28, ఏప్రిల్ 2011, గురువారం

కడుపులు కాలడంతోనే జనం తిరుగుబాటు

 తెలంగాణ ఉద్యమం ఇంత జోరుగా సాగుతున్నాఆంధ్రా వలసవాదుల దోపిడీ కొనసాగుతూనే ఉందని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ ధ్వజమెత్తారు. అమరవీరుల ఆత్మ శాంతించాలంటే వారి ఆశయసాధనకోసం ఉద్యమించాల ని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.బొగ్గు, నీళ్ళు, గుట్టలు, ఇసు క, కలప తదితర సంపద తరలిపోతూ తమ కడుపులు కాలడంతోనే జనం తిరుగుబాటుచేసి వేరు తెలంగాణ కావాలంటున్నారన్నారు. ఇన్నేళ్ళ పోరులో సమైక్యవాదులు సంపన్నులైతే తెలంగాణ ప్రజలకు గోరీలే మిగిలాయని పేర్కొన్నారు. చిన్నరాష్ట్రాలను ఇచ్చిన బీజేపీ ఎవరో అడ్డుతగిలితే తెలంగాణను ఇవ్వలేదని, అలాగని మనం బోర్లా పడమని, ప్రత్యేకరాష్ట్రాన్ని సాధించుకునేంతవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఠాగూర్ 150వ జయంతి కి కొత్త ఐదు నాణెం

రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతిని పురస్కరించుకుని త్వరలో   కొత్త ఐదు రూపాయల నాణెం  విడుదల చేయనున్నట్లు రిజర్వ్‌బ్యాంకు సమాచార కార్యాలయాధికారి   తెలిపారు.ఈ నాణెంలో ఒక వైపు అశోక స్థూపంలోని నాలుగు తలల చిహ్నం, కింద ఐదు రూపాయలు అని ముద్రించబడి ఉంటుం ది. మరో వైపు రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మ ఉంటుంది. దీని కింద రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతిని గుర్తించే రీతిలో 1861 - 2011 అని ఉంటుంది.


గవర్నర్ పదవికి ఇక్బాల్ సింగ్ రాజీనామా?

నల్లధనం కేసులో అరెస్టయిన హసన్ అలీకి పాస్‌పోర్ట్ ఇప్పించిన వ్యవహారంలో ఇరుక్కుపోయిన పుదుచ్చేరి గవర్నర్ ఇక్బాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.  ఆయనపై పుదుచ్చేరిలో రోజుకో ఆరోపణ వస్తుండడంతో పాటు బుధవారం బంద్ సైతం జరగడం ఆయన్ను కాస్త ఆవేదనకు గురిచేసినట్టు తెలిసింది. పదవి నుంచి తప్పుకుని తనపై వచ్చిన అభియోగాలను ఎదుర్కొనేందుకు ఇక్బాల్ సింగ్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

నేడు, రేపు బాబా మహాసమాధి దర్శనం

నిన్న జరిగిన సత్యసాయి బాబా మహా సమాధిని చూసేందుకు నేటి నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు సత్య సాయి ట్రస్ట్ ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో భక్తులు దర్శించుకోవచ్చని ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను అనుమతిస్తా మని వారు తెలిపారు.

పెళ్లి కొడుకైపోతున్న 'ఆవారా' కార్తి

టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్. ఒక్కో హీరోకీ పెళ్లి జరుగుతోంది. ఇప్పుడీ ట్రెండ్ కోలీవుడ్ కి కూడా పాకుతున్నట్టుంది. ఆమధ్య తమన్నాతో ఎఫైర్ నడుపు తున్నాడంటూ వార్తలు పుకార్ల ప్రచారం తో తబ్బి ఉబ్బి పోయిన కార్తీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నాడు.
ఐతే తమన్నా తో మాత్రం కాదు లెండి.. తనది పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటూ నొక్కివక్కనిస్తున్నాడు. హీరో సూర్య సోదరుడిగా వెండితెరకొచ్చిన కార్తి 'యుగానికొక్కడు', 'ఆవారా' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర య్యాడు.
కార్తి పెళ్లి విశేషాలని ఆయన తండ్రి, ప్రముఖ నటుడు అయిన శివకుమార్ మీడియాకి వెల్లడిస్తూ.. జూలై 3 న ఈరోడ్ కు చెందిన రంజనితో కార్తి చెప్పారు. పెళ్లి జరుపడానికి ముహూర్తాన్ని పెట్టినట్లు చెప్పారు.