2, డిసెంబర్ 2010, గురువారం

కిరణ్‌కు వట్టి షాక్

మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖలు కేటాయించిన కొద్ది గంటలకే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి గట్టి షాక్ తగిలింది. మంత్రివర్గ విస్తరణ జరిగిన కొద్ది సేపటికే తొలి వికెట్ రూపంలో వట్టి వసంత కుమార్‌ను సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి కోల్పోయారు. ఇలాంటి షాక్‌లు మరికొన్ని తగలవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా కేటాయించిన పోర్ట్‌ఫోలియోలపై బహిరంగంగానే మంత్రులు అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలిసింది.