29, అక్టోబర్ 2010, శుక్రవారం

అనుష్క మరీ హాట్ గురూ ...













తాజా సౌత్ స్కోప్ కవర్ పేజీపై దర్సనమివ్వనున్న రామ్ చరణ్, శ్రియాలు


అల్లు వారి 'వరుడు'కి వధువు దొరికిందట

యువ హీరో అల్లుఅర్జున్ త్వరలో వరుడు కాను న్నారు.హైదరాబాద్'కుచెందిన స్పేహారెడ్డిని పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. నగర శివార్లలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత కుమార్తె స్నేహారెడ్డి. ఈమె ఇంజనీరింగ్ పార్టీ చేసి ప్రస్తుతం యుఎస్'లో ఎంఎస్ చదువుతున్నట్లు తెలుస్తోంది.

గత ఆరు నెలల క్రితమే స్నేహరేడ్డితో పరిచయం కాస్త ప్రేమగా మారినా.. ఇది ప్రేమ వివాహంగా కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్ళిగా చేసుకోవాలని ఇద్దరు భావి౦చడంతో ..ని ఇరువైపుల పెద్దలు ఒక అంగీకారానికి వచ్చినట్లు కూడా తెలిసింది.

మాలధారణం....నియమాల తోరణం....

నిష్ట... నియమం... మనసు నియంత్రణ... చెడు వ్యసనాలకు దూరం.. దైవారాధనే ప్రధాన మంత్రం.... వెరసి మాలధారణం.... వెళ్లేదారి ఏదైనా చేరే మార్గం మాత్రం ఒక్కటే... అందుకే ఆధ్యాత్మికతకు ప్రజలు పెద్దపీట వేస్తున్నారు. నిష్టగా ఉండి దీక్షతో తాను కొలిచే దేవుడి ప్రాంగణానికి వెళ్లాలని భ క్తులు ఆశిస్తున్నారు. ఆయా దేవుళ్లకు సంబంధించిన మాలధారణ చేసి నియమనిష్టలతో దేవుడిని పూజిస్తున్నారు. మనసును నియంత్రించే శక్తిని మాలకు ఉందని విశ్వసించి అదే బాటలో పయనిస్తున్నారు భక్తులంతా. స్వామి శరణం... అయ్యప్ప శరణం.. అంటూ శరణఘోషలో ఉదయం, రాత్రి వేళల్లో అయ్యప్పస్వామిని ప్రార్థిస్తున్నారు. 41 రోజుల మండలి దీక్ష చేసిన వారంతా శబరిమలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మాలధారణ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి.

ఇప్పటికే వేలాది మంది భక్తులు మాలధారణ చేసి అయ్యప్ప భక్తి సేవలో తరిస్తున్నారు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత స్నానమాచరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిర్దేశిత సమయంలో శరణ ఘోష చెప్పాలి. మాలవేసుకున్న భక్తులు ఎదుటివారిలో అయ్యప్పనే చూడాలి. అందుకే ఎవరికి ఎక్కడ పలకరించినా స్వామిఅని, మహిళలను మాత అని సంబోధిస్తారు.

నవంబరు 16న శబరిమల పుణ్యక్షేత్రంలో పడిపూజ (మెట్లు పూజ) నిర్వహించి దేవాలయాన్ని తెరుస్తారు. ఆ సమయానికి అక్కడకు వెళ్లడానికి అయ్యప్ప స్వాములు ఇప్పటికే ప్రత్యేక బస్సులు, రైళ్లు బుక్ చేసుకున్నారు. జనవరి నెలలో మకర జ్యోతివరకూ స్వాములు శబరిమలకు వెళుతూనే ఉంటారు. స్వామిని దర్శించేనాటికి ప్రతి ఒక్కరూ 41 రోజుల పాటు దీక్ష చేయాల్సి ఉంటుంది. ఇరుముడిని పట్టుకుంటేనే 18 బంగారు మెట్లు ఎక్కడానికి అనుమతిస్తారు. సన్నిధానం, ప్రయాణం ఇలా అన్ని ఖర్చులు కలిపి ఒక్కక్క భక్తుడికి దాదాపు 8 వేల నుంచి 10 వేల వరకూ ఖర్చు అవుతుంది.

ఎన్‌టివి ‘మిర్చి మసాల’పై కేసు


ఎన్‌టివిలో రాత్రి 11.30 గంటల సమయంలో ప్రసారం చేస్తున్న మిర్చి మసాల కార్యక్రమంపై నగర పోలీసు కమీషనర్ ఎకె ఖాన్ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. మిర్చి మసాల కార్యక్రమం ద్వారా అశ్లీల దృశ్యాలను ప్రసారం చేస్తూ యువతను చెడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నట్లు భావించిన సిపి ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. 1995 కేబుల్ టెలివిజన్ నియంత్రణ చట్టం కింద 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 18 కింద ఫిర్యాదు చేసేందుకు ఒక్క కమీషనర్‌కు మాత్రమే అధికారం ఉంది. ఎన్‌టివి చైర్మన్ నరేంద్ర చౌదరి, ఔట్‌పుట్ ఎడిటర్‌తో పాటు మొత్తం ఏడుగురిపై ఫిర్యాదు చేశారు.

