11, డిసెంబర్ 2011, ఆదివారం

ఆర్య, ద్రావిడుల సహజీవనం

ప్రాచీన భారతదేశచరిత్ర అంటే ఋగ్వేదం, సింధు నాగరికత, ఆర్యులదాడి, ద్రావిడులను దక్షిణాదికి తరిమి వయడం ఇవే ప్రధానాంశాలు కావనీ, ఋగ్వేద ఆర్యులు సింధునగరాల వాసులైన ప్రజలు సహజీవనం చేసారనీ వారితోపాటు పూర్వ ద్రావిడులు, ద్రావిడభాషా కుటుంబీ కులు కూడా కలిసి జీవించారనీ, వీరంతా ఒకరి వలన మరొకరు ప్రభావితులైనారని నిరూపించే అనేక అంశాలు వెలుగులోకి రావడంతో ఈ పరిశోధనలు క్రొత్త పుంతలు తొక్కసాగాయి అన్నారు పూర్ణచంద్‌.
అంతేగాక 'భారతదేశంలో ఆస్ట్రిక్‌ భాషా కుటుంబం ఇండో యూరోపియన్‌ భాషా కుటుంబం ద్రావిడ భాషా కుటుంబం మంగోలాయిడ్‌ భాషా కుటుంబం సమాహారంగా వుంటుంది. ఇక్కడి భాషలు నాగరికత, సంస్కృతుల ప్రభా వంలోనే ఋగ్వేద సంకలనం జరిగింది. ఋగ్వేద ఆర్యులు, వారికన్నా పూర్వీకులైన ముండా ప్రజలు పూర్వ ద్రావిడులైన ప్రజలతో సహజీవనం చేసారు. చరిత్ర కారులలో ఆర్యులదాడి జరిగిందనేవారు, జరగలేదనే వారు. ఇలా రెండు వర్గాలు వున్నాయి. జిమ్‌షాఫర్‌, టైనీ లిక్టెన్‌స్టీన్‌ (1999) అనే ఆర్కియాలజిస్టులు ఆర్యులదాడి అనేది జరగలేదని స్పష్టంగా పేర్కొన్నారు. 'ఆర్యన్‌ ఇనేవేజన్‌ థియరీలోని ఆర్యుల జన్మభూమి భారత దేశం కాదని, ఇండో యూరోపియన్‌ భాషా కుటుం బం కూడా భారతదేశంది కాదని బయట నుంచే వచ్చాయని నిరూపించడమే కొందరి లక్ష్యంకాగా వీరిలో ఆర్యులు ఆగంతకులుగా వచ్చారు. ఆర్యులు ఆశ్రితులుగా వచ్చారు అనే రెండు వర్గాల వాదనలు చేసే వారు ఉన్నారు. ఇందుకు భిన్నంగా ఆర్యులు ఇక్కడి వారేనని చెప్పాలని మేము అనుకుంటున్నా. ''ఈ రెండు సిద్ధాంతాలు రైలు పట్టాలాంటివి. ఏనాటికీ కలవలేవు. చరిత్రకు రాజకీయాల రంగు పులమటమే ఇక్కడ విచా రకరం అంటారు పూర్ణచంద్‌.
దక్షిణాసియా దేశాల మధ్య అనాదిగా నడిచిన పరస్పర సంబంధ బాంధవ్యాలన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి లోనే కొనసాగాయి కాబట్టి మూల ద్రావిడులు వైదిక ఆర్యులు సమకాలీనంగా కలిసిమెలిసి జీవించారన్నదే ముఖ్యమైన విషయం అంటారు పూర్ణచంద్‌.
సుప్రసిద్ధ ఆర్కియాల జిస్ట్‌ ఎ.ఎస్‌.రావు సింధు నగ రాలలో వైదిక ఆర్యులు పూర్వ ద్రావిడులు సహజీవనం చేసా రని పేర్కొన్నారని పూర్ణచంద్‌ పేర్కొన్నారు. మైఖేల్‌ విట్జ్‌ల్‌ అన్న పరిశోధకులు కూడా వరి, నాగలి వంటి పదాల వ్యుత్ప త్తులను నిర్వచనాలను ఎత్తిచూపి ఆర్యులు, ద్రావిడుల సహ జీవనం చేసారన్నారు అని కూడా పూర్ణచంద్‌ చెప్పారు.
ఋగ్వేదకర్తలకన్నా భిన్నమైన సంస్కృతి కలిగిన ప్రజలు భారతదేశంలో అనాది నుంచి వుండేవారన్న పూర్ణచంద్‌ గారి మాటలను మేము ఇక్కడ ఒక విధంగా సమన్వ యంచేసి చూపుతున్నాం. వేదాలు మహాతపస్సంప న్నులైన ఋషులు విన్నవి కావున శ్రుతలైనవి. 'వేదాలను ఋషులు దర్శించారు కాబట్టి ఆ ఋషులు ద్రష్టలైనారు, కాబట్టి వేదాలు అపౌరుషేయములయ్యాయి. అయితే తాము వినిన వాటిని
దర్శించిన వాటిని, అప్పటికే వాడుకలో వున్న భాషలోనే వారు ప్రకటించి వుండాలి కదా! ఆనాటి వాడుక భాషలో వైదిక సంస్కృతభాషా జనంతో పాటు ఫ్రోటో ద్రావిడులైన వ్రాత్యులు కూడా సహజీవనం చేస్తున్నారు. కాబట్టి తాము వినినదాన్ని, ఋషులు తమ వాడుక భాషలో అంటే సంస్కృత బహుళమైన భాషలో ప్రకటించి వుంటారు. అట్టి ప్రకటనలో వ్రాత్యులు మాట్లాడే భాషా పదాలు కూడా వుండి ఉంటాయి కదా! కాబట్టి వేదాలలో ప్రక్షటో ద్రావిడియన్‌ పదాలు కూడా కలిసి వుండే ఆస్కా రం వుంది అన్నది మా సమన్వయవాదం.
ఎ.పి.కల్మార్కర్‌ వైదిక వ్రాత్యులనే నేడు మనం ద్రావి డులనుకుంటున్నాం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందుకు వారు చూపించిన ప్రమాణాలలో పూర్ణచంద్‌ తమ గ్రంథంలో ప్రకటించిన ఋగ్వేదసూక్తాలు కూడా వున్నాయని మనం ఇచట గుర్తించుకోవాలి. (ఋగ్వేదం 1-15-8, ఋగ్వేదంలో 10-86-19)- ఋగ్వేదంలోని తొలిమండలాలలో ఆర్యుల, ఆర్యేతరులైన వారిని కూడా కలిపి (వ్రాత్యులు) అర్థదేవతలుగా పరిగణఙంచినట్లు సంస్కృత నిఘంటువు అమరకోశంలో చెప్పబడిందని మనం గమనించాలి. అమరకోశంలో అసురదైత్య దైతేయ, ధను, దానవ, దితిసు, ఈ
పదాలన్నీ సమానార్థకాలుగానే ఉన్నాయి. వీళ్లం దరూ ఆర్యుల ధర్మాన్ని గౌరవించి సఖ్యతతో వుండి ఉంటారు. కాబట్టి వీళ్లకి అర్ధదేవతలనే గౌరవం దక్కివుంటుంది. అంటే సగం ఆర్యులన్నమాట. ఆర్యులతో సంలీనం కాని వారు ఎలా అర్ధ దేవత లౌతారు? బహుశ వీరి మధ్య సాంస్కృ తిక, సామాజిక సంబంధాలతో పాటు, వైవాహిక సంబంధాలు కూడా ఎక్కువగా జరిగి వుండాలి అం టారు పూర్ణచంద్‌. తలపైన కొమ్ము,చుట్టుకొన్ని జంతు వులమధ్య యోగాసనంలో కూర్చుని ఒకదైవరూపం సింధు ముద్రికలలో దొరికిందికదా.
ఋగ్వేదంలో దాశరాజ్ఞ యుద్ధం ఒక సుప్రసిద్ధ చారి త్రక సంఘటనగా చెప్పబడింది. ఆ పదిమంది రాజులలో మాత్స్యుల, భక్తులు, భళానులు, ఆళీనులు, నిషానులు, అజులు, శివులు, శిగ్రులు, యక్షులు వంటి వారంతా వున్నారు. వారంతా సుదాసుడనే రాజునకు ఏదో ఒక సమయంలో వ్యతిరేకంగానో,అనుకూలంగానో, నిలబడిన వారేనని ఋగ్వేద ఆర్యులు అన్న పేరున గల తన గ్రంథంలో సుప్రసిద్ధ వైదిక పరిశోధకులు రాహులు సాంకుృత్యాయన్‌ చెప్పారని పూర్ణచంద్‌ తన రచనలో చెప్పారు. ఎ.పి.కల్మార్కర్‌ కూడా ఆ సంగతిని దాశరాజ్ఞ యుద్ధ వివరణలో చెప్పివున్నారని మనం ఇక్కడ గుర్తించాలి.
సమాజంలో వర్ణవ్యవస్థ, కులవ్యవస్థలు వేరువేరు అంశాలు. ఆర్యులది వర్ణవ్యవస్థ, ద్రావిడ తెగల వారిది కులవ్యవస్థ. కాలక్రమంలో ఈ రెండూ కలగలసి బ్రహ్మ క్షత్రియ వైశ్య శ్రూదులకు అదనంగా దళితులు హిందూ సమాజ వ్యవస్థలో చేర్చబడి అనాది నుంచి వస్తున్న నాలుగు వర్ణాలకుపైన పంచములు క్రొత్తగా చేర్చబడ్డారా అని కూడా వారు అడుగుతున్నారు.
ఆర్యేతరులైన వ్రాత్యులనుండే కులవ్యవస్థ హిందూసమాజంలో ఆరంభమయిందా? అన్న ప్రశ్నను

బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కూడా అడిగారు. వైదికమైన పంచవింశ బ్రాహ్మణంలోను, అథర్వణవేదంలోను ఈ ప్రశ్నకు సమాధానం వున్నదన్నారు అంబేద్కర్‌.
వ్రాత్యులే అర్హంతులు, ¸°ధులుగా విభక్తులయ్యా రనీ, అధర్వణవేదంలో ఏకవ్రాత్యుల నుండి రాజస్య బ్రాహ్మణ వర్గాలు వచ్చినవంటారు అంబేద్కర్‌. పంచ వింశబ్రాహ్మణంలో హీనులు, గరాగిరులు, సమనీచ మేఢ్రులు, నిందితులు అన్న నాలుగు విభాగాలు ఏర్ప డినవి అంటూ,ఏవేవో కారణాంతరాల చేత వెలివేయ బడిన ప్రజావర్గాల నుండి పంచములు అన్న విభాగం కాలక్రమంలో ఏర్పడి ఉంటుందంటారు అంబేద్కర్‌.
ఆర్య భాష మాటాడిన ప్రజలకు అడుగడుగునా ద్రవి డయన్లు ఎదురయ్యారు. ఆర్యులు వారిని దాసులు, దస్యు లు ఇలా అనేక పేర్లతో పిలుచుకున్నారు. వీరు తమకన్నా అత్యున్నత నాగరికులని సంపన్నులని బలమైన నగరాలు కలిగిన వారిని ఆర్యులు వైదిక సాహిత్యంలో వర్ణించారు. కర్మార్కర్‌ కూడా తమ రచనలో ఇట్టి వర్ణనల వివరాలు ప్రకటించి వున్నారుకూడా. అయితే దాస, దస్యాది ఆర్యే తర ప్రజలు సుసంపన్నులుగా వున్నంత కాలం ఆర్యుల నుండి ఇట్టి ప్రశంసలు పొందుతూనే వున్నారు. సింధు నగరాల పతనం తర్వాత వర్తక, వాణిజ్యాదులు లేక ఈ దానవులు ఈ దస్యులే నల్లవారుగా, అస్పృశ్యులగా, బానిస లుగా నిందింపబడ్డారా? అంటూ ఒక సహజమైన సందే హం రేకెత్తించిన పూర్ణచంద్‌ అస్పృశ్యతా వివక్షలు ఆనాటి నుంచీ హిందూ సమాజంలో ప్రవేశించి పంచములుగా వెలియే యబడిన కొందరు బాధలకు లోనవుతున్నారని అంటారు పూర్ణచంద్‌. నిజంగా ఇది ఒక చర్చనీయాం శంగా పరిశీ లనాంశమే కదా.
బహుభాషా కోవిదులు తిరుమల రామచంద్ర తెలుగు, ప్రాకృత భాషల సంబంధాలను గురించి వ్రాస్తూ ప్రాకృ తం ప్రథమ భాష, ప్రజల నిత్య వ్యవహార భాష, ప్రజల ప్రేమ భాష, కష్టసుఖాల భాష, ఇదే ప్రకృతుల ప్రాకృతుల భాష అని తీర్మానించారు. మానవజాతి తొలి ఛందో రూపమైన ఋగ్వేదంలో ప్రాకృతభాషా రూపాలు కనిపిం చినందువల్ల ఋగ్వేదభాషకన్నా అతిభిన్నం అపరిష్కృతమైన ఒకభాష ఆనాడు వాడుకలోవుండేది. అది ప్రాకృతమూల మన్నారు. సంస్కృత వాఙ్మయచరిత్ర వ్రాసిన మల్లాది సూర్యనారాయణశాస్త్రి 'ఛందో' అనే వేదసంజ్ఞతో పిలువ బడిన సంస్కృతశబ్దాలు భాష అన్న సంజ్ఞతో పిలువబడిన లౌకిక శబ్దాలు తొలిదశలో ఒకేనని, కాలానుగుణంగా లౌకిక సంస్కృత భాషగా అది వికసించిందని అట్టి లౌకిక భాష విశృంఖలంగా వాడబడుతున్నపుడు 'పాణిని' దానిని సంస్క రించేందుకు పూనుకున్నారు.
- కె. ఘనశ్యామల ప్రసాదరావు

