2, డిసెంబర్ 2010, గురువారం
రాజీనామా బాటలో మంత్రులు
మంత్రివర్గ విస్తరణలో కేటాయించిన శాఖలపై పలువురు మంత్రులు అసహనానికి గురై రాజీనామ బాటను ఎంచుకున్నట్టు తెలిసింది. తనకు కేటాయించిన శాఖపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వెల్లగక్కి రాజీనామా బాటలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వున్నట్టు సమాచారం.. తెలంగాణకు సంబంధంలేని శాఖను తనకు కేటాయించడం వల్ల కోమటిరెడ్డి నిరసనను తెలిపారు. వట్టి వసంతకుమార్ ఇంట్లో పలువురు మంత్రులు భేటి అయ్యారు.
వెనక్కి తగ్గేదిలేదన్న వట్టి
మంత్రివర్గ విస్తరణలో తనకు దక్కిన శాఖతో మనస్తాపం చెంది రాజీనామా చేసిన మంత్రి వట్టి వసంతకుమార్ బుజ్జగించే పనిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ వున్నారు. రాజీనామా చేసిన వట్టి వసంతకుమార్‌ను శాంతపరిచేందుకు మంత్రి ఆనం ఆనం రాయబారం విఫలమైంది. రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదిలేదని వట్టి స్పష్టం చేశారు.
కిరణ్‌కు వట్టి షాక్
మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖలు కేటాయించిన కొద్ది గంటలకే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి గట్టి షాక్ తగిలింది. మంత్రివర్గ విస్తరణ జరిగిన కొద్ది సేపటికే తొలి వికెట్ రూపంలో వట్టి వసంత కుమార్‌ను సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి కోల్పోయారు. ఇలాంటి షాక్‌లు మరికొన్ని తగలవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా కేటాయించిన పోర్ట్‌ఫోలియోలపై బహిరంగంగానే మంత్రులు అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలిసింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)