3, నవంబర్ 2010, బుధవారం

చిరుత పులి ఆడియో ఫంక్షన్ లో గౌరీ మంజిల్





గృహ రుణాలపై వడ్డీ వడ్డన

స్వల్పకాలిక రుణ వితరణ, స్వీకరణను ఆర్‌బిఐ మరోసారి పెంచింది. దీంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ వడ్డనకు సన్నద్ధమవుతున్నా యి. గృహ రుణాలకు సంబంధించిన నిబంధనలను కూడా ఆర్‌బిఐ కఠినతరం చేసింది. ఇంటి విలువలో 80 శాతం కంటే మించి రుణాలు ఇవ్వరాదని బ్యాంకులను కోరింది.

గృహ రుణాల మంజూరులో ఖాతాదారులను ఆకర్షించడం కోసం మార్కెట్‌ రేటు కన్నా తక్కువ వడ్డీకి పలు బ్యాంకులు రుణాలు అందివ్వ డంపై ఆర్‌బిఐ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి వాణిజ్య బ్యాంకులు ఈ రుణాలపై 2 శాతం రిజర్వు నిధిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. సేవింగ్స్‌ రేటుపై పరిమితి ఎత్తివేయడానికి సంబంధించి డిసెంబర్‌ నాటికి ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేస్తామని ఆర్‌బిఐ తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జిడిపి అభివృద్ధి రేటు 8.5 శాతంగానే ఉంటుందని ఆర్‌బిఐ భావిస్తోంది.

ఎన్నికల బరిలోకి క్రికెట్ యోధులు

కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) ఎన్నికల్లో భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్లు జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్‌లు పోటీ చేయనున్నారు. ఈనెల 21వ తేదీన జరిగే ఈ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నట్టు వెంకటేష్ ప్రసాద్ తెలిపారు. అయితే, రాహుల్ ద్రావిడ్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయరని, కేవలం పరిపాలనా వ్యవహారాల్లో మాత్రం సూచనలు ఇస్తూ పాలు పంచుకుంటారని తెలిపారు.

గత సెప్టెంబరు నుంతి జాకీయ క్రికెట్ అకాడెమీ ఛైర్మన్‌గా కుంబ్లే .. మ్యాచ్ రెఫరీగా శ్రీనాథ్ కొనసాగుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీలలో ఒకటైన చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుకు వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్ కోచ్‌గా ... రంజీ ... అండర్-17 జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

మోకాటిలోతు నీళ్లులో శ్రీవారి ఆలయం

తిరుమలలో బుధవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. మోకాటిలోతు నీళ్లు రావడంతో ఆలయంలో భక్తుల రాకపోకలు ఆగాయి. వెంటనే అధికారులు రెండు అగ్రిమాపక దళ వాహనాలను నీటిని తోడారు. నిల్వఉన్న నీళ్లు కాస్త తగ్గడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆలయంలోని తూములు మూతపడటంతో తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.





ఆంధ్రజ్యోతి సహకారంతో

జగన్ గ్యాంగ్ కి పదవులపైనే శ్రద్ధ ... వైఎస్ పై లేదా ?

అన్నదాత వెన్నులో వణుకు

ఊరంతా నీరు.. పొలాలే చెరువులుగా మారాయి..రోడ్లన్నీ కాల్వలయ్యాయి..లక్షలాది రూపాయల వ్యవసాయ మదుపులన్నీ నీట మునిగాయి... వందలు కాలు వేల ఎకరాలు పంట నాశనమయ్యింది..నాలుగు రోజులుగా కుండపోత వర్షం అన్నదాత కన్నీటి వానలో తడిసి ముద్దవుతున్నాడు.