ఉసురు తీస్తున్న ఆసుపత్రులు

ప్రభుత్వాసుపత్రులు మురికి కూపాలుగా, మృత్యుముఖాలుగా తయారు కావడంతో డబ్బు ఖర్చయినా మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్న సామాన్య ప్రజలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయనడానికి తరచుగా వస్తున్న వార్తలే నిదర్శనం. శరీరంలో వివిధ విభాగాలకు పరీక్షల పేరిట ప్రజల జేబులు కొల్లగొడుతున్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం మాట అటుంచి వారి ప్రాణాలకు భద్రత లేదనడానికి కోల్‌కతాలోని ఆమ్రి ఆస్పత్రిలో శుక్రవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదాన్ని ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఆస్పత్రులకు, ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ప్రస్తుత వ్యవస్థలో ఏ విధంగా లభిస్తున్నాయో మనందరికీ తెలుసు. నిబంధనలను ఉల్లంఘించని సంస్థల సంఖ్య వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఆస్పత్రులను ఇరుకైన ప్రాంతాల్లో నెలకొల్పరాదనీ, స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణంలో ఉంటేనే వైద్య చికిత్సలు ఫలిస్తాయన్నది జనం నమ్మకం. అయితే, ఇప్పుడు గాలి ప్రవేశించని ఇరుకైన సందుల్లో సైతం కార్పొరేట్‌ ఆస్పత్రులు వెలుస్తున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులన్న పదంలోనే వ్యాపార సంస్కృతి నిబిడీకృతమై ఉంది కనుక, ప్రైవేట్‌ ఆస్పత్రులు పూర్తిగా వాణిజ్యపరంగానే నిర్వహించబడుతున్నాయని వేరే చెప్పనవసరంలేదు. అంతేకాక, బహుళ అంతస్థుల ఆకాశ హర్మ్యాల్లో ఆస్పత్రులు నెలకొల్పడం అనేది సర్వసాధారణమైంది. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో ప్రమాదాలు సంభవించడం కూడా చాలా సహజమైన విషయంగానే భావించాల్సి ఉంటుంది.
భవన నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘన అనేది చాలా సహజమైన విషయం అయింది.ఆస్పత్రుల భవనాలే కాదు, అపార్టుమెంట్లు, ఇతర ప్రైవేట్‌ భవనాల నిర్మాణానికి నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మించడం అనేది ఒక్క కోల్‌కతాలోనే కాక, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో సర్వసాధారణమైంది. చట్టాలు,నిబంధనలు మొదలైనవన్నీ మనం రూపొందించుకున్నవే. వాటిని రూపొందించే ప్రజాప్రతినిధులే ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పుడు వాటి గురించి అసలు ఏమాత్రం తెలియని సామాన్య ప్రజలు వాటిని ఉల్లంఘించడం అబ్బురమూ కాదు, అసహజమూ కాదు. నగరపాలక,పురపాలక సంస్థల్లో ఉండే టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో భవనాల ప్లాన్‌లను ఆమోదింపజేసుకోవడం ఎలాగో ఈరోజుల్లో ఎవరికీ చెప్పనవసరం లేదు.బిల్డర్ల వద్ద ఈ పనులు చేయడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారు. భవననిర్మాణ ఖర్చుల్లో ఈ అదనపు ఖర్చులను కూడా కలిపి బిల్డర్లు ఇండ్ల యజమానుల వద్ద వసూలు చేస్తూ ఉంటారు. కాకినాడ శ్యామలా నగర్‌లో ఇటీవల అపార్టుమెంటు కూలిన ఘటనలో ప్రాణనష్టం వాటిల్లకపోవడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. అసలు అపార్టుమెంట్లు, ఆకాశహర్య్మాలు ఇరుకైన సందుల్లో, జనసమర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్మించకూడదన్న నిబంధనను కూడా ఇప్పుడు ఎవరూ పాటించడం లేదు. వాహనాలకూ ఇది వర్తిస్తుంది. పాత వాహనాల స్థానే కొత్త వాహనాలకు అనుమతి ఇవ్వాల్సి ఉండగా, పాతవి రోడ్ల మీద తిరుగుతుండగానే కొత్త వాహనాలకు అనుమతి ఇవ్వడం కూడా నిబంధనల ఉల్లంఘనే. భవన నిర్మాణాల్లో నిబంధనలు పాటించకపోవడం వల్ల అవి పేక మేడల్లా కూలిపోతుననట్టే, అడ్డు, అదుపు లేకుండా వాహనాల సంఖ్య పెరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి.
ఉద్యమాలు, ఆందోళనలు జరుగుతున్నప్పుడైతే ఇక చెప్పనవసరం లేదు. బంద్‌లకూ, రాస్తా,రైల్‌ రోకోలకు రాజకీయ పార్టీలు పిలుపు ఇవ్వడం సర్వసాధారణమైంది. వీటి వల్ల అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు. ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు రోకో సంఘటనల కారణంగా ఇతర వాహనాలతో పాటు 'కుయ్‌ కుయ్‌' శబ్దంతో వేగంగా దూసుకుని వెళ్ళే అంబులెన్స్‌లు, 108 వాహనాలు కూడా ఆగిపోతున్నాయి. ఫలితంగా ఆ వాహనాల్లో అత్యవసర చికిత్స కోసం తీసుకుని వెళ్ళే రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి. సమస్య ఎంత తీవ్రమైనది అయినా ప్రజలకు అసౌకర్యం కలిగించే రీతిలో ఆందోళనలు సాగించడం, నిబంధనలను ఉల్లంఘించడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదనీ, ఇలాంటి ఆందోళనలు నిర్వహించే వారిపై కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఇటీవల ఆదేశించింది. పౌరజీవనానికి ఆటంకం కలిగిస్తున్న వారి పట్ల అటు ప్రభుత్వమూ, ఇటు ప్రజలూ చూసీ చూడనట్టుగా వ్యవహరించుకోవడం వల్ల ప్రజలు అవస్థలు పడటమే కాక, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పొగొట్టుకుంటున్నారు.
అలాగే, ప్రజాప్రతినిధులు నిబంధనలనూ, సభా సంప్రదాయాలను ఉల్లంఘించడం వల్ల అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమవుతూ ఉంటాయి. మన రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఉప ఎన్నికల భారం ప్రజలపైనే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. అటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా,వైద్య సంస్థలూ నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ వారు కొద్ది పాటి జరిమానా, లేదాశిక్షలతో బయటపడుతుండగా, ఏ తప్పూ చేయని ప్రజలపై అదన పు ఆర్థిక భారం పడుతుండటం గమనార్హం. ఎవరో చేసిన తప్పునకు ఆర్థిక భారాన్ని మోయడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రజల వంతు అవుతున్నది. కోల్‌కతా ప్రమాదం సంగతి తీసుకుంటే, శీతాకాలంలో అగ్ని ప్రమాదం సంభవించడం 'ఔరా' అని అనిపించే విషయమే. అయితే, విద్యుత్‌ వాడకం ఎక్కువగా ఉండే వాణిజ్య, వైద్య సంస్థలు, ఆస్పత్రుల్లో 'షార్ట్‌ సర్క్యూట్‌' వల్ల తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాలు నివారించదగినవే అయినా, సిబ్బంది నిర్లక్ష్యం, రోగుల తరపు బంధువుల అజాగ్రత్తల వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి. ఉదాహరణకు రోగుల తరఫు బంధువులు ఆస్పత్రుల ఆవరణల్లోనే పొయ్యి రాజేసి వంటలు చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే, ఆస్పత్రుల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన వాటర్‌ స్టోరేజి ట్యాంకులు లేకపోవడం, బహుళ అంతస్థుల భవనాలకు ఉండాల్సిన సౌకర్యాలు లేకపోవడం రోగుల తరఫు బంధువులను పరిమితికి మించి ఆస్పత్రుల్లోకి అనుమతించడం వంటి కారణాల వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన రోగుల పట్ల సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వేరే చెప్పనవసరం లేదు. అలాగే, కార్పొరేట్‌ ఆస్పత్రులకు అవసరార్థం వచ్చే వారి పట్ల నిబంధనల పేరిట సిబ్బంది ఎంత దాష్టీకంగా వ్యవహరిస్తారో వేరే చెప్పనవసరం లేదు. ఆస్పత్రులకు, విద్యా సంస్థలకు ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మౌలిక సదుపాయాలు ఉండకపోవడం ప్రమాదాలకు హేతువు అవుతున్నాయి. జీవితంలో వేగం పెరగడం వల్ల డబ్బు ఎర చూపి నిబంధనలను ఉల్లంఘించే ధోరణి ప్రజల్లో పెచ్చు పెరుగుతోంది.
ఫైవ్‌స్టార్‌ ఆస్పత్రులు ఇంటికన్నా గుడి పదిలం సామెతను గుర్తు చేస్తున్నాయి. ఆర్థిక నేరాలకు అరెస్టు అయి జైళ్ళలో ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులకు ఈ ఆస్పత్రులు స్వర్గధామాలు అవుతున్నాయి. వివిధ కుంభకోణాల్లో అరెస్టు అయిన ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు ఈ మధ్య ఆస్పత్రుల్లో చేరిన ఉదంతాలు కోకొల్లలు. అలాగే, అన్ని నిబంధనలు పాటించినప్పటికీ, కొన్ని సందర్భాల్లో జనం రద్దీ ఎక్కువ కావడం వల్ల ప్రమాదాలు తరచుజరుగుతున్నాయి. కోల్‌కతా ఆస్పత్రి ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది దట్టమైన పొగ వల్ల ఊపిరి ఆడక మరణించిన వారే. అలాగే, జనం ఎక్కువ అయితే, తొక్కిసలాటలు సంభవించి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనల గురించి కూడా మనకు తెలుసు.కనుక ఈ మాదిరి ప్రమాదాలకు ఆవలి వారు ఎంత బాధ్యులో ప్రజలు కూడా అంతే బాధ్యులు. పనులు త్వరగా ముగించుకుని పోవాలన్న తొందర, నిబంధనల పట్ల ఉదాసీనత, తనిఖీ యంత్రాంగం అవినీతి మయం కావడం ప్రమాద హేతువులు అవుతున్నాయి. ఇందుకు కోల్‌కతా సంఘటన గట్టి నిదర్శనం.

సోనియా జన్మదిన కానుకగా మద్యం

యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ జన్మదిన కానుకగా రాష్ట్ర ప్రభుత్వం 171 లక్షల లీటర్ల మద్యం ఉత్పత్తి పెంచేందుకు వీలుగా ఉత్తర్వులిచ్చే ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేసి మహిళలను అవమానపరచారని తెలుగుదేశం పార్టీ దుయ్యబట్టింది. సోనియా బర్త్‌డేకు మహిళలకు ఇచ్చే కానుక ఇదేనా, ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆయన అసమర్థకు అద్దం పడుతుందని ఆ పార్టీ మండిపడింది. ఆర్ధిక లావాదేవిలకు సంబంధించిన అన్ని ఫైళ్ళలో అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయని, అలాంటి ఫైళ్ళకు ప్రభుత్వం ఎక్కువ చొరవ చూపుతుందని శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యుడు యలమంచలి బాబూ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని వంద నుంచి 200 రోజులకు పెంచుతామంటూ ముఖ్యమంత్రి హామీ ఇస్తూ పేదలను వంచిస్తున్నారని తెలుగుదేశం నాయకులు దుయ్యబట్టారు. వందరోజుల పని చూపించలేకపోవడమే గాక చేసిన పనులకు వేతనం కూడా చెల్లించడం లేదని వారు ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నిధులు కాంగ్రెస్‌ పైరవీకారులు దోచు కుంటున్నారని, సోషల్‌ ఆడిట్‌లో కూడా నిధుల దుర్వినియోగం బయటపడిందని వారు చెప్పారు. కాంగ్రెస్‌ నేతల బొజ్జలు నింపేందుకే ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారని, పేదల సొమ్ము దోచుకుంటున్నారని వారు ధ్వజమెత్తారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంతకుమార్‌లు ఉపాధి హామీ పథకం నిధులను తమ సొంత ఎస్టేట్‌లకు రోడ్లు వేయించుకునేందుకు దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు. రాజీవ్‌ యువకిరణాలు పేరుతో మరోసారి యువతను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వస్తుందని వారు దుయ్యబట్టారు. గతంలో రాజీవ్‌గాంధీ పేరుమీద అనేక పథకాలు ప్రకటించి ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకపోగా పాతవాటిని కొత్తవిగా చెప్పుకుంటూ యువతను మభ్యపెడుతున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తామంటూ ఆర్బాట ప్రచారాలతో డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి సభలకు రప్పిస్తున్నారని వారు చెప్పారు. డ్వాక్రా మహిళలు తమ సమస్యలను లేవనెత్తితే ముఖ్యమంత్రి వాటిని వినకుండా డ్రాప్‌బాక్స్‌లో వేయాలంటూ చెబుతున్నారని, ప్రభుత్వ హామీలకు, చేతలకు ఏ మాత్రం పొంతన లేదని వారు దుయ్యబట్టారు.

బాబు 'స్థానిక' శంఖారావం...

రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన కృష్ణా జిల్లా నుండి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలుస్తోంది. ఈనెల మూడవ వారంలో ఆయన కృష్ణా జిల్లాలో పోరుబాట పేరుతో విస్తృతంగా పర్యటించనున్నారు. మైలవరం నుండి గాని, లేదా గుడివాడ నుండి గాని బాబు పర్యటన ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రైతు సమస్యలు ప్రధానంగా ఈ పోరుబాట సాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ స్థానిక ఎన్నికల ప్రక్రియ త్వరోనే ప్రారంభం కానున్న నేపధ్యంలో చంద్రబాబు నాయుడు ఈ పోరుబాటనే స్థానిక ఎన్నికల పోరాట బాటగా ఎంచుకుంటారని తెలుస్తోంది. ఈ పర్యటన ద్వారా పార్టీ కేడర్లో నూతన జవసత్వాలు నింపేందుకు బాబు ప్రయత్నించనున్నారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే సందేశాన్ని ప్రజలకు చంద్రబాబు ఇవ్వనున్నారు. ఇదివరకు జిల్లాలో వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్రసాగింది. ఆ యాత్ర ద్వారా జగన్‌ జిల్లా అంతటా పర్యటించి మత పార్టీ వైపు ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. అప్పుడు సైతం జగన్‌ పేరుకు ఓదార్పు యాత్రే అయినా ఆయన యాత్ర రైతు సమస్యల పైనే సాగిన విషయం తెలిసిందే. చివరకు ఆయన తన ఓదార్పు యాత్ర చివరి రోజు విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుటు రైతు మహా ధర్నా నిర్వహించి రైతులను ఆకట్టుకునే ప్రయత్నంచేశారు. అయితే అదే తరుణంలో అనివినీతిని అంతం చేయాలంటూ అన్నా హజారే స్పూర్తితో చంద్రబాబు నాయుడుకూడా జిల్లాలో పర్యటించారు. అయితే ఇప్పుడు స్థానిక సమరానికి దాదాపు పార్టీలన్నీ సర్వసన్నద్ధమ వుతున్నాయి. ఈ తరుణంలో చద్రబాబు నాయుడు పోరు బాట రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీకి స్వర్గీయ ఎన్‌టీ రామారావు కాలంనుండి కృష్ణాజిల్లా పెట్టని కోటగా వస్తోంది. అయితే ఎన్టీఆర్‌ మరణానంత రం పార్టీ కొంత దెబ్బతిని కాంగ్రెస్‌ పార్టీకి కూడా బలమైన జిల్లాగా మారింది. ఇప్పటికీ జిల్లాలో టిడిపికి బలమైన కేడర్‌ ఉంది, నాయకత్వం ఉంది. గత స్థానిక ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌ అభివృద్ధి మంత్రం బాగా పనిచేసిందనే వాదన ఉంది. అయితే ఈసారి జరగ బోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ అండ కాంగ్రెస్‌కు ఉండే అవకాశాలు లేవు. పైగా అదే వైఎస్‌ ఆర్‌ తనయుడు సొంత పార్టీని గెలిపించుకునేందుకు కాంగ్రెస్‌ ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలను తెలుగుదేశం పార్టీ తమ పార్టీ విజయానికి ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై ముందస్తు వ్యూహ రచన చేస్తోంది. అదే సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులను స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరహర శెట్టి నరసింహారావు ఇప్పటికే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌, మంత్రి పార్ధ సారధిల సూచనలతో జిల్లాలో పర్యటిస్తున్నారు. మండల కాంగ్రెస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకాలను సైతం చేప డుతున్నారు. పార్టీ కేడర్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరో పక్క యూత్‌ కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరుపుతున్నారు. ఇక వామపక్ష పార్టీలు కూడా తమ పార్టీ క్యాడర్ను సన్నద్దంచేస్తున్నాయి. గత స్థానిక ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో కాంగ్రెస్‌ విజయఢంకా మోగించింది. మెజారిటీ జడ్పీటీసీ లను గెలుచుకుని జిల్లా పరిషత్‌ను గెలుచుకుంది. మెజారిటీ ఎంపీపీ స్థానాలను గెలుచుకుంది. అదే విధంగా గ్రామ పంచాయతీల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే మెజారిటీ స్థానాల్లో సర్పంచులుగా గెలిచారు. జిల్లాలో మొత్తం 49 మండలాలకు గాను 25 ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్‌ గెలవగా, టీడీపీ 23 స్థానాలను దక్కించుకుంది. కాగా మిగిలినవి వామ పక్ష పార్టీలు గెలుచుకున్నాయి. అదే విధంగా జడ్పీటీసీ స్థానాలు 49 లో 32 కాంగ్రెస్‌ గెలవగా, 13 స్థానాల్లో మాత్రమే టిడిపి గెలుచుకుంది. ఇక మిగిలినవి ఇతరులు గెలచుకున్నారు. జిల్లాలో మొత్తం 972 గ్రామ పంచాయితీల్లో మెజారిటీ పంచా యితీలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఈ ఫలితాలు వైఎస్‌ రాజశె ఖర్‌రెడ్డి అభివృద్ది పధకాలు పెట్టి అభివృద్ది మంత్రంతో సాధిం చనవి. అయితే ఈసారి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్లను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ భారీగా చీల్చే అవకాశం ఉంది. జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్‌లకు గట్టి పోటీనిచ్చే అవకాశాలున్నాయి. అంటే ప్రతి చోట త్రిముఖ పోటీ ఉంటుంది. ఈ పోటీలో ప్రధానంగా కాంగ్రెస్‌ ఓట్లు భారీగా చీలిపోతే అది టిడిపి లాభిస్తుందని పరిశీలకు విశ్లేషిస్తున్నారు. టిడిపి కూడా ఇదే నమ్మకంతో ఈ సారి కృష్ణాజిల్లాలో పసుపు జెండా రెపరెపలాడడం ఖాయమ నే అభిప్రాయంతో ఉంది. అందుకే ముందస్తుగానే పార్టీ అధినే తను జిల్లా పర్యటనకు జిల్లా పార్టీ రప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మూడంచెల పంచాయతీరాజ్‌పై పార్టీల్లో చర్చ
ఇటీవల ముఖ్యమంత్రి అసెంబ్లిdలో మూడంచల పంచాయ తీరాజ్‌ వ్యవస్థను తెరమీదకు తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానంలో ఎంపిటిసి, జడ్పిటిసిలుండరు. గ్రామ పంచాయితీ సర్పంచులే మండల పరిషత్‌ అధ్యక్షుని ఎన్నుకుంటారు. అదే విధంగా ఎంపిపిలంతా కలసి జిల్లా పరిషత్‌ అధ్యక్షులను ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ మార్పువల్ల రాజకీయంగా కలిగే మార్పులేమిటనే విషయంపై కూడా పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఎంపిటిసిలు, జడ్పిటిసిల ను రద్దు చేయడంతో జిల్లాలో దాదాపు వందల సం ఖ ్యలో ఎంపిటిసి, 49 మంది జడ్పిటిసిలు పదవులు కోల్పోతారు. ఈ విధానంపై పార్లమెంటులో చట్టం తేవాల్సిన అవసరం ఉ ంటుంది. అయితే తక్షణమే దీన్ని అమలు చేసేందుకు కార్యనిర్వహక ఉత్తర్వులను ఉపయోగించుకో వచ్చునని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇప్పటికే మన రాష్ట్రం ఈ మూడంచల విధానంకోసం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

'ఆధార్‌' భవితవ్యం ప్రశ్నార్థకం

కేంద్ర హోంమ ంత్రిత్వ శాఖ సందేహాలు వ్యక్తం చేయడం తో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత ్మకంగా చేపట్టిన 'ఏకీకృత గుర్తింపు కార్డు (యుఐడి) పథకం' భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 'యుఐడి' స్థానంలో కొత్త బిల్లును తీసుకు రావాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సూచిం చింది. అయితే అధికార వర్గాలు మాత్ర ం, యుపిఎ ప్రభుత్వం చేపట్టిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పథకాన్ని కాపాడేం దుకు చివరి ప్రయత్నాలు జరుగుతున్నా యి. పార్లమెంటరీ స్థాయీ సంఘం, హోం మంత్రిత్వ శాఖ సందేహాలు త్రోసి రాజని ఈ ప్రాజెక్ట్‌ కొనసాగించేందుకు ప్రణాళికా సంఘం, కేబినెట్‌కు ఓ ముసాయిదాను సమర్పిం చినట్లు సమాచా రం. 'యుఐడిఎఐ' ప్రాజెక్ట్‌ను భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆమోదించే విధంగా నిబంధనలను సవరించాలని ప్రణాళికా సంఘం తన ముసాయిదాలో సూచించి నట్లు తెలిసింది. బయో మెట్రిక్‌ విధానం లేకుండానే జన గణన ప్రక్రియ పూర్తయిందని ప్రణాళికా సంఘం పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే కోస్తా తీర ప్రాంతాల్లో బయో మెట్రిక్‌ విధానం ద్వారా జన గణన ప్రక్రి య సగభాగం పూర్తయిందని చెబుతున్న హోంశాఖ, 'ఆధార్‌' పథకం ఖర్చును కూడా ప్రశ్నిస్తోంది. దేశ వ్యాప్తంగా జాతీయ జనాభా రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలో రూ.6650 కోట్ల ఖర్చుతో జన గణన పూర్తి చేస్తుండగా, ఆధార్‌ ప్రాజెక్ట్‌కు రూ.18 వేల కోట్లు అవసరమ వుతాయని హోంశాఖ వాదిస్తోంది.

అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆమరణ దీక్ష : బాబా రామ్‌దేవ్‌

గోవాలో అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం తక్షణమే తగుచర్యలు తీసుకుని అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని రామ్‌దేవ్‌ గోవా ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ''వచ్చే సంవత్సరంలో జరుగను న్న ఎన్నికలకు ముందు అక్రమ మైనింగ్‌ వ్యతిరేకంగా తామంతా ప్రచారం చేయను న్నాం, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, అసెంబ్లిdకి దోపిడీదారులు ఎన్నిక కావడాన్ని అనుమతించం'' అని రామ్‌దేవ్‌ బాబా పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌ కు వ్యతిరేకంగా 'గోవా బచావో సమ్మేళన్‌' పేరుతో నిర్వహించిన సభలో బాబా రాందేవ్‌ పాల్గొని ప్రసంగి ంచారు. ఈ సందర్బ éంగా రామ్‌దేవ్‌ మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌ కార్యకలా పాలకు వ్యతిరేకంగా గోవా రాష్ట్ర వ్యాప్తం గా పర్యటించనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్లు రాందేవ్‌ బాబా వెల్లడించారు.
చైనా ఉత్పత్తులను బహిష్కరించండి
ఆర్థిక రంగంలో భారత్‌కు పోటీగా తయా రవుతున్న చైనాను అడ్డుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉందని, ఇందులో భాగంగా చైనా ఉత్పత్తులను బహిష్క రించాలని యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడు ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు.

యుపిఎ కూటమిలో అజిత్‌సింగ్‌

కేంద్రంలో అధికారంలో ఉన్న యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలియన్స్‌(యుపిఎ) కూటమిలోకి అజిత్‌ సింగ్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దల్‌ చేరింది. రానున్న ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ఆర్‌ఎల్‌డి పోటీచేయాలని నిర్ణయిం చాయి. శనివారం నాడు యుపిఎ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఆమె నివాసంలో ఆర్‌ఎల్‌డి అధినేత అజిత్‌ సింగ్‌ కలుసుకుని యుపిఎ కూటమిలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. అజిత్‌సింగ్‌ నిర్ణయాన్ని సోనియాగాంధీ స్వాగతించారు. ఆర్‌ఎల్‌డికి లోక్‌సభలో ఐదుగురు పార్లమెంట్‌ సభ్యులున్నారు. యుపిఎ కూటిమిలోకి చేరినందున ఆర్‌ఎల్‌డికి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రీయ లోక్‌దల్‌ పార్టీని యుపిఎ కూటమిలోకి తీసుకురావడానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మోహన్‌ ప్రకాష్‌ విశేషంగా కృషి చేశారు. శనివారంనాడు సోనియాగాంధీతో అజిత్‌సింగ్‌ భేటీలో కూడా మోహన్‌ ప్రకాష్‌ ఉన్నారు.
భేటీ అనంతరం మోహన్‌ ప్రకాష్‌ మీడియాతో మాట్లాడుతూ ఆర్‌ఎల్‌డి అధినేత అజిత్‌ సింగ్‌ త్వరలో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను కలుసుకుంటారు.
కేబినెట్‌లో బెర్త్‌కు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆర్‌ఎల్‌డికి చోటు కల్పించడం జరుగుతుందని, యుపిఎ భాగస్వామి అయినందున ఆర్‌ఎల్‌డికి అధికారాన్ని పంచుకునే అర్హత ఉందని ప్రకాష్‌ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లిd ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌- ఆర్‌ఎల్‌డి కలిసి పోటీచేస్తాయని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి రషీద్‌ మసూద్‌తో పాటు పలువురు సీనియర్‌ నాయకులు త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని మోహన్‌ప్రకాష్‌ వెల్లడించారు.

మన సైన్యం అంటే హడల్‌!

భారత సైన్యం శత్రువును పిప్పి చేసే శక్తిగా, ఎక్కడికంటే అక్కడికి కదలి వెళ్లగల చిన్నచిన్న గ్రూపులతో కూడిన పటాలంగా భారత సైన్యం రూపాంతరం చెందుతోం దని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వి.కె.సింగ్‌ కొనియాడారు. యుద్ధ సమ యాల్లో త్రివిధ దళాల సమన్వయంతో, అత్యాధునిక సాంకే తిక పరిజ్ఞానంతో త్వరగా ముందుకు దూసుకువెళ్లే సైన్యం అవసరమని ఆయన అన్నారు. పోరాటం చేసే చిన్నచిన్న గ్రూప్‌లు, గాలింపు యుద్ధ ట్యాంకులు, యాంత్రీకృత పదాతి దళం, వైమానిక దాడులకు అనుగుణ ంగా వెళ్లే పదాతిద ళాలు, మానవరహిత వైమానిక సేవలు, 120 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఫిరంగిదళాలపై రాజస్థాన్‌ లోని సుదర్శన శక్తి విన్యాసాల్లో దృష్టి పెట్టామని అన్నారు. 'మనకు భారీ సైన్యం ఉంది. పరీక్షించకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఎలాంటి మార్పులు చేయలేం. దీని కోసం అనేకసార్లు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. పరీక్షించిన నివేదికను ఆర్మీ ఛీఫ్‌ పరిశీలించిన తర్వాత ఆఖరు గా భారత సైన్యంలో మార్పులకు ఆయన ఆమోదిస్తారు' అని దక్షిణ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎ.కె.సింగ్‌ తెలిపారు.

పుతిన్‌ పాలన ఇక చాలంటున్న రష్యన్లు

రష్యా ప్రధాని వ్లాదిమిర్‌ పుతిన్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ రష్యా పార్టీ పార్లమెంటులో 238 స్థానాలను సంపాదించినప్పటికీ, ఆయన పట్ల ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. శనివారంనాడు మాస్కోలోనూ, దేశంలోని వివిధ నగరాల్లోనూ వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మాస్కోలో క్రెవ్లిున్‌కి సమీపంలోని స్క్వేర్‌ వద్ద వేలాది మంది గుమిగూడి “పుతిన్‌ పాలన ఇక చాలు’ అంటూ నినాదాలు చేశారు. డ్యూమా ఎన్నికల్లో అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని ప్రదర్శకులు ఆరోపించారు. రేవు నగరమైన వ్లాదివోస్టోక్‌లో గత ఆదివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పుతిన్‌ పార్టీ అయిన యునైటెడ్‌ రష్యా కమ్యూనిస్టుల చేతిలో ఓటమి పాలైంది.అలాగే,ఖాబారోవస్క్‌ నగరంలో జరిగిన నిరసన ప్రదర్శనలో వేలాది మంది పాల్గొన్నారు. మాస్కోలో జరిగిన ప్రదర్శకులు పుతిన్‌,మెద్వెదెవ్‌లు తప్పుకోవల్సిందే నన్న నినాదాలు గల అట్టలు చేత పుచ్చుకున్నారు.
కాగా, నిరసన ప్రదర్శన కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాస్కోలో 50 వేల మంది భద్రతా సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.ఈ ప్రదర్శనల్లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది కమ్యూనిస్టులు ఉన్నారు. అయితే, పుతిన్‌ ఈ ప్రదర్శనలు జరిపిన వారికి ఆ హక్కు ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రదర్శకులకు అమెరికా మద్దతు ఉందని అధికార పార్టీ నాయకులు ఆరోపించారు.

