18, డిసెంబర్ 2011, ఆదివారం

దళిత రాజకీయాలకు దిక్సూచి ఎవరు?

దళితులకు రాజకీయ అధికారం ఒక్కటే అన్ని సామాజిక, ఆర్థిక సమస్యలకు పరిష్కారం అని భారత రాజ్యాంగపిత, ప్రముఖ రాజనీతిజ్ఞుడు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 1930లోనే చెప్పారు. నిమ్నజాతులు సొంతశక్తితోనే రాజకీయాధికారాన్ని చేపడితే తప్ప వారి సమస్యలు పరిష్కారం కావు అని కూడా ఆయన హెచ్చరించారు. ఎనిమిది దశాబ్దాల తర్వాత కూడా దళితుల సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదంటే రాజకీయాధికారం వారికి దక్కని కారణంగానే అన్నది డాక్టర్‌ అంబేద్కర్‌ హెచ్చరికతోనే రుజువవుతున్నది.
75 సంవత్సరాల దళిత రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి? ఎటు వెళ్ళాలి అనే అంశంపై హైదరాబాద్‌ నడిబొడ్డున వివిధ ఎస్‌సి, ఎస్‌టి సంఘాలు, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో జరిగే జాతీయ స్థాయి సదస్సు దేశంలో నెలకొన్న సంకీర్ణ రాజకీయాల్లో దళితులు కీలక భూమికి పోషించే ఈ తరుణంలో ఆత్మపరిశీలన దిశగా దళిత రాజకీయ నాయకులు, ఉద్యమకారులు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మార్గంలో ఏ విధంగా రాజకీయ అధికారాన్ని సాధించాలో, సాధించవచ్చో తన జీవిత కాలంలోనే నిరూపించారు నిజమైన అంబేద్కర్‌ వారసుడు బహుజన పితామహుడు, రాజకీయ బుద్ధుడు అయిన కాన్షీరాం.
నేటి దళిత రాజకీయాలకు ఆయన మార్గం అత్యంత అనుసరణీయం. ఓట్లుమావా? సీట్లు మీవా? ఇకపై చెల్లదు? ఇకపై సాగదు అంటూ దేశంలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న బ్రాహ్మణ వాద అగ్రకుల మనువాద రాజకీయాల్ని తలక్రిందులుచేసి, మినీ ఇండియాగా పిలువబడే బ్రాహ్మణాధిపత్య కేంద్రమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాన్ని తొలిసారిగా తన సొంత కాళ్ళమీద ఒక అంటరాని చమార్‌ అధికారాన్ని సాధించింది. అంటే దాని వెనుక మూడు ముఖ్యమైన అంశాలు కీలకంగా పనిచేశాయి. ఒకటి సొంత రాజకీయ పార్టీ, ఆ పార్టీ సిద్ధాంతం అంబేద్కరిజం, దాన్ని నడిపించే సమర్థవంతమైన అమ్ముడుపోని నాయకత్వం. ఈ మూడు అంశాలు దళితులు రాజకీయ అధికారాన్ని సాధించడానికి అత్యంత ఆవశ్యం. వీటికితోడు దళితులకు సొంత మీడియా, సొంత అంగబలం, ఆర్థిక బలం కావాలి.
కాన్షీరాం మాటల్లో చెప్పాలంటే, దళితులు అధికారంలోకి రాకుండా అడ్డుపడుతున్న ప్రధాన అంశాల్లో మనీ మాఫియా (అంగబలం) మీడియా (ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌), దళితుల్లో విపరీతంగా పెరిగిన చెంచాగిరి. వీటన్నింటిని ఏకకాలంలో ఎదుర్కొంటూ దళితుల సంఘటితం చేసి, ఓటు విలువను తెలియపరిచి పార్టీ ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో బుల్లెట్‌ కన్నా బ్యాలెట్‌కే అత్యంత శక్తి ఉందని గత 64 సంవత్సరాలు స్వతంత్ర రాజకీయ చరిత్ర నిరూపిస్తున్నది. అందుకే కాన్షీరాం డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చూపించిన 'బ్యాలెట్‌' మార్గాన్ని ఎంచుకున్నారు. భారత రాజ్యాంగాన్ని నవంబర్‌ 26, 1949 లో పార్లమెంట్‌కు సమర్పిస్తూ ఒక హెచ్చరిక చేశారు. రాజ్యాధికార ప్రకారం, రాజకీయంగా అందరూ సమానమే. ఒక మనిషికి ఒక ఓటు, దానికి ఒకే విలువ కాని,సామాజికం, ఆర్థికంగా అసమానతలు కొన్నివేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. సామాజిక, ఆర్థిక సమానత్వం, రాకుండా రాజకీయ సమానత్వానికి అర్థం లేదు. సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని దళితులు సాధించాలంటే రాజకీయ అధికారం ద్వారా మాత్రమే సాధిస్తారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 64 సంవత్సరాలు గడిచినా, భారత రాజ్యాంగం అమలు అయి 61 సంవత్సరాలు గడిచినా దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలు, సాంఘిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించకపోవడానికి ప్రధాన కారణం వారి చేతుల్లో పరిపాలన పగ్గాలు లేకపోవడాన్ని సాధించడానికి డాక్టర్‌ బాబా సాహెబ్‌ చాలా ప్రయత్నాలు చేశాడు.
1936లో ఇండిపెండెంట్‌ పార్టీని స్థాపించాక 1937లో జరిగిన లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఎన్నిక 18 మంది సభ్యులను గెలిపించాడు. 1942 లో అఖిల భారత షెడ్యూల్డు కులాల ఫెడరేషన్‌ పార్టీ ద్వారా 1952లో శాసన, లోక్‌సభ సభ్యులను గెలిపించారు. 1955 మారుతున్న, దేశ సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా మ్యానిఫెస్టో రూపొందించారు. 1956 లో ఆయన మరణించినా ఆమె కూడా ఆయన స్ఫూర్తితో 1957లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అనేక రాష్ట్రాల శాసన, లోక్‌సభ సభ్యులు ఆ పార్టీ నుండి గెలుపొందారు. తర్వాత కాలంలో మహారాష్ట్రలో ఆయన అనుచరులు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సిద్ధాంతం గొప్పదే కాని ఓట్లు రావు, సీట్లు రావు, అధికారం అసలే రాదు. స్వయంగా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఓడిపోవడం ద్వారా అది రుజువైంది కాబట్టి దళితులు ఆర్‌పిఐ ని వదిలి కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇతర ప్రముఖ పదవులు అనుభవించారు. ఇంకా అనుభవిస్తూ ఉన్నారు.
డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కల్పించిన రోజు రిజర్వేషన్ల కారణంగా నేడు దళితులే కాక, ఇతర వెనుకబడిన, మైనారిటీ వర్గాలు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులుగా, ఎంఎల్‌ఎ, ఎంపిలుగా కాక రాష్ట్రపతి, పార్లమెంట్‌, అసెంబ్లీ స్పీకర్‌లుగా అనేకమైన అత్యున్నత పదవులు పొందారు. దళిత అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండగా మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవారికి సైతం ఆత్మగౌరవం దక్కడం లేదు. అందుకు ప్రధాన కారణం దళితులు తమ సొంత పార్టీ ద్వారా కాక, అగ్రకుల పార్టీల ద్వారా అవకాశాలు పొందుతుండడం వలన వారి చెప్పుచేతల్లో ఉండాల్సిన పరిస్థితి. అందుకే కాన్షీరాం సొంత కాళ్లపై నడువు అసెంబ్లీ, పార్లమెంటు మెట్లు ఎక్కు అని నినాదం ఇచ్చారు. తన ఆ నినాదం డా|| అంబేద్కర్‌ 1930 సంవత్సరాలుగా ఇచ్చిన నినాదమే. అందుకే ఆయన 1984లో బి.ఎస్‌.పి స్థాపించి 1989లోనే డాక్టర్‌ అంబేద్కర్‌ నినాదానికి ఓట్లే కాదు సీట్లు కూడా వస్తాయని నిరూపించారు.

