5, ఫిబ్రవరి 2011, శనివారం

వచ్చే నెల ఏడున జగన్ పార్టీ

వైఎస్ జగన్మోహనరెడ్డి తన రాజకీయ పార్టీని వచ్చే నెల ఏడున ప్రకటించనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'వైఎస్ఆర్ కాంగ్రెస్' లేదా 'రాజన్న రాజ్యం పార్టీ'లలో ఒకదానికి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని, 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ' వైపే జగన్ మొగ్గు చూపుతున్నారని, మార్చి మొదటి వారంలోనే గుర్తింపు లభిస్తే.. ఉప ఎన్నికల్లో పార్టీ జెండాతోనే రంగంలోకి దిగేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారని తెలిసింది.

ఆర్టీసీ ఆధ్వర్యంలోనే డ్రైవింగ్ స్కూళ్ళ నిర్వహణ

: రోడ్డు ప్రమాదాలను నివారించే క్రమంలో డ్రైవింగ్‌లో పూర్తి స్థాయి ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలోనే డ్రైవింగ్ స్కూళ్ళ నిర్వహణ బాగుంటుందని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మౌలిక వసతులను విస్తృతపరుచుకోవడంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డిపోల్లో, లేదా ఆర్టీసీ స్థలాల్లో డ్రైవింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు నిర్ణయించారు. సరుకు రవాణాకు తగిన ఏర్పాట్లు చేసుకునే దిశగా ఆర్టీసీ సన్నాహాలను చేస్తూనే.. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ సేవలను సరుకు రవాణాలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

మేం కాస్త వయసు మళ్లిన వాళ్లమే : నాగార్జున

"మేం అందరం కాస్త వయసు మళ్లిన వాళ్లమే. నేటి తరం టీవీ ప్రేక్షకులకు ఏ తరహా వినోదం కావాలన్న దానిపై మాకు మూస అభిప్రాయాలే ఉంటాయి. ఓ యంగ్ మైండ్ మా బోర్డ్ సభ్యుల్లో ఉంటే బాగుంటుందని ఎన్నాళ్లుగానో చెబుతున్నాను. అది ఈనాటికి కుదిరింది'' అని నాగార్జున తెలిపారు. "సరికొత్త ఆలోచనలు కలిగిన ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీలను మా బోర్డులో చేర్చుకోవడం ద్వారా బోర్డు సభ్యుల సగటు వయసు తగ్గుతుంది' చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజను మా టీవీ బోర్డు సభ్యుల్లో ఒకరిగా చేర్చుకున్నట్లు ప్రకటించారు.