15, ఏప్రిల్ 2011, శుక్రవారం
బుల్లితెరపైకి దూసుకొస్తున్న వెంకటేష్
సినిమాల కన్నా సీరియల్స్‌కు లభిస్తున్న ఆదరణ రోజు రోజుకు పెరిగి పోతుండటంతో ఇప్పుడు బుల్లితెరపై కనిపించడానికి పెద్ద పెద్ద తారలు కూడా సిద్దమైపోతున్నారు. ఇప్పటికే అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ లాంటి అగ్ర కధానాయకులు హీరోయిన్లు , సీనియర్ నటులు బుల్లితెరపై కూడా నటించిన విషయం తెలిసిందే. తాజాగా వీరి బాటలో మరో అగ్రహీరో .. విక్టరీ వెంకటేష్ కూడా పయనించనున్నాడు. ఎప్పటి నుంచో స్వామి వివేకానంద పాత్ర పోషించాలనుకుంటున్న వెంకటేష్ . వివేకానందుని జీవితచరిత్రను సినిమా రూపొందించడానికి కూడా ప్రయత్నించాడు. అయితే, రెండున్నర గంటల్లో ఆ కథ చెప్పడం సాధ్యమయ్యే పని కాదని సినిమా నిర్మాణాన్ని విరమించుకుని, టీవీ సీరియల్ గా తీయాలని అనుకుంటున్నాడట. త్వరలోనే ఈ సీరియల్ సెట్స్‌పైకి వెళుతుందని తెలుస్తోంది!