చరిత్ర పునరావృతం చేస్తున్న కాంగ్రెస్‌

చరిత్ర పునరావృతం అవుతుంది' అనేది అరిగిపోయిన మాటే. కానీ రాజకీయాల్లో మాత్రం నిత్యనూతనం. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాలు, కుమ్ములాటలు పరిశీలిస్తున్నవారికి రాష్ట్రంలో మరోసారి చరిత్ర పునరావృతమవుతున్నదన్న భావన కలుగుతుంది. 1978 -82 మధ్య ఐదేళ్ళు; 1989 -94 మధ్య ఐదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కలహాలు, నేతల కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. 1978 -82 మధ్య కాలంలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన ప్రతిపక్షం లేదు. స్వపక్షంలోనే విపక్షం ఉండేది. ఆ ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు నలుగురు ముఖ్యమంత్రుల్ని చూశారు. 1989 . 94 మధ్య కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అయినా కాంగ్రెస్‌కు స్వపక్షంలో తప్పలేదు. ఆ ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు.
2009 ఎన్నికల తర్వాత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రోశయ్య ఎక్కువకాలం పరిపాలన సాగించలేక అర్థాంతరంగా తప్పుకోవలసి వచ్చింది. రాష్ట్ర సమస్యల పరిష్కారంలో రోశయ్య విఫలం చెందారనడం కంటే... సహచర కాంగ్రెస్‌ నేతల విశ్వాసం పొందలేకపోయారనడం సబబు. తనకు మంత్రులెవరూ సహకరించడం లేదని రోశయ్య ఢిల్లీ వెళ్ళి తమ అధిష్టానం ముందు మొరపెట్టుకున్న సందర్భాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలోని ఒక బలమైన సామాజిక వర్గం రోశయ్య పదవినుంచి తప్పుకొనే వరకూ నిద్రపోలేదు.
రోశయ్య ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకొన్న తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చి ఆ పదవిని అధిష్టించిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ప్రస్తుతం పొసగడం లేదన్న వార్తలు కొట్టివేయదగినవేమీ కాదు. పిసిసి అధ్యక్షుడు కావడంలో విజయం సాధించి తొలిమెట్టు అధిరోహించి బొత్స సత్యనారాయణ మలిమెట్టు అధిష్టించడానికి ఆరాటపడుతున్నారు. రోజుకో కొత్త పథకంతో... ప్రతిష్టను పెంచుకోవాలని చూస్తున్న కిరణ్‌కుమార్‌ రెడ్డికి బొత్స కంట్లో నలుసుగా మారారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న 'రాజీవ్‌ యువకిరణాలు' పథకంపై పదునైన విమర్శలు చేసి బొత్స పిసిసి అధ్యక్షుడిగా తన పట్టు నిరూపించుకోవాలని ఆరాటపడ్డారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి ఒంటెత్తు వ్యవహారశైలి 'బొత్స'కు బాగా ఉపయోగపడింది. కేబినెట్‌లో సీనియర్లయిన డిఎల్‌ రవీంద్రారెడ్డి, జానారెడ్డి వంటివారు కొన్ని పథకాలను బాహాటంగానే విమర్శిస్తున్నారు.
కొత్త పథకాల జోరుతో ప్రభుత్వంపై, పార్టీపై పట్టు సాధించాలని చూసిన కిరణ్‌కుమార్‌ రెడ్డిని సీనియర్‌ మంత్రుల విమర్శలు జీర్ణించుకోలేని విధంగా తయారయ్యాయి. కలెక్టర్ల సమావేశంలో సీనియర్‌ మంత్రులు పరిపాలనా లోపాల్ని ఎత్తిచూపుతూ చేసిన నిశిత వ్యాఖ్యలు... జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో పడేసింది. సాధారణంగా కేబినెట్‌ సమిష్టిగా నిర్ణయాలు తీసుకొంటుంది. ప్రతి నిర్ణయాన్ని కేబినెట్‌ మంత్రులు సమర్థిస్తూ మాట్లాడుతుంటారు. కానీ, ఇపుడు ప్రభుత్వ నిర్ణయాలను మంత్రులే వ్యతిరేకిస్తున్నారు. అంటే అర్థం... చాలా నిర్ణయాల్లో వారికి ప్రమేయం లేదు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌ రెడ్డి ఒక్కరే తీసుకొంటున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. కిలో రూపాయి బియ్యం పథకంతో సహా ఇటీవల ప్రకటించిన చాలా స్కీమ్స్‌ ముఖ్యమంత్రి సొంతవి.
ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో మంత్రుల భాగస్వామ్యం లేకపోవడం పార్లమెంటరీ డెమోక్రసీకి మచ్చ. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశం సందర్భంగా... శాంతిభద్రతలపై జరిగే సమీక్షా సమావేశేంలో ఒక్క హోంమంత్రి మినహా మిగతా మంత్రులందర్నీ సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లమని ముఖ్యమంత్రి ఆదేశించడం కిరణ్‌కుమార్‌ రెడ్డి వ్యవహారశైలిని గమనిస్తున్న వారికి ఆశ్చర్యం కలిగించదు. కాకపోతే... ఆయన అంత నిర్మొహమాటంగా మంత్రుల్ని బయటకు పంపించడమే ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. మంత్రులతో సమన్వయం చేసుకోకుండా, టీమ్‌ వర్క్‌ లేకుండా ఆయన తన స్థానాన్ని ఎలా సుస్థిరం చేసుకోగలరో అర్థం కాదు.
పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య ఏ విధంగా సమన్వయం లేదో... పార్టీ వ్యవహారాలకు సంబంధించి సి.ఎం., పీసిసి అధ్యక్షుడి మధ్య కూడా సత్సంబంధాలు ఉన్నట్లు కన్పించడం లేదు. ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసిన జగన్‌ వర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలపై వేటువేయాలని బొత్స ఉత్సాహపడుతుండగా ఆ ప్రక్రియను వీలైనంతమేర వాయిదా వేయించాలని కిరణ్‌కుమార్‌ రెడ్డి భావిస్తున్నారు. వేటుపడ్డాక వచ్చే ఉప ఎన్నికల్ని ఎదుర్కోవడం ఇబ్బందికరమైనదని కిరణ్‌కుమార్‌ రెడ్డికి తెలుసు. ఉప ఎన్నికలు వచ్చి మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైతే... కిరణ్‌కుమార్‌ రెడ్డికి పరిపాలించడం కష్టమవుతుందనే భావనతో... గీతదాటిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనంటూ పిసిసి అధ్యక్షుడు పట్టుబడుతున్నారు. రాజకీయంగా వీరిద్దరూ ఎత్తుకు పై ఎత్తులు వేసుకొంటుంటే... వీరిద్దరి మధ్య సమన్వయం చేయాల్సిన కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తూ తమకు అలవాటైన 'విభజించు -పాలించు' సూత్రాన్ని అమలు చేస్తోంది.
ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని... వాటికి బొత్స ప్రోత్సాహం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల శైలిని గమనించే వారికి... అది వార్త కానేకాదు... జోడు పదవులు నిర్వహిస్తున్న బొత్సను మంత్రిపదవి నుంచి తప్పించి పిసిసికి పరిమితం చేయాలని సి.ఎం. తమ అధిష్టానాన్ని కోరినట్లు వార్తలొచ్చాయి. అది నెరవేరకపోయేసరికి సిఎం తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తాజాగా, ఉత్తరాంధ్ర మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు చేసి కీలక సమాచారం సేకరించినట్లు, ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే ఇవి జరిగినట్లు సాగుతున్న ప్రచారం నిజమైతే... రాష్ట్ర రాజకీయాలు మరోమలుపు తిరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడల్లా చరిత్ర పునరావృతం అవుతుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కేవాలి?