పాత పథకాలకు కొత్త లేబుళ్లు

ముఖ్యమంత్రిగా ఏడాది పరిపాలన పూర్తి చేసుకొన్న కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రయాణం నల్లేరుమీద బండిలా సాఫీగా సాగిపోతున్నదన్న భావన చాలామందిలో ఉంది. కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల అధినేతలపై హైకోర్టుల్లో నడుస్తున్న కేసుల వల్ల... వారేదో సమస్యల్లో కూరుకొని ఉండగా... తను మాత్రం కొత్త కొత్త పథకాలు ప్రకటించుకుపోతూ ధీమాగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కన్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకు చాలావరకు పరిస్థితులు అనుకూలించి... రాష్ట్ర ప్రధాన సమస్యలు తాత్కాలికంగా వెనక్కుపోయాయి. ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె, ఆ తర్వాత గాలి జనార్థనరెడ్డి అరెస్ట్‌, వైయస్సార్‌ పార్టీ అధినేత జగన్‌పై అక్రమాస్తుల కేసు దర్యాప్తు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వై.ఎస్‌. విజయ దాఖలు చేసిన అఫిడవిట్‌పై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశం... అసెంబ్లీ సమావేశాల రభస, అవిశ్వాస తీర్మానం .. తదితర పరిణామాలు మీడియా పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. మధ్యలో పార్లమెంట్‌ సమావేశాలు, ఎఫ్‌డిఐపై విపక్షాల రగడ మొదలైన అంశాలు ప్రజల దృష్టిని అటువైపు మళ్లించేలా చేశాయి.
కారణాలు ఏవైనా కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఓ ఏడాది కాలం సజావుగా సాగిపోయుండచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. నిజం చెప్పాలంటే... ఆయనకిది ఎంతో గడ్డుకాలం... రానున్న నాలుగైదు నెలలు మరింత క్లిష్ట సమయం. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగి ఉంటే కిరణ్‌ కష్టాలు ప్రజలకు తెలిసేవి. కానీ... ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా లేవనెత్తిన అంశాలకు, చేసిన ఆరోపణలకు కిరణ్‌కుమార్‌ రెడ్డి సమాధానం ఇవ్వకుండా తాను చెప్పదలచుకున్నదేదో చెప్పేసి సరిపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీష్‌రావులు తెలంగాణాపై అనర్గళంగా, ఆవేదనతో మాట్లాడిన అంశాలలో ఏ ఒక్కదానికీ బదులు ఇవ్వకుండా 'తెలంగాణ అంశం కేంద్రం పరిధిలోనిది' అనే ఏకవాక్య సమాధానంతో సరిపెట్టారు.
అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంఎ్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికపై చర్చ జరిగి ఉంటే ప్రభుత్వం ఇరుకునపడేది. కాగ్‌ నివేదికలో ప్రభుత్వ వైఫల్యాలెన్నో కొట్టొచ్చినట్లు కన్పిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక స్వరూపాన్ని కాగ్‌ ఎండగట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకొనే లక్ష కోట్లు దాటిన బడ్జెట్‌ డొల్లతనాన్ని ఎత్తిచూపింది. 2009 -10 ఆర్థిక సంవత్సరంలో లక్షా 11 వేల కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌ చివరికొచ్చేసరికి 87 వేల కోట్ల రూపాయలు దాటలేకపోయిన వైనాన్ని 'కాగ్‌' చూపింది. కాగ్‌ నివేదికలో ఇంకా అనేక చేదు నిజాలు వెల్లడయ్యాయి. జలయజ్ఞం చతికిలపడిన తీరుతెన్నులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భారీగా పెరిగిన అంచనాలు, అధిక చెల్లింపులు, నాణ్యతా లోపాలు, కేంద్రం నుంచి అందిన నిధులకు లెక్కలు లేకపోవడం, మద్యం అమ్మకాలు పెరుగుతున్న తీరు లాంటి ఎన్నో లోపాల్ని 'కాగ్‌' బహిర్గతం చేసింది.
'కాగ్‌' నివేదికపై ప్రతిపక్షాలు విమర్శించినా ప్రభుత్వం నోరు మెదపలేదు. మెజారిటీ ప్రజలకు గణాంకాలు అక్కర్లేదు కనుక ప్రభుత్వానికి 'కాగ్‌' వల్ల కలిగిన తలనొప్పులు లేకపోవచ్చు. కానీ... ప్రజలు ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యలు కిరణ్‌కుమార్‌ రెడ్డిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసే క్షణాలు సమీపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకొనే డిసెంబర్‌ నెలలోనే విద్యుత్‌ కొరత ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. గత 15 సంవత్సరాల కాలంలో ఎన్నడూ చూడని విద్యుత్‌ సంక్షోభం రాష్ట్రంలో నెలకొని ఉంది. తమకు సక్రమంగా విద్యుత్‌ సరఫరా జరుగుతున్నదా? లేదా? అన్న అంశాన్నే ప్రజలు పరిగణనలోకి తీసుకొంటారు తప్ప కొరతకు ప్రభుత్వం చెప్పే కారణాలను విశ్వసించరు. వాటిని సాకులుగానే చూస్తారు. విద్యుత్‌ కోతల వల్ల రాష్ట్ర పారిశ్రామిక రంగం రూ.12,000 కోట్ల మేర నష్టపోయినట్లు ఫ్యాప్సీ వెల్లడించింది. వారానికి రెండు రోజులపాటు కరెంట్‌ లేకపోతే పరిశ్రమలు ఏం సాధిస్తాయి? ఉత్పత్తిని కుదించుకొన్న పరిశ్రమలు వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. శీతాకాలంలోనే విద్యుత్‌ కొరత నెలల తరబడి ఉంటే మండువేసవిలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించడానికి కూడా భయం వేస్తుంది. గృహావసరాలకు సరఫరా చేసే విద్యుత్‌లో గ్రామాలకు, మండల కేంద్రాలకు 8 నుంచి 12 గంటలు; నగరాలకు 6 గంటలు కోత కోస్తుంటే ఈ వేసవిలో విద్యుత్‌ సరఫరా ఎలా ఉండబోతోంది? రబీలో వేసే పంటలు సక్రమంగా చేతికొస్తాయా? అన్నది అనుమానమే. ఇప్పటికే కరెంట్‌ కోతలను నిరసిస్తూ వివిధ ప్రాంతాలలో రైతులు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను ముట్టడిస్తున్నారన్న వార్తలొస్తున్నాయి. కళ్లముందే పంటలు ఎండుతున్న దృశ్యాలను చూసి రైతాంగం నిర్లిప్తంగా ఎలా ఉండగలదు?
ప్రజా సమస్యలెలా ఉన్నా కొత్త పథకాలు ప్రకటించడంపైనే కిరణ్‌కుమార్‌ రెడ్డి ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆయనకు తెలిసి చేస్తున్నారో లేక అధికారులు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారో తెలియదుగానీ... పాత పథకాలకే కొత్త ముసుగులు తొడిగి వాటినే కొత్త పథకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకు ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో మౌలిక సదుపాయల కల్పన అంటూ కొత్త పథకాన్ని ప్రారంభించారు. నిజానికిది 2005లో డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆదర్శ గ్రామాలు అనే కాన్సెప్ట్‌ తెచ్చారు. ప్రతి రెండేళ్లకు 1/3 వంతు ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఏర్పరిచి 2011 నాటికల్లా అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. 2011 పూర్తికావస్తున్న తరుణంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇప్పుడా పథకం చేపట్టి కొత్తదిగా చెపుతున్నారు. మీసేవ, రాజీవ్‌ యువకిరణాలు, స్త్రీశక్తి... ఇవన్నీ కొత్త లేబుల్స్‌తో వచ్చిన పాత పథకాలే. ఇది కిరణ్‌మార్కు జిమ్మిక్కు... ఇలాంటి జిమ్మిక్కులతో ముఖ్యమంత్రి ప్రజల మన్ననలు పొందగలరా?

పాపం పెద్దోళ్లది - భారం ప్రజలది

ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిన పాపం ఒకరిదైతే భారం మరొకరిపై పడుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక వర్గం ఈ పాప ఫలితాన్ని అనుభవిస్తున్నది. సుమారు 5 కోట్ల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంఘం లెక్కల ప్రకారం సాధారణ స్థితి రావడానికి మరో 3-4 ఏళ్లు పడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల కార్మికులపై భారం మరీ తీవ్రంగా పడింది. ఐఎల్‌ఓ తన నివేదికలో ఇలా పేర్కొన్నది. 'సమాచారం లభ్యమవుతున్న 35 దేశాల్లో, సుమారు 40 శాతం ఉద్యోగస్తులు గత సంవత్సర కాలం నుండి ఉపాధి దొరకక తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు దొరకడం లేదు. ఉద్యోగం దొరికినా అది ఎక్కువ కాలం నిలుస్తుందన్న నమ్మకం లేదు. తమ నైపుణ్యానికి తగిన ఉద్యోగం దొరకడం లేదని చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. 2009 నాటికి సుమారు 40 లక్షల మంది ఉద్యోగార్థులు ఇక ఉద్యోగం కోసం వెదకడం దండుగని విరమించుకున్నారు. పెట్టుబడిదారీ సంక్షోభం కోట్లాది శ్రామిక జనుల బ్రతుకులను చిన్నాభిన్నం చేసింది.
దివాళా తీసిన బ్యాంకులను గట్టెక్కించడానికి పెట్టుబడిదారీ దేశాలు కోట్లాది డాలర్లను వెచ్చించాయి. సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో భాగంగా ఎన్నో పొదుపు చర్యలను చేపట్టారు. సంక్షేమ పథకాలకు అందించే నిధులను పూర్తిగా తగ్గించారు. ప్రభుత్వరంగ ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధించారు. ఒకవైపు రిటైర్మెంట్‌ వయసును పెంచేసి మరోవైపు పెన్షన్‌ సదుపాయాలను తగ్గించారు. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను రద్దుచేసిన బ్రిటన్‌ ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్‌ అర్హతా వయస్సును పెంచేసింది. పోర్చుగీసు ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో 5 శాతం కోత విధించింది. జర్మనీ సంక్షేమ పథకాల నిధులను తగ్గించింది. ఫ్రెంచి ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 60 నుంచి 62 కి పెంచి, పెన్షన్‌ అర్హత వయస్సు 65 నుండి 67 మార్చింది.
ఈ పరిణామాలను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గం ఉవ్వెత్తున ఉద్యమించింది. సంక్షోభానికి కారకులయిన వారు పాప ఫలితం అనుభవించాలి తప్ప కార్మికులపై భారాలు మోపితే సహించమంటూ కార్మికులు నినదించారు. కార్మిక సంఘాల సభ్యత్వం ఒక్కసారిగా పెరిగింది. సమరశీల పోరాటాలు చేపట్టిన కార్మికులు ప్రభుత్వాల విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2010 అక్టోబర్‌ 2న అమెరికా కార్మికులు వాషింగ్టన్‌ వీధుల్లో పెద్ద ప్రదర్శన నిర్వహించారు. సుమారు 3 కోట్లుగా వున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, నైపుణ్యానికి తగిన ఉద్యోగాలను కల్పించాలని ప్రదర్శనకారులు డిమాండ్‌ చేశారు. ఈమధ్య కాలంలో అమెరికాలో జరిగిన అతిపెద్ద కార్మిక ప్రదర్శనగా విశ్లేషకులు దీన్ని పేర్కొన్నారు.
యూరప్‌లో కూడా నిప్పు రాజుకుంది. సమ్మెలు, ప్రదర్శనలు అక్కడ నిత్యకృత్యమయ్యాయి. తమ జీవన ప్రమాణాలపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టడానికి గ్రీకు కార్మికవర్గం వీరోచిత పోరాటాలకు పూనుకున్నది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు కార్మికులు అమరులయ్యారు. నిరుద్యోగిత 20 శాతానికి చేరుకున్న స్పెయిన్‌లో కార్మిక ఉద్యమాలు వెల్లువలా చెలరేగాయి. పారిశ్రామిక సమ్మెలు ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలకు అంటుకున్నాయి. విమానాశ్రయాలు, రైల్వే, పోస్టల్‌, ఆస్పత్రులు, రిఫైనరీలు అన్ని రంగాలు సమ్మెలతో స్థంభించిపోయాయి. సర్కోజీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులకు విద్యార్థులు, ఇతర వర్గాల నుండి అనూహ్య మద్దత్తు లభిస్తుంది. బ్రిటన్‌, ఇటలీల్లోనూ కార్మిక ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద కార్మిక సమ్మె 2010 సెప్టెంబర్‌ 29న యూరప్‌లో జరిగింది. 35 దేశాల్లోని లక్షలాది మంది కార్మికులు ఆ రోజున సమ్మె చేశారు. మన దేశంలో స్వాతంత్య్రానంతరం అతిపెద్ద కార్మిక సమ్మె 2010, సెప్టెంబర్‌ 7న జరిగింది. ఆ రోజున సుమారు 10 కోట్ల మంది కార్మికులు సమ్మెబాట పట్టారు.
నయా ఉదారవాదం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాలను ధ్వంసం చేసింది. అమెరికా నిర్దేశకత్వంలో ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకులను సాధనాలుగా చేసుకొని ఈ నయా ఉదారవాద విధానాలను వర్థమాన దేశాలపై అప్రజాస్వామికంగా రుద్దారు. వ్యాపారంపై నున్న అన్ని ఆంక్షలను తొలగించాలని, ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించాలని ఈ విధానాల సారాంశం. ఈ విధానాలకు నేడు ప్రతిచోట వ్యతిరేకత ఎదురవుతున్నది. నియంత్రణలు పూర్తిగా ఎత్తివేయాలనే విధానం ఇక చెల్లుబాటు కాదని 2009 లో జరిగిన జి-20 సమావేశంలోనే బ్రిటన్‌ ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ తేల్చి చెప్పారు. మన సమాజంలో శృంఖలాలు ఉండకూడదు నిజమే కాని, విశృంఖలత్వానికి కూడా తావులేదని బ్రౌన్‌ స్పష్టీకరించాడు. ఇదే అభిప్రాయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్‌ రన్‌ కూడా వ్యక్తీకరించాడు. ''నియంత్రణ లేని మార్కెట్లే అన్ని సమస్యలను పరిష్కరించగలిగే దేవతలను కొందరు కొలుస్తున్నారు. అవి క్షుద్ర దేవతలని నేడు తేలింది.'' నయా ఉదారవాదాన్ని వేనోళ్లా పొగిడిన వారే ఇప్పుడు దాన్ని ఈసడించుకుంటున్నారనడానికి ఇవి ప్రబల నిదర్శనాలు.
విధాన నిర్ణయాల్లో తమకు కూడా పాత్ర ఉండాలని నేడు వర్థమాన దేశాలు గట్టిగా నిలబడుతున్నాయి. సమస్త మానవజాతి భవిష్యత్తును నిర్ణయించే అధికారం ధనిక దేశాల కెక్కడిదనే ప్రశ్నలు నేడు ఉత్పన్నమవుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలోని 196 దేశాలు ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ప్రజల జీవన స్థితిగతుల్లో మెరుగుదల తీసుకురాలేని అభివృద్ధికి అర్థంలేదని తేల్చిచెప్పాయి. అమెరికా ఆధిపత్యాన్ని కూడా నేటి ప్రపంచం ప్రశ్నిస్తున్నది. ఆర్థిక సంక్షోభానికి తోడు అఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లలో తగిలిన ఎదురుదెబ్బలు అమెరికా సామ్రాజ్యవాదాన్ని మరింత బలహీనపరిచాయి.
తమ జీవన ప్రమాణాలు నానాటికీ దిగజారడం చూస్తున్న ప్రజలు తమ ప్రభుత్వాలపై నమ్మకం కోల్పోతున్నారు. ఐఎల్‌ఓ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఆయా దేశాల్లోని మెజారిటీ ప్రజలు పెట్టుబడిదారీ విధానంపై తమకు నమ్మకంలేదని తేల్చిచెప్పారు. నయాఉదారవాద ఆర్థిక నమూనా నేడు సవాళ్లను ఎదుర్కొంటున్నది. లాటిన్‌ అమెరికా ఖండం ప్రత్యామ్నాయ విధానాలతో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. మౌలిక వసతుల కల్పనలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి అంతర్గత డిమాండ్‌ను సృష్టించిన చైనా ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావం నుండి సునాయాసంగా తప్పించుకోగలిగింది. నేటివరకు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలపై పున: సమీక్ష జరిపి ఆర్థిక వ్యవస్థను సక్రమ మార్గంవైపు మళ్లించడానికి భారత దేశానికిదే సరైన సమయం.

