-
క్షణాల్లో క్షతగాత్రుల చెంతకు చేరుస్తూ....
-
ఆన్‌లైన్‌లో రక్తదానం చేయిస్తూ...
- పైసా ఖర్చులేకుండా అందరికీ బాసటగా నిలుస్తూ....
వివిధ సందర్భాలలో క్షతగాత్రులైన వారికి.. అనేక ఆప రేషన్‌లప్పుడు అవసరమయ్యే రక్తం కోసం ఉరుకులు.. పరుగులు తీసే పని లేకుండా కేవలం క్లిక్ ద్వారా రక్తదాత మన చెంతకు చేరే విధంగా అం తర్జాలం ద్వారా రక్తదా తలకు సమాచారం అందించి ఇప్పటికి యాభైవేలమందికి పైగా ప్రాణాలను కాపాడి.. రక్తదానాన్ని ఓ మహొద్యమంగా ... జనచైతన్య కల్గించే దూసుకుపోతున్నారు ఆ యు వకులు. తాము ఏర్పాటు చేసుకున్న ూూూ.ౌస|nd2షూూుసష.ుసగ -వబ్ సైట్ ద్వారా వాడవాడలా విస్తరిస్తూ... అందరి ప్రశంసలూ పొందుతున్నారు.
ఈ సమాజానికి మనం ఏం చేస్తున్నాం... అని ఆలోచించడం మానేసి...ఈ సమాజం నాకేమిచ్చిందన్న భావన ఎక్కువై పోవ టంతో సామాజిక పరంగా అనేక సమస్యలు వస్తునే ఉన్నాయి. ఎవరెలా పోతే మాకేం... నేను... నాకుటుంబం... బాగుంటే చాలు అనుకునేవారే ఎక్కువ ఈరోజుల్లో ... సాటి మనిషి ప్రమాదానికి గు రైతే... చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే... ఆదుకోవాల్సిన బాధ్యత మనదన్న భావననుండి మనకేమైపోతుందో అన్న భావ నతో మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు కొందరు.
అలాగని ఈ సమాజంలో అందర్నీ ఒకే గాటాన కట్టేయలేం... నన్నీ స్థితికి తీసుకువచ్చిన సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలని ఆలోచించే వారూ ఉన్నారు. అయితే యువతరంలో ఈ సమా జానికి ఏదో ఒకటి చేయాలన్న తపన చాలానే ఉంది. అయితే చిన్న పాటి నిర్లిప్తతలతో చేయాలనుకున్న పనిని ముందుకు తీసుకుపోలేని వారు కొందరైతే....నలుగురూ మెచ్చేలా సేవ చేయాలి అని నిర్ణ యించు కున్నా... దానికి ఓ కార్యరూపం ఎలా ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడేవారు మరికొందరు. రంధ్రా ణ్వష ణలు జరిపి దాని ద్వారా లబ్దిపొందుతున్నట్లు జరిగే దుష్ప్రచారానికి భయపడి సేవలం దించేం దుకు వెనుకడుగు వేసేవారు మరికొందరు. కొంత మంది యువకులు... భావన, నవజీవన నిర్మాతలు... అంటూ మహాకవి శ్రీశ్రీ చేసిన ప్రశంసలు నిజంగా ఆయువకులకు వర్తిస్తాయి. సమయా నుకూలంగా రక్తం అందక ప్రాణాలు అనంత వాయువుల్లో కల్సిపో తున్న వారిని కాపాడేందుకు ఐదుగురు యువకులు చేసి చిరు ప్రయత్నం నింగికెగిసింది.
కృషి, పట్టుదల, కార్యధీక్ష, ఉంటే సమాజానికి తమ వంతు సహా యం చేయగలం అని నిరూపించారు ఈ ఐదుగురు యువకులు. ూూూ.ౌసnd2షూూుసష.ుసగ వెబ్‌సైట్ ద్వారా అవసరమైన అన్ని ప్రాంతాలలో సామాన్యులే కాదు... అన్ని తరగతుల ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రక్తాన్ని పొందేందుకు గానీ... దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ... ఎందరి ప్రాణా లనో కాపాడేందుకు వారు చేస్తున్న ప్రయత్నం అందరి మన్నలను పొందుతోంది.
