28, ఫిబ్రవరి 2011, సోమవారం

రైల్‌రోకోను అడ్డుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌

తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపుమేరకు రేపు చేపట్టనున్న రైల్ రోకోకు అనుమతిలేదని డీజీపీ అరవిందరావు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని రై లు మార్గమంతటిలో టాస్కఫోర్స్'ని ఏర్పాటు చేస్తామని డిజీపీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పోలీసుల కాల్పుల నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు హోంమంత్రి సబితారెడ్డి, డీజీపీ అరవిందరావు భేటీ అయ్యారు.

నగదు బదిలీ ని కాపీ కొడుతున్న కాంగ్రెస్

గత ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ పొందుపరచిన నగదు బదిలీ పథకాన్ని పథకాలను ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు మార్చి డైరెక్ట్ ట్రాన్స్‌లేషన్ క్యాష్ స్కీముగా అమలు చేయడానికి చర్యలు చేపడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ఎదుర్లంకలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నగదు బదిలీ పథకాన్ని రూపొందించిన చంద్రబాబును కాంగ్రెస్ నేతలు... గ్యాస్, ఎరువులపై అందించే సబ్సిడీని డైరెక్టుగా నగదు రూపంలో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టేుదుకు చర్యలు చేపడుతోంటే.. ఎందుకు మాట్లాడ లేకపోతున్నారని నిలదీశారు.. పేదలకు నేరుగా లబ్ది చేకూర్చగల పథకం నగదు బదిలీ మాత్రమే అని ఇప్పటి కైనా కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలన్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలన్న ఆలోచన తప్ప రాష్ట్రాభివృద్ధికి నిధులు అందించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి, నడిపించగల వాయిస్ స్పీకర్‌కు లేదని.. ప్రతిపక్ష పార్టీ నిలదీస్తుందనే భయంతోనే సమస్యలు చర్చకు రానివ్వడం లేదని యనమల ఆరోపించారు. రైతాంగం సమస్యలపై చర్చిద్దామంటే అసలు టీడీపీకి అవ కాశం ఇవ్వకుండా అసెంబ్లీని వాయిదా వేస్తున్నారన్నారు.

మా వాళ్ళూ గాయపడ్డారు.. డిఐజి సౌమ్య మిశ్రా

వడ్డీ తాండ్ర లో జరిగిన ఘటనలో తమ పోలీసులు 20 మంది గాయపడ్డారని చెప్పారు డిఐజి సౌమ్య మిశ్రా. సోమవారం ఆమె వడ్డీ తాండ్ర గ్రామాన్ని సందర్శించి .. పోలిస్ కాల్పుల్లో గాయపడ్డ ప్రజలని.. పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ.. జరిగిన ఘటన బాధాకరమే అయినా... తమ పోలీసులు చాలా సంయమనం తో వ్యవహరించారని... ఐతే గ్రామస్తులే పోలీసులపై దాడి చేయటంతో తప్పని పరిస్తితిలోనే భాష్పవాయువు ప్రయోగించారని.. అప్పటికి గ్రామస్తులు వెనక్కి తగ్గక పోవటంతో రబ్బరు బులెట్లు మాత్రమే వినియోగించారని..చెప్పారామే. ముగ్గురు గ్రామస్తులు ఈ ఘటనలో మృతువాత పడగా ... ప్రజలతో పాటు పోలీసులు కూడా గాయాలపాలయ్యారని.. చెప్పారు. శాంతి యుతంగా నిరాహార దీక్ష శిబిరాన్ని నడుపుకొంతామంటీ తము అబ్యంతర పెట్టబోమని... ఐతే... రహదారుల దిగ్భందం, పోలీసులని కవ్వించడం వంటి చర్యలను సహించ బోమని తీల్చి చెప్పారు సౌమ్య మిశ్రా

పెన్ను మూసిన ముళ్ళపూడి

అచ్చ తెలుగు సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ చెన్నైలోని అభిరామపురంలో ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముళ్ళపూడి విఖ్యాతుడైన రమణ 1931 జూన్‌ 28న ధవళేశ్వరంలో జన్మించారు. ఆయన అసలు పేరు ముళ్లపూడి వెంకటరావు. ఆయన ఎంత గొప్ప రచయితో అంత సినీ రచయిత కూడా! ఆయన రాసిన పిల్లల పుస్తకం 'బుడుగు' తెలుగు సాహిత్యంలో విష్టమైన స్థానాన్ని పొందింది. అలాగే ఆయన రాసిన ఆత్మకథ 'కోతికొమ్మచ్చి' అశేష పాఠకాదరణ పొందింది. రుణానంద లహరి, రాజకీయ బేతాళ వింశతి, ఇద్దరమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల ప్రేమ కథ వగైరాలలో ఆయన పెన్ను అనేక మెరుపులు మెరిపించింది.
ఆయన సినీ రంగ ప్రవేశమే ఎంతో విచిత్రంగా జరిగింది. బైట గొప్ప హాస్య రచయితగా పేరున్న రమణ అనూహ్యంగా రక్తసంబంధం లాంటి గొెప్ప విషాదభరిత, సెంటిమెంట్‌ సినిమాకు పనిచెశారు. 1961లో రిలీజ్‌ అయిన పాశమలర్‌ తెలుగులో రక్తసంబంధంగా రీమేక్‌ చేసారు. అప్పటిదాకా మిస్మమ్మ... గుండమ్మ కథ...లాంటి సినిమాల్లో జంటగా ఎన్టీఆర్‌...సావిత్రి అన్నాచెల్లెళ్లగా 'ఇందులో నటించడమే కాదు...కరుణరసాన్ని అద్భుతంగా పండించారు. మరో అల్‌ టైం క్లాసిక్‌ మూగమనసులు సినిమాలో ఆత్రేయతో కలిసి చేశారు. అప్పటిదాకా గొప్ప గ్లామర్‌ పైర్‌గా వెలిగిపోతున్న సావిత్రి అక్కినేని కాంబినేషన్‌ను అనూహ్యమైన మలుపు తిప్పారు. సావిత్రి వద్ద పనిచేసే పాత్రలో అక్కినేని తీసుకోవడం, సావిత్రితో రా అని పించడం యాంటి సెంటిమెంట్‌ అప్రోచ్‌తో సినిమాను సూపర్‌ డూపర్‌ హిట్‌ చేయడంలో ఆయన పాత్ర కూడా ఉంది.
బాపు, ముళ్లపూడి ప్రాణ స్నేహితులు. ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాల వంటి వారు. వారి అనుబంధం షష్టిపూర్తి కూడా చేసుకుంది. స్కూల్లో మొగ్గ తొడిగిన ఆ స్నేహం పత్రికా రంగంలో కొంటె బొమ్మగా, చలన చిత్రరంగంలో కదిలించే బొమ్మగా ప్రతి ఫలించింది. రచయితకు సినిమా రంగంలో ఉన్న విలువేంటో అయిదేళ్లలో...ఏడెనిమిది సినిమాల్లో చూపిన రమణ తన దృష్టిని సినిమా నిర్మాణం వైపు మళ్ళించాడు. అప్పటి వరకూ కుంచె పట్టడం తప్ప సినిమాలో ఏమాత్రం అనుభవం లేని బాపుని దర్శకుడిగా ఒప్పించి సాక్షి సినిమా తీసారు. సూపర్‌ స్టార్‌ కృష్ణకు కూడా ఇది ఆల్‌ టైం
బెస్ట్‌ మూవీగా పేరు తెచ్చి పెట్టింది. సాక్షి సినిమాకు తాను నిర్మాతగా ఉండి బాపును ఏ ముహూర్తంలో దర్శకుడిని చేశారో కాని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు తెలుగునాట మోత మోగిపోయాయి. బాక్సాఫీస్‌ వద్ద బోర్లాపడిన సినిమాలు కూడా ఎంతో నాణ్యంగా, నిపుణంగా ఉండి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. బంగారు పిచుక, ముత్యాల ముగ్గు, పెళ్లిపుస్తకం, మిస్టర్‌ పెళ్లాం, రాధాగోపాళం, కృష్ణావతారం, సంపూర్ణరామాయణం, బంగారుపిచ్చుక, గోరంత దీపం, మన ఊరి పాండవులు, రాజాధిరాజు సినిమాలలో రమణ అందించిన సంభాషణలు ఇప్పటికీ ప్రేక్షకులకు కంఠోపాఠం. మూగమనసులు సినిమాకు కథా సహకారం అందించారు. రక్తసంబంధం, సినిమాకు మాటల రచయితగా, అక్కినేని నాగేశర్వరావునటించిన బుద్ధిమంతుడు, అందాల రాముడు సినిమాలకు కథారచయితగా పనిచేసిన ముళ్లపూడి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రవేశారు. రక్తసంబంధాలు, మూగమనసులు సినిమాలకు పనిచేసినా రమణకు రచయితగా పూర్తిస్థాయి గుర్తింపు తెచ్చింది దాగుడుమూతలు సినిమా. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు 'మిస్టర్‌ డీడ్‌ గోస్‌ టు వాషింగ్టన్‌' అనే హాలీవుడ్‌ సినిమా నుంచి ప్రేరణ పొంది రాశానని ముళ్లపూడే స్వయంగా చెప్పుకున్నారు. తర్వాత వచ్చిన ప్రేమించిచూడు, కన్నెమనసులు, నవరాత్రి, పూలరంగడు, ప్రాణమిత్రులు వగైరా చిత్రాలన్నీ రచయితగా రమణను ఉన్నతస్థాయిలో నిలబెట్టాయి. పాపికొండల్లో తొలిసారి కెమెరా పెట్టి గోదావరి అందాలను వెండి తెరకెత్తిన ఘనత కూడా బాపు, రమణలకే దక్కింది. గోదావరి ప్రయాణ నేపధ్యంగా తీసిన అందాల రాముడు తీసారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పల్టిd కొట్టినా అధైర్య పడకుండా బాపు రమణలు వాళ్ల మీదే వాళ్లు కార్టూన్లు వేసుకుని ఓటమిని ఎంజాయ్‌ చేశారు. ఆనాటి అందాల రాముడే నిన్నటి శేఖర్‌ కమ్ముల గోదావరికి ప్రేరణ అయింది. తాజాగా బాపు దర్శకత్వంలో బాలకృష్ణతో రూపొందుతున్న 'శ్రీరామరాజ్యం' సినిమాకు ముళ్లపూడే రచయిత.