అన్నదాత కరవు కేక ...ఆదుకోవడానికి ని'బంధనాలు'

మూడేళ్ళుగా రాష్ట్రాన్ని పీడిస్తున్న కరవు పేద రైతు కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏటేటా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునే ప్రయత్నాలేవీ ఫలించడంలేదు. మద్దతు ధరలు లేక, పంటలు గిట్టుబాటు కాక, పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీరక, బతుకుదెరువుకు మరోమార్గం లేక తీవ్రమైన సమస్యలతో విలవిలలాడుతున్న అన్నదాతలపై పాలకపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. బాధ్యతగల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్త్తేస్తున్నాయి. వాస్తవ పరిస్థితులపై అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తున్నాయి. నష్టం అంచనాల నివేదికలు అధికారుల వద్ద అపరిష్కృతంగానే ఉంటున్నాయి. 2009 వరద బీభత్సం మొదలుకొని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏదో ఒక రకమైన కారణాల వల్ల కరవు విలాయ తాండవం చేస్తోంది. ముఖ్యమంత్రులు మారినా, ప్రతిపక్షాలు ఉద్యమించినా, అధ్యయన కమిటీలు ఆదుకోవాలని సిఫారసు చేసినా చలనం మాత్రం కనిపించడంలేదు. రైతు సంక్షేమం పేరుతో రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నప్పటికీ అవేవీ బడుగు రైతు జీవితాలను బాగు పరచలేకపోతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారుల్లో నిర్లక్ష్యం, అవినీతి అక్రమాలు వారి పాలిట శాపంగా మారుతున్నాయి.
రైతులు సాగుచేసిన పంటలు 50 శాతానికి మించి నష్టపోతేనే పరిహారం చెల్లించాలన్న ధోరణితో ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తోంది. దీంతో అర్హులైన రైతుల్లో సగం మందికి కూడా నష్టపరిహారం అందుతుందన్న నమ్మకం కలగడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో ప్రతి హెక్టారు పరిమాణంగా ఈ పరిహారాన్ని అందజేయాలని భావిస్తున్నాయి. వరి, వేరుశనగ, పత్తి, చెరకు, మిరప, ఉల్లి, కూరగాయలు, పూలతోటలు, బొప్పాయి తదితర పంటలకు ప్రతి హెక్టారుకు రూ.6 వేలు నష్టపరిహారంగా అందజేయాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రణాళిక తయారు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేలు భరించనుంది. అదే విధంగా జొన్న, సజ్జలు, రాగులు, ఆముదం, కలబంద పంటలకు ప్రతి హెక్టారుకు రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించగా, వర్షాభావ ప్రాంతాలకు రూ.2 వేలు మాత్రమే ఇవ్వనున్నారు. పప్పు ధాన్యాలు, పొద్దుతిరుగుడు, సోయాబిన్‌, గోధుమ, ఆజ్వాన్‌, అవిసె పంటలకు రూ.3,750 చెల్లించాలని నిర్దేశించగా, వర్షాభావ ప్రాంతాలకు రూ.2 వేలు మించి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. మొక్కజొన్నకు హెక్టారు ఒక్కింటికి రూ.5 వేలు, ఉద్యానవన పంటలు, నర్సరీలకు రూ.4,500, మామిడి, నిమ్మ, జీడిమామిడి, సపోటా, జామ, దానిమ్మ, రేగు తోటలకు రూ.9 వేలు చెల్లించనున్నారు. సాగునీటి ప్రాంతాల్లో అరటి తోటలకు రూ.24 వేలు, వర్షాభావ ప్రాంతాల్లో రూ.6 వేలు, పొగాకు తోటలకు రూ.6 వేల చొప్పున పరిహారం చెల్లించాలని విపత్తుల నిర్వహణ శాఖ నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రతి హెక్టారుకు రూ.10 వేలకు తగ్గకుండా పరిహారం చెల్లించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఇంత తక్కువ మొత్తంలో నష్టపరిహారం చెల్లింపునకు ప్రణాళికలు రూపొందించుకోవడం గమనార్హం.
కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాభావం, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు, సహకరించని వాతావరణం, కరెంటు కోత, గాడి తప్పిన నీటి యాజమాన్యం తదితర కారణాలు వ్యవసాయ రంగాన్ని గట్టెక్కనీయడం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యేక బృందాలతో అధ్యయనంచేసి వాస్తవాలను జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ, కరవు పీడిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు ప్రారంభంకాలేదు. నష్టపోయిన రైతులకు గత మూడేళ్ళుగా పరిహారం అందని ద్రాక్షగానే మిగులుతోంది. 2009 వరద బీభత్సాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తించినా, అనంతరం 2010లో పెద్దఎత్తున సంభవించిన కరవుపై పలుసార్లు కేంద్ర బృందాలు పర్యటించి అధ్యయనం చేసినా బాధితులను ఆదుకోవడంలో జరుగుతున్న జాప్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది కూడా అంతకు రెట్టింపు స్థాయిలో దారిద్య్రం గ్రామీణ ప్రజలను వెంటాడుతోంది. 84 శాతం ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాని కారణంగానే కరవు ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ గుర్తించినప్పటికీ ప్రభుత్వ చర్యలు హామీలకే పరిమితమవుతున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో పంటలు ఎండిపోయినందున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 మండలాలను ప్రభుత్వం కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 868 మండలాల్లో తీవ్రమైన కరవు ఉన్నట్లు గుర్తించారు. 12 జిల్లాలు పూర్తిగా దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.
ఇదంతా కాదని కేంద్ర ప్రభుత్వం కరవు ప్రాంతాల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) సంస్థకు బాధ్యతలు అప్పగించింది. కోనసీమ మొదలుకొని తెలంగాణ జిల్లాలకు సైతం పాకిన పంటల విరామంపై ప్రభుత్వం నియమించిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందా కమిటీ పూర్తిస్థాయి నివేదిక సమర్పించినప్పటికీ, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రైతు సంఘాల సమావేశంలో స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ బాధితులకు ఒక్కపైసా పరిహారం అందిన దాఖలాలు లేవు. అనంతరం తలెత్తిన కరవుపై ప్రతి జిల్లాకు ప్రత్యేకాధికారిని నియమించి పరిస్థితులపై నివేదికలు రప్పించినప్పటికీ ఇంకా చర్యలు ప్రారంభం కాలేదు. నష్టపోయిన రైతుల పూర్వాపరాలు, స్థితిగతులను కంప్యూటర్లలో భద్రపరిచే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడి ప్రతి విషయాన్ని నివేదిక రూపంలో కేంద్ర సర్కారుకు సమర్పించి ఆదుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఢిల్లిd పెద్దలకు కనికరం కలగడంలేదు. ఈ సమాచారాన్ని అనుమానిస్తూ ఐఐఎం నిపుణులు అధ్యయనం చేసిన తర్వాతనే ఆదుకుంటామన్న సంకేతంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఈ నెలాఖరులోగా ఐఐఎం ప్రత్యేక ప్రతినిధి బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి. పంటల విరామం ప్రకటించిన ప్రాంతాలతో పాటు ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల్లోనూ ఈ అధికారులు పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
మూడేళ్ళ వరుస కరవు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ 2011 నైరుతి రుతుపవనాల సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులుగా నియమించబడిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు ఆయా జిల్లాల్లో పర్యటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. గ్రామాల వారీగా నష్టం అంచనాల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ బాధిత రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, నష్టపరిహారం తదితర లబ్ధి చేకూర్చడానికి డ్రాట్‌ కంట్రోల్‌ రూమ్‌లను సంప్రదించాలని సూచనలు ఇవ్వడం ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. వ్యవసాయ, ఉద్యానవన పంటలకు సంబంధించి పది జిల్లాల్లో మదింపు కార్యక్రమం కొనసాగుతున్నట్లు రెవెన్యూ శాఖ చెబుతోంది. వర్షాభావం, విద్యుత్‌ కోత కారణంగా వరి, వేరుశనగ, ఉల్లి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, ఆముదం, కంది పంటలు పెద్దఎత్తున నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ధ్రువీకరించింది. 23,320 హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి, అరటి, బొప్పాయి, బత్తాయి తోటలకు నష్టం వాటిల్లినట్లు తాజాగా ఉద్యానవన శాఖ స్పష్టంచేసింది. అయినప్పటికీ పశుగ్రాసం కొరత తీర్చే కార్యక్రమాలు ఎక్కడా ప్రారంభం కాలేదు. 75 శాతం ప్రత్యేక సబ్సిడీపై 6వేల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం విత్తనాలు విడుదలైనప్పటికీ ఇంకా రైతుకు అందలేదు. కరవు పీడిత ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు దొరకడం లేదు. ఇందుకోసం రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ.8,200 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు అధికారిక ప్రకటనలు వెలువడుతున్నప్పటికీ అనేక ప్రాంతాల నుంచి వలసలు ఏమాత్రం ఆగడంలేదు.
ఒకవైపు కటిక దారిద్య్రం రాష్ట్రాన్ని వెంటాడుతుంటే, మరోవైపు భూగర్భ జలాలు నానాటికీ అడుగంటిపోతున్నాయి. నీటి వినియోగం అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా తాగునీటికి సైతం తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. గడిచిన సెప్టెంబర్‌ మాసంతో పోల్చిచూస్తే ఇప్పటి వరకు భూగర్భ జలాలు రెండింతల లోతుకు చేరుకున్నాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలోనూ ఈ సమస్య తీవ్రమవుతోంది. భూగర్భ జల శాఖ అధికారుల సమాచారం మేరకు సరాసరిగా 1.57 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయినట్లు తెలుస్తోంది. నెల రోజుల్లోనే ప్రకాశం జిల్లాలో 3.75 మీటర్లు, గుంటూరు జిల్లాలో 2.65 మీటర్ల లోతుగా జలాలు తగ్గిపోయాయి.

వారిపై అనర్హత వేటు తప్పదు...

