తెలుగునాట సినిమా రంగం పురుడుపోసుకున్న
వేళ...వెం డితెరకు నటీమణులను పరిచయం చేసే బాధ్యతను నిర్విఘ్నంగా
నిర్వహిస్తూ... మరోవైపు పౌరాణిక, జానపద, సాంఘీక చలన చిత్రాల్లో అద్వితీయమైన
నటనతో హస్యాన్ని పండిస్తూ తెలుగు చార్లీచాపీన్‌గా, హాస్యకుటుంబానికి
ఆదిపురుషుడుగా పేరుగాంచారు రేలంగి వెంకటరామయ్య. ఇల్లరికంలో ఉన్న మజా అంటూ
తెలుగింటి అల్లుళ్లకు కొత్తభాస్యం నేర్పిన ఆయన హాస్యాన్ని పండిస్తూ, ఆనాటి
అగ్రకథానాయకుల తో సమానంగా పారి తోషికం తీసుకుంటూ, మనస్సున మనిషిగా అటు
పరిశ్రమలోనూ, ఆపద్భాందవుడిగా ఇటు బంధువర్గంలోనూ, హాస్యచక్రవర్తిగా
ప్రేక్షకుల్లోనూ పేరుగాంచారు. రేలంగిగా అందరికీ సుపరిచిత మయ్యారు. ఆయ
పెంచిన మంచిని అనుసరిస్తూ, నేర్పిన క్రమశిక్షణను పాటిస్తూ నేటికి చిత్రరంగ
పరిశ్రమ నుంచి ఆప్యాయతను అందుకుంటున్న రేలంగి ఏకైక కుమారుడు రేలంగి
సత్యనారాయణ బాబు తో ఆంధ్రప్రభ లైఫ్ ఇంటర్వ్యూ...
రేలంగి! తెలుగు సినిమాకు నవ్వులద్దిన హాస్య నటుడు. ఆయన నడిచినా, నవ్వినా, నటించినా, నాట్యం చేసినా...ప్రేక్షకులకు నవ్వులే నవ్వులు! మాయా బజార్‌లో ఉత్తరకుమారుడిగా 'సుందరి నీవంటి దివ్య స్వరూపం .... 'అంటూ సావిత్రికి సరిజోడుగా ఆయన పం డించిన హావభావాలు ఎవరు మర్చిపోగలరు. అలాగే తండ్రి, మామ, అల్లుడు...లాంటి పాత్రల్లో అందరికీ ఆప్తుడైన ఒక భోళా మనిషి.
హాస్యరంగంలో పద్మశ్రీ తీసుకున్న మొదటి నటుడు ఆయన. హరికథా భాగవతార్ , హార్మోనియం షాపు నిర్వహించే రేలంగి రామస్వామి కుమారుడిగా ఆగష్టు13, 1910లో తూర్పు గోదావరి జిల్లా, రావులపాడులో జ న్మించారు. నాలుగుదశాబ్దాల పాటు తెలుగుచిత్రసీమలో హాస్యనటుడిగా ప్రేక్షకులను తన హావభావాలతోనే క డుపుబ్బ నవ్వించిన ఆయన సెప్టెంబర్27, 1975లో మరణించారు. హాస్యకుటుంబానికి మార్గదర్శిగా అందరి హృదయాలలో నిలిచారు. మూడు దశా బ్దాల క్రితం ఆయన భౌతికంగా ఈ లోకం నుంచి దూరమైనా, శ్రీకృష్ణతులాభారంలో వసంతుడిగా, ఇల్లరికం అల్లుడిగా ఎన్నో హాస్యపాత్రల ద్వారా ఆయన పంచిన ఆనందాన్ని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు. నేటికీ తెలుగువారికి హాస్యమంటే ముందు గుర్తొచ్చేది రేలంగి పేరే.
మీ చిన్నతనం గురించి చెప్పండి?
చిన్నతనంలోనే నాన్నగారి కుటుంబం కాకినాడకు వచ్చి అక్కడే స్థిరపడ్డాం. ఆయన విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది. నాన్నగారు సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన తరువాత చాలా రోజుల వరకు మేమంతా కాకినాడలోనే ఉండేవాళ్లం. కొద్దిగా సినిమాల్లో పేరు రావడంతో మా మకాం మద్రాస్‌కు మారింది.
అప్పుడప్పుడు నాన్నతో పాటు నేను, అమ్మ పుల్లయ్యగారి ఇంటికి వెళ్లేవాళ్లం. ఎంతో ఆప్యాయంగా చూసేవారు. కొత్త కథానాయికగా సినీరంగానికి ఎవ్వరినైనా పరిచయం చేయాలంటే పుల్లయ్య తరపున నాన్నగారు ఆ అమ్మా యి ఇంటికి వెళ్లి వారిని ఒప్పించి నటించడానికి అంగీ కరింపచేసేవారు. అలా నా చిన్నతనంలో అంజలి అత్త మా ఇంటి కి తరుచు వచ్చేవారు. కొద్దిరోజులు మాతోనే కలిసి ఉన్నారు. నాన్నగారు సభ్యుడిగా ఉన్న కాకినాడ యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్ నుంచి వచ్చిన వారే దాదాపు25మంది సినిమారంగంలో మంచిస్థాయికి ఎదిగారు. ఆయనకు నేను ఒక్కడినే కుమారుడిని అయినా, మా ఇంట్లో మాత్రం ప్రతిరోజూ కనీసం ముఫ్పై నుంచి నలభై మంది భోజనం చేసేవారు. బంధువుల పిల్లలందరూ మా ఇం ట్లోనే ఉండేవారు. వారికి విద్యాబుద్ధులు చెప్పించడంతో పాటు వివాహాలు కూడా మా అమ్మనాన్న చేతుల మీదుగానే జరిగాయి.
మీరు ఎంతవరకు చదువుకున్నారు? సినిమాల్లో నటిం చే ప్రయత్నం చేశారా?
నాకు పెద్దగా చదువు అబ్బలేదు. పదవ తరగతి వరకు మాత్రమే చదివాను. చిన్నతనంలోనే కె.ఎస్ ప్రకాష్‌రావు (రాఘవేంద్రరావు తండ్రి)డైరెక్షన్‌లో బాలానందం (1950)పిల్లల సినిమాలో హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేశాను. కాని ఆ సినిమా విజయవంతం కాలేదు. హీరో పాత్రలో నేను సరైన నటనను చేయలేకపోయాను అన్న ఫీలింగ్‌తో ఆ తరువాత సిని మా రంగం వైపు వెళ్లలేదు.
కాలేజీ చదువులకు ఎందుకు స్వస్తి పలికారు?
సినీరంగంలో ఏర్పడే చెడుస్నేహాల వల్ల ఎక్కడ చేతికి అందకుండా పోతానో అన్న భయంతో నాన్నగారు నాకు చిన్నతనంలోనే వి వాహం చేశారు. మాది మేనరికం. నాన్నగారి మంచితనానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. మా మామగారు బాగా బతికిన మనిషి. మా ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమే ఉన్నరోజుల్లో మేము కాకినాడలో ఉన్నప్పుడే ఆయన తన కూతురిని నేను చేసుకోవాలని నాన్నగారితో మాట తీసు కున్నారట. కాని నాన్నగారు సినిమాల్లో సక్సెస్స్ కావడంతో మా స్థితి పెరిగింది. విధివశాత్తు మా మామగారు ఆర్థికంగా చితి కిపోయారు. కాని నాన్నగారు అవి ఏమి పట్టించుకోలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి మేనరికమే చేశారు. ఆయన దృష్టిలో డబ్బు కన్నా మాట విలువైనది. ఎస్‌ఎస్సీ కాగానే నాకు పెళ్లి చేసి, నన్ను ఇంటికే పరిమితం చేశారు. నేనే ఏకైక సంతానం కావడంతో, కనీసం నాకు అయినా ఎక్కువ మంది సంతానం ఉండాలని అనేవారు. అలా ఆరుగురు పిల్లలకు తండ్రిని అయ్యాను. ఇద్దరు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. అందరూ జీవితంలో స్థిరపడ్డారు.
మీ పిల్లలు సినిమా రంగంలోకి వచ్చారా?
నేను సినిమారంగంలో ఇమిడలేను అని నాన్నగారు గ్రహించారు. నమ్మకం లేని వ్యాపారం సినిమా అని తరచుగా అంటుండే వారు. ఆయన ప్రభావం వల్లనేమో నాకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు. ఇక మా పెద్దాబ్బాయి తిరుమలబాబు కొన్ని సినిమాల్లో నటించాడు. చిన్నబ్బాయి హేమంత్‌బాబు కనకాల ఫిలిమ్ ఇనిస్టి ట్యూట్‌లో మూడు సంవత్సరాలు శిక్షణ తీసుకున్నా ఫలితం లేదు. కొన్ని పాత్రలు వేసాడు కాని పెద్దగా పేరు రాలేదు.
మీ నాన్నగారు మీతో ఎలా ఉండేవారు?