1973లో 'అందాలరాముడు', 1975లో 'ముత్యాలముగ్గు', 1991లో పెళ్లిపుస్తకం, 1993లో 'మిస్టర్‌ పెళ్లాం' చిత్రాలు ఆయనకి నంది అవార్డులు తెచ్చాయి. 1981లో 'వంశవృక్షం' చిత్రానికి కళాసాగర్‌, సితార అవార్డులు పొందారు. అరవై చిత్రాల రచయిత ముళ్లపూడిని 1987లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఇక ఆయన్ని వరించిన పదవులు, బిరుదులు అనేకం. 1989లో ఆంధ్రప్రదేశ్‌ చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థకి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1990లో ఆలిండియా చిల్డ్రన్‌ ఫిలిం సొసైటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఉన్నారు. 1992లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 1992లో అమెరికా తెలుగు అసోసియేషన్‌ 'శిరోమణి' బిరుదుతో, బాలల అకాడెమీ 'బాలబంధు' బిరుదుతో సత్కరించాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, క్రోక్విల్‌ అకాడెమీ రెండూ సంయుక్తంగా లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించాయి.
ముత్యాల ముగ్గు సినిమాలో రమణ అందించిన ఓరంత కట్టపడిపోతన్నా వేటిరా కొత్తపెళ్లి కొడకా...అంటూ వెటకారాలాడినా...ఆ ముక్క నేను లెక్కట్టుకో మునపే సెప్పాల...డిక్కీలో తోయించేగల్ను జగరత్త...మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? వోల్‌ మొత్తం మీద ఏమయినా కన్సెసను ఉంటుందా?...అంటూ ఆయన రాసిన డైలాగులు తెగపేలాయి.
రమణ కురిపించిన కరుణరసానికి మంచి ఉదాహరణ భక్తకన్నప్ప. కృష్ణంరాజుని గిరిజనుడిగా... శివ భక్తుడిగా...రెండు పాత్రలలోని వేరియేషన్ని తన రచనలో గొప్పగా చిత్రించాడు రమణ. మెగాస్టార్‌ చిరంజీవికి కొత్తల్లో అద్భుతమైన బ్రేక్‌ ఇచ్చిన సినిమా, కృష్ణంరాజుకు బ్రహ్మాండమైన పేరు తెచ్చిన సినిమా మన ఊరి పాండవులు. మహాభారతాన్ని లోకలైజ్‌ చేస్తూ రాసిన ఈ సెటైర్‌లో ఇటు కృష్ణంరాజు డైలాగులు. అటు రావుగోపాలరావు డైలాగులు... తెలుగు దేశాన్ని ఉర్రూతలూరిన్చాయి. రాజాధిరాజులో సైతాను శిశువా...అంటూ రమణ రాసిన డైలాగులు ఎంతో పాపులర్‌ అయ్యాయి. తర్వాత రాధా కళ్యాణం-పెళ్లిdడు పిల్లలు...ఆ తర్వాత చిరంజీవితో మంత్రిగారి వియ్యంకుడు రమణ కలం డైలాగులు కక్కింది.
రమణ కలం నుంచి జాలువారిన మరో దృశ్యకావ్యం పెళ్ళిపుస్తకం...అడుగడుగునా కొత్తకొత్త గిల్లికజ్జాలు... జెలసీ... ద్వేషాలు... ఆశ్చర్యాలు...భార్యా భర్తల మధ్య తియ్యని రాజీలు... అనుమానం నుంచి అర్థం చేసుకోడాలు. అర్థం చేసుకోవడం నుంచి సౌఖ్యాలు...సౌఖ్యం నుంచి సంతోషాలు...సంతోషం నుంచి స్వార్థం...స్వార్థం నుంచీ మళ్ళీ అనుమానాలు...ఇలా అంతులేని వలయంగా తిరిగే మొగుడు పెళ్ళాల గోలను జరంజకంగా రచించాడు రమణ. భార్యభర్తల మధ్య సంబంధాలను మరో కోణం నుంచి సృశించిన సబ్జెక్ట్‌ మిస్టర్‌ పెళ్ళాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే వాదం నుంచి పుట్టిన వివాదానికి రమణ అద్దిన పదాల సొబగులు సినిమాను అందంగా తీర్చిదిద్దాయి. రాధాగోపాలం కూడా భార్యాభర్తల వాదాలు వివాదాల నేపథ్యంలో తయారైందే! ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద బోర్లాపడినా అందులో విలువలకు, బాపు రమణ మార్క్‌ చెణుకలక లోటేలేదు. ఈ విధంగా ఆబాల గోపాలాన్ని అలరించిన అచ్చతెలుగు కలం రమణ కలం.

