20, ఏప్రిల్ 2011, బుధవారం
డీఎల్‌కు ఇదే చివరి ఎన్నికలు : శోభ
100 మంది డమ్మీ జగన్‌లు, 60 మంది డమ్మీ విజయమ్మలను పోటీలో ఉంచినా వారి భారీ విజయాన్ని ఆపలేరన్నారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి. జగన్ పార్టీ తరపున మైదుకూరు నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఆమె కాసేపు మీడియాతో మాట్లాడుతూ... యువనేత జగన్‌ను ఓడించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అధికార దర్పంతో భయాందోళనలకు గురిచేస్తోంద ని ఆరోపించారు. పోలీసులతో దౌర్జన్యం చేసి ఈ ఎన్నికల్లో మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి గెలవాలనుకుంటున్నారని, ఆయన చేసిన దౌర్జన్యాలకు ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని.. డీఎల్‌కు ఇదే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు.
అవినీతి గుర్తు తెచ్చుకోనేలా వై.ఎస్.ఆర్ పార్టీ జెండా
వై.ఎస్ ముఖ్యమంత్రి హయాంలో ప్రజా సంక్షేమం పేరిట బంధువులకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి తోడ్పాటునిచ్చారని... చివరకి సామాన్యుడినితెలుగుదేశం నేతలు పట్టించుకోలేదు సరి కదా.. వాళ్ళని భయపెట్టి పులివెందులలో వార్డు మెంబరు నుంచి ఎంపి వరకు వై.ఎస్ కుటుంబ సభ్యులే పదవులు కొట్టేసి .. అంతా ప్రజాభిమనమని చాటుకోన్నారని ఆరో పించారు రేవంత్‌రెడ్డి, యర్రబల్లె దయాకరరావు, పయ్యావుల కేశవ్‌లు. పులివెందుల ప్రచారానికి వచ్చిన వారు విలేఖర్లతో మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో ఇంత వరకు ఎన్నడూ ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరగలేదన్నారు. వైఎస్ ధౌర్జన్యాలకు, రిగ్గింగ్‌లకు పాల్పడి విజయం పొందుతూ వచ్చారన్నారు. ఈసారి ఉప ఎన్నికల్లో ప్రీ పోలింగ్ జరిగే ఓటర్లు వై.ఎస్ కుటుంబంపై కక్ష తీర్చుకొని వై.ఎస్.జగన్, విజయమ్మ, వివేకాలను ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వై.ఎస్.అభివృద్ధి పథకాల పేరిట అవినీతి సొమ్మును సంపాదించారని, ఆ అవినీతి సొమ్మును గుర్తు తెచ్చుకొనేందుకు వై.ఎస్.ఆర్ పార్టీ జెండాలో ఆ పతకాలనే రూపొందించారని, ఆ జెండా అవినీతి జెండాగా అభివర్ణించారు.
ఆ అవలక్షణాలు చేసేది జగనే...
అవలక్షణాలు చేసేది జగనే, నిందలు మాత్రం వేరొకరి పైనా వేయటం ఆయనకీ సాటి ఎవరూ లేరని ఎద్దేవా చేసారు 20 సూత్రాల కమిటీ చైర్మన్ తులసిరెడ్డి. జగన్, విజయమ్మల పేర్లతో కాంగ్రెస్స్ నీచ రాజకీయాలకి పాలపడుతోందని చెప్తున్న జగన్.. ఇన్నాళ్ళు తన వెంటతిరిగిన సురేష్‌బాబు తో బిఎస్పీ పార్టీ తరపున నామినేషన్ వేయలేదా, ఆయన పార్టీ ఎప్పుడు మారారో చెప్పాలని, అలాగే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మీ పార్టీ వారు కాదా సమాజ్‌వాది పార్టీ తరపున నామినేషన్ వేయలేదా అని ఆయన ప్రశ్నించారు.
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు కడప పార్లమెంటు అభ్యర్థి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సీఎం పదవి ఇవ్వకపోవడంతో ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. చిన్నాన్న వివేకాకు మంత్రి పదవి ఇస్తే ఆత్మగౌరవం లేదట. నీవు పదేపదే ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నావు ఏ రాజనీతి శాస్త్రంలో ఉందో మేము చదువుకొని నేర్చుకొంటామన్నారు. తండ్రి శవం పక్కన పెట్టుకొని సీఎం పదవి కోసం ప్రాకులాడలేదా అని ఆరోపించారు. ఎన్నికలయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు వస్తాయన్నది వాస్తవమన్నారు. వై.ఎస్.ఆర్ పార్టీ అంతమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు కడప పార్లమెంటు అభ్యర్థి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సీఎం పదవి ఇవ్వకపోవడంతో ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. చిన్నాన్న వివేకాకు మంత్రి పదవి ఇస్తే ఆత్మగౌరవం లేదట. నీవు పదేపదే ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నావు ఏ రాజనీతి శాస్త్రంలో ఉందో మేము చదువుకొని నేర్చుకొంటామన్నారు. తండ్రి శవం పక్కన పెట్టుకొని సీఎం పదవి కోసం ప్రాకులాడలేదా అని ఆరోపించారు. ఎన్నికలయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు వస్తాయన్నది వాస్తవమన్నారు. వై.ఎస్.ఆర్ పార్టీ అంతమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.
రామ్- సమంతలతో బెల్లంకొండ మరో చిత్రం
రామ్-హన్సిక జంటగా ‘కందిరీగ’ తెరకె క్కిస్తున్న నిర్మాత బెల్లం కొండ సురేష్ తాజాగా రామ్ తోనే మరో సినిమా కి ప్లాన్ చేసారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్ కి సమంత జంటగా నటించనుంది. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. స్రవంతి రవికిశోర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)