చట్టంలోని సెక్షన్ 5 కింద ప్రోగ్రామ్ కోడ్ ఉల్లంఘన కావడంతో కోర్టులో ఫిర్యాదు చేశారు. అశ్లీల ప్రసారాలను చేస్తున్న టివి చానల్స్‌పై పోలీసులు నియంత్రణ చేసేందుకు మానిటరింగ్ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు కొన్ని అంశాలతో సిపి ఎకె ఖాన్ ఈ ఫిర్యాదును కోర్టులో దాఖలు చేశారు. దీనిపై ఏం చర్య తీసుకోవాలన్నది కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.

కాగా టివిల్లో ప్రసారమయ్యే ఈ తరహా కార్యక్రమాలు సినిమాటోగ్రఫీ చట్టం కింద సెన్సార్ బోర్డుకు సంబంధం లేదని ఆయా వర్గాలు చెబుతున్నాయి. కేబుల్ నియంత్రణ చట్టం కింద రెండేళ్ళ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించవచ్చు. ఒక వేళ రెండోసారి ఇదే నేరాన్ని చేస్తే శిక్షను ఐదేళ్ళకు పెంచి రూ.5 వేలు జరిమాన విధించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.








ఆంధ్ర భూమి సౌజన్యం

మన రోడ్ల పైకి వచ్చేసిన 16 కోట్ల కారు


మనదేశంలో అత్యంత ఖరీదైన కారు గురువారం మార్కెట్లోకి విడుదలైంది. వోక్స్‌వాగన్ గ్రూప్ కంపెనీ బుగట్టి ఆటోమొబైల్స్ ఈ సూపర్ ప్రీమియం స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది.‘బుగట్టివెరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్స్’ బ్రాండ్ పేరుతో ఆవిష్కరించిన ఈకార్ల ధర రూ.16 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. బుగట్టి ఆమెరికా, యూరప్, మధ్యప్రాచ్యంలో బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్లోకి దీన్ని ప్రవేశపెడుతున్నామని బుగట్టి ఆటోమొబైల్స్ సేల్స్ మేనేజర్ గై కాక్విలిన్ విలేఖరుల సమావేశంలో చెప్పారు.

రూ.16 కోట్లకుపైన ధర గల బుగట్టి వెరాన్ గ్రాండ్ స్పోర్ట్స్ కార్లను కంపెనీ భారత డీలర్ అయిన ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ పంపిణీ చేయనుందని ఆయన తెలిపారు. సుమారు రూ.5 కోట్ల ధర గల్గిన రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెబాక్ మోడల్స్ ఇప్పటిదాకా మనదేశంలో విలువైన కార్లు బుగట్టి వెగాన్ ధర విదేశీ ద్రవ్య కదలికలు, కస్టమరీ డిమాండ్‌ని బట్టి వుంటుందని ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సత్య బాగ్లా తెలిపారు.

బుగట్టి వెగాన్ ధర ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న అతి విలువైన కారు ధరకు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువని ఆయన వివరించారు. ఆర్డరు చేసిన తర్వాత ఆరు, ఎనిమిది నెలలకి కారును డెలివరీ చేస్తామని చెప్పారు. ఈఏడాది ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 80 కార్లను మార్కెట్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. బుగట్టి వెరాన్ వేగంలోనూ సాటిలేనిదని, సాధారణ రోడ్లపైన కూడా ఇది గరిష్టంగా గంటకి 407 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదని, కేవలం 2.7 సెకన్లలో దీని వేగం జీరోస్థాయి నుంచి 100 కిలోమీటర్ల స్థాయికి పెరుగుతుందని కంపెనీ చెబుతోంది




ఆంధ్ర భూమి సౌజన్యంతో

కాంగ్రెస్ కి ఒకటి విద్రోహ దినమా? ఎలా? అవుతుంది

రాష్ట్ర ఆవిర్భావం విద్రోహ దినం ఎలా అవుతుందని, విశాలాంధ్ర కావాలని అప్పుడు పార్లమెంటులో అడిగింది.. శాసనసభలో తీర్మానం చేసింది ఈ నాయకులు కాదా అని పీఆర్పీ అధికార ప్రతినిధి వాసిరెడ్డ పద్మ ప్రశ్నించారు. నాయకులు, తరాలు మారగానే అభిప్రాయాలూ మారతాయా అన్నారు.