చీ'కట్‌'లో పరిశ్రమలు

ప్రకృతి చేసిన గాయం రాచపుండులా మారి యావత్‌ రాష్ట్రప్రజానికాన్ని కంటనీరుపెట్టిస్తోంది. తీవ్రవర్షాభావ పరిస్థితులు అన్నదాతల అంతుచూడగా... ఎడాపెడా విద్యుత్‌ కోతలు ఉపాధికి ఉరితాళ్లను పేనుతున్నాయి. గడిచిన నాలుగునెలల కాలంగా విద్యుత్‌ కోతలతో పారిశ్రామిక రంగం రూ.50వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఫలితంగా పరిశ్రమల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో లక్షలాది మంది కార్మికులు ఉపాధిని కోల్పోయే ప్రదకర పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే లక్షఉద్యోగాలు మాట ఎలాఉన్నా, ఉన్న ఉద్యోగాలు ఊడి నిరుద్యోగ సమస్య జటిలం కానుంది. వేసవికి ముందుగానే విద్యుత్‌ లోటు భారీగా కనిపిస్తుండటంతో రబీసాగుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ విద్యుత్‌ కోత తీవ్రంగా వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ఆశయం నెరవేరే సూచనలు కనిపించడంలేదు. కష్టకాలంలో సాంకేతిక లోపాలతో మొరాయిస్తున్న
ధర్మల్‌ ప్రాజెక్టులు... విద్యుత్‌ కేటాయింపులో కేంద్రం మాట నిలబెట్టుకోకపోవడం... వెరసి రానున్న కాలంలో రాష్ట్రప్రజలు మరింత గడ్డుపరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం రైతులతోపాటు పారిశ్రామిక రంగంపై కూడా పడింది. చినుకుజాడలేక ఎండిపోయిన ఖరీఫ్‌పంటచేలు పశువుల మేతకు బీళ్లుగా మారగా, పరిశ్రమలు సైతం పడకేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సకలజనుల సమ్మె ప్రారంభమైన నాటినుండే పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు ప్రారంభం కాగా, నానాటికీ కోతల సమయం పెరుగుతూ పోతుండటంతో వాటి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. దేశఆర్థిక వ్యవస్థకు గుండెకాయలా ఉండే పరిశ్రమలు ప్రస్తుతం సంక్షోభం దిశగా అడుగులు వేస్తుండటంతో ఆప్రభావం లక్షలాది మంది కార్మికులపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నాలుగునెలలుగా పవర్‌హాలిడే పేరుతో వారానికి రెండురోజుల చొప్పున పరిశ్రమలకు పూర్తిగా విద్యుత్‌ కోత విధిస్తుండటంతో పనులు సాగక కార్మికులు తమ ఉపాధిని కోల్పోవాల్సి వస్తోంది. పవర్‌హాలీడే పుణ్యమాని రాష్ట్రవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇప్పటికే రూ.50వేల కోట్ల వరకూ నష్టపోయాయి. దీంతో బ్యాంకురుణాలు కూడా చెల్లించలేక పరిశ్రమల యజమానులు అప్పులపాలు కావాల్సి వస్తోంది. పవర్‌హాలీడేతోపాటు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుండి రాత్రి పదిన్నర వరకు పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు విధిస్తుండటం, అనధికారికంగా కూడా కోతలు సాగుతుండటంతో పరిశ్రమలు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితంగా పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి వీదినపడే పరిస్థితులు గోచరిస్తున్నాయి.
అయితే వచ్చే ఏడాది జనవరి 1 నుండి పరిశ్రమలకు విధించిన పవర్‌హాలీడేను ఎత్తివేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ విద్యుత్‌లోటు భారీగా కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇటు పరిశ్రమలకు , అటు వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా ఎలా చేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వర్షాలు లేక రాష్ట్రంలో జలవిద్యుత్‌ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. మరోవైపు కృష్ణ-గోదావరి (కెజీ)బేసిన్‌లో ఉత్పత్తి తగ్గిపోయిందన్న సాకుతో గ్యాస్‌ సరఫరా తగ్గించడం ఫలితంగా గ్యాస్‌ ఆధారిత ఉత్పత్తి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి ధర్మల్‌ ప్రాజెక్టులే ఆధారం అయినప్పటికీ వరంగల్‌లోని 500 మెగావాట్ల కెటిపిపి, విశాఖలోని 500 మెగావాట్ల ఎన్‌టిపిసిల్లో నెలకొన్న సాంకేతిక లోపాలతో ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఏపిజన్‌కో ధర్మల్‌ ప్రాజెక్టుల సామర్థ్యం పెరగడంతో గతఏడాది 58 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను అందించిన ప్రాజెక్టులు ప్రస్తుతం 98 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండటం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే రాష్ట్రంలో 10 నుండి 15శాతం వరకు మాత్రమే విద్యుత్‌ కొరతఉందని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నప్పటికీ అంతకు రెట్టింపు స్థాయిలోనే కొరత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ను కొనుగోలు చేయడం లేదా కేంద్ర సహకారాన్ని కోరడం మినహా పరిష్కార మార్గాలు కనిపించడం లేదు. చిన్న,మధ్యతరహా, భారీ పరిశ్రమల మాట అలాఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకాన్ని విద్యుత్‌ కోతలు తీవ్రంగా వేధిస్తున్నాయి.