గుంటూరు జిల్లాకు చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగులు 2005 సంవత్స రంలో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. షరీఫ్, నవీన్, ఫణీ, కోటేశ్వ రరావు, మురళీకృష్ణ మిత్ర బృందం ఆలోచనల నుండి పుట్టిన ఈ అంతర్జాలం ఎందరి ప్రాణాలనో నిలుపుతోంది. ప్రారంభించిన తొలినాళ్లలో ఈ సైట్ పై సన్నిహితులకు, స్నేహితులకు, తమ కుటుం బ సభ్యులకు బంధుమిత్రులకు ఇలా అందిరికీ సమాచారం అందిస్తే... అందులో బ్ల్లడ్ డోనర్స్‌గా చేరింది కేవలం 250 మంది మాత్రమే... అయినా వారు నిరుత్సాహపడిపోలేదు... తాము అనుకున్న లక్ష్యాలను చేరేందుకు సమయం చిక్కినప్పుడల్లా... ఆన్‌లై న్‌లో రక్తదానం చేయటం ఎలాగో... కావాల్సిన రక్తాన్ని పొందటం ఎలాగో అవగాహన కల్పిస్తు ముందుకు సాగారు. దీంతో నేడు ఈ వెబ్ సైట్‌లో రక్తదాతల సంఖ్య లక్ష పైచిలుకు దాటడం వారి నిర్విరామకృషికి నిదర్శనంగా చెప్పాలి.
విదేశాల్లో సాప్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న తన స్నేహితులతో కల్సి హైదరా బాద్ వెబ్‌సైట్ డిజైనర్‌గా పని చేస్తున్న షరీఫ్ రక్తదానంపై అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఆన్లైన్ బ్లడ్ డొనేషన్ సైట్ దేశ వ్యాప్తంగా విస్తరించి... ఎందరో సభ్యుల్ని చేర్పించేలా చేసింది.
దేశ వ్యాప్తంగా...వాలంటీర్లు
వెబ్‌సైట్ ద్వారా స్వచ్ఛంద రక్తదాన సేవలందిస్తున్న ఈ సంస్ధకు మన రాష్ట్రంలో 30వేల పై చిలుకు సభ్యులున్నారు. ఈ ఫ్రెండ్సు 2 సపోర్ట్ వెబ్‌సైట్ సేవలు ఆంధ్ర ప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. వినేందుకు వింత గొలుపుతున్నా... జరు గుతున్న వాస్తవాన్ని గమనించి స్వచ్చంధంగా రక్తాన్ని ఇచ్చేందుకు ముందు కొచ్చేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంతో షరీఫ్ ఆతని మిత్ర బృందంలో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలోనే తమి ళనాడు, కర్నా టక, మహారాష్ట్ర, కేరళా, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఉత్తర్రపదేశ్, గుజరాత్, రాజ స్థాన్‌లకి విస్తరించి అక్కడ సభ్యులతో... వెబ్‌సైట్‌పై అవగాహన కల్పించేందుకు, రక్తదాన అవసరంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలలో వాలంటీర్లుగా సీనియర్ సిటిజన్స్, డాక్టర్లు, సాప్ట్‌వేర్ ఉద్యోగులు, కళాశాల విద్యార్ధులు ఇలా సమా జంలో ప్రతి ఒక్కరినీ భాగస్వా మ్యం చేసింది. వీరంతా ఆయా ప్రాంతాల్లో వారు రక్తదానం పై అవేర్‌నెస్ క్యాంప్స్ నిర్వహిస్తూ, సైట్‌ద్వారా బ్లడ్ డోనర్స్, సభ్యులుగా చేర్పిెంచే ప్రయ త్నాలు చేస్తున్నారు.
రక్తదానం ఇలా....
నిజానికి శరీరం నుండి తీసిన రక్తం 21 రోజులు మాత్రమే నిలవ చేయగలం తరు వాత దానిని పయోగించడం ప్రమాదకరమన్నది వైద్యనిపుణుల హెచ్చరికలే త మ వెబ్‌సైట్‌లో రక్తదానం ఇచ్చే వారికి ఉపయోగపడుతున్నట్లు చెప్తున్నారు నిర్వా హకులు. ఈ వెబ్ సైట్‌లో ఎవరైనా, ఎక్కడివారైనా.. ఇందులో సభ్యుడిగా చేరి, తానున్న చోట ఎవరికై, ఎక్కడైనా రక్తం అవసరమైన వారికి రక్తదానం చేసే అవకాశాన్ని కల్పించడం ఇక్కడి విశేషం. దాతలు నివసించే ప్రాంతం, జిల్లా వివరాలు, బ్లడ్ గ్రూఫ్, ఫోన్ నంబర్ వివరాల పొందపరుస్తారు... ఇక రక్తం కావాల్సిన వారు ఈ వెబ్ సైట్‌లో ఆయా ప్రాంతాలు, బ్లడ్ గ్రూప్ వారిగా ఉండే బటన్‌ని క్లిక్‌చేస్తే చాలు సమీప ప్రాంతలలోని దాతల వివరాలు ఫోన్, నెంబర్లు క నిపిస్తాయి. దీని ఆధారంగా రక్తదాతలని పిలుచుకుని బాధితుల ప్రాణాలను కాపాడుకునే వీలుంటుంది. అంతే కాదు.... రక్తం కావాలనుకునేవారు ఈ వెబ్‌సైట్‌లో తామున్న ప్రాంతం, కావాల్సిన రక్తం గ్రూప్ తదితర వివరాలు అ భ్యర్ధన చేస్తే చాలు... సంబంధిత బ్లడ్ గ్రూప్, అందుబాటులో ఉండే దాతలకు సమాచారం అందించి రక్తాన్ని ఇచ్చేలా చూస్తారు.
