1, జనవరి 2012, ఆదివారం

స్వార్థ పరుడిని : షారుఖ్‌

రా.ఒన్‌, డాన్‌ 2 సినిమాలు వరుసగా బ్రహ్మాండమైన విజయం సాధించడంతో షారుక్‌ ఖాన్‌ బాలివుడ్‌ను పాలిస్తున్నారనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఈ మధ్య వారి సినిమాలకు అనుమతులను పెద్దఎత్తున పెంచడం కోసం దేశం మొత్తం పర్యటించిన సమయంలో ప్రజల నుండి అద్భుతమైన రీతిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. జీన్యూస్‌లో ప్రసారమయ్యే కహియే జానబ్‌, స్వాతి చతుర్వేదితో జరిపిన ముఖాముఖి కార్యక్రమంలో షారుక్‌ ఖాన్‌ రాజకీయాలు మొదులుకొని, అన్నా హజారే అవినీతి వ్యతిరేకోద్యమం, లోక్‌పాల్‌ బిల్లు, భారత రత్నలకు సంబంధించి అనర్గళంగా మాట్లాడారు. రాజకీయాలలో ప్రవేశించి ప్రధాన పాత్రపోషించనున్నారా? అన్న ప్రశ్నకు 'నేను చాలా కాలం నుండి చిత్ర జగత్తులో ఉన్నాను. ఒక్కసారి వృత్తిని మార్చలేను. రాజకీయాలనేవి జీవిత కాలంపాటు చేయాల్సినవి. రాజకీయాలలో ప్రవేశించడం అంటే వృత్తిని అందుకోసం అంకితం చేయడం. వృత్తి రాజకీయం అంటే రాజకీయ నాయకుడు నిస్వార్ధంగా ఉండి,ప్రజలతో మమేకమై జీవిత కాలంపాటు సేవచేయడం. నేను స్వార్ధ పరుణ్ని కాదు. నాకు రాజకీయాలు తెలియవు. విలేఖరులు ఎప్పుడూ నన్ను అడుగుతుంటారు మీరు మొన్న ఒక రాజకీయ నాయకుణ్ణి కలిశారు. వారి పార్టీలో చేరుతున్నారా? అని వారికి నేను మీరు ఆ నాయకుల్ని ఎందుకు అడగరు సినిమా లో ప్రవేసిస్తున్నారా? అని' అంటూ షారుక్‌ తనదైన శైలిలో మాట్లాడారు. అన్నా హజారే లోక్‌పాల్‌ ఉద్యమం గురించి మాట్లాడుతూ 'ప్రతి ప్రజాస్వామ్య దేశంలో తీర్పరి (ఓమ్‌బుడ్స్‌మెన్‌) నియామకం అవసరం. అది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాంటిది. పౌర, ప్రభుత్వ లోక్‌పాల్‌ బిల్లుల రెండింటిలో లోపాలు లేకపోలేదు. ఆ రెండింటిని సవరించి నూతన విధి విధానాలను రూపొందించడం ఎంతైనా అవసరం' అన్నారు.
ఈ మధ్య ప్రముఖంగా వినిపిస్తున్న క్రీడాకారులకు, సినిమా నటీనటులకు సచిన్‌, ద్యాన్‌ చంద్‌లను భారత రత్నల జాబితాలో చేర్చాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ 'దేశంలో చారిత్రక వ్యక్తులు ఇంకా ఉన్నారు. అలాంటి వ్యక్తులకు భారత రత్నాలాంటివి ఇవ్వకపోయినా వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం మన కర్తవ్యం' అంటూ షారుక్‌ ఖాన్‌ అన్ని విషయాల పట్ల స్పష్టంగా, సూటిగా తన ధోరణిలో పరిణత వాణిని వినిపించారు.

నేతల 'భవిష్య దర్శనం'

గత ఏడాది అనుభవాల్ని మననం చేసుకుంటూ ఆందోళనకరంగానే ప్రజలంతా కొత్త ఏడాదిలో ప్రవేశించారు. నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగానే జరుపుకున్నా 2011నాటి ప్రభావం ఈసారి ఏమేరకు ప్రసరిస్తుందోనన్న భయాందోళన ప్రతిఒక్కరిలో వ్యక్తమౌతోంది. కాగా, ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా 2014 ఎన్నికల్లో విజయానికి ఈ ఏడాదిలోనే పునాదులేసుకోవాలని పథకరచన చేస్తున్నారు. ప్రజాజీవితంలో తమ పాత్ర పటిష్టానికి ఎత్తుగడలు రచిస్తున్నారు. నూతనేడాదిలోకడుగిడుతున్న కీలకనేతల మనోభావాలు ఈ విధంగా ఉన్నాయి.
చిరంజీవి
2011 ఆశాజనకంగా లేదు. కాంగ్రెస్‌లో విలీన ప్రతిపాదన ఫలితాన్నివ్వలేదు. నన్ను తప్ప పార్టీలో మరింకెవరినీ కాంగీయులు విశ్వసించడంలేదు. మంత్రి పదవుల మాట భగవంతుడెరుగు నాతోవచ్చి కాంగ్రెస్‌లో చేరిన పిఆర్‌పి ఎమ్మెల్యేలకు 2014 ఎన్నికల్లో పోటీకి టికెట్లు కూడా కాంగ్రెస్‌ నుంచి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. విలీనంకాకుండా పదవులేంటంటూ కిరణ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు నా హృదయానికి గాయం చేశాయి. రామచంద్రయ్యకు మంత్రి పదవొద్దంటూ కడప కాంగీయుల రాద్ధాంతం పిఆర్‌పి శ్రేణుల్లో స్థైర్యాన్ని దిగజారుస్తోంది. దీనికంటే పార్టీని పునరుద్ధరించుకోవడమే మేలు. ప్రజలు నిర్ణయించిన విధంగా బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తే 2014 నాటికి ఆశాజనక ఫలితాలుంటాయి.
కెసిఆర్‌
ఈ ఏడాదైనా సోనియా తెలంగాణ ఇస్తుందన్న విశ్వాసముంది. ఆ తర్వాత కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ను విలీనం చేసినా తెలంగాణ ప్రాంతంలో నాదే ఏకఛత్రాధిపత్యం. ఇక్కడ జరిగే ఎన్నికల్లో నేను నిలబెట్టిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించడం ఖాయం. ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా ఉంటూనే రాజకీయ చక్రం తిప్పే అవకాశం చేతిలోకొస్తోంది. అవసరాన్ని బట్టి కేంద్రంలో కూడా రాజకీయం చేయొచ్చు. 2014 నాటికి కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించే అవకాశాలు నాకే ఉంటాయి.
చంద్రబాబు
ప్రతిపక్షపాత్ర పోషణలో విజయవంతమౌతున్నా. తెలంగాణలోకూడా పార్టీని పటిష్ట పర్చడంలో కృతకృతులయ్యాం. రాష్ట్రం విడిపోయినా రెండు ప్రాంతాల్లోనూ పట్టున్నపార్టీగా తెలుగుదేశం గుర్తింపుపొందింది. తెలంగాణలో కూడా అధికారంలోకొస్తాం. మేం సూచించిన వ్యక్తే అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. వచ్చే ఎన్నికల నాటికి జాతీయస్థాయిలో చక్రం తిప్పుతాను. ఎన్‌టిఆర్‌ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన నాయకత్వంలోని యునైటెడ్‌ ఫ్రండ్‌ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని పీఠమెక్కే అవకాశాల్ని ఎన్‌టిఆర్‌, ఆ తర్వాత నేను కూడా కావాలనే కాలదన్నుకున్నా. ఈసారి ఇలాంటి పొరపాటు చేయకూడదు. సీమాంధ్ర, తెలంగాణల్లో పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తాను.
కిరణ్‌కుమార్‌
ఏడాది పాలన సజావుగానే ముగించా. ఇప్పటికీ రాష్ట్రంలో పార్టీ శ్రేణులపై నాకు పట్టులేదన్న అపప్రద ఉంది. దీన్ని తొలగించుకుంటాను. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తా. వారితో మమేకమౌతా. పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు 2012ను సమర్థమంతంగా వినియోగించుకుంటా. 2014 తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా. వైఎస్‌ఆర్‌ కూడా కార్యకర్తల్ని పేరుపెట్టి పిలిచే స్థాయికి చేరిన తర్వాతే ముఖ్యమంత్రి పీఠం ఎక్కగలిగారు. అదృష్టవశాత్తు తొందరగానే లభించిన ముఖ్యమంత్రి అవకాశాన్ని దీర్ఘకాలం నిలబెట్టుకుంటా. ఒక వేళ తిరిగి పార్టీ అధికారంలోకి రాకపోయినా కార్యకర్తలతో ఉన్న స్నేహసంబంధాలు భవిష్యత్‌ను నిర్మిస్తాయి. కేంద్రంలో ఏదొక కీలక అవకాశం లభిస్తుంది.
బొత్స
అధిష్టానం కిరణ్‌కుమార్‌ను
ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశాలు కనిపించడంలేదు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్తో వ్యక్తిగత అనుబంధాలు కలిగిన నాయకులకే కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో అలాంటి అవకాశం నా ఒక్కడికే ఉంది. ఎన్నికలకు ఏడాది ముందు 2013లోనే కిరణ్‌కుమార్‌ పీఠం కదిపేస్తారు. నన్ను ముఖ్యమంత్రిని చేస్తారు. ఈ ఏడాదంతా కిరణ్‌తో విభేదాల్లేకుండా గడిపేస్తాను. భావి ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తా.
జగన్‌
సిబిఐ విచారణకు భయపడాల్సిన అవసరంలేదు. కంగారు పడి అరెస్టు చేసినా ఆరుమాసాల్లో బయటకొచ్చేస్తాను. ఆ సానుభూతితో ఎన్నికల్లో పాల్గొంటాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా కేంద్రంలో చక్రం తిప్పగల శక్తుంది. ఈ విషయంలో మమతాబెనర్జీ, శరద్‌పవార్‌ల తీరును అనుసరిస్తా. కేంద్రం తన అవసరాలకనుగుణంగా నా మాట వినితీరుతుంది.

సంతోషాల సందడి!

2011వ సంవత్సరాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుంటే సంతోష, విషాదాల సమ్మేళనంతో ఈ ఏడాది ముగిసింది. సంతోషకరమైన సంఘటనలను మననం చేసుకుంటే...ఫిబ్రవరి 4న హీరోయిన్‌ నవనీత్‌కౌర్‌ పెళ్లి జరిగింది. శాసనసభ్యుడు రవిరాణాను ఆమె వివాహమాడారు. ఇక 58వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగులో తీసిన ఉత్తమ విద్యావిషయక చిత్రంగా 'అద్వైతం' అవార్డు పొందింది. ఇదే ఏడాది తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాల దర్శకుడైన కె.బాలచందర్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం లభించింది. ఇక మార్చి 5న అల్లు అర్జున్‌, స్నేహారెడ్డిల వివాహం జరిగింది. మే 5న జూ.ఎన్‌.టి.ఆర్‌., లక్ష్మీప్రణతిల వివాహం జరిగింది. డిసెంబర్‌ 1న రామ్‌చరణ్‌, ఉపాసనల నిశ్చితార్ధం జరిగింది. ఇదేనెల 28న చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్‌మేన్‌ ప్రజిత్‌తో మమతామోహన్‌దాస్‌ వివాహం జరిగింది.

డబ్బింగ్‌లదే హవా!

డబ్బింగ్‌ సినిమా విషయానికి వస్తే హాలీవుడ్‌, బాలీవుడ్‌ ,తమిళ్‌, మలయాళ, కన్నడ భాషలకు చెందిన చిత్రాలు అనువాద చిత్రాలుగా వచ్చాయి. వీటిలో కాంచన, సెవెన్త్‌సెన్స్‌, ట్రాన్స్‌పోర్టర్‌, 2011 అంతరిక్ష ఆక్రమణ, అవతార్‌ 2011, నాన్ని, నాపేరు శివ, ప్రేమఖైది, గ్యాంబ్లర్‌, కాంచన, జీ వన్‌, డాన్‌ 2, ద డర్టీ పిక్చర్‌, జర్నీ చిత్రాలు విజయం సాధించాయి. అనువాద చిత్రం 'రంగం' వందరోజుల చిత్రంగా ఆదరణ పొందింది. షారుక్‌ఖాన్‌, అజీత్‌, కార్తీ, ఆది, విద్యాబాలన్‌ వంటి ఇతర భాషలకు చెందిన తారలు తెలుగులో సక్సెస్‌ అయ్యారు. తెలుగు సినిమాకు డబ్బింగ్‌ సినిమా పోటీగా మారిందనేది వాస్తవమే. అయితే డబ్బింగ్‌ సినిమాకు ప్రేక్షకాదరణ లభించడానికి ఆయా చిత్రాల్లో కనిపించే నూతన నేపథ్యమే కారణం అని భావించవచ్చు. ఈ ఏడాది 110 అనువాద చిత్రాలు తెలుగులో విడుదలయ్యాయి.

చిత్తం, విత్తంలేని చిత్రపరిశ్రమ

ఈ ఏడాది తెలుగు చిత్రపరిశ్రమ మిశ్రమ ఫలితాలను చూసింది. అలా మొదలైంది వంటి చిన్న సినిమా ద్వారా సక్సెస్‌కు నాంది పలికింది. ప్రేమకావాలి, అహనాపెళ్ళంట, హండ్రెడ్‌ పర్సెంట్‌ లవ్‌, సీమటపా కాయ్‌, కాంచన, మడత కాజా, నువ్విలా, పిల్ల జమిందార్‌, సోలో, వీడు తడా, ఇట్స్‌ మై లవ్‌స్టోరీ వంటి చిన్న సినిమాలు, మిరపకాయ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, కందిరీగ, దూకుడు, బద్రీనాథ్‌, శ్రీరామ రాజ్యం, రాజన్న వంటి భారీ చిత్రాలు విజయం సాధించాయి. సంఖ్యపరంగా విడుదలైన తెలుగు చిత్రాలు కేవలం 109 మాత్రమే.
ఆందోళన కలిగిస్తున్న ధియేటర్ల సమస్య
ఈ ఏడాది చిత్రపరిశ్రమలో ఏర్పడ్డ ధియేటర్ల సమస్య చిన్న చిత్రాలను తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. బడా సినిమాల కోసం ధియేటర్లను బ్లాక్‌ చేయడంతో ఇతర చిత్రాలకు ధియేటర్లు లేకుండా పోయాయి. దీంతో చిన్న చిత్రాల నిర్మాతలు ఆందొ ళనకు దిగారు, నిరహారదీక్ష ద్వారా తమ నిరసన తెలియజేశారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్లింది. కేవలం ధియేటర్లు లభించని కారణంగా చాలా సిని మాలు ప్రేక్షకుల ముందు కురాకుండా నిలిచి పోయాయి. ఈ సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