అంశాల్లో అన్యాయం జరిగితే దాన్ని గురించి మాట్లాడాలి కానీ.. విద్రోహం అనడం సరికాదన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్రోహదినం అనే హక్కు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల తీర్మానం ఆ పార్టీనే చేసిందని గుర్తు చేశారు. అర్చకుల సమస్యలపు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు

'కోదండరాం... ప్రొఫెసర్‌వా... పోరంబోకువా ?

'2011 లో రావాల్సిన పదోన్నతిని అధికారులను బెదిరించి ముందుగానే పొందావన్న ఆరోపణలు నీపై ఉస్మానియా వర్సిటీలో గుప్పుమంటున్నాయి. వీటిపై ఎందుకు స్పందించడంలేదు. పైగా చంద్రబాబునే ప్రశ్నిస్తావా ?' అంటూ ప్రొఫెసర్ కోదండరాంపై తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) మండిపడింది. సెప్టెంబర్ 17 న విలీనమా ? విమోచనమా ? అన్న అంశంపై రాజకీయ జేఏసీలో ఉన్న టీఆర్ఎస్, బీజేపీలు భిన్నవాదనలను వినిపించినా, జేఏసీ కన్వీనర్‌గా కోదండరాం ఇంతవరకు సరైన వివరణనివ్వలేకపోయాడంటూ కోదండరాంను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నూరి నర్సిరెడ్డి విమర్శించారు.

తెలంగాణా అమరవీరుల కుటుంబాలపై దాడులు జరుగుతున్నా ఖండించలేని అసమర్ధ కన్వీనర్ అని ధ్వజమెత్తారు. ఆంధ్రా పారిశ్రామికవేత్తలతో కేసీఆర్ రహస్య సమావేశం పెట్టినా స్పందించలేదని దుయ్యబట్టారు. కోదండరాం ఒక పొలిటికల్ జోకర్, టీఆర్ఎస్ బ్రోకర్ అని దుయ్యబట్టారు. 'కోదండరాం... నువ్వు ప్రొఫెసర్‌వా... పోరంబోకువా ?' అని ధ్వజమెత్తారు.



ఆంద్ర జ్యోతి సహకారంతో

శ్రీవారి స్క్రీన్స్ పై హాట్ హాట్ హాట్ ఫ్యాషన్ అందాలు

అసలే వివాదాల కొలిమిగా మారిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ వ్యవహారం... ప్రత్యెక కమిటి వచ్చినా కూడా పద్దతి మారని ఉద్యోగుల కారణంగా ఇంకా వివాదాల పుష్కరనిలో మునిగి తేలుతోంది. అత్యంత పవిత్రంగా ఉండే తిరుమలలో గురువారం రాత్రి మరో అపచారం చోటుచేసుకుంది.

వెంకన్న దివ్య మంగళ రూపం చూసి చూసి భక్తులకి బోర్ కోతుతోంది అనుకున్నారో ఏమో అతివల అందాల ఆరబోతకు అగ్ర స్థానం ఇచ్చే ఫేషన్ టివి ని చూపించారు...దేవస్థాన సిబ్బంది...

సాక్ష్యాత్తు టీటీడీ ఏర్పాటు చేసినడిజిటల్ స్కీన్ మీదే నిత్యం చిట్టి పొట్టి దుస్తులతో.. దద్దపు ఉన్దీలేనట్లు కనిపించే వస్తాలతో హాట్ హాట్క్షె బంగారు వంనేలోలికించే భామలి హోయలోలికించే ఫ్యాషన్ ఛానెల్ ప్రసారం అయింది. ఈ ప్రసారం అర్ధగంటపాటు నిరంతరాయంగా సాగడంతో, ఈ అపచారాన్ని చూసి భక్తులు నివ్వెరపోయారు. పరమపవిత్రమైన ఏడుకొండలపై ఈ అపభ్రంశ ప్రసారాలా! అంటూ మండిపడ్డారు.

నేడు హైదరాబాద్ లో ఎయిడ్స్ జాతీయ సదస్సు

నేడు హైదరాబాద్ మహా నగరంలో ఎయిడ్స్, హెచ్‌ఐవి వ్యాధులపై జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. మూడురోజుల పాటు జరుగు ఈ సదస్సును ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు దేశం నుంచే కాక విదేశాల నుండి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వైద్యులు, హెచ్‌ఐవిపై పరిశోధన చేసిన దాదాపు 600 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు ఆధ్వర్యాన జరిగే ఈ సదస్సులో ఆ సంస్థ డెరైక్టర్ అర్. వి. చంద్ర వదన్ తో పాటు ఎయిడ్స్ సోసైటి ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ ఐ.ఎస్. గిలడాపాల్గొన్నారు.