లేకుంటేమీరొచ్చేలోపే వెళ్ళి పోతుంది...

రైలు ఎక్కి మీ ఊరికి వెళ్ళాల్సి ఉందా.... అయితే అరగంట ముందే రైల్వేస్టేషన్‌లో ఉండే విధంగా ఇంటి నుండి బయలుదేరండి. లేకుంటే మీరు వెళ్ళాల్సిన రైలు మీరొచ్చేలోపే వెళ్ళి పోతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య ఆ విధంగా తయారైంది. ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ జాంలే. తాము చేరుకోవాల్సిన గమ్యానికి ఇంటి నుండి గంట ముందు బయలుదేరినా చేరుకోలేకపోతున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుండి రైలెక్కి వివిధ ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు చాలామంది వారు వెళ్ళాల్సిన రైలు ఈ ట్రాఫిక్‌ జామ్‌ల వల్లా మిస్‌అవుతున్నారు. ముందుగానే టికెట్లు బుకింగ్‌ చేసుకొని సమయానికి రైళ్ళో వెళ్ళాలనుకునే వారికి ఈ ట్రాఫిక్‌ జామ్‌ల ద్వారా సమయానికి చేరుకోలేకపోతున్నారు. సికింద్రాబాద్‌లోని ఏ రోడ్‌లో చూసిన ట్రాఫిక్‌ జామే ఉండడంతో ప్రయాణానికి వెళ్ళేవారు అనుకున్న సమయం కంటే ముందుగా ఇంటి నుండి బయలుదేరితే మంచిదని చాలామంది స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు చెప్తున్నారు.

నగరంలోని వివిధ ప్రాంతాల నుండి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరేందుకు బేగంపేట రోడ్‌, రాష్ట్రపతిరోడ్‌, యంజిరోడ్‌, ఎస్పీరోడ్‌, టాంక్‌బండ్‌, తార్నాకరోడ్‌, సెయింట్‌మేరిస్‌ రోడ్‌, చిలకలగూడ రోడ్‌ వంటి ప్రధాన మార్గాలు ఉన్నా బేగంపేట్‌, తార్నాక, సికింద్రాబాద్‌, ఎస్పీరోడ్‌లన్ని ఉదయం నుండి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటుంది. రద్దీని నివారించేందుకు పోలీసుల తిప్పలు అన్ని ఇన్ని కావు. ఒక్కొక్కసారి ట్రాఫిక్‌ను చూసిన పోలీసులు విసుగుచెంది ఓ ప్రక్కకు నిల్చున్న సందర్భాలు ఉన్నాయి.