విష్యూ హ్యాపీ న్యూ ఇయర్‌

మన కొత్త సంవత్సరం ఉగాదితో మొదలైతేనేం జనవరి ఫస్టును ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయం. ఇంకా చెప్పాలంటే దీన్నే సిసలైన న్యూ ఇయర్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటాం. జనవరి 1తో మొదలయ్యే గ్రెగెరియన్‌ క్యాలెండర్‌ డిసెంబర్‌ 31తో ముగుస్తుంది. పన్నెండు నెలల ఈ క్యాలెండర్‌ ప్లుటార్చ్‌, మాక్రోబియస్‌ల పద్ధతిని అనుసరించి క్రీస్తుకు పూర్వం 700 నాటి న్యూమా పాంపీలియస్‌ నాటినుండి అమల్లో వుంది. రోమన్‌ రచయితలు మొదట్లో సంవత్సరాలకు పేర్లు పెట్టేవారు.అయితే క్రీ.పూ. 153 జనవరి 1 తర్వాత కార్యాలయంలో కాలుపెట్టలేదు. దాంతో జనవరి ఫస్టును వాళ్ళు న్యూ ఇయర్‌గా వేడుకచేయడం ప్రారంభించారు. అయితే ఆ ఒక్కరోజే కాదు, మధ్యయుగం వరకు మార్చి 1, మార్చి 25, ఈస్టర్‌ పండుగ, సెప్టెంబర్‌ 1, డిసెంబర్‌ 25 (క్రిస్టమస్‌) తేదీలను కూడా కొత్త సంవత్సరంలాగే వేడుక చేసుకునేవారు. ఇక ఇరవయ్యో శతాబ్ద ప్రారంభంలో పాశ్చాత్య నాగరికత మరింత వేళ్ళూనుకుని విస్తృతమయ్యాక జనవరి 1వ తేదీ ప్రపంచానికి పర్వదినం అయింది. చైనా, భారత్‌ లాంటి దేశాల్లో తమ ప్రాంతీయ క్యాలెండర్లు ఉన్నప్పటికీ న్యూ ఇయర్‌ను ఎంతమాతం విస్మరించకపోగా రెట్టింపు ఉత్సాహంతో జరుపుకోవడం విశేషం.
సిడ్నీలో న్యూ ఇయర్‌ సందర్భంగా 80 వేల ఫైర్‌ వర్క్స్‌ షాపులు వెలిశాయి. ఏకంగా 5 లక్షలమంది అక్కడ హాజరై కేరింతలు కొట్టారు. ఇక ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో తిలకిస్తూ పులకించినవాళ్ళయితే కోటానుకోట్లు. అలాగే చిలీలోని వాల్పరైసోలో ఇరవై లక్షలమంది ప్రజలు 21 కిలోమీటర్ల దూరం మేరకు వ్యాపించారు. న్యూ ఇయర్‌ను స్వాగతిస్తూ 25 నిమిషాల మేరకు క్రాకర్లతో ఊపిరాడకుండా చేశారు. థేమ్స్‌ నది ఒడ్డునున్న ''లండన్‌ ఐ''లో కళ్ళు జిగేల్‌మనేలా, దేదీప్యమానమైన టపాసులు మారుమోగాయి. అర్ధరాత్రి దాటినా కాసింత ఉత్సాహం తగ్గదు. అందుకే అనేక సంస్థలు న్యూ ఇయర్‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ స్వ్కేర్‌లో ఒక అతి పెద్ద క్రిస్టల్‌ బాల్‌ను ఏర్పాటుచేసి దానిమీదే దృష్టిని కేంద్రీకరించి ''టెన్‌.. నైన్‌.. అంటూ కౌంట్‌ డౌన్‌ మొదలుపెట్టి సరిగ్గా పన్నెండు కాగానే ఉద్వేగం తారాస్థాయికి చేరగా గ్రీటింగ్స్‌ చెప్పుకుంటారు. స్కాట్‌ల్యాండ్‌, ఎడిన్‌బరోలో ప్రపంచంలోకెల్లా భారీగా అనిపించే స్థాయిలో హాగ్‌మెనే వేడుకలు జరుపుతారు. స్కాటిష్‌ భాషలో హాగ్‌మెనే అంటే సంవత్సరంలో చివరిరోజు అని అర్థం. ఈ వేడుకలు ఏకంగా నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆ దేశస్తులే కాకుండా చుట్టుపక్కల దేశాల నుండి ప్రజలు హాజరవడంతో ఇసుక వేస్తే రాలనట్టుగా వుంటుంది.
రియో డే జెనీరో, కొపాకబానా బీచ్‌లో ప్రతి సంవత్సరం జరిగే న్యూ ఇయర్‌ వేడుకలో ఇరవై లక్షలమంది పాల్గొంటారంటే అతిశయోక్తి కాదు. పావుగంట పాటు ఎడతెరిపి లేకుండా క్రాకర్లు హోరెత్తుతాయి. లాటిన్‌ అమెరికా సంప్రదాయాన్ని అనుసరించి న్యూ ఇయర్‌ రోజున భవిష్యత్తు ఎలా వుండబోతోంది అనే అంశమై చర్చలు, ఎనాలిసిస్‌లు జరుపుతారు. అంటే మనం ఉగాదిరోజున పంచాంగం తిరగేసినట్లన్న మాట. క్రిస్టియన్‌ ట్రెడిషన్‌ ప్రకారం జనవరి 1వ తేదీ పవిత్రదినంగా భావిస్తారు. వారికి ఆరోజు క్రీస్తు దేవదూతగా, జీసెస్‌గా మారినట్లు.
న్యూ ఇయర్‌ విశేషాలు
శ తూర్పు దేశాల్లోని పన్నెండు అతి పెద్ద సాంప్రదాయ చర్చిల్లో ఎనిమిది చర్చ్‌లు మార్పులు చేర్పులు చేసిన జులియన్‌ క్యాలెండర్‌ను అనుసరిస్తున్నాయి.
శ బల్గేరియా, సిప్రస్‌, ఈజిప్ట్‌, గ్రీస్‌, రొమేనియా, సిరియా, టర్కీల్లో జనవరి 1వ తేదీనే వేడుక చేసుకుంటాయి.
శ ఫ్రాన్స్‌లో కొత్త సంవత్సర వేడుకలు, అతి ప్రాచీన పద్ధతిలో సంప్రదాయబద్దంగా జరుగుతాయి. ఆరోజు వాళ్ళు ఏం ధరించాలి అనే అంశమై మట్టుకు ఎలాంటి నిబంధనలూ లేవు. ఈ దేశస్తులు జనవరి 1వ తేదీని ''జోర్‌ డెస్‌ ఎట్రెనెస్‌'' అని, ''ఈవ్‌ లా సెయింట్‌ సిల్వెస్ట్రె'' అని కూడా పిలుస్తారు. మనం ''హ్యాపీ న్యూ ఇయర్‌'' అని గ్రీట్‌ చేసుకున్నట్టు ''బొన్నే అన్నీ'' అంటూ పరస్పరం అభినందనలు తెలుపుకుంటారు. ఇక ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా టపాసులు మిన్నంటుతాయి. న్యూ ఇయర్‌ ఉత్సవంలో పాల్గొన్న అసంఖ్యాకమైన ప్రజానీకంతో అక్కడి వాతావరణం మహా ఉత్సాహంగా వుంటుంది. అసలు న్యూ ఇయర్‌కు కెళకళలాడని ప్రపంచ వీధులుంటాయా?!
స్కూలు, కాలేజి, ఆఫీసు - అన్నీ దాన్ని అనుసరించే వుంటాయి. అంతేతప్ప తెలుగు క్యాలెండర్‌ ప్రకారం తిథులు, వారాల ప్రకారం నడచుకుంటామంటే కుదరదు. నాలుగేళ్ళకోసారి వచ్చే లీప్‌ ఇయర్‌తో లెక్కలన్నీ కుదిరి ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ పకడ్బందీగా వుంటుంది. ఎక్కడా అధిక మాసాలూ గట్రా వుండవు. మన పంచాంగాలను అర్థం చేసుకోడానికి పాండిత్యం వుండాలి కానీ, ఇంగ్లీష్‌ క్యాలెండర్‌కు అవేమీ అవసరంలేదు. మరి, ఇంత తేలిగ్గా, సుగమంగా ఏర్పాటైన పద్ధతి కనుక, ఆ క్యాలెండర్‌లో మొదటిరోజు కనుక దేశాలు, వర్గాలతో సంబంధం లేకుండా అందరూ అక్కున చేర్చుకుంటున్నారు.
ఉగాది - కొత్త సంవత్సరం
ఈ న్యూ ఇయర్‌ని ఒకసారి పక్కనపెడితే మన తెలుగువాళ్ళు ఉగాదిని కొత్త సంవత్సరంగా జరుపుకుంటాం. ఇది చైత్ర శుద్ధ పాడ్యమిరోజున వస్తుంది. మనవాళ్ళు తిథులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చావుపుట్టుకలను కూడా తిథి, వార, నక్షత్రాలనుబట్టి గణిస్తారు. సంవత్సరాదిరోజున రాశిఫలాలు చెప్పించుకుంటారు. ముఖ్యంగా ఆ ఏడాది వర్షాలు ఎలా ఉన్నది, దేశం సుభిక్షంగా వుండబోతున్నదా లేక కరువుకాటకాలేమైనా రాబోతున్నాయి లాంటి ఫలితాలన్నీ కొందరు పండితులు పంచాంగ శ్రవణంద్వారా వినిపిస్తారు.
తిరువాల్లువార్‌ ఎరా
తమిళుల నూతన సంవత్సరం థాయి నెలలో మొదటిరోజు. తమిళనాడు డి.ఎం.కె. ప్రభుత్వం 2008 జనవరి 29న థాయి నెలలో మొదటిరోజు తమిళులకు కొత్త సంవత్సరం అంటూ డిక్లరేషన్‌ బిల్‌ పాస్‌ చేసింది. తమిళనాడు న్యూ ఇయర్‌ యాక్ట్‌ 2008ని అనుసరించి అప్పటి గవర్నర్‌ కొందరు తమిళ పండితులతో చర్చించిన మీదట అలా నిర్ణయించినట్లు తెలిపారు. ఆ నిర్ణయంలో ఎలాంటి అభ్యంతరాలు లేకపోయాయి. దాంతో తమిళ క్యాలెండర్‌ తిరువాల్లువార్‌ ఎరాను అధికారికంగా ప్రకటించారు.
మనకు తెలుగులో ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత- అంటూ అరవై తెలుగు సంవత్సరాలున్నట్టే తమిళిలకూ అరవై సంవత్సరాలున్నాయి. మొదట్లో తమిళులు మనం సంక్రాంతి లేదా పొంగల్‌ జరుపుకునే జనవరి 14వ తేదీని కొత్త సంవత్సురంగా వేడుక చేసుకునేవారు. కానీ, తర్వాత చోటుచేసుకున్న పరిణామలను అనుసరించి సంప్రదాయబద్దంగా అది సరికాదని, థాయి నెలలో మొదటిరోజును కొత్తసంవత్సరంగా జరుపుకుంటున్నారు. ఇది ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏప్రిల్‌ నెల మధ్యలో వస్తుంది. మన ఉగాది కూడా మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌ మధ్యలోనే వస్తుంది. తమిళనాడు వాసులే కాకుండా, శ్రీలంక, ఇంకా ఇతర దేశాల్లో స్థిరపడిన తమిళులందరూ ఈరోజునే నూతన సంవత్సరంగా గుర్తించి వేడుక చేసుకుంటున్నారు.
శ ఈస్ట్రన్‌ ఆర్తడాక్స్‌ చర్చి సంప్రదాయం ప్రకారం జనవరి 14వ తేదీ కొత్త సంవత్సరం. దీన్ని జూలియన్‌ క్యాలెండర్‌ అంటారు. కొన్ని దేశాల్లో గ్రెగేరియన్‌ క్యాలెండర్‌ న్యూ ఇయర్‌తోబాటు జూలియన్‌ క్యాలెండర్‌ న్యూ ఇయర్‌ను కూడా వేడుక చేస్తారు. జనవరి 1వ తేదీని చాలా దేశాల్లో సెలవుదినంగా పరిగణిస్తారు. జవవరి 1 సివిక్‌ హాలిడే కాగా జూలియన్‌ న్యూ ఇయర్‌ను ''ఓల్డ్‌ న్యూ ఇయర్‌''గా పేర్కొంటూ రెలిజియస్‌ హాలిడేగా ప్రకటించారు. జార్జియా, జెరూసలేం, రష్యా, రిపబ్లిక్‌ ఆఫ్‌ మెకడోనియా, సెర్బియా ఇంకా ఉక్రెయిన్‌ తదితర సాంప్రదాయ చర్చిల్లో ఇప్పటికీ జూలియన్‌ క్యాలెండర్‌ను అనుసరించి కొత్త సంవత్సరాన్ని జరుపుతున్నారు.
చైనా దేశస్తుల కొత్త సంవత్సరాన్ని లూనార్‌ న్యూ ఇయర్‌ అంటారు. లూనార్‌ అంటే చాంద్రమానం. చైనీయులకి మొదటి చాంద్రమాన మాసంలో అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి కొత్త సంవత్సరం అన్నమాట. ఇది ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ ప్రకారం జనవరి 21 - ఫిబ్రవరి 21 తేదీల మధ్యలో వస్తుంది.
వియత్నాం కొత్త సంవత్సరం, చైనీయులు జరుపుకునే రోజునే జరుపుకుంటారు. వీళ్ళు కొత్త సంవత్సరాన్ని ''టెట్‌ న్గూయెన్‌ డాన్‌'' అంటారు.
టిబెట్‌ దేశస్తులు న్యూ ఇయర్‌ను లోసార్‌'' అంటారు. ఇది జనవరి, మార్చి మధ్యలో వస్తుంది.
భారత్‌లో అనేక ప్రాంతాల, వర్గాలవారు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమిని కొత్త సంవత్సరంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు.
పంజాబీలే లేదా సిక్కులు తమ నానక్‌ షాహీ క్యాలెండర్‌ను అనుసరించి ఏప్రిల్‌ 14వ తేదీని కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు.
ఇరాన్‌ దేశస్తులు కొత్త సంవత్సరాన్ని ''నా-రజ్‌'' అంటారు. ఇది మార్చి 20 లేదా 21వ తేదీన వస్మ్‌తుంది. ఈ ఇరానియన్‌ క్యాలెండర్‌ ఆసియా మధ్య ప్రాంతాలకు కూడా పాకింది. అదితే ఈ దేశాలవాళ్ళు మార్చి 22వ తేదీని నా-రజ్‌గా జరుపుకుంటారు.
కాశ్మీరీ క్యాలెండర్‌ను అనుసరించి నవ్‌రేహ్‌ను కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ఇది మార్చి నెలలో వస్తుంది.
మహారాష్ట్ర ప్రాంతీయులు హిందూ క్యాలెండర్‌ ప్రకారం ''గుడి పాడ్వా''ను నూతన సంవత్సరంగా వేడుక చేస్తారు. ఇది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వస్తుంది.
కన్నడీగులు కూడా హిందూ క్యాలెండర్‌ను అనుసరించే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు.
సింధీవారు కొత్త సంవత్సరాన్ని ''చేటీ చాంద్‌'' అంటారు. ఇది సరిగ్గా మన సంవత్సరాది లేదా మహరాష్ట్రీయుల గుడిపాడ్వాయే.
నేపాలీలు బైశాఖ (వైశాఖ) మాస తొలిరోజును కొత్త సంవత్సరంగా వేడుక చేస్తారు. ఇది ఏప్రిల్‌ 12, 15 తేదీల్లో వస్తుంది.
అస్సామీలు న్యూ ఇయర్‌ను రంగోలీ బిహు అంటారు. ఇది ఏప్రిల్‌ 14 లేదా 15వ తేదీన వస్తుంది.
బెంగాలీలు నూతన సంవత్సరాన్ని ''పోహెలా బైశాఖ్‌'' లేదా బాంగ్ళా ''నొబొబొర్షొ'' అంటారు. ఇది ఏప్రిల్‌ 14 లేదా 15వ తేదీన వస్తుంది. పశ్చిమ బెంగాల్లోనూ, బంగ్ళాదేశ్‌లోనూ ఈ వేడుక జరుపుతారు.
ఒరియావారు న్యూ ఇయర్‌ను విశువ సంక్రాంతి అంటారు. ఇది ఏప్రిల్‌ 14వ తేదీన వస్తుంది.
దేశ, విదేశాల్లో ఎన్నెన్ని రోజుల్లో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదూ?! తమ తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలను బట్టి ఎవరెలా జరుపుకున్నా మొత్తానికి మాటలకందని ఆనందమే పర్యవసానం. కొత్త బట్టలు, రకరకాల పిండివంటలు, బంధుమిత్రులతో కాలక్షేపాలతో ఆరోజు ఎలా గడుస్తుందో తెలీదు. ముఖ్యంగా న్యూ ఇయర్‌కు వేలాది రకాలు గ్రీటింగ్‌ కార్డులు అచ్చవుతుంటాయి. మనసుకు నచ్చిన ఆత్మీయులకు చక్కటి కార్డును ఎంపిక చేయడం కూడా ఓ గొప్ప కళే. దాన్ని చూసినవారు పరవశంతో తబ్బిబ్బయిపోతారు. తమ మనసులో ఉన్న ప్రేమను పోయెటిగ్గా చెప్పడమే కాకుండా ఏడాది పొడుగునా సుఖంగా, సంతోషంగా వుండమని చాటిచెప్పే గ్రీటింగ్‌ కార్డులు ఇప్పుడు వందల ఖరీదుతో అందుకోండి చూద్దామంటున్నాయి.
నచ్చినవారికి గ్రీటింగ్‌ కార్డును సెలక్ట్‌ చేసేంత ఓపిక లేనివారు ఫ్లవర్‌ బొకేను ఇవ్వడం మరో సంప్రదాయం. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ధర పెట్టిన కొద్దీ బ్రహ్మాండమైన పూలగుచ్ఛాలు మార్కెట్లో దొరుకుతాయి. దుస్తులో, వస్తువులో అయితే అవతలివారికి నచ్చకపోయే ప్రమాదం వుంది. కానీ, పుష్పగుచ్ఛాలను ఇష్టపడనివారుంటారా? నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి గ్రీటింగ్‌ కార్డులు లేదా ఫ్లవర్‌ బొకేలను మించినవి లేవు.
అదీ సంగతి! న్యూ ఇయర్‌ను ఎవరెలా జరుపుకుంటేనేం, ఎవరు ఎవరికి ఎలా అభినందనలు తెలియజేస్తేనేం, మొత్తానికి ఈ సంవత్సురం దిగ్విజయంగా సాగాలని, వచ్చే ఏడాదికి మరింత అభివృద్ధిని మన ఖాతాలో జమచేసుకుని, విజయకేతనం ఎగురవేయాలని కోరుకుంటూ... విష్యూ హ్యాపీ న్యూ ఇయర్‌!!!

వివాదాస్పదమైన పోలవరం టెండర్లు

ఇందిరా సాగర్‌ పోలవరం ప్రాజెక్టు 2011లో ఇయర్‌ ఆఫ్‌ ది డిస్ప్యూట్‌గా మారింది. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో తీవ్రంగా జాప్యం చేస్తూ విఫలమయ్యిందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ సమస్య ప్రత్యేక అడ్డంకుగా మారినట్టుగా కూడా పులువురు పేర్కొంటున్నారు. 2011 అక్టోబర్‌ నెలలో పోలవరం టెండర్లపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పటికి ఆ తర్వాత కాంట్రాక్టు కంపెనీల మధ్య పెద్ద వివాదం చెల రేగింది. సాగు నీటి శాఖలో ఈ వివాదం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ అంశంపై ప్రత్యర్థి కంపెనీలు ఏకంగా కోర్టుకు ఎక్కి టెండరు దక్కించుకున్న ఎల్‌1 ష్యూ- పటేల్‌ కంపెనీలకు అర్హత లేదని వాదించింది. సోమ కంపెనీ కోర్టులో లేవనెత్తిన అభ్యంతరాలపై కోర్టు సానుకూలతను వ్యక్తం చేస్తూ, టెండర్‌ కేటాయింపులను పున:పరిశీలించాలని, ఇందుకు ఒక ఉన్నతస్థాయి కమిటిని ఏర్పరచాలని ఆదేశించింది. టెండర్లపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటి టెండర్లపై నిర్ణయం తీసుకోవడంలో ఎటూ తేల్చుకోలేకపోతుండటంతో ఆ సమస్య ఎడతెరిపి లేకుండా వాయిదా పడుతోంది. అంతకుముందు ఈ ప్రాజెక్టు విషయంలో అనుమతులు రాలేదన్న కారణంగా వివాదాలు తలెత్తగా ఇప్పుడు టెండర్ల విషయంలోనూ ఆ ప్రాజెక్టును వివాదాలు సులువుగా వదిలేట్టు లేవని పలువురు పేర్కొంటున్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో చెలరేగిన వివాద ప్రభావం మిడ్‌ మానేరుపై పడింది. ఆ ప్రాజెక్టు కోసం పిలిచిన టెండర్లను కూడా వివాదాలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో రద్దు చేశారు. పోలవరం ప్రాజెక్టు కోస్తాంధ్రకు చెందగా, మిడ్‌ మానేరు ప్రాజెక్టు మాత్రము తెలంగాణ ప్రాంతానికి చెందినది. టెండర్లలో నిర్ణయాన్ని తీసుకోవడంలో ఉన్నతాధికారులు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణంపై రాజకీయ నిర్ణయాలు జరగడంతో అధికారులు అందులో పావులుగా మారేందుకు జంకుతున్నారు. సిబిఐ, లోకాయుక్త లాంటి సంస్థలు చురుకుగా వ్యవహరిస్తుండటంతో ప్రాజెక్టుల వివాదాలలో అధికారులు బలికావడానికి సిద్ధంగా లేనట్టు వారు స్వయంగా పేర్కొంటున్నారు.
ఇదిలావుండగా, తెలంగాణ ప్రాంతంలో భారీ ప్రాజెక్టు అయిన ప్రాణహిత -చేవెళ్ళ ప్రాజెక్టు వ్యవహారం ఒక్క ఇంచు కూడా ముందుకు సాగలేదు. ప్రాజెక్టు సర్వే, డిజైన్‌ల కోసం సుమారు 1100 కోట్లు ఖర్చు చేశారు. ఇంతకు మించి ఆ ప్రాజెక్టు వ్యవహారం ముందుకు కదలడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ప్రాణహిత- చేవెళ్ళతో పాటు పోలవరం ప్రాజెక్టులకు రెండింటికి జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ విషయంలోనూ ఎలాంటి ప్రగతి కన్పించడం లేదు. ప్రాణహిత- చేవెళ్ళ అతి పెద్ద ప్రాజెక్టుగా పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జరిగే రిజర్వాయర్‌ నిర్మాణం వలన మహారాష్ట్రలో నీటి ముంపు ఉండటం వలన కూడా ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు తీవ్ర అడ్డంకిగా మారినట్టు పలువురు పేర్కొంటున్నారు.
ఎఐబిపి ద్వారా 4,500 కోట్లు
ఎఐబిపి కేంద్ర ప్రభుత్వ పథకం. దీని ద్వారా వ్యవసాయ రంగంలో సత్వర సాగునీటి లబ్ధిని చేకూర్చేందుకు ఉద్దేశించి ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. 2011 సంవత్సరంలో ఏప్రిల్‌ నుండి అక్టోబర్‌ వరకు ఈ పథకం కింద 4,500 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. స్వర్ణముఖి ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్‌ను కూడా నిర్మించేందుకు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం 23 లక్షలు మాత్రమే 2010-11కు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసింది. వెల్లిగళ్ళు రిజర్వాయర్‌కు రెండేళ్ళలో సుమారు 8 కోట్లు కేటాయించారు. పాలెం వాగుకు 2010-12 మధ్య కాలంలో 38 కోట్లు కేటాయించారు. సుద్దవాగు ప్రాజెక్టుకు 2 కోట్లు కేటాయించారు. గొల్లవాగు 9 కోట్లు, కొమురం భీం ప్రాజెక్టుకు రెండేళ్ళలో 74 కోట్లు కేటాయించారు. నీల్‌వాయి ప్రాజెక్టు 12 కోట్లు కేటాయించారు. మోడికుంట వాగు ప్రాజెక్టుకు ఇందులో ఒక కోటి రూపాయలు కేటాయించారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం మొత్తంగా రెండేళ్ళలో 840 కోట్లు కేటాయించారు. ఇందులో గోదావరి బ్యారేజి, ప్రకాశం బ్యారేజి, ఏలేరు రిజర్వాయర్‌, తారకరామా కృష్ణవేణి ఎత్తిపోతల పథకం, సింగూరు ప్రాజెక్టు, డాక్టర్‌ కెఎల్‌ రావు పులిచింతల ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్‌, మూసి ప్రాజెక్టు, నారాయణపురం ఆణికట్‌ లాంటి ప్రాజెక్టులన్ని ఇందులో ఉన్నాయి. అతి తక్కువ నిధులు కేటాయించడం వలన ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగడం లేదు. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు ప్రాజెక్టులకు అనుమతుల సమస్యలు వేధిస్తున్నాయి. మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణాలలో 68 ప్రాజెక్టులను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. వీటి నిర్మాణాలకు 329 కోట్లను కేటాయించారు. నిధులు అరకొరగా ఉండటంతో ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రగతి మందగించినట్టు విమర్శలున్నాయి.

