12, ఏప్రిల్ 2011, మంగళవారం

ఇటలీ అహంకారానికి, కడప పౌరుషానికి మధ్య పోరు

కడప లోకసభ స్థానంలో ఇటలీ అహంకారానికి, కడప పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరులో వైయస్ జగన్ విజయం సాధిస్తారని  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు దీమా వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ..కడపలో కాంగ్రెసు పార్టీకి ఓటమి తప్పదని, ప్రభుత్వం ఆభాసు పాలవుతుందని అన్నారు. తెలంగాణా అంశంపై తమ అధినేతకు స్పష్టమైన విధి విధానం ఉందని గెలిచిన తర్వాత పార్లమెంటు సభ్యుడి హోదాలో తెలంగాణపై తమ పార్టీ నాయకుడు వైయస్ జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పారు.

వెనక్కి తగ్గినా వంశి?

తన రాజీనామా విషయంలో  వెనక్కి తగ్గనని చెప్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ  హైడ్రామా నడుమ రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. గత పక్షం రోజులుగా కృష్ణ తెలుగుదేశంలో రేగిన చిచ్చు  చివరికి నారా, నందమూరి కుటుంబాల మద్య  భగ్గుమనేల చేసింది. ఈ నేపద్యంలో రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు వల్లభనేని వంశీ ప్రకటించడం కొంత ఊరట కలిగించే అంశమే.


కొండారెడ్డి హత్యకేసులో పరిటాల రవి బావమరిది అరెస్ట్

కాంగ్రెస్ నేత తగరకుంట కొండారెడ్డి హత్యకేసులో నిందితుడు గా ఉన్న   టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు బాలాజీని పోలీసులు  అరెస్ట్ చేశారు. మంగళవారం అత్య్నత నాటకీయ పరిణామాల మధ్య ఆయనతో పాటు 11మంది టీడీపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపద్యంలో వారి వద్ద నుంచి మూడు తుపాకులు, వేట కొడవళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. కాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న పరిటాల రవి చిన్నాన్న ఎల్ నారాయణ చౌదరి కోసం ముమ్మర గాలింపు చేస్తున్నట్లు తెలుస్తోంది. .

ప్రశాంతి నిలయం బోసిపోయింది

గత 16 రోజులు గా సత్యసాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యసాయి బాబా ఆరోగ్యంపై మంగళవారం ఉదయం తాజా బులెటిన్ విడుదల డాక్టర్ సఫాయా చేసారు.  బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తుందని  హృదయ స్పందన, బీపీ నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. కాగా మూత్రపిండాలకు డయాలసిస్ కొనసాగుతోందని త్వరలోనే... ఈ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు

మరో వైపు  శ్రీరామనవమి వేడుకలతో కోలాహలంగా ఉండే  పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం నేడు బోసిపోయి కనిపించింది.  ప్రతి ఏటా శ్రీరామ నవమినాడు భక్తులను ఉద్దేశించి బాబా చేసే ప్రసంగం నేడు వినిపించక పోవటంతో ఇక్కడి సత్తెమ్మ దేవాలయంలో  గ్రామస్తులతో కలసి తరలి వస్తున్న భక్తులు బాబా ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు నిర్వహిస్తున్నారు

14 నుంచి కెసిఆర్‌ చండీయాగం

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్‌ నిర్వహించ తలపెట్టనున్న చండీయాగం కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 14 నుంచి చండీయాగం మూడు రోజుల పాటు కొనసాగుతుంది. మహబూబ్‌ నగర్‌ మాజీ ఎంపీ ఎపి జితేందర్‌ రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రం చండీయాగానికి అనుకూలంగా ఉందా లేదా అని గత మూడు రోజుల నుంచి వేద పండితులతో వచ్చి యాగం నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. మొదటి రోజు కెసిఆర్‌ దంపతులు పాల్గొంటారని సమాచారం.

తెలంగాణ ఉద్యమ దశాబ్ధ ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఉద్యమ దశాబ్ధ ఉత్సవాలు పది రోజుల పాటు కొనసాగుతాయని కార్యక్రమాల వివరాలను వెల్లడించారు ఎమ్మెల్యే జి అరవిందరెడ్డి.

14న అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతి, టీఆర్ఎస్ పతాక ఆవిష్కర ణా

15న ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు, వసతి గృహాల్లో పం డ్లు, మిఠాయిలు పంపిణీ
16న శ్రమదానం

17న నియోజకవర్గ కేం ద్రంలో రక్తదాన శిబిరం

18న ఉచిత వైద్య శిబిరాలు, కంటి అద్దాల పంపిణీ

19న తెలంగాణ సాధన కోసం 1949 నుంచి అమరులైనవారికి నివాళులర్పించడం, నియోజకవర్గ కేం ద్రాల్లో కాగడాల ప్రదర్శన
20న తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌తో మహిళలచే మార్చ్

21న శ్రీకృష్ణ కమిటీ వ్యతిరేక సదస్సు

22న తెలుగు, ఉర్దూ భాష ల్లో కవి సమ్మేళనం

24న జిల్లా కేంద్రంలో సంబరాలు, వివిధ రంగాలకు సేవ చేసిన విశిష్ట వ్యక్తులకు సన్మానం

ధూళిపాళ వర్ధంతి ఏప్రిల్‌ 13.

మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణార్జున యుద్ధం, నర్తనశాల, బొబ్బిలి యుద్ధం, శ్రీకృష్ణావతారం, కంచుకోట, ఉండమ్మా బొట్టుపెడతా, బాంధవ్యాలు, బాలరాజుకథ, అందాల రాముడు, మహాకవి క్షేత్రయ్య, బాలభారతం, ఆత్మీయులు, శ్రీకృష్ణపాండవీయం, దాన వీర శూర కర్ణ, సీతాకళ్యాణం' తదితర చిత్రాల్లో అసమాన నటన ప్రదర్శించి ఎన్టీఆర్‌ అభిమానం పొందిన ధూళిపాళ
విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్ట్‌ గా ఆ పాత్రల్లో రాణించడానికి ఉచ్ఛారణలోని ప్రత్యేకత, స్పష్టమైన ఉచ్చారణ, పాత్రోచిత నటన ప్రధాన కారణాలయ్యాయి. వీర, రౌద్ర, రసాల పాత్రలలో ఎలా ఒదిగి పోయినారో సాత్విక పాత్రల్లోనూ అదే విధంగా ఒదిగిపోయి ఆ పాత్ర కళ్ళముందు కనిపించేలా నటించేసే ధూళిపాళ 300 చిత్రాలకు పైగా నటించారు.
చివరి దశలో సన్యాసం స్వీకరించి కామేశ్వరానంద స్వామిగా మారి 2007లో తనువు చాలించారు. ధూళిపాళ వర్ధంతి ఏప్రిల్‌ 13.