1, డిసెంబర్ 2011, గురువారం

మేడలే వ్యవసాయ క్షేత్రాలుగా..

నగరాలలో రాను రాను సేంద్రీయ పదార్థాలపై అవగాహన పెరుగుతుంది.
అందుకే పలుచోట్ల పురుగుమందులు, రసాయనిక ఎరువులు వేయని
ఆహార పదార్థాల వినియోగంపై మక్కువ చూపుతున్నారు.
దీని కారణంగా 'ఆర్గానిక' దుకాణాలు జోరందుకుంటున్నాయి.
ముఖ్యంగా దంపుడు బియ్యం, బెల్లం, చోళ్లు, రాగులు, మొలకెత్తు విత్తనాలు,
సజ్జలను ఖరీదు చేస్తున్నారు. ఉదయాన్నే నడక చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
పట్టణాలలో బాల్కనీలు, డాబాలపై ఆకు కూరలు, పళ్లమొక్కలను వేస్తు న్నారు. మంబై, హైదరాబాద్‌ ,ఢిల్లీ, కోల్‌కత్తా ఇలా దేశంలోని అనేక ప్రధాన నగరాలలో ఈ తరహాలో మెక్కలని పెంచుతూ... స్వచ్చమైన గాలిని పీల్చే అవకాశాన్ని పొందటమే కాకుండా... కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోతున్న నగరాలల్లో కాలుష్య నివారణకి తమవంతు సాయపడు తునే.. అనేక తాజా కూరగాయలు, పళ్ల రుచిని ఆస్వాది స్తున్న వారు చాలానే ఉన్నారు.
ముంబైలో...
ముంబైలోని భారతీవెూట్వానీ కాకరకాయ, టొమేటో, పుచ్చకాయ మొక్కలను ముంబైలో తమ నివాసంలో వేశారు. పచ్చి మిరపకాయలు, వంకాయలు, బెండకాయలు అధికంగా కాస్తే ఇరుగు పొరుగుకి కూడా యిస్తున్నారు. ఇంటి ఆవరణలో కాసిన పుచ్చకాయలను చూసి మురిసి పోతున్నారు. ప్రీతీ పాటిల్‌ పచ్చిమిరప, పుదీనా, పాలక, పసుపు, అల్లం, లెమన్‌ గడ్డిని వేశారు. అంతేకాక మామిడి, సీతాఫలం, జామ, అరటి మొక్కలు కూడా వున్నాయి. జ్యోతి తన యింటిలో కాసిన 15 దోసకాయలను చూసి తెగ మురిసిపోతుంది. బొప్పాయి చెట్లు నోరూరి స్తున్నాయి. జ్యోతి పవస, ములగ, మొక్కలే కాక ప్యాషన్‌ ఫ్లవర్‌, పారిజాత, గులాబీ యిలా పలు రకాల మొక్కలను వేసింది. ఇంటిలో ఏ మాత్రం జాగా వున్నా మొక్కలను వేస్తున్నారు. 'ప్రయోగ్‌ పరివార్‌' సంస్థ సేంద్రీయ వ్యవసాయాన్ని ముంబైలో ప్రోత్సహిస్తుంది. శ్రీపాద్‌ దభోల్కర్‌ నాట్కూ ఎకో ఫార్మింగ్‌పై అవగాహన కలుగజేస్తున్నారు.
అరుణ్‌షౌరీ, ఎమ్‌పి కొలాహపూర్‌లోని దభోల్కర్‌ యింటికి వెళ్లి మొక్క జొన్న మొక్కలు, చెరకు మొక్కలను కుండీలలో చూసి ఆశ్చర్య పోయా రు. వారింట్లోని సుబాబుల్‌ చెట్టు రెండస్తు లకు ఎదిగింది. దభోల్కర్‌ పలుచోట్ల ద్రాక్ష తోటలను వేయటానికి ప్రోత్సహించి అంద రినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా దాక్ష కరవు ప్రాంతాలలో పనికి రాదనే వాదన ను తిరగవ్రాశారు. నేడు దబోల్కర్‌ ప్రోత్సా హంతో ఎకరానికి 16 టన్నులను పండిం చడం చూసి అరుణ్‌షౌరి కరవుకు సమా ధానం దభోల్కర్‌ వంటి రైతులన్నారు. వీరి స్ఫూర్తిని చెన్నై వాసులు కూడా పొందు చున్నారు.
ముంబైలో 'విద్యావారిధి ట్రస్ట్‌' తరఫున 'అర్బన్‌ లీవ్స్‌' సంస్థ ప్రీతి పాటిల్‌ ఆధ్వర్యంలో రూఫ్‌ గార్డెన్లపై మొక్కల పెంపకాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ముందుగా సెంట్రల్‌ పోర్ట్‌ట్రస్ట్‌ భవనంలో ఈ పనిని ప్రారంభించారు. అక్కడ 3,000 చదరపు గజాల రూఫ్‌టాప్‌ గార్డెన్‌ను పెంచుతున్నారు. 150 మొక్కలకు రీసైకిల్‌ చేసిన వ్యర్థ పదార్థాలను వాడుచున్నారు. దభోల్కర్‌ ఏమంటారంటే 10 గుం తల (10,000 చదరపు అడుగులు) విస్తీర్ణంలో రెండు ఆవులు, మొక్క లతో ఐదుగురు కుటుంబ సభ్యులకు పోషణ లభిస్తుంది. ముంబైలోని చిన్న ఫ్లాట్స్‌లో కూడా నిత్యావసరాలకు ఆకుకూరలు, కూరగాయలను, పళ్లను పండించుకుంటున్నారు. ప్రీతిని తల్లిదండ్రులు 'యింత చిన్న ఫ్లాట్‌'లో నువ్వేం పండిస్తావని ఎద్దేవా చేశారు. నేడు బాల్కనీలో దోస కాయలు, వంకాయలు, కొత్తిమీర, టొమేటో,పచ్చి మిరపను కాయిస్తుం ది. నగరాలలో తక్కువస్థలంలో కూరలు ఎలా పండించాలనే దానిపై మెకేల్‌ లెవెన్‌స్టన్‌ షషష. షఱ్‌ా టశీతీ ఎవఅ. ఱఅటశీ పేరున చక్కటి అవ గాహనను కలుగ జేస్తున్నారు.