అవార్డులు, రివార్డులు...
ఫ్రెండ్స్ టూ సపోర్ట్ డాట్‌కామ్ ద్వారా యువకులు చేస్తున్న కృషి అం తర్జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చింది. ఇంటర్నెట్ ద్వారా సమాజ సేవలో వినూత్న కలిగి ఉండడం, అధికంగా డోనర్లు నమోదు కావడంపై యూనిసెఫ్ నిర్వహించిన యూత్ వరల్డ్ సమ్మిట్‌లో అవార్డు పొంది ంది. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.
తొంభై వేలకు పైగా సభ్యులు..
ప్రస్తుతం 90 వేల డోనర్లు, దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి దాతలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రతి రోజు 10నుండి 20 మంది వెబ్‌సైట్ ద్వారా రోగులు దాతలు నుండి రక్తాన్ని పొందుతున్నారు. రక్తాన్ని ఇచ్చిన సదరు దాత పేరు 90 రోజుల వరకు సైట్‌లో కనిసించవు. మూడు నెలల తరువాత ఎస్‌ఎంఎస్ ద్వారా సభ్యుడు పేరును నమాెెదు చేసుకోవాలని గుర్తుకు చేస్తూ, సందేశాన్ని కూడా పంపిస్తుంది.
రక్త వ్యాపారం చూడలేక...
బ్లడ్ బ్యాంకులంటే రక్తాన్ని వ్యాపారంగా మార్చేసి... వేలల్లో నిర్వహణ ఖర్చు లంటూ వసూలు చేస్తున్నారు. అసలే కష్టా ల్లో ఉన్న వారు... వారు అడిగినంత ఇచ్చు కుని తమ వారి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్న ఘటనలు... నేను చూసాను ఆ కోణంలోనే మిత్రులతో ఆలోచించి ఈ తరహాలో వెబ్‌సైట్ ఏర్పాటు చేసాం....
కోటేశ్వరరావు, యు.ఎస్.ఎ.
అవసరమైన రక్తం దొరక్క
మన చుట్టూ ఉన్న వారిలో కొందరు ఊహిం చని విధంగా క్షతగాత్రులైనప్పుడు అవ సరం అయిన రక్తం తగిన మోతాదులో దొరక్క మర ణాల పాలవుతున్న వారి సంఖ్య పెరు గుతున్న ట్లు వచ్చిన కథనాలు మా మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఆ క్రమంలోనే రూపొం దించిన వెబ్‌సైట్ మంచి ఫలితాలు అందివ్వటం ఆనందంగా ఉంది.
- మురళీకృష్ణ , మలేషియా
సరిగా అందుతుందో లేదో
రక్తదానం చేయాలని ఉన్నా... అది నిజమైన బాధితులకు సరిగా అందుతుందో లేదో అన్న ఆం దోళన చాలా మందిలో ఉం టుంది. ఎం దు కంటే సేకరిం చిన రక్తం సకాలంలో వాడక కొం త, అవగాహన లేమితో మ రికొం త పా డవుతోంది. ఇలాంటి పరి ణామాలనుంచి త ప్పించి కా వాల్సిన గ్రూప్ రక్తాన్ని నేరుగా దాతే వచ్చి అందిస్తే... ఎలా ఉంటుందన్న ఆ లోచనలోంచి పుట్టిన వెబ్‌సైట్ నేడు దశ దిశలా వ్యాప్తి చెందిన ఆనందానికి మించి ఎందరి ప్రాణాలో కాపా డగలుగుతున్నామన్న ఆనందం మాకు ఎక్కువగా ఉంటోంది.
- నవీన్ రెడ్డి, ఫణీ సుందర్, యుఎస్‌ఏ
సామాజిక బాధ్యతగా
దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ ఘటనల్లో క్షతగాత్రులకు, వివిధ చికిత్సల కోసం ప్రతి రో జు సగటున రెండు కోట్ల యూనిట్ల రక్తం అవసమవుతోంది. అయితే కేవలం నలభై లక్షల యూనిట్ల రక్తం మాత్రమే అందు బాటులో ఉంటోంది... దీంతో రక్తం అందక చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోం ది. అం దువల్లే సామాజిక బాధ్యతగా వెబ్‌సైట్ ద్వారా స్వచ్ఛంద రక్తదానాన్ని చేయడం ప్రారంభించాం.. ప్రతి ఒక్కరూ ప్రెండ్స్‌టూ సఫోర్ట్ ఆర్గనైజేషనలో డోనర్ సభ్యుడుగా నమోదయితే మరిందరికి ప్రాణదానం చేసినవారమవుతాం.
- షరీఫ్, వెబ్‌సైట్ నిర్వాహకులు, హైదరాబాద్