-
ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొక్కటే...
-
నేడు తెలుగువారందరిదీ ఒకటే రాష్ట్రం..
-
భవిష్యత్‌లో రెండు రాష్ట్రాలు, మూడు రాష్ట్రాలు ఏర్పడ వచ్చు.
-
కానీ తెలుగువారి సమైక్యతకు సమగ్రతకు పోరాడిన చరిత్రను విస్మరించలేం. మనముందు నూతన చరిత్ర ఆవిష్కృతమైనా..
దానితో పాటు పూర్వ చరిత్రనూ స్మరించుకోవలసిందే త్యాగధనుల్ని తలచుకోవాల్సిందే.
వారి త్యాగాల స్పూర్తిగా తెలుగువారి సమగ్రాభివృధ్ధికి ముందుకు సాగాల్సిందే...
సువిశాల
భారత సామ్రాజ్యానికి స్వాతంత్రం వచ్చాక అంతే స్ధాయిలో రాష్ట్రం కోసం
పోరాటం జరగటం ఆంధ్ర ప్రదేశ్‌తోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. 1912 లోనే
తెలుగు భాష మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండా లని టంగుటూరి
ప్రకాశం పంతులు, నీలం సంజీవ రెడ్డి, భోగరాజు పట్ట్టాభి సీతారామయ్య తదితరుల
సారధ్యంలో అలుపెరగని పోరాటం జరిగింది. 40 ఏళ్ల పాటు పోరా డినా... అప్పటి
బ్రిటీష్ ప్రభుత్వం కానీ తరువాత వచ్చిన స్వతంత్ర భారత ప్రభుత్వం కానీ
ఆంధ్ర ప్రజల ఆకాంక్షని నెరవేర్చలేదు. ఆ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటులో
పొట్టి శ్రీరాములు చేసిన ఎనలేని కృషి చిరస్మరణీయం.అని చెప్పక తప్పదు.
అమరజీవి...
1901
మార్చి 16న చెన్న పట్టణంలో జన్మించిన పొట్టి శ్రీరాములు ప్రాధమిక విద్య
పూర్తయ్యాక శానటరీ ఇంజనీ రింగ్ కోర్సు చేసి పశ్చిమ రైల్వేలో ఉద్యోగం
చేసేవారు. ఈ క్రమంలో నాడు స్వాతంత్ర పోరాటంలో అనేక మంది పాల్గొనటంతో
ఉత్తేజభరితుడై స్వాతంత్ర సమరం వైపు అడుగులు వేసాడు. ఓ వైపు తన తల్లి
చనిపోయినా... వెర వక మాతృభూమిని విదేశీ కబంధహస్తాల నుండి కాపా డటమే
లక్ష్యంగా గాంధీ సాగించిన మహౌద్యమానికి తానూ బాసటగా నిలచి ఉపð సత్యాగ్రహం,
క్విట్ ఇండి యా ఉద్య మాల్లో చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చే
నాటికి ఈ దేశంలో 22 జిల్లాలో తెలుగు మాట్లాడే వారుండేవారు. 1952లో మద్రాస్
ప్రెసిడెన్సీలో ఉండి దక్షణ భారత దేశంలో సాంప్రదాయలకు పెద్ద పీట వేస్తూ
వచ్చిన తెలుగు జాతి ఎన్నో ఈసడిం పులకు అవమానాలకుగురవుతు ఏహ్యభావం
పెరుగుతున్న దశలో వాటిని సహించలేక తెలుగుభాష మాట్లాడే వారందరినీ ఒకే
రాష్ట్ర పరిధిలోకి తేవాలన్న ఏకైక డిమాం డ్‌తో 1952 అక్టోబ ర్ 19న చెన్నై
పట్టణంలోని బులుసు సాంబ మూర్తి ఇంట్లో ఆమరణ దీక్షను ప్రారంభించారు. అంచెలం
చెలుగా ఆమరణ దీక్ష ఫలితాలు తెలుగునాట విస్తరిం చడంతో పాటు తెలుగునాట
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపం దుకుం ది. లక్షలాది ప్రజలువీధుల్లోకొచ్చి
పొట్టి శ్రీరాములుకు మద్దతుగా ప్రదర్శనలు, నిరసనల దీక్షలు చేపట్టారు. నాటి
కేంద్ర సర్కారు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దీక్ష విర మణకు ససేమిరా
అనటంతో పాటు తెలుగురాష్ట్ర ఏర్పా టుకు భీష్మించడంతో క్రమేణా ఆరోగ్యం
కృసించి 1952 డిశంబర్ 15న దీక్షలోనే ఆయన పరమపదిం చారు.