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఈశా న్య రుతుపవనాల ప్రభావంతో అన్నదాత వెన్నులో వణుకు పుట్టించింది. చేతికి అందే సమయంలో వరి చేలు పూర్తిగా నాశనమైంది. ప్రకృతి కటాక్షంతో అనుకున్న అంచనాలకు మించి ఫలసాయం వ చ్చిందన్న ఆనందం పడుతున్న కొద్ది సమయానికే అదే ప్రకృతి కరాళనృత్యానికి పంటలన్నీ నాశనమయ్యాయి.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పంట నష్టాల అంచనాలపై కమిటీని ఏర్పాటు చేయడంతో ఈ నెల ఆరో తేదీ నుంచి కమిటీ పర్యటించనున్నది. అన్నదాతల ఆక్రందన తెలుసుకుని పార్టీ అధినేతకు నివేదికలు ఇవ్వనున్నారు. ఈ మేరకు మంగళవారం అధినేత చంద్రబాబునాయుడు తెలుగుతమ్ముళ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

తిరుమలలో పంచాంగ గణిత సదస్సు

హిందూ పండుగలు, పర్వదినాల తిథులకు సంబంధించి ఎదురవుతున్న మీమాంసలను అధిగమించేందుకు వీలుగా డిసెంబర్ 24వ తేదీ నుండి మూడు రోజుల పాటు తిరుమలలో పంచాంగ గణిత సదస్సును నిర్వహించేందుకు టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం నిర్ణయించింది.

అథారిటీ చైర్మన్ జె సత్యనారాయణ మాట్లాడుతూ హిందూ పండుగలు, పర్వదినాలు ఏ రోజు నిర్వహించాలనే విషయమై మీమాంస తలెత్తడం పరిపాటిగా మారిందన్నారు. దీని వల్లే పంచాంగ గణిత సదస్సును నిర్వహించేందుకు టిటిడి సంకల్పించింది అని చెప్పారాయన

రవాణా రంగం 'టోల్' తీస్తున్నారు

దేశవ్యాప్తంగా రవాణా రంగానికి పెనుభారంగా మారిన టోల్‌టాక్స్ సమస్యకు ఈ నెల 25వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం పరిష్కార మార్గం చూపకపోతే డిసెంబర్ 5న అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా లారీల నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఎఐఎంటిసి (ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్) అధ్యక్షుడు జిఆర్ షణ్ముగప్ప ప్రకటించారు

టోల్‌టాక్స్ సమస్య పరిష్కారంపై గతంలో కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో స్పష్టమైన హామీ వచ్చినప్పటికీ దాన్ని కార్యరూపంలోకి తేలేదని విమర్శించారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో తాము నిరవధిక సమ్మెకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న 259 టోల్‌ప్లాజాల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తున్నా 777 కొత్త టోల్‌ప్లాజాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారని భారం మోపడం తగదన్నారు.

ఒబామా భారత్ పర్యటన సీపీఐ నిరసనలు

అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ పర్యటనకు నిరసనగా ఈనెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు.

బుధవారం ఆయన మాట్లాడుతూ ఆర్‌బీఐ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేంతవరకూ ఎవరూ రుణాలు చెల్లించవద్దన్నారు. రాహుల్‌గాంధీతో ముఖ్యమంత్రి రోశయ్య సమావేశమై సూక్ష్మరుణాల సంస్థలపై చర్చించాలని నారాయణ డిమాండ్ చేశారు.

మోపిదేవి వ్యాఖ్యలుకప్పదాటు కే

హైకోర్టు బెంచి రాత్రికి రాత్రి ఇవ్వలేమని న్యాయశాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణ చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని.. పైగా పెద్దమనుష్యుల ఒప్పందం తెచ్చి చూపిస్తే పరిశీలిస్తాననడం ఆయన కప్పదాటు శైలిని తెలియజేస్తుందని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చలసాని అజయ్‌కుమార్ విమర్శించారు.దాదాపు 40 ఏళ్లుగా న్యాయవాదులు బెంచి ఏర్పాటుపై పోరాడుతూనే ఉన్నారన్న విషయం మంత్రికి గుర్తులేకపోవడం శోచనీయమన్నారు..