ఎంతో క్రమశిక్షణతో ఉండే ఆయన సంతోషాన్ని, కోపాన్ని తట్టుకునేవారు కాదు. తెలియక ఎంత పెద్ద పొర పాటు చేసినా క్షమించే వారు కాని తెలిసి చిన్న తప్పు చేసినా సహించేవారు కాదు. చాలా కోపిష్టి. కోపం వచ్చిందంటే చాలు చేతిలో ఏది ఉంటే అది విసిరేసేవారు. బండబూతులు అలవోకగా వచ్చేవి. అయితే ఆయన కోపం పాల నుర గలాంటింది. ఆ ఉగ్రరూపం కొద్ది నిమిషాలే. ఆ తరువాత శాం తమూర్తిగా మారిపోయేవారు. భోళామనిషి. అబద్ధం తెలియని మనిషి. ఆయన కోపం గురించి చెప్పాలంటే ఒక సంఘటన చెప్పాలి. మా భవిష్యత్ ఆలోచించి ఆయన తాడేపల్లి గూడెంలో ఏక్లాస్ థియేటర్ కట్టించేందుకు సమాయత్తం అయ్యారు. థియేటర్ పక్కన, ఓ మూల చిన్నగా షెడ్ కట్టించమని చెప్పి ఆయన మద్రాస్ వెళ్లిపోయారు. షెడ్ ఎందుకు అంటూ థియేటర్ కట్టాక మిగిలిన మెటీరియల్‌తో నేను చిన్న ఇల్లు కట్టిం చాను. అంతా పూర్తి అయిన తరువాత వచ్చిన నాన్నగారు ఆ ఇంటిని చూసి తిట్లభారతం మొదలుపెట్టారు. మేనేజర్, ఇతర పనివాళ్లముందు. చాలా బాధకలిగింది. అది కొద్ది నిమిషాలే. రైలు ఎక్కేముందు భోరున ఏడుస్తూ... 'ఎందుకు రా చెప్పిన పనిచేయకుండా నాతో అందరి ముందు తిట్లు తింటావు ' అంటూ బాధపడ్డారు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం. కోపం, బాధ, సంతోషం ఏది మనస్సులో దాచుకునే వ్యక్తికాదు.
మీతో ఎలా ఉండేవారు?
నేను, నాన్నగారు స్నేహితుల్లా ఉండేవాళ్లం. ఆయన చేసిన మంచిపనులు చెప్పేవారు కాదు, కాని తప్పులు మాత్రం చెప్పేవారు. ఎందుకు నాన్న ఎప్పుడో జరిగినవి చెబుతారు అంటే అదికాదురా... నీవు తప్పులు చేయకు...తప్పులు చెెస్తే వాటి ఫలితం చాలా బాధకరంగా ఉంటుంది. అందుకే నీవు తప్పులు చేయకు అంటూ మందలించేవారు. స్నేహితుల ప్రభావంతో డ్రింక్ చేసేవాడిని. మానేయమని నాన్న ఎంతో నచ్చచెప్పారు. నాకు బాగా గుర్తు ఆయనకు ఆరోగ్యం దెబ్బతిన్న తరువాత ఒక రోజు ఏడుస్తూ 'తాగుడు మానేయిరా... నీ పిల్లలంతా వీధిన పడ్డతారని నాకు భయంగా ఉందిరా ' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన చనిపోయిన తరువాత పదేపదే ఆయన పడిన ఆవేదన గుర్తుకు వచ్చి, నేను ఆ వ్యసనం నుంచి బయటపడ్డాను.
అగ్రహీరోలతో సమానంగా మీ నాన్నగారి పారితోషికం ఉండేద ట? మరి ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే వారితో సమానంగా ఉన్నట్లు లేదే?
నిజమే...ఆ రోజుల్లోఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌తో సమానంగా నాన్నగారికి పారితోషకం ఉండేది. వీరి ముగ్గురి పారితోషికాలు 40, 39,38వేలరూపాయలుగా ఉండేవి. కాని నాన్నగారు ఎప్పుడు 38వేలే తనకు ఇవ్వమని చెప్పేవారు. అలా ఎందుకు అని ఎప్పుడైనా అడిగితే 'మనదేశం హీరోకు ప్రాధాన్యత ఇచ్చే దేశం' అనే వారు. ఆయనకు అసలు అహంకారం అనేది ఉండేది కాదు. అయితే ఎప్పుుడు ఒక మాట అనేవారు. 'రాళ్లు తిని కరిగించుకునే వయస్సులో తిందామంటే రాళ్ళు కూడా దొరకలేదు. ఇప్పుడు రత్నాలు ఉన్నా తి నే శక్తి లేదు.'
