6, డిసెంబర్ 2011, మంగళవారం

ఆధునికత వెంటాడినా..గాజులకే జేజేలు

హిందూ సంప్రదాయంలో గాజులకో ప్రత్యేక స్ధానం ఉంది. నిండుగా గాజులు వేసుకుని కళకళలాడుతూ ఉంటే... ఐదవ తనం పదికాలాల పాటు వర్ధిల్లుతుందన్న నమ్మకానికి తగ్గట్టుగా... కాలమెంత మారినా...
ఆధునికత ఎన్ని ఒడిదుడుకులు సృష్టిస్తున్నా... ఎప్పటికపðడు తరాలకు తగ్గ అభిరుచిని తనలో మేళవించుకుని...
అద్భుతాలొలికించేలా... ముంజేతిపై తమకో సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాయి గాజులనటంలో సందేహం లేదు.
బంగారం లాంటి లోహాలతో తయారైన గాజులకే కాదు అంతకు మించి రంగు రంగుల మట్టి గాజులనీ...
తమ దుస్తులకు తగ్గట్టు ధరించేందుకు నేటి యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది.
హిందూ సంప్రదాయాలలో ప్రత్యేక స్ధానం దక్కిం చుకున్న వస్తువులలోగాజు ఒకటి. ఐదవతనానికి ప్రతీ కగా గాజుల్ని భావించే సంస్కృతి మనదేశంలో అనా దిగా వస్తోంది. శుభాలకి సంకేతాలుగా భావించే గాజుల్ని దానం ఇస్తే...మంచి జరుగుతుందన్న నమ్మ కం ఉంది. మట్టిదైనా.బంగారానిదైనా...గాజు మంగళ కరమైనదన్న నమ్మకం పూర్వకాలం నుండి ఉంది. ఇక నేటి ఆధునిక యుగంలోనూ మహిళల అభిరుచి కి తగ్గట్టు గాజు ఈ ఫ్యాషన్‌ ప్రపంచంలోనే తన ప్రత్యేకత నిలబెట్టుకుంటోందంటే అతిశయోక్తి కాదె మో? అందుకే తరాలు మారుతున్నా.. మహిళలతో గాజులు మాత్రం ఏమాత్రం అంతరం చెందలేదన్న ది వాస్తవం. గాజులు ధరిస్తే.అందాలకు కొత్త మెరు గులు రావటమే కాదు. చేతి నరాలపై వత్తిడి పెరిగిరక్త ప్రసరణసజావుగా జరుగుతుందన్నది శాస్త్రీయ పరమైన నమ్మకం.

చిన్నతనంలోనే...
మనిషి పుట్టిన చిన్నతనంలోనే చిన్నారికి ఎలాంటి దిష్టి తగల కూడదంటూ... అడైనా, మగైనా సరే నల్లని పూసలతో చేసిన గాజులని, నల్ల గాజుల్ని చేతులకు వేయటం జరుగుతుంది. బహుశా అక్కడి నుండే మగ వారికన్నా ఆడవారికి గాజులతో ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుందనుకోవచ్చు.

క్షేమం కోసం...
మాంగల్యం పచ్చగా నిలవాలని... తమ కుటుంబ మంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మహిళలు గాజులను నోములు, వ్రతాల పేరుతో...దానంగా ఇవ్వ టం జరుగుతూ వస్తోంది. అలాగేనిశ్చయతాం బూలా లు, వివాహం, పెళ్లి పనులు ప్రారంభించే ముందు పసుపుకొట్టడం ఇలాప్రతికార్య్‌క్రమంలోనూ ముత్తయి దువలకు గాజులు ఇవ్వటం ద్వారా ఆ కుటుంబానికి మంచి జరుగుతుందన్న భావన నేటికీ ఉంది.
గాజుల గలగలలు...
అసలు పండగలు, పెళ్లి పేరెత్తితేనే... గాజుల గల గలలు లేకుండా జరగదనే చెప్పాలి. ఆయా పండ గలో, సందర్భానుసారంగా తీసే దుస్తులకు తగ్గ మ్యాచింగ్‌ గాజులు లేకుంటే ఆవస్త్ర అలంకరణ పూర్త వ్వదనే భావన నేటికీ మహిళల్లో ఉంది. అందుకే బంగారు గాజులు ఎన్ని ఉన్నా వాటి నడుమ అందా లలికిస్తూ... గలగలలాడే రంగు రంగుల మట్టిగాజు లు, లక్కగాజులు ముంజేటి మీద నాట్యం చేస్తూ... తమ హుందా తనాన్ని నిలుపుతుంటాయి. గాజుల అందాలను అలంకరించుకుని మురిసిపోని వారు. వాటి గల గలలు వింటూ మైమరచిపోని మహిళలు ఎవరైనా ఉంటారా? వీటిని ధరించేందుకు మతం, కులం, భాషా భేదాలు, ప్రాంతీయ, ధేశీయ భేదాలు అస్సలు లేవనటం సమంజసమే....
సీమంతంలో...