పార్టీ విప్‌ను ధిక్కరించి అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన జగన్‌ వర్గం ఎమ్మెల్యేలపై రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు కింద అనర్హత వేటు వేయాల్సిందిగా శాసనసభ స్పీకర్‌కు దరఖాస్తు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌లతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణ అంశంపై శనివారం విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం హైద్రాబాద్‌ తిరిగివెళ్లే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారిపై అనర్హత వేటు తప్పదని, అయితే, విప్‌ పాటించకపోయినా ఓటింగ్‌కు గైరుహాజరైన వారి నుంచి వివరణ మాత్రం కోరుతామని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం ఇక్కడికి తిరిగి రాగానే రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ నివాసానికి వెళ్లి ఆయనతో దాదాపు గంటకుపైగా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత గులాంనబీ ఆజాద్‌, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌, సోనియాతో సమావేశమైనప్పుడే అధ్యక్షురాలి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రికి కూడా పిలుపు వచ్చింది. దీనితో ఆజాద్‌, అహ్మద్‌పటేల్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి ముగ్గురూ సోనియా గాంధీతో గంటన్నరకు పైగా రాష్ట్ర వ్యవహారాలను చర్చించారు. సోనియాతో సమావేశానంతరం ముఖ్యమంత్రి మరోసారి గులాంనబీ ఆజాద్‌ నివాసానికి వెళ్లి చర్చలు కొనసాగించడం విశేషం.
అధిష్టానంతో జరిపిన చర్చల వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన ఆయన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేసిన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం రాష్ట్రానికి తిరిగివెళ్లిన తర్వాత సీనియర్‌ మంత్రులు, పిసిసి అధ్యక్షునితో కూడా సంప్రదించి అతి త్వరలోనే రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ 2 (1) (బి) సెక్షన్‌ కింద వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ ద్వారా స్పీకర్‌ను కోరనున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు విషయం తనకేమీ తెలియదని, పత్రికలు, టివి చానళ్లలోనే చూస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ తరఫున ఎన్నికైన వారు అదే పార్టీలో కొనసాగాలనే రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంటున్నదని, ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్య తీసుకొనేందుకే పదవ షెడ్యూల్‌ను పొందుపరచినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
అసెంబ్లీలో బలపరీక్షకు ముందు జగన్‌ వర్గం ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపి ప్రలోభపరిచే ప్రయత్నాలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. 'వారంతా కాంగ్రెస్‌ శాసనసభ్యులే, స్వంత పార్టీ ఎమ్మెల్యేలకే లంచం ఇవ్వాల్సిరావడమంటే అంతకంటే దురదృష్టం మరోటి ఉండదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచినవారంతా ఆ పక్కకు ఎందుకు పోయారో చూస్తేనే అర్థమవుతుంది, వారు రాజకీయాలను నీచస్థాయికి దిగజార్చారు, ఆ స్థాయికి నేను దిగజారనవసరం లేదు' అంటూ ముఖ్యమంత్రి నిందించారు.
విప్‌ ధిక్కరించిన ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డిపై చర్య విషయాన్ని ప్రజారాజ్యం పార్టీ నాయకులు చూసుకొంటారని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. టిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ అనుబంధ శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణకు కూడా కాంగ్రెస్‌ పార్టీ జారీచేసిన విప్‌ వర్తిస్తుందా అన్న మరో ప్రశ్నకు 'అవన్నీ సాంకేతికపరమైన అంశాలు, వాటిని సిఎల్పీ చూస్తుంది' అంటూ ఆయన సమాధానాన్ని దాటవేశారు.
జగన్‌ వర్గం ఎమ్మెల్యేలలో ఎవరైనా వెనక్కు తిరిగివచ్చే అవకాశముందా అన్న ప్రశ్నకు కూడా ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసిన వారందరిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. విప్‌ ధిక్కరించిన వారంతా శాసనసభ్యత్వాలను కోల్పోతే జరుగనున్న ఉపఎన్నికల ఫలితాలెలా ఉంటాయో తాను జోస్యం చెప్పదలుచుకోలేదని ముఖ్యమంత్రి అన్నారు. ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి విజయం సాధిస్తుందన్న విశ్వాసముందా అన్న ప్రశ్నకు 'ఎన్నికలు జరిగిన తర్వాత గదా ఫలితం తెలిసేది, నేను మీ మాదిరిగా ఫలితాలను ముందే ఊహించలేను' అని కిరణ్‌కుమార్‌ రెడ్డి సమాధానమిచ్చారు.
పార్టీ అధిష్టానం అనుమతి లభించిన తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఆయన మంత్రి పదవుల కోసం పూర్వపు ప్రజారాజ్యం నేత చిరంజీవి, ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. చిరంజీవితో తాను నిన్న కూడా మాట్లాడానని, వారిని ఎప్పుడు మంత్రివర్గంలోకి తీసుకొంటామో అప్పుడు వారికి, మీకు అందరికీ చెప్పే చేస్తాం అని ఆయన మీడియానుద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్య పరిష్కారమయ్యేంత వరకూ మంత్రివర్గ విస్తరణ సాధ్యపడదన్న గులాంనబీ ఆజాద్‌ ప్రకటనను ప్రస్తావించినప్పుడు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం అవసరమని అధిష్టానం, తాము ఎప్పుడు భావిస్తే అప్పుడు జరుగుతుందన్నారు. రాష్ట్ర శాసనసభలో ఆధిక్యతతో అవిశ్వాస తీర్మానంపై గెలిచిన తర్వాత కూడా తన ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఎవరైనా భావిస్తే తాను చేయగలిగిందేమీ లేదన్నారు.
తెలంగాణ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని, దానిపై కేంద్రం, కాంగ్రెస్‌ అధిష్టానం సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకొంటుందని కిరణ్‌కుమార్‌ రెడ్డి మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దీనిపై రాష్ట్ర స్థాయిలో సంప్రదింపులు ముగిశాయని, తెలంగాణ డిమాండ్‌ను అన్ని కోణాల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న కేంద్రం, రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సముచిత నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చట్టబద్ధమైన, ప్రత్యేక ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయబోతున్నట్లు తనకేమీ తెలియదని, ఈ విషయాన్ని తాను పత్రికలలోనే చూశానని అన్నారు.

ఎపి ట్రాన్స్‌కో, డిస్కంల్లో ఉద్యోగ మేళా

ఎపి ట్రాన్స్‌కోతో పాటు రాష్ట్రంలోని నాలుగు డిస్కంల పరిధిలో 6,263 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. గతంలో ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగ మేళా నిర్వహించలేదు. ఒకే సారి ఇన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నెల 15న ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదలచేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన లక్ష ఉద్యోగాల్లో భాగంగానే విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో విద్యుత్‌కు నానాటికి పెరుగుతున్న ఆదరణ, గుర్తింపు, అన్నింటికి మించి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని శాఖలో సేవలందించేందుకు అన్ని విభాగాలలో అవసరమైన పద్ధతిలో ఉద్యోగులను నియమించనున్నారు. రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి దినేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.
విద్యుత్‌ వ్యవస్థలో వివిధ విభాగాల్లో అవసరమైన ఖాళీలను భర్తీచేసేందుకు సాగే ప్రక్రియ పూర్తిగా పారదర్శకతతో ఉంటుందని ఆయన చెప్పారు. ఇందులో సంస్థ ఉద్యోగులతో పాటు ఉన్నత స్థాయిలోని అధికారులు సైతం జవాబుదారిగా ఉండే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎపి ట్రాన్స్‌కో సిఎండి అజయ్‌జైన్‌, డిస్కంల సిఎండిలు అనంతరాము, ఆహ్మద్‌ నదీం, సిహెచ్‌ నర్సింహారెడ్డి, కె విద్యాసాగర్‌రెడ్డి, జెఎండిలు రంగనాథం తదితర అధికారులతో దినేష్‌ కుమార్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ, ఉద్యోగుల ఖాళీలు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల, ఉద్యోగుల నియామకాల్లో అనుసరించాల్సిన విధానాలను ఆయన చర్చించారు. డిసెంబర్‌ 15న నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని, ఆతర్వాత చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. ప్రకటించిన ఉద్యోగ పోస్టులను అన్నింటిని భర్తీ చేసేందుకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.
ఎపి ట్రాన్స్‌కోలో మొత్తం 2,261 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో జూనియర్‌ లైన్‌ మెన్‌లు 1648, జూనియర్‌ అసిస్టెంటులు 16, సబ్‌ ఇంజనీర్లు 347, అసిస్టెంట్‌ ఇంజనీర్లు 250 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని నాలుగు డిస్కంల పరిధిలో 4002 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇపిడిసిఎల్‌లో జూనియర్‌ లైన్‌మెన్‌ (జెఎల్‌ఎం) 937, జూనియర్‌ అసిస్టెంట్‌లు (ఎల్‌డిసి) 58, సబ్‌ ఇంజనీర్లు 35, ఎస్‌పిడిసిఎల్‌ జెఎల్‌ఎం 1316, ఎల్‌డిసి 144, సిపిడిసిఎల్‌ పరిధిలో జెఎల్‌ఎం 1169, ఎల్‌డిసిలు 100, ఎన్‌పిడిసిఎల్‌ ఎల్‌డిసిలు 182, సబ్‌ ఇంజనీర్లు 61 ఉద్యోగాలకు నియామకాలను చేపట్టనున్నారు. మొత్తం జూనియర్‌ లైన్‌మెన్‌లు 5070, ఎల్‌డిసిలు 500, సబ్‌ ఇంజనీర్లు 443, అసిస్టెంట్‌ ఇంజనీర్లు 250 ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యుత్‌ సంస్థలోని అన్ని యూనియన్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి పి ఉమాశంకర్‌ చేసిన ప్రకటనలో బాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పూనుకున్నట్టు సమాచారం. ఇంధన శాఖలో దేశ వ్యాప్తవంగా 6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. 12వ పంచవర్ష ప్రణాళికలో పెద్ద మొత్తంలో ఉద్యోగ ఖాళీలను పూరించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో రాష్ట్ర ఇంధన శాఖలో మరిన్ని ఉద్యోగాలను భర్తీచేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
ఆర్టీసీలోనూ భారీగా నియామకాలు
త్వరలో నోటిఫికేషన్‌
ఆర్టీసీ మరో సారి భారీ స్ధాయిలో సిబ్బంది నియామకాలకు సిద్దపడింది. కొత్తగా 4 వేల బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిన పాలక మండలి సిబ్బంది సమస్యపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే 12 వేల మంది డ్రైవర్‌, కండక్టర్లను నియమించింది. మరో మూడు వేల మంది వరకు కాంట్రాక్టు పద్దతిలో డ్రైవర్‌, కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. గ్యారేజీల్లో సిబ్బంది నియామకాలు లేక పోవడంతో సాంకేతిక పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సమీప భవిష్యత్‌లో ఆరు వేల మెకానిక్‌లను, 500 మంది క్లరికల్‌ సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. బస్సుల సంఖ్యను పెంచుకోవడం, అందుకు అనుగుణంగా సిబ్బంది నియామకాలు జరపడం కోసం ఇప్పటికే ప్రభుత్వం నుండి ఆర్టీసీ యాజమాన్యం ఆమోదం పొందింది.

అహ్మద్‌పటేల్‌తో కెసిఆర్‌ చర్చలు?

తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక మండలి ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రతి పాదనకు అంగీకరించారా? అనే అంశం చర్చనీయాంశమైంది. ఈ మధ్య కెసిఆర్‌ పత్రికల వారికి దూరంగా ఉంటూ నివాసం నుండే చర్చల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మూడురోజులపాటు మెదక్‌ జిల్లాలో సొంత వ్యవ సాయ క్షేత్రంలో ఎవరికీ అందుబాటులో లేకుండా గడపడంతో పాటు అక్కడి నుండే ఫోన్‌ ద్వారా కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టుగా సమాచారం. తెరాస సీనియర్‌ నాయకుడు హరీష్‌రావు మాత్రం కాంగ్రెస్‌ అధిష్ఠానం తెరాసకు ఎటువంటి ఫోన్‌ చేయలేదని, సంప్రదింపులు జరపలేదని, తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. రాజకీయ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా తెలంగాణాపై కేంద్ర నిర్ణయం ప్రకటించాకే స్పందిస్తామని, కెసిఆర్‌కు ఢిల్లిd నుంచి ఎటువంటి ఫోన్‌ రాలేదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి గుర్ఖాలాండ్‌, బోడో తరహాలో ఒక స్వయం ప్రతిపత్తి గల కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, ఈ కౌన్సిల్‌కు మాజీ పిసిసి చీఫ్‌ డి.శ్రీనివాస్‌ను చైర్మన్‌గా నియమించనున్నట్టు వార్తలొచ్చాయి. ఢిల్లిd వచ్చిన సందర్భంలో డిఎస్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కూడా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణలను ఢిల్లిdకి పిలిపించడంలో తెలంగాణాపై నిర్ణయం ప్రకటించేందుకేనా అన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ కూడా తెలంగాణాపై కేంద్ర నిర్ణయాన్ని ప్రకటించే సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్యానించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణ కూడా తెలంగాణాపై నిర్ణయం తీసుకున్నాకే ఉంటుందని ప్రకటించడం గమనార్హం. ఢిల్లిdస్థాయిలో పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కెసిఆర్‌ మౌనముద్ర వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్‌ జైలు నుండి విడుదలై యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ను శనివారం కెసిఆర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియా ఎంత ప్రయత్నించినా ఆయన కనీసం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణాపై కాంగ్రెస్‌ అధిష్ఠానం కెసిఆర్‌తో మాట్లాడిందనే వార్తలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందనే కారణంగానే ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయినట్లు పలువురు అనుమానిస్తున్నారు. ప్రత్యేక మండలిని కేంద్రం ప్రకటిస్తే దానిపై తనపై విమర్శలు వస్తాయన్న ఉద్దేశ్యంతో ఆయన ఈ విధంగా ప్రవర్తించి ఉండవచ్చునని తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఈ పరిస్థితుల్లో చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని, ఇప్పటికే బిఎస్పీ అధినేత్రి మాయావతి, ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని శాసనసభలో తీర్మానం చేసిన నేపథ్యం వంటి కారణాల వల్ల తెలంగాణాకు తాత్కాలిక పరిష్కారంగా ప్రత్యేక మండలిని ఏర్పాటు చేస్తామంటూ అహ్మద్‌ పటేల్‌ కెసిఆర్‌ ముందు ప్రతిపాదించినట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికలు 2014లో జరగనున్నందున రెండేళ్ళలో ప్రత్యేక మండలి వల్ల అభివృద్ధి చెందకపోతే ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా అహ్మద్‌ పటేల్‌ ఈ సందర్భంగా కెసిఆర్‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేసిందని, మెజారిటీ అభిప్రాయం మేరకే స్వయం ప్రతిపత్తి గల ఒక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చామని, ఇందుకు సహకరించాలని కూడా కెసిఆర్‌కు అహ్మద్‌పటేల్‌ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులన్నీ గమనిస్తున్న కెసిఆర్‌ అహ్మద్‌పటేల్‌ ప్రతిపాదనకు కొంత సానుకూలంగా స్పందించినట్టు సమా చారం. ప్రస్తుతం ఉద్యమం రాజకీయ జెఎసి నాయకత్వంలో జరుగుతుండడం, మరోవైపు గద్దర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, తెలంగాణ తెలుగుదేశం ఫోరం ఎవరికి తోచిన రీతిలో వారు ఉద్యమిస్తుండడంతో కెసిఆర్‌ కూడా ఎటూ తేల్చుకోలేక పోతున్నారనే వాదనలు వినవస్తున్నాయి. కెసిఆర్‌ కేంద్ర ప్రతిపాదనకు అంగీకరిస్తే రాజకీయ జెఎసి ప్రజాసంఘాలు, తెలంగాణ ఫోరంలు వ్యతిరేకించి ఉద్యమబాట పడితే తెరాస రాజకీయ భవిష్యత్తు డోలాయ మానంలో పడుతుందని కూడా కెసిఆర్‌ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్లే కెసిఆర్‌ రహస్యంగా మూడు రోజుల పాటు వ్యవసాయ క్షేత్రంలో గడిపినట్లు తెలుస్తోంది.