రాష్ట్రరాజధాని హైద్రాబాద్‌లో సైతం రెండుగంటలు విద్యుత్‌ కోత ఉండగా, జిల్లాకేంద్రాల్లో ఆరు గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, పల్లెల్లో 10 గంటల విద్యుత్‌ కోత అమలవుతోంది. దీంతో పట్టణాలు, పల్లెల్లో జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న మిల్లులు, జీరాక్స్‌ సెంటర్లు, పోటో స్టూడియోలు, రిపేరింగ్‌ దుకాణాలు, టైలరింగ్‌ తదితర యూనిట్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆయా యూనిట్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. మరోవైపు విద్యుత్‌ కొరతతో సినిమా ధియేటర్లు కూడా మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ.7 ఉండగా, జనరేటర్‌ ద్వారా ఒక్క యూనిట్‌కు రూ.14 వరకు ఖర్చు వస్తుండటంతో సినిమాలు ప్రదర్శించిన యజమానులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.మరోవైపు విద్యుత్‌ కోతలతో ఆసుపత్రుల్లో రోగులు, చిన్నారులు దోమలబెడదతో పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వాసుపత్రుల్లో జనరేటర్లు ఉన్నా కొన్ని చోట్ల వినియోగించకపోతుండటంతో రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మరోవైపు ఎక్స్‌రే , స్కానింగ్‌ రిపోర్టులకు సైతం రోజల్లా ఎదురుచూడాల్సిన పరిస్థితిలు కనిపిస్తున్నాయి.
గొల్లుమంటున్న పల్లెలు
విద్యుత్‌ కోతలు పల్లెప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పట్టణాల్లో ఆరుగంటల కోతతో సరిపెడుతున్న అధికారులు పల్లెల్లో మాత్రం అధికారిక, అనధికారికంగా ఎడాపెడా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ప్రస్తుతం పల్లెల్లో పదిగంటల పాటు అధికారికంగా విద్యుత్‌ కోత విధిస్తుండగా, గత వారంరోజులుగా రాత్రి వేళల్లోనూ అనధికారికంగా కోతలు పెడుతున్నారు. ఓ వైపు విద్యుత్‌ కోత , మరోవైపు దోమల మోత వెరసి పల్లె ప్రజలునిద్రకు దూరమవుతున్నారు. మరోవైపు, విద్యుత్‌ కోతల కారణంగా పల్లెల్లో తాగునీటి పథకాలు పూర్తిగా పడకేస్తున్నాయి. ఉదయం ఆరు గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు విధిస్తున్న కోతతోపాటు అనధికారిక కోతలు కూడాతోడవుతుండటంతో రక్షిత మంచినీటిపథకాల మోటర్లు నడవక పల్లె ప్రజల గొంతులు ఎండుతున్నాయి. అదలాఉండగా వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి పీకల్లోతు కష్టాల్లో కూరకుపోయిన రైతులు రబీసాగుపై ఆశలు పెట్టుకోగా, విద్యుత్‌ కోతలతో రబీసాగుపై కూడా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పల్లెల్లో రైతులు , ప్రజల కష్టాలు పగవాడికి కూడా రాకూడదన్నట్లుగా మారాయి.
సమ్మె... సాకే
సకలజనుల సమ్మె వల్లే విద్యుత్‌ కోతలు విధించాల్సి వసతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బొగ్గు ఉత్పత్తి లెక్కలను చూస్తే వారి ప్రకటనలు వాస్తవ విరుద్ధాలుగా కనిపిస్తున్నాయి. సింగరేణిలో సమ్మె ప్రభావం కొంతమేరకు చూపిన మాట వాస్తవమే అయినా విద్యుత్‌ కోతలకు పూర్తి కారణం సమ్మె మాత్రమే కాదని తేటతెల్లమవుతోంది. ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ సింగరేణి ఏరియాల్లో సమ్మెసంపూర్ణంగా సాగినప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం కార్మికులు సమ్మెలో పాల్గొనలేదు. 35రోజుల సమ్మె కాలంలో 52లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కావల్సి ఉండగా, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి ఓసీల్లో 15లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. సమ్మె అనంతరం ఆ నష్టం భర్తీచేసుకోవడానికి సింగరేణి యాజమాన్యం తీసుకున్న చర్యలు ఫలించాయి. రాష్ట్రంలో 36భూగర్బ, 14ఓపెన్‌ కాస్టు గనులుండగా , గతంలో రోజుకు 1.20లక్షల టన్నుల బొగ్గుఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకునే వారు. అయితే సమ్మె ప్రభావం నుండి కోలుకోవడానికి ప్రస్తుతం 1.93లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న యాజమాన్యం ఈమేరకు ఇప్పటికే సఫలీకృతమైంది. కార్మికుల భోజన విరామ సమయాన్ని కూడా కుదించి బొగ్గు ఉత్పత్తిని కూడా పెంచడానికి యాజమాన్యం పకడ్బందీ చర్యలు చేపట్టింది.దీంతో సమ్మె ముగిసిన రెండవరోజు నుండే విద్యుత్‌ ప్లాంట్లకు తగ్గబొగ్గు తరలిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్‌ కోతలకు పూర్తిగా సమ్మేకారణం అని ప్రభుత్వం, అధికారులు చేస్తున్న ప్రకటనలు నమ్మశక్యంగా కనిపించడం లేదు.
మాటతప్పిన కేంద్రం
సకల జనుల సమ్మెతో రాష్ట్రంలో విద్యుత్‌ కొరత తీవ్రంగాఉన్న నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రభుత్వ విన్నపానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రానికి 183 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయిస్తున్నట్లు ప్రకటన కూడా చేసింది. అయితే విద్యుత్‌ కెటాయింపులో మాటతప్పిన కేంద్రం రాష్ట్రానికి ఇస్తానన్న కేంద్రం తమిళనాడు, కేరళలకు మరలించి మనకు మొండిచేయి చూపింది. అయితే కష్టకాలంలో తాను ఇచ్చిన మాటను కేంద్రం తప్పినా రాష్ట్రానికి చెందిన ఆపార్టీ ఎంపిలు గానీ , రాష్ట్రప్రభుత్వం గానీ ఒత్తిడితెచ్చి విద్యుత్‌ను తేవడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పవచ్చు. గతంలో ఇచ్చిన మాట ఎలా ఉన్నా ప్రస్తుతం రాష్ట్రాన్ని చీకట్లు చుట్టుముడుతుండటం, విద్యుత్‌ కోతలతో పారిశ్రామిక రంగం సంక్షోభంలో కూరుకుపోతుండటం వంటి గడ్డుపరిస్థితులు నెలకొన్న తరుణంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చిగతంలో కేటాయించిన విద్యుత్‌తో పాటు అదనంగా రాష్ట్రానికి విద్యుత్‌ కేటాయింపులు చేయించుకోగలగితే కరెంటు కష్టాలు కొంతమేరకైనా గట్టెక్కవచ్చు.