ఈ మధ్య అమృత్‌మిట్టి, కంపోస్టింగ్‌, డ్రిప్‌, స్ప్రింకిల్‌ ఇరిగేషన్‌ నగరా లలో ప్రాచుర్యం పొందుతున్నాయి. ముంబై మహానగరంలోనే 4,000 టన్నుల చెత్త రోజూ పేరుకుంటుంది. ఈ చెత్తను ఎరువుగా మార్చేం దుకు కొందరు ముందుకు వస్తున్నారు.
నేడు ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలలో 40 శాతం ప్రజలు స్వయంగానే ఆహార పదార్థాలను పండించుకుంటున్నారు. రష్యా, చైనాలలో కూడా ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా క్యూబా సేంద్రీయ వ్యవసాయం ద్వారా స్వయంగా ఆహార పదార్థాలను పండించడంలో ముందంజలో వుంది. హవాయిలో ఏ మాత్రం ఖాళీస్థలం వున్నా చక్కా సేద్యం ప్రారంభిస్తున్నారు. ఔషధ మొక్కలను కూడా వేస్తున్నారు.
ముంబైలో పదవీవిరమణ చేసిన వారు, గృహిణులు, యువతీ, యువకులు మహీం నేచర్‌పార్క్‌, నానీనానీ పార్క్‌లో అనేక రకాల కూరగాయాల మొక్కల ను, పూలమొక్కలను పెంచుతున్నారు. ఖాళీ సమయాల్లో యిక్క డ పలువురు సేద్యం చేయ డం కానవ స్తుంది. 'అర్బన్‌ లీవ్స్‌' సంస్థ వర్క్‌షాపుల ద్వారా వాలెంటీర్ల సంఖ్యను పెంచుతుంది. నామ మాత్రం ఫీజుతో వారు ఎంతోమందికి బాల్కనీ, రూఫ్‌ గార్డెన్లపై వ్యవసా యా న్ని ప్రోత్సహిస్తున్నారు.
బాల్కనీ వ్యవసాయంకి సంబం ధించి విషయాలు తెలుసుకోవాల నుకుంటే ఈ క్రింది వెబ్‌సైట్లలో చూడొచ్చు.
షషష. బతీశిశఅ శ్రీవశఙవర ఱఅ ఱఅసఱశ.షశీఎ
షషష. జూతీశాశీస్త్రజూశతీఱఙశతీ.అవ్‌
3. షషష. షశ్‌వతీరఎశత్‌ీజూశ్‌ీ.షశీఎ
సంస్థలు/ వ్యక్తులు
మరాఠీ విద్యాన్‌ పరిషత్‌ - 022- 5224714
డా.బి.ఎన్‌.విశ్వనాథ్‌, బెంగళూరు 28485717
ఆంధ్రప్రదేశ్‌లో
సేంద్రీయ వ్యవసాయం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఊపందుకుంటుంది. రామ్‌దేవ్‌బాబా, మంతెన సత్యనారాయణరాజు తదితర యోగా చార్యు ల స్ఫూర్తి, కారణాన దంపుడు బియ్యం, సేంద్రీయ వ్యవసాయం ఆహార పదార్థాల కొనుగోళ్లు పెరిగాయి. హైదరాబాద్‌లో నర్సాపూర్‌ వద్ద నాగార్జున సిమెంట్‌ గ్రూప్‌ అధినేత కలిదిండి రామచంద్రరాజు సేంద్రీ య వ్యవసాయానికి నాంది పలికారు. వారు వ్యవసాయ క్షేత్రంలోనే మకాం వుంటూ రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా సేద్యం చేశారు. వారి పొలంలో పండిన వరిని సొంత ఉప యోగానికే కాకుండా, ఉద్యోగులకు, సేంద్రీయ వ్యవసాయ ప్రేమికులకు యిచ్చేవారు.
ఓ సారి విదేశీయుడు మొత్తం పంటను కొనుగోలు చేస్తానంటే, అమ్మకానికి

విముఖత వ్యక్తంచేశారు.వారి తోట లోని చెరకు ద్వారా లభిం చిన బెల్లంఎంతో రుచిక రంగా వుండేది.తోట లోని పళ్లను కూడా ఉచిత గా పంచేవారు. వారి వ్యవసా య క్షేత్రం వద్ద ఫార్మ్‌హౌస్‌ చూడముచ్చటగా వుంటే బాపు, రమణలు వారి చిత్రాల ను యిక్కడే షఉటింగ్‌ చేసు కునే వారు.
హైదరాబాద్‌లోని ఆర్గానిక స్టోర్స్‌, నేచురల్‌ సంస్థలలో విక్రయా లు ఊపందుకుంటున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తేతలివాసి భూపతిరాజు రామకృష్ణం రాజు, జస్టిస్‌. పర్వతరావు గారి వ్యవ సాయ క్షేత్రంలో చాలా కాలంగా సేంద్రీ య వ్యవసాయాన్ని చేస్తున్నారు. వీరి దంపుడు బియ్యానికి విశేష ప్రజాదరణ వుంది.
చెన్నైలోని రామకృష్ణ మిషన్‌, విద్యా సంస్థలు వీరివద్దనే బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. వీరు దేశవాళీ గోవులతో గోశాలను సమర్థవంతంగా నిర్వహిస్తు న్నారు. పంచగవ్యను వ్యవసాయానికి వినియోగిస్తున్నారు.
బెంగళూరులోని ఇస్కాన్‌ సంస్థ (హరేకృష్ణ) సేంద్రీయ వ్యవసాయాన్ని మైసూర్‌ సమీపంలో నిర్వహిస్తున్నారు. వీరి సేంద్రీయ ఆహార పదార్థాలకు గిరాకీ వుంది. హైదరాబాద్‌ సమీపంలో పలు క్షేత్రాల్లో ఈ మధ్య 'ఆర్గానిక ఫార్మింగ్‌'ని చేపట్టారు. నేడు పలు సూపర్‌ బజార్లు కూడా సేంద్రీయ ఆహార పదార్థాలను కొనడానికి ముందుకు వస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి, కానీ కీడు చేయవు. రుచికి రుచి వుంటాయి.
రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం కారణాన పండ ిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికే చేటు చేస్తున్నాయి. తల్లిపాలు కూడా శక్తిని కోల్పోతున్నట్లు కొన్ని నివేదికలు తెలుపు తున్నాయి. కొన్ని విదేశాలు కూడా ఆర్గానిక దిగుమతులకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

తోటల పెంపకంపై సెమినార్‌
నగరాలలో కాయగూరలు, పూలతోటలు, పళ్ల తోటల పెంపకంపై ముంబైలో డిసెంబర్‌ 10-12వ తేదీ వరకు సెమినార్‌ను నిర్వహిస్తున్నారు. అర్బన్‌ సంస్థ సారవంతమైన మట్టిని ఎలా తయారు చేయాలనే అంశంపై తెలియజేస్తుంది. దేశంలోని ప్రముఖ సేంద్రీయ నిపుణులు తమ అనుభవాలను తెలియజేస్తారు.
ఈ సెమినార్‌ ఔషధ మొక్కల గూర్చి, ఆరోగ్య పరిరక్షణ గూర్చి ప్రముఖులు మాట్లాడెదరు. మహారాష్ట్ర నేచర్‌ పార్క్‌, మహీం, ముంబైలో ఈ సదస్సు జరుగుతుంది.
టెర్రేస్‌ గార్డెనింగ్‌
బెంగళూరులోని డా్ప్ప బి.ఎన్‌. విశ్వనాథ్‌ టెర్రేస్‌ గార్డెనింగ్‌పై ఓ హ్యాండ్‌బుక ప్రచురించారు. 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిలోనే చెత్త, చెదారం నుండి ఎరువుని చేసి వేస్తు.. 10 కిలోల సేంద్రీయ కూరగాయాలను వారం రోజులలో పండించ వచ్చని నిరూపించారీయన
రోజూ ఓ గంట 'గార్డెనింగ్‌' చేస్తే కుటుంబానికి పోషణ లభించడమే కాకుండా మంచి ఆరోగ్యం కూడా దొరుకుతుందని ఈయన తన వెబ్‌సైట్లు, యూట్యూబ్‌లలో చేస్తున్న ప్రచారం బహుళ ప్రజాదరణ పొందాయి.

- దండు కృష్ణవర్మ

సాహితీ జగత్తులో ధృవతార గురజాడ




అభ్యుదయ సాహిత్యాన్ని సృజించి, తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకున్న మహోన్నతుడు ఆయన. 19వ శతాబ్దిలో అప్పటి సామాజిక స్థితిగతులను అవగతం చేసుకుని దార్శినిక దృక్పథంతో రచనలు సాగించిన అతి కొద్దిమందిలో ఆయనది సమున్నత స్థానం. సాహిత్యమనేది సామాజిక అభ్యున్నతికి, సంఘ సంస్కరణకు దోహదపడాలన్న ఉదాత్త ఆశయం ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సామాజిక దురాగతాలపై పోరాటమే సాహిత్యం లక్ష్యమని ప్రగాఢంగా విశ్వసించిన ఆయనే నవయుగ వైతాళికుడు, అభ్యుదయ సాహిత్య సృష్టికర్త గురజాడ వెంకట అప్పారావు.
తెలుగుసాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీవేత్తల్లో గురజాడ అగ్రగణ్యులు. ఆయన హేతువాది. 19వ శతాబ్దిలోనూ, 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ సాహితీప్రియుల మన్ననలు పొందుతూనే ఉన్నాయి.
వారాలబ్బాయి నుంచి బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ సభ్యుని దాకా..
వ్యావహారిక భాషలో రచనలు చేయటం తప్పుగానూ, చేతగాని తనం గానూ భావించే ఆ రోజుల్లో ప్రజలందరికీ అర్థమయ్యే జీవభాషలో రచనలు చేసిన గురజాడ వెంకట అప్పారావు విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో మేనమామ ఇంట 1862 సెప్టెంబరు 21న జన్మించారు. ఆయన కుటంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాల (గురజాడ) నుంచి విశాఖ తరలి వచ్చింది. అప్పారావు తండ్రి వెంకటరామదాసు. తల్లి కౌసల్యమ్మ. ఇద్దరు కుమారుల్ల వెంకట అప్పారావు మొదటి కొడుకు. రెండో కొడుకు శ్యామలరావు. వెంకట రామదాసు విద్యావంతుడు. సంస్కృత భాషా భినివేశం గలవారు. ఆయన విజయనగరం సంస్థానంలో పేష్కారు (రెవెన్యూసూపర్‌ వైజర్‌) గా, ఖిలేదార్‌గా పని చేసేవారు.
ఒకరోజు విజయనగరం సమీపంలోని ఊడగెట్ట దాటు తుండగా ప్రమాదవ శాత్తూ మునిగి చనిపోయారు. వెంకట రామదాసు చీపురుపల్లిలో పని చేసే రోజుల్లో వెంకట అప్పారావు ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే జరిగింది. తండ్రి మరణానంతరం విజనగరం వచ్చేసిన ఆయన మిగిలిన విద్యాభ్యాసాన్ని విజయనగరంలోనే పూర్తి చేశారు. ఆయన విద్యాభ్యాసం ఒడిదుడుకుల మధ్యే సాగింది.
తండ్రి లేడు. ఆదాయం వచ్చే మార్గం లేదు. ఇంట్లో పేదరికం తాండవిస్తోంది. పూటగడవటమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఎవరు చదివిస్తారు? అయినా చదువుకోవాలన్న పట్టుదల గురజాడలో ఎక్కు వైంది. ఆ ఇంటా ఈ ఇంటా వారాలు చేసుకుంటూ చదువు కొనసాగిం చారు. అదే సమయంలో ఎం.ఆర్‌. కళాశాల ప్రిన్సిపాల్‌ సి.చంద్రశేఖర శాస్త్రి గురజాడను ఆదుకున్నారు. ఉచితంగా వసతి, భోజన సదుపా యాలు కల్పించారు. ఆయన సంరక్షణలోనే గురజాడ 1882లో మెట్రిక్యులేషన్‌, 1884లో ఎఫ్‌ఎ పూర్తి చేశారు. తరవాత మహారాజా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. అప్పుడు ఆయన నెల జీతం రూ.25. 1885లో అప్పలనరసమ్మతో వివాహమైంది. వారికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 1887లో పెద్ద కూతురు లక్ష్మీనరసమ్మ, 1890లో కొడుకు వెంకటరామదాసు, 1902లో రెండో కూతురు కొండయ్యమ్మ జన్మించారు. ఒకపక్క ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 1886లో బి.ఎ.పట్టభద్రులయ్యారు. అదే సమయంలో కొద్దిరోజులు డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయంలో హెడ్‌క్లర్క్‌గా పని చేశారు. 1887లో మహారాజా కళాశాలలో రూ.100 జీతంతో అధ్యాపకునిగా చేరారు. అదే సమయంలో విజయనగరం సంస్థానాధీశుడు పూసపాటి ఆనందగజపతిరాజుతో పరిచయమైంది. క్రమేపీ ఇద్దరి నడుమా ఆ పరిచయం విడదీయరాని బంధంగా మారింది. 1891లో గురజాడ మహరాజా సంస్థాన్‌లో ఎపిగ్రఫిస్ట్‌ (సంస్థాన శాసన పరిశోధకుడు)గానియ
మితులయ్యారు.ఆ మరు సటి సంవత్సరమే మద్రాసు లా కళా శాలలో చదువుతున్న సోదరుడు శ్యామలరావు మృతిచెందాడు. 1897లో మహారాజా ఆనంద గజపతిరాజు స్వల్ప అనారోగ్య కారణంగా మృతి చెందాడు. ఈ రెండు సంఘటనలూ గురజాడను ఒకింత కుంగదీశాయి.
