15, ఏప్రిల్ 2011, శుక్రవారం
బుల్లితెరపైకి దూసుకొస్తున్న వెంకటేష్
సినిమాల కన్నా సీరియల్స్‌కు లభిస్తున్న ఆదరణ రోజు రోజుకు పెరిగి పోతుండటంతో ఇప్పుడు బుల్లితెరపై కనిపించడానికి పెద్ద పెద్ద తారలు కూడా సిద్దమైపోతున్నారు. ఇప్పటికే అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ లాంటి అగ్ర కధానాయకులు హీరోయిన్లు , సీనియర్ నటులు బుల్లితెరపై కూడా నటించిన విషయం తెలిసిందే. తాజాగా వీరి బాటలో మరో అగ్రహీరో .. విక్టరీ వెంకటేష్ కూడా పయనించనున్నాడు. ఎప్పటి నుంచో స్వామి వివేకానంద పాత్ర పోషించాలనుకుంటున్న వెంకటేష్ . వివేకానందుని జీవితచరిత్రను సినిమా రూపొందించడానికి కూడా ప్రయత్నించాడు. అయితే, రెండున్నర గంటల్లో ఆ కథ చెప్పడం సాధ్యమయ్యే పని కాదని సినిమా నిర్మాణాన్ని విరమించుకుని, టీవీ సీరియల్ గా తీయాలని అనుకుంటున్నాడట. త్వరలోనే ఈ సీరియల్ సెట్స్‌పైకి వెళుతుందని తెలుస్తోంది!
సూపర్ స్టార్ సింహాసనం పాట రీమిక్స్
అప్పుడెప్పుడో.. చిరంజీవి కొండవీటి రాజా లోని మంచమేసి దుప్పటేసి పాటకి. ఈ మధ్య చినుకులా రని.. నదులుగా సాగి.. అంటూ చిందేసిన అల్లరి నరేష్ ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ పాటకి డ్యాన్స్ చేసి పారేస్తున్నాడు. .. అందులోనూ 'సింహాసనం' సినిమాలోని 'ఆకాశంలో ఒక తార... నా కోసమొచ్చింది ఈవేళ' అనే సూపర్ హిట్ సాంగ్ . అల్లరి నరేష్, పూర్ణ జంటగా గతంలో 'సీమ శాస్త్రి' సినిమాని రూపొందించిన దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న 'సీమ టపాకాయ్' సినిమా లో ఈ పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాట ఆడియోకే హైలైట్ అవుతుందని నిర్మాత చెబుతు...ఈ సినిమా ఆడియోను ఈ నెల 18 న హైదరాబాదులో ఘనంగా రిలీజ్ చేస్తామని చెప్పారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)