భగవద్గీత తీవ్రవాద సాహిత్యం!

హిందువులు అమితంగా గౌరవించే ఆరాధించే భగవద్గీతను రష్యా ప్రభుత్వం నిషేధించేందుకు రంగం సిద్ధం చేసింది. టామ్‌స్క్‌ లోని న్యాయస్థానంలో భగవద్గీతను తీవ్రవాద సాహిత్యంగా గుర్తించి రష్యా ప్రభుత్వం నిషేధించిన వివిధ పుస్తకాల జాబితాలోకి దీన్ని చేర్చి ప్రచారంలో లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ యేడాది జూన్‌లో ఒక పిటిషన్‌ దాఖలైంది. దీన్ని ఎఫ్‌ఎస్‌బి, రష్యన్‌ ఆర్థోడాక్స్‌ చర్చి కలిసి దాఖలు చేశాయి. టామ్‌స్క్‌ ప్రాంతంలో హిందువులు సంఖ్యాపరమైన మైనార్టీలు. ఈ ప్రాంతంలో తమ మూలాలు పెంచుకోడానికి, చాప కింద నీరులా విస్తరించడానికి ఇస్కాన్‌ ప్రయత్నిస్తోందని అక్కడి సంప్రదాయవాద క్రైస్తవులు ఆరోపిస్తున్నారు. ఇస్కాన్‌ ఆటలు కట్టించేందుకు, విస్తరించకుండా అడ్డుకునేందుకు కేసు దాఖలు చేశారు. ఈ ఆరోపణలు వచ్చాక భగవద్గీతను నిపుణుల కమిటీకి పంపించారు. ఆ కమిటీని యూనివర్శిటీ ప్రొఫెసర్లతో ఏర్పాటు చేశారు. ఆ ప్రొఫెసర్లు గీతను చదివి ఈ గ్రంథం 'మత, లింగ, జాతి, జాతీయతా, భాషా ద్వేషాలను రెచ్చగొట్టేదిగా ఉందని అభిప్రాయపడింది. రష్యా ప్రభుత్వం ఆరోపించింది. ఈ పుస్తకాన్ని, అచ్చువేసినా, కలిగిఉన్నా, పట్టుకుతిరిగినా, పంచినా ప్రమాద కరమైన నేరంగా భావించి దారుణంగా శిక్షించాలని సిఫారసులు అందాయి. అందుకు అనుగుణంగా రష్యా
ప్రభుత్వం నిషేధపుటుత్తర్వులు జారీచేసేందుకు రంగంసిద్ధం చేస్తోంది.
మన న్యాయస్థానాలు అతిపవిత్రమైన గ్రంథంగా భావించి ప్రమాణ గ్రంధంగా గుర్తించి సాక్ష్యులతో ప్రమాణాలు చేయిస్తుంటే అది మత విద్వేషాలను రెచ్చగొట్టేదిగా ఉందని, మనుషుల మధ్య చిచ్చురేపేదిగా ఉందని రష్యా ప్రభుత్వం భావిస్తోంది. సార్వకాలీన సత్యాలకు ఆటపట్టుగా, మానవత్వాన్ని ప్రబోధించే పుస్తకంగా హిందువులు నమ్ముతుంటే అది జాతి విద్వేషాన్ని, భాషాద్వేషాలను పురికొల్పుతోందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇస్కాన్‌ వాళ్ళు చేస్తున్న కృష్ణచైతన్య ప్రచారాలను అడ్డుకోవడానికి ఈ చర్య తోడ్పడుతుందని హిందువుల మనోభావాలను గాయపరిచేదిగా ఉందని ఇస్కాన్‌ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వం త్వరగా మేలుకుని భగవద్గీతపై నిషేధం వేటుపడకముందే రష్యన్‌ ప్రభుత్వంతో మాట్లాడి దిద్దుబాటు, సర్దుబాటు చర్యలు చేపట్టాలని ఇస్కాన్‌ వారు కోరుతున్నారు. ప్రపంచదేశాలు రెండోమాటలేకుండా ఆదరించి అక్కున చేర్చుకున్న ఆ అద్భుత వ్యాఖ్యాన గ్రంథాన్ని ఇస్కాన్‌ వ్యవస్థాపక గురువు భక్తివేదాంత స్వామి ప్రభుపాద రచించారు. ఏ దేశంలో ఎవ్వరూ పెట్టని వంకలన్నీ రష్యన్లు ప్రభుపాద రచించిన గీతకు ఆపాదించారు. ఈ పుస్తకాన్ని అన్ని దేశాల నాయకులు కళ్ళకద్దుకుని మహాప్రసాదంగా స్వీకరిస్తుంటే రష్యా ప్రభుత్వం విపరీతంగా పరిగణించడం వివాదాస్పదమైంది. కృష్ణభక్తులను, ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలను గాయపరుస్తోంది. ఇటీవలే బ్రిటన్‌ ప్రధానమంత్రి డేవిడ్‌ కేమరాన్‌కు ఈ పుస్తకాన్ని బహుమానంగా అందిస్తే ఆయన ఎంతో సంతోషపడిపోయి దాన్ని తన ఆఫీసు లైబ్రరీలో దాచుకున్నారు. వేదవ్యాసముని రచించిన భగవద్గీతను రష్యా భాషలోకి అనువదించి ఇస్కాన్‌ అక్కడ గీతను ప్రచారం చేస్తోంది. 1989లో ఈ రష్యాభాషలో ఉన్న భగవద్గీత కాపీని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీకి బహూకరించారు కూడా! ఆగస్ట్‌ లో ఈ కేసుపై తొలి విచారణ జరిగింది. ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి గలీనా బటెన్కో ఈ వాదనలు విన్నారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలని సిఫారసు చేసిన నిపుణుల కమిటీ చేసిన వాదనలో పసలేదని, దాన్ని నిషేధించాలనడానికి బలమైన సాక్ష్యాలు చూపలేకపోయారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కమిటీలోని నిపుణులు కూడా ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవలేదని, అభ్యంతరాలు వ్యక్తం చేసిన పార్టీల వాదనలతో ఏకీభవించి సిఫారసులు చేశామని అంగీకరించారు. దాంతో న్యాయమూర్తి కామెరోవో వర్శిటీకి చెందిన ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి భగవద్గీతయథాతథం పుస్తకంపై అభిప్రాయాన్ని ఇవ్వవలసిందిగా కోరారు.
ఈ కమిటీలో ఒక్క హిందువు కూడా లేకపోవడంతో ఇస్కాన్‌ ప్రతినిథులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును సాకుగా తీసుకుని ఇస్కాన్‌ కార్యకలాపాలకు చెక్‌ చెబుతారేమోనని వారు భయపడుతున్నారు. నార్వేకు చెందిన మైనార్టీల మతహక్కుల పరిరక్షణ సంస్థ 'ఫోరమ్‌-18 తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. దీనిపై మన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తులు అందాయి. దీనిపై సీరియస్‌గా స్పందించి రష్యా ప్రభుత్వంతో మాట్లాడి కేసు ఉపసంహరించుకోడానికి లేదా కేసు వీగిపోయేలా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేలా చూడాలని మాస్కోలోని భారత రాయబారకార్యాలయానికి సూచించారు. ఈ కేసుపై సోమవారంనాడు తదుపరి విచారణ జరగనుంది.

తెలంగాణ ఉప ఎన్నికల ప్రచార సారథి దేవేందర్‌

తెలంగాణాలో త్వరలో జరిగే ఉపఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యతను పార్టీ సీనియర్‌ నాయకుడు టి.దేవందర్‌ గౌడ్‌కు అప్పగించాలని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఉపఎన్నికలు జరిగే కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల పేర్లను కూడా దాదాపుగా ఖరారు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎన్నికలు జరిగే నాగర్‌ కర్నూలు, కొల్లాపూర్‌, మహబూబ్‌నగర్‌ స్థానాలతో పాటు మిగిలిన జిల్లాల్లో ఎన్నికలు జరిగే స్థానాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో దేవేందర్‌ గౌడ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ఎంపికపై పార్టీలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఎంపిక బాధ్యతను కూడా దేవేందర్‌ గౌడ్‌కే చంద్రబాబు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ప్రచారంలో దేవేందర్‌ గౌడ్‌తో పాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహుల, వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కూడా ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు. ఉపఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఒక్కో మండలానికి ఇద్దరు నుండి నలుగురు ఎమ్మెల్యేలను ఇన్‌చార్జ్‌లుగా నియమించే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎల్‌.రమణ, విజయరమణారావు, గంగుల కమలాకర్‌లను నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు. వరంగల్‌ జిల్లాలోని పరకాల నియోజకవర్గానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేం నరేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిలను ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు. నాగర్‌కర్నూల్‌కు దేవేందర్‌ గౌడ్‌తో పాటు రేవంత్‌రెడ్డి, జైపాల్‌ యాదవ్‌, పి.రాములు, ఎర్ర చంద్రశేఖర్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు. మహబూబ్‌నగర్‌ స్థానానికి ఎల్లారెడ్డి, దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డిలను, కొల్లాపూర్‌కు రావుల చంద్రశేఖరరెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన ఉమా మాధవరెడ్డిని కూడా ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు

మనమే తాగిద్దాం

నూతన ఎక్సైజ్‌ సంవత్సరం నుంచే కొత్త అబ్కారీ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. నేరుగా ప్రభుత్వమే రిటైల్‌ ఔట్‌లెట్స్‌ను నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో అక్రమ మద్య వ్యాపారం, పన్ను ఎగవేత, ధరల నియంత్రణలతోపాటు మద్యం మాఫియాను కట్టడి చేసే అవకాశాలుంటాయని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే సిబిఐ, విజిలెన్స్‌ శాఖలు మద్యం సిండికేట్‌లపై దాడులు నిర్వహిస్తున్నాయి. రైస్‌ మాఫియా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రభావితం చేస్తోంది. తమకనుగుణంగా చట్టాల్ని మార్చుకుంటోంది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని పొందుతోంది. ఇప్పుడు రైస్‌మాఫియాను కూడా మద్యం మాఫియా మించిపోతోంది. మద్యం అక్రమవ్యాపారంతో కొందరు కోట్లకు పడగలెత్తారు. వీరంతా రాజకీయాల్ని శాసిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు భారీగా ముడుపులిస్తున్నారు. గెలిచినవారిని తమకనుకూలంగా మలచుకుంటున్నారు. వారిని చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నారు. పరోక్షంగా ప్రభుత్వంపై పెత్తనం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారికీ, వీరికి పెట్టుబడి పెట్టడం కంటే తామే నేరుగా చట్టసభలకు పోటీ చేయాలన్న ఆలోచన పలువురు అక్రమ మద్యవ్యాపారుల్లో చోటు చేసుకుంది.తద్వారా ప్రభుత్వంపై ప్రత్యక్షంగా పెత్తనం చేసి తమ వ్యాపార ప్రయోజనాల్ని పరిరక్షించుకోవాలని వీరు ఆశిస్తున్నారు. ఇప్పట్లా కొందరు ప్రభుత్వ పెద్దలకు నెలనెలా మామూళ్ళివ్వడం, వ్యాపారాల్లో వాటాలివ్వడం, పదే పదే వారికి మొరపెట్టుకుని అధికారులపై ఒత్తిళ్ళు తేవడం కంటే నేరుగా తామే అధికారుల్ని ఆదేశించే స్థానంలోకెళ్ళడం వీరి లక్ష్యంగా తెలుస్తోంది. మాదకద్రవ్యాలు, మద్యం మాఫియా ఇంతవరకు సమాజానికి చేటుగా డవించేవారు. కానీ ఇప్పుడు వీరు ప్రజాస్వామ్య వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారు. వ్యవస్థ పునాదుల్ని కదిపేస్తున్నారు. గతంలోకూడా మద్యం మాఫియా దేశాన్ని అతలాకుతలం చేసింది. అనేక రాష్ట్రాల్లో తమ ప్రాబల్యం ప్రదర్శించింది. వీరిని అణచివేసేందుకే ప్రభుత్వాలు పలురకాల ఆలోచనల్ని అమలు చేశాయి. కొన్ని దశల్లో మద్య నిషేధాన్ని కూడా ప్రవేశపెట్టాయి. భారీగా సమకూరే అబ్కారీ ఆదాయాన్ని కూడా పక్కనపెట్టేసి సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రయత్నించాయి. కానీ అధికారుల వైఫల్యంతో అనధికార మద్యం వెల్లువెత్తింది. కల్తీసారా విజృంభించింది. ఇది ప్రజల ప్రాణాలకు చేటుతెచ్చింది. మద్యం మాఫియా ఈ అవకాశాన్ని వినియోగించుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమమార్గాల్లో మద్యాన్ని స్మగ్లింగ్‌ చేసింది. కోట్లకు కోట్లు సంపాదించింది.
ఒక దశలో సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపే స్థాయికి ఎదిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టిఆర్‌ మూడోసారి అధికారంలోకి రాగానే తొలి సంతకాన్ని మద్యనిషేధ దస్త్రంపైనే పెట్టారు. కానీ అది మూణ్ణాళ్ళ ముచ్చటగానే ముగిసింది. మరికొంతకాలం నిషేధం అమలైతే మద్యం మాఫియా శక్తికి ప్రభుత్వం కూడా తల వంచక తప్పదని చంద్రబాబు గుర్తించారు. అంచెలంచెలుగా నిషేధాన్ని తొలగించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం టోకు వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. డిస్టిలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి రిటైల్‌ వ్యాపారులకు అమ్ముతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11,300కి పైగా మద్యం దుకాణాలకు బహిరంగ వేలం పద్ధతిలో అనుమతులిచ్చింది. వీటికి పదిరెట్లకు పైగా బెల్ట్‌షాపులు వెలిశాయి. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చి జీరో బిజినెస్‌ నిర్వహిస్తున్నారు. వీటి అమ్మకాలపై పన్ను ఎగవేస్తున్నారు. మరోవైపు సిండికేట్‌గా ఏర్పడి ధరల్ని తమ అదుపులో పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు మద్యం వ్యాపారంలోకి దిగితే సమాజంలో చులకనౌతారని భావించేవారు. కాగా ఇప్పుడదే ప్రతిష్ఠాత్మక వ్యాపారంగా మారింది. కాంగ్రెస్‌, తెలుగుదేశం, బిజెపి ఇలా పార్టీలతో సంబంధంలేకుండా నేతలంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానే మద్యంవ్యాపారంలోకి ప్రవేశించారు. అందులోనే కాసులు గడిస్తున్నారు. దాన్నే రాజకీయాలకు పెట్టుబడిగా పెడుతున్నారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా దీన్నే ప్రధాన ఆదాయమార్గంగా ఎంచుకున్నారు. ఈ పరిస్థితిని కట్టడి చేయక పోతే 2014ఎన్నికల్లో మద్యం సిండికేట్‌లు, వ్యాపారులతో పోటీకి దిగడం కష్టమని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోలేమన్న భయం కొందరు పాలకుల్లో ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 5వేలకోట్లకు పైగా షాపుల వేలం ద్వారా అబ్కారీ ఆదాయం లభిస్తోంది. మరో 7వేల కోట్లు హోల్‌సేల్‌ వ్యాపారం, ఎక్సైజ్‌ డ్యూటీ, అమ్మకపు పన్ను ద్వారా సమకూరుతోంది. బడ్జెట్‌లో సింహభాగాన్ని సంపాదించి పెడుతున్న అబ్కారీని నిర్లక్ష్యం చేయకుండానే క్రమబద్ధీకరించి తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకోసం గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన విధానాల్ని పాలకులు అధ్యయనం చేస్తున్నారు. గుజరాత్‌, నాగాలాండ్‌, మిజోరం రాష్ట్రాల్లో ఇప్పటికీ సంపూర్ణ మద్యనిషేధం అమలౌతోంది. రెండేళ్ళ క్రితం గుజరాత్‌లో కల్తీసారా మరణాలు జరగడంతో మద్యంప్రియుల కోసం పర్మిట్లు ఇవ్వాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. కాగా గిరిజనుల్లో మద్యం వినియోగం అధికంగా ఉన్నప్పటికీ నాగాలాండ్‌, మిజోరం ప్రభుత్వాలు ఈ వ్యాపారాన్ని అనుమతించడంలేదు. ఢిల్లీలో టోకు, చిల్లర వ్యాపారాలన్నీ ఆ రాష్ట్రప్రభుత్వమే చేస్తోంది. ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేసి ప్రభుత్వ దుకాణాల ద్వారానే వినియోగదారులకు విక్రయిస్తోంది. పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలోనే ఈ వ్యాపారం సాగుతోంది. నిర్ణీత వేళలు, ధరల్ని ఖచ్చితంగా అమలు చేస్తోంది. కేరళలో మద్యం వినియోగం బాగా ఎక్కువ. ఆ రాష్ట్ర ఆదాయంలో 40శాతం అబ్కారీ ద్వారానే సమకూరుతోంది. ఒకప్పుడు అక్కడ ప్రైవేటు వ్యాపారులుండేవారు. వారంతా సమాంతర ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి ఎదగడంతో మొత్తం మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ప్రతి 80వేలమందికి ఒక దుకాణం చొప్పున 337షాపుల్ని ఆ రాష్ట్రంలో ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. వారానికి ఏడురోజులూ ఉదయం 8నుంచి రాత్రి 10గంటల వరకు అక్కడే అమ్మకాలు సాగిస్తున్నారు.దీంతో వ్యాపారం పెరగడమే కాకుండా ఆదాయం గణనీయంగా వృద్ధి అయింది. 1984లో ప్రభుత్వం చేపట్టే నాటికి కేరళలో అబ్కారీ ఆదాయం 60కోట్లుంటే 2010నాటికది 5వేలకోట్లకు చేరుకుంది. వీటన్నింటిని పరిశీలిస్తున్న పాలకులు ఇదే విధానాన్ని రాష్ట్రంలో కూడా ప్రవేశపెడితే మద్యం మాఫియా అక్రమాలకు, ఆగడాలకు అడ్డుకట్ట వేయగలమని భావిస్తున్నారు.

