కడపలో ఉప ఎన్నికల యుద్ధం జరగబోతోందని అందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పులివెందులలో బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సహకరించేలా ప్రయత్నిస్తోందన్నారు. అలాగే కడపలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపి టీడీపీకి సహకరించేలా రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు సోనియాగాంధీ, వైఎస్ఆర్‌ల మధ్య జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు.