13, ఫిబ్రవరి 2011, ఆదివారం

రేపు జంటగా కనిపించారో పెళ్ళే....

ఫిబ్రవరి 14 తేది ‘వాలైంటైన్ డే’ రోజున ప్రేమికులకు భజరంగదళ్ హెచ్చరికను జారీ చేసింది. భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ప్రవర్తించే వారిని సహించేదిలేద ని ... ప్రేమికుల రోజున జంటగా కనిపించే ప్రేమికులకు పెళ్లి జరిపిస్తామని భజరంగ్‌దళ్ కార్యకర్తలు తెలిపారు.


మళ్ళి... దీక్షకి దిగుతున్నా... : కేసెఅర్ ప్రకటన

తెలంగాణ జెఏసి పిలుపు మేరకు సహాయ నిరాకరణ ను ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యం కలిగించాలని ఉద్యోగ సంఘాలకి పిలుపు నిచ్చారు తెరాసా అధినేత కేసీఆర్. . ఆదివారమ కేసెఅర్, ఉద్యోగ సంఘాలతో సమావేశమై .. ఉద్యోగులపై చర్యలు తీసుకొందుకు ప్రభుత్వం సిద్ధ పడితే తానూ చూస్తూ ఊరుకోబోనని... గాంధీ చూపిన బాటలో సహాయనిరాకరణ కు మద్దతుగా నిలుస్తామని అవసరమైతే తానూ మళ్ళి నిరాహార దీక్షకి దిగ బోతున్నట్లు... ప్రకటించారు... ఈ సారి తెలంగాణా వాచీ వరకు తన దీక్ష చేస్తానని చెప్పారు.

ఎన్నికల వ్యయ పరిమితి పెంపు

లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై ఉన్న గరిష్ట పరిమితిని పెంచాలని ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. లోక్‌సభకు పోటీచేసే అభ్యర్ధి ఎన్నికల వ్యయం ప్రస్తుతం రూ.25 లక్షలుండగా, దానిని రూ.40 లక్షలకు, అసెంబ్లీకి పోటే చేసే అభ్యర్థుల వ్యయం రూ.10 లక్షల నుండి రూ.16 లక్షలకు పెంచాలని సిఫారసు చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ పేర్కొన్నారు.

అదుర్స్ నుండే నాపై కన్నేశాడు

కేసీఆర్.. ఇక్కడ కాదు... అక్కడ పెట్టాలి...


నాగార్జున 'ఢమరుకం' షూటింగ్ ప్రారంభం

నాగార్జున కథానాయకుడిగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం 'ఢమరుకం' షూటింగ్ ఫిబ్రవరి 12 సాయంకాలం హైదరాబాదు, అన్నపూర్ణా స్టూడియోలో ప్రారంభమైంది.

దేవుడి పటాలపై చిత్రీకరించిన తొలి షాట్ కు అక్కినేని నాగేశ్వర రావు కెమెరా స్విచాన్ చేయగా, రామానాయుడు క్లాప్ ఇచ్చారు. నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకుడు కృష్ణారెడ్డి, సురేష్ రెడ్డి, పత్రికాధిపతి నూకారపు సూర్యప్రకాశరావు సినిమా స్క్రిప్టును దర్శకుడికి అందజే య గా.... పూరీ జగన్నాథ్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, "ఈ రోజు మంచిదని లాంచనంగా స్టార్ట్ చేసాం. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగు జరుగుతుంది. అందుకని విశేషాలన్నీ అప్పుడు చెప్పుకుందాం" అన్నారు, నవ్వుతూ. రెగ్యులర్ షూటింగుకి ఇంకా చాలా సమయం వుంది కాబట్టి, సినిమా వివరాలను తర్వాత వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.

ఇందులో అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. చోటా కె. నాయుడు ఫొటోగ్రఫీ నిర్వహిస్తారు.