ఆనందగజపతిరాజుకు వారసులు లేకపోవటంతో ఆయన సోదరి అప్పలకొండయ్యమ్మ (రీవారాణి) సంస్థానం వ్యవహారాలు చూస్తుం డేది. ఆమెకు వ్యక్తిగత కార్యదర్శిగా, సలహాదారుగా గురజాడ నియ మితులయ్యారు. 1905లో తల్లి కౌసల్యమ్మ కాలం చేసింది. 1911లో ఆయన మద్రాసు యూనివర్సిటీలో బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ సభ్యులుగా నియమితులయ్యారు.
సాహితీ కృషీవలుడు
'దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌' అంటూ సమా జానికి చాటిచెప్పిన గురజాడ సంఘ సంస్కరణ కోసం కలం పట్టారు. స్త్రీ జనోద్ధరణ, మూఢనమ్మకాల ఖండన అనే రెండంచుల కత్తిని ప్రయోగించారు. సమకాలీన సమస్యలపై పోరాటానికి కలాన్ని ఝుళి పంచారు. గురజాడ గొప్ప సంఘసంస్కర్త మాత్రమే కాదు. అంతకు మించిన చదువరి. ఇంగ్లీషు చదువు వల్ల సమకూర్చుకున్న విజ్ఞానాన్ని తన జాతి జనులకు పంచిపెట్టటానికి పూనుకున్నారు.
తన రచనల వల్ల సాధించాలనుకున్న సాంఘిక ప్రయోజనం గురించి అవగాహన ఉన్న కవి కనుకనే తాను ఎవరి కోసం కలం పట్టా రో ఆ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన భావాలను వారు మాట్లాడే భాషలోనే చెప్పదలచుకున్నారు. కవి తన భావ ప్రకటన కోసం ఎంచుకోవాల్సిన బాహ్యరూపాన్ని నిర్ణ యిం చుకున్నప్పుడు వర్తమాన కాలం సామాజిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. అందుకే గురజాడ భావానికి తగిన భాషతోపాటు రచన స్వరూపం కూడా కొత్తగా ఉండాలని ఆశించారు. తెలుగు భాషలో అప్పటి వరకూ వాడుతున్న ఛందస్సు యతిప్రాసలప్రతిబంధకంలో బిగించబ డి ఉంది. తన భావ ప్రకటన వ్యావహా రిక శైలిలో, మృదుమధురమైన పదాల తో ఉండేలా ముత్యాలసరాలు అనే సరళతరమైన ఛందస్సును గురజాడ రూపొందించుకున్నారు. గణబద్ధమైన ఛందస్సు మీద తిరుగుబాటుగా ప్రౌఢమైన పదాల స్థానంలో సరళమైన వ్యావహారిక పదాలు పేరుస్తూ అత్యంత సులభతరంగా అర్థమయ్యే శైలిలో మాత్రాఛందస్సులో ఆయన రచించిన గేయాలన్నీ నవ్యకవితకు నిదర్శనాలు.
తలుగు సాహిత్యంలో కథానిక ప్రక్రియకు 'దిద్దుబాటు'తో 1910లో శ్రీకారం చుట్టారు. ఈ కథ ద్వారా తెలుగు సాహిత్య వికాసానికి నవ్య బాటలు వేశారు. ఆయన ప్రతి రచనలోనూ సామాజిక ప్రయోజనం పరిపుష్టంగా ఉంటుది. తెలుగు కవితకు కొత్త అందాలు, సొగసులు అద్ది కొత్త ప్రయోజనాలను ఆపాదించటంలో ఆయన వహించిన పాత్ర చిరస్మరణీయం.
సామాజిక దురాచారంపై గొడ్డలిపెట్టు కన్యాశుల్కం
తాంబూలాలిచ్చేశాను.. ఇక తన్నుకు చావండి
డామిట్‌ ! కథ అడ్డం తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌ 12.5
వాడొట్టి బొట్లేరింగ్లీషు పేల్తాడు
గురజాడ అప్పారావు గురించి విననివారు ఉంటే ఉండవచ్చునేమో కానీ కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన పై వాక్యాలు వినని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు వంటి పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.
వ్యావహారిక భాషావ్యాప్తికి గిడుగు రామ్మూర్తిపం తులుతో కలిసి ఉద్యమించిన గురజాడ ఆధునిక తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టారు. సమకాలీన సాంఘిక దురాచారాలను నిరసిస్తూ సాహిత్యాన్ని జనబాహు ళ్యంలోకి మరింత విస్తృతంగా తీసు కెళ్లలిగే ప్రక్రియ నాటకమేనని గురజాడ గుర్తించారు.
అద్భుత నాటకం కన్యాశుల్కం.
వాస్తవిక జీవితం నుంచి సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకుని తెలుగు వాడుకభాషలో 1892లో కన్యాశుల్కం నాటకం రాశారు. 1909లో మరిన్ని మార్పులు చేసి ప్రచురించారు. వందలాది ప్రదర్శనలిచ్చిన తెలుగు నాటకం ఇదే. శతాధిక వత్సరాలు దాటినా విశేష జనాదరణ పొందుతున్న ఓ అద్భుత నాటకం కన్యాశుల్కం. జాతీయ భాషల్లోనే కాకుండా ఫ్రెంచ్‌, రష్యన్‌, ఇంగ్లీషు భాషల్లో కూడా ఇది అనువదిత మైంది. ఈ నాటక రచనకు ఆనాటి సమాజంలో బాల్యవివాహాలే ప్రేరణ. ముక్కుపచ్చలారని పసిపిల్లలను పెళ్లి పేరిట అమ్ముకోవటాన్ని గురజాడ తీవ్రంగా నిరసించారు. 'ఇంతటి ఘోరమైన పరిస్థితి సమాజానికే సిగ్గుచేటు. ఈ దురాగతాన్ని ఎండగట్టి ఉన్నతమైన నైతిక ప్రమాణాల వ్యాప్తికి మించిన కర్తవ్యం సాహిత్యానికి మరొకటి లేదు.' ఈ మాటలను కన్యాశుల్యం నాటకానికి గురజాడ రాసిన తొలిమాటలో పేర్కొన్నారు.
