12, ఫిబ్రవరి 2011, శనివారం

దమ్ముంటె తెలంగాణా ఇవ్వని 'కేంద్రం'పై అవిశ్వాసం పెట్టు

13 మంది సభ్యులతో అవిశ్వాసం పెడతానని విర్రవీగుతున్న కెసిఆర్ కి తెలంగాణపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణాకి మద్దతుగా నిలుస్తానని చెప్పిన ఎన్డియే మద్దతుతో కేంద్ర సర్కార్ పై అవిశ్వాసం పెట్టాలని టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సవాల్ విసిరారు

శనివారం ఆయన నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ... తెలంగాణా పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవటమే కేసేఅర్ కి తెలిసిన విద్యా... కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడు నిలదీయకుండా. ప్రజల్లో అభద్రతా సృష్టించి... ఇక్కడే కాలం వెల్లదీస్తున్నాడని.. తానీ తెలంగాణా బిల్లు పార్లమెంట్లో పెట్టె యత్నం ఎందుకు చేయడని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు దమ్ముంటే టూజీ స్పెక్టం, కామన్ హెల్త్, ఆదర్శ్ కుంభకోణాలకు పాల్పడ్డ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలన్నారు. తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని కేసీఆర్ ప్రకటించడం హాస్యాస్పందగా ఉందని కేసీఆర్ చెబితే రాజకీయ పాఠాలు నేర్చుకునే స్థితిలో టీడీపీ లేదన్నారు సోమిరెడ్డి .

నా కధకి కాపీ..నాగార్జున ‘గగనం’

ఈమధ్య విడుదలైన చాలా సినిమాలు కధల విషయంలో వివాదాలలో చుటుటకోవటం అనివార్యంగా మారిపోయింది. అదుర్స్‌, రోబో ఇలా వరుసపెట్టి కధల వివాదం ఎదుర్కొన్నవే.. తాజాగా విడుదలైన నాగార్జున గగనం కూడా ఇదే కోవలో పయనించింది. ...

ప్రముఖ రచయిత్రి రజనీ శకుంతల మీడియాలో మాట్లాడుతూ...‘గగనం’ చిత్రం కథ తనదేనని..హైజాకింగ్ నేపథ్యంలో తాను రాసిన ఒక నవలను కొద్దిపాటి మార్పులు చేసి చిత్రాన్ని రూపొందించారని, కొన్ని మాటలను యథాతథంగా వాడుకున్నారని ఆరోపించారు.ఇందుకు చిత్ర దర్శకుడు, హీరో నాగార్జున, నిర్మాత దిల్‌ రాజులపై తాను ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

చిరంజీవి క్షమాపణలు చెప్పాల్సిందే

చిరంజీవి కాంగ్రెసులో చేరడాన్ని తాము స్వాగతిస్తున్నామని... అయితే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతి జరిగిందని..ఆరోపణలు చేయడంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తిగా చిరంజీవి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రాక వల్ల కాంగ్రెసుకు తెలంగాణలో ఏ మాత్రం ప్రయోజనం ఉండదని, సీమాంధ్రలో కూడా ప్రయోజనం అంతంత మాత్రమేనని..కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.

రేపు జూ. ఎన్టీఆర్ లగ్నపత్రిక వేడుక

రేపటి నుంచి నందమూరి వారి కుటుంబ సభ్యులు పెండ్లిపిలుపుకి సన్నద్ధం కానున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ వివాహ ముహూర్తాన్ని రేపు ఉదయం ఖరారు చేయలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన లగ్నపత్రిక వేడుకను వధువు ప్రణతి నివాసంలో జరిపేందుకు అన్ని ఏరాట్లు పూర్తి చేసారు.

రేపు ఉదయం 8:05 గంటలకు వధూవరుల కుటుంబ సభ్యులు లగ్నపత్రికను మార్పిడి చేసుకోనున్నారని నందమూరి కుటుంబ సభ్యుల సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఖరారు చేసినట్లు వినిపిస్తోంది..ఇప్పటికే మే 5న జూ. ఎన్టీఆర్ వివాహం ఖరారు చేసినట్లు వినిపిస్తోంది..

తెలంగాణా వచ్చాక తెరాస ఉండదు...

