12, నవంబర్ 2010, శుక్రవారం

కేసీఆర్ మరో మర్రి చెన్నారెడ్డి

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో మర్రి చెన్నారెడ్డి అని టీడీపీ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు
ఇందిరాగాంధీకి చెన్నారెడ్డి ఉద్యమాన్ని తాకట్టు పెట్టి పదవులు పొందితే నేడు కేసీఆర్ సోనియా గాంధీ కాళ్ళ వద్దకు ఉద్యమాన్ని తీసుకువెడుతూ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

డిసెంబర్ తర్వాత ఉద్యమం ఉధృతమని ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని కేశవరావు సమక్షంలో అనడం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని ఆ పార్టీ నేతలే ఒప్పుకున్నట్టేనని ఎద్దేవా చేశారు.

చిరంజీవి కోరితే రాజకీయ శిక్షణ ఇస్తా ,.......

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కోరితే రాజకీయ శిక్షణ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

నాయకత్వ లక్షణాలు పుట్టుకతో వచ్చేవి కావని, అలవర్చుకోవాలనే ఆసక్తి, జిజ్ఞాస ఉండి తనకు ఆహ్వానం పంపితే ....23 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న తాను సినీరంగం నుంచి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన చిరంజీవికి రాజకీయ పార్టీల లక్షణాల గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నానని ఒకవేళ తన ప్రతిపాదనను అపహాస్యంగా భావిస్తే 'అది వారి ఖర్మ...' అని వ్యాఖ్యానించారు.

ప్రజారాజ్యం పార్టీకి ఒక్క ఎంపి కూడా లేనందున ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 33మంది కాంగ్రెస్ ఎంపిీలు గడిచిన 18 మాసాల్లో చేపట్టిన కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని.....ఎన్‌డీఎ హయాంలో రాష్ట్రానికి టీడీపీ ఎంపీలు ఏం సాధించారో చంద్రబాబునాయుడు కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రోడ్డుపై రోశయ్యధర్నా

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి రోడ్డుపై ధర్నా చేశారు. తమ అధినేత్రిపై వచ్చిన అభియోగాలను నిరసిస్తూ సగటు కార్యకర్తతో పాటు రహదారిపై బైఠాయించారు. అదీ నిషేదాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతంలో. సర్వత్రా చర్చనీయాంశమైన ఈ ఘట్టానికి హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ కూడలి వేదిక అయింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఆర్ఎస్ఎస్ మాజీ అధినేత సుదర్శన్ చేసిన విమర్శలను నిరసిస్తూ ప్రదర్శనలు జరపాలని పీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాసరావు, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

.రోశయ్యని అరెస్ట్ చేయాలి

నిషేధిత ప్రాంతంలో ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.రోశయ్యని పోలీసులు అరెస్ట్ చేయాలని లోక్'సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ధర్నాలో పాల్గొనడాన్ని ఆయన తప్పుపట్టారు.

వాస్తవాలు దాగవు

కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఎదురు దాడులు చేసినా వాస్తవాలు దాగవనే విషయం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు హెచ్చరించారు.

జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని సిీఎం రోశయ్య ఉలిక్కి పడుతున్నారని అందుకే మంత్రులపై ఆరోపణలను ఖండించాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, అంబటి రాంబాబు, కొండా సురేఖ తదితరులు మంత్రులపై అనేక అవినీతి ఆరోపణలు చేశారని, వాటికి సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం రోశయ్య చేసిన ఆరోపణలకు ఆయన విచారణకు సిద్ధంగా ఉన్నారని, రోశయ్య, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా ఆయన విచారణకు సిద్ధంగా ఉన్నారా..! అని ఆయన సవాలు విసిరారు.

మనుషులకే వైద్యసేవలు అందించని దానం.. నాకు పశువైద్యం చేస్తాడా?