కన్యాశుల్కం నాటకంలో ప్రతి పాత్రా సజీవమే. తదనం తర కాలంలో అనేక సామాజిక మార్పులకు ఈ నాటకం దోహదపడింది. ఆయన కలం నుంచి జాలువారిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ స్త్రీ సామాజిక దుస్థితిని ఆవిష్కరింపజేసింది. సమాజంలో రావాల్సిన మార్పులను సూచిం చింది. కరుణ రసాత్మకమైన ఈ గేయకావ్యం నాటి దురాచారాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.
సారంగధర, కొండుభట్టీయం, నీలగిరి పాటలు, కన్యక, సత్యవ్రతీ శతకం, బిల్హణీ యం (అసంపూర్ణం), సుభద్ర, దించు లంగరు, లంగరెత్తుము, లవణరాజు కల, కాసులు, మీ పేరేమిటి?, మెటిల్డా, సంస్కర్త హృదయం, మతము- విమతము వంటివి గురజాడ కలం పేర్చిన 'ముత్యాలసరాలు'. అయాన రచించిన దేశభక్తి గేయాలు నవ ఉత్తేజాన్ని నింపటమేకాకుండా దేశభక్తిని కొత్తకోణంలో చూపిస్తాయి.
ఆయన రచనలు ప్రగతిశీల భావాలు కలిగిన అభ్యుదయ రచయితలకు, వ్యక్తులకు సదా అనుసరణీయం. సామాజిక దురాచారాలను నిరసిస్తూ నైతిక ప్రమాణాల వ్యాప్తి చేయటంమే సాహిత్యం కర్తవ్యమని విశ్వసించిన గురజాడ రచనలు స్ఫూర్తిదా యకం. తెలుగు సాహిత్యంలో నవ్యకాంతులు నింపి వెలుగుజాడగా నిలిచిన గురజాడ సాహితీ జగత్తులో ధృవతార.
నిరాడంబర జీవి
బతికినన్నాళ్లూ గురజాడ నిరాడంబరంగానే బతికారు. తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయారు. చివరకు కట్టుకున్న ఇంట్లోకి వెళ్లకుండానే ఆయన అంతిమ శ్వాస విడిచారు. ఆయాచితంగా వచ్చిందేదీ స్వీకరించేవారు కాదని ఆయన మనుమడు (ఆయన పేరు కూడా వెంకట అప్పారావే) ఒక సందర్భంలో ప్రస్తావించారని విజయనగరానికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు 72 సంవత్సరాల ఆండ్ర భాస్కర సుబ్బారావు చెప్పారు.
ఆనందగజపతి సంస్థానంలో పని చేస్తున్నప్పుడు ఇప్పుడు విజయనగరంలో జిల్లా సమాచార కేంద్రం నిర్వహిస్తున్న గ్రంథాలయ భవనంలో గురజాడ నివసించేవారు. ఆ ఇంటిని ఉచితంగా ఇప్పిస్తానని ఆనందగజపతి చెప్పినా గురజాడ ససేమిరా అన్నారట. మరీ పట్టుబడితే తనకు ఆయాచితంగా వచ్చేదేదీ అవసరం లేదని చెబుతూ ఆ ఇంటిని రూ.260 ఇచ్చి కొనుక్కున్నారట.
ఈ ఇంటికి పక్కనే 1915 ప్రాంతంలో గురజాడ కుటుంబీకులు సొంత ఇంటిని కట్టుకున్నారు. గృహప్రవేశం కూడా అయింది. కానీ అప్పటికే ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన గురజాడ సొంతింట్లోకి వెళ్లలేకపోయారు. ఆయన చివరి ఘడియలు పాత ఇంట్లోనే గడిచాయని గురజాడ మునిమనుమడు (నాలుగో తరం) వేంకటేశ్వరప్రసాద్‌ చెప్పారు. గురజాడ తాతగారు (ఆయన పేరు కూడా వెంకట అప్పారావే) మెజిస్ట్రేట్‌గా పనిచేసేవారట. ఒకరసారి ఆయనతోపాటు కోర్టుకు వెళ్లిన గురజాడ తాను కూడా బాగా చదువుకుని మెజిస్ట్రేటున వుతానని కోర్టుహాలు గోడమీద రాసినట్లు తమ పెద్దలు చెప్పినట్లు వేంకటేశ్వరప్రసాద్‌ చెప్పారు.
వెలుగు చూడని 'అస్తమించని సూర్యుడు'
హైదరాబాద్‌కు చెందిన ప్రియదర్శిని ఆర్స్ట్‌ వాళ్లు 1981లో గురజాడపై 'అస్తమించని సూర్యుడు' అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రీకరించారని, షూటింగ్‌ మొత్తం విజయనగరం, పరి సర ప్రాంతాల్లో జరిపారని ఎ.బి.సుబ్బా రావు తెలిపారు. ఆ డాక్యుమెంటరీకి బంగా రునంది కూడా లభించిం దని, మరే కారణంచేతో ఆ డాక్యుమెంటరీ వెలుగు చూడలేదని అన్నారు.