డిశంబర్ ప్రకటన.
పొట్టిశ్రీరాములు
మరణ వార్త యావత్ ఉమ్మడి రాష్ట్రాన్ని కుదిపేసింది. మద్రాసు నుంచి విశాఖ
సాగర తీరం వర కు లక్షలాది ప్రజలు ఆమరజీవి మరణం పట్ల ఆగ్రహావే శాలు వ్యక్తం
చేస్తూ. విధ్వంసానికి దిగారు. అనేక హింసా త్మక చర్యలకు కూడా పాల్పడ్డారు.
నాడు జరిగిన పోలీసు కాల్పు ల్లో అనేక మంది అసువులు బాసారు. చివరికి ఆయన
చేసినప్రాణత్యాగాన్ని గుర్తించిన నాటి ప్రధాని జవహ ర్ లాల్ నెహ్రూ 1952
డిశంబర్ 19 నఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కు శ్రీకారం చుడుతున్నట్లు
ప్రకటించారు.. 1953 అక్టోబర్1న తెలుగు వారి కోసం ప్రత్యేక ఆంధ్ర ఏర్పా టు
చేసారు.అయితే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్టల్ ఆంధ్రా, రాయలసీమ
జిల్లాలను విడి రాష్ట్ర ఏర్పాటు సన్నాహాల దిశలో ఉండగా నాడు ఉమ్మడి
ముఖ్యమంత్రిగా వ్యవహరి స్తున్న చక్రవర్తుల రాజగోపాలచారి.. ఆంధ్ర రాష్ట్రం
ఏర్పా టు చేస్తే,వెంటనే ఆంధ్రులు వెళ్లిపోవాలని తెగేసి చెప్పడం
తోరాజధానిఏర్పాటుపై అనేక తర్జనభర్జనలు జరిగాయి.
రాజధాని కోసం తర్జన భర్జనలు...
ఈ
క్రమంలో ఆంధ్రకు రాజధానిగా కాకతీయులు పాలించిన వరంగల్‌ని రాజధానిగా చేస్తే
అందరికీ సౌల భ్యంగా ఉంటుందని... అలాగే రాజమండ్రిని పరి గణలో కి
తీసుకోవచ్చని రాజ్యాంగ ప్రదాత బాబా సాహేబ్ అంబే డ్కర్ ప్రతిపాదనచేసారు.
మధ్యే మార్గంగా విజయ వాడని కూడా ఎంపిక చేయాలని తలచారు. అయితే అప్పటికే
విజయవాడని కమ్యూనిస్టులు తమ కంచుకోటగా మార్చు కోవటంతో అక్కడ రాజధాని
ఏర్పాటు చేస్తే తమకు ఇబ్బం దులు ఏర్పడటం ఖాయమని కాంగ్రెస్ నేతలు ససేమిరా
అనటంతో రాజధాని కధ మళ్లీ మెదట ికొచ్చింది.
అదే సమయంలో చెన్నైకి
దగ్గరగా ఉన్న తమని ఆంధ్ర లో కలపడం వల్ల రాజధాని దూరం అవుతుందని.. తద్వారా
తమ రాయలసీమ జిల్లాల అభివృధ్ధి ఆగిపోతుందని... అక్కడి కాంగ్రెస్ నేతలు
కొత్త మెలిక పెట్టడంతో పాటు రాజధానిని కోస్తా ప్రాంతాలలో ఏర్పాటు చేస్తే
తాము అంగీకరించే ప్రశ్నే లేదని, కోస్తా వారిని తాము ఎట్టి పరి స్ధితిలోనూ
నమ్మబోమంటూ రాయల సీమలోనే రాజధాని ఉండాలి. లేదంటే తమకు ప్రత్యేకరాష్ట్రమే
అవసరం లేదం టూ నీలం సంజీవరెడ్డి లాంటి నేతలు ఎదురు తిరగటం ఓ వైపు అయితే
తిరువళ్లూరు, బళ్లారీ, బరంపురం తది తర తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే
ప్రాంతాలను కూడా వదులుకునేందుకు సిద్దపడాల్సి వచ్చింది మరో వైపు.. మద్రాసు
రాష్ట్రాన్ని వదిలి పెట్టి ఎట్టి పరిస్ధితిలోనూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు
త్వరితగతిన ఏర్పాటు చేసుకోవాలని ఒకే ఒక కాంక్షతో రాయలసీమ ప్రాంతంలోని
కర్నూలు రాజ ధానిగా చేసి 1953 అక్టోబర్1న ఆంధ్ర రాష్ట్రంని ఏర్పాటు
చేసారు. దీనికి తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రకేశరి టంగు టూరి ప్రకాశం పంతులు
వ్యవహరించారుఆపై ఆంధ్ర రాష్ట్రంలోనిజాంస్టేట్‌లోని తొమ్మిది జిల్లాలను
కలిపి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌ని ఏర్పాటు చేసి దీనికి హైదరా బాద్‌ని
రాజధానిగా చేసారు. నాటి నుండి తెలుగు వాళ్లు ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా
చూపి స్తూ, తెలుగుభాషకు, మన రాష్ట్రానికి ఎనలేని పేరు ప్రఖ్యా తులు తెచ్చి
పెట్టారు. ఖండా తరాలలోనూ తెలుగువాడి ఖ్యాతి మిన్నంటింది. తెలుగు రాష్ట్ర
ఏర్పాటుకు కృషిచేసిన పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు దిగిన ఇంటిని ఆయన
స్మృతి చిహ్నంగా కాపా డుతూ వస్తోంది. చెన్నైలోని మైలాపూర్, రాయపేట హైవే
రోడ్డులో ఉన్న 126 నంబర్ ఇంటిని మీరెపðడైనా చెన్నై వెళ్తే దర్శించండి. ఇక
మన రాష్ట్ర ప్రభుత్వ ఆ మహనీ యుని పేరు మీద పొట్టి శ్రీరా ములు తెలుగు విశ్వ
విద్యాల యాన్ని స్ధాపించగా... 2008 లో నెల్లూరు జిల్లాకు పొట్టి
శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసింది.
రాష్ట్రం సరే... భాషను కాపాడుకొందాం...
కానీ
నేడు తెలుగు రాష్ట్ర భవి ష్యత్ అగమ్యగోచరంగా తయా రైంది. మా తెలుగు
తల్లికి మల్లె పూదండ... అం టూ తెలుగు భాషకి అమ్మలోని కమ్మదనాన్ని మేళవించి
చేసిన శంకరంబాడి కలం విన్యా సాలు... చేయెత్తి... జై కొట్టు తెలు గోడా...
గతమెంత ఘన కీర్తి కల వోడా... అంటూ వేముల పల్లి శ్రీకృష్ణ తెలుగు జాతి గొప్ప
తనాన్ని... నిండు గౌరవాన్ని ప్రపంచం పిక్కరి ల్లేటట్లు చేసినా అవి పాటలకే
పరిమితం అయిపో వాల్సిన దుస్ధితి నెలకొంది. కనీ సం తెలుగుభాషకీ గౌరవం
దక్కకుండా పోతోంది.
విదేశీయులు మన భాషని ఆశ్వాదిస్తుంటే...
