23, ఫిబ్రవరి 2011, బుధవారం

పెళ్లిళ్లకు ఇంతమంది మాత్రమే హాజరవ్వాలి

పెళ్లిళ్లకు కూడా సరిగ్గా ఇంతమంది మాత్రమే హాజరవ్వాలి అన్న నిబంధన పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ పార్లమెంటులో ఓ ప్రతిపాదన కూడా చేశారు. పెళ్లిళ్లు తదితర ఫంక్షన్లప్పుడు విపరీతంగా ఆహారం వృథా అవుతోందని ఆయన తెలిపారు.

ఇలా వృథా అయ్యే ఆహారాన్ని ఆదా చేయడం వల్ల దేశంలో ఆకలితో బాధపడేవారికి, పేదవారికి అన్నం దొరుకుతుందని భావిస్తున్నామని చెప్పారు. అందుచేత పెళ్లిళ్లకు అతిథుల హాజరుపై పరిమితి విధించాలని భావిస్తున్నామన్నారు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదనను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. దేశంలో ఇంతకన్నా తీవ్రమైన సమస్యలు ఇన్ని ఉండగా ప్రభుత్వం ఇలాంటి పనికిమాలిన విషయాలపై దృష్టి పెట్టడం అసహ్యం గొలిపేదిగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.

'మధురమీనాక్షి' ఆడియో విడుదల

సాంఘిక పాత్రలకే కాదు దేవతా పాత్రలకు కూడా రమ్యకృష్ణ పెట్టిందిపేరు. ఆమె ఏ దేవతా పాత్ర పోషించినా అచ్చు అలాగే ఉంటుందని ఊహిస్తారు ప్రేక్షకులు. ఆమె టైటిల్‌ పాత్రను పోషించిన చిత్రం 'మధురమీనాక్షి'. నాగార్జున యలవర్తి సమర్పణలో శ్రీ కామాక్షీతాయి మూవీమేకర్స్‌ పతాకంపై రాజవంశీ దర్శకత్వంలో మందలపు హరీష్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం ఆడియో హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది. అతిథిగా విచ్చేసిన రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని నిర్మాత వల్లభనేని వంశీమోహన్‌కు అందజేశారు.

సెట్స్‌ నిర్మాణంలో 'శ్రీరామరాజ్యం'

బాలకృష్ణ శ్రీరామునిగా నటిస్తున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం'. మేటి దర్శకుడు బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ 35 శాతం మేరకు పూర్తయింది. ఇందులోని సన్నివేశాల చిత్రీకరణ కోసం పలురకాల సెట్స్‌ నిర్మిస్తుండటంవల్ల మధ్య మధ్యలో గ్యాప్‌ తీసుకుని షెడ్యూల్స్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ 2 నుండి 10 వరకు, జనవరి 21 నుంచి ఫిబ్రవరి 8 వరకు షూటింగ్‌ జరిగింది. ఇందులో భాగంగా వాల్మీకి ఆశ్రమం సెట్‌లో మూడు పాటల చిత్రీకరణ, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామని నిర్మాత సాయిబాబు తెలిపారు. లవకుశుల జననం, లక్ష్మణుడు అడవిలో సీతను వదిలివేయడం, వాల్మీకి ఆమెను ఆదరించడం వంటి సన్నివేశాలను వాల్మీకి ఆశ్రమంలో 14 సెటప్స్‌లో చిత్రీకరించామని ఆయన చెప్పారు. మార్చి నెలాఖరు నుండి పూర్తయ్యేవరకు తదుపరి షెడ్యూల్‌ నిర్విరామంగా జరుగుతుందని అన్నారు. మరోపక్కన రామోజీ ఫిలింసిటీలో దర్బారు, ఏకాంత మందిరం, కౌసల్య మందిరం వంటి సెట్స్‌ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇంకా రాజప్రసాదం యొక్క అవుట్‌డోర్‌, అయోధ్యనగరం నిర్మాణం పనులు కూడా అక్కడే జరుగుతున్నాయని అన్నారు. ఇందులో ఎనిమిది పాటలు, కొన్ని బిట్‌ సాంగ్స్‌ ఉన్నాయని ఆయన వివరించారు. జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
కాగా వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్న ఈ చిత్రంలో సీతగా నయనతార, హనుమంతునిగా ఒకప్పటి దారాసింగ్‌ అబ్బాయి విందు ధారాసింగ్‌ నటిస్తున్నారు. జనకునిగా మురళీమోహన్‌, జనకుని భార్యగా సుధ, భూదేవిగా జయసుధ, వశిష్టుడుగా బాలయ్య, లక్ష్మణునిగా శ్రీకాంత్‌, భరతునిగా సాయికుమార్‌, రుష్యంగుడిగా నాగినీడు, తిప్పడుగా బ్రహ్మానందం, రంగిగా ఝాన్సీ నటిస్తున్నారు. ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