అయితే ట్రాఫిక్‌ సమస్యకు మరోకారణం ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఉన్న రోడ్ల సమస్య ప్రయాణికులకు తీవ్ర నరకాన్ని చూపిస్తుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే రైళ్ళు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుండి బయలుదేరుతుంటాయి. ఇక్కడినుండే చాలామంది నగర వాసులు, చుట్టుపక్కల శివారు ప్రాంత ప్రజలు ఈ స్టేషన్‌ నుండే బయలుదేరి వెళ్తుంటారు. అయితే సికింద్రాబాద్‌లో కాలు పెట్టగానే అసలు సమస్య తలెత్తుతుంది. మరో అరగంటలో లేదా పావుగంటలో రైలు ఉంటే మాత్రం ఇంకా ఆ రైలుపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇది మన సికింద్రాబాద్‌ ట్రాఫిక్‌ సమస్య, ఈ ట్రాఫిక్‌ సమస్యను నివారించాలంటే ఇకా ఆ భగవంతుడే దిగిరావాలి.

ఆస్కార్ విజేతలు వీరే

1. ఉత్తమ చిత్రం : ది కింగ్స్ స్పీచ్
2. ఉత్తమ నటుడు : కోలిన్ ఫిర్త్ (ది కింగ్స్ స్పీచ్)
3. ఉత్తమ నటి : నటాలీ పోర్ట్‌మన్ (బ్లాక్ స్వాన్)
4. ఉత్తమ సహాయ నటుడు : క్రిష్టియన్ బాలే (ది ఫైటర్)
5. ఉత్తమ సహాయనటి : మెలిసా లియో (ది ఫైటర్)
6. ఉత్తమ దర్శకుడు : టామ్ హూపర్ ( ది కింగ్స్ స్పీచ్)
7. ఉత్తమ విదేశీ భాష చిత్రం : ఇన్ ఎ బెటర్ వరల్డ్ (డెన్మార్క్)
8. ఉత్తమ స్క్రీన్ ప్లే : ఆరాన్ సోర్కిన్ (ది సోషల్ నెట్‌వర్క్)
9. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే : డేవిడ్ సీడ్లర్ (ది కింగ్స్ స్పీచ్)
10. ఉత్తమ యానిమేషన్ చిత్రం : టాయ్ స్టోరీ 3
11. ఉత్తమ యానిమేషన్ (లఘు) : ది లాస్ట్ థింగ్
12. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ : అలైస్ ఇన్ వండర్‌ల్యాండ్
13. ఉత్తమ సినిమాటోగ్రఫీ : ఇన్‌సెప్షన్
14. ఉత్తమ శబ్దగ్రహణం, ఎడిటింగ్ : ఇన్‌సెప్షన్
15. ఉత్తమ గీత రచన : ట్రెంట్ రెజ్నర్, అటికస్ రాస్ (ది సోషల్ నెట్‌వర్క్)
16. ఉత్తమ సంగీతం : రాండీ న్యూమన్ (వియ్ బిలాంగ్ టుగెదర్ టాయ్‌స్టోరీ 3)
17. ఉత్తమ దుస్తుల రూపకల్పన : అలైస్ ఇన్ వండర్‌ల్యాండ్
18. ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) : ఇన్‌సైడ్ జాబ్
19. ఉత్తమ డాక్యుమెంటరీ (లఘు) : స్ట్రేంజర్స్ నో మోర్
20. ఉత్తమ ఎడిటింగ్ : ది సోషల్ నెట్‌వర్క్
21. ఉత్తమ మేకప్ : ది వుల్ఫ్‌మన్
23. ఉత్తమ లైవ్ యాక్షన్ (లఘు) : గాడ్ ఆఫ్ లవ్
24. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఇన్‌సెప్షన్

ఈసారి ఎ.ఆర్.రహ్మాన్‌కు నిరాశే ..

అమెరికాలోని లాస్ ఎంజెలిస్, కోడక్ థియేటర్‌లో 83వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి.ఈసారి ఆస్కార్‌పై భారత్ ఆశలు గల్లంతయ్యాయి. రెండేళ్ల కిందట దేశానికి మొట్టమొదటి ఆస్కార్ సాధించి పెట్టిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహ్మాన్ ఈ ఏడాది కూడా ఉత్తమ నేపథ్యం సంగీతం, గీతం విభాగాల్లో నామినేషన్ పొందినా చివరకు ఉత్త చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.

