తెలంగాణ జేఏసీ కార్యక్రమాలను విజయవంతం చేయాలంటూ ఈ నెల 21న రిలే దీక్షలతో ఢిల్లీ పీఠం దద్దరిల్లాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం రాజకీయ మార్గంతోనే సాధ్యమని, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని, రాజీనామా చేయకపోతే దద్దమ్మలుగా మిగులుతారన్నారు.
తెలంగాణకు నీ ళ్లందించే ఏకైక ప్రధాన ప్రాజెక్టు శ్రీరాంసాగర్ శిథిలావస్థకు చేరడం, ఆంధ్రా ప్రాంతానికి నీరందించే నాగార్జునసాగర్ ప్రాజెక్టు సర్వ హంగులతో రూపుదిద్దుకోవడంపై వివక్షత కనిపించిందన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దుస్థితి, తెలంగాణ వెనకబాటు తనం, బషీర్‌బాగ్ కాల్పులు ... తెలంగాణ ఉద్యమానికి నాంది పలికాయని, తెలంగాణ ఉద్యమం పది మందితో ప్రారంభమైందని, నేడు కోట్ల జనం ఊపిరిపోస్తున్నారని.. . ప్రస్తుతం తెలంగాణ శ్రేణు లు గీత గీసి మా తెలంగాణ మాకు కావాలని అడి గే రోజు వచ్చిందని, ఇక తెలంగాణ ఆగదని కేసీఆర్
స్ప ష్టం చేశారు.