సూర్యోదయ సమయానికి ముందే భక్తులు ఆలయానికి చేరుకోవాలని సూచించారు.