తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబంతోపాటు ఆయన మేనల్లుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు కోట్లాది రూపాయల దండుకున్నారని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రఘువీరారెడ్డి తెలిపారు.రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తుందని విమర్శించారు. తల్లితెలంగాణ విగ్రహం దహనం చేయడం చరిత్రలో పెద్ద తప్పిదమన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈ సంఘటనలు చూస్తుంటే ఇక ముందు ఎలాంటి దౌర్జన్యాలైనా చేసేందుకు ఒడిగడుతుందని సందేహం వ్యక్తం చేశారు.