17, ఏప్రిల్ 2011, ఆదివారం
రెండెకరాల నుంచి రెండు వేల కోట్ల కి ఎలా ఎదిగారో...
రెండెకరాల చంద్రబాబు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తికి ఎలా ఎదిగారో... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెపితే తాము టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆస్తులపై విచారణ జరపడానికి ఉ సిద్ధమేనని సవాల్ విసిరారు టిఆర్ఎస్ నేత తారక రామారావు. ఆది వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంత మామకే పంగనామాలు పెట్టిన చంద్రబాబు డిసెంబరు 9 ప్రకటన తరువాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడన్నారు. టిడిపిలో ఎన్టీఆర్ కుటుంబం తప్ప ముఖ్య నాయకులు ఎవరు లేరని.. అల్లాంటి పార్టీ నేతలు తమ పార్టీని కుటుంబ పార్టీ అంటూ విమర్శలు చేయటం విద్దురంగా ఉందన్నారు. తెలంగాణ కోరుకునే ప్రజలందరూ టిఆర్ఎస్ సభ్యులేన న్న విషయాన్నీ తెలుగుదేశం నేతలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
నేరగాళ్ళ సరసన త్వరలో జగన్
హసన్ అలీ, మధు కోడ వంటి నేరగాళ్ళ సరసన త్వరలో జగన్ కూడా చేరుతాడని కడప పార్ల మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీం ద్రారెడ్డి చెప్పా రు. జగన్ తన అఫిడివి ట్‌లో తెలిపిన విధంగా ఆయన ఆస్తులు లేవని, వేలాది కోట్ల రూపాయల ను ఆస్తులని పేర్కొనలేదని, వాటిని వెల్లడిం చా లని డీఎల్ డిమాండ్ చేశారు. తం డ్రి సీఎం పదవి అడ్డు పెట్టుకొని కోట్లా ది రూపాయల అక్రమ సంపాదనకు, ఆర్థిక నేరాలకు ఒడి గట్టాడని విమర్శ లు గుప్పించారు. తం డ్రి సీఎం పదవి అడ్డు పెట్టుకొని కోట్లా ది రూపాయల అక్రమ సంపాదనకు, ఆర్థిక నేరాలకు ఒడి గట్టాడని విమర్శ లు గుప్పించారు.
ఆ ముగ్గురిపై వేటుకు రంగం సిద్దం
గత కొంత కాలం గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, బాలనాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అనర్హత అంశంపై సాగాదీత ధోరణి కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎట్టకేలకు న్యాయనిపుణుల సలహాల తో వారిపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. పార్టీ గుడ్‌బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన పోచారం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న బాలనాగిరెడ్డి, ప్రసన్న కుమార్‌రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ డిప్యూటి స్పీకర్‌ను కోరిన విషయం తెలిసిందే...శాసనసభ స్పీకర్ గా ఇన్‌చార్జి హోదాలో ఉపసభాపతే విధులను నిర్వర్తిస్తున్నందున సభ్యుల అనర్హత వేటును పరిశీలించే అధికారంపై సందిగ్ధత నెలకొ నడంతో ఆదివారం న్యాయ నిపుణుల సహలను సేకరించారు ఆయన. కాగా కాంగ్రెస్స్ పార్టీ కి చెందిన నలుగురుపై వేటుకు రంగం సిద్దం చేసుకోన్నందునే.. తనపై విమర్శలు రాకుండా ఉండేందుకే ఉపసభాపతి.. వ్యూహాత్మకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు వినిపిస్తోంది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)