నిజంగా న్యాయవాదుల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే కేబినెట్‌లో పెట్టి రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా బెంచి ఏర్పాటు చేయవచ్చునన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, న్యాయశాఖా మంత్రులు న్యాయ నిపుణులతో చర్చించి ఈ విషయంపై పరిశీలించాలని చలసాని డిమాండ్ చేశారు

తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే తొలి ఓటు నాదే

పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లును సమర్థిస్తూ మొట్టమొదటి ఓటు తానే వేస్తానని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు..

తెలంగాణ విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ దొంగనాటకమడుతున్నాయని, ఈ విషయంలో తెలుగుదేశంపార్టీ స్పష్టమైన వైఖరితో నిలబడిందని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో తెలంగాణ కోసం తాము చేసిన ఆందోళనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంట్‌లో అనేక బిల్లులపై చర్చించామని, ప్రజా వ్యతిరేక బిల్లులను వ్యతిరేకించామని తెలిపారు. అయితే పార్లమెంట్‌లో పూర్తి బలం కల్గిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు మాత్రం ప్రవేశపెట్టడం లేదని విమర్శించారు.

ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగిన గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వటం లేదని, అవినీతి అక్రమాలు విఫరీతంగా పెరిగిపోయాయని దుయ్యబట్టారు.

జలుబుకి మందు రెడీ


మనిషి.. కేన్సర్, హెచ్‌ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఎంతోకొంతమేరకు చికిత్స కూడా కల్పించగలిగాడు. కానీ జలుబుకు మా త్రం చికిత్స కల్పించలేకపోయాడు. అయితే ఈ కొరత కూడా తీరబోతోందంటున్నారు కేంబ్రిడ్జ్ వర్సిటీ శాస్తవ్రేత్తలు. జలుబుకు విరుగుడుగా రోగ నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేసే కేంద్రాలను గుర్తించామంటున్నారు.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాంటీబాడీలు కణాల బయటే వైరస్‌లపై దాడి చేసి లోపలికి చొచ్చుకుపోకుండా ఆపుతాయని ఇప్పటివరకూ భావిస్తూండగా ఇది తప్పని తాజా పరిశోధనల్లో తేలింది. యాంటీబాడీలు కణాల్లోపలకూ వెళుతున్నాయని, ట్రిమ్21 అనే ప్రొటీన్ విడుదలకు కారణమవుతున్నాయని తెలిసింది. ఈ ఫలితాల ఆధారంగా ట్రిమ్21 ప్రొటీన్ మోతాదును పెంచే మందులను తయారు చేశారు.

సాక్షి నుంచి సేకరణ

పదవులకోసం ఢిల్లీకి నేతల పరుగులు...అల్లాడుతున్న ప్రజలు

రాష్ట్రంలో ప్రస్తుత ప్రకృతి వైపరీత్యాల వల్ల అల్లాడుతున్న ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఎక్కడా కానరావడంలేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. సహాయక చర్యలు చేపట్టకుండా పదవులకోసం ఢిల్లీకి పరుగులు పెట్టడాన్ని చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం లేదేమోనన్న అనుమానం కలుగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

1996లో ఇలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి ప్రాంతంలో తాత్కాలిక సెక్రెటేరియేట్ ఏర్పాటుచేసి ప్రజలను, రైతులను ఆదుకున్నారని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారన్నారని.. గుర్తుచేశారు.

చంద్రబాబు పిలుపుమేరకు ప్రతి గ్రామంలో నష్టం అంచనాలను పరిశీలించి క్షేత్రస్థాయి నివేదికను పార్టీ తరఫున ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.

బాలయ్య తాజా చిత్రం పేరు 'రౌద్రం' ?

నవదీప్ గ్యాంగ్ కి 25 వేల జరిమానా

ప్రయోజనం లేకున్నా, సెంటిమెంట్‌కే ప్రాధాన్యత

కోట్ల విలువైన టపాకాసులను ప్రజలు రెండు రోజుల్లో కాల్చివేస్తారని అధికారి క అంచనా. నయాపైసా ప్రయోజనం లేకున్నా, సెంటిమెంట్‌కే ప్రాధాన్యతని స్తూ జనాల ప్రాణాలకు అధికారులు భద్రత లేకుండా చేస్తున్నారు.