నత్తనడకన 'స్థానిక' సంస్థలు

రాష్ట్రంలో స్థానిక పరిపాలన నత్తనడకన సాగుతోంది. స్థానిక సంస్ధల పాలకమండళ్ళ గడవు ముగిసినప్పటికీ ఎన్నికలను నిర్వహించలేని పరిస్థితి ప్రభుత్వానిది. దీంతో ఏడాది కాలంగా ప్రత్యేకాధికారులతో స్థానిక పాలన బండిని లాగిస్తున్నారు. ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థలు, పంచాయితీరాజ్‌ సంస్థలన్నీ ఖాళీగా ఉన్నాయి. 2010లో పట్టణ స్థానిక సంస్థల పాలకమండళ్ళు, 2011లో 22 జిల్లా పరిషత్‌, 1097 మండల పరిషత్‌లు, 21,807 గ్రామ పంచాయితీల పాలకమండళ్ళ గడవు ముగిసింది. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్ధల పాలకమండళ్ళ గడవు ముగిసేలోగా ఎన్నికలు జరపాలి. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయితీరాజ్‌ సంస్థలలో 60.5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే ఈ రిజర్వేషన్ల 50 శాతం దాటరాదన్న సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఎన్నికలు నిలిచిపోయాయి. మరోపక్క పంచాయితీరాజ్‌ వ్యవస్థను మూడంచెలగా మారుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రత్యేకాధికారుల పాలనను పక్కనపెట్టి వచ్చే 2012 మార్చి నాటికల్లా ఎన్నికలు నిర్వహిస్తామని పురపాలక శాఖ మంత్రి ఎం.మహీధరరెడ్డి కూడా ప్రకటించారు. కానీ మార్చి నెలలోగా ఎన్నికలను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రిజర్వేషన్ల సమస్యలు తేలకుండా ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలావుండగా మహిళలను ఆకట్టుకునేందుకు స్థానిక సంస్థలలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలుజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో అదనంగా 8 పంచాయితీలను పురపాలక సంస్ధలుగా మార్చేందుకు వచ్చిన ప్రతిపాదనలకు అనుమతి లభించింది. అలాగే 21 నగర పంచాయితీలను నగరపంచాయితీలుగా నోటిఫై చేశారు. వాటిలో అనంతపురంలో 3, నల్గొండలో 1, పశ్చిమగోదావరిలో 1, మహబూబ్‌నగర్‌లో 3, వరంగల్‌లో 1, తూర్పుగోదావరిలో 3, విజయనగరంలో 1, కర్నూలులో 2, పొట్టి శ్రీరాములు నెల్లూరులో 1, కరీంనగర్‌లో 5 నగర పంచాయితీలు ఏర్పడ్డాయి. గ్రామ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన వెంటనే ప్రత్యేకాధికారుల పరిపాలన అమలులోకి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 21,807 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. వీటిలో రెండు, మూడు పంచాయితీలకు కలిపి దాదాపు ఏడువేల మందిని ప్రత్యేకాధికారులగా నియమించారు. పంచాయితీరాజ్‌ వ్యవస్థను మూడంచెలకు కుదిస్తూ.. ఎంపిటీసి, జెడ్పీటిసీ వ్యస్థను మంగళం పాడుతామని ముఖ్యమంత్రి కిరణ్‌, కేంద్ర పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ కూడా విడివిడిగా ప్రకటించారు. దీనిపై అనుమతులు లభించాక, చట్టాలు సవరించడం లేదా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఒడిదుడుకులతో గట్టెక్కిన 'ఐటి'

సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు... నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ (ఐటి) చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం, ఎగుమతుల విలువ రూ. 36 వేల కోట్లకు చేరుకోవడం ఈ ఏడాది చెప్పుకోదగ్గ విశేషాలు. రాష్ట్రంలో వేగంగా విస్తరించిన ఐటి పరిశ్రమ ద్వారా 2 లక్షల మందికి నేరుగా, దాదాపు 12 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే స్థాయికి ఈ ఏడాది ఐటి పరిశ్రమ చేరుకుంది. అలాగే, హైదరాబాద్‌తో పాటు విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి, కాకినాడ, వరంగల్‌ నగరాలలోనూ కొత్తగా ఐటి కారిడార్‌లు విస్తరించాయి. కాగా, ఇదే సమయంలో ఉద్యోగాలు ఇస్తామంటూ కొన్ని ఐటి కంపెనీలు నిరుద్యోగులను ఆకర్శించి శిక్షణ ఇస్తామని ఆశ చూపి డిపాజిట్ల పేరుతో డబ్బులు వసూలు చేసి అడ్రస్‌ లేకుండా పోయిన సంఘటనలు సైతం ఈ ఏడాది చోటు చేసుకున్నాయి. ఈ దృష్ట్యా ఐటి కంపెనీల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముగ్గురు ప్రభుత్వ కార్యదర్శులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
రైతులకు ప్రతి నిత్యం అవసరమయ్యే సర్టిఫికెట్ల జారీలో జాప్యాన్ని నివారించేందుకు ఐటి శాఖ ఈ ఏడాది మీ సేవ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్‌ సంతకాలతో ముందుగానే ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో సర్టిఫికెట్ల జారీని ప్రయోగాత్మకంగా చిత్తూరు, కృష్ణా జిల్లాలలో ప్రారంభించారు. 2012 మార్చి నాటికి ఈ సేవలను రాష్ట్రమంతటా విస్తరింపజేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. 2014లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అంతర్జాతీయ సాఫ్ట్‌వెర్‌ ఇంజనీరింగ్‌ సదస్సును నిర్వహించేందుకు ఈ మేరకు సదస్సు స్టీరింగ్‌ కమిటీ ప్రతినిధులు మంత్రి పొన్నాల ఎదుట ప్రకటించారు. ఇక ఇంజనీరింగ్‌ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను సాంకేతికంగా మరింత ప్రతిభావంతంగా తీర్చిదిద్దేందుకు అమెరికాకు చెందిన ఆటో డెస్క్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థ ముందుకొచ్చింది. 2015 నాటికి రూ. 70 వేల కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని ఐటి శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించేందుకు వీలుగా రూపొందించిన చిప్‌తో హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక ఈ ఏడాది రాష్ట్ర ఐటి శాఖ సాధించిన విజయాలలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాన్ని విస్తృత పరిచే కార్యక్రమంలో భాగంగా రూ. 2380 కోట్లతో ప్రతిపాదించిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌ మెంట్‌ రీజియన్‌ (ఐటిఐఆర్‌)కు కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదం లభించడం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాన్ని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా, నగరంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించేలా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఇటీవల వరుసగా రాష్ట్రంలో ఐటి కంపెనీలు మూత పడుతూ అభ్యర్థులను ఆర్థికంగా, మానసికంగా నష్టానికి గురి చేస్తున్నందున వీటిని అరికట్టేందుకు ఐటి శాఖ, పరిశ్రమల శాఖ, న్యాయ శాఖ కార్యదర్శులతో పాటు ఇట్స్‌ ఎపి ప్రతినిధులను సభ్యులుగా చేస్తూ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటుతో ఐటి కంపెనీల అక్రమాలను నియంత్రించేందుకు, నిరుద్యోగ యువతను మోసం చేసిన సందర్భంలో చర్యలు తీసుకునేందుకు వీలు కలిగింది. జాతీయ ఐటి ఎగుమతులలో రాష్ట్రం వాటా 15 శాతం ఉండగా, అలాగే ఉపాధి అందించే విషయంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం వాటా 12 శాతానికి చేరుకుంది. సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువుగా తీసుకునే లక్ష్యంతో పారదర్శకత, త్వరితగతిన పనులు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ-డిస్ట్రిక్ట్‌ పనులకు నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దేశవ్యాప్తంగా 640 జిల్లాలలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు రూ. 1663 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మన రాష్ట్రానికి రూ. 88 కోట్లు అవసరం కాగా, 25 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందించిన ప్రోత్సాహం, మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీసుకున్న చొరవతో ఈ ఏడాది బహుళ జాతి కంపెనీలు తమ కార్యాలయాలను ప్రారంభించడం ఈ ఏడాది చెప్పుకోదగ్గ అంశం.

.ప్రమాదపుటంచున పథకాలు... 2011లో ఎత్తిపోతల పథకాలు

ఎగువ ప్రాంతాల మెట్టభూములను సస్యశ్యామలం చేయాలన్న దృఢసంకల్పంతో దాదాపు మూడు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో ప్రారంభించబడిన ఎత్తిపోతల పథకాలు నేడు ప్రమాదపుటంచుకు చేరుకున్నాయి. ప్రతిఏటా పెరుగుతున్న వ్యయం, మోయలేని నిర్వహణ భారం, పెట్టుబడికి తగిన విధంగా దక్కని ప్రతిఫలం లాంటి అనేక కారణాలు ఈ పథకాల మనుగడకు ప్రశ్నార్థకమవుతున్నాయి. పదేళ్ళ క్రితం అమర్చిన మోటార్లు సామర్థ్యం తగ్గిపోవడం, విద్యుచ్ఛక్తి ఎక్కువగా అవసరమవుతుండడం, ప్రతిఏటా రెండు మూడుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల భారీ వ్యయం ప్రభుత్వ ఖజానాకు గండికొడుతోంది. సాగునీటి పారుదల శాఖ ఇంజినీరింగ్‌ అధికారుల అంచనాల ప్రకారం గత ఏడాది నాటికే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్వహణకు ఏటా10 వేల కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేయాల్సివస్తోంది. ఈ నిధులను మళ్ళించి మరో అభివృద్ధి పథకానికి వెచ్చిస్తే రాష్ట్ర రైతాంగానికి ఇంతకన్నా రెట్టింపు ప్రతిఫలం అందించవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవ పరిస్థితులు కూడా ఈ వాదనకే బలం చేకూరుస్తున్నాయి. చెప్పుకోదగిన జలవనరులు లేని కారణంగానే వెనుకబడిన తెలంగాణ ప్రాంతానికి భవిష్యత్తులోనూ వెనుకబాటు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంత ఆయకట్టుకు ఎత్తిపోతల పథకాలే ప్రధానం. అయితే వీటి ద్వారా రైతాంగానికి అందే ప్రయోజనం కన్నా వెచ్చిస్తున్న ఖర్చే అధికమవుతోందన్న వాదన నానాటికీ బలపడుతోంది. ప్రభుత్వంపై ప్రతిఏటా ఎత్తిపోతల పథకాల నిర్వహణ భారం పెరిగిపోతోంది. నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఎక్కువభాగం ఈ పథకాల నిర్వహణకే ఖర్చవుతోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ నీటి ప్రాజెక్టులు అధికంగా ఉన్నాయి. వీటి నిర్వహణ ఖర్చు పెద్దగా ఉండదు. ప్రభుత్వ అంచనా ప్రకారం కేవలం ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ప్రతిఏటా సుమారు పది వేల కోట్ల రూపాయాలు వెచ్చించాల్సి వస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన ఎత్తిపోతల పథకాలు 22 కాగా, కొత్తగా ప్రతిపాదించినవి కలుపుకొని మొత్తం 26 పథకాలు నెలకొల్పబడుతున్నాయి. వీటిలో దాదాపు 16 పథకాలు ఒక్క తెలంగాణా ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి మోయలేని భారంగా మారిన ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చు సమీప భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారనుంది. గత ఏడాది తీవ్ర ప్రభావం చూపిన ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో నానాటికీ పెరుగుతున్న ఖర్చు ఆందోళన కలిగిస్తోంది. కెపాసిటీ తగ్గుతున్న విద్యుత్‌ మోటార్లకు మరమ్మతు చేయడం, నీటిని తోడి పంట పొలాలకు అందించడం, ఇతర కార్యక్రమాలకు ప్రస్తుత అంచనాల ప్రకారం అవసరమయ్యే నిధులు దాదాపుగా 5 వేల కోట్ల రూపాయలు. జలాశయం నుంచి సుమారు 500 మీటర్ల ఎత్తున ఎగువ ప్రాంతాలకు నీటిని తరలించేందుకు లిఫ్టులకు అమర్చిన భారీ కెపాసిటీ గల మోటార్లకు అవసరమయ్యే విద్యుత్‌ ఖర్చు మరో 5 వేల కోట్ల రూపాయలు. మొత్తం కలుపుకుని ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతిఏటా దాదాపు 10 వేల కోట్లకు పైగానే నిధులు ఖాళీ అవుతున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా అవసరమవుతున్న మానవవనరులు, కార్యాలయాల నిర్వహణ, ప్రయాణపు ఖర్చులు కలుపుకుని మరో రెండున్నర వేల కోట్ల రూపాయలు వెచ్చించక తప్పడంలేదు. ఇంత పెద్ద మొత్తంలోప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పటికీ, అందుకు తగిన ప్రతిఫలం మాత్రం అన్నదాతకు దక్కడంలేదు. భవిష్యత్తులో అధికారంలోకి రానున్న ప్రభుత్వాలకు సైతం ఈ వ్యయం గుదిబండగా మారనుంది. అధికారుల అంచనా ప్రకారం ఒక్కో ఎత్తిపోతల పథకం కింద 5 నుంచి 10 వేల ఎకరాలకుపైగా పంటలు సాగైతే, అప్పుడప్పుడు తలెత్తే సాంకేతిక లోపాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ నష్టం అన్నదాతలకు ప్రాణసంకటంగా కూడా మారుతున్నది. ఈ లిఫ్లుల నిర్వహణలో అధికభాగం మెకానికల్‌ వ్యవస్థే ఉంటుంది. ఏటేటా కెపాసిటీ తగ్గుతున్నందున ఖరీదైన మోటార్లు కాలిపోతే గనుక వేలాది ఎకారాల్లో పంటలు ఎండిపోకతప్పదు. దీంతో రైతుల్లో ఆందోళన, ప్రభుత్వంపై ఒత్తిడి తదితర సమస్యలు ఉత్పన్నమవుతుండడం సర్వసాధారణమే. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని గతంలో ఎత్తిపోతల పద్ధతిని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల్లో తాగునీటి వనరులు సమకూర్చేందుకు మాత్రమే ఏర్పాటు చేసేవారు. ఒకేసారి పెట్టుబడితో తరతరాలుగా ప్రయోజనం చేకూర్చే భారీ నీటి ప్రాజెక్టులు తెలంగాణలో లేకపోవడం దురదృష్టకరమే. అయినప్పటికీ ఈ ప్రాంతంలో సాహసంతో నెలకొల్పుతున్న ఎత్తిపోతల పథకాలు మాత్రం భావితరాలకు ముప్పును సూచిస్తున్నాయి. హరితాంధ్ర సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అమలు చేస్తున్న జలయజ్ఞం కార్యక్రమంలో తలపెట్టిన ఎత్తిపోతల పథకాలు ఖజానాకు భారంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఆయకట్టు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచి వ్యవసాయ రంగానికి బంగారుబాట వేయాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి లక్ష్యం, ఆలోచనా విధానం సరైనదే అయినప్పటికీ గత పరిణామాల దృష్ట్యా ఈ పథకాలకు భవిష్యత్తు కనిపించడం లేదు. అనంతరం అధికార బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వాలు ఈ రంగానికి ఇదివరకిచ్చిన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాయి. గడిచిన రెండు దశాబ్దాల కాలంగా చూస్తే ఇప్పటివరకు అనేక ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయి. నీటి పారుదల శాఖ ఇంజనీర్ల అంచనా ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న పథకాల ఆయకట్టు విస్తీర్ణానికి ఎకరం ఒక్కింటికి సరాసరిగా 12 వేల నుంచి 15 వేల రూపాయల నిర్వహణ ఖర్చు అవసరమవుతున్నది. ఈ పెట్టుబడుల మేరకు రైతాంగానికి ఫలితం దక్కడంలేదు. గత ఐదేళ్ళ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో కొనసాగుతున్న 60 సాగునీటి పారుదల ప్రాజెక్టుల్లో 22 ఎత్తిపోతల పథకాలే ఉన్నాయి. ఈ పథకాల కింద ఆయకట్టు విస్తీర్ణం 40,83,535 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. నీటి వనరులు అంతగాలేని తెలంగాణ ప్రాంతంలో 14 ఎత్తిపోతల పథకాల క్రింద 26,80,535 ఎకరాల ఆయకట్టు, రాయలసీమలో 5 పథకాల కింద 9,75,000 ఎకరాలు, ఆంధ్రా ప్రాంతంలో 3 పథకాల కింద 4,28,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. కనిష్టంగా ఎకరాకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తం 12,000 రూపాయలుగా లెక్కకడితే ప్రతిఏటా 4,900 కోట్ల 24 లక్షల 20 వేల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీ మేరకు తమ పార్టీ ప్రతిష్ట కోసమైనా ఖర్చు చేయక తప్పదు. కానీ ఒకవేళ ప్రభుత్వం మారితే గనుక ఇంతటి భారాన్ని మోయలేని పరిస్థితుల్లో పథకాలన్నీ మూసివేసే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే కనుక తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 86 మధ్యతరహా చిన్ననీటి వనరుల్లో దాదాపు అన్ని ఎత్తిపోతల పథకాలే ఉన్నాయి. అందులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న సుమారు 33 పథకాల్లో సగానికిపైగా నిర్వహణ లోపంతోనే మూతపడ్డాయి. తద్వారా తొమ్మిది జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాల్లో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోక తప్పలేదు. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున ప్రజాధనం కూడా వృధా అయ్యింది. అంతకు ముందే మూతపడిన చిన్నాచితకా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు అనేకంగా ఉన్నాయి. జలయజ్ఞంలో లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టు విస్తీర్ణం సగానికిపైగా ఎత్తిపోతల పథకాల కిందే ఉన్నది. సాగు విస్తీర్ణాన్ని కోటి ఎకరాలకు పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సమీప భవిష్యత్తులో ప్రశ్నార్థకమయ్యే సూచనలున్నాయి.
తెలంగాణ ప్రాంతంలోని 26 ప్రాజెక్టుల్లో 14 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలు ఉన్నాయి. అందులో చొక్కారావు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు మొదటి దశలో వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో 1,23,000 ఎకరాల ఆయకట్టు, రెండవ దశలో 5,25,100 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదే విధంగా నిజామాబాద్‌ జిల్లాలో అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం కింద 53,973 ఎకరాలు, గుత్పా ఎత్తిపోతల పథకం కింద 38,729 ఎకరాలు, నల్గొండ జిల్లాలో శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌పై నిర్మించిన ఎనిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం కింద 2,70,000 ఎకరాల విస్తీర్ణం ఉన్నది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాజీవ్‌(బీమా) ఎత్తిపోతల పథకం కింద 2,03,000 ఎకరాలు, మహాత్మాగాంధీ (కల్వకుర్తి) ఎత్తిపోతల పథకం కింద 3,40,000 ఎకరాలు, జవహర్‌ (నెట్టెంపాడు) ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల ఎకరాలు, కరీంనగర్‌ జిల్లాలో శ్రీపాదరావు ఎత్తిపోతల పథకం కింద 4,63,600 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం మొదటి దశలో 2 లక్షల ఎకరాలు, ఇదే పథకం రెండవ దశలో మరో రెండు లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం సాగులోకి వచ్చింది. ఆదిలాబాద్‌ జిల్లా పెద్దవాగుపై నిర్మించిన జగన్నాథపురం ఎత్తిపోతల పథకం కింద 15,000 ఎకరాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కోయిలసాగర్‌ ఎత్తిపోతల పథకం కింద 38,250 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కింద 10 వేల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం సాగులో ఉన్నది.
రాయలసీమ ప్రాంతంలోని 11 సాగునీటి పారుదల ప్రాజెక్టుల్లో మూడు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అందులో కర్నూలు జిల్లా గురు రాఘవేంద్ర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ కింద 50,000 ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు సాగవుతున్నది. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల రైతాంగానికి సంబంధించి నిర్మించిన గాలేరు-నగరి సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం కింద 2,60,000 ఎకరాలు, అనంతపురం జిల్లాలో పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ స్టేజ్‌-2 పథకం కింది 50,000 ఎకరాలు, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం కింద 6,50,000 ఎకరాలు, కడప జిల్లా గండికోట ఎత్తిపోతల పథకం కింద 10 వేల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం సాగులో ఉన్నది. ఈ ప్రాంతంలో మొత్తం 11 ప్రాజెక్టుల కింద 16,54,000 హెక్టార్ల విస్తీర్ణం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఆంధ్రా ప్రాంతంలోని 23 నీటి పారుదల ప్రాజెక్టుల కింద మొత్తం 39,55,719 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం కాగా అందులో 4,28,000 హెక్టార్లు ఎత్తిపోతల పథకాల కింద సాగవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని పుష్కర ఎత్తిపోతల కింద 1,86,000 ఎకరాలు, వెంకటనగరం ఎత్తిపోతల పథకం కింద 36,000 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద 2,06,000 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం సాగవుతోంది.
ఇప్పటికే పూర్తయిన మధ్య తరహా చిన్ననీటి పారుదల ప్రాజెక్టుల్లో ఆంధ్రా రీజియన్‌లో ఉన్న 32 పథకాల కీంద 4,68,816 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం సాగవుతోంది. రాయలసీమ రీజియన్‌లోని నాలుగు జిల్లాల్లో ఉన్న 53 పథకాల కింద 1,75,184 ఎకరాలు, తెలంగాణా రీజియన్‌లోని తొమ్మిది జిల్లాల్లో ఉన్న 86 చిన్ననీటి ప్రాజెక్టుల కింద 4,68,816 ఎకరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మధ్య తరహా చిన్ననీటి ప్రాజెక్టుల ఆయకట్టు 1,01,60,188 ఎకరాల విస్తీర్ణం సాగవుతున్నట్లు నీటి పారుదల శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఈ ప్రాజెక్టుల్లో అధికంగా ఉన్న ఎత్తిపోతల పథకాలు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వ్యవసాయరంగ నిపుణులు భావిస్తున్నారు. ఎకరా ఒక్కంటికి ప్రతీ సంవత్సరం 15 వేల రూపాయలు పెట్టుబడి అవసరమయ్యే ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులు పొందుతున్న ప్రయోజనం చాలా తక్కువగా ఉండడంతో సమీప భవిష్యత్తులో వీటిని ఎత్తివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