పీతాంబరానికి నివాళి

దివంగత నటులు ఎన్‌.టి.రామారావు, ఎవ్జీుఆర్‌కు గతంలో మేకప్‌మెన్‌గా పనిచేసిన పీతాంబరం మృతిపట్ల పలువురు తెలుగు చిత్ర ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తంచేశారు. సోమవారంనాడు ఆయన చెన్నైలో కన్నుమూశారు. ఆయన ఎన్టీఆర్‌కు దాదాపు 41 సంవత్సరాలు మేకప్‌మెన్‌గా చేశారు. అలనాటి ఎందరో ప్రముఖ తారలకు మేకప్‌ చేసిన ఆయన నిర్మాతగా కూడా మారి, ఎన్టీఆర్‌తో అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్‌ చిత్రాలను నిర్మించారు. ఆయన అంత్యక్రియలు మంగళవారంనాడు చెన్నైలో జరిగాయి. ఆయన కుమారుడు ప్రముఖ దర్శకుడు పి.వాసు. ఈయన చంద్రముఖి, నాగవల్లి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

మరో ధృవతార రాలిపోయింది

స్వర్ణయుగంనాటి మరో ధృవతార రాలిపోయింది. సినీరంగంలో 50 ఏళ్ల పాటు ఓ వెలుగువెలిగిన ఆ తార భౌతికంగా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. అలనాటి చిత్రసీమలో సుగంధ పరిమళాలను వెదజల్లి ప్రేక్షకులకు హాయిగొలిపిన ఆ తార మరెవరో కాదు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (96). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాలలో అద్భుతమైన పాత్రలను పోషించిన ఆయన దాదాపు 350 చిత్రాల్లో నటించారు. కృష్ణాజిల్లాలోని కోలవెన్ను మండలం ఆయన స్వస్ధలం. పాత తారలు చాలామంది మాదిరిగానే మిక్కిలినేని కూడా నాటకరంగం నుంచే సినిమారంగానికి వచ్చారు. 'దీక్ష' చిత్రం ద్వారా 1949వ సంవత్సరంలో చిత్రసీమలోనికి వచ్చిన ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్టచేశారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'భైరవద్వీపం' ఆయన చివరి చిత్రం. మిక్కిలినేని మృతికి పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తంచేశారు.

జగన్ పై సర్కార్ కక్ష సాధింపు

25 లక్షలమంది విద్యార్థుల భవిష్యత్ కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేస్తున్నారని.. ప్రభుత్వం ఇప్పటికైనా తమ ప్రతినిధులను జగన్ వద్దకు పంపాలన్నారు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్.

ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విషయంలో సర్కార్ కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుందన్నారు..

చంద్రబాబు దీక్ష చేస్తే.. మూడోరోజేపరిగెట్టారు, తెలంగాణా ఎంపీలు దీక్ష చేపట్టిన గంటల్లోనే విరమించేందుకు యత్నించిన సర్కారు జగన్ దీక్ష పై స్పందించటం లేదు సరి కదా.. బొత్స లాంటి మంత్రులు జగన్ దీక్షని ఎద్దేవా చేస్తున్నారని విమర్శించారు కొండా సురేఖ

తెలంగాణా బిల్లు ద్వారానే రాష్టంలో శాంతి

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు బుధవారం ఉదయం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్‌కుమార్ బన్సాల్‌ను కలిశారు. రాష్ట్రంలో సహాయ నిరాకరణ, తెలంగాణ బంద్, విద్యార్థులపై లాఠీఛార్జ్ తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెట్టడం ద్వారానే రాష్టంలో శాంతి నెలకొంటుందని.. ఈ దిశగా కేంద్రం కృషి చేయాలనీ కోరారు

అసెంబ్లీలో వాయిదాల పర్వం ప్రారంభం

విపక్షాల నిరసనల మధ్యే శాసనసభ సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయాలంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ పట్టు వీడటం లేదు.సభను సజావుగా జరిపేందుకు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ కోరినా ఫలితం లేకపోయింది.విపక్షాల నిరసన మద్య ప్రారంభం అయిన కొద్దినిముషాల్లోనే సభ వాయిదా పడింది.

వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవటంతో స్పీకర్ మరోసారి అసెంబ్లీని పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. సభ వాయిదా పడినా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు.

తెలంగాణలో రెండో రోజు బంద్

తెలంగాణలో బంద్ రెండో రోజు కూడా విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు మూతబడ్డాయి. బంద్‌కు పలు ఆటో యూనియన్లు కూడా మద్దతు ప్రకటించటంతో పాటు తెలంగాణ జిల్లాల్లో పలు డిపోల్లో కూడా బస్సులను నిలిపి వేయటంతో ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి.దీంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు బైటకు తీస్తే తగలబెదతమంటూ, ఓయు, కేయు జెఎసి లు హెచ్చరికలు జారీ చేయటంతో ఈ డిపోలోని బస్సుని తీసేందుకు కార్మికులు కూడా ఒప్పుకోవట్లేదు.

తెలంగాణ నినాదాలతో హోరేత్తిన లోక్‌సభ

తెలంగాణ అంశంపై చర్చ జరపాలంటూ చర్చ జరపాలంటూ టీఆర్‌ఎస్, బీజేపీ ఎంపీలతో పాటు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కూడా స్వరం కలపడంతో తెలంగాణ నినాదాలతో లోక్‌సభ హోరేత్తింది బుధవారం సభ ప్రారంభం కాగానే తెలంగాణ అంశంపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్, ఎన్డీయే పార్టీలు పట్టుబట్టాయి. జీరో అవర్‌లో ఈ అంశంపై చర్చకు అనుమతిస్తామని స్పీకర్ మీరాకుమార్ హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది.
సభలో గందరగోళం చెలరేగటం, కేసీఆర్, విజయశాంతిలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వెళ్లాడంతో స్పీకర్ మీరాకుమార్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.