డెడ్‌లైన్లు, రాజీనామాలతో కెసిఆర్ సాధించిందేమీ లేదని...ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కి మరోమారు భంగపాటు పాటు తప్పదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు

శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణపై నిర్ణయం జరగాల్సింది ఢిల్లీలోనే..విఅని విషయం తెలిసినా అక్కడ ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఇక్కడ మాట్లాడటం ఏంటని నిలదీసారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెరాస ఉండదని జోస్యం చెప్పారు.

మరోవైపు జగన్‌ వ్యవహారంపై స్పందిస్తూ... ప్రజలు వచ్చినంత మాత్రాన ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటేనని..సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సభలకు కూడా పెద్ద యెత్తున ప్రజలు వచ్చారని, కానీ తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడలేదని...జగన్ పరిస్థితి కూడా అంతేనని..వ్యాఖ్యానించారు విహెచ్‌.

28న చిరంజీవి విలీన ‘వివరణ’ సభ

ఈ నెల 28వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చిరంజీవి భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులోని విలీనం చేయాలని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలకు తెలియ చేయాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి నిర్ణయించినట్లు సమాచారం.

ఇటీవల హైదరాబాదులో అభిమానులతో సమావేశమైన చిరంజీవి తన అభిమానులను, కార్యకర్తలను విలీనానికి సుముఖం చేసే ఉద్దేశ్యంతో ఈ సభను నిర్వహించాలని నిర్ణయం పలువురు ఇష్టపడక పోయినా.. కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటానని సోనియా తనకిచ్చిన భరోసాని చెప్పడంమే కాకుండా ప్రజలకు మనం ఎందుకిలా చేయాల్సి వచ్చిందో... విపక్షం దిగజారుడు రాజకీయాలు చేసున్న వివరాలను వెల్లడించాల్సిన తరుణం ఇదేనని.. ఈ సభకు భారీ ఎత్తున అన్ని జిల్లాల నుంచి అభిమానులని తరలించాలని చిరంజీవి సూచించి నట్లు సమాచారం

పదవి కోసమే జగన్ బైటకి.. చిరంజీవి లోనికి ...

పదవి కోసమే వైయస్ జగన్ కాంగ్రెసు నుంచి వెళ్లిపోయారని, పదవి కోసమే చిరంజీవి కాంగ్రెసులోకి వచ్చారని..తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శనివారం ఆయన చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. వైయస్ జగన్ 83 కోట్ల రూపాయల ముందస్తు పన్ను చెల్లించారని, ఆ లెక్కన చూసుకొన్నా జగన్ ఆదాయం 250 కోట్ల రూపాయల దాకా ఉంటుందని, అయితే ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాదన్న విషయం తెలిసినా... ఆయన అక్రమ సంపాదనను క్రమబద్దీకరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.

నల్లధనాన్ని సక్రమ డబ్బుగా మార్చడానికి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉదాసీన వైకరి అవలంబిస్తున్నారని..ఇది దేశభద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆయన అన్నారు.

17 నుంచి సహాయ నిరాకరణ చేసి తీరతాం

ఈనెల 17 నుంచి తెలంగాణ సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వంమధ్యాహ్నం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, దామోదర రాజనర్శింహల ఆధ్వర్యంలో సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో శనివారం చర్చలు జరిపారు.

తెలంగాణ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోలేదని, కేంద్ర సర్కారు ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని... సహాయ నిరాకరణ ఉద్యమానికి దూరంగా ఉండాలని మంత్రులు చేసిన సూచనని ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించలేదు. ఇది తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు జరుగుతుందని,తప్పనిసరిగా పాల్గొనవలసిందేనని స్పష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయ నిరాకరణ తప్పదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.

బాబు... మా ‘అవిశ్వాసానికి” మద్దతివ్వు : తెరాస

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిలు ఇద్దరు కుమ్మక్కై జనంతో ఆటలాడుకుం టున్నారని తెరాస శాసనసభ్యుడు కె. తారక రామారావు ఆరోపించారు.

శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. తాము చేసున్న ఆరోపణ లు నిజం కాదని నిరూపించాలనుకుంటే... తమ పార్టీ ప్రవేశ పెట్టనున్న అవిశ్వాసానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ ఊరూరు తిరుగుతున్న చంద్రబాబు తానే అవిశ్వాసానికి ఎందుకు సిద్దపడటంలేదో.. ప్రజలకు జవాబివ్వాలని... లేక దమ్ముంటే.. తమ పార్టీ ప్రవేశ పెట్టే తీర్మానానికి మద్దతు ఇచ్చి తెలంగాణాపై తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్‌ చేసారు కెటిఆర్‌.