లేపాక్షి బసవయ్య నీకిదేం దుస్ధితి అయ్యా!

భారతావని కళలకు పుట్టినిల్లు.. శిల్పకళకు జీవగడ్డ. ఎందరో చక్రవర్తు లు, మహారాజులు, రాజులు, సరాజులు, సామంతులు తమ అభిరుచుల మేరకు కట్టించిన ఎన్నో కట్టడాలకు శిల్పకళా నైపుణ్యం తోడై నేటికి పర్యా టక కేంద్రాలుగా భాసిల్లుతునే ఉన్నాయి. ఆంధ్రదేశాన సైతం ఇలాంటి కళాసంపద అందర్నీ ఆకర్షిస్తూ ... అక్కున చేర్చుకుంటున్నాయి. వాటిలో అగ్ర భాగాన నిలచేది లేపాక్షి అనటంలో సందేహం లేదెవ్వరికీ... అద్భుత శిల్ప కళా నిలయంగా నిలచే లేపాక్షి అందాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదేవెూ లేపాక్షి బసవయ్యా లేచి రావయ్య అంటూ అడవి బాపిరాజులాంటి అగ్ర కవి ఉత్తములే ఇక్కడి నందిని చూసి పరవశించి పోయారంటే చూసేవారికి కళా తృష్ణ ఉండాలే కానీ ఇక్కడి శిల్ప కళాఅందాలెలాంటివో ఇట్టే తెలుసుకోవచ్చు.
విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ్ప్పశ 1530 నుండి 1542 వరకు పాలించిన అచ్యుత దేవ రాయులు కాలంలో ఇక్కడ వీరభద్ర ఆలయాన్ని నిర్మించడం జరిగిందని...ఏక శిలపై తెలుగుదనం ఉట్టి పడేలా నంది నిర్మాణం జరిగి నట్లు చరిత్రకారులు చెప్తారు. పెనుగొండగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం లో ఆంధ్రదేశాన హిందుపురానికి 18 కిలో మీటర్ల దూరంలో వెలసిన అద్భుత శిల్పకళా క్షేత్రం లేపాక్షి. రాయల కాలం అంతరించాక ఈ ప్రాం తాన్ని అనేక మంది ఆక్రమించుకున్నారు. ఆపై నవాబులపాలనలోకి వచ్చి తరువాత పాలెగాళ్లు...ఆపై మరాఠాల ఏలుబడిలో కొనసాగింది. మురారి రావు అనే మరాఠాయోధుడు తన తండ్రి హిందూరావు పేరుపై నిర్మించిన పట్టణం హిందూపురం. తరువాత టిపð సుల్తాన్‌ పాలనలోకి వెళ్లిన ఈ ప్రాంతాన్ని బ్రిటీష్‌ పాలకులు టిపð సుల్తాన్‌ని శ్రీరంగ పట్టణంలో వధించి తమ వశం చేసుకుని నైజాం పాలనలోకి తెచ్చారు. తదుపరి నైజాం తన రాజ్యంలోని కొంత భాగాన్ని బ్రిటీష్‌ వారికి దత్తత ఇవ్వటంతో ఈ ప్రాంతం కూడా ఆ దత్తమండలంలో భాగమై బ్రిటీష్‌ పాలనలోకి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన అనేక దాడుల కారణంగా ఇక్కడి శిల్పకళా సంపద కొంత మేర నష్టం జరిగిందని చెపుతారు.
లేపాక్షికి ఆపేరెలా వచ్చిందంటే...
సీతాదేవిని చెరబట్టిన రావణుడు ఆమెని లంకకి తీసుకెళ్లే క్రమంలో తన వాయువాహనంపై ఈ ప్రాంతం నుండి వెళ్తుండగా... అడ్డగించి దాడి చేసి... సీతను కాపాడేందుకు ప్రయత్నించిన జఠాయువు రెక్కల్ని కత్తిం చగా. ఆపై రాముడు ఆ పక్షిని లే.. పక్షి అని తట్టి లేపగనే లేచి కూర్చొం దని.. ఆపై దాని...సేద తీర్చి విషయాన్ని తెలుసుకున్నాడని. .. అపðడు రాముడు నోటి నుండి వచ్చిన లే.. పక్షి అన్న మాటలే తరువాత కాలం లో లేపాక్షిగా స్ధిర పడినట్లు చెప్తారు. మరోవైపు అచ్యుత రాయల ఆస్ధానంలో కోశాధికారిగా పనిచేసే విరూపణ్ణ పరమ శివ భక్తుడు కావ టంతో శివాలయాన్ని నిర్మించాలని తలచి రాజు అనుమతి తీసు కోకుండానే దీనిని ప్రారంభించి ఖజానా ధనాన్ని ఖర్చు చేస్త్తూ... మండప నిర్మాణ దశకు ఆలయం చేరు కున్న దశలో విషయం తెల్సిన అచ్యుత రాయలు ఆగ్రహించి విరూపణ్ణ ని అంధుడుని చేయమ ని ఆజ్ఞాపిం చగా... ఆ శిక్ష ఆ శివాలయంలోనే తానే అమలుపరుచుకుని గోడకు తన కళ్లని కొట్టాడని... తదుపరి జరిగిన తపð తెలుసుకున్న అచ్యుత రాయు లు తన వల్ల అక్షువులను (కళ్ల)ను కోల్పోయిన ఈ ప్రాంతానికి (అక్షి లేమి ) లేపాక్షి అని పేరు పెట్టి ఆలయ నిర్మాణం పూర్తి చేసాడని మరో కధనం ప్రచారంలో ఉంది. ఇప్పటికీ విరూపణ్ణ కనులు విసిరిన ప్రాంతంలో ఆ ఆనవాళ్లుఆలయ గోడపై దర్శనమిస్తున్నాయి.
భారీ నంది విగ్రహం..
దాదాపు 8.1 మీటర్ల పొడుగు, 4 మీటర్ల ఎత్తుతో ఏకశిలతో రూపొందిన ఈ విగ్రహం ఇప్పటికే ప్రపంచంలో అరుదైన అతి పెద్దదైన విగ్రహంగా చోటు సంపాదించుకుంది. తెలుగుజాతి వ్యవసాయంలో కీలక భూమిక పోషించే వృషభజాతిరాజసాన్ని ఒలికిస్తూ. అనేక అలంకరణలతో మహా శివునిలింగం ముందు వెూకరిల్లి ఠీవిగా మనకి ఆహ్వానం పలుకుతూ ఉం టుంది. మన తెలుగు వాకిళ్లలో సంక్రాంతి పండగకు పశువులను అలం కరిం చుకోవటం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఆ క్రమంలోనే ఈ నందినిశిల్పులు చెక్కినట్లు కనిపిస్తుంది.మెడలో లోహపుపట్టిలు, గంట లు కు తోడుగా గరుడ పక్షులు రెండు ఏకంగా ఏనుగుల్ని తీసుకెళ్తున్న రూపాలు, కుడి ఎడమ పక్కల్లో నృసింహ స్వామి రూపాలు స్పష్టంగా కనిపిస్తాయి. నాటి రాయల వారి రాజసానికి ఇవి దర్పంగా.. సామ్రా జ్య పటిమకు ప్రతీకగా చెప్తారు.
వీరభద్ర ఆలయం...
అడుగుడుగునా శిల్పకళకు నిలువెత్తు రూపంగా నిలచే ఈ ఆల యం పరిసరాలలో ప్రశాంతత... ప్రతి అణువు చూస్తూ... మనసు ఉప్పోంగిపోతూ ఉండేలా చేస్తుంది. లోపలి, వెలుప లి ప్రాకారాలలో..ఖాళీప్రదేశాలలో సైతం అద్భుత కళాసంపద కనిప ిస్తుంది. కూర్మాకారంలో ఉన్న రాతి శిలపై విజయనగర సామ్రాజ్య ధీరోదాత్తతని, జీవన విధానాలకు ప్రతిబింబాలుగా ఇక్కడి శిల్ప కళ కనిపిస్తుంది. నలుదిశలా నిర్మించిన కళ్యాణమండపాలు కడుచక్కగా ఉన్నా..కొన్ని అసం పూర్ణంగా నిర్మాణమైనట్లు కనిపిస్తాయి.
పార్వతీపరమేశ్వరుల కళ్యాణ మండపంలో బ్రహ్మ,విష్ణు, దేవేంద్ర, యమ, వశిష్ట, అగ్ని, విశ్వామిత్ర తదితరులు ఈ పరిణయానికి వచ్చినట్లు మలచి న తీరు కట్టి పడేస్తుంది. అంతే కాదు పైకపðలపై రాయబడిన అనేక కుడ్య చిత్రాలు నేటికీ కనీసం రంగు కూడా వెలియ కుండా... చెక్కు చెదరకుండాఉన్నాయంటే నాటి కళాకారుల కళా నైపుణ్యా నికి ఆశ్చర్యం కలగక మానదు. అదే లేపాక్షిరంగులకున్న ప్రత్యేకత గా ఇక్కడి వారు చెప్తారు.
ఒకపðడుఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆల యం అనేక ఆక్రమణ