'ప్రత్యేక' పర్యవేక్షణలో పడకేసిన పాలన 2011లో పురపాలక పట్టణాభివృద్ధిశాఖ

పట్టణాలు, నగరాలలో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ఈ ఏడాది ఆదాయం కోసం పన్నుల విధింపునే మార్గంగా ఎంచుకుని వసూళ్ళే లక్ష్యంగా పనిచేసింది. ఈ ఏడాది ప్రారంభంలో పురపాలక పట్టణాభివృద్ధిశాఖ పన్ను వసూళ్ళు రూ.900 కోట్లు కాగా సంవత్సరాంతానికి ఈ మొత్తం రూ.1500 కోట్లకు చేరుకుంది. పన్నుల వసూళ్ళ కోసం ఏకంగా కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టింది. గతంలో తమ ప్రాంతం మున్సిపాలిటీగా ఏర్పాటవడాన్ని గొప్పగా చెప్పుకునే ప్రజలు పన్నుల భారాన్ని భరించలేక ఆ హోదా వద్దనే స్థితికి చేరుకున్నారు. 2010 సెప్టెంబర్‌లో 108 మున్సిపాటిటీలు, నగర పాలక సంస్థలలో ప్రారంభమైన ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా తయారవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్తిపన్నుతో పాటు చెత్త, మంచినీటిపై కూడా పన్ను విధించడంతో అన్ని ప్రాంతాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదమూడవ ఆర్థిక సంఘం విధించిన నిబంధనలను అనుసరించి ప్రజలపై భారాన్ని మోపుతున్నారు. ఆస్తిపన్నును పెంచకపోతే ప్రణాళిక సంఘం నిధులు విడుదల చేయదనే బూచిని చూపించి ఆస్తిపన్ను వసూళ్ళపై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేయడంతో ప్రజల జేబులకు చిల్లు పడనుంది. ఈ నిర్ణయం వలన కొన్ని మున్సిపాలిటీలలో 5నుంచి 300శాతం మేరకు ఆస్తిపన్ను పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలకు ఉచితంగా అందించాల్సిన సేవలన్నింటిపై పన్ను రూపంలో పడుతున్న భారాన్ని వసూలు చేసేందుకు ఆయా శాఖలను ఏకంగా ప్రైవేటు పరం చేశారు. చివరకు వీధి దీపాల నిర్వహణను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఈ ఏడాది మహానగరాలలో ఉచిత టాయ్‌లెట్‌లు కనుమరుగయ్యాయి. రాష్ట్రంలోని పలు పురపాలక సంఘాలకు ప్రభుత్వం నుంచి వివిధ పద్దుల కింద రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో ఆయా మున్సిపాలిటీలు ఆర్దికంగా దివాళా తీశాయి. రాజీవ్‌ యువ కిరణాల పేరిట జెఎన్‌యుఆర్‌ఎం ద్వారా 40 వేల ఉద్యోగాలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ వాటిని ఏ రూపంలో ఇవ్వాలో తెలియక పురపాలక అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ పథకం కింద కేంద్ర నిధులు రాబట్టుకునేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకే ఈ సంవత్సరమంతా అధికారులకు సరిపోయింది. పట్టణాలలో మురికి కాలువల శుభ్రం కోసం రూ.4500 కోట్ల ప్రతిపాదనలను కేంద్రం బుట్ట దాఖలు చేసింది. ఈ ఏడాది పట్టణ ప్రాంతాలలో 2 లక్షల ఇళ్ళను నిర్మించి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని నేరవేర్చడంలో చేతులెత్తేసి కేవలం 50వేల ఇళ్ళను మాత్రమే అందించింది. పట్టణాలు, నగరాలలో పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన మున్సిపల్‌ అధికారులు వాటి ద్వారా భారీ ఎత్తున అపరాధ రుసుంను వసూళ్ళు చేశారు. ఒక్క హైదరాబాద్‌ నగరంలోని మూడు సర్కిళ్ళ పరిధిలలోనే లక్షా 20 వేల అక్రమ నిర్మాణాలను అధికారులు కనుగొన్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, వరంగల్‌ తదితర నగరాలలో కూడా ఈ తరహ వసూళ్ళు మొదలయ్యాయి. వచ్చేసరికి సాంకేతిక కారణాలను చూపిస్తూ చేతులెత్తేశారు. ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ ప్రకటన ఎంతవరకూ అమలవుతుందో వేచి చూడాల్సిందే.

రోజుకు రూ.81.50 లక్షల నష్టం 2011 ..ఆర్టీసీ

ఆర్టీసీకి ఈ సంవత్సరం ఏ మాత్రం కలిసి రాలేదు. ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సంస్ధ పయనం సాగింది. కొత్త బస్సుల కొనుగోలు ప్రయాణికులు, సర్వీసుల క్రమబద్దీకరణతో కార్మికులకు కొంత వరకు ప్రయోజనం కలిగినప్పటికీ సంస్ధ మాత్రం ఆర్ధికంగా ముందడుగు వేయలేక పోయింది. ఆదాయం, వ్యయం పెరుగుదలతో పాటుగా అప్పులు కూడా పెరిగాయి. ఆర్టీసీ రోజుకు రూ. 81.50 లక్షల నష్టాలతో నడుస్తుంది. సంస్ధ నష్టాలు ఇప్పటికే రూ. 2,300 కోట్లు దాటాయి. ఈ సంవత్సరం రూ. 296.66 కోట్ల నష్టం వాటిల్లింది.
ఆర్టీసీ 22,289 బస్సులు కలిగి ఉంది. దాదాపు 1.22 లక్షల మంది ఉద్యోగులు సంస్ధలో పనిచేస్తున్నారు. రోజుకు 1.34 కోట్ల మందిని సురక్షితంగా తమ గమ్యం చేర్చడానికి ఆర్టీసీ బస్సులు ప్రతి నిత్యం 81.50 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఆర్టీసీని బలోపేతం చేయడానికి యాజమాన్యం నిరంతర కృషి కొనసాగిస్తునే ఉంది. ప్రయాణికులను ఆకట్టుకోవడానికి వినూత్న పథకాలను ప్రకటించింది. ముఖ్యంగా గ్రామీణ మహిళలను ఆకట్టుకునేందుకు వనితా కార్డును ప్రవేశ పెట్టింది. దూర ప్రాంతం ప్రయాణం చేసే మధ్య తరగతి వర్గాలకు ఇంద్ర బస్సులను ప్రారంభించింది. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని సరి కొత్త విధానాలను ప్రకటిస్తుంది. అయినప్పటికీ ప్రైవేటు పోటీని తట్టుకోలేక పోతుంది. ప్రయాణికులను ఆకర్శించడంలో ఆశించిన ప్రగతిని సాధించలేక పోయింది. ప్రైవేటు ఆపరేటర్ల పోటీ, ఉద్యమాలు ఆర్టీసీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొట్టాయి.
ప్రభుత్వానికి వివిధ రూపాల్లో చెల్లిస్తున్న పన్నులు కూడా ఆర్టీసీని కృంగదీస్తున్నాయి. దాదాపు 12 వేల మంది ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించడం ఆర్టీసీకి భరించలేని భారంగా తయారైంది. ఈ సంవత్సరం కొత్తగా 4 వేల బస్సులను ప్రవేశపెట్టడానికి సాహసోపేతంగా నిర్ణయం తీసుకుంది. అందులో ఇప్పటికే 2700 బస్సులు రోడ్లపైకి వచ్చాయి. ఇంధన పొదుపులో కూడా అవార్డులు పొందింది.
మోటారు వాహనాల పన్నులు, ముడిసరుకులపై వసూలు చేస్తున్న 14.5 శాతం విలువ ఆధారిత పన్ను, టోల్‌ టాక్స్‌, డీజిల్‌పై చెల్లిస్తున్న పన్నులు ఆర్టీసీకి పెనుభారంగా పరిణమించాయి. ఆర్టీసీ గత కొంత కాలంగా డీజిల్‌పై రాయితీ కోరుతుంది. వ్యాట్‌ తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. మోటారు వాహనాల పన్ను నుండి సంస్ధను మినహాయించాలని కోరింది. ఆర్టీసీని బలోపేతం చేయడానికి ఏటా రూ. 750 కోట్ల వరకు సహాయం అందించాలని బెంగుళూరు ఐఐటి నిర్వహించిన అధ్యయన నివేదిక సిఫారసు చేసింది. ఆర్టీసీని బలోపేతం చేయడంలో ప్రభుత్వం ఆశించిన మేరకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే బస్సుల కొనుగోలుకు రూ. 200 కోట్లు ఇస్తామని ప్రకటించి, రూ. 100 కోట్లకు మించి విడుదల చేయని పరిస్ధితి నెలకొంది. ఫలితంగా ఆర్టీసీ ఆర్ధిక పరిస్ధితి దిగజారింది. కోలుకోవడం కష్టమనే విధంగా అప్పులు రూ. 2,500 కోట్లకు చేరుకోబోతున్నాయి. అంతర్గత వనరుల వృద్ది కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా సానుకూల ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి.
ఆర్టీసీ 20 వేల గ్రామాల్లో తిప్పుతున్న 12 వేల పల్లె వెలుగు బస్సులు నష్టాలతోనే నడుస్తున్నాయి. సామాజిక బాధ్యతతో కొన్ని రూట్లలో నష్టాలు భరించి బస్సులు నడపాల్సి వస్తుంది. ఆర్టీసీ ఎంతగా ప్రయత్నించినా ఆక్యుపెన్సీ రేషియో 63 నుండి 69 మధ్యనే ఉంటుంది. 2008 -09 ఆర్ధిక సంవత్సరంలో ఆర్టీసీ రూ. 110 కోట్ల లాభాలను ఆర్జించింది. 2008 -10లో రూ. 514 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ. 300 కోట్ల నష్టాలు ప్రకటించారు. అప్పులు కూడా అదే స్ధాయిలో పేరుకు పోతున్నాయి. ప్రైవేటు పోటీని తట్టుకొని బస్సులను నడిపించడం తప్ప ఆర్టీసీకి మరో మార్గం కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ వనరుల పెంపుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రణాళికలు వేగవంతం చేయడం ఆర్ధిక పరిపుష్టికి మరో మార్గంగా పేర్కొంటున్నారు.

సంక్షేమం అంతంత మాత్రమే

రాష్ట్ర జనాభాలో గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించినప్పటికీ ఆర్ధికంగా, విద్యాపరంగా ఇతరేతర అవకాశాల పరంగా ఈ వర్గాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. 2011లో మన రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజన వర్గాల సంక్షేమానికై కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టినప్పుటికీ ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి..
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుచేసేందుకు మానిటరింగ్‌ అపెక్స్‌ కమిటీని పునర్‌ వ్యవస్థీకరించారు. అయితే సబ్‌ప్లాన్‌ నిధులను మొత్తం దారీ తప్పించి.. పార్కుల అభివృద్ధికి వాడుకున్నారని దళిత సంఘాలు నెత్తినోరు మొత్తుకున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. రూ.1600 కోట్లతో ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేసిన భూముల అభివృద్ధికై ''ఇందిరా జలప్రభ'' పథకం ప్రారంభించారు. లక్ష బోరుబావులతో 10 లక్షల ఎకరాల సాగునీరు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పథకం ఇంకా కొన్ని జిల్లాల్లో ప్రారం భానికే నోచుకోలేదు. ఎస్సీ, ఎస్టీ కాలనీలలో ఉపాధి హామీ పథకం కింద రూ.1000 కోట్లతో మౌలిక సదుపాయాలు పనులు చేపట్టారు. అయితే ఈ పనుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు తనికీల్లో తేలింది.
ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు వయో పరిమితిని 5 సంవత్సరాలు పొడిగించారు. అయితే వివిధ శాఖల్లో ఈ వర్గాల వారికి కేటాయించిన బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేస్తే సరైన అర్హత కలిగిన అభ్యర్ధులు లభించడం కష్టమవుతుంది. ఉర్దూ మీడియం టీచర్ల పోస్టుల కోసం డియస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తే సగం మంది కూడ దరఖాస్తు చేయలేదు. ఈ ఏడాది బకాయిలు లేకుండా 26 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గ విద్యార్ధులకు ఫీజురీఇంబర్స్‌మెంట్‌ చెల్లించినట్లు ప్రభుత్వం చెబుతుంది. కానీ ఈ వ్యవహారంపై నిత్యం దుమారం లేస్తుంది, విద్యార్ధులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. మోయలేని భారం వంకతో ప్రస్తుతం వార్షిక బడ్జెట్‌లో బోధనా ఫీజులను రూ.3500 నుండి రూ.2500కు కుదించారు. స్క్రూటినీలో 1.40 లక్షల దరఖాస్తులను తిరస్కరించగా, 2.60 లక్షల దరఖాస్తులను పలు కారణాలు రీత్యా పెండింగ్‌లో పెట్టారు. పిజి కోర్సులు చేస్తున్న వారిలో అర్హతలేని 1071 మంది దరఖాస్తులను తొలగించారు. పెరిగిన ఫీజుల చెల్లింపుల భారాన్ని తగ్గించుకునేందుకు కనీస వయస్సు, హాజరు శాతం, బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రం మొత్తం 5910 వసతిగృహాలు ఉన్నాయి, వీటన్నింటికీ ఆహారధాన్యాలను అందించే బాధ్యత పౌరసరఫరాల సంస్థకు ప్రభుత్వం అప్పగించింది.
ఉపాధిహామీ పథకం కింద బీడుభూములు అభివృద్ధి చేసి, రాబోయో మూడేళ్ళలో 49.55 లక్షల ఎకరాల భూములు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ. 12908.6 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అలాగే గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములపై వారికి హక్కులను కల్పించే చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 1.67 లక్షల గిరిజనులకు అటవీహక్కుల చట్టం కింద 14.45 లక్షల ఎకరాల అటవీభూమిపై హక్కుపత్రాలను ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో బిసిలు 38.6 శాతం మంది ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. బిసిలలో కొన్ని సంప్రదాయ వృత్తులలో ఉన్నవారి పరిస్థితి దయనీయంగా ఉంది. రాష్ట్రంలో బిసి ఫెడరేషన్లు నిధులు లేక మగ్గిపోతున్నాయి. బిసి సంఘాలు ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం బిసి కార్పోరేషన్‌కు రూ. 2.77 కోట్లు, వడ్డెర ఫెడరేషన్‌కు రూ.6.25 లక్షలు, ఉప్పర ఫెడరేషన్‌కు రూ. 7.50 లక్షలు, వాషర్‌మెన్‌ ఫెడరేషన్‌కు రూ. 1.25 లక్షల నిధులను విడుదల చేసింది. మరోపక్క బిసి విద్యార్ధుల కోసం రూ.600 కోట్లతో 1000 హాస్టళ్ళను నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే ఆ హాస్టళ్ళ భవనాలు కూడా నత్తనడకన నడుస్తున్నాయి.
రాష్ట్రంలో ఆర్ధికంగా, సామాజికంగా, విద్యాపరంగా బాగా వెనుకబడిన మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుతం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి ఆశించినంత మేరకు ఫలితాలు ఇవ్వడం లేదని వివిధ సర్వేలు వెల్లడించాయి. మైనారిటీలకు ప్రస్తుతం కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను మరో పది సంవత్సరాలు పొడిగించారు. ఈ ఏడాది ''దారుల్‌ మారిఫ్‌ -ఉల్‌ -ఉస్మానియా'' సంస్థకు రూ.57 లక్షలు అదనంగా కేటాయించారు. 2011 జూన్‌ నుంచి ప్రీ మెట్రిక్‌ మైనారిటీ వెల్ఫేర్‌ వసతి గృహాల్లో ఉంటే 3 నుండి 10వ తరగతి విద్యార్ధులకు డైట్‌ ఛార్జీలను పెంచారు. అయితే తమ శాఖకు చెందిన నిధులు సరిపోవడం లేదని అదనం మరో వంద కోట్ల రూపాయలు పైబడి ఇవ్వల్సిందిగా మైనారిటీ శాఖ మంత్రి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అరకొర నిధులు విదిలించి సరిపెట్టడం గమనార్హం.
వికలాంగుల సంక్షేమానికి ఎన్నిరకాల పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ వాటి ఫలాలు అర్హులైన వికలాంగులకు అందడం లేదు. వికలాగుంలకు ఉపాధి హామీ పథకం కింద 150 పని దినాలు కల్పించాలని నిర్దేశించినప్పటికీ రాష్టంలో ఎక్కడా ఆ నిబంధనలు అమలుకావడం లేదు. ఉపాధి హామీ పథకం ఖర్చులో భాగం కేవలం 1.29 కోట్లు మాత్రమే వికలాంగుల కోసం ఖర్చు పెట్టారు.

రోడ్డు ప్రమాదాలు”తగ్గుముఖం”

గడచిన రెండేళ్ళ కాలంలో రాష్ట్రం లో జరిగిన రోడ్డు ప్రమాదాల కంటే ప్రస్తుత సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది. అయితే పట్టణ ప్రాంతాలలో మాత్రం ప్రమాదాల సంఖ్య పెరిగింది. దీంతో పట్టణ ప్రాంతాలలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం దృష్టిని సారించింది. పోలీసు శాఖ తన పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 23 జిల్లాలను 30 జిల్లాలుగా విభజించింది. 30 జిల్లాలలో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్యను పరిశీలించగా ఆరు జిల్లాలలో వీటి సంఖ్య గడచిన రెండేళ్ళ కంటే ఈ ఏడాది పెరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస పెరగడం, కొత్త కాలనీలు వెలయడంతో పాటు వాహనాల సంఖ్య కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో పట్టణీకరణ అధికంగా ఉన్న ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని స్పష్టమవుతోంది.
రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్న సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 2009లో 3254 రోడ్డు ప్రమాద కేసులు నమోదవగా 3168 మంది క్షతగాత్రులై 1084 మంది మరణించారు. 2010లో 3333 రోడ్డు ప్రమాద కేసులు నమోదవగా 3299 మంది క్షతగాత్రులై 1088 మంది అవుసులు బాసారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకు 3426 రోడ్డు ప్రమాద కేసులు నమోదవగా 3321 మంది క్షతగాత్రులై 1121 మంది మరణించారు. సైబరాబాద్‌ పరిధిలో ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఈ ఏడాది 36 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య ఈ ఏడాది పెరగింది. 2009లో 1173 రోడ్డు ప్రమాదాలు జరుగగా 1756 మంది గాయపడి 445 మంది మరణించారు. 2010లో 1315 రోడ్డు ప్రమాదాలు జరుగగా 1976 మంది గాయపడి 511 మంది మరణించారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకు 1356 రోడ్డు ప్రమాదాలు జరుగగా 2099 మంది గాయపడి 514 మంది మరణించారు. నిజామాబాద్‌ జిల్లా గుండా హైదరాబాద్‌ -నాగ్‌పూర్‌ జాతీయ రహదారి వెళ్తుంది. ఈ ఏడాది ఈ రహదారిపై ప్రమాదాల సంఖ్య కూడా అత్యధికంగా ఉందని అధికారులు చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 2010 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగగా మెదక్‌ జిల్లాలో తగ్గాయి. అయితే ఈ ఏడాది ఈ జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగింది. జిల్లాలో 2009లో 1631 రోడ్డు ప్రమాదాలు జరుగగా 2613 మంది గాయాలపాలవగా 727 మంది మృత్యువాత పడ్డారు. 2010లో 1556 రోడ్డు ప్రమాదాలు జరుగగా 2215 మంది గాయాలపాలవగా 702 మంది మృత్యువాత పడ్డారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకు 1498 రోడ్డు ప్రమాదాలు జరుగగా 2094 మంది గాయాలపాలవగా 730 మంది మృత్యువాత పడ్డారు. ఈ జిల్లాలో దాదాపు 100 కిలోమీటర్ల వరకు నాగ్‌పూర్‌ -హైదరాబాద్‌ జాతీయ రహదారి విస్తరణ జరిగి వాహనాల వేగం అదుపు తప్పుతోంది. వరంగల్‌ అర్భన్‌ జిల్లాలో 2010లో 413 రోడ్డు ప్రమాదాలు జరుగగా 522 మంది గాయపడి 117 మంది మరణించారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకూ 786 రోడ్డు ప్రమాదాలు జరిగి 1024 మంది గాయపడి 215 మంది మరణించారు. వరంగల్‌ -హన్మకొండలలో కొత్త కాలనీలు వెలయడం, వాహనాల సంఖ్య పెరగడంతో ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తిరుపతి అర్భన్‌ జిల్లాలో 2010లో 423 రోడ్డు ప్రమాదాలు జరుగగా 531 మంది గాయపడగా 152 మంది మరణించారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకూ 633 రోడ్డు ప్రమాదాలు జరుగగా 899 మంది గాయపడగా 232 మంది మరణించారు. టెంపుల్‌ సిటీగా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతిలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సందర్శకుల సంఖ్య పెరగడంతో పాటు వాహనాల రద్దీ తీవ్రమవడంతో ప్రమాదాల సంఖ్య పెరిగిందని అధికారులు అంటున్నారు.
గుంటూరు అర్భన్‌ జిల్లాలో ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగింది. 2010లో 369 రోడ్డు ప్రమాదాలు జరుగగా 424 మంది గాయలపాలవగా 136 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకూ 1189 రోడ్డు ప్రమాదాలు జరుగగా 757 మంది గాయాలపాలవగా 233 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజమండ్రి అర్భన్‌ జిల్లాలో 2010లో 318 రోడ్డు ప్రమాదాలు జరుగగా 330 మంది గాయాలపాలవగా 80 మంది మరణించారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకూ 488 రోడ్డు ప్రమాదాలు జరుగగా 575 మంది గాయాలపాలై 139 మంది మరణించారు. డిసెంబర్‌ మాసాంతానికల్లా ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. సైబరాబాద్‌ పరిధిలో ఏయేటి కాయేడు కాలనీల సంఖ్య పెరగడం, తామరతంపరగా వాహనాలు రోడ్లపైకి వస్తుండటంతో ప్రమాదాలకు అంతులేకుండా పోతోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగక పోవడం, కొన్ని చోట్ల రోడ్ల సౌకర్యం అంతంత మాత్రంగా ఉండటం, మరికొన్ని చోట్ల రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో ఈ సంఖ్య పెరుగుతోంది. కూడళ్ళలో ట్రాఫిక్‌ నియంత్రణకు సరిపోయేంత పోలీసు సిబ్బంది లేక పోవడం కూడా మరో కారణం అవుతోంది. ఇలాంటి పరిస్థితులే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో నెలకొంది.

లక్ష్యాన్ని అధిగమించిన”వసూళ్ల్లు” 2011లో ఆర్థిక శాఖ

ఆర్ధిక శాఖ వసూళ్ల లక్ష్యాన్ని అధిగమించింది. మొత్తంగా వార్షిక వసూళ్ల లక్ష్యం రూ.68,777 కోట్లు. అందులో రాష్ట్ర పన్నుల వసూళ్ల లక్ష్యం రూ. 56,438 కోట్లు కాగా ఇప్పటికే రూ. 72 వేల కోట్లకు పైగా వసూలు చేశారు. పన్నేతర ఆదాయ వసూళ్ల లక్ష్యం రూ. 12,339 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ. 10,931 కోట్లు వసూలు చేశారు. పన్నుల వసూళ్లలో 22 శాతం ప్రగతి నమోదయింది. వాణిజ్య, అబ్కారీ, రవాణా, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల నుండి రాబడులు ఆశాజనకంగా నమోదయ్యాయి. వసూళ్ల పర్వం కొనసాగుతునే ఉంది.
రాష్ట్ర బడ్జెట్‌ రూ. 1,28,542 కోట్లు. ఈ లక్ష్యాన్ని చేరుకొనేందుకు రూ. 1,00, 995 కోట్లు రాబడులుగా సమకూర్చుకోవాలని సంకల్పించారు. ఇప్పటికే రూ. 82,931 కోట్లు వసూలు చేశారు. మరో మూడు మాసాల్లో లక్ష్యాన్ని అధిగమించగలమనే ధీమాను ఆర్ధిక శాఖ వ్యక్తం చేస్తోంది. మార్చి 2012 వరకు మరింతగా వసూళ్లు పెంచుకొనే ప్రణాళిక ఇప్పటికే సిద్దమయింది. రాష్ట్రానికి కేంద్ర నిధుల బదలాయింపులు రూ. 32,218 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేశారు. అందులో మూడవ వంతు నిధులు ఇప్పటికే ఖజానాలో జమైనట్లు వెల్లడించారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని సమర్ధవంతంగా అమలు పర్చడంతో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఆర్ధిక నిర్వహణలో సమర్ధవంతమైన పద్దతులను పాటించి, వనరులను పెంచుకొనడంపై ప్రధానంగా దృష్టి పెట్టడం వల్ల ద్రవ్య లోటును తగ్గించి, రెవెన్యూ లోటు లేకుండా చేయడంలో రాష్ట్రం మంచి ప్రగతిని సాధించింది. వ్యవసాయ రంగం 6.5 శాతం, పారిశ్రామిక రంగం 9.61 శాతం వృద్ధిని సాధించాయి. రాష్ట్ర ప్రణాళికలో ఆర్ధిక సేవలకు 57.64 శాతం, సామాజిక సేవలకు రూ. 40.78 శాతం, సాధారణ సేవలకు 1.58 శాతం నిధులు కేటాయించారు. ఈ కేటాయింపులకు మించి వ్యయం జరుగుంతుంది. కేటాయింపులను పరిగణలోకి తీసుకోకుండానే పథకారుల వెలుగుచూస్తున్నాయి. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని రూపాయి కిలో బియ్యంగా మార్చడంతో ఏటా రూ. 600 కోట్ల అదనపు భారం పడింది. ఉచిత విద్యుత్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ పథకం, గృహ నిర్మాణం, పావలా వడ్డి లాంటి పథకాల్లో మార్పులు చేయడం, కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయడంతో వ్యయం భారీగా పెరిగింది.
సామాజిక భద్రతా పథకాల రూపకల్పన, ప్రజా పంపిణీ వ్యవస్ధలో వస్తున్న మార్పులు, మనుగడ కోసం ప్రకటిస్తున్న ప్రజాకర్షక పథకాలు ఆర్ధిక వ్యవస్ధను కుదిపేస్తున్నాయి. సబ్సిడీ బియ్యం పథకానికి బడ్జెట్‌లో రూ. 2,500 కేటాయించగా మరో రూ. 600 కోట్లు అదనంగా చెల్లించవలసిన పరిస్ధితి నెలకొంది. రచ్చబండలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరాల అమలుకు రూ. 2,750 నుండి రూ. 3000 కోట్లు వ్యయం చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ప్రణాళికేతర వ్యయం భారీగా పెరిగిపోతుంది. ఆర్ధిక క్రమశిక్షణకు గండి కొడుతుంది. రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చడం కోసం పాలకులు ప్రజాకర్షక పథకాలను ప్రకటించంతో ప్రభుత్వాలు అప్పుల పాలవుతున్నాయి. ఫలితంగా, రాష్ట్ర వ్యయం అదుపుతప్పుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న పన్నుల వ్యవస్థ అన్ని వర్గాలకు పెనుభారంగా పరిణమించింది. పాలకులు ప్రకటిస్తున్న ప్రజాకర్షక పథకాలతో ఖజాన ఖాళీ అవుతోంది. రాష్ట్ర ఆదాయం పెరిగినప్పడికీ అప్పుల చెల్లింపు తప్పడం లేదు.
వ్యయ నియంత్రణ నిబంధనలకే పరిమితమయ్యింది. ప్రజాకర్షక, పేరు ప్రఖ్యాతుల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారుతున్నాయి. గత సంవత్సర కాలంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల భారం రూ. 2750 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూపాయికి కిలో బియ్యం. రాజీవ్‌ యువకిరణాలు, వడ్డీ లేని రుణాలు, ఇందిర జలప్రభ లాంటి పథకాలు భారీ వ్యయంతో కూడుకున్నవి కావడంవల్ల ఖజానాపై పెనుభారం పడుతోంది. బడ్జెట్‌ తయారు చేసే ముందు ఊహించని అనేక పథకాలు మధ్యలో రూపుదిద్దుకుంటున్నాయి. ఇదో అనుకోని అదనపు వ్యయంగానే భావిస్తున్నారు. రాష్ట్రం ఇప్పటికే రూ. 1.36 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. విదేశీ సంస్థల అప్పులు రూ. 17,217 కోట్లకు చేరుకున్నాయి. ఆర్థిక పరిస్ధితిని పరిగణలోకి తీసుకోకుండానే ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టడానికి పాలకులు అలవాటు పడటంతో నిరర్థక, ప్రణాళికేతర వ్యయం భారిగా పెరిగిపోతోంది. ఏటేటా వార్షిక పడ్జెట్‌ను పెంచుకుంటూ పోవడం తప్ప బడ్జెట్‌లోని అంకెలకు ప్రామాణికం లేకుండా పోతోంది.
పొంతన లేని లెక్కలతో అందమైన బడ్జెట్‌ను రూపొందించడానికి పాలకులు అలవాటు పడటంతో బడ్జెట్‌లో శాస్త్రీయ దృక్పథం లేకుండా పోతోంది. ప్రణాళికా వ్యయాలు కుదించుకు పోవడం, అభివృద్ధి ఆశించిన మేరకు ముందుకు సాగక పోవడం, సంక్షేమం కుంటుపడటం వెనుక పాలకుల తప్పిదాలు వెక్కిరిస్తున్నాయి. ప్రణాళికేతర వ్యయం భారీగా పెరగడంతో ఉత్పాదక వ్యవస్ధలు బలపడలేక పోతున్నాయి. ప్రభుత్వ శాశ్వత నిరర్ధక ఆస్తులు కూడా పెంచుకోలేక పోతున్నారు. రాజకీయ నిర్ణయాలు జరుగుతుండడంతో ఆర్ధిక క్రమశిక్షణ లోపించడం వల్లనే ద్రవ్య వ్యవస్ధ గందరగోళంలో పడిపోతోంది. ఓటర్లను అన్ని ఆశించే వారుగా భావించి పాలకులు తీసుకుంటున్న ప్రజాకర్షక నిర్ణయాల్లో మార్పులు వచ్చేంత వరకు ఆర్థిక వ్యవస్థకు ఈ తిప్పలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.
పథకాలు ప్రజాహితంగా, ప్రయోజనకరంగా, పేదరికాన్ని నిర్మూలించేవిగా , ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేవిగా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేవిగా, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేవిగా, ఉత్పత్తికి ఊతమిచ్చేవిగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు కొద్ది పాటి ప్రత్యక్ష ప్రయోజనం కనబరిచి పన్నుల రూపంలో భారీ ఎత్తున వసూలు చేయడం సర్వసాధారణమయ్యింది. ఇటీవల రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంను రూపాయి కిలో బియ్యంగా ప్రకటించిన ప్రభుత్వం రాబోవు కాలంలో ఇంధన సర్‌చార్జీగా రూ. 4500 కోట్లు, విద్యుత్‌ చార్జీల పేరుతో రూ. 3000 కోట్లు, వాణిజ్య పన్నుల ద్వారా మరో రూ. 1500కోట్లు, మద్యం ధరలను సవరించడంతో అదనంగా రూ. 1500 కోట్లు, ఆస్తి పన్నుల రూపంలో రూ. 1000 కోట్లు, మంచినీటి చార్జీల పెంపుతో రూ. 300 కోట్లు, విత్తనాల ధరలు పెంచడంతో రూ. 400 కోట్లు ప్రజల నుండి రాబట్టడానికి ప్రణాళిక రూపొందించింది. 2012 ఏప్రిల్‌ నుండి జూలై మాసాల మధ్యలో ఈ పన్నులు ప్రజల నుండి వసూలు చేయడానిక సిద్దపడింది. ఇక మీదట 10.30 శాతం సేవా పన్ను, 14.5 శాతం విలువ ఆధారిత పన్ను ప్రతి ఒక్కరి నుండి వసూలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

మహిళాభివృద్ధికి”చే“యూత

రాష్ట్ర మహిళల జీవనచిత్రంలో 2011 సంవత్సరం కీలకఘట్టంగా మారింది అనడంలో అతిశయోక్తిలేదేమో. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మహిళల జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నాయి. స్థానికసంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు, వడ్డీ లేకుండా రుణాలు అందించేలా స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు ఈ సంవత్సర కీలకాంశాలు. మహిళలకు సాధికారత కల్పించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో స్థానికసంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అన్ని నిర్ణయం చారిత్రాత్మకంగా మారింది. జనాభాలో సగం ఉన్న మహిళలకు చట్టసభల్లోనూ సముచిత స్థానం కావాలన్న డిమాండ్‌కు ఊతం ఇచ్చింది. క్షేత్రస్థాయి నుంచే మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంచడంలో ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారుతుంది. రాజకీయాల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు ఎంతో ఉపకరిస్తాయి. మహిళల సాధికారతకు, ఆత్మగౌరవానికి ఇది నాందిగా మారింది.
రాజకీయంగా మహిళలకు సముచిత స్థానం ఇచ్చిన ప్రభుత్వం ఆర్థికంగా వారిని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వెయ్యికోట్ల రూపాయలతో స్త్రీనిధి బ్యాంకును ఏర్పాటుచేసింది రాష్ట్ర ప్రభుత్వం. స్వయం సహాయక బృందాలకు తక్షణ బుణ సదుపాయం అందించడమే ఈ పథకం ముఖ్యఉద్దేశ్యం. ఈ బ్యాంకు ద్వారా పదిలక్షల స్వయం సహాయక బృందాలు రుణాలను అందుకునే అవకాశం లభిస్తోంది. రుణాలను సక్రమంగా చెల్లించిన వారికి నూటికినూరు శాతం వడ్డీ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించి మహిళాఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మహిళలకు విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం పలుచర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని 387 ఐసిడిఎస్‌ ప్రాజెక్టులలో 12.83 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. 58,44 లక్షల మంది చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు రోగనిరోధక కీటాలు అందించారు. ఫ్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పథకం ద్వారా 18,06,855మందికి విద్యను అందిస్తున్నారు. ఈ సంవత్సరం అదనంగా మరో పది వేల అంగన్‌వాడీ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జనని పథకం ద్వారా గర్భిణీలకు నెలకు ఐదు కిలోల బియ్యం, ఒక కిలో కంద పప్పు, కిలో ఉప్పు పదినెలల పాటు ఉచితంగా అందిస్తున్నారు. పదికోట్ల రూపాయలతో రెండుజిల్లాల్లో ఇందిరాగాంధీ సహయోగ్‌ యోజన ద్వారా పదివేలమందికి సహాయం అందించారు. జిసిపిఎస్‌ పథకం ద్వారా లక్షా ఆరువేల 231మంది బాలికలకు 48కోట్ల రూపాయలతో వివిధ పథకాలను అమలు చేస్తున్నారు.
కేంద్రం దేశవ్యాప్తంగా రెండువందల జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టిన సబల పథకం రాష్ట్రంలోని ఏడు జిల్లాలల్లో అమలు జరుగుతున్నది. మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు సేకరించి వివరాల ప్రకారం ఎంపిక చేసిన కిశోరబాలికలకు శిక్షణ ఇస్తారు. జిల్లా కేంద్రాల్లో ఉన్న మహిళా ప్రాంగణాల్లో కేంద్రప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం 200వందల వృత్తికోర్సులలో శిక్షణనిస్తారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో కోటి 25లక్షల రూపాయలతో తొమ్మిది లక్షలమంది కిశోరబాలికలకు పౌష్టికాహారం, వృత్తివిద్యాకోర్సులలో శిక్షణనిస్తున్నారు.

హిట్లు-పట్లు

భారత క్రికెట్‌ చరిత్రలో 2011 సంవత్సరానికి విశిష్ట ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ ఏడాది భారత క్రికెట్‌ జట్టు ఎన్నో మరుపురాని విజయాలను సొంతం చేసుకుంది. వీటిలో ఒకటి వన్డే ప్రపంచకప్‌ విజయం. అంతేగాక, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాలతో జరిగిన టెస్టు సిరీస్‌లలో జయకేతనం ఎగుర వేసింది. దీంతోపాటు వన్డే క్రికెట్‌ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్‌ చిరస్మరణీయ డబుల్‌ సెంచరీ సాధించి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇన్ని తీపి జ్ఞాపకాల మధ్య కొన్ని మరచిపోలేని చేదు గుళికలు కూడా క్రికెట్‌ జట్టు అందించింది. ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్టులు, వన్డేల్లో క్లీన్‌స్వీప్‌ కావడం టీమిండియా ప్రతిష్టను దిగజార్చింది. మరోవైపు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు చారిత్రక వందో సెంచరీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ ఏడాది విదేశి గడ్డపై భారత్‌ వరుసగా ఐదు టెస్టుల్లో ఓటమి పాలైంది. దశాబ్దకాలంగా ఎన్నడూ కూడా భారత్‌ ఇటువంటి చెత్త రికార్డును మూటగట్టుకోలేదు. కాగా, అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌, వరుణ్‌ అరోన్‌లో రూపంలో భారత్‌కు కొత్త అస్త్రాలు దొరికాయి. కానీ, ఓపెనర్లు గౌతం గంభీర్‌, సెహ్వాగ్‌, హైదరాబాదీ వివిఎస్‌.లక్ష్మణ్‌, కెప్టెన్‌ ధోనీ, సురేశ్‌ రైనాల వైఫల్యం టీమిండియాను వెంటాడింది. అంతేగాక సీనియర్‌ బౌలర్లు జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ, ప్రవీణ్‌ కుమార్‌, నెహ్రా, హర్భజన్‌ సింగ్‌ తదితరులు గాయాల వల్ల చాలా రోజుల పాటు జట్టుకు దూరంగా ఉన్నారు. అంతేగాక స్టార్‌ ఆటగాడు యువరాజ్‌ కూడా జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు.
జగజ్జేత భారత్‌..
శతకోటి అభిమానుల కలలను సాకారం చేస్తూ టీమిండియా ఉపఖండం గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌పను గెలుచుకొంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్‌ మూడున జరిగిన చారిత్రక ఫైనల్లో ధోనీ సేన చిరకాల ప్రత్యర్థి శ్రీలంకను ఓడించి తన ఖాతాలో రెండో ప్రపంచకప్‌ను జమ చేసుకుంది. ఎప్పుడో 1983లో కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని భారత జట్టు తొలి వరల్డ్‌కప్‌ గెలుచుకోగా, దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్లిd జగజ్జేతగా నిలిచింది. భారత క్రికెట్‌ చరిత్రలోనే ఇది మరుపురాని ఘట్టంగా చిరకాలం గుర్తుండి పోతుంది. ప్రతికూల వాతావరణంలోనూ కెప్టెన్‌ ధోనీ, గౌతం గంభీర్‌ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో జట్టును విశ్వవిజేతగా నిలిపారు. ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్‌లో భారత్‌ అద్భుత ఆటతో కప్పును సొంతం చేసుకుంది. యువరాజ్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభకు, జహీర్‌ పదునైన బౌలింగ్‌ తోడు కావడంతో టీమిండియా ప్రపంచకప్‌ను ఎగురేసుకు పోయింది.
మాస్టర్‌ అ 15000
రికార్డుల రారాజు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఈ ఏడాది తన పేరిట మరో అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. వెస్టిండీస్‌తో ఢిల్లిdలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా సచిన్‌ టెస్టు క్రికెట్‌లో 15వేల పరుగుల మైలురాయిని అందు కున్నాడు. క్రికెట్‌ చరిత్రలోనే ఒక ఆటగాడు టెస్టుల్లో 15వేల పరుగుల మార్క్‌ను చేరుకోవడం ఇదే ప్రథమం. టెస్టుల్లో 15వేల పరుగులు చేసిన సచిన్‌ వన్డేల్లో 18వేలకు పైగా పరుగులు సాధించి తన పేరిట ఎన్నటికి చెదిరిపోని రికార్డులను నమోదు చేశాడు.
అందని ద్రాక్షే...
అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న సచిన్‌కు శతకాల సెంచరీ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో సెంచరీ తర్వాత సచిన్‌ మళ్లిd మూడంకెల స్కోరుకు చేరుకోలేక పోయాడు. వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లలో సచిన్‌ ఈ రికార్డును అందుకోలేక పోయాడు. రెండు మూడు సార్లు శతకానికి చేరువగా వచ్చినా ఒత్తిడికి తట్టుకోలేక పెవిలియన్‌ చేరాడు.
సెహ్వాగ్‌ గ్రాండ్‌ డబుల్‌
ఇక, భారత క్రికెట్‌ చరిత్రలోనే మరో అరుదైన రికార్డును డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో డిసెంబర్‌ 8న ఇండోర్‌లోని హోల్కార్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్‌ 149 బంతుల్లోనే 219 పరుగులు సాధించి వన్డే క్రికెట్‌ చరిత్రలో డబుల్‌ సెంచరీ సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ పేరిట ఉన్న 200 నాటౌట్‌ రికార్డును అధిగమించాడు. కరేబియన్‌ బౌలర్లను హడలెత్తించిన సెహ్వాగ్‌ 149 బంతుల్లో 25 ఫోర్లు, 7భారీ సిక్సర్లతో 219 పరుగులు సాధించి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. వన్డేల్లో ఇప్పటివరకు నమోదైన రెండు వన్డే సెంచరీలు కూడా భారత ఆటగాళ్లే నమోదు చేయడం మరో విశేషం. మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో అరుదైన రికార్డును నెలకొల్పింది. వన్డే క్రికెట్‌లో అత్యధిక సార్లు 400పైగా స్కోర్లు నమోదు చేసిన జట్టుగా భారత్‌ నిలిచింది. భారత్‌ నాలుగు సార్లు 400పైగా స్కోర్లు నమోదు చేసింది.
ఇంగ్లండ్‌ సిరీస్‌ ఓ పీడకల....
ఇదిలావుండగా, భారత క్రికెట్‌ చరిత్రలో ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగిల్చిన 2011 సంవత్సరం అంతే చేదు అనుభవాలను కూడా మిగిల్చింది. దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా ఈసారి ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు నెలలకు పైగా సాగిన ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా అత్యంత చెత్త ఆటతో అవమానకర ఓటమిని చవిచూసింది. ఆడిన నాలుగు టెస్టుల్లోనూ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. అంతేగాక, వన్డేల్లోనూ క్లీన్‌స్వీప్‌ అయ్యింది. దీంతోపాటు ఆడిన ఏకైక ట్వంటీ-20 మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. భారత క్రికెట్‌లోనే ఇది చాలా చెత్త సిరీస్‌గా పరిగణించవచ్చు. సుదీర్ఘకాలంపాటు సాగిన ఇంగ్లండ్‌ సిరీస్‌లో భారత్‌ ఒక్క విజయం సాధించకుండానే ఇంటికి చేరింది.
కొసమెరుపు...
అయితే ఆ వెంటనే సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా టీమిండియా తీయని ప్రతీకారం తీర్చుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ను భారత్‌ 5-0 తేడాతో గెలుచుకొని ఇంగ్లండ్‌ తీయని బదులిచ్చింది. ఈ గెలుపు భారత అభిమానులను కాస్త ఊరట కలిగించింది. తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లను కూడా భారత్‌ కైవసం చేసుకుంది.
చేజేతులా...
మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్‌డే టెస్టులో ఘోర పరాజయం ద్వారా భారత్‌ మళ్లిd నిరాశ పరిచింది. ఆస్ట్రేలియాను ఓడించేందుకు వచ్చిన చారిత్రక అవకాశాన్ని టీమిండియా చేజేతులా జారవిడుచుకుంది. నిర్లక్ష్య బ్యాటింగ్‌, పసలేని బౌలింగ్‌తో ఆసీస్‌ చేతిలో ఓటమి పాలైంది. కీలక సమయంలో వైఫల్యం భారత్‌ విజయావకాశాలను దెబ్బతీసింది. గంభీర్‌, సెహ్వాగ్‌, సచిన్‌, లక్ష్మణ్‌, కోహ్లి, ద్రవిడ్‌, ధోనీ వంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌ కలిగిన టీమిండియా 292 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో చతికిల పడింది. కనీస పోరాట పటిమను కూడా కనబరచకుండానే చేతులెత్తేసింది. దీంతో భారత క్రికెట్‌ జట్టు 2011 సంవత్సరాన్ని ఓటమితో ముగించింది.

'సాగు'ముళ్ల బాట...2011లో వ్యవసాయం

వ్యవసాయరంగం పూర్తిగా దుర్భిక్ష పరిస్థితులనుఎదుర్కొంటోంది. గత మూడే ళ్ళుగా అన్నదాతను వెంటాడుతున్న కరవు ఈసారి మరింత ప్రభావాన్ని చూపుతోంది. అనాదిగా నమ్ముకున్న వృత్తి కడుపు నింపలేక, బతుకుదెరువుకు మరో మార్గం లేక రాష్ట్రంలో రైత న్నలు తల్లడిల్లుతున్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేవీ వారికి ఆశించిన ప్రయోజనాన్ని చేకూర్చడం లేదు. పెట్టుబడి వ్యయం పెరిగి, పంటలకు గిట్టు బాటు ధరలు రాక, తెచ్చిన అప్పులు తీరక కష్టనష్టాల మధ్య సాగుతున్న వ్యవాయం కర్షకుల కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తోంది. అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరెంటు కోత , నకిలీ విత్తనా లు, అందని ఎరు వులు, స్పందించని బ్యాంకర్లు... ఇవన్నీ వారి పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రతియేటా నిత్యావసర సరుకుల ధరలు అదుపు తప్పి పెరుగుతున్నా, రైతు పండిం చిన పంటకు తగిన నిష్పత్తిలో మద్దతుధరలు అందడం లేదు. ఏడాది పొడవునా చెమటోడ్చి పండించిన పంటను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. గత్యంత రంలేక కొన్ని ప్రాంతాల్లో పంటల విరామం, మరికొన్ని ప్రాం తాల్లో వలసలు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ఒడిదుడుకులను, ఆటుపోట్ల ను తట్టుకొనే శక్తి లేని రైతన్నలు కుటుంబ పోషణ భారమై ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఈ విధమైన ప్రతికూల పరిస్థితుల మధ్య గత ఏడాదికాలంగా అన్నదాతలు ముళ్ళబాటలోనే బతుకులు వెల్లదీస్తున్నారు.
2011 ఖరీఫ్‌ మొదలుకొని వ్యవసాయ రంగానికి అన్నీ ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. సీజన్‌ ప్రారంభంలో తలెత్తిన వర్షాభావంరైతులను ఆందోళనకు గురిచేయగా, అనం తరం కురిసిన అతివృష్టి వల్ల తీవ్ర బీభత్సం జరిగింది. అనేక ప్రాంతాల్లో అడపాదడపా సాగైన పంటలు కూడా నాశనమై పోయాయి. అనంతరం ఖరీఫ్‌ ఆఖరులో మళ్ళీ భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ప్రాథమిక అంచనాల మేరకు సుమా రు 33 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. వరి, పత్తి, వేరు శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, కంది, మొక్కజొన్న పంట లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. కొన్ని జిల్లాల్లో తీవ్రమైన ఎరు వుల కొరత, నకలీ విత్తనాలు అన్నదాతను నట్టేట ముంచాయి. అదే నెలలో వరుసగా ఆరు తుఫానులు సంభవించి పంట నష్టంతో పాటు తీవ్రస్థాయిలో ఆస్తినష్టం, ప్రాణ, పశునష్టం కూడా సంభ వించింది. అదే సమయంలో తారాస్థాయికి చేరిన ప్రాంతీయ వాద ఉద్యమాలు తీవ్ర ప్రభావం చూపాయి. సమ స్యల సుడి గుండం మధ్య మెట్ట పంటల విస్తీర్ణం 25 శాతానికి పైగా తగ్గి పోయింది. ఆ విపత్తు నుంచి తేరుకోకముందే రబీ సీజన్‌ ప్రారంభమైంది. తీవ్రమైన వర్షాభావం రైతాంగాన్ని మరింత ఆందోళనకు గురిచేసింది. పండించిన ప్రతి ధాన్యం గింజను కొను గోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం చేతులె త్తేసింది. మిల్లర్లను, వ్యాపారులను అప్రమత్తం చేసి ఇందిరా క్రాంతి పథం బృందాలనురంగంలోకి దింపినప్పటికీ పరిస్థితు లు అదుపులోకి రాలేదు. కనీస మద్దతు ధర ధాన్యం క్వింటాలు ఒక్కింటికీ 1030 రూపాయలు ఉండగా, రూ.900కు మించి కొనుగోలు చేయలేదు. దీంతో పెట్టుబడి సైతం చేతికందని రైతులు తీవ్రంగా నష్టపోవలసి వచ్చింది. సకల జనుల సమ్మె సందర్భంలో తీవ్ర కరెంటు కోత, అందని సహకారం, ఎరువు లు, విత్తనాల కొరత తదితర కారణాల వల్ల 40 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ పంటలు ఎండిపోయాయి. నష్టాలను భరించలేని ఈ పరిస్థితుల్లో కోనసీమలో పంటల విరామం ఉద్యమం ప్రారం భమైంది. కేవలం 15 రోజుల్లోనే తెలంగాణ జిల్లా లకు సైతం పాకిన ఈ ఉద్యమం ప్రభు త్వానికి సవాల్‌గా మారింది. లక్షల ఎకరాల పంటపొలాలు బీళ్ళుగా మారాయి. గిట్టుబాటు లేని వ్యవసాయాన్ని తామిక చేయలేమని రైతులు ప్రభుత్వంపై తిరు గుబాటు ప్రారంభించారు. ప్రతిపక్ష పార్టీలు వారికి అండగా ఉన్న పరిస్థితుల్లో క్రాప్‌ హాలిడేకు దారి తీసిన కారణాలను, పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం మాజీ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా నేతృత్వంలో ఒక కమిటీ ని నియమించింది. సుమారు నెలరోజుల తర్వాత గిట్టు బాటు లేకే రైతులు పంటల విరామాన్ని ప్రకటించినట్లు మోహన్‌కందా కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ధాన్యం కొనుగోలు బాధితులను రైతుమిత్ర బృందాలకు, స్వయం సహాయక సంఘా లకు అప్పగించిన ప్రభుత్వం వారికి అవస రమైన ఆర్ధిక సహాయం అందచేయాలని, ఉత్పత్తుల అంచ నాకు అనుగుణంగా ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు గోదాములు అవస రమని కందా తేల్చిచెప్పారు. స్వామినాథన్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం రైతు పెట్టుబడి వ్యయానికి 50 శాతం కలిపి కనీస మద్ద తు ధరలు అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అయినా ప్రభుత్వం చేపట్టిన తదనంతర చర్యలు నామమాత్రం గానే కొనసాగా యి. ప్రకృతి కనికరించకపోయినా, ప్రభుత్వ సహకారం అంద కపోయినా పోగొట్టుకున్న చోటే వెదుక్కుందామన్న ఆలోచనతో పంటలను సాగు చేస్తున్నా రు. రబీ సాధారణ విస్తీర్ణం 40.44 లక్షల హెక్టార్లు కాగా అరకొర సౌకర్యాలతోనే 20 లక్షల హెక్టార్లు సాగు చేశారు. వర్షా భావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పత్తి పంట సాగుపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.
ఆదుకోవడానికి నిబంధనలు ఎన్నెన్నో!
రాష్ట్రాన్ని పీడిస్తున్న వరుస కరవు పేద రైతు కుటుంబా లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏటేటా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునే ప్రయత్నాలే వీ కనిపించడం లేదు. మద్దతు ధరలు లేక, పంటలు గిట్టు బాటు కాక, పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీరక, బతుకు దెరువుకు మరోమార్గం లేక తీవ్రమైన సమస్యలతో విలవిలలా డుతున్న అన్నదాతలపై పాలకపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. బాధ్యతగల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతు లత్త్తేస్తున్నాయి. ముఖ్యమంత్రులు మారినా, ప్రతిపక్షాలు ఉద్య మించినా, అధ్యయన కమిటీలు ఆదుకోవాలని సిఫార సు చేసినా చలనం మాత్రం కనిపించడంలేదు. రైతు సంక్షేమంపై పేరుతో రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నప్పటికీ అవేవీ బడుగు రైతు జీవితాలను బాగు పరచలేకపోతున్నాయి. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారుల్లో నిర్లక్ష్యం, అవి నీతి అక్రమాలు వారి పాలిట శాపంగా మారుతున్నాయి.
రైతులు సాగుచేసిన పంటలు 50 శాతానికి మించి నష్ట పోతేనే పరిహారం చెల్లించాలన్న ధోరణితో ప్రభుత్వం నిబం ధనలు రూపొందిస్తోంది. దీంతో అర్హులైన రైతుల్లో సగం మం దికి కూడా నష్టపరిహారం అందుతుందన్న నమ్మకం కలగడం లదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో ప్రతి హెక్టారు పరిమాణంగా ఈ పరిహారాన్ని అందజేయాలని భావిస్తున్నాయి. వరి, వేరుశనగ, పత్తి, చెరకు, మిరప, ఉల్లి, కూరగాయలు, పూలతోటలు, బొప్పాయి తదితర పంటలకు ప్రతి హెక్టారుకు రూ.6వేలు నష్టపరిహారంగా అందజేయాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రణాళిక తయారు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేలు భరించనుంది. అదే విధంగా జొన్న, సజ్జలు, రాగు లు, ఆముదం, కలబంద పంటలకు ప్రతి హెక్టారుకు రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించగా, వర్షాభావ ప్రాంతాలకు రూ.2 వేలు మాత్రమే ఇవ్వనున్నారు. పప్పుధాన్యాలు, పొద్దుతిరుగు డు, సోయాబిన్‌, గోధుమ, ఆజ్వాన్‌, అవిసె పంటలకు రూ, 3,750 చెల్లించాలని నిర్దేశించగా, వర్షాభావ ప్రాంతాలకు రూ.2 వేలు మించి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. మొక్క జొన్నకు హెక్టారు ఒక్కింటికి రూ.5వేలు, ఉద్యానవన పంటలు, నర్సరీలకు రూ.4,500, మామిడి, నిమ్మ, జీడి మామిడి, సపోటా, జామ, దానిమ్మ, రేగు తోటలకు రూ.9 వేలు చెల్లించ నున్నారు. సాగునీటి ప్రాంతాల్లో అరటి తోటలకు రూ.24వేలు, వర్షాభావ ప్రాంతాల్లో రూ.6వేలు, పొగాకు తోటల కు రూ.6వేల చొప్పున పరిహారం చెల్లించాలని విపత్తుల నిర్వహణ శాఖ నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకు నేందుకు ప్రతి హెక్టారుకు రూ.10వేలకు తగ్గకుండా పరిహారం చెల్లిం చాలని ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఇంత తక్కువ మొత్తంలో నష్ట పరిహారం చెల్లింపునకు ప్రణాళికలు రూపొందించుకోవడం గమనార్హం. 2009 వరద బీభత్సాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీ య విపత్తుగా గుర్తించినా, అనంతరం 2010లో పెద్దఎత్తున సంభవించిన కరవుపై పలుసార్లు కేంద్ర బృందాలు పర్యటించి అధ్యయనం చేసినా బాధితులను ఆదుకోవడంలో జరుగుతున్న జాప్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడా ది కూడా అంతకు రెట్టింపు స్థాయిలో దారిద్య్రం గ్రామీణ ప్రజలను వెంటాడుతోంది. 84 శాతం ప్రాంతాల్లో సాధారణ వర్షాపాతం నమోదుకాని కారణంగానే కరవు ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ గుర్తించినప్పటికీ ప్రభుత్వ చర్యలు హామీలకే పరిమితమవుతున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌, రబీ సీజ న్‌లలో పంటలు ఎండిపోయినందున రాష్ట్ర వ్యాప్తంగా సుమా రు 800 మండలాలను ప్రభుత్వం కరవు పీడిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 876 మండ లాల్లో తీవ్రమైన కరవు ఉన్నట్లు గుర్తించారు. 12 జిల్లాలు పూర్తి గా దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఇదంతా కాదని కేంద్ర ప్రభుత్వం కరవు ప్రాం తాల స్థితిగతులపై అధ్యయనం చేసేం దుకు అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) సంస్థకు బాధ్యతలు అప్పగించింది. కోనసీమ మొదలుకొని తెలంగాణ జిల్లాలకు సైతం పాకిన పంటల విరామంపై ప్రభుత్వం నియ మించిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందా కమిటీ పూర్తిస్థాయి నివేదిక సమర్పించినప్పటికీ, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రైతు సంఘాల సమావేశంలో స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ బాధితులకు ఒక్కపైసా పరిహారం అందిన దాఖలాలు లేవు. అనంతరం తలెత్తిన కరవుపై ప్రతి జిల్లాకు ప్రత్యేకాధికారిని నియమించి పరిస్థితులపై నివేదికలు తెప్పిం చినప్పటికీ ఇంకా చర్యలు ప్రారంభం కాలేదు. మూడేళ్ళ వరు స కరవు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ 2011 నైరుతి రుతు పవనాల సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిం చేందుకు ప్రత్యేకా ధికారులుగా నియమించబడిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు ఆయా జిల్లాల్లో పర్యటించాలని ప్రభు త్వం ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. రాష్ట్రంలో సాధారణంగా చెరకు పంట విస్తీర్ణం 5 లక్షల 27 వేల ఎకరాలు సాగుకావాల్సివుండగా, ఈ వ్యవసాయ సంవత్సరం ముగిసిన ఖరీఫ్‌లో ఈ పంట 4 లక్షల 97 వేల ఎకరాలకు తగ్గింది. అదే విధం గా 2010 ఖరీఫ్‌లో 4 లక్షల 80 వేల ఎకరాలు, 2009 ఖరీఫ్‌లో 3 లక్షల 95 వేల ఎకరాల్లో మాత్రమే చెరకు సాగైనట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ విస్తీర్ణం తగ్గడానికి ఉత్పత్తులకు తగిన గిట్టుబా టు ధర రాకపోవడమేనని తెలినప్పటికీ ప్రభుత్వం అందు కు తగిన చర్యలకు పూనుకోవడంలేదు. చక్కెర ధర పెరిగి న సందర్భాల్లో అదుపుకోసం తీసుకుంటున్న చర్యలు, విడుదలవుతున్న సబ్సిడీ నిధులు ఫ్యాక్టరీలకే లబ్ధి చేకూరుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో చెరకు సాగుకు అవసరమయ్యే పెట్టుబడులు రైతాంగానికి ముందుగానే సమకూరుస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు కొనుగోలు సమయం లో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నాయి. మార్కెట్లో చక్కెర ధర 22 రూపాయలున్న సమయంలో చెరకు మద్దతు ధర 1700 రూపాయలుండగా, ప్రస్తుతం చక్కెర ధర 36 రూపాయలకు చేరుకున్నా ధరమాత్రం వంద రూపాయలకు మించి పెరగలేదు. సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో చెరకు రైతులు మరింతగా నిలువు దోపిడీకి గురవుతున్నారు. చక్కెర శాతం అధికంగా ఉన్న చెరకునుబట్టి ధరను చెల్లించాల్సివున్న సహకార కర్మాగారాలు మద్దతు ధర చెల్లింపులో చేతులెత్తేస్తున్నాయి. రాష్ట్రంలో క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభమై దాదాపు నెలరోజులు గడిచినా ఇప్పటివరకు సహకార ఫ్యాక్టరీలు ప్రతిపాదిత ధరలను ప్రకటించలేదు. ఈ అంశంపై ఇటీవల జరిగిన శాసనసభలో ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఉమ్మడి రంగం, ప్రైవేటు రంగంలో కొనసాగుతున్న ఫ్యాక్టరీలు ఒకటి, రెండు మినహా ధరలను ప్రకటించాయి. కానీ సహకార రంగంలో ఉన్న 11 ఫ్యాక్టరీలు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. చక్కెర ఉత్పత్తి శాతం 7 నుంచి 9.45 వరకు నమోదవుతున్నా చెరకు ధర రూ.1700 లకు మించడంలేదు. అనకాపల్లి, తాండవ, చిత్తూరు, కోవూరు సహకార కర్మాగారాల్లో టన్ను రూ.1700 మాత్రమే చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు ప్రతిపాదిత ధరలను ప్రకటించలేదు. తెనాలిలోని ఎన్‌విఆర్‌, నిజామాబాద్‌, కడప చక్కెర ఫ్యాక్టరీలలో క్రషింగ్‌ ప్రారంభించలేదు. చక్కెర ఉత్పత్తి 9.35 శాతంగా ఉన్న విజయనగరంలో జిల్లాలోని విజయరామ సహకార చక్కెర ఫ్యాక్టరీ టన్ను ఒక్కింటికి ధర కేవలం రూ.1800గా ప్రకటించింది.ఉమ్మడి రంగంలో కొనసాగుతున్న చక్కెర ఫ్యాక్టరీలు రికవరీ శాతం ఎంతున్నా మద్దతు ధర రూ.2200లుగా ప్రతిపాదించాయి. కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లిలోని నిజాం డెక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ చక్కెర రికవరీ 8.62 శాతం, నిజామాబాద్‌ జిల్లా షక్కర్‌నగర్‌లోని నిజాం డెక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌లో రికవరీ శాతం 10.20, మెదక్‌ జిల్లా మంబోజిపల్లిలోని నిజాం డెక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌లో రికవరీ శాతం 9.35 గా ఉన్నప్పటికీ ఈ మూడు కర్మాగారాలు రైతులకు ఒకే విధమైన ధరలను చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీలు ప్రాంతాల వారీగా ధరలను ప్రతిపాదించాయి. చిత్తూరు జిల్లా సాగర్‌ షుగర్స్‌, ప్రుడెన్షియల్‌ షుగర్స్‌ చెరకు ప్రతి టన్ను రూ. 1900, కృష్ణాజిల్లా డెల్టా షుగర్స్‌, కెసిపి షుగర్స్‌ రూ.1950, విజయనగరం జిల్లా ఎన్‌సిఎల్‌ షుగర్స్‌, శ్రీకాకుళం జిల్లా ప్యారీస్‌ షుగర్స్‌, కర్నూలు జిల్లా రాయలసీమ షుగర్స్‌, తూర్పు గోదావరి జిల్లా నవభారత్‌ షుగర్స్‌, సర్వరాయ షుగర్స్‌, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రా షుగర్స్‌, జెపోర్‌ షుగర్స్‌, కృష్ణా జిల్లా ఉయ్యూరులోని కెసిపి షుగర్స్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా ఎన్‌ఎస్‌ఎల్‌ కృష్ణవేణి షుగర్‌ ఫ్యాక్టరీలు ప్రతి టన్నుకు రూ.2000 చొప్పున మద్దతు ధరలను చెల్లించనున్నట్లు ప్రకటించాయి. నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి, నిజాంసాగర్‌లలోని గాయత్రి షుగర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లతోపాటు ఖమ్మం జిల్లా మధుకాన్‌ షుగర్స్‌, మెదక్‌ జిల్లా సంగారెడ్డిలోని గణపతి షుగర్స్‌ మద్దతు ధర రూ.2200, ఖమ్మం జిల్లా కాకతీయ షుగర్స్‌ రూ.2150, ట్రిడెంట్‌ షుగర్స్‌ రూ.2100 ధరలు చెల్లించనున్నట్లు ప్రతిపాదన పంపారు. కానీ చిత్తూరు జిల్లా కెబిడీ షుగర్స్‌, నెల్లూరు జిల్లా గాయత్రి షుగర్స్‌ ఫ్యాక్టరీలు ఇప్పటివరకు ఎలాంటి ధరలను ప్రతిపాదించలేదు.చెరకు సాగు వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ప్రతి టన్ను చెరకు పండించడానికి రూ.2 వేలకు పైగానే పెట్టుబడి వ్యయం అవుతున్నట్లు వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. రైతు శ్రమ లెక్కగడితే మరో రూ.500 పెరిగే అవకాశముంది. కానీ ఫ్యాక్టరీలు చెల్లిస్తున్నది రూ.1800 నుంచి రూ.2200 లోపు మాత్రమే. పండించిన పంట గిట్టుబాటు కాక, శ్రమకు తగిన ఫలితంలేక రైతులు చెరకు సాగుపై ఆసక్తి చూపడంలేదు.

