9, నవంబర్ 2010, మంగళవారం

విధులకుడుమ్మా కొట్టే వైద్యులు పై ప్రభుత్వం కొరడా

వైద్యులుగా కొలువు చేస్తూ విధులకుడుమ్మా కొట్టే వారిపై ప్రభుత్వం కొరడాఝళిపించింది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల మేరకు వైద్యులు విధిగా ప్రతిరోజు ఉదయంతొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగుగంటల వరకు ఆస్పత్రిలో ఉండాలి. ఏడాదికి మించిఅన ధికారికంగా విధులకు డుమ్మా కొడితే విధులనుంచి తొలగించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏడాది కన్నా తక్కువగా విధులకు గైర్హాజరైతే భారీజరిమానా విధించడంతోపాటు శాఖ పరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

రేడియో మిర్చిలో ముమైత్ ఖాన్

'తెలుగమ్మాయి' సలోని

విగ్రహారాధన వల్ల ఏకాగ్రత

కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధిస్తే కలిదోషాలు దూరమై జన్మరాహిత్యం కలుగుతుందని పరమహంస పరివ్రాజకులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌స్వామి పేర్కొన్నారు.

తిరునక్షత్ర మహోత్సవాల్లో సోమవారం ఆయన అనుగ్రహభాషణం చేస్తూ ఏకాగ్రత, భక్తి శ్రద్ధలతో అర్చనాదికాలు చేస్తే భగవంతుని అనుగ్రహం సంపాదించటం సాధ్యమేనన్నారు.

ప్రతి ఒక్కరూ భక్తి విశ్వాసాలతో స్వామి కృపకు అర్హత సాధించాలన్నారు. విగ్రహారాధన వల్ల ఏకాగ్రత కలుగుతుందని, సుందర స్వరూపుడైన పరమాత్మ రూపాన్ని మనోఫలకంపై నిలిపి ధ్యానం చేయాలన్నారు. అప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతామని తెలిపారు.

మహా నగరం లో కూర'గాయాలు'

గత నెల 29 నుంచి జనాన్ని వరుణుడు బాధిస్తుంటే ఇదే అదనుగా నిత్యావసర వస్తువుల, కూరగాయల ధరలు కొండెక్కాయి. దీంతో, వర్షాల కారణంగా పనుల్లేక కాలం గడుపుతున్న వ్యవసాయ కూలీలు, పేదలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. హఠాత్తుగా పెరిగిన ధరల వల్ల నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనలేక హైదరాబాద్ లో సగటు జీవి నానా అవస్థలు పడుతున్నాడు.

29వ తేదీ నుంచి ఈ వారం రోజుల్లోనే కూరగాయల ధరలు నూరు శాతం పెరిగాయి. వారం క్రితం కేజీ వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, క్యారెట్‌, కాకరకాయల ధరలు రూ.20 చొప్పున ఉండేవి. ఇప్పుడు వాటి ధర రూ.40లకు చేరింది. చిక్కుడుకాయల ధర రూ.15 నుంచి రూ.30లకు చేరుకుంది. నిలకడగా ఉల్లిపాయలు, టమాటాల ధరలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే కిలో రూ.20లకు దొరుకుతున్నాయి.

ఓ వైపు వర్షాలకు పనులు లేకపోవడం, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశనంటడంతో నగరంలో 60 శాతం మంది ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఇది ఇలా ఉంటే అద్దెకు ఉండే వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇంటి అద్దెలు కూడా ఇటీవల కాలంలో విపరీతంగా పెరగడంతో వీరు కుదేలైపోతున్నారు. ప్రయివేటు కంపెనీలు, షాపుల్లో పనిచేసే కార్మికుల వేతనాలు పెరగలేదు. రోజు కూలికి వెళ్లేవారి కూడా కూలిరేట్లు పెరగలేదు. కాని ధరలు పెరుగుదల, ఇళ్ల అద్దెలు పెరుగుదల భారం మాత్రం వీరి నెత్తిన పడింది. తరుచూ వర్షాల వల్ల పనులు ఉండడం లేదని అన్ని రోజులు పనులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు.

సొంత పార్టీ కోసం.. బొత్స రివర్స్‌గేర్‌...

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇసుక అక్రమాలపై కొత్త భాష్యం చెప్పారు. 'గ్రామాల్లో దబాయించేవారు, మోతుబర్లు, రౌడీ మామూళ్లు వసూలు చేస్తున్నారు..ఇసుక వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావాలి లేదా ప్రజలైనా వినియోగించు కోవాలి. కానీ దళారులు దోచుకుని లాభపడుతున్నారు. ఇక నుంచీ వాహనాలను సీజ్‌ చేయడం కాదు..డబ్బులు వసూలు చేసేవారినే బొక్కలోపెట్టండి'..అంటూ బొత్స రివర్స్‌గేర్‌కు అధికారులే ఖంగుతిన్నట్టయింది.

తెలుగుదేశం వారు కాంగ్రెస్‌పైనా, కాంగ్రెస్‌ వారు టిడిపిపైనా విమర్శించుకోవడం కనిపిస్తోందని అన్నారు. డబ్బులు వసూలుకు పాల్పడేవారిని లోపల వేస్తే ఏ పార్టీయో తేలుతుందని వ్యాఖ్యలు చేస్తుండటం ...ఇప్పటివరకూ ఆయా మండలాల్లో తహశీల్దార్‌లు, ఎస్‌ఐలు ట్రాక్టర్లను సీజ్‌ చేయడం, డబ్బులు తీసుకుని వదిలేయడంతో వారు బాగా గడించారన్నది బొత్స అంతరంగం.

తాజాగా వాహనాలపై సీజ్‌ చేయొద్దంటూ ఆదేశించడం వెనుక అధికార పార్టీ నాయకులకు ఆ డబ్బులు చెందేలా చేయడం ఒకటైతే, వాహనాల సీజ్‌ సమస్య కూడా భవిష్యత్‌లో ఉండకుండా బొత్స జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఆదర్శ్ దెబ్బకు చవాన్ అవుట్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజీనామాను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం ఆమోదించారు.

ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చవాన్ తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి సమర్పించిన విషయం తెలిసిందే.

రాజీనామ లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపాలని ఏఐసీసీ అశోక్‌చవాన్‌కు ఆదేశించింది.

తెలంగాణ కోసం డిసెంబర్ 9న ఢిల్లీలో బీజేపీ మహాధర్నా

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి డిసెంబర్ 9న ఢిల్లీలో బీజేపీ చేపట్టే మహాధర్నాకు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సాహిత్య అభిమాని: ఎన్ టి రామారావు తీయని అల్లూరి సీతారామరాజు సినిమా లో పాట

సాహిత్య అభిమాని: ఎన్ టి రామారావు తీయని అల్లూరి సీతారామరాజు సినిమా లో పాట


saahitya-abhimaani.blogspot.com nunchi sekarana