లకు గురికావటంతో నేడు మూడు ప్రాకారాలతో దర్శనమిస్తుంది. ఎక్కడై నా దేవాలయాన్ని దర్శించేపðడు ధ్వజ స్ధంభం నుండి నేేరుగా గర్భగుడిలో దేవుడు స్పష్టంగా కనిపిస్తాడు. కానీ ఈ దేవాలయంలో మాత్రం అందుకు భిన్నంగా ఆతని తీవ్ర దృష్టి పడకుండా మధ్యగా అడ్డు గోడ ఉండి ఉండ టం విశేషం. ఇక్కడి వీరభద్రుడు చిన్న చిన్న కళ్లతో అందంగా ఆకర్షణీ యంగా కనిపిస్తాడు. ఇక ఈ మండపంలో దర్శనమిచ్చే దుర్గాదేవి గాలిలో తేలుతు... ఓ మూలకు ముఖం పెట్టి ఉన్నట్లు కనిపించడం మరో విశేషం. సీతారామలక్ష్మణులు,హనుమాన్‌స్ధాపిత శివలింగం,నవగ్రహాలు ఉన్నాయి.
వేలాడే రాతి స్ధంభం
చాలావరకు మండపాలు కూలిపోతున్నట్లుగా విదారకరదృశ్యంని ఆవిష్క రించినా... నాట్య మండపానికి తూర్పున వేలాడే రీతిగా ఈ స్ధంభ నిర్మా ణం సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతుంది. పైకపðకు అంటి పెట్టుకుని భూమికి 2 అంగుళాల ఖాళీ కనిపిస్తుందంటే..నాటి శిల్పకారులు, స్ధపతు ల శిల్పకళా వైదుష్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ విచిత్రాన్ని తెలుసుకు న్న అప్పటి బ్రిటీష్‌ పాలకులు తమ ఇంజనీర్లను పంపించగా.ఈ స్ధంభాన్ని కదిపి చూడగా... ఓవైపు మాత్రం కాస్త కిందకి జారిందని.. గైడ్లు చెప్తారు
నాగేంద్రుడు..
ఆలయ తూర్పు చివరన నాగేంద్ర విగ్రహం ఉంది. ఆరడుగుల ఎత్తులో ఉన్న ఈ నాగేంద్రుడు తన చుట్టలతో శివలింగాన్ని కావలించుకుని ..ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది కూడా ఏక శిలతో తయారైన విగ్రహమే... ఈ పడగ వెనుక ఉన్న గోడపై చిన్న గోళీలంత సైజులో ఏర్పడ్డ రం ధ్రాలు... వాటిలో రక్తపు మరకలు కనిపిస్తాయి. ఇవి విరూపఫ్ణుని కళ్లుగా చెప్తారు.
శిల్ప కళ
నాటి ప్రజల జీవ నవిధి విధానాలను, కళాభిరుచులను ఇక్కడి కళా ఖండాలు అలనాటి అపురూప దృశ్యాలను సాక్షా త్కరింపచేస్తాయి.పాలకుల నిర్ల క్ష్యం వల్ల అక్కడక్కడా కొంత భాగం కూలిపోయినా..ప్రపంచానికి లేపాక్షి నంది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నా సరైన ఆలనా పాలనా లేకపోవటం ఉన్నదాన్ని రక్షించకపోవటంతో చెత్తాచెదారం పేరుకు పోయి నేడు ఈ ప్రాంతమంతా దుర్గంధంలో కూరుకుపోతూ ఉండటం.. చాలా మేర ఆక్రమణల బారిన పడటం ఆందోళనకరం.పాలకులెపðడు పట్టించు కుంటారా అనిదీనంగా చూస్తున్నట్లు ఉంటుంది ఈ ఆలయ పరిస్ధితి,
లేపాక్షి దుస్తులు :
వస్త్ర పరిశ్రమలో లేపాక్షి వస్త్రాలకు ప్రత్యేక స్ధానం ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి నేత పరిశ్రమ లేదని.. చుట్టుపక్కల ఉన్న నేత పనివారు విరూ పాక్షుని ఆలయం లోని వివిధ విగ్రహాలు, కుండ్య చిత్రాలను తాము నేసే వస్త్రాల పై వేసి లేపాక్షి వస్త్రాలుగా చలామణి చేస్తారని చెప్పడం ఆశ్చర్యం కలిగించే అంశమే...
నంది అవార్డులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమాలలో ఉత్తమంగా నిలచిన చిత్రాలకు.. నటీ నటులకు.. సాంకేతిక నిపుణులకు, టివి నటీనటులకు నంది అవార్డు లను ఏటా అందిస్తూ వస్తోంది. ఇందుకు అందించే ప్రతిమలను లేపాక్షి నంది నే ప్రాతిపదికగా తీసుకుని రూపొందించడం విశేషం.
తెలుగుజాతి వారసత్వ సంపదగా భాసిల్లుతున్న లేపాక్షి కళా కేంద్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో దీనిని మరింత ముందు కు తీసుకు పోయేందుకు హెరిటేజ్‌ లేపాక్షి పేరుతో ప్రత్యేక సంస్ధని ఏర్పాటు చేసారు. యునిస్కో గుర్తింపు కోసం కేంద్రం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూడా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అద్భుత కళా సంపదను రక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో పర్యాటకులను ఆకర్షించేలా ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్య త కూడా అంతే ఉంది.
ఎలా వెళ్లాలి...
బెంగుళూరు.హైదదాబాద్‌ హైవేకి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూపురం నుండి ఇక్కడి కి చేరుకునేందుకు ప్రతి గంటకు ఒక బస్సుని నడుపుతున్న ఆర్ట్టీసి. ఇవి కాక శివరాత్రి తదితర సందర్భాలలో మరిన్ని బస్సులు నడుపుతుంది. అయితే ఇక్కడకి వచ్చే యాత్రీకుల సౌక ర్యార్ధం కేవలం ఒక్క గెస్టుహౌజ్‌ని నిర్మించడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రాత్రుళ్లు బస చేయటం తలకు మించిన భారంమై చిన్నపాటి హౌటళ్లే యాత్రీకులకు ఆధారమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని గదుల నిర్మాణం జరిగితే సౌకర్యవం తంగా ఉంటుందని యాత్రీ కులు కోరుతున్నారు.