వాగ్దానాలు ప్రజల్లో... ఆచరణ పాతాళంలో...2011లో 'ఆరోగ్యం'

ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్యం దృష్ట్యా ప్రకటించిన పథకాలు సరైన ముందస్తు ప్రణా ళిక లేకపోవడంతో అమలుకు నోచుకోలేదు. దీంతో వాగ్దా నాలు ప్రజల్లో, పథకాలు పాతాళంలో అన్న చందంగా తయారైంది. ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌,మౌలిక సదుపాయాలు మెరుగు పర్చడానికి రూపొందించిన జన ఔషది పథకానికి ఆరంభంలోనే ఆటంకాలు ఎదురయ్యాయి.
ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేయడానికి వినూత్నంగా 360 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, న్యూట్రిషన్‌ అధికా రులను నియమించడం, రూ. 96 కోట్లతో 114 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టగా, శిశు మరణాలు తగ్గించడానికి, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ ను పటిష్టపరచడానికి ప్రణాళికా సంఘం సహ కారంతో రూ. 1331 కోట్లతో పథకాలు అమలు చేయడం వంటివి 2011లో వైద్య, ఆరోగ్య శాఖలో చేపట్టిన ప్రముఖ అంశాలుగా చెప్పుకోవచ్చు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 2005లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న శస్త్ర చికిత్సలు 11 లక్షలకు చేరుకోవడం గొప్ప మలుపు. ఈ పథకంలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని 22 నుంచి 40 శాతానికి పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి తోడు జాబితాలో మరి కొన్ని కొత్త వ్యాధులను చేర్చడం కొత్త అంశంగా చెప్పుకోవచ్చు. దీంతో 942 వ్యాధు లకు ఉచిత చికిత్స పొందే అవకాశం నిరు పేదలకు లభిం చింది. మారుమూల పల్లె ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే 104 సంచార వైద్య కేంద్రాాలు ప్రశంసలు అందు కున్నాయి.
అయితే, ఏడాది చివర్లో వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కోరుతూ సిబ్బంది దాదాపు రెండు నెలలుగా ఆం దోళనకు దిగడంతో ఆరోగ్య సేవలు స ్తంభించిపోయాయి. ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని నిస్స హాయులు, వృద్ధులు దీంతో ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆసుపత్రు లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించినప్పటికీ ప్రజల ఆదరణను చూరగొ నడంలో విఫలమైంది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ ఈ ఏడాది ప్రత్యేకంగా ఆసుపత్రుల పని తీరును పర్యవేక్షించడానికి ఐఎఎస్‌ స్థాయి అధికారిని ఓస్‌డిగా నియమించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 225 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం, అర్హత ఉన్న డాక్టర్లందరినీ ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌,అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులలో భర్తీ చేశారు. 'జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష' ( నీట్‌ ) ద్వారా ఎంబీబీ ఎస్‌ అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన తో రాష్ట్ర విద్యార్థులు, తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన నెలకొం ది. జాతీయ స్థాయి పరీక్షతో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుం దని గ్రహించిన ప్రభుత్వం పరీక్షను ఒక విద్యా సంవత్సరం పాటు పరీక్షను వాయిదా వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కొద్ది రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని టెన్షన్‌లో పెట్టిన ఈ అంశం నీట్‌ నుంచి రాష్ట్రానికి ఏడాది మినహా యింపు ఇస్తున్నట్లు ప్రకటన రావడంతో ముగిసింది. రాష్ట్రంలో రేబీస్‌ మరణాలు అటు ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రజలను వణికించాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని రాజ మండ్రి, కాకినాడ ప్రాంతాలలో ఈవ్యాధి బారిన పడి దాదాపు ఎనమిది మంది మృతి చెందడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఎలాగోలా వైద్యారోగ్య, మున్సిపల్‌ శాఖలను సమన్వయం చేసి రేబీస్‌ మరణాలకు అడ్డుకట్ట వేయగలిగింది.

పేదలకు భరోసా... రూపాయికే కిలో బియ్యం...2011లో పౌర సరఫరాలు

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదవర్గాలు, రైతుల సంక్షేమానికి కొత్త పథకాలు చేపడుతూ వారికి తామున్నామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2011 సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సంక్షేమ బాటను పట్టింది.
పేద వర్గాలకు ఆహారభద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో కేవలం రూపాయికే కిలోబియ్యం పథకం ప్రారంభించి ఈ వర్గాలలో ధైర్యాన్ని నింపింది. అదే సందర్భంలో ధాన్యం సేకరణలో ముందడగు వేస్తూ రైతులకు కూడా అండగా ఉన్నామని చాటుతోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పరిధిలో ఈ రెండు కార్యక్రమాలను విజయవంతంగా చేపడుతోంది.
ప్రభుత్వం ప్రారంభించిన రూపాయికే కిలోబియ్యం పథకం ద్వారా రాష్ట్రంలోని తెల్లకార్డులున్న 2.26 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతోంది. దీని వల్ల ప్రభుత్వంపై రూ. 2,600 కోట్ల భారం పడుతుందని అంచనా వేసినప్పటికీ, ఆహారభద్రతలో భాగంగా చౌకధరకే బియ్యం పంపిణీకే సిద్ధపడింది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్‌ 1 న ఈ పథకాన్ని ప్రారంభించింది. కూరగాయల ధరలు పెంచి రూపాయికే బియ్యం ఇస్తే ప్రయోజనమేమని ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పటికీ, ప్రభుత్వం వెరవకుండా ఈ పథకాన్ని కొనసాగిస్తోంది.
ధాన్యం సేకరణలో సైతం ప్రభుత్వం పురోగతిలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ధాన్యం సేకరణ జరిగింది. ప్రభుత్వం చూపిన చొరవతో పాటు రైతు సంఘాలు, ప్రభుత్వేతర సంఘాలు, రాజకీయ పార్టీల ఒత్తిడుల మూలంగా ధాన్యం సేకరణ ఈ సారి బాగా పెరిగింది. గత ఖరీఫ్‌ కంటె ఈ సారి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఏజెన్సీలు ఆసక్తిని పెంచాయి. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఆ), ఇందిరాక్రాంతి పథం( ఐకెపి) సంస్థలు 1577 కొనుగోలు కేంద్రాల ద్వారా 7,39,577 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాయి. రైస్‌ మిల్లర్లు 27,59,492 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఆధికంగా కొనుగోలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఏజెన్సీలు కలిపి గత డిసెంబర్‌ 26 వరకు 35,35,980మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాయి. గత సంవత్సరం 20,51,056 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించాయి. నిరుడు కంటె ఈ సంవత్సరం 14,84,924 మెట్రిక్‌ టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేయడం విశేషం. లెవీ కింద భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) 9,54,732 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించింది.
వరి గ్రేడ్‌ -ఎ రకం ధాన్యానికి రూ. 1110, సాధారణ రకం వరికి రూ. 1080 చెల్లిస్తున్నామని, మద్దతు ధర, ఇతర సమస్యలపై తమ ఫిర్యాదులను టోల్‌ ఫ్రీ నంబర్‌ 1804 252977 , 1804 250082 లను అందుబాటులో ఉంచారు. కొనుగోలు కేంద్రాలు పెంచాల్సిన అవసరం ఉందనుకుంటే వెంటనే ప్రారంభించేందుకు జాయింట్‌ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు అధికారాలను దఖలు చేసింది. ఇవేగాక చౌకధరల దుకాణాలను సరకులు నల్లబజారుకు తరలించకుండా తనిఖీలను కూడా పెంచింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు ఈ పథకాలను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

కోతలతో జనం విలవిల -'సకలం' కుదుపు...2011లో విద్యుత్‌ శాఖ

2011 సంవత్సరంలో రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థలు (డిస్కంలు) అలవికాని సమస్యలతో సతమతమ వుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఉద్యో గులు సెప్టెంబర్‌ 13, 2011 నాడు ప్రారంచిన సకల జనుల సమ్మెతో సింగరేణి కాలరీస్‌ కంపెనీ అతలాకుతలం అయ్యింది. దీంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్నాటక ప్రాంతాల థర్మల్‌ విద్యు త్‌ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా పూర్తిస్థాయిలో జరగక ఇబ్బందులకు గురయ్యా యి. దీనికి తోడు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలలో గుణాత్మక మార్పుల వలన విద్యుత్‌ డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. ఏకంగా ఆ డిమాండ్‌ 280 మిలియన్‌ యూనిట్లకు చేరడంతో ప్రజలు విలవిలలాడారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి జరగకపోవడంతో విద్యుత్‌ లోటు 50 మిలియన్‌ యూనిట్లు ఉంటూ వచ్చింది. ఈ లోటును సర్దుబాటుచేయలేక ప్రజలపై కోతలను అమలుచేశారు. రాష్ట్ర రాజ ధానిలో 2 నుండి 4 గంటలు, జిల్లా కేంద్రాల్లో 4 నుండి ఆరుగంటలు, మం డల కేంద్రాలు, మున్సిపాలిటీలలో ఆరు నుండి ఎనిమిది గంటల విద్యుత్‌ కోత లు విధించారు. అంతేకాకుండా పరిశ్రమలకు కూడా వారంలో మూడు రోజులు పవర్‌ హాలిడే ప్రకటించారు.
సమ్మె తరువాత మారని విద్యుత్‌ సరఫరా పరిస్థితి
తెలంగాణ ప్రాంతంలో చేపట్టిన సమ్మె 42 రోజుల తర్వాత ముగిసింది. ఆతర్వాతైనా విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాలో ఏ మాత్రం మార్పు రాలేదు. ముఖ్యంగా విద్యుత్‌ డిమాండ్‌ ఏమాత్రం తగ్గక పోవ డంతో పూర్తి సంకటంగా మారింది. కోతల విషయంలో కొంత మార్పు వస్తుందని ఆశించినప్పటికి వాతావర ణంలో అదేస్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతుండ టం తో విద్యుత్‌ కోతలు యధాతథంగా అమలు చేస్తున్నారు. విద్యుత్‌ లోటును బర్తీ చేసేందుకు బయటి నుండి రోజుకు 7 కోట్లు ఖర్చుచేసి విద్యుత్‌ కొనుగో లుచేశారు. సుమారుగా గత ఆరునెలలో రూ. 600 కోట్లను విద్యుత్‌ కొనుగోలుకు వెచ్చించారు.
కష్టకాలంలో చేయిచ్చిన జల విద్యుత్‌ ప్రాజెక్టులు
రాష్ట్రంలో విద్యుత్‌ కష్టాలు ప్రారంభంలోనే జలాశయాల్లో నీరులేక జల విద్యుత్‌ ప్రాజెక్టల్లో ఉత్పత్తి ఆగిపోయింది. ఇందులో ప్రధానంగా శ్రీశైలం, నాగార్జున సాగర్‌, సింగూరు జలవిద్యుత్‌ ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడం వలన ఉత్పత్తి స్తంభించింది. జల విద్యుత్‌ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యం 3,829 మెగా వాట్లు కాగా, ఇందులో ఉత్పత్తి 6 మిలియన్‌ యూనిట్లకు పడిపోంది. జల విద్యుత్‌ను 8 వేల మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 6 వేల ఎంయులు మాత్రమే ఉత్పత్తి జరిగినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేప థ్యంలో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా భారమంతా థర్మల్‌ విద్యుత్‌ సెక్టార్‌ పడింది. ఈ రంగంలో ఉత్పత్తి సామర్థ్యం 5093 మెగావాట్లు కాగా, ప్రాజెక్టు లోడ్‌ ఫ్యాక్టర్‌ (పిఎల్‌ఎఫ్‌)ను దాదాపు ఎపి జెన్కో 90 శాతానికిపైగా సాధిం చింది. అదేవిధంగా గ్యాస్‌ కూడా పూర్తి స్థాయిలో రాలేదు. 75 శాతం రావాల్సిన గ్యాస్‌ 55 శాతానికి పడిపోవడంతో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోయాయి. కొత్త సంవత్సరంలో కెటిపిఎస్‌ కొత్త గూడెం 500 మెగావాట్ల యూనిట్‌తో పాటు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 39 యూనిట్ల ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. ఎద్దుమైలారం వద్ద 400 కెవి సబ్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు సబ్‌ స్టేషన్‌ వ్యవస్థ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రజలపై 4,950 కోట్ల అదనపు భారం కోసం కసరత్తు
రాష్ట్రంలో విద్యుత్‌ కష్టాలు, కోతలు ప్రజలను పట్టిపీడిస్తుండగా మరో వైపు విద్యుత్‌ సంస్థలు ప్రజలపై అదనంగా 4,950 కోట్ల భారాన్ని మోపేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు డిసెంబర్‌ 26 నాడు రాష్ట్రం లోని నాలుగు డిస్కంలు విద్యుత్‌ చార్జీలను పెంచుకునేందుకు ఎపి ఈఆర్‌సిని అనుమతి కోరాయి. చార్జీల పెంపును సమాజంలోని అన్ని వర్గాల వారికి వర్తింపచేస్తూ, ప్రతిపాదనలను తయారు చేశాయి. ఇందులో వ్యవసాయం, చేతి వృత్తుల వారికి పెంపు నుండి మినహాయింపు నిచ్చాయి. సాధారణ వినియో గదారులు, వాణిజ్య వర్గాలు, పరిశ్రమలు ఇలా అన్ని వర్గాలపై పెద్ద ఎత్తున భారం మోపేందుకు సిద్ధపడ్డాయి.