ఒకపðడు
ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్‌గా... దేశ భాషలందు తెలుగు లెస్సగా ఎందరో దేశ
విదేశాలకు చెందిన అనేక మంది ఈ భాషపై మక్కువతో...తెలుగు నేర్చుకుని.తమ
అభిమానాన్ని చాటుకొంటు ప్రపంచంలోని ఏ భాషకూ లేని తెలుగు భాష నుడికారాన్ని,
వీనుల విందైన పదకట్టు విన్యాసాలని నేర్చుకుని మన భాష సౌందర్యాన్ని ఆస్వాది
స్తుంటే... మనం మాత్రం పరాయి భాషల వెూజు లో పడి తెలుగుభాష కమ్మదనాన్ని
పక్కకు నెట్టేస్త్తూన్నా మన తెలు గు భాష అంత్యంత ప్రాచీన భాషగా గుర్తింపు
పొందడమే కాకుండా ప్రాధాన్యతా క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 6వ స్ధానాన్ని
భారతదేశంలో 2వ స్ధానాన్ని దక్కించుకొందంటే మనమింకా అప్రమత్తతగా ఉంటే
ఆస్ధాయి ఎక్కడికి పెర గొచ్చో, తెలుగు భాషలోని జాతీయాలు, మాట్లాడేందుకు ఉండే
సౌలభ్యం ఉన్నతంగా ఉండటంతో అనేక మంది తెలుగు వారిని తమభాషల్లో కలిపేసు
కోవాలని చూసినా అనేక అనువాదాలను తెరపైకి తెచ్చినా వీలుకా లేదు.మన భాషాబలం
అలాం టిది మరి.
జాతికి ద్రోహం చేసినట్లే....
కానీ మన
వాళ్లే సొంత ఇంటి భాషని నిర్లక్ష్యం చేస్తూ... పరాయి భాషల చూరు పట్టుకు
వేలాడుతున్నారు. ఉపాధి కోసం ఇంగ్లీషు నేర్చుకున్నంత మాత్రాన తెలుగు భాషని
మరచిపోవాలన్న రూలేమీ లేదు. మాతృభాషలో ఎవరైనా మాట్లాడటం వింటే చాలు...వికృత
ముఖం పెట్టి చూడ టం...తెలుగు వచ్చినా మాట్లాడకుండా సాటి తెలుగు వారి ని
ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొడటం అంటే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లే
భావించాలి. ఇక తెలుగు మాట్లాడేవారంతా ఒక్కటిగా ఉండాలని నినదించిన వారిని
ఏహ్యభావనతో చూడటం ఆశ్చర్యకరం. తెలుగు జాతి, భాషావికాసాలకు ఎనలేని కృషి చేసి
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మాండలికా లను యావత్ తెలుగు జాతి మొత్తానికీ
పరిచయం చేసిన ఎందరో మహనీయులని, కవులు, కళా కారులని తలచుకుంటూ.వారు చూపిన
బాటలో నడుస్తూ భవిష్యత్‌లో మన రాష్ట్రం ఎన్ని ముక్కచెక్కలైనా తెలుగు
వాళ్లంతా తమ భాష సంస్క ృతులును కాపాడుకోవాల్సిన అవసరం గుర్తించాల్సిన అవసరం
ఎంతైనా ఉందని చెప్పడానికి ఏ మాత్రం సందేహ పడనఖ్ఖర్లే...
అక్కడ వికసిస్తూ.. ఇక్కడ మందగిస్తూ...
విదేశాల్లో
ఆటా, తానా, సిలికానాంధ్ర పేర్లతో అక్కడ ఉన్న తెలుగు వారు తమ మాతృభాష
గొప్పదనాన్ని ఎప్పటిక పðడు గుర్తు చేసుకుంటూ తెలుగు సంస్కృతి, భాషా వికా
సాలకి ఎంతగానో తొడ్పడుతుసాటి తెలుగువారిలో జాతీ యతా భావాన్ని
రగిలిస్తున్నాయి. తెలుగు పతాకాన్ని అక్కడ రెపరెపలాడిస్తున్నా.. మన తెలుగు
గడ్డపై మాత్రం తెలుగు జాతి ఏకీకరణకుగానీ, భాష పట్ల గౌరవాన్ని కానీ
ప్రదర్శిం చక పోవటం విచారకరం.ఇప్పటికే ఇంగ్లీషు మాద్యమానికే పెద్ద పీట
వేస్తూ... మాతృభాషలో విద్యాబోధన పట్ల చిన్న చూపు జరుగుతున్న క్రమంలో నేడు
స్పోకెన్ ఇంగ్లీషు కేంద్రాలొచ్చినట్లే... భవిష్యత్‌లో స్పోకెన్ తెలుగు
కేంద్రాలు పుట్టుకు వచ్చినా ఆశ్చర్యపోనఖ్ఖర్లే...