హిందూ సాంప్రదాయాలలో గర్భిణీ స్త్రీలకు జరిగే ప్రత్యేక కార్య క్రమం సీమంతం. చేతలు నిండుగా గాజులువేసి... పండంటి బిడ్డని ప్రసాదించమని వేడు కుంటూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అయితే ఇలా సీమంతం నిర్వహించడం వెనుక కార ణాలను. గర్భిణీగా ఉన్న స్త్రీ చేతి నరాలు చాలా వర కు బిగిం చుకుపోతాయని... ఇవి గర్భకోశం మీద కూడా ప్రభావం చూపే అవకా శాలుండటం వల్ల... గాజులు తొడగటం వల్ల చేతినరాలపై వత్తిడి పెరుగు తుందని... తద్వారా గర్భ కోశంపై సరైన వత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుందని విశ్వా సంతో మనపూర్వీకులు ఈ సీమంతం ప్రక్రియని ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెప్తారు. అనేక రంగుల గాజులని నెల లు నిండిన గర్భిణీకి శీమంతం రోజున తొడుగు తారు. ఇందులో ఓ చేతికి 21 మరో చేతికి 22 జత గాజుల్ని వేస్తారు వచ్చే పేరంటాళ్లు, బాలింతకు ఎర్రని గాజులు, పచ్చని గాజులు వేస్తే మంచి జరుగు తుంధని భావిస్తునే కొక్కేలతో ఉండే బంగారు, వెండి గాజులు ధరింప చేస్తారు. ఇలా చేయటం వల్ల ప్రసవ సమయంలో చేతులు ఉబ్బితే ఇబ్బంది లేకుండా తీసేసందుకు వీలు కలుగుతుం దని ఓ నమ్మకం.
ఆరోగ్యానికీ....
గాజులు ఆరోగ్యాన్ని ఇస్తాయంటే ఆశ్చర్యం కలుగు తోందా? కానీ ఇది వాస్తవం. గాజుల గలగలలు శరీ రానికి ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయో...మనిషికి మానసికానందం కలిగించడమే కాకుండా... మెదడు ను చురుకుదనం కలించేందుకు కూడా ఉపయోగ పడతాయని అందువల్ల వారిలో నూతనో త్సాహం గాజుల శబ్ధం విన్నప్పుడు కలుగుతుందని మరి కొందరు చెప్తారు. గాజు నాడీ మండలాన్ని నియం త్రించి రక్తపోటుబారిన పడకుండా నియంత్రిస్తుంది. అందువల్లే బి.పితో బాధపడే వారిని చేతికి రాగి, ఇత్తడి, పంచలోహాలతో చేసిన గాజు ఆకారంలో రూపొందే వాటిని ధరించమని నిపుణులు చెప్తుంటారు. అంటే అసలు గాజు రూపకల్పనలోనే మన పూర్వీ కులు వైద్యపరంగా కూడా ఎన్నో ఆలోచనలు చేసాకే రూపొందించారని తెలుస్తోంది కదా?
మనస్ధత్వం చెప్పేస్తాయి...
మగువుల మనస్ధత్వాన్ని గాజులు స్పష్టంగా చెప్పేం దుకు ముందుంటాయంటే ఆశ్చర్యం కలగకమాన దు. రెండు చేతులకీ 3,4 గాజులు వేసుకుని సింపుల్‌ గా కనిపించే మహిళ మంచి పొదుపరి అని అర్ధం. ఓ చేతికి మాత్రమే గాజులు వేసుకుని... మరో చేతికి వాచ్‌ లేదా.. బ్రాస్‌ లెడ్‌ తొడిగిన మహిళ అయితే .. ఓ వైపు సంప్రదాయానికి విలువ ఇస్తునే... మరోవైపు