19, ఏప్రిల్ 2011, మంగళవారం

పవన్ 'గబ్బర్ సింగ్' లేటుగా వస్తాడట..

హిందీ ‘దబాంగ్’ కి రీమేక్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ అనే చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. .ఇటీవల విడుదలైన ‘తీన్ మార్’ కి వసూళ్లు బాగుండటంతో ... ఈ చిత్రం మీద కూడా భారీ అంచనాలున్నాయి. అయితే యధావిధిగా తీన్మార్ లా ఈ సినిమా చేస్తే ఫ్లాప్ కావడం ఖాయమని భావించిన హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ ని, ఇంకా పటిష్టంగా తెలుగుదనానికి దగ్గరగా, ప్రేక్షకులు మెచ్చేల తీర్చిదిద్దాలని భావిస్తూ...మరికొంత సమయం కావాలని భావిస్తున్నాడట.. పవన్ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించడంతో హై టెక్నికల్ వేల్యూస్ తో ఈ చిత్రం రూపొందటం ఖాయంగా కనిపిస్తోంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరో పక్కా కమర్షియల్ ఫిలిం గా 'గబ్బర్ సింగ్' రూపొందటం ఖాయం.

సాక్షి వార్తలకు రేటు కట్టి జగన్ ఖాతాలోకి..?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటరీ స్థానం అభ్యర్థి జగన్‌కు చెందిన దినపత్రిక, ఛానల్‌లలో జగన్‌కు అనుకూలంగా వస్తున్న వార్తలన్నింటినీ పెయిడ్ న్యూస్‌గా పరిగణించి, ఎన్నికల ఖర్చులో లెక్కించాలని టీడీపీపీ నేత నామా నాగేశ్వరావు చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఈ మేరకు త్వరలోనే స్పష్టమైన విధివిధానాలను రూపొందిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్ జనరల్(డీజీ) అక్షయ్ రావత్ వెల్లడించారు. దేశంలో చాలా మంది రాజకీయ నేతలకు సొంత ఛానెళ్లు, పత్రికలు ఉన్నాయని, మరికొందరికి అనుకూల మీడియా ఉందని ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో స్పష్టమైన విధానాలను రూపొందించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాక్షి కథనాలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ఓ ప్రశ్నకి సమాధానంగా చెప్పారాయన . దీంతో సాక్షిలో వస్తున్న జగన్ అనుకూల వార్తలు పైడ్ న్యూస్ గా పరిగణిస్తే.. ఇబ్బందులు తప్పవని జగన్ వర్గం తలలు పట్టుకోంటోంది .

సమంతా చుట్టూ తిరుగుతున్నశింబు

నయన తారతో ప్రేమ వ్యవహారం నడిపి ఆపై బొక్కబోర్ల పడ్డ తమిళ హీరో శింబు ఇప్పుడు సమంతా ప్రేమలో పడ్డాడని సినిమా సర్కిల్స్ లో కధనాలు వినిపిస్తున్నాయి. అమ్మడు నటించిన 'ఏ మాయ చేశావే', 'బృందావనం' చిత్రాలni తెగ చూసేసి.. ఈవిడ అందానికి ఫ్లాట్ ఐపోయాడట ... తను నటించే సినిమాలలో వరుసగా సమంతనే బుక్ చేయమంటు నిర్మాతలపై తెగ వత్తిడి తెస్తుండటమే కాకుండా. సమయం దొరికితే సమంతా కి ఫోన్ చేసి మాట్లాడాలనే ప్రయత్నిస్తున్నాడట. ... మొత్తానికి శింబు సమంతా చుట్టూ తిరుగుతున్నాడు!

సోనియా మతం మీకెందుకు?

యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ మతంపై సమాచారం వెల్లడించడం అంటీ వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడడ టమే అని జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్, జస్టిస్ ఏకే పట్నాయక్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రజాసమాచార అధికారి నుంచి ఈ వివరాలను హర్యానా మాజీ డీజీపీ పీసీ వాధ్వా సమాచార హక్కు చట్టం కింద సోనియా ఆమె పిల్లల మతం, విశ్వాసం ఏంటో బహిర్గతం చేయాలంటూ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి చేష్టలు తగనివని ఇంతకు ముందు ఈ కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.

రెహ్మాన్ లేకుండానే వర్మ 'రంగేల' సీక్వెల్

రక్త చరిత్ర రెండు పార్టులుగా తీసిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు మరో సీక్వెల్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. . గతంలో తన బాణీ తో బాలీవుడ్ని కొత్తపుంతలు తొక్కించిన 'రంగీలా'ని తెరకెక్కించి తన సత్తా చూపిన వర్మ ఇప్పుడు దానికి సీక్వెల్ తీయాలనేది ప్లాన్ చేసుకొంటున్నాడట.
ఈమధ్య ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ ని కలిసి ఈ ప్రాజక్టు గురించి డిస్కస్ చేస్తూనే .. మ్యూజిక్ చేయాలని కోరినా.. ప్రస్తుతం బిజీగా ఉన్నా అంటూ రెహ్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట .

ఐతే వర్మ మాత్రం రెహ్మాన్ తో పనిలేకుండా రంగేల స్క్రిప్ట్ తయారుచేసేసుకుని , సెట్స్ ఎక్కాలని భావిస్తున్నాడని తెలుస్తోంది.