తెలంగాణ వాదం అంతంత మాత్రమే

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, జగన్‌ వర్గ ఎమ్మెల్యేలపై తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు ఢిల్లిd వెళ్ళిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి తెలంగాణ అంశంపై ఓ సమగ్ర నివేదికను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అందజేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నివేదికలో కీలకమైన అంశాలు చోటుచేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గతంలోని పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉందని, విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యమకారులు తమ దైనందిన కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లో కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే తెలంగాణ సెంటిమెంట్‌ ఉందని, ఆరు జిల్లాల్లో ఏమాత్రం సెంటిమెంట్‌ లేదని ముఖ్యమంత్రి కిరణ్‌ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరిపితే కాంగ్రెస్‌ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని నివేదికలో చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణ వాదం ఎంతో బలంగా ఉన్న నాలుగు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే ఉద్యమకారులు రోజుకు ఏదో ఒక పోరాటం చేస్తూ తమ వాదం బలపడే విధంగా ముందుకు వెళుతున్నారని, అన్ని నియోజకవర్గాల్లో వాదం అంతగా లేదని పేర్కొన్నారు. మెదక్‌ జిల్లాలో సిద్ధిపేట, దొమ్మాట, మెదక్‌ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లోనే తెలంగాణ వాదం ఉందని, జిల్లాలో మరెక్కడా తెలంగాణ కోసం పోరాడుతున్న వారు లేరని అందులో వివరించారు. నిజామాబాద్‌ జిల్లాలో కూడా నాలుగైదు నియోజకవర్గాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉందని చెప్పారు. బోధన్‌, బాల్కొండ, బాన్స్‌వాడ నియోజకవర్గాల్లో సెటిలర్లు బలంగా ఉన్నారని, బాన్స్‌వాడ, నిజామాబాద్‌ రూరల్‌లో తెలంగాణ సెంటిమెంట్‌ బలంగా వీస్తోందని చెప్పారు. సింగరేణి బెల్టులో సెటిలర్లు అధికంగా ఉండడం వల్ల తెలంగాణ ప్రభావం పెద్దగా లేదని అందులో పేర్కొన్నారు.
కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో తెలంగాణ సాధనకు ఉధృతంగా పోరాటాలు జరుగుతున్నాయని, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతుండడంతో గతంలో లాగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమాలు చేయడం లేదని అందులో ముఖ్యమంత్రి వివరించారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లాల్లో తెలంగాణ వాదం అంతంత మాత్రంగానే ఉందన్నారు. అయితే తెలంగాణపై మాత్రం పార్టీ అధినాయకత్వం సత్వరమే ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, ఏదో ఒక విషయాన్ని ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సోనియాను ప్రత్యేకంగా అభ్యర్థించారు. సోనియాతో జరిగిన చర్చల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న కార్యకలాపాలు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనకు చేపట్టిన కార్యక్రమాలను సోనియా అడిగి తెలుసు కున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని పార్టీలు యత్ని స్తున్నాయని, అభివృద్ధిలో తెలంగాణతో పాటు రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాలు వెనకబడి ఉన్నాయని, వీటిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించి మారుమూల ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. సీమాంధ్రలో జరిగిన అభివృద్ధి, తెలంగాణ ఉన్న అభి వృద్ధిని పోలిస్తే తెలంగాణలోనే అంతగా అభివృద్ధి జరగ లేదని, అయితే ఇతర ప్రాంతాలతో సమానంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం భారీస్థాయిలో నిధులను మంజూరు చేయవలసిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.
రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు కోస్తాలోని ప్రకాశం, ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా అభివృద్ధిలో వెనకబడి పోయాయని, ఈ జిల్లాల అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి దశల వారీగా అభివృద్ధికి పాటుపడితే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని అందులో పేర్కొ న్నారు. ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక మండళ్ళను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై సోనియా ముఖ్యమంత్రి కిరణ్‌ను ఆరా తీసినట్టు సమాచారం. తెలంగాణపై మరోసారి అన్ని రాజకీయ పక్షాలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని, అప్పటి వరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని సోనియా ముఖ్యమంత్రిని కోరినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి సోనియాకు ఇచ్చిన రహస్య నివేదికపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ ససేమిరా అన్నారు. తాను అధినాయకత్వంతో చర్చించిన అంశాలను మీడియాకు చెప్పడం సబబు కాదని దాటవేశారు.

కురులకు రంగుల హంగులు

ఒకప్పుడు కేవలం తెల్ల జుట్టును నల్లగా చేసుకునేందుకు హెయిర్‌కలర్స్‌ అన్న భావన నుండి...
ఫ్యాషన్‌ ప్రపంచంలో `వచ్చిన అనేక మార్పులకు తగ్గట్టు అనేక రంగులొచ్చాయి.
ఇవి ఆకర్షణీయ కేశాలకు సరికొత్త అందాలు ఇవ్వటంతో
పాతికేళ్ల పడచులే కాదు... పండు ముసలమ్మలు సైతం నేడు రంగులేసుకుంటున్నారు...
తద్వారా మరింత ఆనందాలను పొందేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
కేవలం ముఖం మాత్రమే కాదు... కేశ సౌందర్యానికి కూడా ప్రాముఖ్యత ఇస్తు....తమ అందాలను మరింత అకట్టుకునేలా రూపొం దిం చుకుంటున్నారు నేటి తరం అమ్మయిలు.
కేశాలంకరణలో భాగంగా నేడు అనేక రకాల వస్తువులు మార్కె ట్‌లోకి వచ్చేసాయి. అందునా... అనేక రకాల రంగుల్ల్లొ కేశాలను అలంకరించు కోవటం పెద్ద ఫ్యాషన్‌గా మారి పోయింది. జుట్టు అందాలను మరింతగా మెరిసేలా చేసేందుకు ఈ రంగులు ఉప యుక్తంగా ఉంటున్నాయన్నది... హెయిర్‌కలరింగ్‌తో పెరుగు తున్న వయసును ఏమాతం కనిపించకుండా చూసుకోవచ్చన్న ఆనందం నేడు ఎందరిలోనో కనిపిస్తోంది.
కురులకు కొత్త అందాలు ఇవ్వటంలో నేడు రంగులు కీలక భూమిక పోషిస్తున్నాయనటం వాస్తవం. నలుపుతో పాటు గోల్డెన్‌, మెెరూన్‌, పర్సుల్‌, చెర్రీ, హనీ బ్రౌన్‌, బ్లాక్‌ బ్రౌన్‌, బ్రౌన్‌తో పాటు అనేక రంగులు నేడు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.
సమాజంలో భిన్నంగా కనిపించాలన్న తపన ఉన్న మహిళలు చాలామంది ఈ రంగులను వినియోగించి కొత్త అందాలనే కాదు... ఆనందాలను పొందుతున్నారన్నది నిజం. భిన్నంగా కనిపించేలా చేయటమే కాకుండా... వయసుని దాచేయటంతో రంగులు అద్భుతంగా పనిచేస్తున్నాయని నేటి తరం సైతం అంగీకరిస్తున్న సత్యం.
సెమీ పర్మినెంట్‌ కలరింగ్‌ :
సెమీ పర్మినెంట్‌ కలరింగ్‌లో లభ్యమయ్యే వివిధ రంగుల్లో అమ్మోనియా శాతం తక్కువగా ఉంటుంది. దీంతో ఈ రంగులు ఎక్కువ కాలం కేశాలని పట్టి ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు మార్చుకునే అవకాశం ఉండదు.
హైలెట్స్‌ కలరింగ్‌ :
హైలెట్స్‌ కలరింగ్‌లోనూ వివిధ రంగులు సహజత్వానికి దగ్గర చేసేలా వేసుకోవాలి. లేదంటే ఇబ్బందిగా కనిపిస్తుంది. సహజ సిద్దం గా కనిపించే రంగులని కేశాలకు వేసుకున్న తరువాత జుట్టును పాయలుగా తీసుకుని వేరే రంగుల్ని వేసుకొంటే... భిన్నంగా కనిపి స్తారు. ఈ హైలెట్‌ కలరింగ్‌కి ఇప్పుడు చాలా ప్రాధాన్యత కనిపి స్తోంది.
తాత్కాలిక రంగులే బెటర్‌ :
నిెర్జీవ కేశాలకు అందంగా కనిపించేందుకు వాడే రంగులు శాశ్వ త రంగుల కన్నా తాత్కాలిక రంగుల కే ప్రాధాన్యత ఇవ్వటం మంచి దని చెప్తున్నారు. చర్మ వ్యాధి నిపుణులు. బ్యుటీషియన్లు.


రంగులు ఒక్కో సారి పడక పోతే అలెర్జీలు, అర్జీమాలు వచ్చే అవకాశం ఉందని ... అంతే కాక కురుల మొదళ్లలోకి వెళ్లి కురుల సహజ రంగుల్ని నిర్వీర్యం చేస్తాయని...ఓ వేళ రంగులు వాడాల్సి వస్తే... ముందు ఖచ్చి తం గా నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తాత్కాలికంగా ఉండే రంగులను వాడుకోవటం వల్ల ఎప్పటి కప్పుడు కేశాలను శుభ్రపరచుకుని... అవసరమైనప్పుడు వేరే రంగు వేసుకుని..నిత్యం ఫ్రెష్‌గా కనిపించడం ఒకటైతే... సహజత్వానికి తగిన రంగుల్ని ఎంపిక చేసుకోవటం కూడా ప్రధానమే..
రంగుల ఎంపికలు ఎలా?
శరీరానికి సరిపోయే విధంగా కేశాలంకరణ ఉంటేనేఅందం. అందుకు తగ్గట్టుగా రంగుల ఎంపిక జరగక పోతే... అందవిహీనంగా మిమ్మల్ని కనిపించేలా చేస్తాయి. అంతే కాదు. మీ ముక్కు తీరు, ముఖ ఆకారం, కూడా రంగులని ఎంపిక చేసుకునేందుకు ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ కవళికలకు తగ్గ హెయిర్‌ స్టైల్‌ చేసుకుంటేనే అందరి కన్నా భిన్నంగా కనిపించే అవకాశాలుంటాయని బ్యుటీషియన్లు చెప్తున్నారు. రంగులు వేసుకునే ముందు నిపుణుల సలహా సూచనలు పాటించడం మంచిదని... లేదంటే లేనిపోని అవాంతరాలు వచ్చిపడి... జుట్టు ఊడిపోయే ఆస్కారం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

గుర్తుంచుకోండి...
సహజత్వానికి దగ్గరగా ఉండాలని భావించే వారు... అందుకు తగ్గట్టుగా కలరింగ్‌ చేసుకునే ప్ర్‌క్రియ ప్రారంభించాలి. ఇందుకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం....
రంగులు తరచు మార్చాలనుకునే వారు నిత్యం జుట్టు పొడిగా ఉండేలా చేసుకోవటం ఎంత ముఖ్యమో... వాడుతున్న రంగులు మీకు పడుతున్నాయా? లేదా? అన్నది గమనించడం కూడా అంతే ముఖ్యం.
ఇష్టానుసారం రంగులు మారుస్తూ... కొత ్తదనాన్ని ఆస్వాదిం చడం ఎవరికీ అభ్యంతరం లేకపోయినా... జుట్టు ఊడిపోయే అవకా శాలుంటే అందుకు తగ్గ చర్యలు నిపుణుల పర్యవేక్షణలో తీసుకోంటూ జాగ్రత్త పడాలి.వీలైనంత వరకూ అనవసర ప్రయోగాలకు దూరంగా ఉండటమే మంచిది.
తలపై గాయాలు గానీ, కురుపులు గానీ ఉన్న ప్పుడు రంగులు వేసుకునేందుకు దూరంగా ఉండటం మంచిది. లేదంటే... గాయాల ద్వారా... కలర్స్‌ కెమికల్స్‌ శరీరంలోకి చేరి వేరే సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.
హెన్నా పెడుతూ వస్తున్నవారు ఎప్పటికీ ఇంకా జుట్టు నల్లబడ లేదని అర్ధంతరంగా రంగులు వేసేందుకు ప్రయత్నిస్తే... జుట్టు రాలే అవకాశాలు బోలెడు ఉన్నాయి. కనుక హెన్నా పెట్టడం ఆపేసి.. కనీసం నాలుగు నెలల తరువాతనే ఆ కేశాలకు రంగులు అద్దటం శ్రేయ స్కరం., అలాగే రంగులు వాడుతున్న వాడుతున్న వారు హెన్నా వాడితే ఉపయోగం ఉండదు.
రంగులు వేసుకునే ముందు... వీలైనం తవరకు కేశాలను దగ్గరగా కట్‌ చేయించుకుని వేసుకుంటే మంచిది. ముఖ్యంగా మహిళలు కురుల చివర్లు చిట్లిపోయి కనిపిస్తుంటాయి... ఇలాంటి సమయంలో రంగులు వేస్తే కేశాలు అందవిహీనంగా తయారవుతాయి. అందుకు తగ్గట్టుగా ట్రిమ్మింగ్‌ చేసుకోండి. అందువల్ల నష్టాలను ముందుగానే నివారించుకోవచ్చు.
రంగులు వేసుకునే వారు వీలైనంత ఎక్కువగా నీడలోనే ఆరేలా చూస్తే మంచిది. ఇప్పుడు మార్కెట్‌లో నిమిషాల్లో ఆరిపోయే రంగులు చాలా వచ్చేసాయి కనుక ఎలక్ట్రీకల్‌ డ్రై మిషన్ల పని చాలా వరకు తగ్గిందనే చెప్పాలి.
రంగులు వేసుకునన్న వారు ముఖ్యుంగా ఏదో ఒక ష్యాంపూని వేడేయటం వల్ల రంగులపై ప్రభావం చూపి తొందరగా అవి వదిలేసే ప్రమాదం ఉంది.
అలాగే మీరు మీ కురులపై రకరకాల ప్రయోగాలు చేస్తే.. ఊడి పోగలవ్‌ జాగ్రత్త. రసాయనాల కారణంగా వెంట్రుకలు బిగుసుకు పోయే ప్రమాదం ఎక్కువగా ఉండటమే కాకుండా పొడిగా మారి... రాలటం ప్రారంభిస్తాయి.
అందువల్ల కండిషర్‌లు, షాంపూలు కలరింగ్‌లకోసం ప్రత్యేకంగా తయారు చేసినవి మాత్రమే వాడాల్సి ఉంటుంది. కరింగ్‌ వేసుకున్న రోజున వర్షంలో తడవటం, ఈతకు వెళ్లడం కూడా మీ కేశాలకు శ్రేయస్కరం కాదు.
ఎండలో తిరగటం వల్ల కూడా కేశాలకు, అవి వాడిన రంగులకు ప్రమాదాలు తెస్తుంది. సూర్య కాంతిలోని అతినీలలోహిత కిరణాలు కేశాలపై అధిక ప్రభావం చూపి వాటిని నిర్జీవం చేస్తాయి. ఈ క్రమంలో హెయిర్‌ కలరింగ్‌ వేసుకున్న తొలి రోజుల్లో కాస్త్త గుడ్డని జుట్టుకి కట్టుకుని తిరిగితే మంచిది.
జుట్టు తత్వాన్ని బట్టి వారానికి రెండు సార్లయినా తలంటు స్నానం చేస్తే... చుండ్రు తదితరాలకు దూరంగా ఉండొచ్చు. సగటున ప్రతిరోజు 100 వరకు వెంట్రుకలు రాలటం సహజమైనదేనని... అంత మాత్రాన అందోళన చెందాల్సిన అవసరమేలేదని... అంతకు మించి పాయలు పాయలుగా తలని దువ్వుతున్నా... రంగులు వేసుకున్న ప్పుడు జుట్టు చేతిలోకి వచ్చేస్తే... ఖచ్చితంగా నిపుణులను సంప్రదించాలి

