18, ఏప్రిల్ 2011, సోమవారం

జగన్ హీరోగా జగన్నాయకుడు

మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం త్వరలో రానుందని సమాచారం.   దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం ఇడుపుల పాయ వద్ద ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేపట్టిన ఓదార్పు యాత్ర, కాంగ్రెసులో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టిన ఓదార్పు, తండ్రి ఆశయాలు సాధించే వ్యక్తిగా ఇలా ఈ సంవత్సరంన్నరగా జగన్ ఎదుర్కొంటున్న సమస్యలను   తదితర విషయాలు పొందు పరుస్తూ శ్రీరామ్ అనే దర్శకుడు చిత్రం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి జగన్నాయకుడు అనే పేరును కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.

ఉత్తరాది వేడుకలకి యన్టీఆర్ గుడ్ బై

మన సినిమా వాళ్ల పెళ్లిళ్ళన్నీ ఈమధ్య ఉత్తరాది సంప్రదాయ పద్ధతి కే పెద్ద పీట వేస్తూ జరుగుతున్నాయి. మన సంప్రదాయం కాని సంగీత్, మెహందీ లకు మన పెళ్ళిలో చోటు దక్కిన్చుకోన్నాయి , అయితే తన వివాహంలో తెలుగు సంప్రదాయాలకు, సంస్కృతికి పెద్దపీట వేస్తూ.... ఓ తెలుగు పల్లెలో.. ఓ కలవారి ఇంట జరిగే అంగరంగ వైభవంగా... మమతల వేడుకలా జరగాలని కోరుకొంతున్నాన్ని చెపుతున్నాడు యన్టీఆర్.
'పెళ్లి పుస్తకం' సినిమాలోని 'శ్రీరస్తు...శుభమస్తు..శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం' పాటలో బాపుగారు చూపించిన పద్ధతిలో యన్టీఆర్ వివాహ వేడుక ఉంటుందన్న మాట! శుభలేఖతో బాటు స్వీట్లు పంచే పద్ధతిki చేక్చేప్పి... గతంలో ఉన్నా సాంప్రదాయాలనే అనుసరిస్తూ... స్వయంగా కుటుంబ సబ్యులతో వెళ్లి పేరు పేరునా ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే శూతిన్గ్లకి సెలవులు ప్రకటించిన యన్టీఆర్. సోమవారం నాడు హైదరాబాదులో సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, రామానాయుడు, చిరంజీవి, రాఘవేంద్రరావు, రాజమౌళి, వినాయక్ ల ఇళ్లకు వెళ్లి, పెళ్లి శుభలేఖల్ని స్వయంగా ఇచ్చి ఆహ్వానించి వచ్చా డు. తెలుగింటి సాంప్రదాయానికి ప్రతీకగా నిలచే తాతకి తగ్గ మనవడిగా నిలవాలన్నది ఆయనగారి తపనకి హర్షించాల్సిందే..

ఒకే రోజు ఆరు సినిమాలు..జనాలు థియేటర్లవైపు రాలేదు...

సినిమారంగం పరిస్థితి ఏమాత్రం బాలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. పరిస్థితి బాగా లేకుంటే ఒకే రోజు ఆరు సినిమాలు ఎలా విడుదలవుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. గతవారం ఏప్రిల్‌ 8వ తేదీన నాలుగు డబ్బింగ్‌ చిత్రాలు, రెండు స్ట్రయిట్‌ చిత్రాలు ప్రేక్షకుల ముందుకువచ్చాయి. ఈ ఆరు చిత్రలకు కనీసస్థాయి ఓపెనింగ్స్‌ లేవు. థియేటర్లన్నీ వెలవెలబోయాయి. శివాజీ నటించిన 'లోకమే కొత్తగా', సూపర్‌గుడ్‌ సంస్థ తీసిన 'మంచివాడు' చిత్రాలకు కనీస స్థాయి కలక్షన్స్‌ రాలేదు.
ఈ చిత్రాల ఫలితాన్ని ముందుగా అంచనావేసినప్పటికీ, ఇంత ఇదిగా ఉంటాయని మాత్రం వాణిజ్య వర్గాలు భావించలేదు. హీరోలమంటూ సినిమాకు లక్షల్లో డిమాండ్‌ చేసేవారు, తమకున్న ఇమేజ్‌ ఎలాంటిది? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సామర్ద్యం ఉందా? విషయాన్ని గ్రహిస్తే మంచిదని సినీపండితులు సలహా ఇస్తున్నారు. ఇక డబ్బింగ్‌ చిత్రాలది కూడా సేమ్‌ సిట్యూవేషన్‌. ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీ పూర్తికావడంతోనే రిలీజ్‌ చేసినా, జనాలు థియేటర్లవైపు రాలేదు.

