ప్రముఖ సినీనటుడు నాగార్జునతో సహా పలువురు వి.ఐ.సిలు తృటిలో విమాన ప్రమాదం నుంచి బయటప ద్దారు. ఉదయం ఏడు గంటలకు బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం . శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరుతున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన సంగతిని గుర్తించిన విమాన పైలట్ వంటనే విమానాన్ని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా విమానంలో కూర్చుని తలుపులు మూసి వేసిన తర్వాత ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ముప్పు తప్పిందని విమానాశ్రయ వర్గాలు చెపుతున్నాయి .