10, నవంబర్ 2010, బుధవారం

రోశయ్య ని తప్పిస్తారా...

ప్రపంచంలోనే ఉత్తమ సిఎం రోశయ్య

దేశంలో ముఖ్యమంత్రిగా రోశయ్య నెంబర్ వన్ అని, ప్రపంచంలోకూడా మేటి నాయకుడని 20సూత్రాల ఆర్థిక కమిటీ చైర్మన్ తులసిరెడ్డి రోశయ్యను పొగడ్తలతో ముంచెత్తారు...నేడుమారుతున్న రాజకీయాలకు అనుగుణంగా యువత, అనుభవం కలిగిన వారు ఇరువురు పార్టీకి అవసరమని...పార్టీలో అనుభవంతోపాటు, యువత సేవలు కూడా కావాలని, జగన్ కూడా భవిష్యత్తులో సిఎం అయ్యే అవకాశం ఉందన్నారు.

ప్రపంచంలోనే రోశయ్య ఉత్తమ సిఎంగా మొదటిస్థానంలో ఉన్నారని... ఆయనకు రాజకీయ అనుభవం అపారంగా ఉందని, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్సీగా, ఒక పర్యాయం ఎంపిగా, పిసిసి అధ్యక్షులుగా పదవులు అనుభవించారన్నారు. రోశయ్య పిసిసి అధ్యక్షులుగా ఉన్న కాలంలో రాష్ట్రంలో 22మంది ఎంపిలను గెలిపించిన ఘన చరిత్ర ఆయనకు ఉందన్నారు.

ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధిస్తా..!: సైనా నెహ్వాల్

చైనాలో జరుగనున్న ఆసియన్ గేమ్స్‌లో ధీటుగా రాణించడం కఠినమేనని భారత మేటి షట్లర్, కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్ చెప్పింది. అయితే ఆసియన్ గేమ్స్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని సైనా పేర్కొంది.

2009 టివి నంది అవార్డుల ప్రకటన

హైదరాబాద్: 2009 టివి నంది అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ టెలీచిత్రంగా విప్రనారాయణ,
ఉత్తమ రెండవ టెలీఫిల్మ్'గా దృష్టి ఎంపికైంది. ఉత్తమ టివీ మెగా సీరియల్'గా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర చరిత్ర ఎంపికైంది. ఉత్తమ టివి సీరియల్'గా మొగలిరేకులు, రెండవ ఉత్తమ సీరియల్'గా అభిషేకం, ఉత్తమ పిల్లల సీరియల్'గా ఆశాదీపం ఎంపికయ్యాయి.

ఉత్తమ దర్శకురాలి అవార్డు మంజులానాయుడు (మొగలిరేకులు), ఉత్తమ నటుడుగా సాగర్(మొగలిరేకులు), ఉత్తమ నటిగా వహిదా(విప్రనారాయణ) ఉత్తమ విలన్'గా రవివర్మ(మనసున మనసై..), ఉత్తమ హాస్యనటుడుగా గుండు హనుమంతరావు ఎంపికయ్యారు. ఈ నెల 28న అవార్డులు ప్రదానం చేస్తారు.