20, మే 2011, శుక్రవారం
జేపీ సరిహద్దు దాటకుండా అడ్డు కోవాల
సమైక్యా వాది అయిన లోకసత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ రైతుల కష్టాల పేరుతో తెలంగాణ ప్రాంతంలో అడు గు పెట్టడాన్ని తెలంగాణ ప్రజలు స హించబోరని, జేపీ సరిహద్దు కూడా దాటకుండా తెలంగాణ వాదులు అడ్డు కోవాలని ప్రజా సంఘాల రాష్ట్ర జేఏసీ కో-కన్వీనర్ రమేష్‌యాదవ్ పిలుపుని చ్చారు.
ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి
'రైతులూ.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి' అని అన్నదాతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్ల సమస్యను పరిష్కరించే వరకు రైతు చైతన్య యాత్రలకు వచ్చే మంత్రులను నిలదీయాలని సూచించారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఇందుకు అవసరమైతే దీర్ఘకాలిక ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ కావాలో... పార్టీ కావాలో తేల్చుకో
'ఏడాదిన్నర క్రితం కళింగ భవన్‌లో తెలంగాణ జెఎసి ఏర్పాటైన రోజు అన్ని పార్టీలు జెండాలు పక్కనబెట్టి కలిసి పోరాడాలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ తానే అందరికీ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు దానిని గాలికి వదిలి తన జెండా పట్టుకొని తిరుగుతూ తెలంగాణలో తన పార్టీ ఒక్కటే ఉండాలని...మిగిలిన పార్టీలు ఉండకూడదని ప్రయత్నం చేస్తున్నారు. కెసిఆర్ తన రాజకీయ లబ్ధి కోసమే చూస్తే ఏనాటికీ తెలంగాణ రాదు. తనకు తెలంగాణ కావాలో...తన పార్టీ కావాలో ఆయన తేల్చుకోవాలి' అని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. 'ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడం ఒకటే ఆయన చేశారు. తెలంగాణ పరువు పోతుందని మేం కెసిఆర్ విషయంలో మౌనం వహిస్తున్నాం. మేం నోరు తెరిస్తే తెలంగాణ ప్రజలు ఆయనను తరిమికొడతారు' అని ఆయన వ్యాఖ్యానించారు.
58వ జాతీయ చలన చిత్ర అవార్టుల ప్రకటన
జాతీయ చలన చిత్ర అవార్టులను కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా ‘అదమంటే మకాన్ అబూ’, ఉత్తమ జనరంజక చిత్రంగా ‘దబాంగ్’ ఎంపికయ్యాయి. జాతీయ అవార్డులను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు జేపీ దత్తా ప్రకటించారు.
ఉత్తమ నటుడు: ధనుష్ (ఆదుకాలం), సలీం కుమార్ (అదమంటే మకాన్ అబూ)
ఉత్తమ నటి: మితాలీ జగ్‌తాప్ (బాబు బ్యాండ్ బాజా), శరణ్య పిరవనమ్
ఉత్తమ దర్శకుడు: వెట్రిమాలన్ (ఆదుకాలం)
ఉత్తమ ఫోటోగ్రాఫర్: మధు అంబట్
ఉత్తమ సంగీత దర్శకుడు: విశాల్ భరర్వాజ్ (ఇష్కియా)
ఉత్తమ ఎడిటర్: కిషోర్
ఉత్తమ కళాదర్శకుడు: సాబు సిరిల్ (ఎంథిరన్)
ఉత్తమ గాయకుడు: సురేశ్ వాడ్కర్
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఎంథిరన్
ఉత్తమ నటుడు: ధనుష్ (ఆదుకాలం), సలీం కుమార్ (అదమంటే మకాన్ అబూ)
ఉత్తమ నటి: మితాలీ జగ్‌తాప్ (బాబు బ్యాండ్ బాజా), శరణ్య పిరవనమ్
ఉత్తమ దర్శకుడు: వెట్రిమాలన్ (ఆదుకాలం)
ఉత్తమ ఫోటోగ్రాఫర్: మధు అంబట్
ఉత్తమ సంగీత దర్శకుడు: విశాల్ భరర్వాజ్ (ఇష్కియా)
ఉత్తమ ఎడిటర్: కిషోర్
ఉత్తమ కళాదర్శకుడు: సాబు సిరిల్ (ఎంథిరన్)
ఉత్తమ గాయకుడు: సురేశ్ వాడ్కర్
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఎంథిరన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)