కడసారి వీడ్కోలు
సంఘ సంస్కరణోద్యమానికి సాహిత్యాన్ని పదునైన ఆయు ధంగా ప్రయోగించిన మహాకవి గురజాడ అంతిమ ఘడియల్లో కూడా హాస్యరసాన్ని చిందిస్తూనే సాహితీ సరస్వతి ఒడిలో ఒదిగి పోయా రు. 1915 నవంబరు 30న క(పె)న్ను మూశారు. నాటి నికృష్ణ సమాజంపై నిప్పులు చెరిగిన ఆయన కలం అలసి సొలసి ఆగిపోయి ఇప్పటికి 97 సంవత్సరాలైంది. విజయనగరంలోని గురజాడ గ్రంథాలయంలో లభించిన ఆధారాల ప్రకారం.. 1915 ఏప్రిల్‌ నుంచి ఆయన ఆరోగ్యం అస్తవ్యస్తంగా తయారైంది. అదే నెల 7న విశాఖలోని పి.టి.శ్రీనివాస అయ్యంగార్‌ ఇంట్లో మకాం చేశారు. గిడుగు రామ్మూర్తిపంతుల్ని పిలిపించుకుని రెండురోజులపాటు ఆయనతో సాహిత్యగోష్టి జరిపారు. అప్పటికే ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్న రామ్మూర్తిపంతులు గురజాడకు వైద్యం చేస్తున్న డాక్టర్‌ ఎల్లింగ్టన్‌తో ఆయన ఆరోగ్యంపై చర్చించారు. అప్పారావుకు ఉత్తరాలు రాయవద్దని, ఆయనను అనవసరంగా శ్రమకు గురి చేయవద్దని ఎల్లింగ్టన్‌, రామ్మూర్తి పంతులుకు చెప్పారు. తరువాత గురజాడ విజయనగరం వచ్చేశారు. ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తోంది. కుటుంబ వ్యవహారాలు కొన్ని ఆయనను చీకాకు పరిచాయి. నవంబరు నాటికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మంచం పట్టారు. 29న కొడుకు రామదాసును పిలిచి గిడుగు రామ్మూర్తిపంతులుకు ఉత్తరం రాయమన్నారు. అదే ఆయన రాయించుకున్న చివరి ఉత్తరం. పరిస్థితి క్షణక్షణానికీ దిగజారుతోంది. మంచం పక్కన కొడుకు రామదాసు, వైద్యుడు మంగయ్యనాయుడు దిగులుగా నిల్చున్నారు. ఇంటిల్లిపాదీ ఆందోళనతో అటూ ఇటూ తిరుగుతున్నారు. కొడుకును పిల్చి 'కొద్దిగా వైను, దంచిన తాంబూలం తెచ్చిపెడతావూ' అని అడిగారు. రామదాసు డాక్టర్‌ నాయుడువైపు చూశారు. అలాగే తెచ్చి ఇవ్వమంటూ తలూపారు నాయుడు. తాంబూలం చప్పరిస్తూ గురజాడ డాక్టర్‌ నాయుడు చెయ్యి పట్టుకుని 'వీటిని వేసుకోవచ్చునో.. కూడదో.. నేను బతికుంటే ఆహారశాస్త్రం మీద గ్రంథం రాస్తాను' అంటూ చిరునవ్వు నవ్వారు. అదే ఆయన చివరి మాట. ఆఖరి చిరునవ్వు. 1915 నవంబరు 30 ఉదయం 8.20 గంటలకు ఆ సాహితీమూర్తి కన్నుమూశారు.
-సోమయాజుల సన్యాసిరావు
-ఫొటోలు : పి.కిశోర్‌కుమార్‌

వింజమూరి కళాఝరి

ఏ దేశ మేగినా ఎవ్వరెదురైనా... నిలపరా నీ జాతి నిండు గౌరవం... అన్న స్పూర్తిని మనసారా మదిలో నింపుకుని.. అమెరికాలో తెలుగులో ఏ కార్యక్రమం జరిగినా ఆ శ్రావ్యమైన గొంతు అతిధులను ఆహ్వానిం చాల్సిందే! తన శిష్యబృందంతో కల్సి అందెల సవ్వడి చేస్తూ...నాట్యమయూరిలా ఆనందింపచేస్తూ... స్వాగతం పలకాల్సిందే. అందలాలు ఎన్ని ఎక్కినా అన్నింటిని సమర్ధవంతంగా నెరవేరుస్తూ... ''తెలుగు వాణి''తో పాటు కూచిపూడితోనూ...తన మనసునే కాదు ఎదుటివారినీ ఉల్లాస పరుస్తూ.. సాగుతున్న వ్యక్తి వింజమూరి రాగసుధ.
కలకండ వంటి తియ్యని తెలుగు లండన్‌లో మాట్లాడుతూ, నవరస విన్యాసాలతో కూచిపూడి నాట్యఔన్నత్యాన్ని చాటుతూ, తెలుగు సాహితీ, సంస్కృతుల ప్రాభవ వింజామరలతో కళామతల్లిని అర్చిస్తూ జీవితాన్ని రాగరంజితం చేసుకున్న నృత్య, గాన మాధురి పరీవాహ ఝరి రాగసుధ వింజమూరి. అక్షరాన్ని అమృత కలశంగా, కళాహృదయాన్ని సుధా లాపంగా మార్చి అక్షర దీపాలతో స్వరలక్షణ హారతులందిస్తూ, చరణ మంజీర నాదాలతో నీరాజనాలందుకుంటోన్న సార్థక నామధేయురాలు రాగసుధ.
స్వరపదం తెలిసి, మానస సరోవరంపై హాయిగా తేలియాడే కలహంస ఆమె. పదవిన్యాసం గుట్టు తెలిసి సప్తకళావర్ణాల మధ్య నర్తించే మయూరం ఆమె. స్వరంలో పదం, శ్రుతిలో భావావేశం, వ్యాఖ్యానంలో రాగసుధలు ఆమెకు అబ్బిన సహజ లక్షణాలు. భావాలను, అనుభవాలను, ఆత్మీయతా సుగంధాలను రంగరించి తెలుగు పరిమళాలు వెదజల్లే రాగసుధ నీహారుల చల్లదనాల తెల్లదనానికి ప్రతీక. మమతాను బంధాలు, మకరంద సంశోభిత సుధలు కురిపిస్తూ, సాంద్రకళా చంద్రికలు ప్రకాశింపచేస్తూ తెలుగు ఘనకీర్తిని విదేశాలలో చాటుతోన్న కళామతల్లి ముద్దుబిడ్డ. లండన్‌ వెళ్ళిన తెలుగు రసజ్ఞులకు, కళాకారులకు ఆమెపేరు చిరపరిచితం. ఎక్కడ ఏ తెలుగు కార్యక్రమం జరిగినా రాగసుధ ఉండి తీరవలసిందే. ఆమె వ్యాఖ్యానమో, నాట్యమో అలరించవలసిందే. ఇదే ఆమె ప్రత్యేకత అయితే అంతగా చెప్పుకోనవసరం లేదు. అయితే ఆమె చాలామందివలే ఐటి చదువులతో ఆమె విదేశాలకు వెళ్లలేదు.
చిన్నప్పటి నుంచీ నాట్యమే ధ్యాసగా, తెలుగు భాషే శ్వాసగా, కళలే ఆశగా తండ్రి అభిరుచులకు అనుగుణంగా పెరిగింది. కళలపట్ల ఆరాధన, సాహిత్యం పట్ల విశేషమైన మక్కువగల కీర్తిశేషులు వింజమూరి శేషాచార్యుల కలల పంట రాగసుధ. అందుకే స్ఫూర్తీభవించిన సాంస్కృతిక రసపోషణలో కళాప్రమోద దరహాస సురభిళాలతో, సులలిత మనోజ్ఞ భావాలతో పెరిగింది. భారతీయం రంగరించిన తెలుగు కళాసాంస్కృతిక వికాసమే వృత్తిగా, ప్రవృత్తిగా భావించింది. చిన్నప్పటి నుంచే నాట్యాన్ని మంచి గాత్రంతో రాగసుధలు ప్రసరించే ప్రసంగాల్ని అభ్యసించింది.
అందుకే రాగసుధ లండన్‌లోని తెలుగు రేడియోలో ప్రసంగాలు చేస్తున్నా, కార్యక్రమాలకు వ్యాఖ్యానం చేస్తున్నా మాటల మంత్రనగరిలో ద్వారాలు తెరిచినట్టు, చెట్టు చెట్టు నుంచి పట్టు తేనెలు పట్టుకొని పిండినట్టు, స్వర స్వర్గ విపినంలో మాధవుని మోహన మురళికి తరులన్నీ విరిసినట్టు, మంగళకైశికి, భూపాల రాగాలు మురిసినట్టు ఉంటాయి. లండన్‌లో తెలుగు కార్యక్రమాలు ఉన్నాయంటే చాలు ఇంట్లో ఏదో శుభకార్యానికి తానే అన్ని అయి నిర్వహించాలన్నంత హడావిడి పడిపోతుంది రాగసుధ. ఎటువంటి బృహత్తర కార్యాన్నైనా, మహత్తర బాధ్యతనైనా అలుపూ సొలుపూ లేకుండా నిర్వర్తించగల చాకచక్యం, ఓర్పు, నేర్పు ఆమెకే సొంతం స్వోక్తికీ, స్వోత్కర్షకీ, స్వాతిశయానికి అతీతమైన మనస్తత్వం, సౌమ్యత, సౌకుమార్యం పుణికి పుచ్చుకున్న పరిణిత వ్యక్తిత్వం. అందుకు రాగసుధ మంచి కళాకారిణి కాగలిగింది.
వ్యాఖ్యానంలో భావ ప్రకటన, భాషాలాలిత్యాలపై అదుపు, పొదుపూ, పట్టు తెలుసుకున్న 'గళాకారిణి'. పంచరంగుల ప్రపంచాన్ని, సప్తవర్ణాల జీవితాకాశాన్ని, నవరసాల జీవితాన్ని, జీవితోద్యానంలో ఆత్మానందాన్ని కలిగించే అతసీకుసుమాల్ని, గుండెలు కరిగించే సన్నివేశాల్ని, నరనరాన ఉత్కంఠ రేపే ఘటనల్ని మాటలతోనే సాక్షాత్కరింపజేయగల నేర్పు ఆమె వ్యాఖ్యానానికి ఉంది.
ఇక నాట్యం సంగతికి వస్తే డా|| ఉమారామారావు శిష్యురాలిగా మాత్రమే కాక తనదైన ముద్రకోసం తపించే సృజనశీలి రాగసుధ. ఆమె నాట్యంలో శంపాలతల మెరుపు, పాలపుంతల మోహరింపు ఒక వినూత్న శోభ. రసార్ద్ర నయనాంచలాలలో వింతకాంతులు వెదజల్లుతాయి. నాట్యమే వేదంగా, నిజజీవన నాదంగా, పండిత పామర జనామోదంగా ఉంటుంది.
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నృత్య విభాగపు అధిపతిగా పనిచేస్తున్న రోజుల్లో ఉమా రామారావుగారి వద్ద శిష్యరికం చేశారు రాగసుధ, అలా ఆమె నేర్చుకున్న కళకు తనదైన శైలిలో పదును పెడుతూ స్వల్ప వ్యవధిలోనే మంచి డాన్సర్‌గా ఎదిగారు.
వృత్తిలోనూ ప్రశంసలే... భారత దేశంలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనని తాను నిరూపించుకుంటూ భారత పర్యాటక రంగంలో పనిచేసి, ఆపై అంతర్జాతీయ పర్యాటక శాఖ కన్సల్టెంట్‌గా చేరారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మన హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహించిన ఏఫ్రో ఏషియన్‌ గేమ్స్‌కు లైసెన్స్‌ అధికారిగా బాధ్యతలు స్వీకరించి... అద్భుత మైన పనితీరుతో అంతా ఆశ్చర్యపోయేలా నిర్వహించి... నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అనేకమంది ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం లండన్‌లో పర్యాటక శాఖలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ... జట్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ సహారా లాంటి అంతర్జాతీయ విమాన సంస్థలలో పనిచేసేవారికి ట్రావెలింగ్‌ పై శిక్షణ ఇస్తూనే... శ్రీలంక ఎయిర్‌లైన్స్‌, సిల్క్‌ ఎయిర్‌, ఎమిరేట్స్‌ సంస్థలకు... మన రాష్ట్ర పర్యాటక శాఖలో జరిగే అనేక ప్రమోషనల్‌ కార్యక్రమాలకు ప్రత్యేక సలహాదారుగా సేవలందిస్తున్నారు.
లండన్‌లో తెలుగు గుబాళింపులు : లండన్‌లో జరిగే ప్రతి తెలుగు వారి సాంస్కృతిక కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తెలుగుదనం గుబాళింపులు అద్దుతూ వింజమూరి 'తెలుగు'కు చేస్తున్న సేవపై ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ప్రశంసలు అందుకుంటున్నాయి. తానా, ఆటా వంటి సభలకు కమ్మనైన తెలుగు పదాలతో నిండుదనం తేవటమే కాకుండా... తన శిష్యబృందంతో కలసి ఇచ్చే ప్రదర్శనలు విలక్షణంగా ఉంటాయి.