రోమ్ నగరం తగలబడుతుంటే 'నీరో చక్రవర్తి' ఫిడేలు వాయిస్తూ కూర్చున్నట్టు.. రాష్ట్రంలో ప్రజలు వరదలతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రోశయ్య కాంగ్రెస్ పార్టీ 125 అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించండంటూ పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని టీడీఎల్‌పీ ఉపనేత, ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే వారి గోడు పట్టించుకోకుండా కాంగ్రెస్ ఉత్సవాలు ఘనంగా జరపాలని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. మనుషులకే వైద్యసేవలు కరువవుతుంటే ఆరోగ్యశాఖ మంత్రి దానం నాగేంద్ర నాకు పశువైద్యం చేయాలంటూ విమర్శించడం విడ్డూరంగా మండిపడ్డారు.

బలో పేతం దిశగా తెలుగుదేశం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలో పేతం చేసే దిశగా తెలుగు దేశం పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలు అజెండాగా జనం మధ్యకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి. వాడవాడలా, పల్లెపల్లెనా తెలుగుదేశం నినాదంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.

విద్యార్థి, ఉద్యోగ, ఉపా«ధ్యాయ, కార్మిక, కర్షకుల సమస్యలు పరిష్కరించలేని అసమర్థ ప్ర భుత్వాలుగా ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చరిత్ర పుటల్లో నిలుస్తాయని .... ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలిచేందుకు వాడవాడలా టీడీపీ నినాదంతో ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణ యం తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై రాజీలేని పోరాటం సాగిస్తామన్నారు పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు

బాబును శంకించడం తగదు

తెలంగాణ ఏర్పాటు అం శంపై టీడీపీ అధినేత చంద్రబాబును శంకించడంతగదని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్రంలో, రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అంశంపై టీఆర్ఎస్ నిలదీయకుండా కేవలం టీడీపీని విమర్శించ డం చూస్తుంటే ఆ రెండు పార్టీలు లో పాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు.

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే టీడీపీకి చెందిన ఆంధ్ర ప్రాంత ఎంపీలు మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు.

వెక్కిరిస్తున్నదృశ్య శ్రవణాలు

విద్య ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దృశ్య శ్రవణ బోధన ఘోరంగా విఫలమైంది. ప్రాథమిక విద్యను మెరుగుపర్చడానికి ప్రభుత్వం సక్సెస్ పాఠశాలలతో పాటు ఉన్నత పాఠశాలలకు కలర్ టీవీలు, డిష్‌లను అందజేసింది. మన టీవీ కార్యక్రమాలను విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం వీటిని సరఫరా చేసింది.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల అలసత్వం, పాలకుల స్వార్థం వల్ల అమలుకు నోచుకోకపోవడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టింది. మరోవైపు రూ. లక్షలాది నిధులు వృథా అయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితం తాంబుళం ఇచ్చాం... ఇక తన్నుకుచావండి అన్న చందంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేసిన మన టీవీలు పాఠశాలల్లో అటకెక్కాయి.

గణి తం, సామాన్య, ఆంగ్లం, సాంఘిక శాస్త్రాల్లోని పలు అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పే అంశాలను మన టీవీలో పొందుపర్చారు..మన టీవీలను ప్రారంభించి అంశాలను చెప్పిన సందర్భాలు లేవు. వీటి ద్వారానే టెలికాన్ఫరెన్స్ జరగాల్సి ఉన్న జరగడం లేదు. ఫలితంగా రూ. లక్షలాది రాజీవ్ విద్యామిషన్ నిధులు నిరుపయోగంగా మారాయి.

చాలా చోట్లా పనిచేయక మూలన పడి ఉండి అధికారుల పనితీరును వెక్కిరిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. మరికొన్ని పాఠశాలల్లో టీవీలను ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లినట్లు సందర్భాలున్నాయి.

తమిళ సంవత్సరాదికి ఉచిత సరుకులు

తమిళ సంవత్సరాది, పొంగల్ పండుగలను పురస్కరించుకుని రేషన్‌కార్డు దారులందరికీ జనవరి 1తేదీ నుండి చక్కెర, బియ్యం, బెల్లం తదితర సరకులను రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కరుణానిధి ప్రకటించారు
తమిళ సంవత్సరాదిని అన్నికుటుంబాల వారు పొంగల్‌తో ఉత్సాహంగా జరుపుకునేందుకు సరకుల బ్యాగ్‌ను రాష్ట్రప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇందుకోసం రూ.70 కోట్ల నిధులు విడుదల చేసింది.