24, జనవరి 2011, సోమవారం

మొన్న పల్లెబాట.. నిన్న ప్రజాపథం.. నేడు రచ్చబండ.. అంతే...

పింఛన్ల మంజూరు, ఇందిరమ్మ ఇళ్లు, అభయ హస్తం తదితర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పల్లెబాట, నగర బాట తరువాత ప్రజాపథం నిర్వహించినప్పటికీ ఆశించి నంత ఫలితం లభించలేదు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ రచ్చబండ కార్యక్రమైనా ఎంత వరకూ సఫలమవుతుందన్నది పాలకుల చిత్తశుద్ధిని బట్టే ఉంటుంది.

పెన్షన్‌కు అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు ల్లో వయస్సు తప్పుగా ఉండటంతో పింఛన్ పొందలేకపోతున్నారు. ఆస్పత్రుల్లో తక్షణం వైద్యం అందటంలేదన్న విమర్శలున్నాయి. ఆరోగ్య శ్రీలో జబ్బును కనుగొనేందుకు పరీక్షలకు రూ.వేలల్లో ఖర్చవుతోందని పలువురు బాధితులు అంటున్నారు. ఇక రేషన్ కార్డుల విషయానికి వస్తే గతంలో కార్డుకోసం రుసుం చెల్లించి ఐపీఆర్ ఫాం పొందినవారున్నా.... రేషన్ దక్కటంలేదు.

రచ్చబండ కార్యక్రమం పరిష్కారం చూపుతుందో కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది.

కడపకు వస్తా.. కేండేట్స్ ని ప్రకటిస్తానంటున్న బాబు

కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను కడపకు వస్తా.. ప్రకటిస్తానని కడప పార్లమెంట్ పరిధిలోని తెలుగుదేశం నేతలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు.

వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్లమెంట్‌కు, వైఎస్ విజయమ్మ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్ని కలు అనివార్యమయ్యాయిన విషయం తెలిసిందే.. అభ్య ర్థుల ఎంపికతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి విషయం కడప పార్లమెంట్ పరిధిలోని నేతలతో చంద్రబాబు మూడు రోజులుగా చర్చించా కనీ ఈనిర్ణయం తీసుకొన్నారు.

హోంమంత్రి రాజీనామా చేయాలి : నన్నపనేని

మద్దెలచెరువు సూరి హత్యకేసులో రాష్ట్ర హోం మంత్రి కుటుంబసభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న దృష్ట్యా తక్షణమే మంత్రి పదవికి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు.

పరిటాల రవీంద్ర హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డిపై ఆరోపణ వస్తే ఆయన ఇంటికి సీబీఐ అధికారులు వెళ్ళి ఇంటరాగేషన్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ... సూరి హత్య కేసులో హోం మంత్రి కుమారుడిపై ఆరోపణలుంటే పోలీసులు ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.

భాను, సూరి అనుచరులు హోం మంత్రి బంగళా నుంచే లావాదేవీలు జరిపినట్లు .. సూరి హత్యకు సంబంధించి కుట్రలు, సెటిల్‌మెంట్‌లు, చర్చలు నడిచాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె గుట్టుచప్పుడు కాకుండా క్వార్టర్స్‌ను ఖాళీ చేయడం జరిగిందని, అసలు అక్కడ ఏం జరిగిందో బయటకు తెలియాలని ... కేవలం తన కొడుకును రక్షించుకోవడానికే భానును అజ్ఞాతంలో ఉంచి పోలీసులతో రోజుకొకరిని విచారణ జరుపుతూ డ్రామా ఆడుతున్నారని ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే తక్షణం హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఆ నిధులన్నీ "రచ్చ బండ"కి తరలించండి

ఆర్థిక సంవత్సరంలో 3 నెలల కింద విడుదల చేసిన నిధుల్లో ఎలాంటి బిల్లులు చెల్లించరాదని ప్రభుత్వం ఖజానాపై ఆంక్షలు విధించింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు, రచ్చబండలో చెల్లించాల్సిన వాటికి మాత్రమే మినహాయింపు ఇచ్చినా.. ఇదే సమయంలో వివిధ శాఖలకు విడుదల చేసిన నిధులకు సంబంధించి ఎలాంటి బిల్లులు మంజూరు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.
అద్దెభవనాల చెల్లింపులు, కార్యాలయం ఖర్చులు, ప్రభుత్వ వాహనా ల మరమ్మతుల బిల్లులు, పెట్రోల్ బిల్లులు, అద్దె వాహనాల బాడుగలు, కార్యాలయాల విద్యుత్, నీటి బిల్లులు ఇతర ఖర్చులపై ఆంక్షలు విధించడంతో పాటు ఎలాం టివి చెల్లించరాదని ఆదేశాలు జారీ చేయటంతో ఆ నిధులన్నీరచ్చబండకు తరలిచడంలో రానున్న రోజుల్లో జనాలకే కాదు, ఆదికారులకీ ఇబ్బందులు తప్పెట్లు లేవు.

కిరణ్‌కుమార్‌రెడ్డే మంత్రి పదవి ఇవ్వలేదన్న జేసి

తనను సీనియర్ అనుకున్నాడో, తనతో ఇబ్బందులు ఎదురవుతాయనుకున్నాడో తెలియదు గానీ మొత్తం మీద మంత్రి పదవి ఇవ్వకుండా చేశాడని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు

తాడిపత్రిలోని తన నివాసంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే తనకు ఉద్దేశపూర్వకంగా మంత్రి పదవి ఇవ్వలేదని ఒకరి వద్దకు వెళ్లి సాగిలపడాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. తన మాట వింటే నాలుగు మంచి మాటలు కూడా ముఖ్యమంత్రికి చెబుతానని, వినకపోతే చేసేదేమీ లేదని అన్నారు.

27 నుంచి హంపీ ఉత్సవాలు

విజయనగర సామ్రాజ్య వైభవాన్ని నలు దిశలా వ్యాపింప చేసేందుకు వీలుగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్న హంపీ ఉత్సవాల కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. హొస్పేట హంపీ వైపునకు వెళ్లే మార్గంలో ప్రకాష్ నగర్ సమీపంలో కన్నడ సినీ రంగానికి చెందిన ఆర్ట్ డెరైక్టర్ సారధ్యంలో కోటి రూపాయల ఖర్చుతో విజయనగర వాస్తు శైలిలో మంటపాలు, స్తంభాలు ప్రధాన వేదికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
వందలాది మంది కళాకారులు పాల్గొననున్న ఈ ఉత్సవం తిలకించేందుకు వాచీ వారి కోసం సుమారు 80 వేల ఆసనాలను ఏర్పాటు చేస్తున్నారు.

సోనియాగాంధీకి జేఏసీ పిండప్రదానం

తెలంగాణా జేఏసీ ఆద్వర్యంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి పిండప్రదానం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి పెద్దేత్తున తెరాస నేతలు, కార్య కర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో 600 మంది ప్రాణాలు కోల్పోయినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోవడం బాధకరమ ని, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా సీమాంధ్ర నాయకులకు వంత పాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టకుండా తాత్సారం చేస్తున్న సోనియాగాంధీకి పిండప్రదానం చేశామన్నారు.