లాఫింగ్‌ బుధ్ధ

ప్రస్తుతం మార్కెట్‌లోకి అడుగుపెడితే... దాదాపు ప్రతిషాపులోనూ...
ప్రయాణించేందుకు ఏ టాక్సీనో పిలిపించుకుని కారెక్కితేనో... చాలా ఇళ్ల షోకేసుల్లో... టీపాయ్‌పైనా.. ఆఫీసుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ ఓ లావుపాటి వ్యక్తి గుండ్రని తలతో...
పెద్ద బానపొట్టతో... నిత్యసంతోషంతో నవ్వులు చిందిస్తూ... చూడగానే మనకి కూడా
నవ్వు తెప్పించేలా ఉండే ఆకారంతో ఓ బొమ్మ కనిపిస్తోంది. ఇదే లాఫింగ్‌ బుద్ధ.
భారతావనిలో గత రెం డు దశాబ్ధాలుగా లాఫిం గ్‌ బుద్ద ఎంతో ప్రాచూర్యం పొందాడన్నది వాస్త్తవం. నేడు ఎక్కడ చూసినా... కనిపిస్తున్న ఈ బొమ్మకి పూజాదులు చేయక పోయినా... సుఖశాంతుల్ని, సిరి సంపదల్ని కురిపి స్తుందని ఫెంగ్‌షూయ్‌ నిపుణులు చెప్తుండటంతో దాదాపు ప్రతి ఒక్కరికీ దీనిపై గురి బాగానే కుది రింది. ఇంతకీ ఏ ఇంతకీ లాఫింగ్‌ బుద్ద ఎవరు? అనే విషయాన్ని చూస్తే...
లాఫింగ్‌ బుధ్ధ ఎవరంటే...
ఫెంగ్‌ఘాయ్‌ వస్తువులలో అత్యంత ప్రాధాన్యత దక్కించు కున్న వాటిలో లాఫింగ్‌ బుద్ధ ఒకటి. హిందూ దేవుళ్లలో ధనరాశులనిచ్చేది ధనలక్ష్మిగా పేర్కొంటూ ఆ మహాలక్ష్మి చిత్రాన్ని మన ఇళ్లలో పెట్టుకుని ఎలా పూజిస్తామా... బౌద్ధ మతంలో తమకు విజయాలను, ఐశ్వర్యాలను అందించేదిగా భావించి ప్రత్యేకంగా లాఫింగ్‌ బుద్దని పూజిస్తారు.
భారతావనిలో పుట్టిన బౌద్ధ మతం మన దేశం కన్నా విదేశాలలోనే ఎక్కువ ప్రాచూర్యం సంపా దిం చుకుంది. చైనా, జపాన్‌, ధాయిలాండ్‌ ఇలా అనేక దేశాలలోలాఫింగ్‌ బుద్దుడిపై అనేక రకాల ఆసక్తికరమైన కధలు కూడా ప్రచారంలో ఉన్నా యి. సాక్షాత్తు ఆ బుద్దభగవానుడే యావత్‌ మాన వాళి పడుతున్న కష్టాలను కన్నీళ్లను చూసి అనేక మందిని ఓదార్చాడని... అంతటి సహనం, ఓర్పు, దయ అన్నీ కేవలం బుద్ధుడికి మాత్రమే సొంతమ ని... ఆ క్రమంలోనే ఆయనే లాఫింగ్‌ బుద్ధగా అవతరించాడని ఓ కధ ప్రచారంలో ఉంది.
పూ తాయ్‌ బుద్ద్ద్ధ
లాఫింగ్‌బుద్ధాకి మరో పేరుగా చైనీయులు పిలుచు కునే పేరు హూతీ. దాదాపు వేయ్యి ఏళ్ల క్రితం చైనానికి లియాంగ్‌ వంశస్తులు పాలిస్తున్న రోజు ల్లో బుద్ధుడు తమ దేశంలో నివశించాడని... అప్ప ట్లో ఆతన్నిహూతీ అని కూడా పిలచేవారని కొంద రు చెప్తారు. అయితే ఆ కాలంలోనే సన్యాసి జీవి తాన్ని గడుపుతూన్న బుద్ధుడు పెద్ద బాన పొట్ట తో...నిత్యం నవ్వుతూ... తన దగ్గరకు వచ్చిన వారికి కావాల్సిన వస్తువుల ను తన చేతిలో ఉండే గొనె సంచి నుండి తీసి ఇస్తూ.. పిల్లలని అమితం గా ఇష్టపడుతూ.. అందరితో పూ తాయ్‌గా పిలి పించుకునేవాడన్న కధనం మరొకటి ప్రచా రంలో ఉంది. అయితే బౌద్ధ బిక్షువైన లాఫింగ్‌ బుద్ద్ద అసలు పేరు హోట్టే అని.. కాలక్రమంలో ఈ పేరు పూ తాయ్‌గా మారిందని చెప్తారు. చైనాలో పుట్టిన ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో తిరుగుతూ...అందరి బౌద్దబిక్షువులవలే ఓ భుజాన జోలె, చేతిన బిక్షాపాత్రతో కనిపించేవాడని ఆపద ల్లో ఉన్నవారు ఎలాంటి వారైనా సాయమందించే తత్వం ఆది నుండి ఏర్పరుచుకున్న హోట్టే పిల్ల లంటే అమితంగా ఇష్టపడుతూ... వారి తో ఆనందంగా ఉండే వాడని... పిల్లల కోసమే కాకుండా పెద్దలకు కూడా తిను బండారాలను తన జోలె నుండి తీసి ఇచ్చేవాడని చెప్తారు. అసలు ఈ లాఫిం గ్‌ బుద్ద చేతిలోనిది బిక్షాపాత్ర కానే కాదని.. అక్షయ పాత్ర అని దాని ద్వారానే అనేక విధాలుగా అందరినీ ఈ బుద్ధుడు ఆదుకునేవాడని అప్పటి నుండి కోరిన కోర్కెలు తీర్చేవాడిగా పేరు సంపాదించుకోవ ట మే కాకుండా...ఎలాంటి కష్టమెచ్చినా నవ్వుతూ ఎదుర్కొనాలని ప్రచారంచేస్తూ..తానునిత్యం నవ్వు తూ కనిపించేవాడని..ఆక్రమంలోనే లాఫింగ్‌ బుద్ధ గా హొట్టో బహుళ ప్రచారం పొందాడని మరో కధనం ప్రచారంలో ఉంది. ఆపదలో ఆదు కునే ఈ బౌద్ద బిక్షువుని హ్యాపీ బుద్దగా బుదాయి, మైత్రేయి, కైసీ, ఇలా అనేక పేర్లతో బౌద్దులు పిలుస్తారు.
మైత్రేయి
తమ ఏడుగురు అదృష్ట దేవతలలో లాఫింగ్‌ బుద్ధ ఒకడని జపనీయులు నమ్ముతారు. సమ స్త మానవాళికి మంచి చేసేందుకు... ఈ భూమిపై పుట్టిన వ్య్యక్తిగా బుద్ధుడిని మైత్రేయిగా పేర్కొంటారు. మనదేశం లో పుట్టిన ఈ గౌతమ బుద్ధుడు గురించి రాసిన అనేక గ్రంధాలలో బుద్ధుడిని మైత్రేయిగా కూడా పేర్కొంటారు. బోధి సత్త్వూకుడిగా పేరున్న బుద్ధు ని సంస్కృతం రచన ల్లో మైత్రేయిగా పేర్కొ నటం గమనార్హ
మని... మైత్రేయి అంటే భవిష్య బుద్ధుడిగా కూడా కొందరు చరి త్రకారులు పేర్కొంటారు. ఈ భవిష్య బుద్దుడు యావత్‌ జనుల భవిష్యత్‌ ఆనంద సాగరంలో మునిగి తేలాలని కోరుకుం టాడని... అందువల్లే నిత్యం తాను నవ్వుతూ అందరి నీ నవ్విస్తూ ఉండే మైత్రేయి విగ్రహాన్ని ఇళ్లలో పెట్టుకుంటే సుఖశాంతులు, సిరి సంపదలు వర్ధిల్లుతాయని వారి నమ్మకం.
సంజకాయ్‌
ధాయ్‌లాండ్‌లో ప్రచారంలో ఉన్న కధ ఇది. మగాళ్లు సైతం మైమరిచి పోయేంత అందంతో ఉండే సంజకాయ్‌ అనే వ్యక్తిని ఆడ పిల్లగా ఉంటే ఈ పాటికి పెళ్లాడే వాళ్లమని ఆట పట్టిస్తూ ఉండే వాళ్లని... దీంతో ఆతను తన రూపాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుని శరీరాన్ని భారీగా మార్చుకున్నా డని అనంతర కాలంలో ఆతను బౌద్ధమత ప్రచారకుడిగా... ఆపై బౌద్ద్ధ బిక్షువుగా మారి చిరు నవ్వులు చిందిస్తూ... అందరికీ సాయమందిస్తూ.. బుద్ధుని కృపకు పాత్రుడై ఆతనిచ్చిన అక్షయ పాత్ర సాయంలో అందరి కష్టాలు తీర్చినట్లు ఈ కధ సారాంశం.
ఎక్కడ ఉంచాలి....
అయితే లాఫింగ్‌ బుద్ధని ఇష్టాను సారం ఎక్కడ పడితే అక్కడ పెట్ట కూడదని ఫెంగ్‌ షూయ్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆఫీసుల్లోను, వాణిజ్య ప్రాంతాలలో వీలైనంత వరకు రిసప్షన్‌లలోను, బిజినెస్‌ కౌంటర్లలో పెడితే ఫలితాలుంటాయి. అలాగే విద్యార్ధులు తాము చదువుకునే టేబుల్‌పై ఉంచితే విద్యాసమపార్జన బాగా జరుగుతుందని, ఇళ్లలో అయితే టివి రూం, కామన్‌ హాల్‌లలో వీటిని పెట్టాలి మినహా బాత్‌ రూంలలో, డైనింగ్‌ హాళ్లలో, డ్రస్సింగ్‌ రూంలలో పెట్టకూడదని... అలాగే ఈ విగ్రహాన్ని ఎట్టి పరిస్ధితిలోనూ కింద పెట్టవల్ల అనర్ధాలు జరిగే ప్రమాదం ఉందని... హెచ్చరిస్తున్నారు.
ఆఫీసులో, ఇళ్లలో ఎక్కడైనా సరే ద్వార బంధా నికి దగ్గర్లో, కానీ ఎదురుగా గానీ సరైన స్ధలాన్ని నిర్ణయించి భూమి కనీసం అడుగున్నర ఎత్తులొ నైనా ఉంచితే నిత్య సంతోషం అక్కడ తాండవి స్తుందని చెప్తారు.
రూపాలనేకం...
లాఫింగ్‌ బుద్ద వివిధ రూపాల్లో లభ్యమవు తున్నాయి. బౌల్‌ని ఆకాశం వైపు చూపిస్తూ అనం త సంపదను అందుకునే ఉండేదానిని... దయా మయ హృదయంతో చిరునవ్వులు చిందిస్తూ... ఉండే బొమ్మ ఉంచిన చోట సకల సంపదలు వస్తాయని... ఫెంగ్‌ షూయ్‌ నిపుణులు చెప్తారు. అలాగే కుండలోని బంగారు నాణాలతో... భుజం పై సంచీ వేసుకుని నవ్వుతూ కనిపించే లాఫింగ్‌ బుద్ధ ఓ బంగారు తిన్నెపై కూర్చొని.. ఏదో ప్రయాణానికి సిద్దమవుతున్న వాడిలా ఉంటాడ ని.. ఈ ప్రయాణం ఆధ్యాత్మికత వైపని.. ఆతని భుజంపై ఉండే గోతంలో ఉండే సకల భాండా గారం మనిషిలోని అంతర్గత భావాలకు... చేతి లోని విసన కర్ర అవగాహన కల్పించే ఆయుధ చిహ్నాలుగా పేర్కొంటారు. ఈ బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే సౌభాగ్యాలకు, సంతోషాలకు కొదివే ఉండదని... ఫెంగ్‌ షూయ్‌ నిపుణులు చెప్తారు.
ఏది ఏమైనా మన భారతావనితో సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ప్రజలు కోరిన కోర్కె లు తీర్చే ఇష్టదైవంగా లాఫింగ్‌ బుద్ధాని మార్చు కుంటున్నారన్నది వాస్త్తవం.
రోజూ ఇంట్లోంచి బైటకు వెళ్లే సమయంలో ఆతని పొట్టపై రాసి మొక్కుకుని వెళ్తే అనుకున్న కార్యం ఆనందంగా పూర్తవుతుందన్న నమ్మకం బహుళ ప్రచారంలో ఉంది. వీలైనంత పెద్దది కొనుక్కుని అలంకార వస్తువుగా కూడా దీరిని వాడవచ్చని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు.