26, ఫిబ్రవరి 2011, శనివారం
మెరుపు సినిమా నిలిచిపోయినట్టే ...
సునీల్ పుట్టిన రోజు ఫిబ్రవరి 28.
కొందరికి తొలి ప్రయత్నమే ఘనవిజయం తీసుకొచ్చి, రెండుమూడు విజయాలు వరసగా వచ్చి, కిక్కిచ్చేయడంతో అహం పెరిగి అది డీలా పడేట్టు చేస్తుంది. కొందరికి రెండు మూడు ప్రయత్నాలు చేసినా పని జరగక నిరాశ నిస్పృహలకు గురిచేసి ప్రాప్తం లేదు కలిసిరాదు అనే వేదాంత ధోరణితో ఏర్పరుచుకుని ఏ ప్రయత్నాలూ చేయరు. కొందరికి తొలి ప్రయత్నం ఫెయిల్ అయినా నిరుత్సాహం రాక పోవడంతో మరి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అలాటి వారిలో సునీల్ ఒకరు.
డ్యాన్సులమీద దృష్టి పెడితే, నాటకం మీద దృష్టి పెడితే కలిసిరాలేదు. తరువాత డ్యాన్స్ పోటీల్లో వరసగా గెలుపొందారు. హైదరాబాద్ వచ్చి డ్యాన్స్ స్కూల్లో కొంతకాలం డ్యాన్సు ప్రాక్టీసు చేసారు. అలాగే సినిమా చాన్సులకోసం ప్రయత్నిస్తే 'సెకండ్ హాండ్' చిత్రంలో చాన్స్ వచ్చాక ఆ సినిమా ఆగిపోయింది. భీమవరం పరిసర ప్రజల ఇష్టదైవమైన మావుళ్ళమ్మ భక్తుడుగా ఆమె అనుగ్రహంచి చిరునవ్వు నవ్వగా 'చిరునవ్వు' చిత్రం వచ్చింది. ఆ తరువాత 'నువ్వే కావాలి'లో నటించారు. 'నువ్వే కావాలి' ముందు విడుదల కావడంతో గుర్తింపు వచ్చింది. వరసగా ఆరు చిత్రాలు హిట్ కావడంతో హాస్యనటుడుగా స్థిరపడిపోయారు. తన పెర్సనాల్టిdకి విలన్ పాత్రలు వస్తాయని అనుకుంటే కామెడీ వేషాలు వచ్చి కామెడీ ఆర్టిస్ట్ అయిపోయారు.
డ్యాన్సులు తెలిసి బాగా చేయగలిగే కామెడీ ఆర్టిస్ట్ సునీల్- అని రామ్‌గోపాల్ వర్మ నుంచి ప్రశంసలు పొందారు. అందాల రాముడులో హీరో అయిన సునీల్‌ని రాజమౌళి 'మర్యాద రామన్న' గా చూపారు. రెండూ హిట్ కావడంతో వర్మ దృష్టిలో పడి 'కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు' చిత్రంలో దర్శకుడు అయ్యారు. హీరోగా ఒక చిత్రానికి మరో చిత్రానికి వచ్చిన గ్యాప్‌లో కామెడీ ఆర్టిస్ట్ గానే కొనసాగుతున్నా, హీరోగానే చేస్తాడట ఇక కామెడీ పాత్రలకు ఫుల్‌స్టాప్ అనే వదంతులూ వ్యాపించాయి. సునీల్ పుట్టిన రోజు ఫిబ్రవరి 28.
ఇద్దరూ డాక్టర్ల యాక్షన్ సినిమా
ఫిమేల్ ఉన్నికృష్ణన్
మలయాళంలో 'ఫిమేల్ ఉన్నికృష్ణన్' టైటిల్‌తో పూర్తి హాస్యభరితంగా రూపొందిస్తున్నారు. డూప్లికేట్ చిత్రంతో హీరోగా రంగప్రవేశం చేసిన సూరజ్ వెంజర్ మూడు ఇందులో టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. ఇతడు మహిళ పాత్ర పోషించడం లేదు అయినా ఆ టైటిల్ పెట్టారు.
కొంతమంది మగవాళ్ళ కంఠస్వరం ఆడవాళ్ళు మాట్లాడుతున్నట్టు విచిత్రంగా వుంటుంది. అదే ఈ చిత్రానికి ముఖ్యమైన పాయింట్. ఆడవాళ్ళ కంఠస్వరంలా వుండటంతో అతడు మగవాడే అయినా ఫిమేల్ ఉన్ని కృష్ణన్‌గా పాప్యులర్ అయ్యాడు తన వూరు జనానికి. ఎందుకంటే అతను మాట్లాడుతూంటే ఆ స్వరం అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. దీన్ని బేస్ చేసుకుని కథ అల్లారు దర్శకుడు మధు.
సలీమ్ కుమార్, జగతి, బిజూ కుట్టన్, కళాభవన్ ప్రజోడ్ మున్నగు హాస్య నటులు కూడా నటించడంతో ప్రతి సీన్ కామెడీని పండిస్తుందంటున్నారు దర్శకుడు కె.బి.మధు.
మహాలక్ష్మి అనే యువతి హీరోయిన్‌గా, షాజి సుకుమారన్ సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. తుళుజి, వేగమాన్, మున్నార్ పరిసరాల్లో సినాలి ఫిలిమ్స్ పతాకాన నిర్మాత షిజాయ్ వర్గీస్ షూటింగ్ పూర్తి చేసారు.
సోనియా మౌనరాగం ... మన్మోహన్ ప్రేక్షకపాత్ర ...
ప్రతి అంశం రాజకీయం చేసి, ఎన్నికల్లో ప్రయోజనాలు ఎలా పొందాలని ఎత్తుగడలేసే అన్ని పార్టీల నేతలు, సహజంగా తెలంగాణ లాంటి కీలక అంశాన్ని నిజాయితీగా పరిష్కరిస్తామని అనుకోలేము. అందుకే, దశాబ్దాల తరబడి కాలయాపన చేసి ఎవరు అధికారంలో ఉన్నా, సమస్యను మరింత సంక్లిష్టం చేయడమే గాని ఇంతవరకు పరిష్కరించలేదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు మాత్రం, వీరోచిత పోరాటాలకైనా, ప్రకటనలకైనా సిద్ధం అన్నట్లు వ్యవహరిస్తారు. దాదాపు అన్ని పార్టీలు, వారి మిత్రపక్షాలు తెలంగాణ సమస్యను నాన్చటంలో ప్రధాన భూమిక పోషించాయి. అందుకే, నేడు తెలంగాణ అగ్నిదావానలంలా అన్ని పార్టీలకు అంటుకుని ఉంది. రాష్ట్రం మొత్తం (తెలంగాణతర ప్రాంతాలు కూడా) ఈ తెలంగాణ సెగతో ఉడికిపోతోంది. దశాబ్దాల పోరాటం సరే, గత ఏడాదిగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ ప్రకంపనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రులు మారినా, ప్రభుత్వాలు అచేతనంగా ఉన్నాయి. విద్యావ్యవస్థ కుప్పకూలింది. ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తుండగా ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తమైంది. సగటు పౌరులు, అన్ని ప్రాంతాల వారు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రత్యేకించి, రోడ్డు రవాణా పరిస్థితులు అతలాకుతలమైనాయి. అయినా, ఆమాత్యులు మాత్రం తమ పాలన సాఫీగా జరుగుతున్న భ్రమల్లో ఉన్నారు. సహజంగా, సగటు ప్రజలు బేజారైనట్టి భావన వుంది. ఎంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే అంత మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రమొచ్చినా ఫర్వాలేదని సీమాంధ్ర ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే, సుహృద్భావ వాతావరణంలో రాష్ట్ర విభజన జరగాలే కాని, అంతర్యుద్ధ పరిస్థితులు తెచ్చి పెట్టవద్దని రాజకీయ పార్టీలను కోరుతున్నారు.
మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వానిదైంది. 2004 ఎన్నికలనాడు తెరాసతో పొత్తు పెట్టుకుని, తెలంగాణకు సానుకూలంగా చెప్పి, అధికారంలోకి వచ్చి, మొండిచెయ్యి చూపాలనుకుంటే, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ వారికి చావుతప్పి కన్నులొట్టపోయిన పరిస్థితి ఎదురైంది. వైఎస్‌ఆర్ మరణంతో, దాదాపు చావు పరిస్థితే కాంగ్రెస్ ఎదుర్కోవలసి వస్తుంది. కనీసం తెలంగాణను తక్షణమే పరిష్కరించినా నేడా పద్మవ్యూహ పరిస్థితి ఉండకపోయేది కాదు. మొదట్లోనే కెసిఆర్‌ను విశ్వాసంలోకి తీసుకొని, రాష్ట్ర సాధనకొక కాలపరిమితిని ప్రకటించి ఉండాల్సింది. డిసెంబర్ 9, 2009 నాటి చిదంబరం ప్రకటననుసారం తెలంగాణ ప్రక్రియ కొనసాగవలసింది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు స్పష్టంగా ప్రకటించాల్సి వుండేది. కాలయాపన జరిగినా సరే శ్రీకృష్ణ కమిటి సిఫార్సులు పరోక్షంగానైనా తెలంగాణకు అనుకూలంగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సింది. కమిటీ సిఫార్సులు నెలలు గడిచినా ఇంకా కేంద్ర విధానం అస్పష్టంగా ఉండడం వల్ల నేడా పద్మవ్యూహం ఎదురౌతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ ప్రజలు, పార్టీల కతీతంగా ఉద్యమబాట పట్టారు. ఉధృతం చేస్తున్నారు. ఇంకెంత కాలయాపన చేస్తే, ఆ మేరకు కాంగ్రెస్ ఎలాగు నష్టపోతుంది. యావత్ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. కేవలం రెండు రోజుల తెలంగాణ బంద్‌నే చూశాము. వారం రోజుల బంద్ ప్రకటిస్తే ఏమవుతుందో ఆలోచించాలి. రాజధాని హైదరాబాద్ తెలంగాణలో ఉన్నందున, యావత్ రాష్ట్ర పరిపాలన కుంటుపడుతుంది. కనీసం తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలు కూడా దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటి ప్రభావం చివరికి తెలుగువారి మధ్య మానసిక దాడులతో పాటు, భౌతిక దాడులు జరిగే దుస్థితికి కారణమవుతుంది.
ఈ నేపథ్యంలో పరిశీలిస్తే, సత్వరమే తెలంగాణ ప్రకటనతో పాటు పార్లమెంటరీ ప్రక్రియ కొనసాగిస్తే, కాంగ్రెస్ గట్టెక్కవచ్చు. పద్మవ్యూహం నుండి బయటపడవచ్చు. కాదంటే, ప్రతిపక్ష బి.జె.పి.తో బిఎస్‌పి లాంటి ఇతర పక్షాలు, తెలంగాణాలో అనుకూలంగా తీర్మానించాయి. సభలో గట్టిగా నిలబడ్డాయి. అటువంటప్పుడు, 2జి స్పెక్ట్రం కుంభకోణంపై జెపిసిని వేయటానికి వెనుకంజవేసి ఇంతకాలం పరాభవం పాలైన కాంగ్రెస్ మాదిరిగా, తెలంగాణ విషయంలో కాలాతీతమౌతోంది. ఇటు రాష్ట్రంలో, తెలంగాణలో, బయటా కాంగ్రెస్ పరపతి దిన దినగండంగా మారుతోంది. ఈ తెలంగాణ పోరాటాలు ఇంత కంటె తీవ్రరూపం దాల్చి, కాంగ్రెస్‌ను అధోగతి పాలు చేస్తాయి. పరిస్థితి విషమిస్తే, మరో రెండేళ్ళు ఆగటానికైనా తెలంగాణ వాదులు సిద్ధపడి, బి.జె.పి. ప్రభుత్వం ఏర్పడటానికి సాయపడవచ్చు. ఆ దిశలో కెసిఆర్ తదితరులు ప్రయత్నిస్తున్న సంకేతాలొస్తున్నాయి. అటువంటప్పుడే, కాంగ్రెస్‌లో విలీనం కావాల్సిన దుస్థితి కెసిఆర్‌కి కూడదు. తెరాసనే బలోపేతం చేస్తూ, కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కెసిఆర్ చక్రం తిప్పవచ్చు. కేవలం తెలంగాణ కోసం, కాంగ్రెస్ చెప్పినట్లు నడుచుకోటానికి కెసిఆర్ సిద్ధంగా లేడిప్పుడు. కుప్పిగంతులు వేయదు. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పటానికి బి.జె.పి.తో, టిడిపితో జట్టు కట్టడానికైనా ఆయన వెనుకాడడని అర్థం చేసుకోవాలి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కెసిఆర్ వ్యూహాలను తెలంగాణ ప్రజలు సమర్థించాల్సి వస్తోంది. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రం వాయిదా పడి కెసిఆర్ రాజకీయాలు గెలుస్తాయి. కాంగ్రెస్ బదులు బి.జె.పి. అధికారంలోకి వచ్చినంత మాత్రాన తెలంగాణ వస్తుందా అనే ప్రశ్న ఎలాగున్నా, కుక్కకాటుకు చెప్పుదెబ్బ అవసరమని తెలంగాణ ప్రజలు భావిస్తారు. అందుకే ఆలస్యం వల్ల అమృతం విషమవుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి!
డా కె.విద్యాసాగర్ రెడ్డి
అమరజీవి అంకుల్ పాయ్
అంకుల్ పారు అంటేనే 'అమర్ చిత్రకథ, టింకిల్ కామిక్స' గుర్తుకొస్తాయి. అనంతపారు గురువారం నాడు అనంతలోకా లకు తరలి వెళ్లిపోయారు. ఈ చిత్రకథల రారాజు ఎందరో తమ విశిష్ట సేవలతో, గత 44 సంవత్సరాలుగా తన కథ లతో, కామిక్సతో నవ్వుల పువ్వుల్ని పండిస్తూ, దేశంలోనే కాక ప్రపంచఖ్యాతినార్జించి, ఎందరో బాలబాలికల అభిమా నాన్ని చూరగొన్నారు.
అనంతపారు వెంకటరాయ, సుశీల పారు దంపతులకు సెప్టెం బర్ 17, 1929లో కర్ణాటకలోని కర్క లలో జన్మించారు. వారు కెమిస్ట్రీ, ఫిజిక్స, కెమికల్ టెక్నాలజీ చదివినా, ప్రవృత్తి రీత్యా కామిక్స ప్రచురణలంటే ఎంతో ఇష్టమాయనకు. 1954లో 'ఎడిటింగ్ పబ్లిషింగ్' రంగంలోకి ప్రవేశించారు. అమర్ చిత్ర కథ సిరీస్‌ను 1967 లో ప్రారంభించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పుస్తక ప్రచురణ విభాగం 'ఇంక్రజాల్' పేరుతో కామిక బొమ్మల సిరీస్‌ని ప్రారంభించారు.
టింకిల్ పత్రికను 1980లో ప్రారంభించారు. అమర్ చిత్ర కథ 20 భాషలలో వెలువడింది. అంకుల్‌పారుకి పేరు తెచ్చిన టైటిల్స్ కృష్ణా, అశోక, అక్బర్, రాణిఝాన్సీ, వివేకానంద మొదలగునవి.
చారిత్రకం, జానపదం, వివిధ మతాల సంప్రదాయాలు - వాటి విశి ష్టత, జాతక కథలు, పంచతంత్ర కథలు లాంటి ఎన్నో కథలు,కథానికలు పారుకు అవార్డులు-రివార్డులు సంపాదించి పెట్టాయి. హనుమాన్, చాణక్య, అభిమన్యు గాథలు ఆయన కీర్తి ప్రతిష్టలను మరింత పెంచ డమే కాక, బాలబాలకలకు స్ఫూర్థి ప్రదాయకంగా వున్నాయి. ప్రతాప్ మల్లిక, రామ్ వయీర్‌కర్ కుంచెలు తోడవడంతో కథ లకు బొమ్మల అందాలు కలిసి వచ్చి కథలోని పాత్రలు ప్రాణం పోసుకున్నాయి.
అనంతపారు వీరుల గాథలే కాకుండా, ప్రముఖుల జీవిత చరిత్రలు అనేకం రాసారు.
ప్రముఖ చిత్రకారులు ప్రతాప్ మాలిక, సౌరెన్‌రారు, ఝప్రే ఫౌలర్, హెచ్.ఎస్. చవాన్, మధు పౌలే, చంద్రకాంత్, డి.రాణి పారు కథలకు బొమ్మలు వేయడానికి ముందుకు వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అంకుల్ పారు కథలకు ప్రాముఖ్యత ఏర్పడింది.
అనేక పుస్తకాల షాపుల్లో టింకిల్, అమర్ చిత్ర కథ పుస్తకాలు కొనుగోలుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ పాఠశాలలు, గ్రంథాలయ సంస్థలు వీటిని తెప్పించుకోవడం, అనంతపారు ప్రతిభా సంపత్తులకు తార్కాణం. అనంతపారు కర్ణాటక ప్రాంతం వారైనా, వారు వివిధ ప్రాంతాల విద్యార్థుల మనసులను దోచుకున్నారు. వారు ముంబరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నా, అనేక ప్రాంతవాసులు, వారు కథలు చెప్పే తీరు చూసి వారి వారి ప్రాంతాలకు రప్పించుకొని, సత్కార కార్యక్రమాలెన్నో నిర్వహించారు. పారు కేవలం పిల్లలకు కథలు చెప్పడమే కాకుండా వారితో సరదాగా మెలిగేవారు. వారు ఏ అంశం తీసుకున్నా, ఆ కథను తన రచనాశైలితో రక్తి కట్టించేవారనడంలో ఎంతమాత్రం సం దేహం లేదు. వారు వయసు పై బడినా తరం తరం, నిరంతరం వారిని గుర్తుంచుకునేలా రచనలు చేసేవారు. తన రచనలతో ఆబాలగోపాలాన్ని అలరించేవారు. ఈయన కలం నుంచి జాలువారిన ఎన్నో కథలు సిడీలుగా , డివిడిలుగా రూపుదిద్దుకొని మార్కెట్‌లో విస్తారంగా చోటు చేసుకున్నాయి. ఆంధ్రపాఠకులకు చందమామ,బాల మిత్రల్లా, పారు కథలు ప్రపంచ వ్యాప్తంగా చిన్నపిల్లల్ని విపరీ తంగా ఆకర్షిస్తున్నాయి.
ముంబరులోని బెస్ట్ బస్సులు అమర్ చిత్రకథలను బ స్సులపైకి ఎక్కించాయంటే ఆయన ఎంతటి ప్రతిభాశాలో అర్థం చేసుకోవచ్చు. కొం దరు పాఠశాలలోని ఇళ్ళల్లో కూడా ఇంటీరియర్ డిజైన్లుగా అమర్‌చిత్ర కథలను గోడల పైకి ఎక్కించారు.
దీన్నిబట్టి చూస్తే వారు కథలు చెప్పే విధానం, ఆబాల గోపాలాన్ని ఆశ్యర్యపరుస్తుంది. పలు పాఠశాలలు, బోధనా సంస్థలు అమర్ చిత్ర కథలను నీతిపాఠాలుగా బోధిస్తున్నాయి.
నేడు టీవీల ప్రభావంగా పుస్తకాలు కొని చదివే అలవాటు కొరవడుతోంది. అయినా, అనంత్‌పారు రాసిన పుస్తకాలకు, టింకిల్ మ్యాగజైన్లకు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు.
అంకుల్ పారు అజరామర కృషి ఫలితంగా ఆయన కలం నుంచి అనేకానేక పుస్తకాలు పిల్లల్లో చైతన్యస్ఫూర్తిని కలిగించి నీతిని బోధిస్తు న్నాయి. నేడు కృష్ణా, హనుమా త్రీడిలుగా వస్తున్నాయంటే వారి స్ఫూర్తికి, అనంతపారు ముఖ్యకారకులు.
వర్ధమాన కాలమానపరిస్థితులకనుగుణంగా, పిల్లల సైకాలజీకి తగి నట్లుగా వారి రచనలు సాగుతూ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. అనంత పారు కథలు కేవలం పిల్లలకే కాక పెద్దలకు కూడా ఆసక్తిదాయకంగా ఉండేవి. దీనికి కారణంగానే వారు కూడా పిల్లలు చదివిన తర్వాత పెద్దలు కూడా చదివేవారు.
అనంతపారు భౌతికంగా నేడు లేకున్నా, చిన్నారి హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న అమరజీవిగా ఆయన పేరు కలకాలం నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
వివాహానికీ ఉంది బీమా
భారత్‌లో గత సంవత్సరం జరిగిన వివాహ వేడుకల ఖర్చు 1.9 నుంచి 2.25 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. మీ జీవితంలో దాచి వుంచుకున్న డబ్బులో అత్యధిక భాగం పెళ్ళికి వెచ్చించాలని భావిస్తుంటే మాత్రం ఖచ్చితంగా సెక్యూరిటీని కోరుకుంటారు. మీ డబ్బకు భద్రత కల్పించేందుకు, దురదృష్టకర సంఘటనలు జరిగితే మీకు కలిగిన నష్టానికి పరిహారం అందుతుంది.
చాలా కంపెనీలు ప్రస్తుతం ఈవెంట్ ఇన్స్యూరెన్స్‌లో భాగంగా పెళ్ళిళ్లకు బీమా చేస్తున్నాయి. ఈ పాలసీ ప్రధానంగా ప్రమాదం, వివాహం రద్దు లేదా వాయిదా, పెళ్ళి మండపంలో అద్దె వస్తువులకు జరిగే నష్టంలపై కవరేజ్‌ను ఇస్తున్నాయి. ఇదే సమయంలో ఈ పాలసీలను ఎవరికి తగ్గట్టుగా వారు మలచుకోవచ్చు. ఉదాహరణకు ఫుడ్ పాయిజనింగ్ జరగడం, పవర్ ఫెయిల్యూర్, భారీ వర్షాలతో కార్యక్రమం రసాభాస కావడం తదితర రైడర్లను ఎంపిక చేసుకోవచ్చు.
దీంతో పాటు ఆభరణాల దొందతనం, సమయానికి పెళ్ళి కొడుకు లేదా పెళ్ళి కూతురు మండపానికి చేరుకోలేక పెళ్ళి వాయిదా పడడం వంటి సంఘటనలకు బీమా ఉంది. ఒకవేళ ఉగ్రవాదుల దాడి జరిగితే... అందుకూ బీమా కవరేజ్ లభిస్తుంది.
కవరేజ్‌లోకి రానివి: ఒకవేళ ఇరు వర్గాల మధ్యా మనస్పర్ధలు వచ్చి వివాహం రద్దయితే, బీమా ఉండదు. అయితే, కొన్ని సంస్థలు మాత్రం కట్నం విషయంలో తేడా వచ్చి పెళ్ళి ఆగితే బీమా అందిస్తున్నాయి. పార్టీల అజాగ్రత్తే నష్టానికి కారణమని తేలితే బీమా కంపెనీలు క్లయిమ్ చెల్లింపులకు ముందుకు రావు. చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే బీమా కంపెనీ అందించే నియమ నిబంధనలను క్షుణ్ణంగా చదివి పూర్తిగా అర్ధం చేసుకోవాలి.
ప్రీమియం ఎలా..: బజాజ్ అలయన్స్ 20 లక్షలు, 35 లక్షలు, 58 లక్షలు, 73 లక్షలు ఇలా వివిధ రకాలుగా వివాహ బీమాను అందిస్తోంది. వీటికి వరుసగా 2,252, 4,004, 6,232, 8,273 రూపాయల ప్రీమియంను (సేవా పన్ను కలుపుకొని) చెల్లించాల్సి వుంటుంది.
114 కేంద్రాల్లో 'మిరపకాయ్' అర్థశతదినోత్సవం
సంక్రాంతికి విడుదలైన రవితేజ 'మిరపకాయ్' 114 కేంద్రాల్లో 50 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుందని ఎల్లోఫ్లవర్స్ అధినేత, నిర్మాత రమేష్ పుప్పాల తెలిపారు. 'మా సంస్థ తీసిన తొలిచిత్రమే ఇంతటి విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. ఈ విజయానికి కథానాయకుడు రవితేజ, దర్శకుడు హరీష్‌శంకర్, ఇతర యూనిట్ సభ్యులు కారణం. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. త్వరలో వేడుక నిర్వహిస్తాం' అన్నారు.
'ఈ సక్సెస్ క్రేడిట్ అంతా దర్శకుడు హరీష్‌శంకర్‌కు చెందుతుంది. నిర్మాత రమేష్ నాకు మంచి స్నేహితుడు అయ్యారు ఈ విజయానికి కారణమైన అందరికీ థాంక్స్' అన్నారు రవితేజ.
'షాక్' ఫలితంతో నిరాశపడిన నాకు మళ్ళీ మిరపకాయ్ చేసే అవకాశం కల్పించారు రవితేజ, రమేష్ పుప్పాల. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అన్నారు హరీశ్‌శంకర్
అంతవరకు దోమలను కొట్టుకుంటూ బతకాల్సిందే....
ఇంట్లో దోమల వెూతతో బెంబేలెత్తుతున్నారా దోమలు కుట్ట డం తో జబ్బు పడాల్సివస్తుందని బాధపడుతున్నారా దోమలను చంపే మస్కిటోకాయిల్స్‌కోసం వందలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారా మలేరియా మహామ్మారికి భయ పడుతున్నారా అయితే మీకో శుభ వార్త...ఇకపై దోమలకు మీరు భయపడాల్సిన పనిలేదు. దోమ కాటు వల్ల ఇకపై ఎలాంటి అనా రోగ్య సమస్యలు ఉండవు. నిజం ... దోమకాటు వల్ల వచ్చే వ్యాధు లను నివా రించేలా సరికొత్త టీకా మందును అమెరికాలోని టులేన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేస్తు న్నారు.
భారతీయ శాస్త్రవేత్త నిర్భరు కుమార్ నేతృ త్వంలోనే ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. విషానికి విషమే విరుగుడు అన్న సూక్తి నిర్భరు బాగా వంట పట్టించుకున్నాడేవెూ దోమకాటుతో వ్యాపించే మలేరియాను దోమకాటుతోనే అడ్డుకోవాలని ఆయన చేస్తున్న ప్రయోగాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఆయన రూపొంది స్తున్న ఈ టీకా మందులో ఇకముందు మలేరియాను శాశ్వతంగా నిర్మూలించే వీలు కలుగుతుందట. ఈ టీకా వేసుకున్నవారిని దోమ కుట్టినపుడు ఆ యాంటీ బాడీస్ మలేరియా పరాన్నజీవి పునరు త్పత్తికి అవసరమైన ప్రోటీన్స్ ను నిర్వీర్యం చేసి మలేరియా వ్యాధి రాకుండా నియంత్రి స్తాయి. అంతవరకు దోమలను కొట్టుకుంటూ బతకాల్సిందే....
ఆమ్..ఆద్మీ..ఔర్..అమ్మో!
ప్రజలు అంటున్నది, మీడియా మొత్తుకుంటున్నది నిజమేనని ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారంనాడు లోకసేభకు సమర్పించిన 2011-12 ఆర్థిక సంవత్సరపు ఆర్థికసర్వే స్పష్టం చేసింది. మంత్రిగారు సమర్పించిన నివేదిక ప్రకారం
ఆర్థిక ప్రగతి మందగించింది
ద్రవ్యోల్బణం పెరిగిపోయింది
ఆహార ద్రవ్యోల్బణ విలయం
ద్రవ్య సరఫరా, వినిమయం వల్ల విషమ పరిస్థితులు
ప్రపంచ ఆర్థిక సంక్షోభ ఛాయల దుష్ప్రభావం
వంటి భయంకర పరిస్థితులను కళ్ళకు కట్టింది. ఇందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించకపోవడం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షో భాల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పడడం ప్రధాన కారణాలుగా అది చూపింది. దేశంలో నెలకొన్న ఈ విపత్కర పరిస్థితుల వల్ల ప్రభుత్వాలతో పాటే ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యవసర, అత్యవసర రేట్లు తారస్థాయికి చేరడంతో ప్రజలు పడుతున్న బాధలు తారస్థాయికి చేరుతున్నాయని తేల్చి చెప్పింది. ఏదో చేసేస్తున్నామని, ఎంతెంతో కష్టపడిపోతున్నామని డపðకొట్టుకుని చెపðకుం టున్న సర్కారు ప్రచారాలలో పసలేదని, అవి వాస్తవ విరుద్ధాలని ఈ నివేదిక చెప్పకనే చెప్పింది. ఈ 2011-12లో 9% అభివృద్ధి రేటు సాధించాల్సిన అవసరాన్ని నివేదిక నొక్కి చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కనుక ఈ యేడాది ఎంత కష్టపడాలనుకున్నా ఆ స్థాయిలో ప్రగతిరేటు రాదన్నది నిర్వివాదాంశం.
రాష్ట్రంలో అనిశ్చితి కి బీజేపీయే కారణం
శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలోఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై చర్చించాలిగాని, ఇలా దుర్వినియోగం చేయడం తగదని అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కోరినప్పటికీ కొన్ని పార్టీలు పనిగట్టుకుని కావాలనే సమావేశాల్ని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. శాసనసభ సమావేశాలకి ఎంత డబ్బు వృధా అవుతుందో ఆలోచించాలని, ఇదంతా ప్రజల సొమ్మేనని ఆయన గుర్తు చేశారు. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ను తప్పుబట్టడం బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అలవాటైపోయిందని, అసలు ప్రత్యేక తెలంగాణా అక్కరలేదని అద్వానీ అన్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్రంలో సమస్యలు రావడానికి, అనిశ్చితి నెలకొనడానికి కారణం బీజేపీయేనని విమర్శించారు
గవర్నర్ వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తా
ఉద్యమంలో పాల్గొనాలని కోరడం వేరు, వారిని లక్ష్యం చేసుకోవడం వేరని..తెలంగాణ జెఎసి తమ పార్టీ శాసనసభ్యులను లక్ష్యం చేసుకోవద్దని.. సీమాంధ్ర నేతలు తెలంగాణను వ్యతిరేకిస్తే తీవ్ర పరిణామాలుంటాయని, సీమాంధ్ర నాయకులు సమైక్యవాద నిర్ణయాన్ని వదిలేసి జై ఆంధ్ర నినాదాన్ని ముందుకు తేవాలని ఆయన కోరారు.
ఎమ్మెల్యే పదవికి పోచారం రాజీనామా ?
ఆయన శనివారం డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయన్నుట్లు తెలిపారు. కాగా పోచారం రాజీనామా చేస్తే తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.
ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ
మార్చి 10న 'మిలీనియం మార్చ్ టు హైదరాబాద్'
తెలంగాణా ఏర్పాటు సాగే వరకు ఉద్యోగుల సహాయ నిరాకరణ ఆగబోదని.. అందుకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు తెలంగాణా ప్రజలంతా అందించేందుకు సిద్దంగా ఉన్నారని భరోసా ఇచ్చారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగులకు స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.
జీతాలు ఇవ్వకపోతే ఊరుకునేది లేదు
వివేకాకు మద్దతిస్తాం... కానీ...
సమావేశం వివరాలు వెల్లడించేందుకు వీరు నిరాకరించినప్పటికీ.. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం విడిపోకూడదనే ఉద్దేశంతోనే తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నామని... చెప్తున్న నేతలు.. ఉప ఎన్నికల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మిపై వివేకానంద రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి కానీ, కడప పార్లమెంట్ నుండి కానీ పోటీకి దిగరాదని మెలిక పెట్టినట్లు సమాచారం.
వివేకా కాదంటే... తాము ఆయనపై పోటీ చేసేందుకు ఇప్పటికే అభ్యర్ధిని సిద్దంగా ఉంచామని జగన్ వర్గం చెప్తోంది.