30, ఏప్రిల్ 2011, శనివారం
తెలంగాణ ఏర్పాటుకుసీమాంధ్రులు రెడీ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మెజార్టీ సీమాంధ్ర ప్రజలు, ప్రజా ప్రతినిధులు సిద్దంగా ఉన్నారని.. ఐతే కొంతమంది స్వార్థ సీమాంధ్ర రాజకీయ వ్యాపారుల కుట్రల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జాప్యానికి కారణమవుతోందని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మంద జగన్నాథ్ అన్నారు.మీడియాతో ఆయన మాట్లాడుతూ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్తీ కాగానే డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి జూన్ నెలాఖరుకి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. హైద్రాబాద్ రాజధానిగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉంటుందని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని ఆయన ఉద్ఘాటించారు.
తననెవ్వ రూ శాసించలేరు : నాగం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా తననెవ్వ రూ శాసించలేరని, ప్రజల ఆకాంక్ష మేరకే ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాను తప్ప తన స్వార్థం ఎంతమాత్రం లేదని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. శని వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మే9న టీడీపీ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు పార్టీలకతీతంగా హాజరు కావాలని కోరారు. పదే పదే తెలంగాణ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం వల్లనే ఉద్యమానికి భంగం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
ఉద్యమ లక్ష్యాన్ని చాటడానికే ప్రజాభియాన్ యాత్ర
తెలంగాణ వాదాన్ని ప్రతి పల్లెకు చేర్చి ప్రతి ఒక్కరికి ఉద్యమ లక్ష్యాన్ని చాటడానికే ప్రజాభియాన్ యాత్రను చేపట్టినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. శనివారం తన మూడో రోజు యాత్రని ప్రారంభిస్తూ.. జూన్ మాసం చివరి కల్లా ఎటూ తేల్చక పోతే తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నా రు. తెలంగాణ కోసం ఆరువందల మంది విద్యార్థుల ప్రాణత్యాగం కన్నా, ఈ పదవులు ముఖ్యం కాదని మంత్రి వ్యాఖ్యానించారు
పేరుకే దేశానికి స్వాతంత్రం వచ్చింది
దేశానికి పేరుకే స్వాతంత్రం వచ్చిందని... నేటికీ పూర్తిస్థాయిలో స్వేచ్ఛ లభించలేదని, అవినెతి మయమైపొఇన వ్యవస్థ కారణంగా అందని స్వాతంత్ర ఫలాలను సాధించుకునేందుకు మరో స్వాతంత్ర పోరాటానికి సిద్దం కావాలని పిలుపు నిచ్చారు అన్నాహజారే .. శనివారం అవినీతికి వ్యతిరేకంగా పూణేలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన హామీ మేరకు నిర్ణీత సమయంలో జనలోక్‌పాల్‌బిల్లు పార్లమెంట్ లో పాస్ కాకపోతే మరోసారి జంతరమంతర్ వద్ద దీక్షకు ప్రజలు సిద్ధంకావాలని అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం పడాలన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)