నవీన భావాలను ఆహ్వానించే మనస్ధత్వం ఆమెకుం దని చెప్పవచ్చట. చేతికి పరిపుష్టంగా గాజులు వేసుకున్న వారు... అం దులో రత్నాలు పొదిగినట్లు కనిపిస్తే.. అలాంటి వ్యక్తి పూర్తిగా సంప్రదాయాలను పాటించేందుకు ఇష్ట పడేతత్వం ఉన్నదని చెప్పవచ్చు. ఇక చేతికి గాజులే ధరించ కుండా అడపాదడపా నచ్చిన వాటినే గాజు లుగా ధరిస్తూ కనిపించే మగువలు పూర్తిగా ఆధునికత వైపు పరుగులు తీస్తు సంప్రదాయంని కాస్త వెనక్కి నెట్టినా పర్వాలేదన్న ధోరణి ఉన్న వారని అర్ధం చేసుకోవచ్చు.
ఆధునికత ఉట్టి పడుతూ...
మారుతున్నకాలంతో పాటు ఫ్యాషన్‌ ప్రపంచంలో పెనుమార్పులు వచ్చిన నేపధ్యంలో గాజు తన ప్రత్యే కతని నిలుపుకుంటూ నేటితరాన్ని ఆకర్షిస్తునే ఉందన టం లో సందేహంలేదు. కేవలం బంగారు, వెండిలతో తయారైనగాజుల మీదే కాకుండా లక్కతో పాటు ప్లాస్టిక్‌లతో, దంతాలతో తయారైన గాజులపై యువత మక్కువ చూపిస్తోంది. నేటితరంలో గాజులకో ప్రత్యేక ప్రాధాన్యత దక్కు తోంది. కాలమెంత మారినా.మ్యాచింగ్‌ విషయంలో యువత ఏమాత్రం రాజీపడటం లేదన్న ది వాస్తవం. అందునా డ్రస్‌కి తగ్గ గాజు లు లేకుంటే అసలు ఆడ్రస్‌ వేసుకునేం దుకు కూడా మనస్కరించని వారు చాలా మంది కనిపిస్తున్నారు. చీరకట్టిన మహిళ అందుకు తగ్గరంగులో గాజులు వేసుకో కుంటే... ఏదో కోల్పోయినట్లు భావిస్తుం ది. తన అందానికి వన్నె తేవాల్సిన చీర అందుకు తగ్గగాజులు లేనందువల్ల అంద రిలో చిన్నచూపు జరిగిందని ఖిన్ను లైన వారు చాలామంది ఉన్నారు. ఇక అనేక పూసలు, రంగు రంగుల రాళ్లుతో అనేక డిజైన్లతో గాజులు వచ్చేసాయి. ఒకప్పుడు గాజు అంటే గుండ్రంగా మాత్రమే ఉండా లన్న భావన నేడు చతురస్త్రాకారపు గాజు లు కూడా వచ్చేడంతో ఆధునికత సంప్రదాయ గాజు ల్ని ఎలా పక్కకు నెడుతోందో అర్ధం చేసుకోవచ్చు.
డ్రస్‌కి తగ్గట్టు ...
సందార్భానికి, డ్రస్‌కి తగ్గట్టు గాజులు వేసుకోంటే అందం మరింత పెరుగుతుంది. పట్టు చీరలో ఉంటే నిండుగా మ్యాచింగ్‌ గాజులు వేస్కొంటే మరింత రిచ్‌గా కనిపిస్తారు. జీన్స్‌ ధరించే వారు వెడల్పాటి గాజుల్ని ధరించాలి. సాధారణ చీరకడితే...చీర అంచు, జాకెట్‌ ని పరిగణలోకి తీసుకుని మ్యాచింగ్‌ చూసుకోవాలి. నిత్యం వాడుకకు లైట్‌ కలర్స్‌, జస్ట్‌ డీప్‌ షేడ్‌ గాజులు ధరిస్తే బాగుంటుంది. పొడుగు వేళ్లు ఉన్న వాళ్లు వెడల్పుగాజులు కనీసం నాలుగు చొప్పున, వేళ్లు పొట్టిగా, పంజా వెడల్పుగా ఉంటే లావుగా ఉండే గాజులు ధరిస్తే అందానికి బాగుం టుంది.
బంగారు గాజులు..

ఆధునిక తరంలోనే కాదు నాటితరంలోనూ బంగారు గాజులు ధరించేందుకు అంతా మక్కువ చూపిస్తుం టారు. అందమైన అమ్మాయి ముందు బంగారం ఎం త వేసినా దిగదుడుపే అన్న విషయం పక్కన పెడితే బంగారు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. వాటిని కొనుగోళ్లలో కాసింత ఒడిదుకులు ఎదురవుతున్నా అవి ఉన్నంతలో ఉన్నవారికే సొంతమనే భావన దాదాపుగా నెల కొంటోంది. దీంతో చిలకలపూడి బంగారంగా ప్రసిద్ది చెందిన రోల్డ్‌గోల్డు, వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ పేరుతో తయారవుతున్న గాజులకు ఆదరణ నానాటికి పెరుగుతూ వస్తోంది. చౌకైనధరల్లో ఇవి లభ్యం కావటంతో సామాన్యుల నుండి అనేక మంది ఇటు వైపు తొంగిచూస్తున్నారు. బంగారపు గాజుల్లో కూడా దొరకనన్ని డిజైన్లు వెరైటీలు ఇందులో లభ్యంకావటం కూడా ఓ కారణంగా చెప్ప క తప్పదు. అయితే ఎంత బంగారు గాజులు వేసు కున్న మట్టిగాజుల ముందు అవి దిగదుడుపే అని చెప్తారు.
పూర్వం మన ఇళ్ల ముందుకు వచ్చి గాజులు అమ్మే ఆసాములు ఉండే వారు. వీరే సదరు మహిళలకు గాజులు ఎక్కిస్తూ తమ జీవనాన్ని గడిపేవారు అయి తే ఇది కాలక్రమంలో ఇలా అమ్మేవారు దాదాపు గా కనుమరుగై పోయారు. వీరు మరుగున పడి పూర్తిగా గాజుల వ్యాపా రంకోసం ప్రత్యే క అంగళ్లు అందు బాటులోకివచ్చాయి. మహి ళలకు అన్ని రకాలుగా ఉండటంతో వీటికి బాగానే డిమాండ్‌ పెరుగుతోంది.
బాగ్యనగరిది ప్రత్యేకం...

హైదరాబాద్‌ గాజులకు ప్రత్యేక పేరుంది. ఇందుకు తగ్గట్టుగానే వందల ఏళ్ల సంవత్సరాలుగా ఇక్కడ అమ్ముతున్నగాజులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. భాగ్యనగరికి వచ్చే వారితో తమకు గాజులు తెప్పించుకోవాలని చూస్తారు. అలాగే ఈ మహానగ రాన్ని సందర్శించే వారు... ఛార్మినార్‌ని చూసేందుకు ఎంత ఆసక్తి చూపుతారో... ఇక్కడి చొడి బజార్‌లో తమ వారికి గాజులు కొనేందుకు అంతే మక్కువ ప్రదర్శిస్తారు. ఇప్పటికీ సంప్రదాయ పద్దతులలో సరి కొత్త అందాలతో మెరుస్తూ తయారవుతున్న ఈ గాజు లకు ఎనలేని గిరాకీ ఉంది. నగరజీవులు కూడా ఈ గాజులు కొనేందుకు ప్రత్యేకంగా వెళ్తారు.