కటకటాల వెనక్కి మాజీ ఖాకీ

చట్టం తన చేతుల్లో ఉందన్న ధైర్యమో.. లేక ఎంతమందినైనా పెళ్లాడవచ్చని మతం చెప్పిందని సాకు చెప్పించవచ్చన్న ధైర్యమో తెలియదు గానీ ఓ ఖాకీ తన కంటికి అందంగా కనిపించిన.. మనస్సు మెచ్చిన అమ్మాయిలను వలచి మనువాడేశాడు వరుసగా... ఇదేదో ఒక్కసారో రెండు సార్లోకాదు.. ఏకంగా ఐదుగురిని. ఒకరిని తెలియకుండా మరొకర్ని పెళ్లాడేశాడు. ఈమధ్యే సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదవీ విరమణ కూడా చేసిన ఈయన గారి భాగోతం ఆయన నాలుగో భార్య పోలీసు స్టేషన్‌ మెట్లెక్కినా ఫలితం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించటంతో బయటపడింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ నివాసి అయిన గులాం మహ్మద్‌ పోలీసు శాఖలో పని చేస్తూ ఎక్కడ పని చేస్తే అక్కడ ఓ అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకోవడం అనవాయితీగా మార్చుకున్నాడు. ఇప్పటికే నలుగురిని వదిలించుకుని ఐదో భార్యతో కాపురం చేస్తున్న ఈయన గారు తనని పట్టించుకోవడంలేదని నాలుగో భార్య పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఖాకీ చొక్కాలు తమ మాజీ బాస్‌ వ్యవహారంపై స్పందించకుండా ఎప్పటిలాగానే ఆమెను స్టేషన్‌ చుట్టూ తిప్పించుకున్నారు. దీంతో విసిగివేసారిన ఆమె నగర పోలీసు కమీషనర్‌ ఏకే ఖాన్‌కు కూడా ఫిర్యాదు చేసింది. దానికీ స్పందన లేకపోవడంతో మీడియా సాక్షిగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.

తనని తన పిల్లల్ని వదిలేశాడని దీనివల్ల తామంతా అనాథలంగా మారిపోయామని కన్నీరుమున్నీరైంది. ఎట్టకేలకు సిటీ పోలీసు బాస్‌ స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో గులాం అహ్మద్‌ను అంబర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. మరి ఈయన గారికి ఏ శిక్షపడుతుందో... లేక ఖాకీల అండదండలతో తప్పించుకుంటాడో వేచిచూడాలి.

రేపు రైళ్లు నడవవు...

తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు 'రైల్‌రోకో' నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల ప్రయాణాలకు వాయిదా వేసుకోవలసిందిగా అధికారులు ప్రయాణికులకు సూచించారు. అలాగే విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ రావలసిన గరీభ్‌రథ్‌ రైలును కూడా రద్దు పరిచారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలపు కూడా రద్దు పరుస్తున్నట్లు తెలిపారు.

ఐ హేట్ బాలయ్యపై బాలకృష్ణ ఫిర్యాదు

ఐ హేట్ బాలయ్య అనే వెబ్‌సైట్‌పై తెలుగు సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదు నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు కావాలనే వెబ్ఃసైట్ఃలో తనపై వ్య0గ్యంతోకూడి వ్యాఖ్యలు పెడుతున్నారని, ఎస్ఎంఎస్లు పంపుతున్నారని బాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐటి, ఐపిసిల కింద కేసు నమోదు చేశారు.

రాజకీయంగా, సామాజికంగా, వృత్తిపరంగా తనను దెబ్బ తీసేందుకు వెబ్‌సైట్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని..వైబ్‌సైట్ తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్న తనపై కొందరు కావాలనే తన ఇమీజ్ దెబ్బతీసేవిధంగా..బురద జల్లుతున్నారని... తన కుటుంబం, తన అభిమానుల మనస్సుని నొప్పించేవిధంగా కొందరు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని బాలకృష్ణ ఆరోపించారు. వెబ్‌సైట్‌లో అసత్యప్రచారం సాగిస్తున్నారని, మెసేజ్‌లు తన అభిమానులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఈ వెబ్‌సైట్ తనను మానసిక వేదనకు గురి చేస్తోందని ఆయన అన్నారు.

పేల్చినవి రబ్బరువే.. ఐనా చనిపోయారు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో ఈస్టుకోస్టు థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ కి వ్యతిరేకంగా.. ఆందోళన చేస్తున్న వారిని అదుపు చేయమని చెప్పామే తప్ప.. ఎక్కడా తము కాల్పులకు ఆదేశాలు జారీ చేయలేదని డిజిపి అరవింద రావు చెప్పారు.

రబ్బరు బుల్లెట్లు మాత్రమే ప్రయోగిస్తున్నారని, వాటి వల్ల ప్రాణానికి హాని జరుగదని తెలిపారు. ఐతే రబ్బర్ బుల్లెట్ కాల్పులలో ఒకరు మృతి చెందారని డిజిపి ప్రకటించడం ఆశ్చర్యకరం..పోలీసులు, ప్రజలు సంయమనం పాటించాలని ఓ వైపు కోరుతూనే...ఆందోళనకారులు పోలీస్ జీపు తగులబెట్టడాన్ని ఆయన ఖండించారు.