రాగసుధ తెలుగుదనానికి, నృత్య రీతులతో చేస్తున్న సేవలని తానా పత్రిక, యుకెలోని వజ్రం లాంటి స్థానిక పత్రికలు, మన భారతదేశంలోని వివిధ పత్రికల రైటప్స్‌, మీడియా సంస్థల ప్రసారాలు.. మారిషస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌లో ఇంటర్వ్యూ ప్రసారం కావటం తనకో మధురానుభూతి స్ఫూర్తి అంటారు.
పురస్కారాలు... : ఇండో -శ్రీలంక కల్చరల్‌ వారిచే 'అవుట్‌ స్టాండింగ్‌ యంగ్‌ పెర్ఫార్మెన్స్‌' అవార్డు అమెరికాలోని తెలుగు సంఘాల ప్రత్యేక ఉగాది పురస్కారాలు భారతీయ కళా సమితి 'అభినయ ప్రవీణ' పురస్కారం స్వర్గీయ కృష్ణకాంత్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు రాజ్‌భవన్‌లో ప్రత్యేక నృత్య రూపక ప్రదర్శన న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో అశేష ప్రజల నడుమ చేసిన నృత్య రూపకం రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున హిమాచలప్రదేశ్‌లో 20 రోజులపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు. దక్షిణాది సాంస్కృతిక పీఠం సారథ్యంలో ఏటా నాగపూర్‌లో జరిగే 'డాన్స్‌ ఫెస్టివల్‌'లో పాల్గొని దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ సమక్షంలో ప్రదర్శన.
భారత్‌, బ్రిటన్‌లలో తితిదే ధార్మిక మండలి సారథ్యంలో నిర్వహించిన వైతాళికుడు అన్నమాచార్య 600, 601 పుట్టిన రోజు వేడుకల్లో పాల్గోవటం జర్మనీ -పిట్స్‌బర్గ్‌లో ఉన్న గోథే ఇనిస్టిట్యూట్‌లో ఇచ్చిన ప్రదర్శన వంటివి కొన్ని ఆమె ప్రతిభకు ఉదాహరణలు.
'శ్రీనివాస గద్యం' నృత్యరూపకం : శ్రీశైల రంగాచార్యులు రచించిన 'శ్రీనివాస గద్యం' నృత్యరూపకంగా మలిచారు. ఏడుకొండల ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా... 'నాద నీరాజనం' చేస్తూ... దశావతారాలను కూచిపూడి నృత్యరీతిలో కళ్లకు కట్టేలా ప్రదర్శనలిస్తున్నారు. తన కూచిపూడి గురువు ఉమారామారావు సారథ్యంలో నృత్యరీతుల్ని సమకూరుస్తూ.. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు శెట్టిరాజు వేణుమాధవ్‌ సహాయంతో ఈ గద్య రూపకానికి ప్రాణప్రతిష్ట చేసారామె. తిరుపతిలోని ప్రతికొండని, నీటి సొరుగులని, పుష్పాలని నృత్య అభినయంతో అందర్నీ ఆకట్టుకునే రీతిన సాగే 30 నిముషాల నిడివి గల ఈ రూపకాన్ని ప్రదర్శిస్తున్నారామె.
దేశం వీడినా... : ఏడేళ్ల క్రితం 'సుధ' తెలుగు రాష్ట్రం నుంచి యుకె పయనమయ్యారు. లండన్‌లో స్థిరపడినా తెలుగు సంస్కృతిని వీడలేదు. పైగా తెలుగు సాంస్కృతిక ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కంకణ బద్ధులయ్యారు. ఒకవైపు అధికారిణిగా బాధ్యతలు ప్రశంసలందుకునేలా నిర్వహిస్తూ... మరోవైపు భారత నృత్య కళాకారిణిగా అనేక ప్రదర్శనలు ఇచ్చారామె. భారత శాస్త్రీయ నృత్య 'కళ' అంతరించపోకూడదనే ఉద్దేశ్యంతో లండన్‌లోని బర్మింగ్‌హామ్‌ బాలాజి టెంపుల్‌, మహారాష్ట్ర మరాఠా మండల్‌లోనూ... మాంచెస్టర్‌ భారతీయ విద్యాభవన్‌లతో పాటు తన ఇంటి వద్ద కూడా తెలుగు వైభవం, కూచిపూడి నృత్య శిక్షణ ఇస్తు అక్కడ భారతీయుల నడుమ వారధిగా నిలుస్తు అనేక మంది ఔత్సాహిక భారతీయ విద్యార్థులకు నృత్య రీతుల్ని తర్ఫీదు ఇస్తూ... డాన్స్‌ అధ్యాపకురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈమె తన దగ్గర శిక్షణ పొందిన చిన్నారులతో లండన్‌లోని వివిధ ప్రాంతాలలో ప్రదర్శనలు ఇస్తున్నారామె.
అలాగే తెలుగు భాష గొప్పదనం, సంస్కృతి, సంప్రదాయం, ఔన్నత్యాలపై జరిగే అనేక చర్చా వేదికల్లో తన గళం వినిపిస్తూ తెలుగు విశ్వవ్యాప్తం చేసేందుకు అవిరళ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో నివాసముంటూ తెలుగుభాష నేర్చుకోవాలన్న తపన ఉన్న అనేకమందికి తెలుగుభాష నేర్పిస్తూ... సరళీకృత విధానంలో భాషపై అవగాహన పెంచుకునేలా వారిని తీర్చిదిద్దుతున్నారు.
కవయిత్రిగా : తన అనుభవాలని రంగరించి 'రాగసుధ' రాసిన కవిత్వం వివిధ పత్రికల్లో ప్రచురితమైంది. వంగూరి ఫౌండేషన్‌, అమెరికావారు నిర్వహించిన అంతర్జాతీయ కవితల పోటీలో బహుమతి గెలుచుకుంది. ఇలా వివిధ పత్రికల్లో ప్రచురితమైన తన కవితలు, స్వీయ రచనల్ని... 'కవితా రాగసుధ' పేరిట బాపు గీసిన ముఖచిత్రంతో ఓ సంకలనంగా వెలువరించారు.
లక్ష్యం : మోహిని యాట్టం, కథకళి, కథక్‌ ఇలా డాన్స్‌ ప్రక్రియలన్నింటినీ కలగలిపి... ఒక విలక్షణ నాట్యప్రక్రియ రూపొందించడం తన ధ్యేయం అంటారు రాగసుధ. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న గురజాడ అడుగుజాడను ఆచరించి చూపుతోన్న తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ వింజమూరి రాగసుధ.