తాను ఎన్నడూ పార్టీ వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడలేదని పదే పదే ప్రకటిస్తున్న మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి.. ఇప్పుడు సరికొత్త రాగం అందుకున్నారు. ‘పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థా? కాదా? అన్నది పీసీసీ చీఫ్ డీఎస్, సీఎం కిరణ్‌లు తేల్చాలి పాటిల్ నిజమైన కాంగ్రెస్‌వాది కాదు..అందుకే మేం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’ అని స్పశ్తీకరిన్చారు.
ఒకవేళ జేసీ వర్గీయులు అందరూ ఎన్నికలను బహిష్కరించినా.. టీడీపీకి చెందిన 150 మందికిపైగా ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి బాహాటంగా మద్దతు ఇస్తున్నారని పాటిల్ విజయం సాధించడం తథ్యమనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.