అటు తమిళనాడులో ఇటు రాష్ట్రంలోనూ ఏటా టపాసుల తయారీ కేంద్రాల్లో జరిగే ప్రమాదాల కారణంగా ఎందరో వికలాం గులవుతున్నారు. అయినా సరే చేతులు కాలాకే ఆకులు పట్టుకుందామన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఏ నిబంధన పాటించకపోయినా, ప్రాణాలకు ముప్పు తెచ్చే టపాసుల వ్యాపారాల నిర్వహణకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇది ఎంతటి ప్రమాదకరమైన నిర్ణయమో ఘటన జరిగితే గానీ తెలుసుకోలేని మామూళ్ల మత్తులో ఆయా శాఖల అధికారులు మునిగిపోయారు.

అందరి ఇళ్లలో వెలుగులు నింపాల్సిన దీపావళి సంబరాలు ఏటా పదుల సంఖ్యలో కుటుంబాల్లో విషాదం నింపుతూనే ఉంది. క్షణికానందం కోసం, సంప్రదాయాన్నే వారసత్వంగా భావించే ప్రతి కుటుంబం వేలాది రూపాయలను మట్టిపాలు చేస్తున్నారు. ఎంత చెప్పినా చెవికెక్కని టపాసుల వ్యాపారం క్ర మబద్ధీకరణ కోసం ప్రభుత్వం కఠినమైన నిబంధనలు విధించింది. ఎట్టి పరిస్థితుల్లో చిన్న ప్రమాదం కూడా జరగకూడదనే కృతనిశ్చయంతో ఈ వ్యాపారాన్ని ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్‌లో అనుసంధానం చేసింది. అక్రమంగా కలిగి ఉన్నా, అనుమతి లేకుండా స్టాక్ లేకున్నా నేరమేనని నిబంధనలు చెబుతున్నాయి.

ఎన్‌వోసీకి వెనుక ఎన్నో నిబంధనల అమలు దాగిఉంటుంది. జనవాసాలు ఉండకూడదు, పేలుడు పదార్థాలతో ప్రమాదానికి గురైతే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలి. భవనం ఆ ప్రాంతంలో కనిపించకూడదు. ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా పరిగణలోకి తీసుకోవాలి. ఎ లాంటి అనుమతులు లేని గోదాముల విషయంలో కఠినంగా వ్యవహరించా లి. అంతే వీరితో పాటు అగ్నిమాపక శా ఖ ఎన్‌వోసీ చాలా పకడ్బందీగా ఇవ్వాలి. ఏ ప్రమాదం వచ్చినా అగ్ని నిరోధించేందుకు చుట్టుపక్కల ఖాళీ ప్రదేశం, వాహనం రావడానికి దారి, నిరంతరంగా నీటి సరఫరా నిబంధనల్లో ప్రధానమైనవి...కనీసం క్వింటాలు పైబడి సరుకులు అమ్మే వ్యాపారి లక్ష లీటర్ల నీటి కెపాసిటీగల ట్యాంకులు గానీ ఇతర ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

నిర్ధేషించిన స్థలం మినహా మరేది కూడా చిన్న దుకాణం కూడా ఉండకూడదని చట్టం సూచిస్తోంది...అయితే ఏ ప్రాంతాల్లో సరుకు నిలువచేస్తున్నారో, విక్రయాలకు అనువైన నిబంధనలు ఏవి పాటిస్తున్నారనేది అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. దీంతో బేషరతుగా వాటిని తిరస్కరించాల్సి ఉన్నా కొన్నింటికీ క్లియరెన్స్ ఇచ్చారనేది వాస్తవం. విక్రయాల విషయంలోనూ చిల్లర వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడే కౌంటర్‌లు ప్రారంభించి విక్రయాలు సాగిస్తున్నా రు. విక్రయాల సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా అధికారులు చేసి న తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు చర్యలకు ఉపక్రమించడం లేదని విమర్శలు బాహాటంగానే వస్తున్నాయి.