గంగపుత్రులు సెన్సార్ కట్స్

పి. సునీల్‌ కుమార్‌రెడ్డి రచన, స్క్రీన్‌ ప్లే దర్శకత్వం సమకూర్చిన 'గంగపుత్రులు' చిత్రాన్ని కె.బి.ఆర్‌. ప్రొడక్షన్స్‌, శ్రావ్య ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మించారు. సుబ్బరాజు, గాయత్రి, రామ్‌, తన్మయి, మహేష్‌, రావు రమేష్‌ ముఖ్యపాత్రలు పోషించారు.
అయిదుగురు సభ్యులతో కూడిన 'ఇసి' ఈ చిత్రాన్ని చూసి 9 కట్స్‌తో 81.12 అడుగుల ఫిలిం కత్తిరించి 24-3-2011న 'యు' సర్టిఫికెట్‌ జారీ చేసింది.
1. మూడవ రీలులోని ...
ఎ) రెండో పాటలో బొడ్డు చూపెడుతూ, చిత్రీకరించిన క్లీవేజ్‌ షాట్స్‌ని 4.07 అడుగుల నిడివికి కత్తిరించారు. అయితే అంగీకారయోగ్యమైన అంతే నిడివిగల మరో షాట్‌ని ఉంచారు.
బి) పయిట లేకుండా ఇసుకపై హీరోయిన్‌ వెల్లకిలా పరుండే దృశ్యాలను 9.14 అడుగుల మేర కత్తెరించి, అంతే నిడివిగల అంగీకరింపబడిన మరో దృశ్యాన్ని ఉంచడానికి అంగీకరించారు.
సి) హీరోయిన్‌ సముద్రంలో స్నానం చేసే సన్నివేశాలను 32.02 అడుగుల నిడివికి కత్తెరించి ఆ దృశ్యాన్ని ఫ్లాష్‌లా చూపమన్నారు.
డి) మూడవ పాటలో చనుకట్టు ఎక్స్‌పోజర్‌కి సంబంధించిన దృశ్యాలను తొలగించడం వలన 21-02 అడుగులు నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.
ఇ) సన్నిహితంగా ప్రేమించుకునే దృశ్యాలు, హీరోయిన్‌ తన దుస్తులు విప్పేసే దృశ్యాలను 4.13 అడుగులమేరకు తొలగించి, అంతే నిడివిగల అంగీకృతమైన వేరే దృశ్యాలను ఉంచడానికి అంగీకరించారు.
ఎఫ్‌) తెల్లని బ్రా వేసుకుని నీలిరంగు చీర ధరించి చనుకట్టు పై చేతులుంచుకున్న దృశ్యాలను తొలగించడం ద్వారా 28.08 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.
2. నాలుగవ రీలులో...
ఎ) సన్నివేశంలో చిత్రీకరించిన జలయజ్ఞం, సోంపేట, గంగవరం పదాలను బాడకోవ్‌ పదాన్ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
బి) పయిట లేకుండా హీరోయిన్‌ పై బీచ్‌లో చిత్రీకరించిన దృశ్యాలను 7.08 అడుగుల నిడివి మేరకు కత్తిరించి అంగీకృతమైన అదే నిడివిగల వేరే దృశ్యాలను ఉంచడానికి అంగీకరించాలి.
సి. బీచ్‌లో హీరోతో మాట్లాడుతున్న హీరోయిన్‌ ఎక్స్‌పోజ్‌ చేసేలా చిత్రీకరించిన దృశ్యాలను తొలగించడమో బ్లర్‌ చేయడమో చేయాలని సూచించగా బ్లర్‌ చేసారు.
ఈ రకంగా 108.06 అడుగుల ఫిలింని కత్తిరించడం, 26.10 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరించి వేరే షాట్స్‌తో కలపడం వల్ల మొత్తం 81.12 అడుగుల పొడవు ఫిలిం కత్తెరింపుకు గురి అయింది. 3354.90 మీటర్ల నిడివిగల 'గంగపుత్రులు' చిత్రం విడుదలయింది.