ప్రభుత్వమేం చేయాలి...
ఇప్పటికే
ఇంటర్నెట్‌లో తెలుగు భాష చదువుకునేందుకు వీలుగా జరిగిన ఏర్పాట్లు
సామాన్యజనానికి కూడా అర్ధమ య్యేలా చట్టాలను తెలుగు భాషలోనే అందుబాటులోకి
తీసుకు రావాలి. అలాగే ఏ ప్రభుత్వ పధకమైనా ధరఖా స్తు తెలుగులో ఉంటేనే
పరిశీలనకు తీసుకుంటామని.. ప్రభుత్వం ప్రకటించాలి. పాలనాపరమైన సౌలభ్యం పేరు
తో ఇంగ్లీషు ఎంత ముద్దనుకున్నా...ప్రతి ఆదేశాన్ని ప్రజల చెంతకు చేర్చాల్సిన
అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ప్రతి జిఓ ప్రజలకు తెలుగులోనే అందుబాటులోకి
తీసుకు రావాలి. మరో స్వాతంత్ర పోరాటం జరిపినట్లే తెలుగు ప్రజలంతా యాసలకు,
ప్రాంతీయా విధ్వేషాలకు అతీ తంగా ఐక్యంగా మన భాషని రక్షించుకోవటానికి ప్రతి
తెలుగు వాడూ నడుంబిగించాలి.
అపðడెందుకు పాల్గొన్నారు
రాష్ట్రం ఎన్నిగా విభజించినా, అది జరిగే వరకు అంతా కల్సి ఉండాల్సిందే కదా ఆంధ్ర ప్రదేశ్ అవరతణ దినోత్సవం అంతా జరుపుకోవాల్సిందే...
2004లో
మంత్రివర్గంలో ఉన్న నేటి విభజనవాదులు అప్పట్లో ఎందుకు అవతరణ దినోత్సవాలలో
పాలొ ్గన్నారు... నేడెందుకు బ్లాకడేేలుగా పాటిస్తున్నారన్న విష యంపై ప్రజల
కు వివరణ ఇవ్వాల్సిందే కాదా
వి.శ్రీనివాస్, పాలకొండ, శ్రీకాకుళం
పరస్పరం గౌరవించుకోవటం అవసరం
గతంలో
జరిగిన జైతెలంగాణా, జై ఆంధ్ర ఉద్యమాలను చూసిన నాకు ప్రస్తుతం రాష్ట్రంలో
నెల కొన్న పరిస్ధితి చూస్తుంటే బాధ కలుగుతోంది. విధ్వేషాలు రెచ్చ గొడుతూ
పబ్బం గడుపుకుంటున్న రాజ కీయనేతలకు దూరంగా ఈ సారి రాష్ట్ర అవతరణ దినోత్సవాల
నిర్వహణ బాధ్యతల్ని కలెక్టర్ల కివ్వటం సరైనదే, ఇక నుండి వారు రాజ కీయ
వత్తిళ్లకు లొంగకుండా జనం బాధల్ని గుర్తెరిగి జాగుర కతతో వ్యవహరించాలి.
అడుగున పడుతున్న సంక్షేమం ప్రజల ముంగిటకు చేర్చాలి. ప్రజలు కూడా రాజకీయ నేత
ల మాటలకు రెచ్చి పోకుండా కేంద్రం విభజన రేఖలు పూర్తి చేసే వరకు సాటి
తెలుగు వారిని పరస్పరం గౌరవిం చుకోవాల్సిన అవసరం ఉంది.
- మనోరంజన్ రావు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి,
ఆర్‌కె నగర్, సికింద్రాబాద్
రెచ్చగొట్టే వారిని శిక్షించాలి...
రాష్ట్రంలో
విపరీత ధోరణులు పెరిగి పోవటానికి నేతల స్వార్ధ రాజకీ యాలే కారణం అన్నది
వాస్తవం. లక్ష్య సాధన కన్నా తమ రాజకీ య భవిష్యత్‌పైనే దృష్టి పెడుతూ ఇష్టా
నుసారంగా ప్రవర్తిస్తూ... జనానికి సమస్యగా తయారయ్యా రు. ఇలాంటి వారిని జనమే
శిక్షించాలి.
గోపాల్ రెడ్డి, హౌసింగ్ బోర్డు కాలనీ,
ఇసీఈఎల్, సికింద్రాబాద్
రెండు రాష్ట్రాలు ఏర్పడితే తప్పేంటి
తెలుగువారికి
రెండు రాష్ట్రాల డిమాండ్ తప్పుకాదు. నాడు పొట్టి శ్రీరాములు అప్పటి
పరిస్ధితిలకు అనుగుణంగా తెలుగువారికి రాష్ట్రాన్ని సాధించారు. అలాగే
తెలంగాణా వారికి ఇప్పుడొక రాష్ట్రం కావాలి. మరి తెలుగు వారికి రెండు
రాష్ట్రాలు ఏర్పడితే తపేపండి అయితే తెలంగాణా రాష్ట్రాన్ని డిమాండ్
చేస్తూనే తెలుగు వారిని గౌరవించాలి. పొట్టి శ్రీరాములును స్మరించాలి. అదే
భావ సమైక్యతకు, తెలుగు జాతి మనుగడకి శ్రేయాేెదాయకం.
- ప్రసాద్, శ్రీకాకుళం
ప్రత్యేక దేశం కావాలన్న నిజాం
ప్రత్యేక
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడానికి పూర్వమే హైదరా బాద్ నిజాంపాలనలో ఉండేది.
భారతదేశానికి స్వాతం త్రమొచ్చినా...తాము మాత్రం అందులో కలిసేది లేదని ససేమి
రా అంటూ ప్రత్యేకదేశంగా ఏర్పాటు కావాలని నిజాం తన ప్రయత్నాలు ప్రారం భించా
డు. ఈ క్రమంలో ఆయుధాల సమీకరణ చేసుకొంటూనే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిని
ఆశ్రయించి సైన్యాన్ని పెంచుకొన్నారు. ఆపై రజాకార్ల హింస పెరిగి పోవ ట తో
ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి దిగారు. దీంతో హైద రాబాద్‌లో
హింస ప్రజ్వరిల్లటంతో 1948లో సెప్టెంబర్ 13న భారత ప్రభుత్వం పోలీ సుచర్యకి
దిగింది. 5 రోజుల పాటు సాగిన ఈ పోరులో నిజాం ఓటమి పాలవ్వగా 18న పోలీసులు
నిజాం సంస్ధానాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో తప్పని పరి స్ధితిలో
భారత దేశంలో తన సంస్ధానాన్ని కలిపేసేందుకు అంగీకరించాడు.
సైనిక పాలన నుంచి సమైక్యం వైపునకు...
హైదరాబాద్‌ని
సైనిక పాలనలోకి తీసుకు వచ్చి సైనిక గవర్నర్‌గా మేజర్ జనరల్ జెఎస్
చౌదరిని నియమించారు. 1949 చివరి వరకూ గవర్నర్ పాలనలో ఉన్న నిజాంను
హైదరాబాద్ రాష్ట్రంగా ప్రకటించి 1950లో రాజ్ ప్రముఖ్‌గా నిజాంని
ప్రకటించి... ఎం.కె వెల్లోడిని ముఖ్యమంత్రిని చేసారు. ఆపై 1952లో జరిగిన
ఎన్నికల్లో భూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే
1953లో ఏర్పాటైన సయ్యద్ ఫజిల ఆలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్విభజన కమి
టీ, విశాలాంధ్ర ప్రయోజనాలు గుర్తిస్తునే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సై
అంది. దీనిపై విభేదించి.. హైదరాబాద్ అసెంబ్లీ మెజార్టీ సభ్యులతో పాటు
కమ్యూనిష్టులు విశాలాంధ్ర ఏర్పాటును సమర్ధించడంతో తెలంగాణా, ఆంధ్రా నేతల
మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగి 1956 నవంబర్1న ఆంధ్ర ప్రదేశ్
అవతరించింది.