విమల యశస్వి

దరిసె ప్రత్యూష
దరహాస పారిజాత
చైతన్య చకచ్చకిత
సమతా మమతల పీయూష
ధర్మగతి, గృహస్థవిధి, భగవదార్చన, స్వదేశ సేవన విలువలు తెలిసి అమలు చేసి చూపుతున్న మహిత మంగళ.
విలక్షణ ప్రసూన మాల, వినిర్మల
ప్రవిమల శ్రీమతి విమల.
భారతీయ మహిళ’ అనే పదానికి అర్థంగా, అద్దంగా నిలిచే ఆదర్శ వనిత రాష్ట్ర ప్రథమ మహిళ, గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ సతీమణి శ్రీమతి విమల. మూర్తీభవించిన మానవత్వం, స్ఫూర్తీభవించిన భారతీయం ఆమె సొంతం. శిక్షణకు, క్రమశిక్షణకు, విలువల పరిరక్షణకు నిలువెత్తు నిదర్శనం ఆమె. ఈ రాష్ట్రానికి తొలి మహిళననే దర్పం, దర్జా ఆమెలో మచ్చుకైనా కానరావు.
వివిధ రకాల సడి, సందడితో నగరం అర్ధరాత్రి వరకూ హడావిడి పడి భానుడి ఉదయ కిరణాలు ప్రసరించినా నగరం నిద్రపోతున్న వేళ గవర్నర్‌ దంపతుల పూజాదికాలు పూర్తి అయిపోతాయి. నగరం బద్ధకంగా ఒళ్లు విరుచుకునే వేళకు గవర్నర్‌ దంపతులు వారి వారి పనుల్లో ఉత్సాహంగా బిజీ అయిపోతారు. అంతకంటే ఆశ్చర్యం కలిగించే విషయం తొలిపొద్దు పొడిచేవేళ ఉషస్సు కాంతులు పూర్తిగా ప్రసరించకముందే రాజ్‌భవన్‌ అధికార నివాసంలో ముత్యాల ముగ్గులు పెట్టే మహిళ సాక్షాత్తూ ఈ రాష్ట్ర తొలిమహిళే అంటే ఆశ్చర్యం అనిపించవచ్చు. ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి దైనందిన కార్యక్రమాలు ప్రారంభిస్తారు గవర్నర్‌ దంపతులు. శ్రీమతి విమల నిత్యకార్యక్రమాల్లో స్వయంగా ముగ్గులు వేయడం, పూజాగదిని తానే అలంకరించడం ప్రధాన విధిగా భావిస్తారు. నిత్యం అధికార నివాసంలో పూజాది కార్యక్రమాలే కాక దంపతులు ఇద్దరూ రాజభవన్‌ వెనుక పంజాగుట్ట రోడ్డులో వున్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. లిబర్టీ రోడ్డులోని తిరుమల, తిరుపతి దేవస్థానం ఆలయాన్నీ తరచు దర్శిస్తారు.
శ్లోకాల్ని ఆశువుగా చెప్పే శ్రీమతి విమల అధ్యాపకురాలిగా ఢిల్లీలో పనిచేసేవారు. పాఠాలు చెప్పడంలో కూడా మంచి లెక్చరర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ఎప్పుడైనా చిరాకుపడినా, ఆగ్రహించినా చూడాలనిపించేది అంటారట ఆమెతో పాటు పనిచేసిన సహ అధ్యాపకులు. ఆమెవద్ద పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు. ప్రశాంత వదనం, చెదరని చిరునవ్వు ఆమెకు పెట్టని ఆభరణాలు. విమల అంటే నిర్మలమైనది అని అర్థం. ఆవిధంగా సార్ధక నామధేయురాలు అనిపించుకున్నారు ఆమె. భర్త గవర్నర్‌ కాకముందు పోలీసు శాఖలో అత్యున్నత అధికార బాధ్యతలు నిర్వహించడం వల్ల ఆమె లెక్చరర్‌ ఉద్యోగం మానేశారు. అయితే ఆయనతోపాటు ఎక్కడికి వెళ్లినా ఆయా చుట్టుపక్కల గ్రామాల పిల్లలకు పాఠాలు నేర్పడం వారిని ఈ సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అభిలషించడం ఆమెకున్న సామాజిక బాధ్యతకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా శ్రీ నరసింహన్‌ బాధ్యతలు స్వీకరించాక ఈ రాష్ట్రంలో స్థితిగతులు బాగుపడాలని రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని అభిలషిస్తూ పూజలు చేశారు. రాజ్‌భవన్‌లో “సుధర్మ’ అనే కార్యాలయం ప్రారంభించడానికి సొంత గృహప్రవేశం జరిగితే ఎలా పూజలు నిర్వహిస్తారో ఆ విధంగా దంపతులు ఇద్దరూ పీటలపై కూర్చుని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రసాదాల్ని సిబ్బంది అందరికీ పంచారు.
అయితే రాష్ట్రంలో గుళ్లు, గోపురాలు దర్శించడంపై కొందరు రాజకీయ నేతలు విమర్శించడంపై కించిత్‌ నొచ్చుకున్నా ధర్మభూమి, కర్మభూమి అయిన ఈ భారత భూమిలో మనుషులు నిమిత్తమాత్రులే భగవంతుడి అనుగ్రహమే ప్రధానం అనే విశ్వాసాన్ని కాదనలేం అంటారు. దసరా పండుగ నాడు పది రోజులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పసుపు కుంకుమలు అధికార కుటుంబాలకు, సన్నిహితులకు పంచిపెట్టారు విమల. పూజలు చేసిన అక్షతలు తీసుకొని దంపతులు ఇద్దరూ స్వయంగా రాజ్‌భవన్‌ ప్రాంగణం అంతా చల్లి “లోకాస్సమస్తా సుఖినోభవంతు’ అని ప్రార్థించారు.
విమలా -నరసింహన్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. ఇద్దరూ విదేశాల్లో (ఒకరు అమెరికా, ఒకరు ఆస్ట్రేలియా) వుంటున్నారు. ప్రస్తుతం ధనుర్మాసం సందర్భంగా ఇక్కడకు వచ్చారు. కొడుకులు, కోడళ్లు, అత్తమామలు, తల్లిదండ్రులు మాత్రమే కాక తాము ఈ రాష్ట్రానికి బాధ్యత వహిస్తుండడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలంతా మాకుటుంబ సభ్యులే అన్న వసుధైక కుటుంబ భావన పలుసందర్భాల్లో వ్యక్తీకరించారు. అందుకే దీపావళి, హోలీ, న్యూ ఇయర్‌, రంజాన్‌ వంటి పండుగల్ని కలిసి చేసుకోవడం సిబ్బందిలో ఒకరిగా కలసిపోయి హోలీ ఆడటం. రాజ్‌భవన్‌లో దీపావళి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరికీ బాణసంచా పంచడం వంటి కార్యక్రమాల్లో విమల చురుగ్గా పాల్గొంటారు. ఈరోజుకీ అత్తమామలకు, అమ్మానాన్నలకు స్వయంగా సేవలందించడం అవసరమైతే వారికి స్వయంగా వండిపెట్టడం, వంట సిబ్బంది సెలవు పెడితే తనే వంట చేయడం శ్రీమతి విమలకు అలవాటు. పెరటిలో పెంచిన కూరగాయలతోనే వంట. వాటి పోషణ స్వయంగా పర్యవేక్షిస్తారు. ఉగాది సమయంలో రాలిపడే వేపపువ్వు సేకరించి ఎండబెట్టి ఆ వేపపువ్వుతో పులుసు చేస్తారు శ్రీమతి విమల. ఒకవైపు భక్తి మరోవైపు సంస్కృతి అంటే ఆమెకు ఎంతో మక్కువ. తల్లి స్వయంగా సంగీత విద్వాంసురాలు. తీరిక వేళల్లో ఆమెతో కలసి సంగీత సాధన చేస్తుంటారు. తెలుగు మాట్లాడడం బాగానే వచ్చినా ఆ తెలుగులోని మాధుర్యం చవిచూడాలనే పట్టుదలతో తెలుగుపై లోతైన అభ్యాసం చేస్తున్నారు.
ఆభరణాలు, ఖరీదైన చీరలపై ఆమెకు మోజు లేదు. చేనేత చీరల్లో సింపుల్‌గా కనిపించడానికే ఇష్టపడతారు. అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ని అనుసరించి పాల్గొనే ఆమె అధికార వ్యవహారాల్లో మచ్చుకైనా ఆమె జోక్యం కనిపించదు. తల్లిగా, సహధర్మ చారిణి, కోడలిగా కూతురుగా, అధ్యాపకురాలిగా, ఈ సమాజం పట్ల బాధ్యత గుర్తెరిగిన మహిళగా ఎలా ఉండాలి అనడానికి నిలువెత్తు నిదర్శనం శ్రీమతి విమలా నరసింహన్‌. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రభ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది!
ఆదర్శదంపతులు
మ్యారెజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌’ అన్న మాటలు కొందరిని చూస్తే అక్షర సత్యాలనిపిస్తాయి. ఎక్కాడు శ్రీనివాసన్‌ లక్ష్మీ నరసింహన్‌ (ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌)కు అన్నివిధాలా జోడు విమలానరసింహన్‌. సర్వావస్థల్లో చేదోడువాదోడుగా వుంటూ సహధర్మ చారిణి అనే పదాన్ని సార్థకం చేశారు. శ్రీ నరసింహన్‌ దేశంలోనే అత్యంత గౌరవంగల ఐపిఎస్‌ అధికారిగా పేరు తెచ్చుకోవడానికి ఆమె మద్దతు ఎంతైనా ఉందనేది నిర్వివాదాంశం. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌గా నరసింహన్‌ బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఆయన ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. సుమారు 3 సంవత్సరాల తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించారు.
1968వ ఐపిఎస్‌ బ్యాచ్‌కి చెందిన నరసింహన్‌ 1946లో తమిళనాడులో జన్మించారు. చెన్నైలోని మద్రాస్‌ యూనివర్సిటీ నుండి ఫిజిక్స్‌లో పట్టా పొందిన ఆయన రాజకీయ శాస్త్రం, న్యాయశాస్త్రాలలో పోస్టుగ్రాడ్యుయేట్‌ డిగ్రీ కూడా చెన్నైలోనే పూర్తి చేశారు. దేశ రాజధానిలోని నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీలో చదువు పూర్తి చేసిన తర్వాత ఆయన ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌లో చేరారు.
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అనేక సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. అప్పటి వరకూ రాజ్‌భవన్‌ అంటే కేవలం కొందరు రాజకీయ నాయకులు, సీనియర్‌ అధికారులు మాత్రమే అడుగుపెట్టగలిగే ప్రదేశమనే భావనను తుడిపేస్తూ రాజ్‌భవన్‌ గేట్లు సామాన్య మానవునికి కూడా తెరుచుకుంటాయని రుజువు చేసిన ఘనత నరసింహన్‌ది. ఒకదశలో ఈ విషయంపై రాజకీయ వర్గాలలో కొంత అసంతృప్తి వచ్చినప్పటికీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుండా సామాన్య మానవుడు కూడా రాజ్‌భవన్‌లోకి వచ్చి తన గోడు వినిపించుకోవచ్చునని రాష్ట్రం మొత్తానికి తెలియజేశారు నరసింహన్‌. అలాంటి సంచలన వ్యక్తికి సహధర్మ చారిణిగా, ఫస్ట్‌ లేడీ గవర్నర్‌గా తన బాధ్యతలు నిర్వహించడంలో, సామాజిక సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మ భావనలు పెంపొందించడంలో, సాంస్కృతిక పరిమళాలు వెదజల్లడంలో, మహిళల్లో చైతన్యానికి తనవంతు కృషి చేయడంలో శ్రీమతి విమలా నరసింహన్‌ తనదైన ప్రత్యేకత చాటుకొన్నారు.

మూడ్‌ మారుతోందా?

మనిషి జీవన విధానంలో రోజు రోజుకీ చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆతనిపై తీవ్ర ప్రభావం చూపుతూ... మానసికంగా... శారీరకంగా ఇబ్బందులపాలు చేస్తున్నాయన్నది వాస్తవం. దీనికి తోడు ఉదయం లేచింది మొదలు
రాత్రి నిద్ర పోయే వరకు యాంత్రిక జీవనం అయిపోతుండటంతో చిన్న చిన్న విషయాలలోనూ ఇప్పటికి మూడ్‌లేదు.. తరువాత చూద్దాం అన్న ధోరణి చాలామందిలో పెరిగిపోయిందన్నది వాస్తవం. దీంతో ఆదివారాలు, సెలవు రోజుల్లో
కూడా ఆనందంగా గడపడమే గగనమైపోయింది. పైగా పనులన్నీ వాయిదా పడుతున్నాయన్న ఆలోచనలో ఉంటే..
మీ మూడ్‌ మార్చుకుని క్షణాల్లో తిరిగి యధాస్ధితిని పొందేందుకునేందుకు ఈ మార్గాలు ఉపయుక్తంగా ఉంటాయి.
మూడ్‌ సరిగా లేదంటూ... నిత్య జీవితంలో మనం ఎన్నో కార్యక్రమాలని పక్కకు పెడుతుంటాం. ఇవన్నీ కొండలా పేరుకు పోతుండటంతో ఆపై చేయాల్సిన వాటిని చూసి నీరసం... ప్రశ్నించే వారిపైనే కాదు చివరికి ఇంట్లో వాళ్లపైనా చికాకు ప్రదర్శించి ముక్కోపిగా బ్రాండ్‌ వేయించుకోవటం ఇవన్నీ అవసరమా అని మిమ్మల్ని మీరు ఓ సారి ప్రశ్నించుకుని చూడండి. ఆనందం పొందాలనుకుని తాత్కాలిక సుఖాల వైపు పరుగులు తీస్తే మీకు మిగిలేది వాటితో కలిగే రుగ్మతలే అని గుర్తుంచుకోండి.
మనిషిలో ఆంతరంగిక శాంతి చేకూరకపోవటం వల్ల మనసు పరి పరి విధాలుగా మారుతూ... మీ ఆలోచనల్ని మార్చేస్తుంటుంది. దీంతో మూడ్‌ లేదన్న పదం
మీ నోట పుట్టుకొస్తుంది. ఇలాంటి స్ధితిని బాగా అధ్యయనం చేసిన నిపుణులు
దీనిని సరిచేసేందుకు తాత్కాలిక ఉపశమనాల కన్నా మిన్న
అయిన ఆచరించ తగ్గ మార్గాలను సూచించారు.
మరెందుకాలస్యం మీ మూడ్‌ సరిచేసుకోండిక..
మరికెందుకు మీ మూడ్‌ ఎపðడు మారిపోయినా అనవసరంగా
కోపం పెంచుకుంటూ... ఎదుటివారిని తిట్టుకుంటూ...
నా పని పాడు చేసారని ఇష్టానుసారం ప్రవర్తించేకన్నా...
ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి చూడండి.
ఖచ్చితంగా మీ మనసుకు ఆనందాన్ని ఇచ్చి తీరుతాయి.
ఓ సారి ప్రయత్నిస్తే పోయిందేం లేదు...
ఫలితం ఎంత ఆనందంగా ఉంటుందో
ప్రయత్నించి చూడండి
సంగీతం
మనిషి ఆందోళనలో ఉన్నపðడు కూనిరాగం తీసినా ఆందోళన స్ధాయి ఇట్టే తగ్గిపోతుందని బ్రిటన్‌కి చెందిన 'సైకాలజీ, సైకోథెరపి' పత్రిక ప్రకటిం చింది. అంటే సంగీతానికి అంతటి మహత్తరశక్తి ఉంద న్న మాటేగా.. మీ మూడ్‌ బాగా లేదని ఒంటరిగా కూర్చొన్నారనుకోం డి. మీకు నచ్చిన పాటని అందుకోండి. అది శాస్త్రీయమైనా, జానపదమైనా, సినిమా పాటైనా ఒక్కోసారి మీరు పాడే పాట దాని ఒరిజినల్‌తో జత చేర్చి పోల్చుకు చూసుకోండి...బాగుంటే ఆ ఆనందం సరేసరి... బాగులేకున్నా.. నవ్వులు కురిపించి మీలో తాజా తనాన్ని ఇస్తుంది. అలాగే నా గార్ధభ స్వరానికి పాటలు కూడానా.. అంతా పారిపోరూ అనుకునే వాళ్లు కాసేపు సంగీతాన్ని వినండి. మధురమైన సంగీ తం మానసిక వత్తిళ్లని తొలగిస్తుందని ఇప్పటికే పలు పరిశోదనల్లో వెల్లడైం ది కూడా. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఓ అరగంటపాటు శాస్త్రీయ సంగీతాన్ని వింటే 'వాలియం' అనే మందు సమకూరి ప్రశాంతత చేకూరుతోందని నిపుణులు చెప్తున్నారంటే సంగీతం ప్రభావం మనసుపై ఎంతలా పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు...
నవ్వు
మీరు భీకరమైన వత్తిడిలో ఉంటే... మనసారా నవ్వుతూ ఉండండి... అంతకు మించిన ఔషధం లేదని ఇప్పటికే ఎందరో చెప్పారు. నవ్వటం వల్ల శరీరంలో రసాయనిక ప్రక్రియల్లో మార్పు జరిగి సంతోషాన్ని ఎక్కువ చేస్తుందని పరిశోధనల్లో తేలింది కూడా. నవ్వు రోగనిరోధక శక్తిని పెంచి వత్తిడిని తగ్గిస్తుంది. గుండె పోటు తదితరాలున్నా సరే మనసుపై ప్రభావం చూపి ముఖ కండరాలని వదులు చేసి ఏదో తెలియని ప్రశాంతతని చేకూరుస్తుంది. కనుక హాస్యరసం ఉండే సినిమాలు, చిత్రా లు, కార్టూన్లు చూసి మనసారా నవ్వుకోండి. సంతోషంగా ఉన్నామన్న భావన కూడా మీపై వత్తిళ్లని తగ్గించేసి మూడ్‌ మార్చేస్తుంది. ఏదో గుర్తు తెచ్చుకుని అయినా మనసు ఆనందంగా ఉంచుకుంటే... అది ముఖం పై ఉండే కండరాలపై ప్రభావం చూపి మిమ్మల్ని నవ్వేట్లు చేస్తుంది. ఈ నవ్వు మీరు సంతోషంగా ఉన్నారన్న సంకేతాల్ని మెదడుకి పంపడంతో మీ మూడ్‌లో మార్పు ఇట్టే వచ్చేస్తుంది.
వ్యాయామం
వ్యాయామం, శరీరానికే కాదు మనసుకీ ప్రశాంతత చేకూర్చే సాధనం. ఎక్కువ వత్తిడికి లోనైతే వేగంగా నడవటం, యోగా చేయటం చేస్తే వత్తిడి తగ్గుతుంది. ఆఫీస్‌లో గంటల కొద్దీ కూర్చోవటం వల్ల కూడా పని ప్రభావం మీ మనసుపై పడి మూడ్‌ని మార్చేస్తుంది. ఇలాం టపðడు చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు పోయిన మూడ్‌ని తిరిగి రప్పిస్తాయి. పని వత్తిడిలో ఉన్నామని బాధ పడిపోతూ ఉంటే.. ఓ పది నిమిషాలు దానిని ఆపి అటూ ఇటు నడవండి. డైనింగ్‌ హాల్‌, విశ్రాంతి గదులు ఉంటే... అందులోకి వెళ్లి నిటారుగా నిలబడి, అర చేతులు వెనక్కి ఆనించి ముందుకు వంగి గట్టిగా ఊపిరి తీసుకుని వదలండి. అలాగే వెూకాళ్లపై నిటారుగా నించొని, వెనక వైపున్న కాలి బొటనవేళ్లని చేతితో పట్టుకుని ఊపిరి బాగా తీసుకుని ముందుకు వంగి.. తదుపరి ఊపిరి వదులుతూ వెనక్కి వచ్చి యధాస్ధానానికి రండి. ఇక ఒంటి కాలిపై నిలబడి దాని వెూకాలుపై రెండో పాదాన్ని ఉంచి రెండు చేతులూ పైకి లేపి నమస్కరిస్తూ ఊపిరి గట్టిగా తీసి వదలండి.
కండరాలు బిగుసుకు పోవటం వల్ల కూడా మీలో కోపం, మూడ్‌ మారిపోవటం జరుగుతాయి. అపðడు రెండు భుజాలను చేతుల సాయంతో గ్టిగా వత్తుతూ దగ్గరకు చేసేలా చేస్తే బిగువతనం వీడి నూతన ఉత్సాహం కలిగించేలా మారిపోతాయి కండరాలు.
ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలు మూడ్‌ లేనపðడల్లా పదిసార్లుకి తక్కువ కాకుండా చేేసుకుంటే క్షణాల్లో మీ మూడ్‌ మీ దరికి వచ్చి చేరు తుంది.
శ్వాస
తీవ్ర వత్తిడి ఎదుర్కొంటూ... పని మీద శ్రద్ద వహించలేక పోతున్నట్లు గమనిస్తే వెంటనే గుండె నిండా గాలి పీల్చుకుని శ్వాసని విడిచిపెట్టండి. ఇది గుండె వేగాన్ని తగ్గించి ప్రశాంతతకు కారణమవు తుంది.
పూర్తి ఏకాగ్రతతో మీరు పీల్చిన గాలి మీ మనసుని, శరీరం మొత్తాన్ని నింపేసినట్లు ఊహించు కుని చేస్తే... అది ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపి ఆందోళనని తగ్గిస్తుం ది. ఇలా ఓ పదిసార్లు చేయండి. మీరు తాజాగా ఉంటారు.
కానీ ఏదో చేయమన్నారుగా అని పైపైన శ్వాస తీసుకుని వదిలేస్తే...అది గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి మరింత వత్తిడిని పెంచేస్తుంది జాగ్రత్త. ఇలా చేయటం వల్ల ఆందోళన మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కూడా...
రాయటం
కొన్ని ఘటనలు, ఎదురైన మనుషులు వారి కారణంగా మనసుకు ఇబ్బంది కలిగి మూడ్‌ మారిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో కోపం, విసు గు, బాధ అన్నీ ఒకదాని తరువాత ఒకటి తరుముకు వచ్చేస్తాయి. దీంతో మీ పరిస్ధితి ఇబ్బందికరంగా మారిపోతుంది. ఇలాంటపðడు మీ మానసిక పరిస్ధితి సరిచేసుకునేందుకు ప్రయత్నించాలి మినహా కోపం పెంచుకుంటూ పోతే మానసిక ఆందోళన, ఇతర రుగ్మతలకు దారి తీసే అవకాశం ఉంది. మీ మనుసులోని భావాలు, ఘటన వెనుక కారణాలు, మీ పాత్ర ఇలా ప్రతి ఒక్కదాన్ని మీకు ఆప్తులైన వారితో పంచు కోండి. అదీ వీలు కాదనుకుంటే.. కాగితంపై క్షుణ్ణంగా రాసి అందించండి. దీంతో మీ మనసులో ఉద్రిక్తత తగ్గుతుంది. వీలైతే. మీ కోపానికి కారకులైన వారికే ఆ రాసిన దాన్ని ఇచ్చి చదవమనండి. మీరు బాధపడటం, కోపానికి కారణాలు తెలుసుకోగలు గుతారు. దీంతో పరస్పర అవగాహన కలగటమే కాకుండా సంతృప్తి కలిగి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. మీరు ఉల్లాసంగా ఉన్నప్పటికంటే మీ మూడ్‌ బాగా లేనపðడే పొరుగువారి సాయం కావాల్సి వస్తుంది. మనసు బాగా లేనపðడు మీ ఆప్తుల్ని ఇంటికి పిలి పించుకోవటవెూ.. మీరే వెళ్లడవెూ చేసి వారితో మీ బాధల్ని పంచుకోండి.
ఆహరం
ఆకలి కూడా మీ మూడ్‌ని పాడ్‌ చేస్తుంది. ఆహారం మనసుని సానుకూల దృక్పధం వైపు నడిపిస్తుం ది. అందుకే ఉదయాన్నే టిఫిన్‌ చేయటానికి సమయం లేదని పరుగులు తీయాల్సి వస్తే... వేరు సెనగ గుళ్లు, ఉడికించిన జొన్నలు, డ్రై ఫ్రూట్స్‌ తదితరాలువెంట తీసుకెళ్లి తింటే శక్తి అందించ డమే కాకుండా మీ మూడ్‌ని పాడ్‌ చేయకుండా చేస్తాయి. అలాగే చాక్లెట్లు, కూల్‌ డ్రింకులు, ఐస్‌ క్రీమ్‌లుసైతం మనసుపై ప్రభా వం చూపించి ప్రశాంతత ఇస్తాయి. ఆహారం శక్తికోసమే కాదు... మీ మనసు పరిభాషని, మీ మానసిక స్ధితిని తెలుసు కునేం దుకు ఉపకరిస్తుంది. అందువల్ల ఊర్లు వెళ్లినా...ఆరోగ్యం కాపాడుకునేలా చూసుకుంటూనే మనసుకు నచ్చిన ఆహారాన్ని తీసుకెళ్లండి. చిన్నపిల్లల్లోనూ మూడ్‌ పదే పదే మారి పోతుంటుంది. అందుకే చిన్నపðడు చాక్లెట్లు, బిస్కట్లు, కేకులు అంటూ ఎరచూపి వారి మూడ్‌ని మార్చేవారు. ఇదే సూత్రం ఇక్కడ మీకూ వర్తిస్తుంది.