సహాయం కోరి ఇంటికి వచ్చిన ప్రతిఒక్కరికీ ఎదో ఒక సహాయం చేసేవారు. డబ్బుకన్నా స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. మా బంధువుల కుటుంబాలలోనే కాకుండా తెలిసినవారి కుటుంబాల్లో దాదాపు రెండువందల జంటలకు పెళ్లిళ్లు చేశారు. ఇక మా అమ్మగారు ఆయనకు తగ్గ ఇల్లాలు. ఎవరింట్లో శుభకార్యం ఉన్నా ఆవిడ హాజరు కావల్సిందే. ఇలా ఇద్దరూ కలిసి ధనం కన్నా మర్యాద, మంచితనం గొప్పవి అని భావించేవారు. అందుకే ఆయన సంపాదన అధికంగానే ఉన్నా చాలా వరకు ఇతరులకు సహాయపడడానికే ఖర్చు అయ్యింది. మరో కారణం... నేను స్వతహాగా ఏ వ్యాపారం చేయకపోవడంతో తాడేపల్లిగూడెంలో థియేటర్ చూసుకుంటూ ఉండేవాడిని. చిన్న పట్టణమైన ఆ ఊరిలో ఏ క్లాస్ థియేటర్ కట్టడం వల్ల నష్టాలు చవిచూశాం. అయితే వారిలా మేం లేమే అన్న బాధ మాకు లేదు.
మీకు ప్రస్తుతం సినీరంగంలో ఎలాంటి ఆదరణ ఉంది?
మా నాన్నగారు చనిపోయి 37సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అంతా మమ్ముల్ని ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తారు.
మా పిల్లల అందరి పెళ్ళిళ్లకు సినీప్రముఖులంతా వచ్చారు. ఆఖరి అమ్మాయి పెళ్లికి అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విచ్చేసి, ఆశీస్సులు అందించారు. అక్కినేని గారు, అంజలి గారు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తారు. మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల వారు ఈ లోకంలో లేకపోయినా, వారి మంచితనంతో అంతా సంతోషంగా ఉన్నాం.
మీకు సంబంధించిన విజయగార్డెన్స్ వ్యవహారం కోర్టులో ఉంది కదా? ఎంతవరకు వచ్చింది?
మా నాన్నగారు వాణీ స్టూడియో ఎదురుగా ఉన్న విజయగార్డెన్స్‌లో కొబ్బరి, మామిడి తోట ఉన్న పదిఎకరాల స్థలం కొన్నారు. వందల ఎకరాల విజయగార్డెన్స్ లో మాది పదిఎకరాల స్థలం. ఆ తరువాత నాగిరెడ్డి గారు మిగతా స్థలం కొన్నారు. మా స్థలం అమ్మమని అడిగితే నాన్నగారు కాదు కుదరదు అన్నారు. నాగిరెడ్డిగారి అబ్బాయి నేను స్నేహితులం. అలా నేను నాన్నగారిపై ఒత్తిడి తీసుకువచ్చాను. మేం కొన్నస్థలం మధ్యలో ఉన్నందున వారు మాపై ఒత్తిడి తీసుకువచ్చారు. చివరికి నాన్నగారు లీజుకు ఇవ్వడానికి అంగీకరించారు. అయితే లీజు గడువు ముగిసినా మా స్థలం మాకు ఇవ్వనందున మా పిల్లలు కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు కోర్టులో ఉంది. న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి మాకు అనుకూలంగా కొద్ది రోజుల్లో తీర్పు వస్తుందన్న ఆశ ఉంది.
రేలంగి కొడుకుగా మీ తండ్రిపేరు నిలిచేలా ఏదైనా చేయాలనుకుంటున్నారా?
ప్రతి ఒక్కరిలో నటించే సత్తా ఉంటుంది. కాని వారిని కెమెరా ముందు ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది ముఖ్యం. 40సంవత్సరాల నుంచి థియేటర్ నిర్వహిస్తున్నాను. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో తెలుసు. మా చిన్నాబ్బాయి హీరోగా, మా నాన్నగారి పేరు నిలిచేలా, జనం మెచ్చేలా ఒక్క చిత్రం తీస్తాను. కోర్టు వ్యవహారం తేలిన తరువాత నాన్నగారి పేరుపై ఒక్క స్వచ్ఛంద సంస్థను స్థాపించాలన్న ఆలోచన ఉందంటూ తండ్రితో తన అనుబంధాన్ని, ఆయన పేరు నిలిచేలా చేయాలనుకుంటున్న కార్యక్రమాలను వివరించారు.