ధర్మాన ఇలాఖాలో మళ్ళి పేలిన 'ధర్మల్' తూటా..

శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు తన పట్టు చూపించేందుకు 'ధర్మల్'నే శ్రీకాకుళం ప్రజల మీద ఆయుధంగా ప్రయోగిస్తున్నట్టు ఉంది. తమ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న ఆందోళనకారులపై సోమవారం పోలీసులు మూడుసార్లు బాష్పవాయివు ప్రయోగించారు. పల్లె ప్రజలపై పోలీసు తూటాలు.. పొగబాంబులు వెల్లువలా కురిశాయి.దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీస్ జీపులను తగులబెట్టారు.

పొగబాంబుల తాకిడికి పూరిళ్ళు అంటుకుని మంటలు ఎగసిపడుతున్నాయి. సుమారు 150 ఇళ్ళు అంటుకున్నట్లు సమాచారం. బాధితుల ఆక్రందనలు,, పోలీసుల బూట్ల చప్పుడు, ఆందోళనకారుల పరుగులతో వడ్డితాండ్ర వణికిపోతున్నది. ఈ ఘటనలతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

జగన్ ఆస్తులపై 'సభ'ని స్థంభింపజేస్తాo...

వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపైన పార్లమెంటులో జెపిసి మాదిరిగా ఇక్కడ జాయింట్ లెజిస్ట్రేటివ్ కమిటీ వేయాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సాక్షిలో దొంగ పెట్టుబడులు ఉన్నట్లు ఐటి శాఖ తేల్చి చెప్పిందని... అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటానికి గల కారణమేమిటని ప్రశ్నించారు.

జగన్ ఆస్తులపై ప్రభుత్వం జెఎల్‌పి వేయకుంటే శాసనసభా సమావేశాలను స్థంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని అన్నారు.

మంత్రి పైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే

తెలంగాణ అంశంపై సోమవారం కూడా శాసనసభ దద్ధరిల్లింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీయేనని, తెలంగాణను అడ్డుకున్నది ఎవరో బిజెపి అగ్రనేత అద్వానీ చెప్పారని తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

కాంగ్రెసు, తెలుగుదేశం సభ్యుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది.ఓ దశలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుపైకి తెలుగుదేశం శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి దూసుకెళ్లారు. ఆయనను కాంగ్రెసు సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

తెలంగాణా వద్దన్నది చంద్రబాబే

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చంద్రబాబే అడ్డుకున్నారని బీజేపీ నేత అద్వానీయే చెప్పారని.. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీని తప్పుబట్టే అర్హత చంద్రబాబునాయుడుకు లేదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం ఆయన సభలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని..తెలంగాణా పై చంద్రబాబు ద్వంద్వ విధానం వీడి ఓ నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేసారు

మాజీ సిఎం రోశయ్యపై కేసు పెట్టండి : హైకోర్టు

హైదరాబాదీ అత్యంత ఖరీదైన ప్రాంతం మైత్రివనంలోని స్థల వివాదంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై విచారణపై విధించిన స్టేని సోమవారం హైకోర్టు ఎత్తివేసింది. అమీర్పేట భూముల వ్యవహారానికి సంబంధించి రోశయ్యతోపాటు మరో 14 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఎసిబిని హైకోర్టు ఆదేశించింది.దీనితో ఈ వ్యవహారంలో జరిగిన అధికార దుర్వినియోగం, తదితర అంశాలపై ఎసిబి విచారణ జరపనుంది.

రైల్‌రోకో జరిపి తీరుతాం...

రేపు తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు జరగనున్న తెలంగాణ రైల్‌రోకోను విరమించుకోలేదని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. రైల్‌ రోకో సందర్భంగా పట్టాలపైనే వంటా వార్పు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మార్చి 10వ తేదీన తలపెట్టిన 'మిలి యనీర్‌ మార్చ్‌'లో ఎటువంటి మార్పు ఉండదని ఆయన తెలిపారు.

జైపాల్‌ హామీకి ప్రణబ్‌ ఎసరు ?

ఇప్పట్లో పెట్రో ధరలు పెంచే ప్రసక్తే లేదంటున్న ఆ శాఖ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి హామీలకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఎసరుపెట్టారు. సోమవారం 2011-12 బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖర్జీ అన్నారు. బడ్జెట్‌లో కస్టమ్‌, ఎక్సైజ్‌ సుంకాలను యథాతథంగా కొనసాగించడంతో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారల్‌ ముడిచమురు ధరలు 110 యూఎస్‌ డాలర్లకు పెరిగింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయికి సమానం.

ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌పై 7.5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ విధిస్తున్నారు. అలాగే లీటర్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.14.35, డీజిల్‌పై లీటరుకు రూ.4.60 విధిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగడంతో పెట్రో ధర పెంచక తప్పడంలేదు.

ప్రణబ్ బడ్జెట్ ముఖ్యాoశాలు ఇవీ

ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారంనాడు పార్లమెంటులో 2011-2012 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు.

బడ్జెట్ ముఖ్యాoశాలు ఇవీ

-నల్లధనాన్ని వెలికి తీసేందుకు అయిదు అంచెల విధానం

-చేనేత రంగం ఉద్దీపనకు చర్యలు

-నాబార్డు ద్వారా రూ.3000 కోట్లు వితరణ

- 2011-12లో 7 నుంచి 8 లెదర్ హబ్స్ ఏర్పాటు

-నల్లధనం విదేశాలకు తరలకుండా ప్రత్యేక విధానం

-బ్లాక్ మనీ వెలికితీతకు చట్టం చేసే యోచన

- 15 మోగా ఫుడ్ పార్కుల ఏర్పాటు

-త్వరలో జాతీయ ఆహార భద్రతా బిల్లు

- 2012 ఏప్రిల్ 1 నుంచి ప్రత్యక్ష పన్నుల విధానం

-2.50 లక్షల గ్రామ పంచాయితీలకు గ్రామీణ ఇంటర్నెట్ సౌకర్యం

-అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు పెంపు ( రూ.700 ఉన్నకార్యకర్తలకు రూ.1500, రూ.1500 ఉన్న కార్యకర్తలకు రూ.3000 చెల్లింపు)

-పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు 60వేల గ్రామాలకు రూ.300 కోట్లతో ప్యాకేజీ

-రూ.7,300 కోట్లు పట్టణాల దగ్గర

- రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు పావలా వడ్డీకే రుణాలు

-పశుగ్రాస నివారణకు రూ.300 కోట్లు

- భారత నిర్మాణ రంగ కార్యక్రమానికి రూ.58వేల కోట్లు

-విద్యారంగానికి రూ. 52,057 కోట్లు

-విద్యాహక్కు చట్టం కింద మరో రూ.21 కోట్లు

-అట్టడుగున ఉన్న గిరిజనుల అభివృద్ధికి రూ.244 కోట్లు

- గ్రామీణ బ్యాంకుల స్థాపనకు రూ.500 కోట్లు

-ఆరోగ్య రంగానికు రూ.26, 760 కోట్లు

-చిన్న, సన్నకారురైతుల రుణాల కోసం ప్రత్యేక నిధి

-అసంఘటిత రంగాలలో స్వాలంభన పింఛన్ విధానం మరింత సరళీకృతం

-హరిత భారత్ పథకానికి రూ.200 కోట్లు

-రుణాల ఎగవేతను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

- ఈ సమావేశాల్లోనే ఇన్సూరెన్స్ సవరణ , ఎల్‌ఐసీ బిల్లులు

-2వేలు జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకుల ఏర్పాటు

-ఈ ఏడాది కొత్తగా 20వేల గ్రామాలకు బ్యాంకింగ్ సదుపాయం

-జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి రూ.8వేల కోట్లు

-వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ. 9,890 కోట్లు

-ఐఐటీ ఖరగ్‌పూర్‌కు రూ.200 కోట్లు , ఐఐఎం కోల్‌కతాకు రూ.20 కోట్లు

-రక్షణ రంగానికి రూ.69,199 కోట్లు

- కొత్త గిడ్డంగుల ఏర్పాటుకు రూ.2వేల కోట్లు

-ముస్లిం వర్సీటీలకు రూ.50 కోట్లు

-గంగానది మినహా నదులు, సరస్సుల శుద్ధికి రూ.200 కోట్లు

-ముస్లిం యూనివర్శిటీలకు రూ.50 కోట్లు

-మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో విదేశీ పెట్టుబడులు పెంపు

-వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితి 1.8 లక్షలకు పెంపు

జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ కులాల ఆధారంగా జనగణన

-ఇప్పటివరకూ 20 లక్షల ఆధార్ నెంబర్లు జారీ

- త్వరలో కొత్త రుపాయి నాణాలు.

- చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రత్యేక నిధి